Kakinada JNTU
-
రేపటి నుంచి ఏపీఈఏపీ సెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీఈఏపీసెట్)–2021 గురువారం (ఈనెల 19వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీటీ)లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి, సెట్ నిర్వహణ సంస్థ అయిన కాకినాడ జేఎన్టీయూ ఏర్పాట్లు పూర్తిచేశాయి. నీట్‌తో మెడికల్ సీట్లు వేరేగా భర్తీ అవుతుండడంతో.. గతంలో ఏపీఎంసెట్గా ఉన్న ఈ పరీక్ష పేరును ఏపీఈఏపీసెట్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు ఈనెల 19, 20, 23, 24, 25 తేదీల్లో మొత్తం 10 సెషన్లలోను, అగ్రి, ఫార్మసీ స్ట్రీమ్ విద్యార్థులకు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో మొత్తం 6 సెషన్లలోను పరీక్ష నిర్వహించనున్నారు. మన రాష్ట్రంలోను, తెలంగాణలోను మొత్తం 120 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 1.75 లక్షల మంది అభ్యర్థులు ఏపీఈఏపీ సెట్–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,26,156 మంది మహిళలు కాగా, 1,33,408 మంది పురుష అభ్యర్థులు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,75,796 మంది, అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు 83,051 మంది దరఖాస్తు చేశారు. 717 మంది రెండు స్ట్రీమ్‌లలో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన మహిళల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 70,072 మంది, అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌కు 55,686 మంది.. రెండు పరీక్షలు రాసేందుకు 398 మంది ఉన్నారు. పురుషుల్లో ఇంజనీరింగ్‌కు 1,05,724 మంది, అగ్రి, ఫార్మాకు 27,365 మంది, రెండు పరీక్షలకు 319 మంది దరఖాస్తు చేశారు. 70 మంది ఉర్దూ మాధ్యమాన్ని, మిగతావారు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను ఎంపిక చేసుకున్నారు. 23 మంది సహాయక లేఖరికోసం విన్నవించారు. పరీక్షలో 160 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ఉర్దూ మాధ్యమం వారికి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు ఇప్పటికే 1.72 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. ఏయూ పరిధినుంచి అత్యధిక దరఖాస్తులు ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధినుంచి ఎక్కువమంది ఉన్నారు. ఏయూ పరిధినుంచి 1,59,278 మంది, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధినుంచి 86,774 మంది, ఉస్మానియా వర్సిటీ ప్రాంతం నుంచి 10,669 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2,843 మంది నాన్‌లోకల్ అభ్యర్థులున్నారు. ఉస్మానియా వర్సిటీ తెలంగాణ పరిధిలో ఉన్నప్పటికీ గతంలో ఈ యూనివర్సిటీ పరిధిలో చదువుకున్న విద్యార్థులు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోకి మారి స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉంటే వారు ఏపీ స్థానికులుగానే పరిగణనలోకి వస్తారు. ఉస్మానియా పరిధిలో చదువుకుని ఏపీ స్థానికత లేనివారిని మాత్రం నాన్‌లోకల్‌గా పరిగణిస్తారు. ఈఏపీసెట్కే 100 శాతం వెయిటేజీ గతంలో ఏపీఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉంది. కోవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ప్రకటించడంతో ఈ ఏడాది ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని రద్దుచేసినట్లు ఉన్నత విద్యామండలి ఇంతకుముందే ప్రకటించింది. ఏపీఈఏపీసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులనే వందశాతం వెయిటేజీగా పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షకు ఆగస్టు 25న, అగ్రి, ఫార్మా స్ట్రీమ్ పరీక్షకు సెప్టెంబర్ 7న ప్రాథమిక కీలను విడుదల చేయనున్నారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్ కీని విడుదల చేస్తారు. కంప్యూటర్ ఆధారంగా బహుళ సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు సాధారణీకరణ ప్రక్రియననుసరించి ర్యాంకులు ప్రకటిస్తారు. కోవిడ్ బాధిత విద్యార్థులకు వేరుగా పరీక్ష: మంత్రి సురేష్ కోవిడ్ పాజిటివ్ లక్షణాలుండి బాధపడుతున్న విద్యార్థులను ఈ పరీక్షలకు అనుమతించడం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇతర విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పాజిటివ్ ఉన్న వారి హెల్త్ సర్టిఫికెట్లను పరిశీలించి ఈఏపీసెట్‌ను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, వెయ్యిమంది ఇన్విజిలేటర్లు, 200 మంది పరిశీలకులను నియమించామని చెప్పారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్–2021కు దరఖాస్తుల స్వీకరణ శనివారం(నేటి) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఏపీసెట్’ను సందర్శించాలి. కోర్సులు.. 1.ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2.బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ 3.బీఫార్మసీ, ఫార్మాడీ దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ ఫీజు.. ► ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500 ► అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500 ► రెండింటికీ కలిపి హాజరయ్యేవారికి.. ఓసీలకు రూ.1,200, బీసీలకు రూ.1,100, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000 ఆన్లైన్ దరఖాస్తు గడువు.. ► ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు ► ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5 వరకు, రూ.1000తో ఆగస్టు 10 వరకు, రూ.5 వేలతో ఆగస్టు 16 వరకు, రూ.10 వేలతో ఆగస్టు 18 వరకు ► హాల్ టికెట్లను ఆగస్టు 12 నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 19 నుంచి పరీక్షలు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ► ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు ► మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 గంటల వరకు -
వర్సిటీలు అక్రిడిటేషన్ పొందాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నుంచి రాష్ట్రంలో అన్ని వర్సిటీలు అక్రిడిటేషన్ పొందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. రూ.10 కోట్లతో చేపడుతోన్న పీజీ బాలుర హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. జేఎన్టీయూ– విజయనగరంతో పాటు ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని సీఎం వైఎస్ జగన్ ఆమోదించారని, ఇందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలను డాక్టర్ వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామని చెప్పారు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ వద్ద అమ్మాయిల ఆందోళన
సాక్షి, తూర్పుగోదావరి: అనారోగ్య పరిస్థితుల కారణంగా తరగతులకు హాజరుకాలేకపోయిన ఇద్దరు విద్యార్థినులను పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో తమ ఆవేదనను ‘సాక్షి’తో పంచుకున్నారు. హరిత, మోనా అనే స్టూడెంట్స్ కాకినాడ జేఎన్టీయూలో బీ ఫార్మసీ చివరి ఏడాది చదువుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన హరితకు పచ్చ కామెర్లు కావడం, గుంటూరుకు చెందిన మోనా వాళ్ల తల్లికి క్యాన్సర్ రావడంతో తరగతులకు హజరు కాలేకపోయారు. దీంతో హాజరు తగ్గిందని వీరిద్దరిని తరగతి అధ్యాపకులు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ వీసీ రామలింగరాజు కలిసినా పరీక్షలు రాసేందుకు అనుమతి లభించకపోవడంతో వీరిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. (విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్) -
'ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక్క తుపాకీ పేలలేదు'
సాక్షి, కాకినాడ : కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఆదివారం 'జన జాగారన్' పేరిట జాతీయ ఐక్యత ప్రచారం నిర్వహించారు. ఈ సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశారని పేర్కొన్నారు. గత డబ్బై ఏళ్లలో కశ్మీర్లో ఎటువంటి రిజర్వేషన్లు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అమలు కాలేదని తెలిపారు. ఆర్టికల్ 370 లాంటి చట్టాలు ఇటలీ, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నాయా ? మన దేశంలో మాత్రం ఆర్టికల్ 370 ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 65వేల టెర్రరిస్ట్ సంఘటనలు జరిగాయి, కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఒక్క తుపాకీ కూడా పేలలేదని పేర్కొన్నారు. కశ్మీర్ వ్యాలీలో వేలాది దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఐదేళ్లు జమ్మూ కశ్మీర్లో స్ట్రైక్ జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని రాహుల్‌గాంధీ గుర్తుంచుకోవాలని తెలిపారు. -
కాకినాడ జెఎన్టీయూలో ముదురుతున్న వివాదం
-
'స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది'
సాక్షి, కాకినాడ : కాకినాడ జేఎన్టీయులో ఏడవ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, యునివర్సిటీ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉంది. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో విద్యార్దులు భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్ బలమైన అణుశక్తిగా ఎదిగిందని, ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు. గాంధీ కలలుగన్న భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ బిహెచ్ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావుకు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 119 మంది విద్యార్థులు గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డి పట్టాలు అందుకున్నారు. -
కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ బాబులు అరెస్ట్
-
కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, కాకినాడ : ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్టీయూకే ఐఎస్టీ డైరెక్టర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులును సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. వైవా పరీక్షల సందర్భంగా ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సరం విద్యార్థినుల పట్ల బాబులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణాలు ఉన్నాయి. కాగా ఈ వ్యవహారంపై వర్శిటీ... ఇప్పటికే ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. ప్రొఫెసర్ బాబులుపై విద్యార్థులు ఇచ్చిన లేఖ ఆధారంగా రిజిస్ట్రార్ సుబ్బారావు కాకినాడ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దీనిపై 254, 254ఎ, 509 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు అయ్యాయి. ఇవాళ ప్రొఫెసర్ బాబులును అదుపులోకి తీసుకున్నారు. -
ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు
సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా జేఎన్టీయూ-కే ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జేఎన్టీయూ-కే వీసీ వీఎస్ఎస్.కుమార్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు రోజులుగా ఈ వ్యవహారంపై వివాదం చెలరేగి విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేయడం, మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడం, విచారణ కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రొఫెసర్ బాబులుపై విద్యార్థులు ఇచ్చిన లేఖ ఆధారంగా రిజిస్ట్రార్ సుబ్బారావు కాకినాడ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై 254, 254ఎ, 509 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ చైతన్య కృష్ణ చెప్పారు. త్వరలోనే ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. -
కాకినాడ జేఎన్టీయూలో కీచక ప్రొఫెసర్
సాక్షి, కాకినాడ : విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన గురువే లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కాకినాడ జేఎన్టీయూలో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన వైవా పరీక్షల్లో ప్రొఫెసర్ బాబులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సర విద్యార్థినులు వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుపై స్పందించిన యూనివర్శిటీ వైస్ చాన్సులర్ కుమార్...నిజ నిర్ధారణ కోసం హైపర్ కమిటీని నియమించారు. శనివారం సాయంత్రం విద్యార్థినులు.. హైపర్ కమిటీ ఎదుట హాజరయ్యారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ బాబులు క్యాంపస్‌లో ఐసీఎస్‌టీ (ICST) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాకినాడ జేన్టీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ
-
ప్రశ్నపత్రమా...టీడీపీ కరపత్రమా!
– వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు అనంతపురం ఎడ్యుకేషన్ : కాకినాడ జేఎన్టీయూ బీటెక్ సెమిస్టర్ ప్రశ్నపత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను పేర్కొని వారి వ్యాపారాలను పొందుపరచడం చూస్తుంటే అది ప్రశ్నపత్రమా లేక తెలుగుదేశం పార్టీ కరపత్రమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలాంబాబు అన్నారు. ప్రశ్నపత్రం తయారు చేసిన వీసీ, ప్రొఫెసర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి ప్రశ్నలు అడగడాన్ని ఆయన ఖండించారు. టీడీపీ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. జేఎన్టీయూ(కే) వీసీ ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు ఆయన కుటుంబ సభ్యులు, వారి వ్యాపారాల గురించి ప్రశ్నపత్రంలో రూపొందించారని ధ్వజమెత్తారు. ఇది విద్యార్థి లోకాన్ని అవమాన పరచడమేనన్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్‌కు విన్నవిస్తామన్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, కడప జిల్లా అధ్యక్షులు ఖాజా, యువజన విభాగం నగర అధ్యక్షులు మారుతీనాయుడు పాల్గొన్నారు. -
పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ రసాభాస
అంచనాకు మించి వచ్చిన అభ్యర్థులు సౌకర్యాలు కల్పించని జేఎన్టీయూకే అధికారులు ఆగ్రహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలతో దద్దరిల్లిన వర్సిటీ ప్రాంగణం అపస్మారక స్థితిలోకి విద్యార్థిని బాలాజీచెరువు (కాకినాడ) : జేఎన్టీయూకేలో శనివారం నిర్వహించిన పీజీ ఈసెట్ రెండో దశ కౌన్సెలింగ్ రసాభాసగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూ–కాకినాడ, అనంతపురంలలో మాత్రమే కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో, కాకినాడ కేంద్రానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు వచ్చారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. రెండో దశలో 200 మందికి మించి హాజరు కారనే ఉద్దేశంతో పెద్దగా ఏర్పాట్లు చేయలేదు. కానీ, ఊహించని రీతిలో 825 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఇందుకు తగినట్టుగా సిబ్బందిని నియమించకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలు దాటేసరికి కనీసం 300 మందికి కూడా వెరిఫికేషన్ చేయలేకపోయారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కపక్క ఎండ, మరోపక్క తాగడానికి మంచినీరు కూడా లేని దుస్థితిని ఎదుర్కొన్నారు. వర్సిటీ క్యాంటిన్లో భోజన సౌకర్యం కూడా లేకపోవడంతో ఆకలితో మాడిపోయారు. వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుందో తెలియకపోవడంతో ఒక్కసారిగా వారు ఆగ్రహానికి గురై వెరిఫికేషన్ సిబ్బందితో పాటు, సెక్యూరిటీ అధికారుల పైకి కూడా దూసుకువచ్చారు. దీంతో ఆ ప్రాంగణమంతా నినాదాలతో గందరగోళంగా మారింది. 30 మందికి కూడా మించి పట్టని చిన్న గదిలో వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడం.. దాదాపు వంద మందికి పైగా ఒకేసారి ఆ గదిలోకి గుంపుగా ప్రవేశించడంతో గాలి ఆడక గుంటూరు చెందిన విద్యార్థిని ప్రసన్న అపస్మాకర స్థితిలోకి వెళ్లింది. ఆమెను స్థానికుడైన ఈదల మూర్తి తన వాహనంలో ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అదుపు చేయడం ఒక దశలో కష్టతరమైంది. చివరకు సర్పవరం పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. నేటి సాయంత్రం వరకూ గడువు పెంచాం రెండో దశ పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌కు ఆదివారం సాయంత్రం వరకూ గడువు పెంచాం. అర్ధరాత్రయినా సరే నిరంతరాయంగా ప్రతి విద్యార్థి సర్టిఫికెట్లూ వెరిఫై చేస్తాం. వెరిఫికేషన్‌తోపాటు ఆప్షన్ల మార్పు గడువును సోమవారం సాయంత్రం వరకూ పెంచాం. – డాక్టర్ జీఈఆర్ ప్రసాదరాజు, పీజీ ఈసెట్ కన్వీనర్ మంచినీటి సౌకర్యం కూడా లేదు ఒకపక్క వేసవి తరహాలో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం కుర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో చెట్లకిందే ఉండాల్సి వచ్చింది. – మహేష్, కాకినాడ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు వర్సిటీ అ«ధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వెరిఫికేషన్ ప్రక్రియకు ఒక్క రోజు మాత్రమే సమయమివ్వడం, సాయంత్రం 5 గంటలు దాటినా కనీసం 200 కూడా పూర్తి కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మధ్యాహ్నం నుంచైనా కౌంటర్లు పెంచి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఉండాల్సింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడంవల్లే ఈ సమస్య ఏర్పడింది. – పూజిత, విజయవాడ కేంద్రాలు పెంచాలి కౌన్సెలింగ్‌కు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఏ సమయానికి పూర్తవుతుందో తెలీదు. కనీసం మంచినీటితోపాటు ఉండడానికి వసతి సౌకర్యం కల్పిం చినా సరిపోయేది. క్యాంపస్ క్యాంటిన్లో సరైన భోజన వసతి లేకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర విభజన తరువాత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జేఎన్టీయూకేలో కనీ సం 800 మంది విద్యార్థులు ధ్రువపత్రాలు పరిశీలన చేయలేని పరిస్థితి ఉందంటే ఇక్కడి అధికారులు ఏవిధంగా ఉన్నారో అర్థమవుతుంది. – యామిని, విజయవాడ -
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉదయ భాస్కర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్(ఏపీపీఎస్సీ) గా డాక్టర్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీపీఎస్సీ సిలబస్ మార్పుపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఏడాది పరీక్షల నిర్వహణ కోసం క్యాలెండర్ ను రూపొందిస్తామన్నారు. వసతులున్న భవనం దొరికితే ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఉదయభాస్కర్ చెప్పారు. కాగా గుంటూరు జిల్లా వెలంపాడుకు చెందిన ఉదయభాస్కర్ గతంలో జేఎన్టీయూకే ప్రొఫెసర్‌గా పని చేశారు. అదే విధంగా కాకినాడ, విజయనగరాల్లోని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్‌గా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, విదేశీ విశ్వవిద్యాలయ సంబంధాల డెరైక్టర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉదయభాస్కర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయ భాస్కర్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూలో ( డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్) ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విజ్ఞానాన్వేషణ నిరంతర ప్రక్రియ
♦ రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్‌రెడ్డి వెల్లడి ♦ కాకినాడ జేఎన్టీయూ నుంచి డాక్టరేట్ అందుకున్న శాస్త్రవేత్త సాక్షి ప్రతినిధి, కాకినాడ: యూనివర్సిటీల నుంచి పట్టాలు పుచ్చుకొని బయటకు వెళ్లినంత మాత్రాన విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, విజ్ఞానాన్వేషణ నిరంతరాయంగా కొనసాగాలని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త డాక్టర్ జి.సతీష్‌రెడ్డి సూచించారు. కాకినాడ జేఎన్టీయూలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎస్ఎస్ కుమార్ చేతులమీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్తు అంతా సాంకేతిక రంగానిదేనని, అందుకనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగాలని చెప్పారు. స్నాతకోత్సవంలో 72 మందికి పీహెచ్డీ పట్టాలను, 56 మందికి బంగారు పతకాలను వీసీ కుమార్, సతీష్‌రెడ్డి అందజేశారు. మాజీ వీసీ ప్రొఫెసర్ అల్లం అప్పారావు, రిజిస్ట్రార్ ప్రసాదరాజు, ఓఎస్డీ సీహెచ్ సాయిబాబు పాల్గొన్నారు. యువతకు అవకాశాలు ఆకాశమంత:‘‘ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, ఎంచుకున్న రంగమేదైనా నిరంతరం విజ్ఞానాన్వేషణ కొనసాగిస్తే ఏ విద్యార్థి అయినా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా నేనెంతో దగ్గర నుంచి చూసిన క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలామే అందుకు తార్కాణం. ఆయన కృషితో సాకారమైన డీఆర్డీఓలోని ప్రధాన ప్రయోగశాల రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ)కు డెరైక్టర్‌గా వ్యవహరించే అవకాశం రావడం చాలా గౌరవంగా భావిస్తా. ఒక్కో శతాబ్దంలో ఒక్కో దేశం పెద్దన్న పాత్ర పోషించింది. 21వ శతాబ్దం మాత్రం భారత్‌దేనని చెబుతారు’’ అని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ నుంచి శనివారం గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ప్రైవేట్’తో ఇబ్బందేమీ లేదు ప్రస్తుత పరిస్థితుల్లో మన రక్షణ వ్యవస్థను మరింత శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దుకోవడానికి ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని, అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాలి. ఇందుకోసం ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పొందడం ప్రమాదమేమీ కాదు. ఇప్పటికే రక్షణ వ్యవస్థకు కావాల్సిన పరికరాల్లో 80 శాతం వరకూ ప్రైవేట్ సంస్థల నుంచే వస్తున్నాయి. అయితే వ్యూహాత్మక, కీలక విభాగాల్లో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం లేకుండా ఆంక్షలు ఎలాగూ ఉన్నాయి. మన సత్తా చాటాం అంతరిక్ష ప్రయోగాల్లో టాప్-5 దేశాల్లో భారత్ ఒకటి. ఈ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి భిన్న వ్యూహాలతో అంతరిక్ష ప్రయోగాలను విస్తృతం చేసుకోవాలి. విదేశీ ఉపగ్రహాలను ఒకేసారి బహుళ సంఖ్యలో పంపడం ద్వారా మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. రాష్ట్రంలో రక్షణ పరిశ్రమలు రక్షణ రంగానికి సంబంధించి అనంతపురం జిల్లా లేపాక్షి వద్ద ‘భెల్’ ఒక యూనిట్‌ను ప్రారంభిం చింది. కర్నూలు జిల్లాలో మరొకటి ప్రారంభిం చాల్సి ఉంది. మూడో యూనిట్ కోసం విజయవాడ-మచిలీపట్నం మార్గంలో 50 ఎకరాలను పరిశీలించారు. అటవీ శాఖ అనుమతులు వస్తే నాగాయలంకలో కూడా యూనిట్ ప్రారంభమవుతుంది. -
12న ఆర్కిటెక్చర్ కోర్సులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఆర్కిటెక్చర్, ఫైనార్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 12వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ కోర్సులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కేవలం అయిదు కాలేజీలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కాలేజీలు కాకినాడ జేఎన్టీయూ అఫిలియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ (జేఎన్‌యూఏఎఫ్) పరిధిలో వీటికి అఫిలియేషన్ ఉండేది. రాష్ట్ర విభజనతో ఈ వర్సిటీ పదో షెడ్యూల్లో చే రడంతో తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకొంది. పదో షెడ్యూల్లోని సంస్థలు ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ఏపీలోని ఆర్కిటెక్చర్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జేఎన్‌యూఏఎఫ్ ఇటీవల ప్రవేశాల ప్రకటన విడుదల చేసినా అందులో ఏపీలోని కాలేజీలను చేర్చలేదు. కేవలం తెలంగాణలోని కాలేజీలకు మాత్రమే ప్రవేశాలుంటాయని స్పష్టంచేసింది. దీంతో ఏపీలోని కాలేజీలకు వేరుగా ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. ఈమేరకు సోమవారం మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని ఆర్కిటెక్చర్ కాలేజీలు కాకినాడ జేఎన్టీయూ అఫిలియేషన్‌ను తీసుకోవాలి. అప్పుడే ప్రవేశాలకు అనుమతి ఇవ్వనున్నారు. కొన్ని కాలేజీలు ఏయూ నుంచి అఫిలియేషన్‌ను తీసుకుంటామని పేర్కొనడంతో అందుకు మండలి అంగీకరించింది. ఈనెల 12న ఈ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నామని సెట్ల అడ్మిషన్ల ప్రత్యేకాధికారి రఘునాథ్ తెలిపారు. ఈ నెల 30వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. -
ఇంజినీరింగ్‌లో అనిరుధ్, మెడిసిన్‌లో మిథున్
-
ఇంజినీరింగ్‌లో అనిరుధ్, మెడిసిన్‌లో మిథున్
కాకినాడ : ఏపీ ఎంసెట్‌లో ఇంజినీరింగ్ విభాగంలో అనిరుధ్ రెడ్డి 156 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. డి.అచ్యుత్ రెడ్డి 156 మార్కులతో రెండో ర్యాంక్‌లో నిలవగా 156 మార్కులతో జ్యోతి తృతీయ స్థానంలో నిలిచింది. ఇంజినీరింగ్‌లో 157 మార్కులకే లెక్కింపు చేశారు. గణితంలో రెండు, రసాయన శాస్త్రంలో ఒక ప్రశ్న తొలగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం కాకినాడ జేఎన్టీయూలో ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో మొత్తం 77.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఎంసెట్ మెడికల్ ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. మెడిసిన్ విభాగంలో మిథున్ 151 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. 151 మార్కులతో భరద్వాజ్ రెండో ర్యాంక్, 150 మార్కులతో దామిని మూడో ర్యాంక్ సాధించింది. వచ్చే నెల 12 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందుని మంత్రులు గంటా, కామినేని తెలిపారు. ఈ నెల 24 నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి గంటా పేర్కొన్నారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో 1,62,807మంది, వైద్య విద్య, వ్యవసాయ విభాగంలో 81,027మంది హాజరయ్యారు. -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గురువారం ఉదయం 11.30 గంటలకు కాకినాడలోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ర్యాంకుల రూపంలో విడుదల చేశారు. మొత్తం 77.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే ముందంజలో నిలిచారు. బాలికలు 82.32 శాతం, బాలురు 74.44 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులకు ఇంటర్లో వచ్చిన మార్కుల్లో 25 శాతం వెయిటేజీ ఇస్తూ ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లక్కసాని వేణుగోపాలరెడ్డి, జెఎన్టియుకె విసి, ఎంసెట్-2015 చైర్మన్ ఆచార్య విఎస్ఎస్ కుమార్ పాల్గొన్నారు. కాగా జూన్ 1న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈనెల 8న ఏపి ఎంసెట్-2015ను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీని ఈనెల 10వ తేదీన జెఎన్టియుకె విడుదల చేసింది. ఎంసెట్ షెడ్యూల్ ప్రకారం ఫలితాలను ఈనెల 26న ప్రకటించాల్సి ఉంది. అయితే నిర్దేశించిన సమయం కంటే ఐదు రోజులు ముందుగా ఫలితాలను విడుదల చేస్తుండటం విశేషం. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. www.apeamcet.org ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
మే 10న ఏపీ ఎంసెట్: గంటా
-
మే 10న ఏపీ ఎంసెట్: గంటా
విశాఖ : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కారు మాదిరిగానే ఏపీ సర్కార్‌కు కూడా విడిగానే ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 10న ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సొంతగానే ఎంసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంసెట్ నిర్వహణను కాకినాడ జేఎన్టీయూకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా చర్చలు జరిపినా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఎంసెట్‌కు ఒప్పుకోలేదని గంటా అన్నారు. ఎంసెట్‌పై పలుసార్లు గవర్నర్‌తో పాటు తెలంగాణ విద్యాశాఖమంత్రిని కలిశామన్నారు. ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదన్నారు. అలాగే మిగతా ప్రవేశ పరీక్షల తేదీలను ఆయన ప్రకటించారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కూడా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉన్నా.. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుందని, విద్యార్థుల భవిష్యత్ ను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ భారతదేశంలో ఒక రాష్ట్రమని, వాటికన్ సిటీలా ప్రత్యేక పరిధిలు లేవని గంటా వ్యాఖ్యానించారు. -
ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి: భన్వర్‌లాల్
హైదరాబాద్: ఏయే కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలో సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఈ నెల 12 లేదా 13న రీపోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను భన్వర్‌లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికల రూపంలో తెప్పించుకున్నారు. కాకినాడ జేఎన్టీయూలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈవీఎంలోకి వర్షం నీరు చేరలేదని తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఈవీఎంలు మాత్రం వర్షపు నీటిలో తడవలేదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు.