దేశవ్యాప్తంగా ఎనిమిది నెలల్లో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయని ఆన్‌లైన్ జాబ్‌సెర్చ్ ప్లాట్‌ఫామ్ ‘అప్నా.కో’ నివేదిక తెలిపింది. ప్రధానంగా బీఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ కారణంగా ఈ ఏడాది ఉద్యోగ దరఖాస్తులు పెరిగినట్లు సంస్థ పేర్కొంది.
నివేదికలోని వివరాల ప్రకారం..ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు 31 వరకు సూక్ష్య, చిన్న, మధ్యతరహా సంస్థలకు సంబంధించి 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయి. వివిధ రంగాల్లోని సేల్స్, మార్కెటింగ్ మేనేజర్‌లు, అకౌంటింగ్ టెక్నీషియన్లు, టెలికాలర్స్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు, బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్స్ వంటి స్థానాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా బీఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్‌ఎంబీ), ఎంఎస్‌ఎంఈల్లో దాదాపు 11 కోట్లమంది పని చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేందుకు ఈ రంగాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్‌షిప్
ఈ సందర్భంగా అప్నా.కో సీఈఓ నిర్మిత్ పారిఖ్ మాట్లాడుతూ..‘ఎనిమిది నెలల్లో వచ్చిన ఉద్యోగ దరఖాస్తుల్లో 55 శాతానికి పైగా జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, కొచ్చి, భువనేశ్వర్ వంటి టైర్-2, టైర్-3 నగరాలవే కావడం విశేషం. ఈ నగరాల్లో వ్యాపారాలు విస్తరిస్తుండటంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ఉద్యోగుల అవసరం పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 3.5 కోట్ల దరఖాస్తుల్లో 1.4 కోట్ల మహిళల దరఖాస్తులే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వీటి సంఖ్య 30 శాతం పెరిగింది. ఫైనాన్స్, అకౌంట్స్, మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్.. వంటి ఉద్యోగాలకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment