ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కొత్త సంవత్సరంలో కొలువుల జాతర సాగనుంది. ఇప్పటికే ప్రభుత్వం వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. డీఎస్సీ కూడా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో ఉద్యోగ అవకాశాలపై ఆశలు పెరుగుతున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్(ఏపీపీఎస్సీ) పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,677 పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా వారీగా పో స్టులు, రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2013 జూలై 1 నాటికి వయస్సు 18 ఏళ్లు పూర్తి చేసుకొని 36 ఏళ్లు మించకుండా ఉండాలి. పేపర్-1లో జనరల్ స్టడీస్ 150 మా ర్కులు, పేపర్-2 గ్రామీణాభివృద్ధి 150 మార్కులు ఉంటాయి.
జిల్లాకు 241 పోస్టులు..
జిల్లాలో 580 క్లస్టర్ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 190 పంచాయతీలకు కార్యదర్శులు ఉన్నారు. తాజాగా ఏపీపీఎస్సీ నుంచి 241 పోస్టులు భర్తీ కానున్నప్పటికీ జిల్లాలో ఇంకా 149 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. అయితే 120 పోస్టులు పదోన్నతుల ద్వారా గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులను నియమించే అవకాశాలు ఉంటాయి. కాగా కొత్తగా భర్తీ చేయనున్న 241 పోస్టుల్లో 80 శాతం స్థానికులతో, 20 శాతం స్థానికేతరులకు అవకాశం ఉంది. ఇందులో జనరల్ 155, మహిళలకు 86 పోస్టులు కేటాయించారు.
వయో పరిమితి పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపునిచ్చారు. ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్ ఠీఠీఠీ.్చఞటఞటఛి.జౌఠి.జీ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్, జిల్లా సెలక్షన్ కమిటీ ఈ ఎంపిక విధానాన్ని పర్యవేక్షిస్తారు. దరఖాస్తు విధానంలో, హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైన పక్షంలో హైదరాబాద్‌లోని 040-23120055 నెంబర్‌కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదివచవచ్చు. appschelpdesk@gmail.com లోనూ సంప్రదించవచ్చు. మార్చి చివరి వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
కొలువుల జాతర
Published Tue, Dec 31 2013 2:29 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement