నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 86 పంచాయతీ కార్యదర్శుల(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 86 పోస్టులు భర్తీ కానున్నాయి.
గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 36 ఏళ్ల లోపు వారు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తులను జనవరి 4 నుంచి 22వ తేదీలోగా అన్‌లైన్‌లోనే చేయాలి. ఫీజు చెల్లింపునకు తుది గడువు జనవరి 20వ తేదీ. జనరల్ అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి రూ.80 ఫీజుగా నిర్ణయించారు.