
సాక్షి, కాకినాడ : విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన గురువే లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కాకినాడ జేఎన్టీయూలో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన వైవా పరీక్షల్లో ప్రొఫెసర్ బాబులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సర విద్యార్థినులు వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుపై స్పందించిన యూనివర్శిటీ వైస్ చాన్సులర్ కుమార్...నిజ నిర్ధారణ కోసం హైపర్ కమిటీని నియమించారు. శనివారం సాయంత్రం విద్యార్థినులు.. హైపర్ కమిటీ ఎదుట హాజరయ్యారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ బాబులు క్యాంపస్‌లో ఐసీఎస్‌టీ (ICST) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment