కాకినాడ : ఏపీ ఎంసెట్లో ఇంజినీరింగ్ విభాగంలో అనిరుధ్ రెడ్డి 156 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. డి.అచ్యుత్ రెడ్డి 156 మార్కులతో రెండో ర్యాంక్లో నిలవగా 156 మార్కులతో జ్యోతి తృతీయ స్థానంలో నిలిచింది. ఇంజినీరింగ్లో 157 మార్కులకే లెక్కింపు చేశారు. గణితంలో రెండు, రసాయన శాస్త్రంలో ఒక ప్రశ్న తొలగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం కాకినాడ జేఎన్టీయూలో ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంసెట్ ఇంజినీరింగ్లో మొత్తం 77.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇక ఎంసెట్ మెడికల్ ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. మెడిసిన్ విభాగంలో మిథున్ 151 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. 151 మార్కులతో భరద్వాజ్ రెండో ర్యాంక్, 150 మార్కులతో దామిని మూడో ర్యాంక్ సాధించింది. వచ్చే నెల 12 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందుని మంత్రులు గంటా, కామినేని తెలిపారు. ఈ నెల 24 నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి గంటా పేర్కొన్నారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో 1,62,807మంది, వైద్య విద్య, వ్యవసాయ విభాగంలో 81,027మంది హాజరయ్యారు.
ఇంజినీరింగ్లో అనిరుధ్, మెడిసిన్లో మిథున్
Published Thu, May 21 2015 12:14 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM
Advertisement
Advertisement