సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్–2021కు దరఖాస్తుల స్వీకరణ శనివారం(నేటి) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఏపీసెట్’ను సందర్శించాలి.
కోర్సులు..
1.ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
2.బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్‌ఎస్సీ
3.బీఫార్మసీ, ఫార్మాడీ
దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ ఫీజు..
► ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500
► అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500
► రెండింటికీ కలిపి హాజరయ్యేవారికి.. ఓసీలకు రూ.1,200, బీసీలకు రూ.1,100, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు..
► ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు
► ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5 వరకు, రూ.1000తో ఆగస్టు 10 వరకు, రూ.5 వేలతో ఆగస్టు 16 వరకు, రూ.10 వేలతో ఆగస్టు 18 వరకు
► హాల్ టికెట్లను ఆగస్టు 12 నుంచి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆగస్టు 19 నుంచి పరీక్షలు
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.
► ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు
► మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 గంటల వరకు
Comments
Please login to add a commentAdd a comment