Online applications
-
ఎనిమిది నెలల్లో 3.5 కోట్ల దరఖాస్తులు
దేశవ్యాప్తంగా ఎనిమిది నెలల్లో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయని ఆన్లైన్ జాబ్‌సెర్చ్ ప్లాట్‌ఫామ్ ‘అప్నా.కో’ నివేదిక తెలిపింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ కారణంగా ఈ ఏడాది ఉద్యోగ దరఖాస్తులు పెరిగినట్లు సంస్థ పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు 31 వరకు సూక్ష్య, చిన్న, మధ్యతరహా సంస్థలకు సంబంధించి 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయి. వివిధ రంగాల్లోని సేల్స్, మార్కెటింగ్ మేనేజర్లు, అకౌంటింగ్ టెక్నీషియన్లు, టెలికాలర్స్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్ వంటి స్థానాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంబీ), ఎంఎస్ఎంఈల్లో దాదాపు 11 కోట్లమంది పని చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేందుకు ఈ రంగాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్ఈ సందర్భంగా అప్నా.కో సీఈఓ నిర్మిత్ పారిఖ్ మాట్లాడుతూ..‘ఎనిమిది నెలల్లో వచ్చిన ఉద్యోగ దరఖాస్తుల్లో 55 శాతానికి పైగా జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, కొచ్చి, భువనేశ్వర్ వంటి టైర్-2, టైర్-3 నగరాలవే కావడం విశేషం. ఈ నగరాల్లో వ్యాపారాలు విస్తరిస్తుండటంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ఉద్యోగుల అవసరం పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 3.5 కోట్ల దరఖాస్తుల్లో 1.4 కోట్ల మహిళల దరఖాస్తులే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వీటి సంఖ్య 30 శాతం పెరిగింది. ఫైనాన్స్, అకౌంట్స్, మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్.. వంటి ఉద్యోగాలకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు. -
వెల్లువెత్తిన చైతన్యం..!
సాక్షి, సిద్దిపేట: ఓటు హక్కు కోసం అనూహ్య స్పందన లభించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది. అక్టోబర్ 5వ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. నూతనంగా ఓటు హక్కు కోసం 22,095 మంది దరఖాస్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈ నెల 11న తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ జాబితాలో పేర్లు ఉన్న వారందరూ ఈసారి ఎన్నికల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో.. ఫారం–6 ద్వారా ఓటు హక్కు కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను బీఎల్ఓలకు అందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి మండల తహసీల్దార్ కార్యాలయాలకు అందిస్తారు. అర్హత ఉన్న వారి వివరాలను ఎన్నికల సంఘం సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. ఈ నెల 11న తుది జాబితాల వెల్లడిస్తారు. పెరగనున్న ఓట్ల సంఖ్య! నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉన్న వారికి ఓటు హక్కును కల్పిస్తారు. ఈ నెల 30న ఎన్నికలు ఉండటంతో నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. 18 ఏళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే విధంగా బీఎల్ఓలు, రాజకీయ పార్టీల నాయకులు సైతం కృషి చేశారు. నూతనంగా పలువురికి ఓటు హక్కును కల్పిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరగనుంది. నాలుగు నియోజక వర్గాల్లో ప్రస్తుతం 9,25,868 మంది ఓటర్లు ఉన్నారు. -
డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి: డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన 27వ రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్, ఆన్లైన్ లోన్ యాప్‌ల మోసాల విషయంలో ప్రజలు పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మోసాలను నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో ఒక పరిష్కార మార్గాన్ని రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మోసాలను అరికట్టేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్, హీరా, కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, సహారా, ప్రగతి, అవని, ఆదర్శ్ తదితర కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన కేసుల ప్రగతిపైనా సమావేశంలో చర్చించారు. కేసులను ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సీఎస్ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఇన్చార్జ్ అంజనీ మిశ్రా, డీజీఎం రూటా మహాపాత్ర, ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, విజయకుమార్, సత్య ప్రభాకరరావు, విజయవాడ ఏసీపీ సీహెచ్ శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలోనే అడ్డంకులు!.. వాయిదా పడ్డ గ్రూప్-4 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 కొలువుల భర్తీ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ఈ కొలువులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆకస్మికంగా వాయిదా పడగా.. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 విభాగాల్లో గ్రూప్–4 కేటగిరీలోని 9,168 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈనెల 1న వెబ్ నోట్ (ప్రాథమిక ప్రకటన)ను విడుదల చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 23వ తేదీన వెబ్సైట్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించిన కమిషన్.. 23వ తేదీ నుంచి 2023–జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆ వెబ్‌నోట్‌లో వెల్లడించింది. దీంతో అభ్యర్థులంతా దరఖాస్తుల భర్తీ, శిక్షణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆకస్మికంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు, రోస్టర్ ఆధారిత సమాచారంతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక కారణాలంటూ.. సాంకేతిక కారణాల వల్ల గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ తేదీలను మార్పు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ఒక వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. ఈనెల 30వ తేదీ నుంచి 2023 జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హత సమాచారాన్ని వెబ్సైట్లో చూసి నిర్దేశించిన ప్రొఫార్మా ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై స్పష్టత ఇవ్వనప్పటికీ, నిర్దేశించిన తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. కాగా, గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక ప్రకటనలో కేవలం శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల సంఖ్య మాత్రమే ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో జిల్లాల వారీగా ఖాళీలు, ఎవరెవరు అర్హులు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు.. తదితర పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. అయితే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం.. సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేయడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. తదుపరి ఏమవుతుందో..? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక పోస్టులతో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రకటించడం ఇదే మొదటిసారి. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడుతుండగా.. ఈ ఖాళీల్లో గ్రూప్–4 కొలువుల సంఖ్య 12 శాతం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న వేళ నిరుద్యోగులు అత్యంత ఉత్సాహంతో సన్నద్ధమవుతుండగా టీఎస్పీఎస్సీ ఇలా అర్ధంతరంగా దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేయడం, పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేయకపోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శాఖల వారీగా సరైన సమాచారం అందకుండానే ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక ప్రకటన విడుదల చేశారనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
లోన్ యాప్ ఘటనలో ఏడుగురి అరెస్ట్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లోన్ యాప్ వేధింపులకు బలైన దంపతుల సంఘటనలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో రుణ యాప్ బాధితులు పెరుగుతుండటంతో సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. లోన్ యాప్‌లతో వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి, వారంలోనే నిందితుల్ని పట్టుకున్నారు. స్థానిక దిశా పోలీస్ స్టేషన్లో సోమవారం మీడియాకు జిల్లా ఇన్చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలిపారు. భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైన హాండీ లోన్, స్పీడ్ లోన్ యాప్‌లపై పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించి మూడు పోలీసు బృందాలు పనిచేశాయి. యాప్‌లకు, లోన్ తీసుకునే వారికి మధ్యవర్తులుగా పని చేస్తున్న వారిని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం గండిపేట మండలం మానికొండకు చెందిన లంబాడీ నరేష్, మియాపూర్‌కు చెందిన కొల్లూరు శ్రీనివాస్‌యాదవ్, కాకినాడ జిల్లా తిమ్మాపురానికి చెందిన మేడిశెట్టి పృథ్వీరాజ్, ఏలేశ్వరానికి చెందిన నక్కా సుమంత్, అన్నవరానికి చెందిన మండా వీరవెంకటహరిబాబు, విశాఖ జిల్లా కేకే అగ్రహారానికి చెందిన కోరుపోలుత రామకృష్ణ, అనకాపల్లి సమీపంలోని సిరసపల్లికి చెందిన దానబోయిన భాస్కర్లు నిందితులని పోలీసులు గుర్తించారు. వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా నెలలోనే రూ.కోటి లావాదేవీలు చేసినట్టు గుర్తించారు. బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా ప్రతి నెలా వేర్వేరు ఖాతాలను వీరు నిర్వహిస్తున్నారు. పోలీసులకు ఇతర రాష్ట్రాల్లోని యాప్ నిర్వాహకుల సమాచారం కూడా లభిం చడంతో ఆ దిశగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వర లోనే వీరిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
‘పద్మ’ నామినేషన్లకు ఆఖరు తేదీ 15
న్యూఢిల్లీ: పద్మ అవార్డులు–2023కు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్లైన్ పోర్టల్ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది. ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్ ఇన్ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్ గోపాలరత్న–2022కు, నేషనల్ వాటర్ అవార్డ్స్‌కు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్–2023కి అక్టోబర్ 31 చివరి తేదీ అని వివరించింది. -
పిల్లల చదువులకు పాసులభారం.. ఐదు కిలో మీటర్లకు రూ.35 వడ్డన
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీలో బస్‌పాస్‌ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యాసంస్థలు ప్రారంభమై పక్షం రోజులు కావడంతో ఆ సంస్థ అధికారులు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం పెరిగిన చార్జీలతోనే విద్యార్థులకు కూడా రాయితీ బస్ పాస్‌లను జారీ చేయనున్నట్లు ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. దీంతో గత ఏడాదితో పొలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులపై అదనంగా భారం పడుతోంది. ఐదు కిలో మీటర్ల ప్రయాణిస్తే పెరిగిన చార్జీల కారణంగా భారం రూ.35 పడుతుండగా ఆపై కిలో మీటర్లు ప్రయాణించే విద్యార్థులకు అదనంగా చెల్లించాల్సిందేనని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు బస్‌పాస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పాఠశాల, కళాశాల యాజమాన్యానికి ఇచ్చిన లాగెన్‌లోకి వెళ్తుంది. ఆ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను ధ్రువీకరించి తిరిగి ఆర్టీసీ అధికారులకు పంపిస్తే ఆయా బస్టాండ్‌లోని కేంద్రాల్లో బస్‌పాస్‌లను పొందవచ్చని పేర్కొంటున్నారు. చదవండి👉🏻ఖైరతాబాద్ భారీ గణనాథుని రూపం ఆవిష్కరణ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు లేవు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అభ్యసించే విద్యార్థులకు ఈ సదుపాయం వర్తించదని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. బస్‌పాస్ పొందాలనుకునే విద్యార్థులు తొలుత అకౌంట్ ఆఫీసర్, టీఎస్ఆర్టీసీ నల్లగొండ పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. యాజమాన్యం ఆ డీడీని తీసుకువచ్చి సంబంధిత బస్టాండ్ బస్సుపాస్ కౌంటర్లలో నమోదు చేయించాలి. అనంతరం ఇనిస్టిట్యూట్ వివరాలు బస్సుపాస్ కౌంటర్లలో పొందుపరుస్తారు. వెంటనే నమోదు చేసిన మొబైల్‌కు యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. 15ఏళ్ల లోపు బాలికలు, 12ఏళ్ల లోపు బాలురకు ఉచితంగా.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా, బాలికలను విద్యలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్టీసీ 15ఏళ్లలోపు బాలికలు, 12ఏళ్లలోపు బాలురకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తోంది. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ చార్జీలపై ఆర్టీసీ రాయితీని అందిస్తోంది. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. చదవండి👉🏻ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు బస్‌పాస్ పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాం. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వారికి కేటాయించిన విధంగా ప్రెష్, రెన్యువల్ ఆడ్మినిస్ట్రేషన్ చార్జీలను తక్షణమే చెల్లించాలి. – బొల్లెద్దు పాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, మిర్యాలగూడ -
ఆ అభ్యర్థులకు నిరాశ! టెట్‌లో ప్రత్యేక పేపర్ లేనట్టే...
సాక్షి, హైదరాబాద్: భాషాపండితులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచనేమీలేదని అధికారవర్గాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది భాషాపండితులు నిరాశకు గురయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ అవకాశం కల్పించారని వారు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి సానుకూల స్పందనరాలేదు. విజ్ఞప్తులు, విన్నపాలు కొనసాగుతున్న క్రమంలోనే టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 12తో ముగిసింది. మొత్తం 6,29,352 దరఖాస్తులు అందాయని, ఇందులో పేపర్–1 రాసేవారి సంఖ్య 3,51,468, పేపర్–2 రాసేవారి సంఖ్య 2,77,884 ఉందని అధికారులు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభించే వీలుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ జరుగుతుంది. తమకు తెలియని సిలబస్‌తో టెట్ రాయడం కష్టమనే భావనలో భాషా పండితులున్నారు. హిందీ, తెలుగు భాషాపండిట్ కోర్సు పూర్తి చేసిన ఈ అభ్యర్థులు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులు. (చదవండి: బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!) అయితే, వీరు ప్రధానంగా సంబంధిత భాషపైనే శిక్షణపొంది ఉంటారు. 60 శాతం భాషాపరమైన సిలబస్ నుంచి పరీక్ష నిర్వహిస్తే టెట్‌లో పోటీ పడగలమని వీరు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం గణితం, సైన్స్‌సహా మిగతా సిలబస్‌తో వీళ్లు టెట్ రాయాల్సి వస్తోంది. ఇది తమకు ఇబ్బందిగానే ఉంటుందని వారి వాదన. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల మంది తెలుగు పండిట్లు, 10 వేల మంది హిందీ పండితులున్నారు. ఆన్లైన్ అవస్థలు.. టెట్ దరఖాస్తుల సమయంలో అనేక సమస్యలు ఎదురైనట్టు అభ్యర్థులు చెబుతున్నారు. దరఖాస్తుపై కొంతమంది ఫొటోలు ఆప్‌లోడ్ అయినా, సంతకాలు నిర్దేశిత ప్రాంతంలో పొందుపర్చలేకపోయామని, సాంకేతిక ఇబ్బందులే దీనికి కారణమని చెబుతున్నారు. సమీపంలోని పరీక్ష కేంద్రాలు ఆన్లైన్లో చూపించలేదని ఎల్బీనగర్కు చెందిన చైతన్య, రఘురాం అనే అభ్యర్థులు తెలిపారు. అయితే, దరఖాస్తులు తాము చెప్పిన రీతిలో లేని పక్షంలో తిరస్కరిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ తరహాలో పేపర్–3 ఉండాలి భాషాపండితులకు 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేపర్–3 నిర్వహించింది. అదే తరహాలో ఇక్కడా భాషపైనే ఎక్కువ సిలబస్‌తో ప్రశ్నలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా అయితేనే 30 వేల భాషాపండితులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది. కానీ, దీన్ని పట్టించుకోకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. – సి.జగదీశ్ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, రాష్ట్ర అధ్యక్షుడు) (చదవండి: టెట్ పరీక్ష కేంద్రాలు బ్లాక్) -
ఆన్లైన్ లోన్ తీసుకుంటే తప్పవు తిప్పలు
-
తిరుపతిలో బయటపడ్డ ఆన్లైన్ యాప్‌ల మోసాలు
-
ఏపీ: టెన్త్ పాసైన విద్యార్ధులకు ఆన్లైన్లో మైగ్రేషన్ సర్టిఫికేట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఆన్లైన్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. ఇందుకోసం విద్యార్ధులు 80 రూపాయిలు చెల్లించి విద్యా శాఖ వెబ్సైట్ www.bse.ap.gov.in 2021 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది. కాగా, 2004 తర్వాత టెన్త్ పాసైన విద్యార్ధులు సైతం మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకున్న విద్యార్ధులు మైగ్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి -
ట్రిపుల్ ఐటీలో 20,178 మంది దరఖాస్తు
భైంసా(ముధోల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు ఈసారి పాలిసెట్ అర్హతతో సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 2న ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, 12 వరకు గడువు ప్రకటించారు. ప్రత్యేక కేటగిరీ కింద ఈ నెల 14 వరకు సడలింపు ఇచ్చారు. దీంతో 20,178 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 19,253 సాధారణ దరఖాస్తులు కాగా, గ్లోబల్ కేటగిరీలో 925 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 18న జాబితా విడుదల చేయనుంది. గతేడాది 1,500 సీట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి వెయ్యి సీట్లకే పరిమితం చేస్తుందా.. లేదంటే 1,500 సీట్లు కేటాయిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. త్వరలో విద్యార్థుల జాబితా ప్రకటిస్తామని ట్రిపుల్ ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు తెలిపారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్–2021కు దరఖాస్తుల స్వీకరణ శనివారం(నేటి) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఏపీసెట్’ను సందర్శించాలి. కోర్సులు.. 1.ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2.బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ 3.బీఫార్మసీ, ఫార్మాడీ దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ ఫీజు.. ► ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500 ► అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500 ► రెండింటికీ కలిపి హాజరయ్యేవారికి.. ఓసీలకు రూ.1,200, బీసీలకు రూ.1,100, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000 ఆన్లైన్ దరఖాస్తు గడువు.. ► ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు ► ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5 వరకు, రూ.1000తో ఆగస్టు 10 వరకు, రూ.5 వేలతో ఆగస్టు 16 వరకు, రూ.10 వేలతో ఆగస్టు 18 వరకు ► హాల్ టికెట్లను ఆగస్టు 12 నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 19 నుంచి పరీక్షలు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ► ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు ► మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 గంటల వరకు -
చైనాకు పరారైన లోన్‌యాప్ డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : రుణాలు తీర్చినా తీవ్ర వేధింపులకు పాల్పడుతూ ప్రాణాలు తీసుకునేలాగా చేసిన లోన్ యాప్స్ నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే వారు పోలీసులకు చిక్కకుండా స్వదేశం చైనాకు పరారయ్యారు. చైనాకు వెళ్లిన లోన్ యాప్స్ కంపెనీల రెక్టర్లను తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో డైరెక్టర్లను పట్టుకునే ప్రయత్నాలు సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు. అయితే ఆ కంపెనీ నిర్వాహకులు పక్కా ప్లాన్‌తో ఈ వ్యవహారం నడిపించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసే వారు కూడా భారత్‌కు చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించుకున్నారు. నేరం చేసినా తమ మీదకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పడ్డారు. ఆ విధంగా డైరెక్టర్లను నియమించుకున్న చైనా కంపెనీలు ఇప్పుడు వారి నేరాలు బహిర్గతమవడంతో వారు చైనాకు పారిపోయారు. చైనాకు చెందిన కంపెనీలు భారత్‌కు చెందిన వారితో కంపెనీ నడిపిస్తున్న విషయం కేసుల నమోదు అనంతరం బయటపడింది. ఆ కంపెనీల భారీ ఆఫర్లు ఇవ్వడంతో భారత్‌కు చెందిన చాలామంది ఆశ పడి డైరెక్టర్లుగా చేరారు. ఇలాంటి 16 కంపెనీలపై ఇప్పటివరకు దాడులు చేసి పోలీసులు మూసివేశారు. అయితే చైనాకు పారిపోయిన ఈ కంపెనీ డైరెక్టర్లను పట్టుకుంటే అసలు విషయాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా చైనాకు వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రుణాల యాప్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక దాదాపు 5 మంది బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. వందకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. -
కిల్లర్ లోన్స్
-
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, వరంగల్ : రాష్ర్టంలో దంత వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలిన పీజీ తరహాలోనే యుజి ప్రవేశాలకు చేపట్టనున్నారు. 01-11-20 నుంచి 08-11-20 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఈ ఏడాది ఆన్లైన్లోనే ఇంటర్ ప్రవేశాలు
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు ఆన్ లైన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ మంగళవారం విజయవాడలో పేర్కొన్నారు.https ://bie.ap.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. రేపటి నుంచి ఆన్ లైన్లో ఇంటర్మీయట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా ఈనెల 29 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా రెండేళ్ళ ఇంటర్మీయట్ రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కాగా బీసీ,ఓసీ విద్యార్థులకు రూ. 200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 100 ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయొచ్చని రామకృష్ణ పేర్కొన్నారు. -
ఆన్లైన్లోనే నూతన జూ.కళాశాలల అనుమతులు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాని బోర్డు సూచించింది. ప్రస్తుతం ఉన్న జూనియర్ కాలేజీలు అఫిలియేషన్ గుర్తింపును పొడిగింపు కూడా ఆన్లైన్లో చేసుకోవాలని తెలిపింది. నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసిన వాటిని మాత్రమే ఇకపై ఆన్లైన్లో జూనియర్ కళాశాల అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొంది. (కరోనాతో వ్యాపారి మృతి.. ఢిల్లీలో కలకలం) జియో ట్యాగింగ్ ద్వారా కళాశాల క్రీడా స్థలం, తరగతి గదులు, లైబ్రరీ గుర్తింపు, ఇతర అనుమతులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు 10,500 ఫీజు, పట్టణ ప్రాంతాల్లో 27,500 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలని తెలిపింది. మే 31 వరకు ఆన్లైన్లో జూనియర్ కళాశాలకు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 1 నుంచి అపరాధ రుసుం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. (‘రిపోర్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి’ ) -
ఆధార్ అవస్థలు
వికారాబాద్ అర్బన్: కొత్తగా ఆధార్ కార్డు పొందాలన్నా, ఉన్న దాంట్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ముగిసి డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరు దోస్త్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దోస్త్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాలి. ఇందుకోసం విద్యార్థి ఆధార్ నంబర్‌కు ఫోన్ నంబర్ లింక్ తప్పకుండా ఉండాలి. చాలా మంది గ్రామీణ విద్యార్థుల ఆధార్ నంబర్‌కు ఫోన్ నంబర్ లింక్ లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడంలో వెనకబడుతున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతీ పథకానికి ఆధార్ లింక్ తప్పని సరి చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మొదట్లో తీసుకున్న చాలా మందికి వారి ఫోన్ నంబర్ ఆధార్ కార్డుకు లింక్ లేదు. ఓటీపీ నంబర్ తెలుసుకునేందుకు ఆధార్ కేంద్రం నిర్వాహకులే వారి నంబర్లు ఇచ్చి అప్పటి పూర్తిగా పని ముగించారు. ఇటీవల బ్యాంకుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా సొంత ఫోన్ నంబర్ ఆధార్ లింకు ఉండాలని షరతు పెడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది మార్పుల చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అవస్థలు పడి మార్పులు, చేర్పుల దరఖాస్తులు నింపి ఇచ్చినా సకాలంలో మార్పులు జరగడం లేదు. కొత్తగా కార్డు తీసుకోవాలనుకునే వారి అవస్థలు వర్ణనాతీతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అడుగుతున్నారు. ఇటీవల పోలీసులు రోడ్డుపై వాహనదారులను ఆపి తగిన పత్రాలు లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా, హెల్మెట్ లేకున్నా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులకు కూడా ఆధార్ కార్డు లింక్ అడుగుతున్నారు. ఇలా ప్రతిపనికి ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఒకేఒక ఆధార్ కేంద్రం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలన్నా, కొత్త కార్డు తీసుకోవాలన్నా వారం రోజుల సమయం పడుతోంది. ఆధార్ కార్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ప్రతి నియోజకవర్గానికి ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 24న నేతన్నల సమస్యలపై చలో ఢిల్లీ హిమాయత్‌నగర్: నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయని జాతీయ చేనేత నాయకులు దాసు సురేష్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాగ్దానాలు చేసిన నాయకులు ఎన్నికల అనంతరం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువైయ్యాడని వాపోయారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హామీలపై తమ వాణి వినిపించేందుకు ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు దఫాలుగా బడ్జెట్లో ప్రవేశపెట్టిన రూ.1,283 కోట్ల నిధులను ఏ మేరకు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఇసుక ఆక ఆన్లైన్
తెలంగాణ సర్కార్ భారీ ఆదాయం సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు హైదరాబాద్ తరువాత మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కొరతతో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయనే ఉద్దేశంతో ఇసుకను విక్రయించడం ద్వారా ఒకవైపు అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చేస్తూనే మరోవైపు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్‌జోన్: రాష్ట్రంలో ఎక్కడ ఇసుక ఉందో అక్కడి నుంచి కొరత ఉన్నచోటుకు తరలించి విక్రయించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు డ్యాం నుంచి ఇసుకను పెద్ద పెద్ద లారీల్లో తరలించి మెదక్‌లో డంప్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరంలో మూడుచోట్ల డంప్ చేస్తుండగా ఆ తరువాత మెదక్ జిల్లా కేంద్రంలోనే డంప్ చేస్తునట్లు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారి ఒకరు తెలిపారు. 20 నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డంప్ చేశాకే విక్రయాలు మొదలు పెడతారని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం సర్కార్‌కు అత్యధికంగా ఆదాయం సమకూర్చేది మద్యం అయితే ఆ తరువాత ఇసుకతోనే ఉంటోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మద్యం తయారీ కోసం కొంత మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇసుకకు అదేం ఉండదు. నిల్వ ఉన్న చోటు నుంచి తెచ్చి లేనిచోట విక్రయించడమే. కేవలం రవాణా ఖర్చు తప్ప మరే ఇతర ఖర్చు ఉండదు. దీంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రావడం ఖాయమంటున్నారు. జిల్లాలో ఇసుక తవ్వడం నిషేధం.. జిల్లాలో మంజీరనది, పుష్పలవాగు, పసుపులేరుతోపాటు పలు మండలాల్లోని వాగులు వంకల్లో ఇసుక ఉంది. వరుస కరువు కాటకాలతో ఇప్పటికే భూగర్భ జలాలు 42 మీటర్ల లోతుకి పడిపోయిన నేపథ్యంలో ఇసుకను తరలిస్తే మరింత ప్రమాద స్థాయిలోకి ఊటలు పడిపోతాయని, తాగునీటికి సైతం కష్టాలు తప్పవనే ఉద్దేశంతో జిల్లాలో ఇసుకపై నిషేధం విధించారు. అయినప్పటికీ అక్కడక్కడా అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అక్రమ రవాణాకు చెక్ ఏకంగా ప్రభుత్వమే నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇసుకను విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనిద్వారా అక్రమార్కులు మంజీరనదితో పాటు ఇతర వాగులు, వంకల్లోంచి అక్రమంగా ఇసుకను తరలించకుండా అడ్డుకట్ట వేసినట్లయింది. అక్రమ రవాణకు అడ్డుకట్ట పడకుంటే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు యజమానిపై కేసులు నమోదు చేసేందుకైనా వెనుకాడబోమని పలువురు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్లో బుకింగ్ ఇసుక అవసరం ఉన్న వ్యక్తులు ఆన్లైన్ ద్వారా (మీసేవలో) టీఎస్ఎండీసీ వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన ఇసుకను క్యూబిక్ మీటర్లలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డబ్బును మీసేవ నిర్వాహకులకే నేరుగా చెల్లించి రసీదుతో ఇసుక నిల్వకేంద్రానికి వెళ్లి వాహనంలో తరలించుకోవాల్సి ఉంటుంది. ఇసుక నిల్వకేంద్రం నుంచి తరలించేందుకు వాహన రవాణ ఖర్చు సదరు కొనుగోలు దారుడే భరించాల్సి ఉంటుంది. ఇసుకను కొనుగోలు చేసే ప్రాంతంలోనే వేబ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. త్వరలో విక్రయాలు ప్రారంభం మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక నిల్వకేంద్రం ఏర్పాటు చేశాం. ఇక్కడ 20 నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ అయ్యాక విక్రయాలు ప్రారంభిస్తాం. అవసరం ఉన్నవారు మీసేవ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – రామకృష్ణ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాజెక్టు అధికారి -
‘దోస్త్’ షురూ
పాపన్నపేట (మెదక్): దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్) పద్ధతిన డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మూడు విడతల్లో ఆన్లైన్ ప్రవేశాలు జరగనున్నాయి. దేశంలోనే మొట్ట మొదటిసారిగా 2016లో దోస్త్ పద్ధతిన తెలంగాణలో ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లను గుర్తించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులతో పాటు కొత్త సౌకర్యాలు కల్పించారు. డిమాండ్‌లేని కోర్సుల సీట్లకు కోత విధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత అందులో పాసైన వారికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ఇంటర్లో ఫలితాలు తగ్గిన నేపథ్యంలో డిగ్రీ సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపు జిల్లాలో నాలుగు ప్రభుత్వ, 15ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 12వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. 2016 వరకు ఇంటర్‌పరీక్షల్లో సాధించిన మార్కులు, కుల, స్పోర్ట్స్, దివ్యాంగుల రిజర్వేషన్లకు అనుగుణంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించేవారు. 2016లో దోస్త్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కులు, రిజర్వేషన్లకు అనుగుణంగా విద్యార్థులకు కళాశాల కేటా యిస్తారు. ఈ విధానంపై మొదట్లో కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. మీసేవతోపాటు ఆధార్ అనుసంధానమైన మొబైల్ నుంచి విద్యార్థులు రిజస్ట్రేషన్ చేసుకునేవారు. కొంతమందికి వేలి ముద్రలు నమోదు కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెం దిన విద్యార్థులు ఆన్లైన్ సౌకర్యం అందుబా టులో లేక, వాటిపై అవగాహన కరువై ఇంటర్‌తోనే విద్య మానేసిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రైవేట్, 20 మైనార్టీ డిగ్రీ కళాశాలలు దోస్తులో చేరకుండా సొంతంగా ప్రవేశాలు చేసుకుంటున్నాయి. -
జోరుగా ఇసుక దందా
ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ అనుమతులు, ఇతర చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు దందాను కొనసాగిచేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. నంబర్ప్లేట్లు లేని ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. వేములపల్లి మండలంలోని సల్కునూరు, రావులపెంట పరిసర ప్రాంతాలలోని పాలేరు వాగునుంచి ఇసుక రవాణాకు అనుమతి ఉంది. అయితే వ్యాపారులు రెండు ట్రాక్టర్లకు అనుమతి తీసుకుని వాటివెంట మరో ఐదారు ట్రాక్టర్లను (అనుమతి లేనివి) నింపి మిర్యాలగూడ పట్టణానికి తరలిస్తున్నారు. వీటికి నంబర్ప్లేట్లు ఉండవు. ఇలా రోజుకు 20 ట్రాక్టర్ల ఇసుక రవాణా జరుగుతోంది. నంబర్ ప్లేట్లు కూడా లేని ట్రాక్టర్లకు అధికారులు ఎలా అనుమతి ఇస్తున్నారనే విషయం ప్రశ్నార్థకం. మిర్యాలగూడ : ద్విచక్ర వాహనానికి నంబర్ ప్లేట్ లేకుంటేనే పోలీసులు ఆపి జరిమానా విధిస్తారు. కార్డన్ సెర్చ్‌లు నిర్వహించిన సమయంలోనూ రిజిస్ట్రేషన్ లేని వాహనాలుంటే వాటిని అక్కడికక్కడే సీజ్ చేస్తారు. కానీ నంబర్ ప్లేట్లు కూడా లేని ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే కనీసం మందలించే నాథుడే లేడు..ఆన్లైన్లో అనుమతి తీసుకోకుండానే..ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఎవరైనా ఇసుక కావాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటేను అనుమతి లభిస్తుంది. కానీ ఆన్లైన్లో అనుమతులు పొందకుండా భారీగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఒక ట్రాక్టర్ ఇసుకకు మూడు వేల రూపాయలకు విక్రయిస్తున్నా రు. రోజుకు 20 ట్రాక్టర్ల ద్వారా 80 ట్రి ప్పు ల ఇసుకను వేములపల్లి మండలం నుంచి మిర్యాలగూడ పట్టణానికి తరలి స్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులు. ఉదయం వేళల్లోనే కాకుండా రాత్రి 8 గంటల వరకు దందా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే రవాణా చేయడానికి పర్మిషన్ తీసుకున్న ట్రాక్టర్ యజమానులే ఇసుకను తరలించాల్సి ఉంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక రవాణా చేయడానికి పర్మిషన్ తీసుకున్న ట్రాక్టర్ యజమానికి ఆర్సీ బుక్, లైసెన్స్ ఉన్న డ్రైవర్ ఉంటారు. బుకింగ్ చేసుకున్న వారికి పర్మిషన్ ఉన్న ట్రాక్టర్ల ద్వారానే ఇసుక రవాణా చేయడంతో పాటు వినియోగదారుడి ఫోన్‌కు ట్రాక్టర్ నంబర్‌తో మెసేజ్ కూడా వస్తుంది. కానీ, నంబర్ ప్లేట్లు కూడా లేని ట్రాక్టర్లకు ఎలా అనుమతి ఇస్తున్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అనుమతి లేకుండా నంబర్ ప్లేట్లు కూడా లేని ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేదే ప్రశ్న. వేములపల్లి మండలంలోని సల్కునూరు, రావులపెంట పరిసర ప్రాంతాల్లోని పాలేరు వాగు నుంచి ఇసుకను మిర్యాలగూడకు జోరుగా తరలిస్తున్నారు. దందా సాగుతుంది ఇలా.. వేములపల్లి మండలంలోని పాలేరు వాగునుంచి నంబర్ ప్లేట్లు లేని పది ట్రాక్టర్లు ఇసుక లోడుతో బయలుదేరుతాయి. వాటికి ముందుగా ఆన్లైన్లో అనుమతులు ఉన్న రెండు ట్రాక్టర్లు వెళ్తాయి. అంతకంటే ముందుగా ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి రెక్కీ నిర్వహిస్తాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న విషయాన్ని తెలియజేయడానికి ద్విచక్ర వాహనంపై వచ్చే వ్యక్తి గమనిస్తాడు. అధికారులు ఉంటే ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాహనాలను నిలిపి చెకింగ్ చేస్తారు. ఆ సమయంలో అధికారులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని నంబర్ ప్లేట్లు లేని అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లకు సమాచారం అందిస్తాడు. దీంతో అప్రమత్తమవుతున్న డ్రైవర్లు ఏ దైనా ఒక గ్రామంలో రోడ్డు పక్కన నిలుపుతున్నారు. ఇలా రోజుకు 20 నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. -
నెలకు రెండు వేలు కొత్త రేషన్ కార్డులు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య నెలనెలకు పెరుగుతోంది. కొత్త కార్డుల మంజూరు, పాత కార్డుల్లో పేర్లను కలిపేందుకు ప్రభుత్వం అనుమతించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలిస్తున్న అధికారులు అర్హులకు కార్డులు మంజూరు చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో జిల్లా 8 వేలకు పైగా కొత్త కార్డులు మంజూరయ్యాయి. జనవరిలో జిల్లాలో 3,81,083 రేషన్ కార్డులు ఉండగా, ఇందులో 12,71,610 మంది లబ్ధిదారులకు రేషన్ అందించారు. అప్పుడు నెలకు 8 వేల మెట్రిక్ టన్నులుగా బియ్యం కోటా అవసరమఅయ్యేది. అయితే, ప్రస్తుతం మే నెల లో రేషన్ కార్డుల సంఖ్య 3,89,827కు చేరింది. 13,01,616 మంది లబ్ధిదారులకు రూ.1కి కిలో చొప్పున రేషన్ అందించడానికి జిల్లాకు 8,185 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా అవసరం అవుతోంది. గత జనవరి నుంచి మే నెల వరకు 8,744 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా, అదనం గా 185 మెట్రిక్ టన్నుల బియ్యం నెల వారీ కోటాలో పెరిగింది. ఈ లెక్కల ప్రకారం నెలకు రెండు వేల చొప్పున కొత్త రేషన్ కార్డులు పెరిగాయి. మరింత పెరగనున్న సంఖ్య అర్హులైన వారిందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు సివిల్ సప్లయి కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లాలో చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల కొత్త పేర్లను చేర్చేందు కు కూడా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు, నాలుగు నెల ల్లో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య నాలుగు లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోంది. అర్హులైన వారందరికీ మంజూరు.. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ నిబంధనల ప్రకారం మంజూరు చేస్తున్నాం. అంతకు ముందు మండలాల నుంచి తహసీల్దార్లు సమ్మతి తెలిపి డీఎస్వో కార్యాలయానికి ఆన్లైన్లో పంపుతారు. వాటిని మేము కూడా పరిశీలించి అర్హులని తేలితే మంజూరు చేస్తున్నాం. గడిచిన నాలుగు నెలల్లో 8 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటి సంఖ్య ఇది వరకంటే బాగా పెరిగింది. – కృష్ణప్రసాద్, డీఎస్వో, నిజామాబాద్ -
కార్డులొచ్చేస్తున్నాయి
మోర్తాడ్(బాల్కొండ): కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కోరిక త్వరలో నెరవేరనుంది. ఈ నెలాఖరుతో ఎన్నికల కోడ్ ముగిసి పోనుండగా వచ్చే నెల ఆరంభంతోనే కొత్త కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆయా జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ మొదటి వారం నుంచే కొత్త కార్డులు ఇచ్చే అవకాశముంది. దీంతో జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే జిల్లాలో 3,89,827 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా 7 వేల మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముంది. పెండింగ్‌లో దరఖాస్తులు.. ముందస్తు శాసనసభ ఎన్నికలతో మొదలైన ఎన్నికల కోడ్.. పంచాయతీ, పార్లమెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ వల్ల ఇంకా అమలులోనే ఉంది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ పడింది. గతంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసినా, జిల్లాల పునర్విభజన వల్ల ఆ ప్రక్రియ నిలిచి పోయింది. రేషన్ వినియోగదారులకు సరుకులు అందుతున్నా కార్డులు మాత్రం అందలేదు. గతంలో జారీ అయిన రేషన్ కార్డులు మాత్రమే వినియోగదారుల వద్ద ఉన్నాయి. అలాగే, అర్హులైన వారందరికీ రేషన్ సరుకులను అందించాలని ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిర్ణయించింది. అప్పటి నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. కొంత మందికి రేషన్ మంజూరు కాగా, ఎన్నికల కోడ్ కారణంగా చాలా మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటో తేదీ నుంచే ప్రారంభం! అయితే, వరుస ఎన్నికల కారణంగా దరఖాస్తులకు మోక్షం లభించలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వారికి రేషన్ కార్డులను జారీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లో లాగిన్ అయిన వారం రోజుల్లో అర్హులైన వారికి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. అంటే జూన్ ఒకటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ కానున్నాయి. వారికి రూ.1కి కిలో బియ్యం, ఇతర రేషన్ సరుకులు అందనున్నాయి. అర్హులందరికీ రేషన్ కార్డులు.. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ అవుతాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన వెంటనే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను జారీ చేస్తాం. అలాగే కొత్తగా వచ్చే దరకాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తాం. – కృష్ణప్రసాద్ -
నేడు పరిషత్ నోటిఫికేషన్
కరీంనగర్: జిల్లా, మండల ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. వెనువెంటనే నామినేషన్ల స్వీకరించనున్నారు. మొదటి విడత ఎన్నికలు ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక, మానకొండూర్ మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలతోపాటు 89 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 22న ఆయా మండలాల పరిధిలో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. 24వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అప్పీలు, 28న నామినేషన్ల ఉపసంహరణ, 28న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లోనే నామినేషన్లు... అన్ని మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు. జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారి చొప్పున 15 అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను నియమించారు. మరో ముగ్గురు రిటర్నింగ్ అధికారులను రిజర్వ్‌లో ఉంచనున్నారు. ప్రతీ మూడు ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఒకటి చొప్పున మొత్తం 60 క్లస్టర్లనుఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారికి సహాయకులుగా ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు కేటాయించిన రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులకు చాన్స్... ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించే విధానం అందుబాటులోకి వచ్చింది. నామినేషన్ పత్రాల కోసం రిటర్నింగ్ అధికారుల వద్ద వెళ్లాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో క్యాండిడెట్ పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో నాలు అప్షనల్ ఉంటాయి. వాటిలో ఆన్లైన్ నామినేషన్ ఫర్ రూరల్ బాడీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఎంపీటీసీ స్థానానికి, జెడ్పీటీసీ స్థానానికి ఆన్లైన్ నామినేషన్ సమర్పించేందుకు ఆప్షన్ చూపిస్తుంది. ఏ అభ్యర్థి ఏ పదవీకి పోటీ చేస్తున్నారో దానిని ఎంచుకోని ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేయాలి. అప్లోడ్ చేసిన తరువాత ఆ కాపీని ప్రింట్ తీసుకుని కచ్చితంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కేవలం ఆన్లైన్ సబ్మిషన్ నామినేషన్ పరిగణలోకి తీసుకోరాదని ఎన్నికల సంఘం తెలిపింది. జెడ్పీటీసీకి రూ.5 వేలు, ఎంపీటీసీకి రూ.2,500... పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు డిపాజిట్లు మొదలుకుని వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జనరల్ జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.5 వేలు, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే వారు రూ. 2,500 డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్‌కు కేటాయించిన జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.2,500, ఎంపీటీసీ అభ్యర్థులు రూ. 1250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించనున్నారు. -
మేము సైతం..
అమెదక్ అర్బన్: మెదక్ జిల్లాలో ఓటరు నమోదుకు మంచి స్పందన లభిస్తోంది. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని వారు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఒకవైపు గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి ఉండగా ఓటరు నమోదు ప్రక్రియ సైతం ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వపరంగా సంబంధిత దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకితీసుకువచ్చారు. ఇదిలా ఉండగా వివిధ రాజకీయ పార్టీలు సైతం ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించడానికి ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో పార్టీల నాయకులు, బాధ్యులు ఓటరు నమోదుకు సంబంధించిన ఫారాలను, మార్గదర్శకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావుడి, అది పూర్తి కాగానే గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో ఓటుహక్కుకోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 4వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 19,993 మంది నూతనంగా ఓటరు లిస్టులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వారిలో 18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారు. ఓటరు నమోదుపై జిల్లా యంత్రాంగం ఆయా కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం, ఓటు హక్కు విలువ తెలియజేయడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. దీంతో కళాశాలల్లోని యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం 3,97,999 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో 1,95,649, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,02,350 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన నూతన ఓటరు నమోదు ప్రక్రియతో 19,993 మంది ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఓటు హక్కుకు నూతనంగా నమోదు చేసుకున్నారు. వాటిలో మెదక్ నియోజకవర్గం నుంచి 10,757, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 9,236 మంది కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది. -
మరో చాన్స్!
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ కట్టలేము. ఓటు అనే బ్రహ్మస్త్రంతో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశముంది. ఓటరు జాబితాలో పేర్లు చూసుకుని అర్హులైన వారందరూ ఓటు హక్కు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నా పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఈ మేరకు పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయిన వారితో పాటు కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. నేటి నుంచి... కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల కోసం బుధవారం నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. ఈ మేరకు 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరముంది. జిల్లాలో 10,26,728 మంది ఓటర్లు మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,26,728 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ప్రకారమే తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ జాబితా విడుదల చేసింది. అయినప్పటికీ పలువురు తమ పేర్లు జాబితాలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రస్తుత అవకాశాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అర్హులందరిపై ఉందని చెబుతున్నారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు ప్రతీ ఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు అర్హులు. గ్రామంలోని బూత్‌లెవల్ అధికారికి లేదా తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫారం–6 దరఖాస్తులు సమర్పించాలి. మీసేవా కేంద్రాల్లో లేదా స్వయంగా కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. -
దరఖాస్తు చేసుకోలె!
కరీంనగర్‌ఎడ్యుకేషన్: విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. అధికారుల అవగాహనలేమి.. పట్టింపులేనితనంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 13 ఇంజినీరింగ్ కళాశాలలు, 109 డిగ్రీ కళాశాలలు, 6 ఫార్మసీ, 9 పాలిటెక్నిక్, 8 బీఈడీ కళాశాలలు, 56 ప్రైవేట్ కళాశాలలున్నాయి. ఫీజురీయింబర్‌మెంట్ ఫ్రెష్, రినివల్ చేసుకోవాల్సిన విద్యార్థులు 42,666 మంది ఉన్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, ఇంటర్మీడియట్ శాఖల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏటా రెన్యూవల్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా చేరిన విద్యార్థులు సైతం రీయింబర్స్‌మెంట్‌కు అర్హులే. అయితే సాంకేతిక సమస్య..అవగాహన కల్పించాల్సిన కళాశాల యాజమాన్య, సంక్షేమాధికారుల వైఫల్యం వెరసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు వేలాదిమంది కనీసం దరఖాస్తుకు నోచుకోవడంలేదు. ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చినా.. దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లాలో గతంతో పోల్చితే దాదాపు 22 వేల మందికిపైగా విద్యార్థులు ఈసారి స్కాలర్షిప్ దరఖాస్తు చేయకపోవడం విశేషం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఏటా ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం గడువు విధిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గడువు వచ్చేనెల 30తో ముగియనుంది. దాదాపు మూడు నెలల నుంచి దరఖాస్తు చేసుకునేందుకుగడువు ఉన్నా.. జిల్లాలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్ దరఖాస్తులు చేసుకోలేకపోయారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది దాదాపు 22 వేల మందికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు దూరంగా ఉన్నారు. దరఖాస్తు చేసుకోకపోవడానికి అవగాహన కల్పించడంలో ఆయా కళాశాలల యాజమాన్యం, సంబంధిత సంక్షేమ శాఖలు, ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముందుగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, ఆ కాపీని ప్రింట్అవుట్ తీసి కళాశాల్లో అందించాల్సి ఉంటుంది. ఆ వివరాలను కళాశాలలు తమ లాగిన్ ద్వారా సంబంధిత సంక్షేమశాఖ కార్యాలయాలకు ఆన్లైన్ ద్వారా పంపిస్తాయి. తిరిగి హార్డ్‌కాపీలను కూడా కార్యాలయానికి పంపిస్తాయి. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని నిబంధన పెట్టినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. విద్యార్థులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినప్పటికీ.. సర్వర్ సమస్యతో అప్లోడ్ కాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. వీటితో పాటు తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది అరకొరగా ఉండడం, ఉన్న సిబ్బంది ఎన్ని కల ప్రక్రియ షెడ్యూల్‌తో పాటు ఇతరత్రా కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో అనుకున్న సమయానికి «విద్యార్థులకు ధృవపత్రాలు అందించలేకపోతున్నారు. సర్టిఫికెట్లు పొందడంలోనూ ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో తాత్సారం, బ్యాంక్ ఖాతాలు తెరవడంలో సమస్యలతో నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇదిలా ఉంటే విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకునేట్లు చేయడంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు, సంక్షేమ శాఖల వైఫల్యం కూడా కనిపిస్తోంది. సాంకేతిక సమస్యలు పోను ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించలేకపోయారనే ఆరోపణలున్నాయి. సాంకేతిక శా పం, అవగాహన కల్పించడంలో వైఫల్యం తో మొత్తానికి వేలాది విద్యార్థులు కనీసం దరఖాస్తుకు కూడా నోచుకోని దుస్థితి ఏర్పడింది. వచ్చేనెల 30 వరకు గడువు.. ప్రభుత్వం మూడోసారి స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగించింది. వచ్చేనెల 30 వరకు ఫ్రెష్, రినివల్కు సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకొని హార్డ్‌కాపీలు కళాశాలలో అందజేయాలి. ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి 2018–19 సంవత్సరానికి గాను 8,491 మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. 6422 మంది విద్యార్థులు స్కాలర్షిప్కు ఇంత వరకు దరఖాస్తు చేసుకోలేదు. గడువుముగిసేలోగా దరఖాస్తులు అందజేయకుంటే ఆయా కళాశాలలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
నేటితో గడువు పూర్తి
కరీంనగర్‌సిటీ: మంచి పాలన కావాలి.. మంచి నేత రావాలి.. మరి ఏం చేయాలి? నినదించా లి? నిలువరించాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి? అంటే.. ఓటు వేయాలి? వేయాలంటే ముందు ఓటరుగా నమోదు చేసుకోవాలి.. ఇదే ఆఖరి అవకాశం.. వదిలితే అథఃపాతాళం.. ‘లేవండి! మేల్కొనండి! ఇకపై నిద్రించకండి.. అజ్ఞానాంధకారం నుం చి బయటికి రావాలి..’ అన్న స్వామీ వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓటు అనే వజ్రాయుధం సంధించడంలో ముందు వరుసలో నిలవాల్సిన తరుణమిదే. ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ఆఖరి అవకాశం ఇ చ్చింది. యువతకు ప్రాధాన్యం కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతోపాటు అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో విస్తృత అవగాహన కల్పిస్తోంది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక శ్రద్ధతో రెవెన్యూ, ఇతర శా ఖల అధికారులు, ఉద్యోగులు బిజీబిజీగా ఉన్నా రు. విధుల్లో దాదాపు 90 శాతం ఎన్నికల నిర్వహణ కసరత్తుపైనే దృష్టిసారించారు. ఓటరు నమోదుకు గడువు సమీపించడంతో అవగాహ న సదస్సులు, ర్యాలీలు విస్తృతం చేశారు. ఎన్నిక ల సంఘం ఈనెల 10న ప్రకటించిన ముసాయిదా జాబితా అనంతరం సెప్టెంబర్ 25 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. జిల్లాలో ఇంకా 60 వేలకు పైగా ఓటు హక్కు పొందాల్సి ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఓటరు నమోదుకు స్పందన ఇప్పటివరకు ఓటరు నమోదుకు గాను 57,040 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఓటరు న మోదుకు మంచి స్పందనే లభించినట్లు తెలు స్తోంది. తొలగింపు, ఆక్షేపణలకు సంబంధించి (ఫారం–7) 10,125, వివరాలను సరిదిద్దేందు కు (ఫారం–8) 4,314, ఒక పోలింగ్ నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్పునకు (ఫారం–8ఏ) 3,640 దరఖాస్తులు వచ్చాయి. చిరునా మాలు మారడం, ఆధార్ ఇవ్వకపోవడం తదిత ర కారణాలతో జాబితాల్లో నుంచి భారీగా ఓట్లు తొలగించిన క్రమంలో దరఖాస్తుల సంఖ్య పెరగకపోవడం గమనార్హం. గల్లంతయిన పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటరు జా బితాలో పేరు ఉందో లేదో చూసి లేకుంటే అక్క డే ఫారం–6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తులు ఇస్తున్నారు. కొత్త ఓటర్లతో పాటు మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గడువు పొడిగించేనా..? కొత్తగా ఓటర్లుగా నమోదు కావాలన్నా.. మా ర్పులు, చేర్పులు చేయించుకోవాలన్నా మంగళవారం (నేటి వరకు) వరకే అవకాశముంది. ఈ నెల 15 నుంచి ప్రా రంభమైన ఈ కార్యక్రమం 25 తేదీతో ముగియనుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని అధికారులు చె బుతున్నారు. బూత్‌స్థాయి అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంది. పోలింగ్ ఏజెంట్ల సాయంతో ప్రతి గ్రా మంలో జాబితాలో లేని వారిని గుర్తించి వారితో దరఖాస్తులు సమర్పించేలా చేస్తే ఫలితం ఉం టుంది. అయితే ఓటరు నమోదుకు మరిన్ని రోజులు గడువు పొడిగిస్తారా? లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. సహాయ కేంద్రంలో సేవలు.. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సేవలందిస్తున్నారు. ఫోన్‌కాల్స్ స్వీకరించి వారి పే రు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలియజేస్తున్నారు. బీఎల్వోలు అందుబాటులో ఉన్నారా లే దా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నగరంలోని 50 డివిజన్లలో 250 మంది బీఎల్వో లు, 100 మున్సిపల్ సిబ్బంది విధుల్లో ఉన్నా రు. డిగ్రీ పీజీ కళాశాలలల్లోనూ ఫారం–6లు అందజేస్తున్నారు. అందుకు ఎంపీడీవోలను పర్యవేక్షకులుగా నియమించారు. కలెక్టరేట్లో సహాయ కేంద్రం నంబర్ 0878–2234731కు సంప్రదించాలని సూచిస్తున్నారు. -
2 రోజులు.. 23 వేల ఓటర్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నూతన ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులతోపాటు జాబితాలో పేరులేని అర్హులంతా నమోదుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వివిధ మాధ్యమాల ద్వారా ఓటు విలువ, ప్రాధాన్యత తెలుసుకుంటున్న యువత పెద్దఎత్తున ఓటరుగా నమోదు చేయించుకునేందుకు బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్దకు బారులుదీరుతున్నారు. రెండు రోజుల్లోనే 23 వేల మందికి పైగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లే జిల్లా ఏరియాల్లో 3,073 ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి బీఎల్ఓలు దరఖాస్తులు స్వీకరించారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం 23,174 మంది ఓటు హక్కు కోసం అర్జీలు అందాయి. ఈనెల 25వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు గడువు ఉంది. ఈ లోగా దరఖాస్తుల సంఖ్య 35 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 10న విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 26.56 లక్షలు. కొత్తగా వస్తున్న దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటే ఓటర్ల సంఖ్య 27 లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రత్యేక క్యాంపులకు మంచి స్పందన వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించారు. వచ్చేనెల 8న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. తొలగింపులు తక్కువే! ప్రత్యేక క్యాంపులు కొనసాగిన రెండు రోజుల్లో ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు కోసం మొత్తం 1,144 దరఖాస్తులు అందాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్లు మారితే తప్పనిసరిగా తొలి జాబితాలో తమ పేర్లను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మరో నియోజకవర్గం లో ఓటు హక్కు పొందే వీలుంటుంది. వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి నగ ర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, సరూర్‌నగర్‌తోపాటు పరిశ్రమల కేంద్రంగా మారుతున్న షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా తమ సొంత ఊళ్లలో ఓటు హక్కు ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో తాత్కాలిక నివాస ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో తమ పేర్లను తొలగించుకుని తమ సొంత నియోజకవర్గంలో పొందేందుకు ఆసక్తి కనబర్చుతారు. అలాగే తమ పేర్లు, ఇంటిపేరు, పుట్టిన తేదీ తదితర వాటిలో తప్పుల సవరణకు కూడా 1,097పైగా దరఖాస్తులు అధికారులకు అందాయి. వీటితోపాటు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నివాస స్థలం మారితే.. చిరునామా మార్పు కోసమూ 1,553 మంది అర్జీలు సమర్పించారు. అందుబాటులోకి కాల్ సెంటర్ ఓటరు జాబితాపై ఫిర్యాదులు, ఓటరు నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులు, సందేహాల నివృత్తి కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ సమస్యను కాల్ సెంటర్లోని సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే పరిష్కార మార్గాలు చూపిస్తారు. కలెక్టరేట్లోని ఎన్నికల విభాగంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా, ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ కాల్ సెంటర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. 040–23230811, 040–23230813, 040–23230814 కు అన్ని రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయవచ్చు. -
కొత్త ఓటర్ల నమోదుకు మరో అవకాశం
సాక్షి, జనగామ: జిల్లాలో 6,76,586 మంది ఓటర్లు ఉన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలో అధికారులు ఓటర్ల ముసాయిదా విడుదల చేశారు. శాసన సభను రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా, కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడంపై ఎన్నికల కమిషన్ అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల ఏర్పాట్లుపై జిల్లాస్థాయి అధికారులతోపాటు రెవెన్యూ శాఖ అధికారులకు అవగాహన సదస్సులను సైతం నిర్వహించారు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో మునిగిపోయింది. కొత్త సాంతికేతిక పరిజ్ఞానంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త సాంతికేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటును సరిచూసుకునే యంత్రాలకు వీవీ ప్యాట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈవీఎం మిషన్లపై పలు రాజకీయ పార్టీలతోపాటు పలువురు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో ఈ సారి వీవీ ప్యాట్లను అమర్చనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటు ఎవరికి నమోదైందో రశీదు ద్వారా తెలుసుకోవచ్చు. 1 జనవరి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు నూతన ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండి ఓటు హక్కు లేని వారి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఈనెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు, ప్రతిపాదనల స్వీకరణ, 15, 16వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణకు గ్రామ సభలు, ప్రత్యేక క్యాంపులు, అక్టోబర్ 4వ తేదీన అభ్యంతరాల పరిష్కారానికి తుది గడువు, 7వ తేదీ వరకు మార్పులు, చేర్పులతో జాబితా ముద్రణ, అనంతరం 8వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితా ప్రకారమే శాసన సభ ఎన్నికలను నిర్వహిస్తారు. -
పరిష్కారమయ్యేనా..?
కరీంనగర్ కార్పొరేషన్: స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారం బద్దకిస్తోంది. దరఖాస్తులు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా దరఖాస్తుదారుల నుంచి స్పందన కనిపించడం లేదు. 2016 నవంబర్‌లో స్థలాల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. రూ.10 వేల డీడీలను చెల్లించి 4368 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 6 నెలల గడువు విధించింది. అయినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు గడువును పొడిగిస్తూ సుమారు రెండేళ్ల కాలం ఎదురుచూసింది. చివరిగా మరో అక్టోబర్ 30 వరకు గడువును పొడిగించింది. రెండేళ్ల కాలంలో కేవలం 56 శాతం మాత్రమే దరఖాస్తులు పరిష్కారానికి నోచుకున్నాయి. అక్టోబర్ 31 వరకు గడువు ఉండగా దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పందన కనబడుటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు చివరిసారిగా ఇచ్చిన గడువును దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకుంటే బల్దియాల కాసుల పంట పండనుంది. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ద్వారా రూ.30.26 కోట్ల ఆదాయం రాగా, మొత్తం దరఖాస్తులు పరిష్కారమైతే మరో రూ.20 కోట్ల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. అయితే గడువు ఎన్నిసార్లు పొడిగించినా దరఖాస్తుదారుల్లో ఉత్సాహం కనబడడం లేదు. దరఖాస్తు చేసుకునేందుకు చూపించిన ఉత్సాహం పరిష్కరించుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే చివరిసారిగా పెంచిన గడువుతో మొత్తం దరఖాస్తులు పరిష్కారం అవుతాయనే ఆశాభావం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. దరఖాస్తులన్నీ పరిష్కారానికి నోచుకుంటే బల్దియాకు కాసులపంట పండనుంది. స్పందన అంతంతే.. కరీంనగర్ నగరపాలక సంస్థలో స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. పలుమార్లు గడువు పొడిగించడంతోపాటు రెండు పర్యాయాలు బల్దియాలో ఎల్ఆర్ఎస్ మేళాను ఏర్పాటు చేశారు. ప్రతి దరఖాస్తుదారుడికి మూడు సార్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గడువులోపు మొత్తం దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం అనుమానంగానే మారింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకుంటే వీఎల్టీ కట్టాల్సి వస్తుండడంతో కొంత మంది దరఖాస్తుల పరిష్కారానికి రావడం లేదు. మరికొంత మంది దరఖాస్తుల పరిష్కారానికి ఫీజులు చెల్లించినప్పటికీ సరైన పత్రాలు సమర్పించకపోవడంతో దరఖాస్తులను అధికారులు పరిష్కరించడంలేదు. పరిష్కారంలోనూ ఇబ్బందులే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఫీజులు చెల్లించుకునే వరకే హడావిడి చేసిన అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చే విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు ఆ దిశగా వేగం పెంచడం లేదు. వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటుండడంతో దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కోసం వేచి చూడలేక ఎలాంటి అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారు. ఇలా ఆలస్యం అక్రమాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దరఖాస్తుదారులను చైతన్యపరుస్తాం నగరపాలక సంస్థ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి దరఖాస్తుదారులకు మరోసారి నోటీసులు జారీ చేస్తాం. దరఖాస్తులు పరిష్కరించుకునే విధంగా చైతన్యపర్చి పరిష్కరించుకునే విధంగా చర్యలు చేపడ్తాం. – రవీందర్‌సింగ్, నగర మేయర్ -
ఓటోత్సాహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటు విలువపై యువత చైతన్యమైంది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు పొందేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. ఆరు నెలల్లోనే రెండు లక్షలకుపైగా యువత నూతన ఓటర్లుగా నమోదు కావడం విశేషం. ఎన్నికల విభాగం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 31 వరకు కొత్తగా 2.05 లక్షల మంది ఓటు హక్కు పొందారు. ఇందులో 90 శాతం మంది 18 ఏళ్లు నిండి 19వ ఏట అడుగు పెట్టినవారేనని అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓటును మార్చుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పట్టణ ప్రాంత, మార్చిలో గ్రామీణ ప్రాంత ఓటర్ల తుది జాబితాలు విడుదలయ్యాయి. ఆ సమయంలో జిల్లా ఓటర్లు 24.50 లక్షలు. ఆ తర్వాత చాలా మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై విస్తృతంగా చైతన్యం కల్పించాలి. ఓటరుగా నమోదు చేసుకునేందుకు కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులను సైతం నిర్వహించారు. వీటి ఫలితం గానే కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజా ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 26.56 లక్షలు. అభ్యంతరాల స్వీకరణ.. ఓటరు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ముసాయిదా ప్రతులను అన్ని గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ని (ఆర్డీఓ) నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచేందుకు యంత్రాంగం ఏర్పా ట్లు చేస్తోంది. కలెక్టరేట్ నుంచి ప్రతులను ఆయా ప్రాంతాలకు చేర్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 30 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మధ్యలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తుది జాబితా విడుదల తేదీ మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే తుది జాబితాను విడుదల చేస్తారని పేర్కొన్నారు. నమోదుకు మరోసారి అవకాశం.. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఓటు హక్కు పొందాలంటే జిల్లా పరిధిలో ఏదేని ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. పుట్టిన తేదీ, నివాస చిరునామా ఉంటే సరిపోతుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో సంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. లేదంటే మీ–సేవ ద్వారాగాని ఓటు హక్కు పొందవచ్చు. అక్టోబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 30 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మధ్యలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తుది జాబితా విడుదల తేదీ మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఓటే వజ్రాయుధం!
గుంటూరు, తుళ్లూరు: ఓటు హక్కు.. ప్రజా స్వామ్యాన్ని కాపాడే వజ్రాయుధం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటర్లుగా నమోదు కావాలి. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎన్నికల కమిషన్ సెప్టెంబరు 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఓటరుగా నమోదు కావడానికి, అభ్యంతరాలకు, సవరణలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటర్ల తుది జాబితాను 2019 జనవరి 4న ప్రకటిస్తారు. ఈ జాబితానే త్వరలో జరిగే ఎన్నికలకు ప్రామాణికం కానుంది. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ ఓటర్లుగా నమోదు కావచ్చు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్వో), తహసీల్దార్, బీఎల్వోల దగ్గర అన్ని రకాల దరఖాస్తులు లభిస్తాయి. ఓటరుగా నమోదు కావాలంటే ఫారం–6 దరఖాస్తును నింపి ఫొటో, వయస్సు, చిరునామా ధ్రువపత్రాలు(రేషన్ కార్డు, ఆధార్ కార్డు) జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను తహసీల్దారు కార్యాలయంలోను, బీఎల్ఓకు అందజేయాలి. అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబరు 1950ను కూడా అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లో ఇలా.. ఓటరు నమోదుతో పాటు అభ్యంతరాలకు, సవరణలకు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తులను సంబంధిత ఈఆర్వో, ఏఈఆర్ఓలకు పంపవచ్చు. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్(ఎన్వీఎస్పీ) సందర్శించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కింద క్లిక్ హియర్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే కావాల్సిన దరఖాస్తు ఓపెన్ అవుతుంది. వివరాలు పూర్తి చేసి దరఖాస్తుతో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అభ్యంతరాలకు, వివరాల సవరణల కోసం, ఒకే నియోజకవర్గంలోనే ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి చిరునామా మార్పు కోసం, సంబంధిత ఫారంను క్లిక్ చేసి వివరాలు నింపి తగిన ధ్రువ పత్రాలతో అప్లోడ్ చేయాలి. ఏ ఫారం.. ఎందుకు ⇒ ఫారం–6: కొత్తగా ఓటర్లు నమోదు ⇒ ఫారం–6ఏ: విదేశాల్లో ఉన్న భారతీయులు తమ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు ⇒ ఫారం–7: ఓటర్ల జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు, తొలగింపు ⇒ ఫారం–8: ఇంటి పేరు, ఓటరు పేరు, పుట్టిన తేదీల్లో తప్పులు ఉంటే సవరణ ⇒ ఫారం–8ఏ: ఒకే శాసనసభ నియోజకవర్గం పరిధిలో చిరునామా మార్పు, బదిలీ అర్హులందరూఓటు హక్కును పొందాలి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఓటు హక్కుతో మంచి పాలకులను, మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి వారందరూ ఓటర్లుగా నమోదు కావాలి. 18 ఏళ్లపైబడి ఉండి ఓటరుగా నమోదు కాని వారు కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబరు 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.–మండెపూడి పూర్ణ చంద్రరావు,తహసీల్దార్, తుళ్లూరు -
అందని ద్రాక్షగా బీసీ రుణాలు
ఒంగోలు టూటౌన్: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన దుంపల శ్రీనివాసులు 216–17 ఆర్ధిక సంవత్సరంలో శివ కేశవ సగర ఉప్పుర సొసైటీ కింద జేసీబీ యూనిట్‌కు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. రూ.13 లక్షల సబ్సిడీ కాగా రూ.13 బ్యాంకు రుణం కింద మంజూరైంది. బ్యాంకులో నగదు జమైనట్లు అతని సెల్‌కు మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు పోతే డబ్బులు రాలేదని అధికారులు తిప్పిపంపుతున్నారు. ఇలా ఒకటిన్నర సంవత్సరంగా బ్యాంకు చుట్టూ, బీసీ కార్పొరేషన్ చుట్టూ రుణం కోసం తిరుగుతూనే ఉన్నాడు. శ్రీనివాసులు లాంటి వారు ఎంతో మంది రుణాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లాలో రజక ఫెడరేషన్లు 24 ఉండగా వాటిలో సుమారుగా 10 ఫెడరేషన్లకు రుణాలు మంజూరయ్యాయి. ఈ గ్రూపులలో దాదాపు 150 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరు కూడా 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే రుణాలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రుణం అందని పరిస్థితి ఉంది. జిల్లాలో బీసీ ఫెడరేషన్లకు రుణాలు అందని ద్రాక్షగా మారింది. రెండేళ్లుగా చాలా మంది లబ్ధిదారులకు రుణాలు అందక అటు బ్యాంకుల చుట్టూ, ఇటు బీసీ కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితి నెలకొంది. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో కొతపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన దుంపల శ్రీనివాసరావు మరో 12 మంది సభ్యులతో కలిసి శివ కేశవ సగర ఉప్పర సొసైటీ (ఫెడరేషన్) ఏర్పాటు చేసి, బీసీ కార్పొరేషన్ ద్వారా జేసీబీ యూనిట్‌కు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. యూనిట్ మొత్తం విలువ రూ.26 లక్షలు. దీనిలో రూ.13 లక్షలు సబ్సిడీ కాగా, రూ.13 లక్షలు బ్యాంకు రుణంగా మంజూరైంది. రుణం మంజూరుకు బ్యాంకులో రూ.30 లక్షల విలువైన ప్రాపర్టీని హామీగా చూపించారు. ఈ రుణం మంజూరుకు సంబంధించి 2017 డిసెంబర్ 30న చెక్ మంజూరైంది. చెక్ మంజూరు అయినట్లు ఆన్లైన్ మెసెజ్ కూడా లబ్ధిదారుని సెల్‌కు వచ్చింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయినట్లు చెక్ నెంబర్‌తో సహా ఆన్లైన్లో చూపిస్తోంది. బ్యాంకుకు పోయి అధికారులను అడిగితే డబ్బులు జమకాలేదని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుడు అయోమయానికి గురయ్యారు. చేసేదేం లేక శివ కేశవ సగర ఉప్పర సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ అయిన ఎస్.ఏడుకొండలు దృష్టికి తీసుకెళ్లాడు. వస్తాయి అని చెబుతున్నారే కానీ ఇంతవరకు రుణం అందలేదని బాధితుడు శ్రీనివాసులు ‘సాక్షి’ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రుణం కోసం తిరగడానికి వివిధ ఖర్చుల నిమిత్తం దాదాపు లక్ష వరకు సొంత ఖర్చులు అయినట్లు తెలిపాడు. ఇతనే కాకుండా ఇంకొంత మంది లబ్ధిదారులు ఇలానే రుణం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారని బీసీ సంఘం నాయకుడు బంకా చిరంజీవి తెలిపారు. రజక ఫెడరేషన్ రుణాలదీ అదే పరిస్థితి అదే విధంగా రజక ఫెడరేషన్లకు సంబంధించిన రుణాలు ఇంత వరకు లబ్ధిదారులకు అందలేదని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండయ్య తెలిపారు. జిల్లాలో మొత్తం 24 రజక ఫెడరేషన్లు ఉంటే వాటిలో దాదాపు 10 ఫెడరేషన్ల వరకు రుణాలు మంజూరైనట్లు చెప్పారు. కానీ ఏ ఒక్క ఫెడరేషన్‌కు డబ్బులు చేతికందలేదని తెలిపారు. ఆన్లైన్లో రుణాలు మంజూరైనట్లు చూపిస్తూ ప్రభుత్వమే మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ్‌కాలనీ, విజయ నగర్ కాలనీ, ఎన్జీవో కాలనీల్లోని గ్రూపులకు మంజూరు రుణాలు పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది నాగులుప్పలపాడు మండలం కార్యాలయం నుంచి మంజూరైన నగదు వివరాలను స్థానిక బ్యాంకులకు ఆన్లైన్ ద్వారా పంపించనందున దాదాపు రూ.80 లక్షల రుణాలు లబ్ధిదారులకు అందకుండానే మురిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, స్థానిక రాజకీయ నాయకుల వల్ల ఉప్పుగుండూరు, మద్దిరాలపాడు, అమ్మనబ్రోలు గ్రామాలకు చెందిన రజక సంఘాల లబ్ధిదారులు దాదాపు 40 మంది తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఫెడరేషన్ల రుణాల మంజూరులో గందరగోళంపై ఇటీవల మీకోసం కూడా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అధికారులకు ఇచ్చిన వినతి పత్రాన్ని తిరిగి బీసీ కార్పొరేషన్ ఈడీకే పంపించడం వలన అది బుట్టదాఖలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు బ్యాంకులో పెండింగ్ పడటానికి కారణం ప్రభుత్వమేనని మండిపడ్డారు. సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా, రుణాలు మంజూరైనట్లు ఆన్లైన్లో పురోగతి చూపించడం ఏమిటని ప్రశ్నించారు. ఫెడరేషన్ల రుణాలు లబ్ధిదారులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
ఇళ్ల కోసం బారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. బడుగుల సొంతిం టి కల సాకారమవుతోంది. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం), రాజీవ్ గృహకల్ప, వాంబే పథకాల కింద జిల్లా యంత్రాంగం ఫ్లాట్లను కేటాయిస్తోంది. ఈ మేరకు ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా 12 చోట్ల నిర్మించిన కాలనీల్లోఖాళీగా ఉన్న 1900 ఫ్లాట్లను కేటాయించేందుకు దరఖాస్తుదారులను ఆహ్వానించింది. దీంతో శనివారం గడువు ముగిసే సమయానికి 1,366 మంది మొదటి విడతగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపేణా రూ.45,011 చెల్లించారు. డీడీలు చెల్లించేందుకు ఈ పథకాల కింద సుమారు 26వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ తొలి వాయిదా కట్టడానికి ముందుకు రాలేదు. దీంతో డబ్బు చెల్లించినవారికి దాదాపుగా ఫ్లాట్ ఖాయమైనట్లే. అయితే, మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతితో బ్యాంకులకు సెలవు రావడంతో డీడీలు తీయలేకపోయామని పలువురు లబ్ధిదారులు వాపోయారు. ఫ్లాట్ల ఖాళీ ల నేపథ్యంలో వీరికి మరో అవకాశం కల్పించే అం శాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఫ్లాట్ల ఖాళీల కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిన కేటాయించి.. మిగతా వారికి డీడీలు వాపస్ ఇవ్వాలని యంత్రాంగం యోచిస్తోంది. -
మా ప్లాట్ ఏ జోన్లో ఉందో చెప్పండి..
సాక్షి, సిటీబ్యూరో: ‘ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ (ఎల్‌యూసీ)...భూమి యజమాన్య హక్కులున్న వారికి ఇది ఎంతో ఉపయోగం...ఆ భూమిలో భవన నిర్మాణానికి అనుమతి కావాలన్నా ఇది తప్పనిసరి. బ్యాంక్ రుణాలకు ఉపయోగపడుతుంది అవసర సమయంలో ఇతరులకు విక్రయించేటప్పుడు ఈ సర్టిఫికెట్ ఉంటే ఈజీగా అమ్మేయొచ్చు. కొనుగోలుదారుడు కూడా నమ్మకంతో ముందుకొస్తాడు’...గతంలో ఎల్‌యూసీ సర్టిఫికెట్ వచ్చేందుకు ఏళ్ల తరబడి తార్నాకలోని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. వీరి వెతలు హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు దృష్టికి రావడంతో డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా ఎల్‌యూసీ ఆన్లైన్ సేవలను గత ఏడాది జూలైలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా హెచ్ఎండీఏకు నెలకు దాదాపు 200కుపైగా ఎల్‌యూసీ దరఖాస్తులు వస్తున్నాయి. ఎల్‌యూసీ కోసం తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి రాకుండానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పక్షం రోజుల్లోనే సర్టిఫికెట్ అందుకుంటున్నారు. ఆన్లైన్ డీపీఎంఎస్లోనే... http://www.hmda.gov.in వెబ్సైట్లో కుడివైపున ఉండే ‘ఆన్లైన్ డీపీఎంఎస్’ అప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే ‘అప్లయ్ ఫర్ ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్’ను క్లిక్ చేస్తే ‘అప్లయ్ ఫర్ న్యూ’ అనే అప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి మండలం, విలేజ్, సర్వేనంబర్లు, సేల్‌డీడ్, ఓనర్షిప్ యజమాన్య పత్రాలు ఆప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆ సర్వే నంబర్లను మాస్టర్‌ప్లాన్‌లో అధికారులు పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి కెళ్లి ఆ భూమి వివరాలు తెలుసుకుంటారు. ఈ ప్రక్రియ 15 రోజుల పాటు సాగుతుంది. ఆ తర్వాత ఆ భూమి ఏ యూజ్‌లో ఉందో తెలుపుతూ ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. పక్కా పారదర్శకంగా... ప్రస్తుత రోజుల్లో భూమి కొందామంటే భయం.. అది సక్రమమా, అక్రమమా అని. తమ సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో చాలా మంది ఎన్నో ప్రాంతాల్లో తిరిగి ఎక్కడో ఒక చోట బోల్తా పడుతుంటారు. తీరా ఆది మాస్టర్‌ప్లాన్‌లో గ్రీన్జోన్లో ఉందని తెలియడంతో వారి బాధలు వర్ణనాతీతం...ఒక లే అవుట్‌ను డెవలప్‌చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్న వ్యాపారులు కూడా రియల్ దందాలో ఆ భూమి గురించి పూర్తి వివరాలు తెలియక కొని మోసపోతున్నవారు ఎందరో ఉన్నారు. ఇటువంటి వాటికి చెక్‌పెట్టేందుకు కొన్ని ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఎల్‌యూసీ దరఖాస్తు, జారీ మాన్యువల్‌గా సాగుతుండటం, అది కూడా నెలల పాటు సమయం తీసుకుంటుండడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో బిల్డింగ్ పర్మిషన్ కూడా ఆలస్యమవుతోంది. సొంతిల్లు సకాలంలో నిర్మించుకోలేక అద్దె ఇండ్లలోనే కాలం వెళ్లదీస్తున్నవారు ఉన్నారు. కొంత మంది ఎల్‌యూసీ వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటుండడంతో ముందే ఇల్లు కట్టేసి తీరా అది గ్రీన్జోన్లో ఉండటంతో అధికారులు కూల్చివేయడంతో లబోదిబోమంటున్న సంఘటనలు అనేకం. వీటన్నింటికి చెక్ పెట్టడంతో పాటు ఎల్‌యూసీ దరఖాస్తుదారుడికి సకాలంలో అందేలా అది కూడా 15 రోజుల్లో వచ్చేలా కమిషనర్ చిరంజీవులు చొరవ తీసుకున్నారు. దీంతో పాటు వాటర్, కరెంట్ కనెక్షన్ కోసం ఉపయోగపడే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. పక్షం రోజుల్లోనే అనుమతి... ఎల్‌యూసీ దరఖాస్తుదారులు హెచ్ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. దరఖాస్తుదారుడు అప్లయి చేసిన దగ్గరి నుంచి సర్టిఫికెట్ జారీ చేసే వరకు పారదర్శకంగా ఉంటుంది. ఎల్‌యూసీ కోసం దరఖాస్తు చేసిన భూమి సర్వే నంబర్లు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్,. ఇండస్ట్రియల్, కన్జర్వేషన్, ఇన్స్టిట్యూషన్ గ్రీన్‌జోన్..ఇలా ఏ పరిధిలో ఉందో తెలుసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో అన్ని తెలుసుకున్నాక ఆన్లైన్ ద్వారానే పక్షం రోజుల్లోనే ఎల్‌యూసీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీనివల్ల బిల్డింగ్ పర్మిషన్ తొందరగా వచ్చేస్తుంది. బ్యాంక్ నుంచి రుణాలు పొందడం కూడా సులభమవుతుంది. –టి.చిరంజీవులు, హెచ్ఎండీఏ కమిషనర్ -
ఆమ్యామ్యాలు అక్కర్లే!
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ ద్వారానే భవన నిర్మాణ దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీని అమల్లోకి తెచ్చినప్పటికీ, సంబంధిత ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఆగలేదు. వివిధ కొర్రీలతో అనుమతుల జారీలో జాప్యం చేస్తూ.. చేతులు తడిపితేనే దరఖాస్తులకు అనుమతులిస్తున్నారు. వీటిల్లో నిర్మాణ ప్లాన్‌లో లోపాలు.. షార్ట్‌ఫాల్స్ ఉన్నాయంటూ నిరాకరిస్తున్నారు. లోపాలు సరిదిద్ది తిరిగి రివైజ్ ప్లాన్‌తో దరఖాస్తు చేసుకోమంటున్నారు. జీహెచ్ఎంసీలో ఏటా దాదాపు పదివేల ఇళ్లకు అనుమతులిస్తుండగా, వాటిల్లో దాదాపు మూడువేల దరఖాస్తులిలా ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. తద్వారా ఖర్చులు పెరగడంతో పాటు అనుమతి జారీలో జాప్యం చోటు చేసుకుంటోంది. భవనాలకు 21 రోజుల్లోనే అనుమతులు జారీ చేయాలనే నిబంధన వచ్చాక ఇలాంటి తిరస్కరణలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితి నివారించేందుకు, నిర్మాణదారుల ఇబ్బందులు తప్పించేందుకు ఆటో డీసీఆర్ (ఆటో డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్) ద్వారా దరఖాస్తుకు ముందే ప్లాన్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకునే ప్రీ స్క్రూటినీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. దాని కోసం సంబంధిత కార్యాలయాల దాకా వెళ్లాల్సి వస్తోంది. లేదా ఆర్కిటెక్టులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో చేయి తడిపితేనే పనులవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో డీసీఆర్ ద్వారా ప్రీ స్క్రూటినీతో తమ బిల్డింగ్ ప్లాన్ సరిగ్గా ఉందో లేదో ఎక్కడినుంచైనా యజమాని/ఆర్కిటెక్ట్ ఆన్లైన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనున్నారు. నిర్ణీత ఫార్మాట్లో ప్లాన్ నమూనాను సంబంధిత వెబ్సైట్లో అప్‌లోడ్‌చేస్తే.. ప్లాన్ సరిగ్గా ఉన్నదీ లేనిదీ ఆన్లైన్లోనే తెలుస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటే ఓకే అని చూపుతుంది. లేని పక్షంలో ఎక్కడ లోపాలున్నాయో తెలుపుతుంది. భవన నిర్మాణానికి సంబంధించి సెట్బ్యాక్లు, ఎత్తు, వెంటిలేషన్ తదితరమైనవి నిబంధనల కనుగుణంగా లేని పక్షంలో ఆ వివరాలు తెలియజేస్తుంది. ఆమేరకు స్క్రూటినీ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. తద్వారా భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ముందే ప్లాన్ సక్రమంగా ఉన్నదీ లేనిదీ స్వీయ పరిశీలనతోనే తెలుసుకోగలుగుతారు. లోపాలుంటే సరిదిద్దుకుంటారు. తద్వారా ఎంతో సమయం, వ్యయం కలిసి వస్తాయి. స్క్రూటినీలో ఓకే అయ్యాక ఇతర సాకులు చూపి, నిర్మాణ అనుమతులు జాప్యం చేసేందుకు అవకాశం ఉండదు. భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రజలు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండే చర్యల్లో భాగంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. సర్కిల్ స్థాయి వరకు అనుమతులిచ్చే నిర్మాణాలకు సైతం ఇది అందుబాటులోకి వస్తుంది. తద్వారా తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకునేవారికి ఎంతో సదుపాయంగా ఉంటుందని భావిస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ.. జీహెచ్ఎంసీతోపాటు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, డీటీసీపీల పరిధిలోని భవనాల ప్లాన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనున్నారు. వీటన్నింటికీ హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ ఏర్పాటుకయ్యే వ్యయంలో జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ, డీటీసీపీలు తమవంతు వాటా నిధులు చెల్లిస్తాయని సంబంధిత అధికారి తెలిపారు. జీప్లస్ ఐదంతస్తుల భవనాల ప్లాన్ల వరకు దీన్ని అందుబాటులోకి తేనున్నారు. దాదాపు రెండునెలల్లోగా ఇది అందుబాటులోకి రానుంది. -
ఆన్లైన్ అడ్మిషన్స్
గతంలో డిగ్రీలో చేరాలంటే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలకు వెళ్లి సీట్లు ఉన్నా యో లేదో తెలుసుకుని దరఖాస్తు చేసుకునేవారు. అయితే ఈ ఏడాది నుంచి ఈ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యలో కేంద్రీకరణ ప్రవేశ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఏ సమయంలోనైనా డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకునే వెసులబాటును కల్పించింది. నెల్లూరు(టౌన్): జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ, తొమ్మిది ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో బీఏలో 1,192, బీకాంలో 1,660, బీఎస్సీలో 2,644 కలిపి మొత్తం 5,496 సీట్లు ఉన్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ తరహాలో పారదర్శకంగా ఉండేలా కేంద్రీకరణ ప్రవేశ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అకడమిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఏపీఎస్ఏఎంఎస్)గా నామకరణం చేసి ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని ఈనెల 5వ తేదీనుంచి అమలులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు విధించారు. 29వ తేదీ ఎంపికైన వారి తొలి జాబితాను ప్రచురించనున్నారు. ఈ నెల 31వ తేదీలోపు సీటు పొందిన కళాశాలలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చేనెల 3న ఎంపికైన వారి రెండో జాబితాను ప్రచురిస్తారు. 5వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు జూన్ మొదటి వారంలో దరఖాస్తులు స్వీకరించి ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ 10వ తేదీకల్లా పూర్తి చేస్తారు. జిల్లాలో 18 ప్రభుత్వ,ఎయిడెడ్ కళాశాలలు జిల్లా వ్యాప్తంగా 18 ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డీకేడబ్ల్యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నెల్లూరు), ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(గూడూరు), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (నాయుడుపేట), శ్రీ వీఎస్ఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సూళ్లూరుపేట), విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (వెంకటగిరి), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (రాపూరు), వైకేఆర్కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కోవూరు), పీఆర్ఆర్వీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (విడవలూరు), ఎంఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఉదయగిరి) ఉన్నాయి. అదేవిధంగా ఎయిడెడ్‌కు సంబంధించి వీఆర్ డే కళాశాల (నెల్లూరు), వీఆర్ ఈవినింగ్ కళాశాల (నెల్లూరు), ఎస్వీజీఎస్ డిగ్రీ కళాశాల (నెల్లూరు), శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాల (నెల్లూరు), ఎన్బీకేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల (విద్యానగర్), డాక్టర్ ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల (ఆత్మకూరు), వేద సంస్కృత ఓరియంటల్ కళాశాల (నెల్లూరు), జవహర్ భారతి డిగ్రీ కళాశాల (కావలి), డీఆర్డబ్ల్యూ డిగ్రీ కళాశాల (గూడూరు) ఉన్నాయి. దరఖాస్తు చేసే విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ap.gov.in/admissions వెబ్‌సైట్‌ను రూపొందించింది. వైబ్సైట్లోకి Ðð వెళ్లి తొలుత రిజిస్టర్ చేసుకుంటే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ తరువాత లాగిన్ అయితే డిగ్రీ అడ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాం కనిపిస్తుంది. దానిలో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రయార్టీ ప్రకారం వరుసగా ఐదు కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రయార్టీ ప్రకారం వచ్చే దరఖాస్తు పత్రంలో విద్యార్థి ఆధార్ సంఖ్య, హాల్ టికెట్ నంబరు, జనన, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉంటే వాటి పత్రాలు, దివ్యాంగులైతే వాటి పత్రం, తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తరువాత చలానా జనరేట్ అవుతుంది. చలానా తీసుకుని మీసేవ, ఈసేవా కేంద్రాల్లో రూ.50లు చెల్లించాల్సి ఉంది. ఆ తరువాత సీటు కేటాయింపు వివరాలు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తారు. విద్యార్థుల కోసం క్యాంపెయిన్ విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చుకునేందుకు ఆయా కళాశాలల్లో అధ్యాపకులు క్యాంపెయిన్ బాట పట్టారు. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 266 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో 35మంది నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 231 మందికి ఆయా కళాశాలల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. మరింత మంది విద్యార్థులను చేర్చుకునేందుకు అధ్యాపకులు ఇంటర్ పాసైన విద్యార్థుల వివరాలను సేకరించి వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఈనెలాఖరు వరకు సమీప ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ చేర్చేందుకు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు పలువురు అధ్యాపకులు తెలిపారు. ఎక్కడినుంచైనాదరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలో డిగ్రీ చేరేందుకు రాష్ట్రంలో ఎక్కడునుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా సులువుగా ప్రవేశం పొందవచ్చు. ప్రయార్టీ ప్రకారం ఒక్కో విద్యార్థి ఐదు కళాశాలలను ఎంపిక చేసుకునే వెసులబాటును కల్పించారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ విధానంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆయా కళాశాలల్లో సీట్లు మిగిలి ఉంటే ఈ నెల 25వ తేదీ తరువాత దరఖాస్తు చేసుకోవచ్చు. –మస్తానయ్య, ప్రిన్సిపల్డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల -
ఆన్లైన్.. హైరానా!
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ పీ జీ విద్యార్థుల సెమిస్టర్ పరీక్ష దర ఖాస్తులు అప్లోడ్ కాకపోవడంతో వి ద్యార్థులు హైరానా పడుతున్నారు. ఎ స్వీయూలో పీజీ సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తు కోసం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష దరఖాస్తు తుది గడువు శనివారంతో ముగియనుంది. అయితే దరఖాస్తు చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెతా ్తయి. దీంతో దరఖాస్తులు అప్లోడ్ కా వడం లేదు. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన సీబీసీఎస్ విధానం ప్రకారం విద్యార్థులు మూడు రెగ్యులర్ పేపర్లతో పాటు ఒక జనరల్ ఎలక్టివ్, ఒక ఓపెన్ ఎలక్టివ్ పేపర్ చదవాల్సి ఉం ది. ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో జనరల్ ఎలక్టివ్ పేపర్లు ఎం చుకునే కాలమ్‌లో ఒక పేపర్ మా త్రమే ఎంటర్ చేస్తే అప్లోడ్ కావడం లేదు. రెండో పేపర్ ఎంటర్ చేయమ న్న ఆప్సన్ వస్తుంది. వాస్తవానికి వి ద్యార్థులు చదువుతున్నదీ, పరీక్ష రా యాల్సింది ఒక పేపర్ మాత్రమే. అ యితే రెండు జనరల్ పేపర్లు ఎంచుకొనేలా సాఫ్ట్వేర్ ఉండడంతో విద్యార్థుల దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదు. గణితం, ఆక్వాకల్చర్, రసాయ న శాస్త్రం, సాంఖ్యక శాస్త్ర విభాగాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. అకడమిక్ విభాగం నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ స మస్య తలెత్తిందని కొందరు విద్యార్థి నాయకులు పేర్కొంటున్నారు. ఈ స మస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ అంశంపై రె క్టార్ ఎం.భాస్కర్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నా రు. ఈ అంశాన్ని వివిధ విభాగాల వా రితో చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. -
నిరుద్యోగులకు.. ఉద్యోగాల వేదిక
నిడమర్రు : కాలం మారింది.. అంతా కంప్యూటర్ యుగం నడుస్తుంది. నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నా అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు ఆన్లైన్ దరఖాస్తు విధానంతో తప్పాయి. గత కొంతకాలంగా నిరుద్యోగుల నుంచి ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ కూడా ఆన్ లైన్ విధానంలో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఆ వివరాలు తెలుసుకుందాం. గతంలో అర్హతలుంటేనే కాల్ లెటర్స్ గతంలో ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్‌లో పేర్లు నమోదు చేసుకునేవాళ్లు. అప్పుడు వాళ్ల అర్హతలకు తగిన అవకాశాలు ఉంటేనే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేది. ఇప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌ను అధికారులు రూపొందించారు. ఇప్పటికే రకరకాల పోర్టళ్లలో రెజ్యూమ్ అప్లోడ్ చేసి నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందినవారు అనేకమంది ఉంటారు. అలాంటి వారికోసం ఈ వెబ్సైట్ మంచి అవకాశాలు కల్పిస్తుంది. ఏపీలోని ఉద్యోగ సమాచార వేదికగా.. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్‌పోర్టల్‌లో ఒక్కసారి రిజిస్టర్ చేసుకుని, తమ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేస్తే సరి పోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఆయా జిల్లాలు, నియోజకవర్గం, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం కూడా తెలుస్తుంది. ♦ ప్రైవేటు ఉద్యోగాల సమాచారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్ల సమాచారం అంతా ఈ వెట్సైట్లో అందుబాటులో ఉంటుంది. ♦ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ చెల్లించాల్సిన అవసరంలేదు. అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ♦ ఉద్యోగాలు అవసరమైన కంపెనీ/సంస్థలు/రిక్రూటర్లు కూడా ఈ సైట్లో తమకు అవసరమైన ఖాళీలు గురించి వెబ్సైట్లో పొందుపరిచే అవకాశం కల్పించారు. దీంతో ఆయా అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు వాటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. అభ్యర్థులు ముందుగా ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ అధికారిక వెబ్సైట్ నందు లాగిన్ అవ్వాల్సి ఉంది. www.apemploymentexchange.com లాగిన్ అయ్యాక కనిపించే వెబ్సైట్ ముఖచిత్రంలో ‘న్యూ జాబ్ రిజిస్ట్రేషన్ హియర్’ వద్ద క్లిక్ చేయాలి. జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు కనిపిస్తుంది. అక్కడ పేరు, ఈ– మెయిల్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత కాలం వద్ద పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని నమోదు చేయాలి. పక్క కాలంలో రీ టైప్ పాస్వర్డ్ వద్ద తిరిగి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. జిల్లా, చిరునామా, పిన్‌కోడ్ నమోదు చేయాలి. తర్వాత మీ సర్టిఫికెట్స్ ఆప్‌లోడ్ చెయ్యాల్సిన కాలం కనిపిస్తుంది. అక్కడ స్కేన్ చేసిన సర్టిఫికెట్స్ (5 కేబీ లోపు) అక్కడ సూచించిన ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా నమోదు చేసిన ఈ–మెయిల్ ఐడీ, మీరు క్రియేట్ చేసుకున్న పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లోకి లాగిన్ కావచ్చు. -
బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలి
కరీంనగర్‌సిటీ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదు అంశాలు, పోలింగ్ కేంద్రాల అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గత నెల 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందని, ఆ జాబితాలో మార్పులు, చేర్పులుంటే బూత్‌స్థాయి అధికారిని సంప్రదించొచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 14 వరకు అవకాశముందని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే బూత్‌స్థాయి, సహాయ ఓటరు నమోదు అధికారిని సంప్రదించొచ్చని, లేదా ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్పులు, చేర్పుల దరఖాస్తులకు ఈనెల 11న ప్రత్యేక సవరణ తేదీని వినియోగించుకోవాలని, ఆ రోజు సంబంధింత బూత్‌స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. తుది ఓటరు జాబితా మార్చి 24న ప్రకటిస్తారని తెలిపారు. భారత ఎన్నికల సంఘం జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడిగా మహిళా శిశు, వికలాంగ వయోవృద్ధుల శాఖ రాష్ట్ర సెక్రటరీ ఐఏఎస్ జగదీశ్వర్‌ను నియమించామన్నారు. బీఎస్పీ ప్రతినిధి మల్లయ్య, బీజేపీ నుంచి వేణుగోపాల్, సీపీఐ నుంచి రాజు, ఐఎస్సీ నుంచి రెమహత్, ఎంఐఎం నుంచి ఇబ్రహీం, టీడీపీ నుంచి ఆగయ్య, కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ తహసీల్దార్లు శ్రీనివాస్, రాజయ్య, మహేందర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
డెంకాడ: అక్కివరం గొల్లపేట వద్ద ఉన్న మోడల్ స్కూల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.స్వర్ణలత ప్రకటనలో తెలిపారు. బీసీ, ఓసీ విద్యార్థులు 01.09.2006 నుంచి 31.8.2008 సంవత్సరాల మధ్యలో, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2004 నుంచి 31.8.2008 మధ్యలో పుట్టి ఉండాలన్నారు. బీసీ విద్యార్థులకు వంద రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు పరీక్షా రుసుం చెల్లించాలన్నారు. ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి వస్తే సెల్ నంబర్లు 70329 96542, 99493 49598కు సంప్రదించాలన్నారు. -
కేంద్ర ఉద్యోగులకు ‘ఆన్లైన్’ సేవలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై సెలవులు, అధికారిక పర్యటనల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేలా కొత్త వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌గా పిలిచే ఈ వ్యవస్థను కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ మంత్రి జితేంద్ర సింగ్ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా సోమవారం నాడిక్కడ ఆవిష్కరించారు. ఈ వ్యవస్థలో భాగంగా 5 మాడ్యుల్స్లో 25 అప్లికేషన్లను ప్రారంభించారు. ‘ఈ–హెచ్ఆర్ఎంఎస్తో సర్వీస్ బుక్, జీపీఎఫ్, జీతం వివరాలను చూడటంతో పాటు సెలవులు, పలురకాల క్లెయిమ్‌లు, రీయింబర్స్మెంట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్లు, అడ్వాన్సులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఎల్టీసీ అడ్వాన్సులు వంటి అన్ని సేవలను ఒకేచోట పొందవచ్చు’ అని మంత్రిత్వశాఖ తెలిపింది. ఆన్లైన్లో ఉద్యోగుల పూర్తి సమాచారం అందుబాటులో ఉండటం వల్ల సంబంధిత విభాగాలు రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్, పోస్టింగుల విషయంలో సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చని వెల్లడించింది. -
ఆన్లైన్లో అగ్నిమాపక శాఖ
జిల్లా అగ్నిమాపక శాఖ ఆన్లైన్ సేవల్లోకి అడుగుపెట్టింది. ఇకపై భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, కల్యాణమండపాలు, ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల(ఎన్ఓసీ)కు దరఖాస్తు చేసుకోవడానికి అగ్నిమాపక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎన్ఓసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తిరుపతి క్రైం: అగ్నిమాపక శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఒక అడుగు ముందుకు వేసింది. ఆన్లైన్ ద్వారా నిరభ్యంతర సర్టిఫికెట్(ఎన్ఓసీ) అందించే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాలోని 16 కార్యాలయాల్లో ఈ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అగ్నిమాపక శాఖ పరిశ్రమలు లేక అందుకు సంబంధించిన ప్రభుత్వ విభాగాల అధికారులు కమిటీగా ఏర్పడి వచ్చి పరిశీలిస్తారు. నిబంధనల మేరకు యజమానులు అన్ని సమకూర్చుకుని ఉంటే ఆన్లైన్ ద్వారా ఎన్ఓసీ పొందవచ్చు. www. fireservices.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆ తర్వాత http://202.83.28 .165/noc/#/login కావాల్సి ఉంది. నూతన దరఖాస్తుదారులతో పాటు ప్రొవిజినల్, ఆక్యుపెన్సీ, రెన్యూవల్ కోసం ఎన్ఓసీ పొందాలన్నా కూడా ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్లో ఇలా... ♦ వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత దరఖాస్తుదారుడు మొదటగా రిజిస్టర్ చేసుకోవాలి. ♦ ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఈ–మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్‌ను పొందుపరచాలి. ♦ పాస్వర్డ్ ద్వారా వెబ్సైట్లోకి లాగిన్కావాలి. దరఖాస్తు ఫారంలో సూచించిన విధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ♦ దరఖాస్తు ఫారాలు అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదు. పొరపాట్లు జరిగితే సిస్టమ్‌లోనే గుర్తు చేసేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి దరఖాస్తు పరిశీలన ఏస్థాయిలో ఉందో అగ్నిమాపక శాఖ వారు మెయిల్, సెల్‌కు మెసేజ్ పంపుతారు. ♦ దరఖాస్తు పరిధిని బట్టి అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలన కోసం ఓ కమిటీని నియమించి, సంబంధిత భవనాలు, నిర్మాణాలను పరిశీలిస్తారు. ♦ అన్నీ సక్రమంగా ఉంటే ఎన్ఓసీ మంజూరు చేస్తారు. లేదంటే ఎలాంటి సర్టిఫికెట్లు కావాలి.. సౌకర్యాలు ఏవిధంగా ఉండాలి.. అన్న వివరాలను దరఖాస్తుదారునికి ఆన్లైన్లో పంపుతారు. ♦ దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలి.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. సందేహాలు ఉంటే ఆన్లైన్లో నివృత్తి చేసుకోవచ్చు. అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ పొందడంలో సందేహాలు ఉంటే ఆన్లైన్లో నివృత్తి చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో ఉంచిన నంబర్‌ను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇక నుంచి ఎన్ఓసీ కోసం అగ్నిమాపక శాఖకు రావాల్సిన అవసరం లేదు. – శ్రీనివాసులురెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి -
ఆన్లైన్లో ఆస్ట్రేలియా వీసా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యాటక వీసా కోసం భారతీయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ దేశ హైకమిషనర్ తెలిపారు. అర్హులైన భారతీయులు తమ విభాగం ‘ఇమ్మి అకౌంట్ పోర్టల్’ ద్వారా జూలై 1 నుంచి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆస్ట్రేలియా తాత్కాలిక హైకమిషనర్ క్రిస్ ఎల్స్టోఫ్ట్ పేర్కొన్నారు. దీని ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటిం చాలనుకునే భారతీయులకు వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు. దరఖాస్తుదారుడి అంగీకారంతో అతడి కుటుంబ సభ్యులు, ట్రావెల్ ఏజెంట్, వీసా అప్లికేషన్, కేంద్రం ఇలా థర్డ్ పార్టీకి చెందిన వారెవరైనా దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయొచ్చని ఆయన వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు, అనుబంధ పత్రాలు ప్రాసెసింగ్ కార్యాలయానికి అందుబాటులో రావడం వల్ల ఇలాంటి వీసాలకు ప్రాసెసింగ్ సమయం చాలా తక్కువ అవుతుందన్నారు. భారత్‌లో ఆస్ట్రేలియా వీసాలకు ఆదరణ పెరుగుతోందని, గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి మధ్యలో సుమారు రెండున్నర లక్షల మంది భారతీయులు ఆస్ట్రేలియాలో పర్యటించారని తెలిపారు. -
మరో ఐదు జిల్లాల్లో జనసేన శిబిరాలు
హైదరాబాద్ : ఉత్తరాంధ్ర, గ్రేటర్ హైదరాబాద్‌లలో జనసేన నిర్వహించిన ప్రతిభా పాటవ ఎంపిక శిబిరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరో ఐదు జిల్లాల్లో జనసేన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో వెలుగులు నింపాలని, దేశ రాజకీయాలను ప్రగతి వైపు మళ్లించాలని ఆశ, ధ్యాస ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ శిబిరంలో పాల్గొనడానికి అర్హులేనన్నారు. స్పీకర్, కంటెంట్ రైటర్, అనలిస్ట్ విభాగాలకు ఆన్లైన్లో తమ దరఖాస్తులు పంపడానికి జనసేన వెబ్సైట్లో లాగ్‌ఆన్ అవ్వాలని, జనసేన వెబ్సైట్లో మే 30 నుంచి జూన్ 3 వ తేదీ వరకు దరఖాస్తులు అప్లోడ్ చేయవచ్చునని వెల్లడించారు. -
ఆన్లైన్ పాలన
‘పాలన పారదర్శకంగా ఉండాలి.. ప్రజలకు అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి.. నిబంధనలకు లోబడి ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయాలి. ఒకవేళ కాకపోతే కారణం చెప్పాలి.. అంతే కానీ కాలయాపన చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దు.. కొత్త జిల్లాలో పాలనలో మార్పు రావాలి.. అందుకోసం ఆన్లైన్ పాలన ఫలితాలను ఇస్తుంది’ అని కలెక్టర్ సురేంద్ర మోహన్ అధికారులకు సోమవారం కంప్యూటర్ పాఠాలు చెప్పారు. ‘సాక్షి’ సూర్యాపేట : భవిష్యత్‌లో ఆన్‌లైన్‌పాలన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతీ ఫైలును ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను స్కానింగ్ చేయడమే గాక కొత్తగా వచ్చే వాటిని ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. ఇక కార్యాలయాలకు వచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా జాగ్రత్తగా పొందు పర్చనున్నారు. అదేవిధంగా కిందిస్థాయి కార్యాలయాలు, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఫైళ్లను కూడా కంప్యూటర్స్‌లో ఫీడ్ చేయనున్నారు. దరఖాస్తుతో పాటు ఇచ్చిన సెల్‌నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు కాగానే సదరు దరఖాస్తు దారుడికి రెఫరెన్స్ నంబర్‌ను సెల్ మెస్సేజ్ ద్వారా పంపిస్తారు. దీంతో ప్రజలు తరచు కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ ఇంటి వద్ద కంప్యూటర్ లో జిల్లా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని తమ పని ఎంతవరకు అయింది.. ఏ అధికారివద్ద పెండింగ్‌లో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే తమ సిస్టంకు లాగిన్ అయిన దరఖాస్తులు సకాలంలో చూడకుండా జాప్యం చేసిన అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా స్పష్టం అయ్యే అవకాశం ఉందని, అధికారి ఇంటి వద్దనుంచేఫైల్స్ క్లియర్ చేయడం, ఆన్లైన్ ద్వారా సంతకాలు చేసేందుకు ప్రతీ అధికారికి డిజిటల్ కీ అందిస్తారు. దీంతో ఎంత రాత్రైనా ఇంటి వద్దనే ఉండి పని ముగించుకునే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండటంతోపాటు.. అధికారులకు విధుల పట్ల అంకిత భావంతో పనిచేసే అవకాశం ఉంది అంటారు జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్. జనవరి నుంచి.. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, ప్రజలసమస్యల పరిష్కారం ప్రక్రియను జిల్లాలో అమలు చేయడం కష్టమేమీ కాదని కలెక్టర్ జిల్లా అధికారులకు చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో హైదరాబాద్ ఐటీ నిపుణులతో ఆన్లైన్ పాలనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన కంప్యూటర్లు, స్కానర్ల కొనుగోలుకు త్వరలో నిధులు సేకరిస్తామని, ఆ వెంటనే వచ్చే జనవరి నాటినుంచి కొత్తసంవత్సరంలో కొత్తగా ఆన్లైన్ పాలన ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా జిల్లా కార్యాలయాల నుంచి ఈ విధానం అమలు చేస్తామని, సంవత్సరం కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు పనులు వేగవంతంచేస్తామని కలెక్టర్ వివరించారు. అయితే అధికారులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చేందుకు ముందుగా విడతల వారీగా జీహెచ్ఎంసీలో పనితీరును పరిశీలించేందుకు పంపిస్తామని, ఆ తర్వాత జిల్లాలో కంప్యూటర్ శిక్షణకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
పద్మ అవార్డుల్లో పక్షపాతం ఎక్కువే
వివిధ రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా పౌరులకు ఇచ్చే పద్మ అవార్డులను అందజేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందా? 1954లో ఏర్పాటుచేసిన భారతరత్న, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ఇప్పటివరకు అందుకున్న వారి వివరాలను విశ్లేషిస్తే అవుననే సమాధానం వస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4,329 అవార్డులను కేంద్రం అందజేయగా, 797 అవార్డులతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 756 అవార్డులతో మహారాష్ట్ర, 391 అవార్డులతో తమిళనాడు, 295 అవార్డులతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ సహా ఈ నాలుగు రాష్ట్రాలే మొత్తం అందజేసిన అవార్డుల్లో 50 శాతానికి పైగా అందుకున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు జనాభా ప్రాతిపదికన ఎక్కువ అవార్డులు వచ్చాయని సమర్థిస్తున్న వారు కూడా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పది లక్షల మందికి ఒక అవార్డు రావాలని చూసుకుంటే.. అవార్డులు అందుకున్న జాతీయ సగటు శాతం 3.58కాగా, 47.57 శాతంతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 6.73 శాతంతో రెండో స్థానంలో ఉండగా, తమిళనాడు 5.42 శాతంతో మూడోస్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్‌కు అతి తక్కువగా 1.48 శాతం అవార్డులే దక్కాయి. ఈ లెక్కల ప్రకారం చూసినా జనాభాకు, అవార్డులకు ఎలాంటి లింకు లేదని స్పష్టమవుతోంది. అసలు లింకంతా కేంద్ర ప్రభుత్వంలోనే ఉంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే పద్మ అవార్డులకు ఆనవాయితీగా పేర్లను సిఫార్సు చేస్తున్నా, కేంద్రానికి దగ్గరగా ఉన్నవారినే ఎక్కువగా ఎంపిక చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతుంది. ప్రధానమంత్రి నాయకత్వంలోని అవార్డుల కమిటీయే ప్రతి ఏటా అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తున్నా.. వారి ప్రాధాన్యతలు అవార్డుల ఎంపికపై ప్రభావం చూపిస్తుందన్న విషయంలో సందేహం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలతో సిఫార్సు చేయించుకునేందుకు ఎంతో మంది ప్రభుత్వ పెద్దలతో లాబీలు నడపడం కూడా మనకు తెల్సిందే. ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం నేరుగా ప్రజల నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు కోరింది. ఇప్పటికే 1700 దరఖాస్తులు సంబంధిత కేంద్ర విభాగానికి చేరాయని తెల్సింది. ఈసారయినా అవార్డు గ్రహీతల ఎంపికలో పారదర్శకత, ప్రమాణికత ఉంటుందో, లేదో చూడాలి. -
కొత్త జిల్లాలపై క్షేత్రస్థాయి సర్వే
-
కొత్త జిల్లాలపై క్షేత్రస్థాయి సర్వే
⇒ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ⇒ ప్రశ్నావళి సిద్ధం చేసిన సీఎం కార్యాలయం ⇒ ఆందోళనలు, అభ్యంతరాలపై లోతుగా ఆరా ⇒ నిఘాతోపాటు పలురకాలుగా సమాచార సేకరణ ⇒ నివేదికల ఆధారంగానే జిల్లాలపై తుది నిర్ణయం ⇒ అర లక్ష దాటిన ఆన్లైన్ అర్జీలు సాక్షి, హైదరాబాద్ కొత్త జిల్లాలపై జరుగుతున్న ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా సర్వే చేయించాలని అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సీఎం కార్యాలయం ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించింది. నిఘా విభాగంతో పాటు మరో ఏజెన్సీ ద్వారా సర్వేకు సన్నాహాలు చేసింది. పలువర్గాల నుంచి సమాచారం సేకరించి క్షేత్రస్థాయిలో నిజానిజాలు రాబట్టాలని నిర్దేశించింది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మీ స్పందనేమిటి? మీ మండలం, డివిజన్, జిల్లా మార్పుపై మీ అభిప్రాయమేమిటి? ఏ పట్టణాన్ని కొత్త జిల్లా కేంద్రం చేయాలని కోరుతున్నారు, ఎందుకు? ప్రతిపాదిత జిల్లాలతో పాలనాపరంగా ఇబ్బందులేమైనా ఉన్నాయా? ప్రయోజనాలేమున్నాయి?’ తదితర ప్రశ్నలను సర్వేలో పొందుపరిచింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాలతో ముసాయిదాను ప్రకటించడం తెలిసిందే. వీటిలో 17 కొత్త జిల్లాలపై అభ్యంతరాలు వ్యక్తమవడమే గాక తమ పట్టణాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని, డివిజన్లు చేయాలని ఆందోళనలు మొదలయ్యాయి. ప్రధానంగా వరంగల్‌లో హన్మకొండ జిల్లా ఏర్పాటుకు నిరసనగా ప్రజలు రోడ్డెక్కారు. అదే జిల్లాలో జనగామ, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షాల అధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కోరుట్లను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలని అక్కడి ప్రజలు పట్టుబడుతున్నారు. మహబూబ్‌నగర్‌లో వనపర్తి జిల్లాలో కలిపిన నాలుగు మండలాలపై ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఇవన్నీ ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఆందోళనలేనా, నాయకులు తెర వెనక ఉండి స్వప్రయోజనాల కోసం చేయిస్తున్నారా అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. సర్వే ద్వారా దీనిపైనా సమాచారం రాబట్టనుంది. అర్జీల్లో అసలువెన్ని, నకిలీలెన్ని... కొత్త జిల్లాలకు నిర్దేశించిన వెబ్సైట్లో అర లక్షకుపైగా అర్జీలు దాఖలయ్యాయి. దాదాపు అన్ని జిల్లాలు, డివిజన్లు, మండలాలపైనా ప్రజలు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు నమోదు చేశారు. అర్జీలు మంగళవారం నాటికి 53,665కు చేరాయి. వీటిని పరిశీలించిన సీఎం, నిజమైనవెన్ని.. ఉత్తుత్తివెన్నో తెలుసుకోవాలని అధికారులను పురమాయించారు. కొన్నింటిపై తప్పుడు పేర్లు, తప్పుడు చిరునామాలున్నట్లు గుర్తించారు. కొందరు అర్జీదారులకు ఫోన్ చేసి అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రధానంగా వనపర్తి, యాదాద్రి జిల్లాలపై ఎక్కువ ఫిర్యాదులు రావడంతో ఇవన్నీ అక్కడి రాజకీయ నేతలు ఉద్దేశపూర్వకంగా దాఖలు చేయించినవేనని ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే సర్వేలో భాగంగా క్షేత్రస్థాయికి వెళితే ఆన్లైన్ అర్జీల్లోని పస కూడా తేలిపోతుందని భావిస్తోంది. అభ్యంతరాలకు మరో 8 రోజులు... జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై ప్రజలు తమ అభ్యంతరాలు నమోదు చేసేందుకు మరో ఎనిమిది రోజుల గడువు మిగిలింది. ప్రభుత్వం ఆగస్టు 22న కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ప్రచురించినందున ఈ నెల 21 వరకు అర్జీలు దాఖలు చేసుకునే వెసులుబాటుంది. ఆ తర్వాత వాటిని పరిశీలించి, కొన్ని మార్పుచేర్పులతో ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. అక్టోబరు 11న దసరా నాటి నుంచి కొత్త జిల్లాలను మనుగడలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నందున విజ్ఞప్తులన్నిటినీ ఈ నెలాఖర్లోగా పరిష్కరించి తొలి వారంలోనే తుది నోటిఫికేషన్ సిద్ధం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయించిన ముహూర్తం మేరకు దసరా రోజున ఉదయమే తుది నోటిఫికేషన్‌ను జారీ చేసి, అదే ముహూర్తంలో కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. -
చదువుకు సాయం
శ్రీకాకుళం: నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోవడానికి ఓ సాయం అందుబాటులో ఉంది. బ్రాహ్మణ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (ఏబీసీ) లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘భారతీ విద్యా పథకం’ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు ఏటా ఈ పథకం లో నగదు ప్రోత్సాహకం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అర్హతలు... ⇒ విద్యార్థి తల్లిదండ్రులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నివాసితులై ఉండాలి. ⇒ 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అనాథ పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న వారు మాత్రమే అర్హులు. ⇒ దరఖాస్తుదారులు ప్రభుత్వ గుర్తింపు గల సంస్థల్లో చదువుతూ ఉండాలి. ⇒ తల్లితండ్రులు/సంరక్షకుని వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. ⇒ 2016-17 సంవత్సరంలో పాఠశాల/కళాశాల/ఇన్స్టిట్యూట్/ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండాలి. ⇒ ముందు సంవత్సరంలోని చదువు లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై ఉండాలి. ⇒ విద్యార్థి ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి లబ్ధి పొంది ఉండరాదు. అయితే అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు మాత్రం ఈ పథకానికి కూడా అర్హులే. దరఖాస్తు చేసుకోండిలా.. ⇒ దరఖాస్తులను ఆన్లైన్లో www.and-h-ra-bra-h-m-in.ap.go-v.in వెబ్సైట్లో సెప్టెంబర్ 30లోపు పొందుపర్చాలి. సమాచారం కోసం టోల్‌ఫ్రీ నం : 1800 102 3579లో సంప్రదించవచ్చు. ⇒ దరఖాస్తుతోపాటు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు ⇒ ఒక్కొక్కటీ 250 కేబీ లోపు పీడీఎఫ్ ఫార్మెట్లో ఉండాలి. ఏ కోర్సుకు దరఖాస్తుతోపాటు ఏయే ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలో ఏబీసీ వెబ్సైట్లో పొందుపరిచారు. ⇒ విద్యార్థి రాష్ట్రంలో చదివితే ఆంధ్రాబ్యాంకు ఖాతా, రాష్ట్రం వెలుపల చదివితే ఏ జాతీయ బ్యాంక్ ఖాతా అయినా తప్పనిసరిగా ఉండాలి. ⇒ ఎంపిక విధానంలో అనాథ, ఒంటరి తల్లి, శారీరక వైకల్యం, బాలిక, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత క్రమం పాటిస్తారు. నిర్ణీత మొత్తాన్ని ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థుల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. -
జన్మభూమి ఇంటి గుట్టు
► సొంత ఇళ్లు ఇప్పిస్తామంటూ వసూళ్లు ► జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో నిరుపేదలకు టోపీ ► దళారులుగా మారిన తెలుగు తమ్ముళ్లు పేదల సొంత ఇంటి కల తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తోంది. ‘పది వేల రూపాయలు ఇవ్వండి. మీకు సొంత ఇల్లు ఇప్పిస్తాం’ అంటూ తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము చెప్పిన వారికే అధికారులు ఇళ్లు మంజూరు చేస్తారనీ, తమ మాట వినకుంటే అనర్హుల జాబితాలో పెట్టిస్తామని భయపెడుతున్నారు. కొందరు అధికారులకు ఈ వ్యవహారం తెలిసినా అధికారం వాళ్లది తమకెందుకని మిన్నకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్: సావిత్రికి ఇద్దరు పిల్లలు కాగా, ఐదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అంత వరకు అద్దె ఇంటిలో ఉండటం, సంపాదన లేకపోవడం, అద్దె కట్టుకోలేక ప్రభుత్వం కల్పించే సొంత ఇంటి కోసం జన్మభూమి కమిటీ సభ్యుడిని వేడుకుంది.రూ.10వేలు ఇచ్చావంటే ఆన్లైన్లో నీ పేరు నమోదు చేయించి, ఇల్లు వచ్చేలా మంత్రితో మాట్లాడుతా ’’ అని ఆ కమిటీ సభ్యుడు హామీ ఇచ్చాడు.‘‘ఇళ్లలో పాచిపని చేసుకునే కుమారిది నిరుపేద కుటుంబం. ‘అందరికీ ఇల్లు’ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన చూసి జన్మభూమి కమిటీ సభ్యుడిని ఆశ్రయించింది. అందుకు ఆయన రూ.12వేలు ఇస్తే ఇల్లు ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.’’ ఇదీ తిరుపతిలో సొంత ఇల్లు ఇప్పిస్తామంటూ జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్న తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు వ్యాపారానికి నిదర్శనం. పట్టణాల్లో ఇల్లులేని ప్రతి కుటుంబానికి 2022 నాటికి శాశ్వత గృహాలు నిర్మించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. అర్హులైన పేదలు మీసేవ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే దీనిని తిరుపతిలోని తెలుగు తమ్ముళ్లు తమ అక్రమాలకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆదాయ మార్గంగా దరఖాస్తులు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 91,811 నివాస గృహాలు ఉండగా 3,74,260 లక్షల మంది జీవిస్తున్నారు. అయితే తిరుపతిలో 4.50 లక్షల మందికి పైగా జీవనం సాగిస్తున్నారని, అందులో సొంత ఇల్లులేని నిరుపేదలు దాదాపు 50 వేల మందికి పైగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అర్హులు ఈ పథకంలో దళారీలను నమ్మకుండా నేరుగా మీ సేవ కేంద్రంలో రూ.20 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరును జత చేసేలా మార్గదర్శకాలు జారీ చే సింది. రూ.10వేలు ఇస్తే ఇల్లు ఇప్పిస్తాం నగరంలో శాశ్వత ఇల్లు లేని నిరుపేదలు దాదాపు 40 వేల మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. అర్హులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ముప్పైరోజుల పాటు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని ప్రచారం కల్పించారు. అయితే ఇప్పటివరకు కేవలం 3వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు కార ణాలు విశ్లేషిస్తే ఆయా వార్డుల్లోని అర్హుల వివరాలు తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు తమకు తాముగా జన్మభూమి కమిటీ సభ్యులుగా ప్రకటించుకున్నారు. ఇల్లు కావాలంటే తాము రెఫర్ చేయాలని, లేకుంటే అధికారుల దృష్టికి వెళ్లదని చెబుతున్నారు. పైగా మీ దరఖాస్తు నంబరును మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సొంతిల్లు మంజూరు చేయిస్తామని, అందుకు రూ.10వేలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. డబ్బులు ఇచ్చిన వారికే ఇల్లు వస్తుందని దళారుల అవతారం ఎత్తిన నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియని నిరుపేదలు అమాయకంగా పచ్చ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒక్కో వార్డుకు సరాసరి 550 నుంచి 670 మంది చొప్పున నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి వ్యక్తుల స్థాయిని బట్టి రూ.10 నుంచి రూ.15వేల వరకు దాదాపు రూ.కోటి వరకు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమానికి స్థానికంగా ఉన్న స్వయం సహాయక సంఘాల నాయకులు సైతం సహకరించారని సమాచారం. దీనిపై ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే, వారిని అనర్హులుగా పక్కన పెడుతున్నట్టు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఆటోనగర్, జీవకోన, బొమ్మగుంట, ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరా నగర్, కొర్లగుంట, మారుతీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు ఇందులో బాధితులుగా ఉన్నట్లు సమాచారం. తమను అధికార పార్టీ నాయకుల నుంచి కాపాడాలని, కార్పొరేషన్ అధికారులను వేడుకుంటున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు కార్పొరేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. సార్ అధికారం వారిది.. అందులోకి మమ్మల్ని లాగకండి ప్లీజ్ అంటూ తప్పించుకోవడం గమనార్హం. -
28న ఐసెట్ నోటిఫికేషన్
♦ షెడ్యూల్ ఖరారు చేసిన ఉన్నత విద్యా మండలి ♦ మార్చి 1 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ♦ మే 19న ఐసెట్, అదే నెల 31న ఫలితాలు ♦ అభ్యర్థులకు ఓఎంఆర్ జవాబుపత్రం కాపీలు ♦ వచ్చే నెల 2న లాసెట్, 3న ఎడ్‌సెట్ షెడ్యూల్ ప్రకటన ♦ అన్ని పోటీ పరీక్షల ఫీజు పెంపు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్-2016 నోటిఫికేషన్ ఈనెల 28న జారీకానుంది. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ మేరకు ఐసెట్ షెడ్యూల్‌ను గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఖరారు చేసింది. ఐసెట్ పరీక్ష ఫీజు గతంలో అన్ని వర్గాలకు రూ. 250 ఉండగా... ఈసారి బీసీ, ఇతర విద్యార్థులకు రూ. 350కి పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం పాత ఫీజే వర్తిస్తుంది. ఇక ఈసారి ఐసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు తొలిసారిగా ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీలను అందజేయనున్నారు. బయోమెట్రిక్ విధానం అమలుపై త్వరలోనే తుది నిర్ణయం ప్రకటించనున్నారు. గత ఏడాది ఐసెట్ రాసేందుకు 70,449 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... 68 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా 70 వేల మంది పరీక్షకు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. సిలబస్, పేపరు విధానం పాతదే ఉండనుంది. వివిధ జిల్లాల్లో 15 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు ఉండగా... వాటితోపాటు ఈసారి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోనూ ప్రాంతీయ సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఐసెట్ కమిటీ భేటీలో ఐసెట్ చైర్మన్, కాకతీయ వర్సిటీ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు, మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటాచలం, ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వచ్చే నెల 2న లాసెట్, 3న ఎడ్‌సెట్ కమిటీలు సమావేశమై దరఖాస్తులు, పరీక్షలు, ఫలితాలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూళ్లను జారీ చేయనున్నాయి. అన్ని ‘సెట్’లకూ ఫీజు పెంపు! ఇప్పటికే ఎంసెట్, ఈసెట్ ఫీజులను పెంచిన నేపథ్యంలో... ఐసెట్ సహా మిగతా అన్ని సెట్ల దరఖాస్తు ఫీజులను పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఐసెట్ ఫీజును పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం గతంలో ఉన్న ఫీజులను కొనసాగించనున్నారు. దీంతో అభ్యర్థులకు ఫీజుల భారం తప్పదు. పరీక్షల్లో సంస్కరణల అమలు, పరీక్ష విధులకు హాజరయ్యే వారి రెమ్యూనరేషన్ పెంపు, నూతన విధానాల అమలు తదితర కారణాలతో ఫీజుల పెంపు తప్పడం లేదని అధికారులు వెల్లడించారు. -
మార్చి 3న ఈసెట్ నోటిఫికేషన్
9 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈసెట్-2016 నోటిఫికేషన్‌ను వచ్చే నెల 3న జారీ చేయనున్నారు. బుధవారం జరిగిన ఈసెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఈసెట్ నోటిఫికేషన్, మార్గదర్శకాలు, ఆన్లైన్ దరఖాస్తుల విధానానికి సంబంధించి పూర్తి వివరాలను వచ్చే నెల 4న వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300, ఇతరులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు హైదరాబాద్‌లో రెండు, వరంగల్, కరీంనగర్, నిజమాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండలో ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదీ ఈసెట్ షెడ్యూల్... 2016 మార్చి 9 నుంచి: ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం 2016 ఏప్రిల్ 12: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సబ్మిషన్కు చివరి గడువు 2016 ఏప్రిల్ 18: రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు సబ్మిషన్ 2016 ఏప్రిల్ 21 నుంచి 2016 ఏప్రిల్ 25 వరకు: సబ్మిట్ చేసిన దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం 2016 ఏప్రిల్ 25 వరకు: రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు సబ్మిషన్ 2016 ఏప్రిల్ 27: పరీక్ష కేంద్రాల నిర్ణయం 2016 ఏప్రిల్ 30 వరకు: రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు సబ్మిషన్ 2016 మే 5: హాల్ టికెట్ల జనరేషన్ 2016 మే 5 వరకు: రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్ 2016 మే 6 నుంచి 2016 మే 10 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ 2016 మే 12: ఈసెట్ పరీక్ష (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) 2016 మే 23: ఫలితాల వెల్లడి -
3 నుంచి ఏపీ ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులు
-
3 నుంచి ఏపీ ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులు
అపరాధ రుసుము లేకుండా తుది గడువు మార్చి 21 సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016, ఏపీ పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారయ్యాయి. ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానుంది. పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుంది. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 29న, పీజీ సెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4న విడుదల చేయనున్నారు. ఏపీ ఎంసెట్, పీజీ సెట్ కమిటీల సమావేశం బుధవారమిక్కడి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, ఎంసెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ఎస్కుమార్, కన్వీనర్ సీహెచ్ సాయిబాబు, పీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాదరాజు హాజరయ్యారు. పరీక్ష రుసుముల పెంపు ఎంసెట్, పీజీ సెట్ పరీక్ష రుసుములను పెంచారు. ఎంసెట్ ఫీజు గతంలో రూ.250 ఉండగా.. ఈసారి 350కి పెంచారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. పీజీ సెట్ ఫీజు గతంలో రూ.500 ఉండగా.. ఈసారి 600కు పెంచారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. కాగా, ఎంసెట్ దరఖాస్తులను ఆన్లైన్లోనే దాఖలు చేయాలని కన్వీనర్ సాయిబాబు చెప్పారు. దరఖాస్తు, ఇతర నియమ నిబంధనలను ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఈఏఎంసీఈటీ.ఓఆర్జీ’’ వెబ్సైట్లో పొందుపరుస్తున్నామని చెప్పారు. ఒక దరఖాస్తు ఒక్కసారే ఆన్లైన్లో ఆమోదం పొందుతుందని, ఈ విషయాన్ని గమనించి వివరాలను సరిచూసుకొని అప్లోడ్ చేయాలని సూచించారు. -
ఈ నెల 29న ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఎంసెట్’ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల సేకరణ ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 21 వరకు ఆఖరు తేదీని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 29వ తేదీన ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. -
నేటినుంచి ఆన్లైన్లో పీజీ మెడికల్ దరఖాస్తులు
విజయవాడ: 2015-16 విద్యాసంవత్సరానికి గాను పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా), పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలకు శనివారం నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ చెప్పారు. దరఖాస్తు చేసుకునే విధానం, ప్రవేశ పరీక్ష, ఫీజు వివరాలు http://www.drntruhs.org వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే ఇతర దేశాల్లో అండర్ గాడ్య్రుయెట్ డిగ్రీ చదివిన విద్యార్థులు ఎంసీఐ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రూ.7 వేలు, ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు రూ.3 వేలుగా ఫీజుగా నిర్ణయించారు. వివరాలు http://ntruhs.inc.in వెబ్సైట్లో పొందవచ్చు. -
ఇక ఆన్లైన్లో హజ్ దరఖాస్తులు
ఈ ఏడాది నుంచే అమలు సాక్షి, హైదరాబాద్: ఇకపై హజ్ యాత్రకు వెళ్లేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే యాత్రకు సంబంధించిన ఖర్చులూ చెల్లించవచ్చు. భారతీయ హజ్ కమిటీ ఈ ఏడాది నుంచి ఆన్లైన్ సేవలను ప్రారంభించనుంది. హజ్ యాత్ర-2015కు వెళ్లే యాత్రికులు ఠీఠీఠీ.జ్చ్జిఛిౌఝఝజ్ట్ట్ఛ్ఛీ.ఛిౌఝ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో హజ్ రుసుము చెల్లించవచ్చు. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఎ.షుకూర్ శనివారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తులపై ప్రజల్లో అవగాహన లేనందున ఆఫ్‌లైన్ (లిఖితపూర్వకంగా) దరఖాస్తులు సైతం స్వీకరిస్తామన్నారు. ఫారాల పంపిణీని ఈ నెల 19 నుంచి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 20 లోగా తమ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. మక్కాలో హజ్-2015 ప్రార్థనలు సెప్టెంబర్ 23న జరగవచ్చని, భారత్ నుంచి యాత్రికుల ప్రయాణాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కావచ్చని చెప్పారు. -
టెర్ట్ దరఖాస్తులు ఆన్లైన్లోనే..!
నేడు టీచర్ పోస్టుల భర్తీ మార్గదర్శకాలు విడుదల పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి వెల్లడి దరఖాస్తు నేరుగా డీఈవో కార్యాలయాల్లో ఇస్తే అనుమతించం ఆన్లైన్ దరఖాస్తు ప్రతిని ధ్రువపత్రాలతో డీఈవోకు అందచేయాలి రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ‘టెర్ట్’ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వి.ఉషారాణి సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నేతృత్వంలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహిస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఒకే పరీక్షగా ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్ష (టెర్ట్) పేరుతో నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. నేరుగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించే దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టంచేశారు. తొలుత తమ శాఖ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు ప్రొఫార్మాలో పూర్తి చేసి సమర్పించాలని చెప్పారు. అనంతరం అప్లికేషన్ కాపీపై సంతకం చేసి అర్హత, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాల నకళ్లతో కలిపి ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మంగళవారం సవివరంగా మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు. 'ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని 9,061 టీచర్ పోస్టులు భర్తీచేస్తాం. జిల్లాలవారీగా, కేటగిరీలు, సబ్జెక్టుల వారీగా, రోస్టర్ వారీగా వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం. 3వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవ చ్చు' అని వివరించారు. నూతన ఉపాధ్యాయులు వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికే పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని టీచర్ పోస్టుల భర్తీని ఈ డీఎస్సీలోనే చేపట్టనున్నారు. మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏజెన్సీ ఏరియాలోని పోస్టులకు ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేయాలి. 'టెర్ట్'నోటిఫికేషన్ వివరాలు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు: డిసెంబర్ 2 నుంచి జనవరి 16 (ఏపీ ఆన్లైన్, ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చు) దరఖాస్తుల దాఖలుకు గడువు: డిసెంబర్ 3 నుంచి జనవరి 17 హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ గడువు: 2015 ఏప్రిల్ 25 రాత పరీక్షల తేదీలు: మే 9, 10, 11 ఎస్జీటీ పోస్టులకు: మే 9 భాషా పండితులు, పీఈటీ లకు: మే 10 స్కూల్ అసిస్టెంట్లకు: మే 11 ప్రాధమిక కీ విడుదల తేదీ: మే 18 కీపై ఆన్లైన్లో అభ్యంతరాలకు గడువు: మే 19 నుంచి మే 25 వరకు తుది 'కీ'విడుదల: మే 27 ఫలితాల ప్రకటన: మే 28 పోస్టుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. -
మే 10న ‘ఈసెట్-2014’
నేడు నోటిఫికేషన్ విడుదల ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కాకినాడ, న్యూస్‌లైన్ : ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)ను వరుసగా మూడోసారి కూడా జేఎన్టీయూ కాకినాడ నిర్వహించనుంది. సోమవారం జరిగిన ఈసెట్ కమిటీ సమావేశం కాకినాడ జేఎన్టీయూలో జరిగింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.విజయ్ ప్రకాష్, కార్యదర్శి ప్రొఫెసర్ కె.సతీష్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఈసెట్ అడ్మిషన్ల చీఫ్ క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ కె.రఘునాథ్, కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు, కమిటీ సభ్యుడు అజయ్ జైన్, డీఈ డాక్టర్ వి.రవీంద్ర పాల్గొన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్, వర్సిటీ వీసీ డాక్టర్ తులసీరామ్‌దాస్ విలేకరులకు తెలిపారు. మే 10న అనంతపురం, గుంటూరు, హైదరాబాద్ 1, 2, కాకినాడ, నిజామాబాద్, కరీంనగర్, తిరుపతి, విశాఖ, విజయవాడ, వరంగల్, విజయనగరంలలో 78 కేంద్రాల్లో ఈసెట్ జరుగుతుంది. ఈనెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అనుమతించనున్నారు. పరీక్ష రుసుము రూ.300 కాగా అపరాధ రుసుము లేకుండా మార్చి 29 వరకు దరఖాస్తులను అనుమతిస్తారు. ఆపై రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 12 వరకు, రూ.1,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తులను అనుమతిస్తారు. మే 2 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
నిరుద్యోగులకు శుభవార్త
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 86 పంచాయతీ కార్యదర్శుల(గ్రేడ్-4) పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 86 పోస్టులు భర్తీ కానున్నాయి. గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 36 ఏళ్ల లోపు వారు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తులను జనవరి 4 నుంచి 22వ తేదీలోగా అన్లైన్లోనే చేయాలి. ఫీజు చెల్లింపునకు తుది గడువు జనవరి 20వ తేదీ. జనరల్ అభ్యర్థులకు రూ.100. మిగిలిన వారికి రూ.80 ఫీజుగా నిర్ణయించారు. -
ఒమెన్‌లో భారత స్కూళ్లకు ఆన్లైన్ దరఖాస్తులు
మస్కట్: వచ్చే 2014-2015 విద్యా సంవత్సరానికిగానూ మస్కట్‌లోని ఒమెన్‌లో భారత విద్యాలయాలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్టు అక్కడి మీడియా గురువారం వెల్లడించింది. ఈ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను డబ్య్లూడబ్య్లూడబ్య్లూ. ఇండియన్ స్కూల్స్ ఒమెన్. కామ్ ( www.indianschoolsoman.com) లో పొందవచ్చునని పేర్కొంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు వీలుగా సంబందిత దరఖాస్తు ఫారమ్‌లు జనవరి 1 నుంచి పొందవచ్చునని అక్కడి టైమ్స్ ఆఫ్ ఒమెన్ నివేదించింది. ఈ విద్యాసంవత్సరానికి ఒమెన్‌లో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ (బీఒడీ) భారతీయ విద్యాలయ శాఖ అధ్వర్యంలో 19 భారతీయ విద్యా సంస్థలు ఉండగా, అందులో చదువుకునే విద్యార్ధులు 37వేల మంది వరకు ఉన్నారు. రిపోర్ట్ ప్రకారం.. కేంద్రీకరించిన అడ్మిషన్ విభాగ వ్యవస్థ (సీఏయస్) ఆధ్వర్యంలో ఆరు రాజధాని ఏరియా విద్యాసంస్థలను సమర్ధవంతముగా నడుస్తున్నాయి. ఈ అడ్మిషన్ విభాగ వ్యవస్థను 2011లో స్థాపించారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం పోటీపడే విద్యార్ధుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి విద్యాసంస్థల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఆ దేశ పాఠశాలలో ప్రధానంగా భారతీయ సంస్కృతికి తగట్టుగా విద్యను అభ్యసించేలా స్థాపించారు. ఈ విద్యా సంస్థలను రాజకీయేతరంగా నడుపుతున్నారు.