Andhra pradesh Eamcet
-
ఏప్రిల్ 20 నుంచి ఏపీ ఎంసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏపీఎంసెట్ – 2020ను ఏప్రిల్ 20 నుంచి 24వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. అన్ని ప్రవేశపరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను కూడా ఆన్లైన్లోనే పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకు మీసేవ, ఏపీ ఆన్లైన్, ఎస్ఎస్సీ బోర్డ్, ఇంటర్మీడియెట్ బోర్డ్, తదితర సంస్థలతో అనుసంధానం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధ్రువపత్రాల పరిశీలనలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే అలాంటి వారి కోసం ప్రతి జిల్లాలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రవేశపరీక్షలు పూర్తయ్యాక అడ్మిషన్ల కన్వీనర్లతోపాటు అడ్మిషన్ల తేదీలను ప్రకటిస్తామని వివరించారు. తెలంగాణ ఎంసెట్ కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రవేశపరీక్షలను పూర్తి చేస్తామన్నారు. జేఈఈ, నీట్ ఇతర జాతీయ పరీక్షలకు హాజరయ్యేవారికి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. కళాశాలలకు ఫీజు బకాయిలన్నీ చెల్లిస్తాం వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో కోర్సుల ఫీజులపై జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కసరత్తు చేస్తోందని మంత్రి సురేశ్ చెప్పారు. ప్రవేశాల నాటికి ఆయా కాలేజీలకు ఫీజులు ఎంత ఉండాలో కమిషన్ ప్రకటిస్తుందన్నారు. ఏ కాలేజీకి ఎంత ఫీజును నిర్దేశించామో ఆన్లైన్లో అందరికీ తెలిసేలా పెడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమయ్యేలోగా కాలేజీలకు బకాయిల మొత్తాన్ని చెల్లిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యామండలిలో గతంలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించామని, ఈ కమిషన్ నివేదిక సమర్పణకు మరో నెల గడువు పెంచుతున్నామని చెప్పారు. నివేదిక అందాక నిధుల దుర్వినియోగానికి కారణమైన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. కాగా, మూడేళ్ల కాలానికి ఆయా కాలేజీలకు ఫీజులను తమ కమిషన్ నిర్ణయిస్తుందని, ఈ మూడేళ్లలో జరిగే సెట్లన్నిటికీ ఈ ఫీజులే వర్తిస్తాయని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యా శాఖ) సతీశ్ చంద్ర, సాంకేతిక విద్యా కమిషనర్ ఎం.ఎం.నాయక్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఎంసెట్–19 నోటిఫికేషన్ విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ)/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, యానిమల్ హజ్ బెండరీ, బీఎఫ్ఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మ–డీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్–2019 నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు సోమవారం తెలిపారు. ఈ పరీక్షను జేఎన్టీయూనే వరుసగా ఐదోసారి నిర్వహిస్తోందన్నారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో వరుసగా మూడోసారి ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుం లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 4 వరకూ, రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 9 వరకూ, రూ.5 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 14 వరకూ, రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 19 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. http://sche.ap.gov.in/eamcet వెబ్సైట్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులో విద్యార్థి మూడు కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, విద్యార్థి ప్రాధాన్యాన్నిబట్టి ఈ మూడింటిలో ఒకచోట మాత్రమే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారని తెలిపారు. హాల్‌టిక్కెట్లను ఏప్రిల్ 16 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్షను ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లోను, అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 23, 24 తేదీల్లోను నిర్వహిస్తామన్నారు. ఉర్దూ మాధ్యమం కావాలనుకునే వారికి కర్నూలులో మాత్రమే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీసీ విద్యార్థులకు గణితం 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు, బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బోటనీ 40, జువాలజీ 40 కలిపి మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. ర్యాంకును నిర్ధారించేందుకు ఎంసెట్ మార్కులను 75శాతం, 25శాతం ఇంటర్మీడియట్ మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హతా మార్కులు లేవు. ఇతర అభ్యర్థులకు 40 మార్కులను అర్హతా మార్కులుగా నిర్ణయించారు. ఆన్లైన్ పరీక్ష వల్ల పారదర్శకంగా, త్వరితగతిన ర్యాంకులు కేటాయించడానికి వీలవుతుందని, విద్యార్థి తమ జవాబులను ఎన్ని సార్లయినా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని సాయిబాబు తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు, ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. ఐదు రోజుల పాటు జరిగే ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రశ్నాపత్రాలు కష్టంగాను, సులభంగాను ఉన్నాయని ఒకరితోనొకరు పోల్చుకుని ఆందోళన చెందనవసరం లేదన్నారు. నిర్దేశించిన నిబంధనల ప్రకారం సాధారణీకరణ (నార్మలైజేషన్) పద్ధతిలో ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు విద్యార్థికి హాల్‌టికెట్‌లో కేటాయించిన రోజు అదే శ్లాట్‌లో పరీక్షకు హాజరు కావాలి. లేదంటే గైర్హాజరైనట్లుగా పరిగణిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థిని పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థికి రఫ్‌వర్కు చేసుకునే నిమిత్తం తెల్లకాగితాలను తామే అందిస్తామని తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఈ ప్రవేశ పరీక్ష శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం సిటీ, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసారావుపేట, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, గుత్తి, హిందూపూర్, కర్నూలు, నంద్యాలతో పాటు హైదరాబాద్‌లో ఎల్బీ నగర్, నాచారం, సికింద్రాబాద్‌లలో ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్ష జరుగుతుంది. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884 – 2340535, 0884 – 2356255 ఫోన్ నెంబర్ల ద్వారా, లేదా ఈమెయిల్ ఐడి 2019apeamcet@gmail.com ద్వారా సంప్రదించాలని కన్వీనర్ సాయిబాబు సూచించారు. -
భరత్..మళ్లీ మెరిశాడు..
వీరఘట్టం: డాకారపు భరత్.. ఈ పేరు జిల్లా వాసులకు గుర్తుండే ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులతో సత్తాచాటుతున్న ఈ సరస్వతీ పుత్రుడు మరోసారి మెరిశాడు. మొన్న జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియాస్థాయిలో 8వ ర్యాంకు సాధించిన భరత్..ఆంధ్రా ఎంసెట్‌లో 32వ ర్యాంకు సాధించాడు. తాజాగా శనివారం విడుదలైన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 6వ ర్యాంకుతో మరో సారి తనసత్తా చాటాడు. భరత్ తండ్రి రమేష్ కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా, తల్లి లిఖిత గృహిణి. చెల్లెలు ధరణి ఇంటర్ చదువుతోంది. భరత్ సాధిస్తున్న వరుస విజయాలతో వారింటిలో పండుగ వాతావరణం నెలకొంది. చదువులో చిచ్చర పిడుగు.. భరత్ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు వీరఘట్టం సెయింట్ జేవియర్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో చదివాడు. 2012లో గుంటూరు బాష్యం విద్యాసంస్థలు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరచి ఫ్రీ సీటు సాధించాడు. 6 నుంచి ఇంటర్ వరకు గుంటూరు భాష్యంలో చదివాడు. 2016 టెన్త్ ఫలితాల్లో 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించాడు. 2018 ఇంటర్మీడియెట్‌లో 987 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. ఏప్రిల్ 30న విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 345/360 మార్కులు సాధించి ఆలిండియాలో ఓపెన్ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించి జిల్లా ఖ్యాతిని చాటిచెప్పాడు. మే రెండో తేదీన విడుదలైన ఆంధ్రా ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 32వ ర్యాంకు సాధించాడు. తాజాగా శనివారం విడుదలైన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాల్లో 6వ ర్యాంకు సాధించి మరో సారి వార్తల్లో నిలిచాడు. కలెక్టర్ కావాలన్నదే కోరిక.. అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు వస్తున్నప్పటికీ తన లక్ష్యం మాత్రం కలెక్టర్ కావడమేనని భరత్ తన మ నోగతాన్ని వెల్లడించాడు. సివిల్స్ రాసి ఐ.ఏ.ఎస్ పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమని ‘సాక్షి’కి చెప్పాడు. -
ఇంజనీరింగ్.. బాలురు భళా!
26 నుంచి కౌన్సెలింగ్ జూన్ 11 నుంచి తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 26 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల రాష్ట్రానికి చెందిన దాదాపు 20 వేల నుంచి 30 వేల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుతారన్నారు. గతేడాది అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కలిపి 1,36,790 సీట్లు ఉండగా 84,498 భర్తీ అయ్యాయని, 52,312 సీట్లు మిగిలిపోయాయని వెల్లడించారు. నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. కంబైన్డ్ స్కోరుతో ర్యాంకుల్లో మార్పులు ర్యాంకుల నిర్ణయంలో ఎంసెట్‌లో (160 మార్కులు) సాధించిన మార్కులను, ఇంటర్మీడియెట్ మార్కులను నార్మలైజేషన్ చేసి 75 శాతం, 25 శాతంగా తీసుకొని కంబైన్డ్ స్కోర్‌ను నిర్ణయించారు. ఆ స్కోర్ ప్రకారం ర్యాంకులను ప్రకటించారు. దీనివల్ల ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించినా ఇంటర్మీడియెట్ మార్కులతో కలిపి కంబైన్డ్ స్కోర్‌ను తీసుకున్నప్పుడు కొందరు ర్యాంకుల్లో వెనుకంజలో నిలిచారు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో తొలి ర్యాంకర్ సూరజ్ కృష్ణకు ఎంసెట్ మార్కులు 150.1803 రాగా కంబైన్డ్ స్కోర్ 95.2720 వచ్చింది. రెండో ర్యాంకర్.. గట్టు మైత్రేయకు ఎంసెట్ మార్కులు 151.7622 రాగా కంబైన్డ్ స్కోర్ 94.9302. ఫలితంగా ఎంసెట్‌లో తక్కువ మార్కులు ఉన్నా కంబైన్డ్ స్కోర్‌లో ముందున్న సూరజ్‌కృష్ణను ఫస్టు ర్యాంకర్‌గా ప్రకటించారు. సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2018 ఫలితాల్లో బాలురు సత్తా చాటారు. టాప్ ర్యాంకుల్లోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ ముందంజలో నిలిచారు. టాప్ 10 ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌లో 9, అగ్రి, మెడికల్ విభాగంలో 7 ర్యాంకులు సాధించారు. బాలికలు టాప్ టెన్‌లో ఇంజనీరింగ్‌లో 1, అగ్రి, మెడికల్‌లో 3 ర్యాంకులు దక్కించుకున్నారు. ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన భోగి సూరజ్ కృష్ణ సాధించగా, తెలంగాణకు చెందిన గట్టు మైత్రేయ రెండో స్థానంలో నిలిచాడు. ఇక అగ్రి, మెడికల్‌లో విశాఖపట్నానికి చెందిన జంగాల సాయి సుప్రియ మొదటి ర్యాంకు, కర్నూలుకు చెందిన గంజికుంట శ్రీవాత్సవ్ రెండో ర్యాంకు దక్కించుకున్నారు. ఏపీ ఎంసెట్–2018 ఫలితాలను బుధవారం విజయవాడలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారావు, కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. 160 మార్కులకు నిర్వహించిన ఎంసెట్‌లో కనీస అర్హత మార్కులను 40గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు లేవు. ఇంజనీరింగ్ విభాగంలో 1,90,922 మంది పరీక్ష రాయగా 1,38,017 మంది (72.28 శాతం) అర్హత సాధించారు. 52,905 మంది అర్హత మార్కులు సాధించలేదు. అర్హత సాధించినవారిలో బాలురు 82,190 మంది, బాలికలు 55,827 మంది ఉన్నారు. అగ్రి, మెడికల్ విభాగంలో 73,373 మంది పరీక్ష రాయగా 63,883 మంది (87.06 శాతం) అర్హత సాధించారు. వీరిలో 21,852 మంది బాలురు, 42,031 మంది బాలికలు ఉన్నారు. 9,460 మందికి అర్హత మార్కులు కూడా రాలేదు. అర్హత సాధించినవారికి ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి కంబైన్డ్ స్కోర్ ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు. ఇంజనీరింగ్‌లో 1,26,197 మందికి, అగ్రి, మెడికల్ విభాగంలో 58,923 మందికి ర్యాంకులు ప్రకటించారు. ర్యాంకుల సమాచారాన్ని అభ్యర్థుల మొబైల్ నెంబర్లకు పంపించారు. అభ్యర్థుల ర్యాంకు కార్డులు ఈ నెల 7 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్ ఫలితాల్లో ర్యాంకులు సాధించినవారే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా టాప్ ర్యాంకులు సాధించారు. జేఈఈ మెయిన్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన భోగి సూరజ్‌కృష్ణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలోనూ మొదటి ర్యాంకు సాధించాడు. ఇక జేఈఈ రెండో ర్యాంకర్ అయిన హేమంత్‌కుమార్ 8వ ర్యాంక్ పొందాడు. ఐదో ర్యాంకు సాధించిన మైత్రేయ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. ఏటా ఎంసెట్ రాసేవారి సంఖ్య పెరుగుతున్నా ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. 2017లో 79.74 శాతం అర్హులు ఉండగా ఈసారి 72.28 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. 124 ప్రశ్నలపై 235 అభ్యంతరాలు ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ ప్రాథమిక ‘కీ’ల్లో 124 ప్రశ్నలకు సంబంధించి 235 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని నిపుణుల కమిటీ పరిశీలించి ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా నాలుగు ప్రశ్నలకు మల్టిపుల్ సమాధానాలను సరైనవిగా గుర్తించి మార్కులను కలిపారు. ఇంజనీరింగ్‌లో మొత్తం ఆరు సెషన్లలో 960 ప్రశ్నలు ఇవ్వగా నిపుణుల సలహా మేరకు ఒక ప్రశ్న ఆప్షన్‌ను మార్పు చేశారు. మూడు ప్రశ్నలకు మల్టిపుల్ ఆప్షన్లు ఇచ్చారు. అగ్రికల్చర్ విభాగంలో రెండు సెషన్లలో 320 ప్రశ్నల్లో పరీక్ష నిర్వహించగా నిపుణుల సలహాతో ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆప్షన్లను ఇచ్చారు. -
ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా
సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ ర్యాంకుల్లోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ ముందంజలో నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్–10లో ఆరుగురు రాష్ట్ర విద్యార్థులే ఉన్నారు. గట్టు మైత్రేయ ఇంజనీరింగ్‌లో రెండో ర్యాంకు సాధించాడు. అగ్రి, మెడికల్ విభాగంలోనూ టాప్–10లో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ఏపీ ఎంసెట్–2018 ఫలితాలను బుధవారం విజయవాడలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఇంజనీరింగ్‌లో 25,410 మంది పరీక్ష రాయగా 21,750 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రి మెడికల్ విభాగంలో 10,359 మంది పరీక్ష రాయగా 9,514 మంది ఉతీర్ణులయ్యారు. అభ్యర్థుల ర్యాంకు కార్డులు ఈ నెల 7 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో ర్యాంకులు సాధించినవారే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా టాప్ ర్యాంకులు సాధించడం విశేషం. జేఈఈ మెయిన్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన భోగి సూరజ్‌కృష్ణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. ఐదో ర్యాంకు సాధించిన మైత్రేయ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు. ఈ నెల 26 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంటా చెప్పారు. మైత్రేయకు ఫస్ట్ ర్యాంకు రావాల్సి ఉన్నా.. ర్యాంకుల నిర్ణయంలో ఎంసెట్‌లో (160 మార్కులు) సాధించిన మార్కులను, ఇంటర్లో మార్కులను నార్మలైజేషన్ చేసి 75 శాతం, 25 శాతంగా తీసుకొని కంబైన్డ్ స్కోర్‌ను నిర్ణయించారు. ఆ స్కోర్ ప్రకారం ర్యాంకులను ప్రకటించారు. దీంతో ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించినా ఇంటర్ మార్కులతో కలిపి కంబైన్డ్ స్కోర్‌ను తీసుకున్నప్పుడు కొందరు ర్యాంకుల్లో వెనుకంజలో నిలిచారు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో తొలి ర్యాంకర్ సూరజ్ కృష్ణకు ఎంసెట్ మార్కులు 150.1803 రాగా కంబైన్డ్ స్కోర్ 95.2720 వచ్చింది. రెండో ర్యాంకర్.. గట్టు మైత్రేయకు ఎంసెట్ మార్కులు 151.7622 రాగా కంబైన్డ్ స్కోర్ 94.9302. ఫలితంగా ఎంసెట్‌లో తక్కువ మార్కులు ఉన్నా కంబైన్డ్ స్కోర్‌లో ముందున్న సూరజ్‌కృష్ణను ఫస్టు ర్యాంకర్‌గా ప్రకటించారు. === పరిశ్రమను స్థాపించడమే లక్ష్యం: విష్ణు మనోజ్ఞ ర్యాంకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదవాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్‌లో మంచి కంపెనీ స్థాపించి, పది మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. === పరిశోధనలు చేయాలనేదే లక్ష్యం: గోసుల వినాయక శ్రీవర్థన్ మాది సంగారెడ్డి జిల్లా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాలని భావిస్తున్నా. భవిష్యత్తులో సైన్స్ రంగంలో పరిశోధనలు చేయాలనేదే లక్ష్యం. === సైంటిస్ట్‌ను కావడమే లక్ష్యం: బసవరాజు జిన్షు సైంటిస్ట్ కావాలన్నది నా లక్ష్యం. ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలంపియాడ్‌కు కూడా ఎంపికయ్యాను. ఇండియా నుంచి ఏటా 25 మంది ఎంపిక చేస్తుండగా, దీనిలో నేను ఒకటిని === సివిల్ సర్వీసే లక్ష్యం: అయ్యపు వెంకటపాణి వంశీనాథ్ ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరుతాను. భవిష్యత్తులో సివిల్స్ సర్వీస్‌లో చేరి సమాజానికి సేవ చేయాలన్నదే లక్ష్యం. === సర్జన్‌గా సేవలందిస్తా: జయసూర్య అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహమే నేను ఈ ర్యాంకు సాధించడానికి ప్రధాన కారణం. భవిష్యత్‌లో సర్జన్‌గా సేవలందిస్తా. === ముంబై ఐఐటీలో చదువుతా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ముంబై ఐఐటీలో చేరాలనుకుంటున్నా. కుటుంబసభ్యుల సహకారంతో ప్రణాళికబద్ధంగా చదవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. – గట్టు మైత్రేయ -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలయ్యాయి. ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్‌లో లక్షా 38వేల మంది ఉత్తీర్ణత సాధించారని, 72.28శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏపీ ఎంసెట్‌లో భాగంగా 1,90,924 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరవ్వగా.. 73,371మంది అగ్రి, మెడికల్ పరీక్షలకు హాజరయ్యారు. గతంలో విడుదల చేసిన ఎసెంట్ కీకి సంబంధించి.. 224 అభ్యంతరాలు వచ్చాయని, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి.. అభ్యంతరాలను నివృత్తి చేస్తుందని మంత్రి గంటా తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎంసెట్‌లో విద్యార్థుల అర్హత శాతం తగ్గిందని చెప్పారు. ఇంజినీరింగ్‌లో భోగి సూరజ్ కృష్ణ (95.27శాతం మార్కులు) ఫస్ట్ ర్యాంక్ సాధించగా, రెండో ర్యాంకును మైత్రేయ (94.93), మూడో ర్యాంక్‌ను లోకేశ్వర్‌రెడ్డి, నాలుగో ర్యాంక్‌ను వినాయక్ వర్ధన్ (94.20), ఐదో ర్యాంక్‌ను షేక్ వాజిద్ సొంతం చేసుకున్నారు. ఇక ఎంసెట్ ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అగ్రికల్చర్ విభాగంలో సాయిసుప్రియ (94.78శాతం మార్కులతో) మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. రెండో ర్యాంక్ వాత్సవ్ (93.26), మూడో ర్యాంక్ హర్ష (92.47) సాధించారు. ఏపీ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నేటి నుంచి ఏపీ ఎంసెట్ - 2018
-
ఎంసెట్ నేటి నుంచే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్–2018) నేటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో మొత్తం 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ ఇంజనీరింగ్, 25వ తేదీన అగ్రికల్చర్, డెంటల్ కోర్సుల ప్రవేశ పరీక్ష జరగనుంది. ఎంసెట్–2018కు మొత్తం 2,76,058 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 1,99,332 మంది ఇంజనీరింగ్, 76,726 మంది అగ్రికల్చర్, మెడికల్ విభాగాల విద్యార్థులు ఉన్నారు. ఎంసెట్ కోడ్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం 8 గంటలకు కాకినాడ జేఎన్టీయూలో విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు వీలుగా వారి హాల్టిక్కెట్ల వెనుక గూగుల్ మ్యాప్ సమాచారం పొందుపరిచామని తెలిపారు. పరీక్షా కేంద్రం, పరీక్ష తేదీ, సమయం తదితర వివరాలను హాల్‌టిక్కెట్లపై ముద్రించామని, ఏ రోజు ఏ స్లాట్ కేటాయించారో అదే సమయానికి విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఏమేం తీసుకెళ్లాలంటే... ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు తమతోపాటు హాల్‌టిక్కెట్, బాల్‌పాయింట్ పెన్, ఎంసెట్ దరఖాస్తు, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. శరీరంపై గోరింటాకు, టాటూలు వంటివి వేసుకోరాదు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించరు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ యంత్రాల్లో విద్యార్థుల వేలిముద్రలను నమోదు చేస్తారు. పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో జరుగుతుంది. విద్యార్థులు ఆయా ప్రశ్నలకు సరైన జవాబును టిక్ చేసి సేవ్ చేయాలి. టిక్ చేసిన జవాబుపై సందిగ్ధం ఉంటే మరోసారి సరైన జవాబును గుర్తించి సేవ్ చేసుకోవచ్చు. పరీక్ష ముగిసేదాకా ఎవరినీ బయటకు అనుమతించరు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉర్దూ మాధ్యమంలో ఎంసెట్ రాయనున్న 67 మందికి కర్నూలులో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందని చెప్పారు. ఇతర సమాచారం కోసం 0884–2340535, 0884–2356255 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. ఎంసెట్ ర్యాంకులను మే 5వ తేదీన ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఎంసెట్–2018 కేంద్రాలు ఇవే.. శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మైలవరం, కంచికచర్ల, మచిలీపట్నం, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, గుత్తి, హిందూపురం, పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 2018–19 విద్యా సంవత్సరపు ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఏపీ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు సోమవారం విడుదల చేశారు. బీటెక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరేపటి నుంచి ఏపీ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ బీఫార్మసీ, ఫార్మా డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించారు. ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్, క్రెడిట్, డెబిట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా రూ. 500(ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి) రుసుము చెల్లించి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ విధానంలో ఈ నెల 28 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండింటికీ హాజరుకాదల్చుకున్న వారు రూ. 1,000 చెల్లించాలి. అపరాధ రుసుము లేకుండా మార్చి 29వ తేదీతో గడువు ముగియనుంది. అపరాధ రుసుము రూ. 500తో ఏప్రిల్ 6 వరకు, రూ. 1,000తో ఏప్రిల్ 11 వరకు, రూ. 5 వేలతో ఏప్రిల్ 16 వరకు, రూ. 10వేలతో ఏప్రిల్ 21వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు పరీక్షలు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 22 నుంచి 25వ తేదీ వరకు జరుగుతుంది. అగ్రికల్చర్ విభాగం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరగనుంది. విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులో మూడు రీజనల్ సెంటర్లకు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్ ఇవ్వాలి. ఏప్రిల్ 18 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 22 నుంచి 26 వరకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఎంసెట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. ఎంసెట్‌తో సహా 8 సెట్ల షెడ్యూళ్లను తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. అన్ని సెట్లనూ ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు. ముందుగా ఎడ్‌సెట్, లాసెట్‌ను ఏప్రిల్ 19న నిర్వహిస్తామని, మే 4న జరిగే పీఈసెట్‌తో సెట్స్ ముగుస్తాయని తెలిపారు. ఎంసెట్ కోసం 115 నుంచి 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
5 నుంచి ఏపీ ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ప్రవేశానికి గాను ఏపీ ఎంసెట్–2017 తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 5 నుంచి నిర్వహించనున్నట్లు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ జీఎస్ పండాదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని, 8న సీట్లు కేటాస్తా మన్నారు. ఇదివరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేని వారు కూడా ఈ రెండురోజుల వెబ్‌కౌన్సెలింగ్‌కు వచ్చి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. వర్సిటీ కాలేజీల్లో 483, ప్రైవేటు కాలేజీల్లో 31,362 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వివరాలను ఎంసెట్ కౌన్సెలింగ్ వెబ్సైట్లో (హెచ్‌టీటీపీఎస్: //ఏపీ ఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్) ఉంచినట్లు తెలిపారు. -
మీ చదువులు మాకొద్దు!
రాష్ట్రంలో దయనీయంగా మారిన విద్యారంగం - ఎంసెట్–2017 కౌన్సెలింగ్‌పై విద్యార్థుల అనాసక్తి.. 100 లోపు ర్యాంకర్లలో హాజరైంది ఇద్దరే - 1,000 లోపు ర్యాంకర్లలో వచ్చింది 178 మందే.. ప్రమాణాల్లేని కళాశాలల్లో చేరడానికి విముఖత - ఏపీలో చదివితే ఉద్యోగాలొస్తా్తయన్న నమ్మకం లేక వెనుకంజ.. జాతీయస్థాయి విద్యాసంస్థలపై దృష్టి - హైదరాబాద్ పరిసరాల్లోని కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నాలు - ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు గొప్పలు ఇంజినీరింగ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు 1.50,000 అగ్రి కల్చర్, ఫార్మాలో అర్హత సాధించింది 70,000 ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చింది 22,734 సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్, ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తున్నాం. రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్నాం. దేశ విదేశాల నుంచి ఏపీకి వచ్చి ఉన్నత విద్యనభ్యసించేలా విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను ఏపీకి తీసుకొస్తున్నాం. చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నాం...’’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచుగా చెప్పుకునే గొప్పలవీ. అత్యుత్తమ విద్యాసంస్థల ఏర్పాటు ముసుగులో తనకు కావాల్సిన వారికి వందల ఎకరాల భూములను కారుచౌకగా కట్టబెడుతున్నారు. కానీ, రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్నత విద్య కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి విద్యార్థులు తరలి రావడం సంగతి పక్కనపెడితే ఏపీ విద్యార్థులు సైతం సొంత రాష్ట్రంలో చదవడానికి ఇష్టపడడం లేదు. ఏపీ ఎంసెట్–2017 కౌన్సెలింగే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎంసెట్‌లో టాప్ ర్యాంకర్లతోపాటు ఇతరులు మీ చదువులు మాకొద్దు బాబోయ్ అంటున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. 1,000 లోపు ర్యాంకర్లలో కేవలం 178 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారంటే ఏపీలో చదువుల దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిధులివ్వరు... ఖాళీలు భర్తీ చేయరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రమాణాలు పాతాళంలోకి దిగజారాయి. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో బోధన అత్యంత నాసిరకంగా మారిపోయింది. ఏపీలో ఈ కోర్సులు చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండడం లేదు. విద్యారంగం అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. బడ్జెట్లో అరకొరగా నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటోంది. వర్సిటీలు, కళాశాలల్లో సంవత్సరాల తరబడి వేలాది పోస్టులు ఖాళీగా ఉంటున్నా భర్తీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని విద్యాసంస్థల్లో చేరాలంటే విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. చాలామంది జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు పక్క రాష్ట్రం తెలంగాణలోని(ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల) కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఎంసెట్–2017లో టాప్ ర్యాంకులు సాధించినవారు కౌన్సెలింగ్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. ఎంసెట్‌లో 1వ ర్యాంకు నుంచి 100వ ర్యాంకు సాధించిన అభ్యర్థుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు కేవలం ఇద్దరే హాజరు కావడం గమనార్హం. 1,000 లోపు ర్యాంకర్లలోనూ ఇప్పటిదాకా కేవలం 178 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఏపీ ఎంసెట్–2017 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాప్ ర్యాంకర్లు ఈ కౌన్సెలింగ్ పట్ల విముఖత చూపుతున్నారు. ఈ ఏడాది మొత్తం ర్యాంకర్లలో సగం మంది కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఏపీ ఎంసెట్‌కు హాజరై కళాశాలల్లో చేరిన తర్వాత జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు వస్తే దీన్ని వదులుకొని వెళ్లిపోయేవారు. ఈసారి కనీసం ధ్రువపత్రాల పరిశీలనకు కూడా హాజరు కాకపోవడం విశేషం. గతంలో టాప్ ర్యాంకర్లు వదిలేయడంతో ఖాళీగా ఉన్న సీట్లను ప్రభుత్వ ఉత్తర్వులతో, ఉన్నత విద్యామండలి అనుమతితో ఇతరులకు కేటాయించేవారు. ప్రైవేట్ కాలేజీలు వాటిని లెఫ్ట్ ఓవర్ సీట్లుగా పరిగణించి భర్తీ చేసుకునేవి. ఈసారి టాప్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు దూరంగా ఉండడంతో.. మెరుగైన ర్యాంకు రాని వారికి కూడా మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సగమైనా భర్తీ అయ్యేనా? ఏపీ ఎంసెట్–2017లో ఇంజనీరింగ్‌లో 1.50 లక్షలకు మందికి పైగా అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా (బైపీసీ స్ట్రీమ్)లో 70,000 మంది అర్హత సాధించారు. వీరికి కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాల్లో ఇంజనీరింగ్ సీట్లు 1,38,751, అగ్రికల్చర్, ఫార్మా సీట్లు 10,233 అందుబాటులో ఉన్నాయి. టాప్ ర్యాంకర్లతోపాటు ఇతర ర్యాంకర్లు కూడా ఏపీలోని ప్రమాణాల్లేని విద్యాసంస్థల పట్ల నిరాసక్తంగా ఉండడంతో వీటిలో ఈసారి ఎన్ని భర్తీ అవుతాయో చూడాలి. 2015–16లో ఇంజనీరింగ్ విభాగంలో కన్వీనర్ కోటాలో 1,10,951 సీట్లు ఉండగా, 74,281 మాత్రమే భర్తీ అయ్యాయి. 2016–17లో 1,17,278 సీట్లు ఉండగా, 65,765 మాత్రమే భర్తీ అయ్యాయి. వెబ్ ఆప్షన్లు ఇచ్చింది 22,734 మందే ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం నాటికి ఆరో రోజుకు చేరింది. ఇప్పటిదాకా 78,000 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉండగా, 41,455 మంది వచ్చారు. వీరిలో 8,998 మంది మంగళవారం కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటివరకు 36,545 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు దూరంగా ఉన్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇప్పటివరకు 60,000 మంది వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా, 22,734 మంది మాత్రమే ఇచ్చారు. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ తరువాత ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. -
కౌన్సెలింగ్ 'లో' కాలేజీలు
► ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ప్రమాణాల్లేని కాలేజీలకు చోటు ► ఉన్నత విద్యామండలి నివేదిక బుట్టదాఖలు ► పొంతనలేని మంత్రి మాటలు, చేతలు ► పరిశీలన లేని కాలేజీల్లోనూ ఎన్నో లొసుగులు సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్-2017 కౌన్సెలింగ్‌లోకి ప్రమాణాలు పాటించని కాలేజీలను కూడా అనుమతించడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఒకపక్క రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిస్తూ మరోపక్క ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో వాటిని అనుమతిస్తుండడం విశేషం. అధ్యాపకులు, మౌలిక వసతుల కల్పన, పరిగణనలోకి తీసుకొని గుర్తింపు ఇస్తాయి. వివిధ విశ్వవిద్యాలయాల్లోని అధికారుల కమిటీలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలను తనఖీలు చేపట్టి వాటిలోని ప్రమాణాలపై నివేదికలు అందిస్తాయి. వాటి ఆధారంగా ఆయా కాలేజీలకు విశ్వవిద్యాలయాలు గుర్తింపునిస్తాయి. ఏటా గుర్తింపు పొందుతున్న ఆయా కాలేజీలు ఇపుడు డిమాండ్‌లేని బ్రాంచిలు విద్యార్ధులు చేరని వాటిని స్వచ్ఛందగా వదులుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. వాస్తవానికి మౌలిక సదుపాయాలు కల్పించని కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాంటి వాటికి గుర్తింపునివ్వకపోవడం, కౌన్సెలింగ్‌లో చేర్చకపోవడం వంటి చర్యలు చేపట్టాలి. కానీ అందుకుభిన్నంగా డిమాండ్‌లేని కోర్సులను వదులుకొంటే చాలని, అలాంటి వాటికి కౌన్సెలింగ్‌లోకి అనుమతిస్తామని చెబుతుండడం విశేషం. ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.నరసింహారావు ఆధ్వర్యంలోని కమిటీ 40 కాలేజీలను తనిఖీ చేసి ఆయా కాలేజీల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదని తేల్చింది. ఆ కమిటీ పరిశీలించిన కాలేజీల్లో 36 కళాశాలల్లో నిర్దేశిత ప్రమాణాలు లేవని గుర్తించింది. ఫీజులు, ప్రవేశాల కమిటీకి ఆయా కాలేజీలు అనేక సదుపాయాలున్నట్లు చూపించడమే కాకుండా భవిష్యత్తులో తాము ఎన్నో పప్రాజెక్టులు చేపట్టబోతున్నామంటూ తప్పుడు నివేదికలు ఇచ్చి ఫీజులను భారీగా పెంచేలా చేసుకున్నాయి. ఏఎఫ్ఆర్సీకి ఆయా కాలేజీలు అందించిన నివేదికల ప్రకారం నరసింహరావు కమిటీ పరిశీలన సాగించింది. అయితే ఆయా కాలేజీలు ఏఎఫ్ఆర్సీకి ఇచ్చిన నివేదికల్లోని పదిశాతం కూడా కాలేజీల్లో నెలకొల్పలేదని, ఏమీ లేకుండానే కాలేజీలు కొనసాగిస్తున్నాయని గమనించింది. ఆయా కాలేజీలకు ఉన్నత విద్యామండలి నోటీసులు కూడా జారీచేసింది. ఈ కాలేజీల్లో కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 24 కాలేజీలు, ఉన్నాయి. ఇందులో 1540 సీట్లను ఆయా కాలేజీల యాజమాన్యాలు వదులుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఈ వర్సిటీ పరిధిలోని 261 కాలేజీల్లో వివిధ బ్రాంచిలకు సంబందించి 17850 సీట్లు తమకు వద్దని ఆయా కాలేజీలు నివేదికలు ఇచ్చాయని అధికారవర్గాలు వివరించాయి. మిగతా 12 కాలేజీల్లో కూడా ప్రమాణాలు లేకుండా పోయాయి. ఇలా ఉండగా ప్రమాణాలు లేని కాలేజీల్లో తగిన చర్యలుచేప చేపట్టాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ వరదరాజన్ ఇటీవల అనంతపురం, కాకినాడ జేఎన్టీయూ కాలేజీలకు లేఖ రాశారు. ఆయా కాలేజీల్లో విద్యార్ధుల చేరికలు గత ఏడాదిలో చాలా తక్కువగా ఉన్నాయంటూ కోర్సుల వారీగా ఎనె్న కాలేజీల్లో చేరికలు తక్కువగా ఉన్నాయో అందులో వివరించారు. కోర్సుల వారీగా 40 శాతం కన్నా తక్కువ ఉన్న కాలేజీలు సివిల్‌లో 94, కంప్యూటర్ సైన్స్‌లో 59, ఈసీఈలో 89, ఐటీలో 6, మెకానికల్‌లో 97 ఉన్నాయని పేర్కొన్నారు. 40 నుంచి 60 శాతం, 60 నుంచి 80 శాతం, 80 శాతం పైగా ఆయా కోర్సుల్లో చేరికలు ఉన్న కాలేజీల సంఖ్యను కూడా ఆయా వర్సిటీలకు పంపించి వాటిలో ప్రమాణాలు మెరుగుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఆ కాలేజీలనీన యధాతథంగా కౌన్సెలింగ్‌లోకి అనుమతించడం విశేషం. ఒకపక్క ఉన్నత విద్యామండలి ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, ప్రమాణాలు మెరుగుపర్చాలని వర్సిటీలకు లేఖలు రాస్తుండగా మరోపక్క అవే కాలేజీలను కౌన్సెలింగ్లోనికి యధాతథంగా అనుమతించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి అమరావతి: ఏపీ ఎంసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ర్యాంకుల వారీగా చేపట్టనున్నారు. ఈ పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కేటగిరీల వారికి ధ్రువపత్రాల పరిశీలన 17వ తేదీ వరకు ఉంటుంది. అభ్యర్థులు ఏ కేంద్రానికైనా వెళ్లి ధ్రువప త్రాలను పరిశీలింపచేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్సు, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల అభ్యర్థులు విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ పరిశీలన కేంద్రం లో మాత్రమే పరిశీలనకు హాజరుకావాలి. వీరికి 8 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వీరు హాజరు కావాల్సిన తేదీలు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ. ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో ప్రత్యేకంగా పొందుపరిచారు. వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈ నెల 11నుంచి 20 వరకు చేసుకోవచ్చును. జూన్ 25వ తేదీన వెబ్ ఆధారిత సీట్ల కేటాయింపు జరుగుతుంది. -
ఏపీ ఎంసెట్ రెండో దశ ఫలితాలు విడుదల
కాకినాడ: ఏపీ ఎంసెట్–17 రెండో దశ ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేసినట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో రీ వాల్యుయేషన్‌లో మార్కులు పొందిన అభ్యర్థులు 1,627, సీబీఎస్ఈ 1,413, దూరవిద్యా కేంద్ర విద్యార్థులు 86, ఇతర బోర్డులు 456 మందితోపాటు అగ్రికల్చర్ విభాగంలో 1,021, ఇతరులుకు కలిపి మొత్తం మీద 4,861 అభ్యర్థులకు ర్యాంకులు విడుదల చేశామన్నారు. ఇంకా ర్యాంకులు ఎవరికైనా రాకపోయినా, ర్యాంకులపై సందేహాలున్నా 0884–2340535 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు. -
జూన్ 8 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
జూన్ 25న సీట్ల కేటాయింపు..29 నుంచి తరగతులు సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్–2017 కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం జరిగిన అడ్మిషన్ల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి ర్యాంకుల వారీగా తేదీలను జూన్ 1న ప్రకటిస్తామని కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు. హెచ్‌టీటీపీఎస్:// ఏపీఈఏఎమ్‌సీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్ వెబ్సైట్లో ఈ వివరాలను పొందుపరుస్తామని తెలి పారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే ముందే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ధ్రువపత్రాల ఒరిజినల్ కాపీలను పరిశీలన కేంద్రాల్లో చూపించి అనంతరం అక్కడి అధికారులకు వాటి జిరాక్సు కాపీలను మాత్రమే అందించాలన్నారు. అలాగే ప్రవేశం పొందిన తరువాత కాలేజీలకు కూడా ఒరిజినల్ ధ్రువపత్రాలను ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం జిరాక్సు కాపీలు మాత్రమే సమర్పించాలని స్పష్టంచేశారు. కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఒరిజినల్ ధ్రువపత్రాల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులను ఆన్లైన్లో చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేయనున్నామన్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు ఇవీ... ∙ ధ్రువపత్రాల పరిశీలన: జూన్ 8 నుంచి 17 వరకు ∙ వెబ్ ఆప్షన్ల నమోదు:జూన్ 11 నుంచి 20 వరకు ∙ ఆప్షన్లలో మార్పులు:జూన్ 21 నుంచి 22 వరకు ∙ సీట్ల అలాట్‌మెంటు: జూన్ 25 ∙ తరగతుల ప్రారంభం: జూన్ 29 -
ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా
-
ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ హవా
- ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాదీకి ఫస్ట్ ర్యాంకు - టాప్–10లో ఐదుగురు తెలంగాణవారే సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2017 ఫలితాల్లో తెలంగాణ విద్యా ర్థులు సత్తాచాటారు. ఇంజనీరింగ్ విభాగం లో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్–10లో ఐదు ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. ఇక అగ్రికల్చరల్ /ఫార్మా స్ట్రీమ్‌లోనూ టాప్–10లో ముగ్గురు రాష్ట్ర విద్యార్థులు నిలిచారు. మొత్తంగా ఏపీ ఎంసెట్‌లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్–10 ర్యాంకులతోపాటు అగ్రికల్చరల్/ఫార్మా విభాగంలో టాప్–10లో ఐదు ర్యాంకులను బాలురే కైవసం చేసుకున్నారు. ఏపీ ఎంసెట్ ఫలితాలను శుక్రవారం విజయవాడలో ఆ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, ఎంసెట్ చైర్మన్ కుమార్ తదితరులు విడుదల చేశారు. హైదరాబాదీల సత్తా.. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణ నుంచి 17,356 మంది పరీక్ష రాయగా.. 15,216 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రి కల్చరల్/ఫార్మాలో 9,814 మంది పరీక్ష రాయగా.. 9,419 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన విద్యార్థి వి.మోహన్ అభ్యాస్ 153.935 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. ఖమ్మం జిల్లా కొత్తగూ డేనికి చెందిన అవ్వారి సాయి ఎస్ఎస్వీ భరద్వాజ్, ఐదో ర్యాంకును హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన వి.వెంకట షణ్ముఖ సాయి, ఆరో ర్యాంకును హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన కోటగిరి వెంకట నిఖిల్, 9వ ర్యాంకును మాదాపూర్ కావూరిహిల్స్‌కు చెందిన డి.వరుణ్‌తేజ దక్కించుకున్నారు. ఇక అగ్రికల్చరల్/ఫార్మా విభాగంలో కూకట్‌పల్లికి చెందిన సాదినేని నిఖిల్‌చౌదరి 4వ ర్యాంకు, కరీంనగర్‌కు చెందిన కల్యాణ్ 8వ ర్యాంకు, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు చెందిన పట్లోళ్ల అఖిల 10వ ర్యాంకు దక్కించుకున్నారు. ఆన్లైన్లో పరీక్ష..: ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో ఇంజనీరింగ్, 28న అగ్రికల్చర్/ఫార్మా విభాగం ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇంజనీరింగ్ విభాగంలో 1,49,505 (79.74 శాతం) మంది, అగ్రికల్చర్/ఫార్మా విభాగంలో 68,882 (91.24 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. పలువురు అభ్యర్థులు చేసిన పొరపాట్లు, ఇంటర్ మార్కుల వివరాలు అందని కారణంగా ఇంజనీరింగ్‌లో 1,39,190 మందికి, అగ్రికల్చర్/ఫార్మాలో 64,379 మందికి మాత్రమే ర్యాంకులు ప్రకటించారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో 1,87,484 మంది పరీక్ష రాయగా.. 1,49,505 మంది అర్హత సాధించారు. వారిలో బాలురు 81,734 మంది, బాలికలు 57,451 మంది ఉన్నారు. ఇక అగ్రికల్చర్/ఫార్మా స్ట్రీమ్‌లో 75,489 మంది పరీక్ష రాయగా.. 68,882 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 21,885 మంది బాలురు, 42,489 మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్/ఫార్మా విభాగంలో గుంటూరులోని కొత్తపేటకు చెందిన వూటుకూరి వెంకట అనిరుధ్ 150.567 మార్కులతో తొలి ర్యాంకు సాధించాడు. మే 12 నుంచి ర్యాంకు కార్డులు అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను మే 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఠీఠీఠీ. టఛిజ్ఛి. www. sche. ap. gov. in/ eamcet వెబ్సైట్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కౌన్సెలింగ్ ప్రారంభించి జూన్ 19 నుంచి తరగతులు నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,924 సీట్లు, 305 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,53,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఏపీ ఎంసెట్–2017 ఫలితాలను మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ప్రవేశపరీక్షలో లక్షా 23వేల 974మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... తొలిసారిగా ఎంసెట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించామని, దీని వల్ల పారదర్శకత ఉంటుందన్నారు. ఎక్కడా కూడా లీకేజీకి ఆస్కారం లేకుండా పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. ఏపీలో 124 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహించినట్లు మంత్రి గంటా తెలిపారు. వచ్చే ఏడాది కూడా ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఎంసెట్ నిర్వహణ కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏపీ ఎంసెట్ ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంజినీరింగ్‌లో టాప్ టెన్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు మొదటి ర్యాంక్: వబిలివెట్టి మోహన్ అభ్యాస్(153.95 మార్కులు) రెండో ర్యాంక్ : సాయి భరద్వాజ్ మూడో ర్యాంక్: ఆర్.సత్యం నాలుగో ర్యాంక్ : జయంత్ హర్ష అయిదో ర్యాంక్ : వెంకట షణ్ముఖ్ సాయి మౌనిక్ ఆరో ర్యాంక్ : వెంకట నిఖిల్ ఏడో ర్యాంక్ :శశినాథన్ ఎనిమిదో ర్యాంక్ :వెంకట సాయి తొమ్మిదో ర్యాంక్ : డి.వరుణ్ తేజ్ పదో ర్యాంక్ : కె.చిన్మయి సాయినాగేంద్ర ఇక అగ్రికల్చరల్, మెడికల్ విభాగానికి సంబంధించి మొత్తం 55,288 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మెడికల్, అగ్రికల్చరల్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకర్స్ వివరాలు మొదటి ర్యాంక్ : ఊటుకూరి వెంకట అనిరుధ్ రెండో ర్యాంక్ : దుర్గా సందీప్ మూడో ర్యాంక్ : నున్న హిమజ నాలుగో ర్యాంక్ : సాదినేని నిఖిల్ చౌదరి అయిదో ర్యాంక్ : ఫణి శ్రీలాస్య ఆరో ర్యాంక్ : మనోజ్ పవన్ ఏడో ర్యాంక్ : స్వాతికారెడ్డి ఎనిమిదో ర్యాంక్ : కల్యాణ్ తొమ్మిదో ర్యాంక్ : సాయి శ్వేత పదో ర్యాంక్ : అఖిల ర్యాంకుల సమాచారాన్ని ఆయా అభ్యర్థుల ఫోన్ నంబర్లకు పంపించనున్నారు. కాగా ప్రశ్నపత్రాల్లో వచ్చాన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ వేసిన సంగతి విదితమే. దీనిపై ఆ కమిటీ అభిప్రాయం వ్యక్తపరుస్తూ పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఒక మార్కు కలిపే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఇతర ప్రశ్నలకు గాను థర్డ్ పార్టీ పరిశీలన అనంతరం తుది నిర్ణయం ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. ఫలితాలను www.sakshi.comలో చూడవచ్చు. -
నేడు ఏపీఎంసెట్ ఫలితాలు
అభ్యర్థుల ఫోన్ నంబర్లకు ర్యాంకుల సమాచారం సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఏపీ ఎంసెట్–2017 ఫలితాలు శుక్రవారం విడుదల కాను న్నాయి. మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు గురువారం మీడియాకు వెల్లడించారు. ర్యాంకుల సమాచారాన్ని ఆయా అభ్యర్థుల ఫోన్ నంబర్లకు పంపిస్తామని తెలిపారు. కాగా ప్రశ్నపత్రాల్లో వచ్చాన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ వేసిన సంగతి విదితమే. దీనిపై ఆ కమిటీ అభిప్రాయం వ్యక్తపరుస్తూ పలు సూచనలుచేశారు. ఈ మేరకు ఒక మార్కు కలిపే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఇతర ప్రశ్నలకు గాను థర్డ్ పార్టీ పరిశీలన అనంతరం తుది నిర్ణయం ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. -
5న ఏపీ ఎంసెట్–17 ఫలితాలు
కాకినాడ: ఏపీ ఎంసెట్–17 ఫలితాలు మే 5న విడుదల కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్ విజయరాజు హాజరై విడుదల చేస్తారని, అనంతరం అర గంటలోగా విద్యార్థుల మొబైల్‌కు మార్కులు, ర్యాంకుల సమాచారం వస్తుందన్నారు. -
ముగిసిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష
3 రోజుల్లో 94.61 శాతం హాజరు సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్‌లో భాగంగా ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 128 కేంద్రాల్లో మూడురోజుల పాటు ఆన్లైన్లో ఈ ప్రవేశపరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,98,158 మంది విద్యార్థులకు గాను 1,87,484 మంది విద్యార్థులు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు, ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. శుక్రవారం అగ్రి, ఫార్మా తదితర కోర్సులకు సంబంధించి (బైపీసీ స్ట్రీమ్) ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు 80,735 మంది దరఖాస్తు చేసుకోగా ఏపీ తెలంగాణల్లో కలిపి 139 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రిలిమనరీ కీ 28వ తేదీన ఎపీ ఎంసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు.కీపై అభ్యంతరాలను మే 1వ తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తామని చెప్పారు. -
తప్పుల సవరణకు 17 వరకు గడువు
ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా వెల్లడి సాక్షి, అమరావతి/బాలాజీచెరువు(కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్–2017కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఈనెల 17 వరకు గడువుందని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబా తెలిపారు. సంబంధిత ధ్రువపత్రాలను జతపరుస్తూ onlineapeamcet2017@gmail. comకు మెయిల్ పంపించాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఎంసెట్‌కు రూ. 5 వేల అపరాధ రుసుముతో ఈనెల 17 వరకు, రూ. 10 వేల రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. స్క్రయిబ్ కావాలనుకొనే అభ్యర్థులు ఎవరి సహాయంతో పరీక్షకు హాజరవుతారో ఆ అభ్యర్థిని ఎంసెట్ కార్యాలయానికి తీసుకువచ్చి అనుమతి పొందాలని చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్షను ఈనెల 24, 25, 26 తేదీల్లో, అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 28న నిర్వహిస్తామన్నారు. సందేహాల నివృత్తికి 0884–2340535, 0884–2356255 నంబర్లలో లేదా ‘ఆన్లైన్ఏపీఎంసెట్ 2017ఎట్జీమెయిల్.కామ్’ ద్వారా సంప్రదిం చవచ్చని చెప్పారు. -
19 నుంచి ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్ల జారీ
కన్వీనర్ సీహెచ్ సాయిబాబు వెల్లడి సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్–2017 హాల్‌టికెట్ల జారీ ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుందని సెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎంసెట్ ఈసారి పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తు న్నామని, ఇంజనీరింగ్ పరీక్షను ఏప్రిల్ 24, 25, 26వ తేదీల్లో, అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 28న ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఉర్దూ మాధ్యమం పరీక్ష రాయాలనుకొనేవారు కర్నూలులో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఏపీ ఎంసెట్‌కు రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఈ నెల 10, రూ.5 వేల అపరాధ రుసుముతో ఈ నెల 17, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోవచ్చునని చెప్పారు. ఏపీలో పలు నగరాలతో పాటు హైదరాబాద్‌లోని నాచారం, మౌలాలి, హయత్‌నగర్‌లలో 140 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వివరాలకు 0884–2340535, 0884–2356255 నంబర్లలో onlineapeamcet2017@ gmail. com ద్వారా సంప్రదించవచ్చు. -
ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు
బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్–17 పరీక్షకు అన్లైన్ దరఖాస్తు గడువు ఈ నెల 21వ తేదీ వరకూ పొడిగించినట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారంతో గడువు ముగిసిందని, విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువు పెంచామన్నారు, ఇప్పటి వరకూ అన్లైన్లో 2.54 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఉర్ధూ అనువాదం కావాలనుకునే అభ్యర్థులకు కర్నూలులో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. అన్లైన్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థికి హాల్‌టిక్కెట్‌లో కేటాయించిన సమయానికి పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించేందుకు మాక్‌టెస్టులు నిర్వహిస్తామని, గతంలో ఓఎంఆర్ షీటుపై జవాబులు దిద్దడానికి అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చునని కన్వీనర్ సాయిబాబు వివరించారు. -
18 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: లాసెట్–2017 పరీక్షలకు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంగళవారం లాసెట్ కన్వీనర్ ప్రొ.ఎంవీ రంగారావు తెలిపారు. అభ్యర్థులు ఎల్ఎల్బీ కోర్సు రిజిస్ట్రేషన్‌కు ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.350 ఫీజు చెల్లించా లన్నారు. ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశపరీక్షకు హాజరుకావాలనుకునే ఎస్సీ, ఎస్టీలు రూ.500, ఇతరులు రూ.600 చెల్లించాలని తెలిపారు. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 నుంచి 28 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 29 నుంచి మే 6 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 7 నుంచి 12 వరకు, రూ.1500 ఆలస్య రుసుముతో మే 13 నుంచి 15 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలను l్చఠీఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీnలో పొందొచ్చన్నారు. న్యాయ కోర్సు ప్రవేశాలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధించిన గరిష్ట వయసు నిబంధనపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఈసారి గరిష్ట వయసు నిబంధన లేదన్నారు. 17 వరకు ఏపీ ఎంసెట్ దరఖాస్తు గడువు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్‌కు ఈ నెల 17లోగా అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. కాకినాడలోని జేఎన్టీయూలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. మార్చి 26 వరకూ రూ.500, ఏప్రిల్ 10 వరకు రూ.1000, ఏప్రిల్ 17 వరకు రూ.5 వేలు, ఏప్రిల్ 22 వరకు రూ.10 వేల అపరాధ రుసుముతో దరఖాçస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 19 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఇంజనీరింగ్ పరీక్ష ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుందన్నారు. అగ్రికల్చర్, బీఫార్మసీ, డీఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ వంటి కోర్సులకు 28న, రెండు విభాగాలకూ హాజరయ్యే అభ్యర్థులకు ఆయా తేదీల ప్రకారం పరీక్ష నిర్వహిస్తామన్నారు. జిల్లాకు 3 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో మౌలాలీ, నాచారం, హయత్‌నగర్‌ల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంసెట్ సందేహాల నివృత్తికి 0884–2340535లో సంప్రదించాలని కోరారు. -
నార్మలైజేషన్లో ఏపీ ఎంసెట్ ర్యాంకులు!
సాక్షి, అమరావతి: ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ తదితర ఉన్నత వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్‌లో నార్మలైజేషన్(సాధారణీకరణ) ప్రక్రియలో ర్యాంకులను ప్రకటించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వివిధ ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ప్రవేశ పరీక్షలను కంప్యూటరాధారితంగా నిర్వహించనుండడంతో ఈ నార్మలైజేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. ఈ నార్మలైజేషన్ ప్రక్రియను ఎలా చేపట్టాలి అనే దానిపై ఉన్నత విద్యామండలి పలువురు ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో నార్మలైజేషన్ కమిటీని ఇంతకు ముందు నియమించింది. గురువారం ఈ కమిటీ సమావేశమై ప్రాథమిక చర్చలు జరిపింది. ఈ సారి కంప్యూటరాధారిత పరీక్షను వివిధ సెషన్ల కింద పెడుతున్నందున అభ్యర్థులకు వేర్వేరు ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. అయితే ఒక సెషన్లో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గరిష్ట మార్కులు 80 వస్తే మరో సెషన్లో పరీక్ష రాసిన వారికి గరిష్ట మార్కులు 100 వరకు ఉండవచ్చు. ఇలా అన్ని సెషన్లలోనూ గరిష్ట మార్కులు వేర్వేరుగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ న్యాయం జరిగేలా.. ఎంసెట్ మార్కులకు ఇంటర్మీడియెట్ వెయిటేజీ మార్కులను కూడా జతచేసి జేఈఈ, గేట్ తరహాలో నార్మలైజేషన్ ద్వారా ర్యాంకులు ప్రకటించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫార్ములాపై చర్చలు జరుపుతున్నారు. ఈనెల 27న నార్మలైజేషన్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. అప్పటికి దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉండగా ఇప్పటివరకు ఏపీ ఎంసెట్‌కు మొత్తం 1,58,912 దరఖాస్తులు అందాయి. -
6న ఏపీ ఎంసెట్–2017 నోటిఫికేషన్
-
6న ఏపీ ఎంసెట్–2017 నోటిఫికేషన్
ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు వెల్లడి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్ –2017 నోటిఫికేషన్ ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది మెడిసిన్ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నందున ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ సైన్స్లకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్ష ఆన్లైన్లో ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మ««ధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామని, ప్రతి రోజూ 40 వేల నుంచి 50 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుంటాయని చెప్పారు.ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు సీసీఎస్, ఏపీ ఆన్లైన్లతో ఒప్పందం జరిగినట్టు చెప్పారు. గతంలో రూ.350 ఉన్న పరీక్ష రుసుమును రూ.450కి పెంచినట్లు తెలిపారు. పరీక్ష ఆన్లైన్లో జరుగుతున్నందున విద్యార్థులకు మాక్, ప్రాక్టీస్ టెస్ట్‌లను అన్ని కళాశాలలూ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోనూ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. -
ఏప్రిల్ 24 నుంచి ఏపీ ఎంసెట్
♦ ఫిబ్రవరి 15 నుంచి మాక్‌టెస్ట్‌లు ♦ విద్యార్థులకు ఉపయుక్తంగా యాప్ ఏర్పాటు ♦ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల చేసిన మంత్రి గంటా ఏయూక్యాంపస్ (విశాఖ): ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌తో పాటు ఇతర సెట్ల తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 24 నుంచి ఎంసెట్ ప్రారంభమవుతుంది. ఈసారి ఆన్లైన్ పరీక్ష కావడంతో ఇంజినీరింగ్ పరీక్షను 24 నుంచి 27 వరకూ నిర్వహించనున్నారు. సంయుక్త ప్రవేశ పరీక్షల తేదీలను సోమవారం సాయంత్రం స్థానిక ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ మందిరంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల తేదీలు వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షల నిర్వహణ బాధ్యత ఏపీ ఆన్‌లైన్‌కు ఇచ్చామని, ఏపీటీఎస్, టీసీఎస్ సంయుక్తంగా ఐటీ అండ్ సీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను చేపడతాయని చెప్పారు. అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో రాదన్నారు. ఆన్లైన్ పరీక్షలపై విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘గైడ్‌లైన్స్ టు ద స్టూడెంట్’ పేరుతో నియమావళిని రూపొందించి వెబ్సైట్లో పొందుపరుస్తామని, ఆన్లైన్ టెస్ట్‌లు జరిగే విధానాన్ని వీడియో రూపంలో వెబ్సైట్లో విద్యార్థుల అవగాహన కోసం ఉంచుతామని పేర్కొన్నారు. 15 నుంచి మాక్ టెస్ట్‌లు విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మాక్ టెస్ట్‌లు తమ ఇంటి నుంచే సాధన చేయవచ్చని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా మాక్‌టెస్ట్‌లతో కూడిన సీడీలు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఉపయుక్తంగా ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నామని, పరీక్ష కేంద్రం వివరాలు, హాల్‌టికెట్ డౌన్లోడ్ వంటివి యాప్ సహాయంతో చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్‌టికెట్ పరీక్ష కేంద్రం రూట్‌మ్యాప్ ముద్రిస్తామన్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ ఇంటర్ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని, దీనిపై విద్యార్థులు ఎటువంటి అపోహ పడవద్దన్నారు. -
జేఎన్టీయూకేకు ఏపీ ఎంసెట్
బాలాజీచెరువు (కాకినాడ) : ఏపీ ఎంసెట్–17బా««దl్యతలను ఉన్నత విద్యాశాఖ ఎట్టకేలకు జేఎ¯ŒSటీయూకేకు అప్పగించింది.గతంలో ఎంసెట్‌తో పాటు పీజీ ఈసె ట్ బాధ్యతను నిర్వహించిన జేఎ¯ŒSటీయూ కే నిర్వహించి న సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పీజీ ఈసెట్ బాధ్యతలను ఆంధ్రా యూని వర్సిటీకి అప్పగించింది. జేఎ¯ŒSటీయూకే ఇ¯ŒSఛార్జి రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ఈఈఈ విభాగం ఆచార్యుడు డాక్టర్ సీహెచ్ సాయిబాబును ఏపీ ఎంసెట్ కన్వీనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సాయిబాబు 2015, 16 సంవత్సరంలో ఏపీ ఎంసెట్ కన్వీనర్‌గా అతి తక్కువ సమయంలో ఫలితాలు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఈయన ఏపీ జె¯ŒSకో, ఏపీ ఈపీడీసీఎల్ పోస్టులకు కన్వీనర్‌గా, మూడు సార్లు ఈసెట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఎంసెట్ కన్వీనర్‌గా నియమితులైన సాయిబాబు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జేఎ¯ŒSటీయూకే వీసీ వీఎస్ఎస్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా వర్సిటీ సిబ్బంది సహకారంతో ఎంసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించి సకాలంగా ఫలితాలు విడుదల చేయడంతో పాటు కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియకు చర్యలు తీసుకుంటానని ‘సాక్షి’కి తెలిపారు. -
ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్
ఏపీ ఎంసెట్-2016 బైపీసీ స్ట్రీమ్ అభ్యర్ధులకు ఫార్మా డీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సులకు సంబంధించి తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 17వ తేదీనుంచి ప్రాంభం కానుంది. ఈనెల 17, 18 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకొనేందుకు అవకాశమివ్వనున్నారు. 18వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఒకటో ర్యాంకరునుంచి చివరి ర్యాంకరు వరకు ఇందులో పాల్గొనేందుకు అవకాశముంది. ఈనెల 20వ తేదీన ఆన్లైన్ ద్వారా సీట్ల కేటాయింపు చేయనున్నామని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి ఒకప్రకటనలో వివరించారు. అభ్యర్ధులు ఇప్పటికే సీట్లు పొంది వేరే కాలేజీల్లో చేరి మార్పును కోరుకుంటే వారికి సంబంధించిన ధ్రువపత్రాలను ఆయా కాలేజీల యాజమాన్యాలు తిరిగి ఇవ్వాలని కన్వీనర్ సూచించారు. -
టి-మెడికల్ అభ్యర్థులకు ఏపీ వెసులుబాటు
హైదరాబాద్: మెడికల్ సీట్ల భర్తీకి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ను తమ విద్యార్థుల కోసం మరోసారి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడారు. లక్ష్మారెడ్డి విన్నపానికి కామినేని శ్రీనివాస్ అంగీకరించారు. ఎంసెట్-2 రద్దు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కామినేనితో లక్ష్మారెడ్డి మాట్లాడాక కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి శనివారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రవిరాజుకు లేఖ రాశారు. అయితే అంగీకారం తెలుపుతూ అక్కడి నుంచి అధికారికంగా సమాచారం రాలేదని తెలిసింది. ఏపీలో మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ 6, 7, 8 తేదీల్లో జరుగనుంది. ఆ లోపు తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాల్సివుంటుంది. ఇక్కడ వస్తుందనుకుని అక్కడ వదులుకున్నారు.. తెలంగాణ ఎంసెట్-2లో మెడికల్ టాప్ ర్యాంకులు సాధించుకున్న విద్యార్థులు అనేక మంది ఏపీ ఎంసెట్‌లోనూ టాప్ ర్యాంకులు పొందారు. ఏపీ ఎంసెట్ కంటే మెరుగైన ర్యాంకులు వచ్చిన విద్యార్థులు అక్కడి సీట్లను వదులుకోవానలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ రాష్ట్రంలో నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు తెలంగాణ విద్యార్థులు అనేకమంది హాజరుకాలేదు. దురదష్టవశాత్తు ఏపీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక ఊహించని రీతిలో ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం బయటపడింది. ఇది విద్యార్థులకు పిడుగుపాటు అయింది. ఏపీలో సీటును వదులుకోవడం.. తెలంగాణలో ఎంసెట్-2 రద్దుతో రెండు చోట్లా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఏపీలో ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ముగియలేదు. కౌన్సిలింగ్‌కు హాజరు కావాలంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తప్పనిసరి. వెరిఫికేషన్‌లో పాల్గొనని కొందరు విద్యార్థులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వీసీ కరుణాకర్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 15 శాతం సీట్లలో ఓపెన్ కాంపిటీషన్.. ఏపీలో ఉన్న మెడికల్ సీట్ల మొత్తంలో 15 శాతం ఓపెన్ కాంపిటీషన్ లో పొందే వీలుంది. ఆ ప్రకారం తెలంగాణకు చెందిన ఏపీ ఎంసెట్ టాప్ ర్యాంకర్లు కౌన్సిలింగ్ లో సీట్లు పొందొచ్చు. తెలంగాణ ఎంసెట్-2లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అనేకమంది ఏపీ కౌన్సిలింగ్ కు హజరుకాలేదు. దీంతో ఇప్పుడు ఆ సీట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు మాత్రం తమ రాష్ట్ర విద్యార్థుల సీట్లకు కోత పడతాయన్న ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. మానవతా దృక్పథంతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరుతోంది. -
ఏపీ ఎంసెట్‌లో అక్రమాల్లేవు: కామినేని
-
ఏపీ ఎంసెట్‌లో అక్రమాల్లేవు: కామినేని
ఏపీలో నిర్వహించిన ఎంసెట్ మెడికల్ పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. 15 శాతం ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులు చేరితే ఏపీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆప్షన్ల ఎంట్రీని వాయిదా వేసినట్లు తెలిపారు. వచ్చే నెల 6, 7 తేదీలలో ఆప్షన్ల ఎంట్రీకి అవకాశం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఎంసెట్ ఆలస్యమైతే... ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇక ఏపీలో పీజీ మెడికల్ సీట్లు తీసుకున్నవాళ్లు కచ్చితంగా చేరాలని కామినేని శ్రీనివాస్ తెలిపారు. వాళ్లు సీట్లు తీసుకునేటప్పుడు కచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. సీట్లు రద్దు చేసుకుంటే రూ. 2 లక్షలు కట్టాలని, అలా కట్టనివాళ్లకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని తెలిపారు. కొంతమంది కౌన్సెలింగ్‌లో సీట్లు తీసుకుని, కోర్సులలో చేరకపోవడంతో చాలా సీట్లు మిగిలిపోయి ఎంతోమందికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. -
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సీఐడీ వివరాలు
-
మధ్యవర్తులే సూత్రధారులు
- ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై బలపడుతున్న సందేహాలు - సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ పాత్రపై అనుమానాలు - ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కన్సల్టెన్సీలు - అభ్యర్థుల తల్లిదండ్రులను సంప్రదించి ఒప్పందాలు! - పరీక్షకు వారం ముందే కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిన విద్యార్థులు - ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉండి పరీక్షకు హాజరు - టీఎస్ ఎంసెట్-1, ఏపీ ఎంసెట్లలో 10-15 వేలకుపైన ర్యాంకులు - ఎంసెట్-2లో మాత్రం వందల్లోపు ర్యాంకులు వచ్చిన వైనం వరంగల్: వైద్య విద్య అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపై సందేహాలు మరింతగా బలపడుతున్నాయి. సాధారణ విద్యార్థులకు కూడా ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు చెల్లించగల వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు మధ్యవర్తులు, కొన్ని కన్సల్టెన్సీలు ఈ వ్యవహారానికి తెరలేపాయనే ఆరోపణలు వస్తున్నా యి. ఒకే కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది పరీక్షకు వారం ముందు అక్కడ లేకుండా పోయిన వారికి మెరుగైన ర్యాంకులు వచ్చాయని పలువురు అభ్యర్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. తొలి ఎంసెట్ జరిగిన 40 రోజుల్లోనే ఎంసెట్-2 జరిగిందని.. ఇంత తక్కువ సమయంలోనే ఏకంగా వేలకుపైగా ర్యాంకుల నుంచి వందల్లోపు ర్యాంకులు రావడం అసాధారణమని పేర్కొంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు కన్సల్టెన్సీలు కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు లక్ష్యంగా.. వారి తల్లిదండ్రులతో మధ్యవర్తులు సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలా జరిగింది? వరంగల్ జిల్లా భూపాలపల్లి, పరకాల ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివారు. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1 పరీక్షలు రాశారు. తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్నారు. షార్ట్‌టర్మ్ కోచింగ్ కోసం వారిలో దాదాపు 19 మంది విజయవాడలోని బ్రిలియంట్ కోచింగ్ సెంటర్లో చేరారు. 40 రోజుల కోచింగ్ కోసం భారీగా ఫీజు చెల్లించారు. కానీ ఎంసెట్-2 పరీక్షకు వారం ముందే కోచింగ్ వదిలేసి.. బయటికి వచ్చారు. తర్వాత హైదరాబాద్‌లో పరీక్ష రాశారు. ఇలా పరీక్షకు వారం ముందు కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన వారికి వందల్లో ర్యాంకులు వచ్చాయి. విజయవాడలో పరీక్ష రాసిన వారికి మాత్రం ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1 తరహాలోనే వేలకుపైగా ర్యాంకులు వచ్చాయి. పరకాల, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లో ఓ విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 24 వేలకుపైన ర్యాంకు, టీఎస్ ఎంసెట్-1లో 17 వేలకుపైన ర్యాంకు రాగా... ఎంసెట్-2లో ఏకంగా ఏడు వందలలోపు ర్యాంకు రావడం గమనార్హం. మరో విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 9 వేలకుపైన ర్యాంకు, టీఎస్ ఎంసెట్-1లో దాదాపు అదే ర్యాంకురాగా... ఎంసెట్-2లో మాత్రం మూడు వందలలోపు ర్యాంకు వచ్చింది. మరో విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 27 వేలపైన, ఎంసెట్-1లో 20వేలపైన ర్యాంకులు రాగా... ఎంసెట్-2లో తొమ్మిది వందలలోపు ర్యాంకు వచ్చింది. దీంతో ఎంసెట్-2 పేపర్ లీకయినట్లుగా సందేహాలు బలపడుతున్నాయి. వారం రోజుల్లోనే.. ఎంసెట్-2 పరీక్ష సమయం దగ్గర పడుతున్న సమయంలో విద్యార్థులు మరింతగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కానీ కొందరు విద్యార్థులు పరీక్ష దగ్గర పడిన సమయంలో కోచింగ్ నుంచి బయటకు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోచింగ్ తీసుకున్న విజయవాడలోగానీ, సొంత జిల్లా వరంగల్లోగానీ పరీక్షలు రాయాల్సి ఉండగా... హైదరాబాద్‌లో పరీక్షలు రాయడంతో సందేహాలు బలపడుతున్నాయి. ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించి ఒక విద్యార్థికి టీఎస్ ఎంసెట్-1లో 7 మార్కులురాగా.. ఎంసెట్-2లో 30కిపైగా మార్కులు ఎలా వచ్చాయనే ప్రశ్న తలెత్తుతోంది. భూపాలపల్లి పట్టణంలోని ఓ వ్యాపారి తన కుమార్తెను విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చేర్పించారు. ఆమెకు ఎంసెట్-1లో 15వేలకుపైన, ఏపీ ఎంసెట్‌లో 20వేలకుపైన ర్యాంకు వచ్చింది. దీంతో ఎంసెట్-2 షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం మే నెలలో విజయవాడలోని బ్రిలియంట్ కోచింగ్ సెంట ర్లో చేర్పించారు. శిక్షణకు రోజుకు రూ.వెయ్యి చొప్పున 45 రోజులకు రూ.45 వేలు ఫీజు మాట్లాడుకున్నారు. కానీ కోచింగ్ పూర్తి కావడానికి వారం ముందే ఆమె అకాడమీ నుంచి బయటకు వచ్చిందని, ఇంటికి కూడా వెళ్లకుండా తండ్రితో కలసి హైదరాబాద్‌కు వెళ్లారని సమాచారం. శ్రీచైతన్య కళాశాలలో చదివి, బ్రిలియంట్ అకాడమీలో శిక్షణ పొందిన భూపాలపల్లికి చెందిన మరో విద్యార్థినికి కూడా ఎంసెట్-2లో మంచి ర్యాంకు వచ్చినట్లు తెలిసింది. పరకాల పట్టణానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు శ్రీచైతన్య కళాశాలలో చదివి, బ్రిలియంట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు సమాచారం. భూపాలపల్లికి చెందిన విద్యార్థుల కంటే పరకాల విద్యార్థులు బాగా చదివేవారని తెలిసింది. అయితే వారిలో ఉత్తమ విద్యార్థులకు కాకుండా... ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1లో ప్రతిభ కనబరచని వారికి మంచి ర్యాంకులు వచ్చాయి. దీంతో పరకాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి సమాచారాన్ని సేకరించగా.. లీకేజీ సమాచారం బయటకు పొక్కింది. ఈ మేరకు బుధవారం ఇంటలిజెన్స్ అధికారులు పరకాలలో విచారణ జరిపినట్లు తెలిసింది. తక్కువ సమయంలోనే ర్యాంకులెలా పెరిగాయి? ‘‘టీఎస్ ఎంసెట్-1లో 15 వేలకుపైగా, ఏపీ ఎంసెట్‌లో 20 వేలకుపైగా ర్యాంకు వచ్చిన వారికి కొద్ది రోజుల్లోనే జరిగిన ఎంసెట్-2లో వందల్లో ర్యాంకులు ఎలా వస్తాయి? ప్రశ్నపత్రం లీకేజీ వాస్తవంగానే కనిపిస్తోంది. దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. ఎంసెట్-2 మళ్లీ నిర్వహించాలి..’’ - ఎం.పురుషోత్తం, ఎంసెట్-2లో 3,470 ర్యాంకు సాధించిన పూజ తండ్రి బాధ్యులపై కఠిన చర్యలు: కడియం ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంటలిజెన్స్, సీబీసీఐడీలు విచారణ చేపడుతున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై సీఐడీ విచారణ సాక్షి, హైదరాబాద్: పరీక్షకు ముందే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైందంటూ వచ్చిన ఆరోపణలపై డీజీపీ అనురాగ్‌శర్మ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ఎంసెట్ కన్వీనర్ రమణారావు బుధవారం లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించారు. కొంత మంది తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని.. ఆదిశగా కూడా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. అనుమానం ఉన్న కోచింగ్ సెంటర్లలో ఆరా తీయనున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎంసెట్ ప్రశ్నపత్రం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని.. ఆయనే కొన్ని ప్రశ్నలు లీక్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తునకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎంసెట్ లీకేజీపై ఆధారాలు లభిస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. మరోవైపు ఈ నెల 25వ తేదీ నుంచి జరిగే ఎంబీబీఎస్, బీడీఎస్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ యధావిధిగా ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
23 నుంచి ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుందని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో మిగిలిన ఇంజనీరింగ్ సీట్లతో పాటు ఫార్మాడీ కోర్సులకూ ఈ విడతలో కేటాయింపు జరగనుంది. మొదటివిడతలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోని వారు ఈ నెల 23న ఆయా సేవా కేంద్రాల్లో పరిశీలన చేయించుకోవాలి. ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్సు, ఎన్సీసీ, సీఏపీ, దివ్యాంగ అభ్యర్థులు విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సేవా కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలి. వెబ్ ఆప్షన ్ల నమోదు అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది. 24వ తేదీ వరకు వెబ్ఆప్షన్లకు గడువు ఉంది. 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థుల ఫోన్‌కు సంక్షిప్త సమాచార రూపంలో కేటాయింపు సీట్ల వివరాలు అందిస్తారు. ఇతర వివరాల కోసం ’హెచ్‌టీటీపీ://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కన్వీనర్ సూచించారు. -
23 నుంచి తుది విడత ఎంసెట్ కౌన్సెలింగ్
ఏపీ ఎంసెట్-2016 ఇంజనీరింగ్ విభాగం తుది విడత కౌన్సెలింగ్ ఈనెల 23, 24 తేదీల్లో జరగనుంది. ఈమేరకు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో మిగిలిపోయిన సీట్లు, కేన్సిల్ అయిన సీట్లు, కాలేజీల్లో చేరకుండా అభ్యర్ధులు డ్రాప్ అయిన ఖాళీలను ఈ తుదివిడతలో భర్తీచేయనున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్‌లో అర్హులైన అభ్యర్ధులు ఈ తుదివిడత కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. ఫార్మా-డి కోర్సులు కూడా తుదివిడత కౌన్సెలింగ్‌కు జతచేస్తున్నట్లు కన్వీనర్ వివరించారు. మొదటి విడతలో సీట్లు పొంది వెబ్‌ద్వారా సెల్ఫ్ రిపోర్టు, కాలేజీల్లో రిపోర్టు చేయని అభ్యర్ధుల ఈనెల 20వ తేదీ లోపల ఆయా కాలేజీలకు వెళ్లి చేరవచ్చని వివరించారు. ఆతేదీ లోగా చేరకపోతే ఆ సీట్లను ఖాళీలుగా పరిగణించి తుది విడత కౌన్సెలింగ్‌కు జతచేయనున్నట్లు స్పష్టంచేశారు. అలాగే ఏపీ ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది తరువాత జాతీయ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందిన వారు తమ సీట్లను రద్దు చేసుకోవాలని భావిస్తే సంబంధిత కాలేజీలను ఈనెల 20లోగా సంప్రదించి తమ ప్రొవిజనల్ అలాట్మెంటును రద్దు చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ సంస్థల్లో కేన్సిల్ అయిన, రిపోర్టు చేయక ఖాళీగా ఉన్న సీట్లను ఈనెల 21వ తేదీ నాటికి అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఏపీఎంసెట్‌లో మెరిట్ సాధించిన వారిలో తదుపరి స్థానాల్లో ఉన్న వారికి ఈ సీట్లు తుదివిడత కౌన్సెలింగ్‌లో కేటాయింపు కానున్నాయన్నారు. 18 నుంచి బీఫార్మసీ కౌన్సెలింగ్ ఇలా ఉండగా ఏపీఎంసెట్ రాసి అర్హులైన బైపీసీ విభాగం అభ్యర్ధులు బీఫార్మసీ, ఫార్మాడీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు. ఈనెల 11వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకానుంది. ఇతర వివరాలకు అభ్యర్ధులు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీడీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని వివరించారు. -
నేడు ‘సప్లిమెంటరీ’ ఏపీ ఎంసెట్ ర్యాంకులు
కాకినాడ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఎంసెట్ ర్యాంకులను బుధవారం విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సి.హెచ్ సాయిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకుల సమాచారం విద్యార్థులు రిజిస్టరు చేసుకున్న మొబైల్ నంబరుకు వస్తుందని, ర్యాంకు కార్డులు గురువారం నుంచి ఎంసెట్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర బోర్డుల ద్వారా పరీక్షలు రాసిన విద్యార్థుల ర్యాంకులు కూడా విడుదల చేస్తామని తెలిపారు. -
15 తర్వాత రెండో విడత ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌ను జూలై మూడోవారంలో నిర్వహించేందుకు అడ్మిషన్ల కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ సంస్థల్లో ప్రవేశాలు, తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు సీట్ల కేటాయింపు పూర్తయ్యాక ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. కాగా, ఈ నెల 14న ఐఐటీ అడ్మిషన్లు, తెలంగాణ ఎంసెట్ సీట్ల కేటాయింపు జరగనుంది. అనంతరం 15నుంచి లేదా ఆ తరువాత ఒకట్రెండు రోజుల్లోరెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టే అవకాశముందని ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి రఘునాథ్ ‘సాక్షి’కి వివరించారు. -
ఏపీలో 43వేల సీట్లు ఖాళీ
ఒకరోజు ముందే ఎంసెట్ తొలివిడత సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఏపీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఏపీ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కమిటీ షెడ్యూల్‌కన్నా ఒకరోజు ముందే సోమవారమే పూర్తిచేసింది. రాష్ట్రంలోని కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో మొత్తం 1,61,512 సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్‌కోటాలో 1,13,058 సీట్లకు గాను మొదటివిడత కౌన్సెలింగ్‌లో 69,459 (61.4 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 43,599 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఎంసెట్‌లో మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారిలో అత్యధికులు ఈసారి ఇక్కడి కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదని తాజా కేటాయింపులు స్పష్టంచేస్తున్నాయి. అనేకమంది జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుతో పాటు పలు ఇతర యూనివర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించి ఉండడం, వాటిలో చేరేందుకు ఉత్సుకత చూపుతుండడం ఏపీ ఎంసెట్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోవడానికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెబ్సైట్ ద్వారా సెల్ఫ్‌జాయినింగ్ రిపోర్టు సీట్లు కేటాయింపు అయిన అభ్యర్థులకు కాలేజీ, కోర్సుల వారీగా సమాచారాన్ని అడ్మిషన్ల కమిటీ సంక్షిప్త సమాచారాన్ని వారి ఫోన్లకు పంపింది. సీట్లు కేటాయింపుపైన అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’లో పొందుపరిచిన సెల్ఫ్‌జాయినింగ్ రిపోర్టు ఆప్షన్ ద్వారా, లేదా సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్లలో కానీ సెల్ఫ్ రిపోర్టు చేయాలని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసిన అనంతరం సంబంధిత రిపోర్టింగ్ కాపీలు రెండింటిని ప్రింటవుట్ తీసుకోవాలి. వాటిలో ఒకదాన్ని తమకు కేటాయించిన కాలేజీలకు జులై 1లోగా తీసుకువెళ్లి సమర్పించి మరో దానిపై ఆ కాలేజీనుంచి అకనాలెడ్జిమెంటు చేయించుకోవాలి. తమకు మొదటివిడత కేటాయించిన సీటు సంతృప్తికరంగా ఉందని భావిస్తే అభ్యర్థులు ఆ కాలేజీల్లో రిపోర్టు మాత్రమే చేయాలి. ఒరిజినల్ ధ్రువపత్రాలను, ట్యూషన్ ఫీజులను (ఫీజు రీయింబర్స్‌మెంటు పరిధిలోకి రానివారు) కాలేజీలకు అందించరాదు. చివరి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక మాత్రమే ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్‌లో అర్హులైన అభ్యర్థులందరికీ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని అడ్మిషన్ల కమిటీ వర్గాలు వివరించాయి. ఇంజనీరింగ్, ఫార్మ కాలేజీల్లో తరగతులు జూలై 1నుంచి ప్రారంభమవుతాయని ఉదయలక్ష్మి వివరించారు. -
ఏపీ ఎంసెట్‌పై ‘స్థానికత’ ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఆ రాష్ట్ర స్థానికతను వర్తింపచేసేలా శుక్రవారం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఎంసెట్ రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఏపీకి వెళ్తే కనుక అక్కడి స్థానికత ఆధారంగా వారికి లోకల్ కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. దీనిపై ఉన్నతాధికారవర్గాల్లోనూ తర్జనభర్జన సాగుతోంది. గతనెలలో జరిగిన ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ(ఓయూ రీజియన్) నుంచి ఇంజనీరింగ్‌లో 17,548 మంది, మెడికల్ విభాగంలో 22,591 మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో దాదాపు 1.60 లక్షల సీట్లుండగా, ఎంబీబీఎస్‌లో 3,900 సీట్లు, డెంటల్ కోర్సులో 1,300 సీట్లు ఉన్నాయి. వీటిలో 371 డీ ప్రకారం ఆయా రీజియన్ల పరిధిలోని సీట్లలో 85 శాతం స్థానికులకు, 15 శాతం సీట్లు మెరిట్లో ఓపెన్ టు ఆల్ ప్రాతిపదికన భర్తీచేయాలి. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి 371 డీ ప్రకారం ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీల రీజియన్లుగా ఉన్నాయి. ఈ లెక్కన హైదరాబాద్, తెలంగాణలో ఇంటర్ వరకు చదివి ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఏపీలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో 15 శాతం కోటా మాత్రమే వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఉస్మానియా పరిధి నుంచి ఉత్తీర్ణులైన వారిని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు 15 శాతం ఓపెన్ కోటాకు అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ సీట్ల కేటాయింపులో ఆమేరకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కౌన్సెలింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 35 వేల ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆప్షన్ల నమోదు పూర్తిచేశారు. వీరిలో అత్యధిక శాతం మంది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులున్నారు. ఈ తరుణంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి స్థానికతను వర్తింపచేసే ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కౌన్సెలింగ్‌పై దాని ప్రభావం పడుతోంది. 85 శాతమా..? 15 శాతమా..? ప్రస్తుతం ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించిన ఓయూ రీజియన్ అభ్యర్థుల్లో అనేక మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. అలా అయితే వారికి ఏపీ స్థానికత వర్తిస్తుంది. అపుడు ఎంసెట్‌లో వారికి 85 శాతం స్థానిక కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేక ఇంటర్ హైదరాబాద్, తెలంగాణలో చదివినందున 15 శాతం స్థానికేతర కోటాలో సీట్లు కేటాయిస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది. ఏపీకి వెళ్లే ఈ విద్యార్థులకు ఏ రీజియన్ పరిధిలో స్థానికత వర్తిస్తుందన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఏపీలోని ఏయూ, ఎస్వీయూలు రెండు రీజియన్లుగా ఉన్నాయి. ఏయూ పరిధిలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో ఎస్వీయూ పరిధిలో స్థానికత ఉన్నవారికి 15 శాతం ఓపెన్ కోటాలో మాత్రమే కేటాయింపులు చేస్తారు. అలాగే ఎస్వీయూ పరిధిలోని సీట్లలో ఏయూ పరిధి స్థానికత ఉన్నవారిని 15 శాతం సీట్లలో మాత్రమే అనుమతిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలి. ఆ తరువాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏ రీజియన్‌కు సంబంధించిన స్థానికత వర్తిస్తుందో తేలాలి. అప్పటికి గానీ ఆయా అభ్యర్థుల స్థానికతపై ఒక స్పష్టత రాదు. ఇందుకు చాలా సమయం పట్టనుంది. ఉన్నత స్థాయిలో చర్చించాకే స్పష్టత.. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఈనెల 22న మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల అలాట్‌మెంటు పూర్తవుతుంది. ఆలోగా ఈ వ్యవహారమంతా తేలదు. ఈ నేపథ్యంలో దీనిపై ఏంచేయాలా? అని అధికారులు ఆలోచనల్లో పడుతున్నారు. ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు దీనిపై స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలననుసరించి ముందుకు వెళ్తాం. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం అని వివరించారు. ఉన్నత స్థాయిలో చర్చించాకే దీనిపై ఒక స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ రాష్ట్రపతి ఉత్తర్వులు రాకముందే ప్రారంభమైనందున ఆ ఉత్తర్వులు ఈ కౌన్సెలింగ్‌కు అమలు చేయాలా? లేదా అన్నది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉందని వివరించారు. -
ఆ ప్రభావం ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా?
- ఏపీకి వెళ్లేవారికి స్థానికతపై రాష్ట్రపతి ఆమోదం - ఎంసెట్‌లో వారిని ఎలా పరిగణించాలన్న దానిపై అయోమయం హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఆ రాష్ట్ర స్థానికతను వర్తింపచేసేలా శుక్రవారం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆప్రభావం ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా? ఏపీ ఎంసెట్ రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఏపీకి వెళ్తే కనుక అక్కడి స్థానికత ఆధారంగా వారికి లోకల్ కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారవర్గాల్లోనూ తర్జనభర్జన సాగుతోంది. గతనెలలో జరిగిన ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ (ఓయూ రీజియన్) నుంచి దాదాపు 42,482 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 18,892 మంది ఇంజనీరింగ్ విభాగంలో, 23,594 మంది మెడికల్ విభాగంలో ఉన్నారు. ఇంజనీరింగ్‌లో 17,548 మంది, మెడికల్ విభాగంలో 22,591 మంది పరీక్ష రాశారు. వీరిలో అత్యధిక శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టాప్‌ర్యాంకుల్లో అధికం వీరికే వచ్చాయి. ఇంజనీరింగ్‌లో దాదాపు 1.60 లక్షల సీట్లుండగా, మెడికల్‌లో ఎంబీబీఎస్‌లో 3900 సీట్లు, డెంటల్ కోర్సులో 1300 సీట్లు ఉన్నాయి. వీటిలో 371 డీ ప్రకారం ఆయా రీజియన్ల పరిధిలోని సీట్లలో 85 శాతం స్థానికులకు కేటాయించాలి. 15 శాతం సీట్లు మెరిట్లో ఓపెన్టు ఆల్ ప్రాతిపదికన భర్తీచేయాలి. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి 371 డీ ప్రకారం ఏపీలోని ఆంధ్రాయూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీల రీజియన్లుగా ఉన్నాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో, తెలంగాణలో ఇంటర్మీడియెట్ వరకు చదివి ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఏపీలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో 15 శాతం కోటా మాత్రమే వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఉస్మానియా పరిధినుంచి ఉత్తీర్ణులైన వారిని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు అదే విధంగా పరిగణించి 15 శాతం ఓపెన్ కోటాకు మాత్రమే వారిని అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ సీట్ల కేటాయింపులో ఆమేరకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కౌన్సెలింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 35 వేల ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆప్షన్లు నమోదు పూర్తిచేశారు. వీరిలో అత్యధిక శాతం మంది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులున్నారు. ఈ తరుణంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి స్థానికతను వర్తింపచేసే ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కౌన్సెలింగ్‌పై దాని ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఏపీ ఎంసెట్ రాసి అర్హత సాధించిన ఓయూ రీజియన్ అభ్యర్థుల్లో అనేక మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. అలా అయితే వారికి ఏపీ స్థానికత వర్తిస్తుంది. అపుడు ఎంసెట్‌లో వారిని 85 శాతం స్థానిక కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేక ఇంటర్మీడియెట్ హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో చదివినందున 15 శాతం స్థానికేతర కోటాలో సీట్లు కేటాయిస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది. ఏపీకి వెళ్లే ఈ విద్యార్థులకు ఏ రీజియన్ పరిధిలో స్థానికత వర్తిస్తుందన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఏపీలోని ఏయూ, ఎస్వీయూలు రెండు రీజియన్లుగా ఉన్నాయి. ఏయూ పరిధిలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో ఎస్వీయూ పరిధిలో స్థానికత ఉన్నవారికి 15 శాతం ఓపెన్కోటాలో మాత్రమే కేటాయింపులు చేస్తారు. అలాగే ఎస్వీయూ పరిధిలోని సీట్లలో ఏయూ పరిధి స్థానికత ఉన్నవారిని 15 శాతం సీట్లలో మాత్రమే అనుమతిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలి. ఆ తరువాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏ రీజియన్‌కు సంబంధించిన స్థానికత వర్తిస్తుందో తేలాలి. అప్పటికి గానీ ఆయా అభ్యర్థుల స్థానికతపై ఒక స్పష్టత రాదు. ఇందుకు చాలా సమయం పట్టనుంది. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఈనెల 22న మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల అలాట్‌మెంటు పూర్తవుతుంది. ఆలోగా ఈ వ్యవహారమంతా తేలదు. ఈ నేపథ్యంలో దీనిపై ఏంచేయాలా? అని అధికారులు ఆలోచనల్లో పడుతున్నారు. ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు దీనిపై స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్తాం. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్తాం అని వివరించారు. ఉన్నత స్థాయిలో చర్చించాకనే దీనిపై ఒక స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ రాష్ట్రపతి ఉత్తర్వులు రాకముందే ప్రారంభమైనందున ఆ ఉత్తర్వులు ఈ కౌన్సెలింగ్‌కు అమలు చేయాలా? లేదా అన్నది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉందని వివరించారు. -
ఏపీ ఎంసెట్‌లో తొలిరోజు 8వేల వెబ్ ఆప్షన్లు
మార్పులు, చేర్పులకు 19, 20న చివరి అవకాశం సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఎంసెట్‌లో 1 నుంచి 35వేల ర్యాంకు అభ్యర్థులు గురు, శుక్రవారాల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలిరోజు దాదాపు 8వేల మంది ఆప్షన్లు ఎంచుకున్నారని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ పేర్కొంది. వీరిలో ట్యాప్ ర్యాంకర్లు ఇంకా ఆప్షన్లు నమోదు చేయలేదని, జేఈఈ మెయిన్స్‌తో సహా ఇతర ప్రవేశపరీక్షలు రాసిన విద్యార్థులు అక్కడా మంచి ర్యాంకులే సాధించినందున వారి ప్రాధాన్యతలు ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలు, ప్రముఖ ప్రైవేటు సంస్థలపై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు 29,968 మంది సర్టిఫికెట్లను ఇచ్చారని అధికారులు వివరించారు. ఆయా ర్యాంకుల అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో నిర్ణీత సమయంలో ఎన్నిసార్లయినా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, మార్పులు చేర్పులు చేసుకోవచ్చని అడ్మిషన్ల కమిటీ ప్రత్యేకాధికారి రఘునాథ్ వివరించారు. మరుసటి రోజు నుంచి తక్కిన ర్యాంకర్లకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందన్నారు. మళ్లీ 19, 20 తేదీల్లో మాత్రమే మొత్తం ర్యాంకర్లందరూ తమ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి రెండు రోజులు చివరి అవకాశమిస్తామని చెప్పారు. జూన్ 22న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. -
నేటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు
ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు కాకినాడ: ఇంజనీరింగ్ కళాశాలల్లో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ ఎంసెట్ రాసిన అభ్యర్థులు రాష్ట్రంలోని సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా హాజరై తమ విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వెబ్ ఆప్షన్ల నమోదులో పాల్గొనవచ్చన్నారు. ఆప్షన్ల మార్పు, చేర్పులు ఈనెల 19, 20 తేదీల్లో చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు 22న జరుగుతుందన్నారు. ప్రభుత్వ హెల్ప్‌లైన్ సెంట ర్లో అధికారుల పర్యవేక్షణలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నెట్‌కేఫ్‌లలో చేస్తే దళారులు మనకు తెలియకుండానే మోసపుచ్చి ఆప్షన్లను మార్చే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చే వన్‌టైం పాస్వర్డ్ చాలా కీలకమని, ఎవ్వరికీ తెలియకూడదని సూచించారు. విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థి హాజరు కాలేకపోయినా తరువాత రోజు హాజరు కావచ్చని వివరించారు. -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
కాకినాడ: ఇంజినీరింగ్ కళాశాలలో 2016-17 సంవత్సర ప్రవేశాలకు సంబంధించి వెబ్ అప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,79,465 మంది హాజరు కాగా, వీరిలో లక్షా 31 వేల 580 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎంసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు రాష్ర్టంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా అభ్యర్థులు హాజరై తమ విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలనతోపాటు వెబ్ అప్షన్ల నమోదులో పాల్గొనవచ్చన్నారు. ఆప్షన్లు మార్పు, చేర్పులు ఈ నెల 19,20 తేదీల్లో చేసుకోవచ్చని, సీట్ల కేటాయింపు 22న చేస్తారన్నారు. పాస్‌వర్డ్‌ను గోప్యంగా ఉంచాలి... ప్రభుత్వ హెల్ప్‌లైన్ సెంటర్లో అధికారుల పర్యవేక్షణలో వెబ్ అప్షన్లు నమోదు చేసుకోవాలని, నెట్‌కేఫ్‌లలో చేస్తే దళారులు మనకు తెలియకుండానే మోసపుచ్చి ఆప్షన్లను మార్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఎంసెట్ విద్యార్థులకు ఇచ్చే వన్‌టైం పాస్వర్డ్ ఎవ్వరికీ తెలియకూడదని, ఈ పాస్వర్డ్ చాలా కీలకమని చెప్పారు. విద్యార్థులకు ర్యాంక్ ఆధారంగా కేటాయించిన తేదీల్లో విద్యార్థి హాజరుకాలేకపోయినా తరువాత రోజు హాజరుకావచ్చన్నారు. ఎన్ని అప్షన్లు ఎక్కువగా ఇస్తే అంత మంచిదని, ఆసక్తిలేని కళాశాల పేర్లను అప్షన్లుగా ఇవ్వకూడదన్నారు. -
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తొలిరోజే ఆటంకం
- సాంకేతిక సమస్యలతో పనిచేయని సర్వర్లు - సాయంత్రానికి ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన సాక్షి, హైదరాబాద్/విజయవాడ(గుణదల): ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు తొలిరోజే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ కావాల్సిన సమాచారం.. సర్వర్లు పనిచేయక సాయంత్రం వరకు కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఎట్టకేలకు సాయంత్రం 6గంటల తర్వాత సర్వర్లు పనిచేయడంతో కొన్ని చోట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనంతపురం జేఎన్టీయూఏ పరిధిలోని మూడు కేంద్రాల్లో మాత్రం మంగళవారానికి వాయిదా పడింది. ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగాలి. ఈ మేరకు విశాఖపట్నంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కౌన్సెలింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అయితే, ఎన్ఐసీ సర్వర్లు పనిచేయకపోవడంతో ధ్రువపత్రాల పరిశీలనను అధికారులు మధ్యాహ్నానికి వాయిదా వేశారు. చివరకు సాయంత్రం 6గంటల తర్వాత సర్వర్లు పనిచేయడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గతంలోనూ ఇదే సమస్యరాగా అప్పట్లో కౌన్సెలింగ్ రెండురోజులు నిలిచింది. ఈసారీ అదే సమస్య తలెత్తడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాల్సి వస్తుందేమోనని అధికారులు భావించారు. చివరికి సర్వర్లు పనిచేయడంతో రాత్రివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,821 మంది ధ్రువపత్రాలు పరిశీలించినట్లు కౌన్సెలింగ్ కమిటీ ప్రత్యేకాధికారి రఘునాథ్ వివరించారు. మంగళవారం నుంచి యథావిధిగా సర్టిఫికెట్ల పరిశీలన సాగుతుందని అధికారులు వివరించారు. -
ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
విశాఖ : ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు సోమవారం వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ప్రక్రియను ఆరంభించారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19, 20 తేదీల్లో ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది. 22న సీట్లు కేటాయింపు, 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కాగా సాంకేతిక లోపం కారణంగా వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. -
ర్యాంకులు ఉల్టా పల్టా!
* తెలంగాణ, ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు తారుమారు * ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్‌కు ఏపీలో ఏడో ర్యాంకు * ఏపీలో ఫస్ట్ ర్యాంకర్‌కు తెలంగాణలో పదో ర్యాంకు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఎంసెట్ లో టాప్ ర్యాంకులు తారుమారయ్యాయి! ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి తెలంగాణ ఎంసెట్‌లో పదో ర్యాంకు లభించగా.. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీలో 7వ ర్యాంకు వచ్చింది. అగ్రికల్చర్ అండ్ మెడికల్(ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా) ఎంసెట్‌లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీలో 100వ ర్యాంకు లభించింది. ఇదే విభాగంలో తెలంగాణ ఎంసెట్‌లో పదో ర్యాంకు సాధించి న విద్యార్థికి ఏపీలో 193వ ర్యాంకు వచ్చింది. ఇటీవల ఏపీ ఎంసెట్ ఫలితాలను ప్రకటించగా.. గురువారం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ఎంసెట్ రాసిన అనేక మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్ కూడా రాశారు. ఏపీ ఎంసెట్ రాసిన వారిలో చాలామంది తెలంగాణ ఎంసెట్‌కు హాజరయ్యారు. రెండుచోట్లా తొలి పది స్థానాల్లో నిలిచినవారికి తెలంగాణలో వచ్చిన ర్యాంకు ఏపీలో రాలేదు.. ఏపీలో వచ్చిన ర్యాంకు తెలంగాణలో రాలేదు. వీరివే కాదు ఇలా అనేక మంది విద్యార్థుల ర్యాంకులు మారిపోయాయి. మెడికల్ టాపర్ల మనోగతం గ్రామాల్లో సేవ చేస్తా: ప్రదీప్ గాలివీడు: ఏపీలోని వైఎస్సార్ జిల్లాకు చెందిన బొజ్జల ప్రదీప్ కుమార్ రెడ్డి తెలంగాణ మెడికల్‌లో తొలి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. రాయచోటి నియోజకవర్గం గాలివీడుకు చెందిన బొజ్జల నారాయణరెడ్డి, అంజనమ్మ దంపతుల కుమారుడైన ప్రదీప్ ఇంటర్లో ఏపీలో రెండో ర్యాంకు సాధించాడు. ఇటీవలి ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించాడు. తండ్రి టీచర్ కాగా తల్లి గృహిణి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. కార్డియాలజిస్టుగా గ్రామాల్లో పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం’’ అని ప్రదీప్ ‘సాక్షి’కి తెలిపాడు. ఎయిమ్స్‌లో సీటే లక్ష్యం..: అర్బాజ్ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మహ్మద్ అర్బాజ్ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మెడికల్ విభాగంలో మూడో ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్‌లో 48వ ర్యాంకు సాధించిన అర్బాజ్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు. ఇంటర్‌లోనూ ప్రతిభావంతురాలు హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెందిన ఉప్పల ప్రణతి మెడికల్ విభాగంలో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించింది. పదో తరగతి, ఇంటర్‌లోనూ ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. తల్లి హేమలత గృహిణి కాగా తండ్రి హైటెక్ సిటిలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదో తరగతిలో 9.8 గ్రేడ్ తెలంగాణ ఎంసెట్ మెడికల్ విభాగంలో ఐదో ర్యాంకు సాధించిన యజ్ఞప్రియ ఇటీవలి ఏపీ ఎంసెట్‌లో మూడో ర్యాంక్ సాధించింది. వీరిది మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. తండ్రి సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌లో సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. యజ్ఞప్రియ పదో తరగతిలో 9.8 గ్రేడ్ మార్కులు, ఇంటర్లో 975 మార్కులు సాధించింది. మంచి డాక్టర్నవుతా: జలీలి హైదరాబాద్ పాతబస్తీ నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన జీషాన్ అహ్మద్ జలీలి ఎంసెట్ మెడికల్‌లో 6వ ర్యాంక్ సాధించాడు. మంచి వైద్యునిగా ఎదుగుతానని అతను చెప్పాడు. జీషాన్ తండ్రి డాక్టర్ ఖలీం అహ్మద్ జలీలి నిజాం కాలేజీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా తల్లి అంజుమ్ ఫాతిమా యాకత్పురా ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్. జీషాన్ అక్క మరియా డాక్టర్. సోదరుడు హరూన్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. -
నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, విజయవాడ బ్యూరో: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభిస్తున్నట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. జూన్ 6 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జూన్ 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19, 20 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని చెప్పారు. జూన్ 22న సీట్లు కేటాయిస్తామని, జూన్ 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన విజయవాడలో తెలిపారు. -
ఏపీలో జూన్ 6నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
విజయవాడ: జూన్ 6వ తేదీ నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఆరో తేదీ నుంచి 15 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన, 9వ తేదీ నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్ల ఎంపిక, 22 నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలను మంత్రి గంటా ఈ రోజు ఉదయం ఇక్కడ విడుదల చేశారు. ఇంజినీరింగ్ కళాశాలలు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. -
ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు
హైదరాబాద్: ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలు మంగళవారం ఖరారయ్యాయి. వచ్చే నెల 6 నుంచి 9 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. జూన్ 15 నుంచి వెబ్ ఆప్షన్లును విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. -
ట్విన్ సిస్టర్స్.. ఆదుర్స్
విజయనగరం అర్బన్: విజయనగరంలోని ట్విన్ సిస్టర్స్(కవలలు)కు ఎంసెట్ మెడికల్ విభాగంలో టాప్ ర్యాంకులు లభించాయి. కొడాలి అలేఖ్య 145 మార్కులతో 62వ ర్యాంక్, అఖిల 126 మార్కులతో 1,275వ ర్యాంక్ సాధించింది. వీరి తల్లిదండ్రులు తిరుమల ప్రసాద్, కృష్ణశాంతి వృత్తిరీత్యా వైద్యులు. పట్టణంలో వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్విన్ సిస్టర్స్ అలేఖ్య, అఖిల మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడిలేని వాతావరణం లభించడం వల్లే ర్యాంక్ సాధించగలిగామన్నారు. తల్లిదండ్రుల బాటలోనే వైద్యసేవలను అందించడమే లక్ష్యమని చెప్పారు. జిప్‌మార్, ఎయిమ్స్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి జాతీయ స్థాయి మెడికల్ కళాశాలల్లో చదవాలనుకుంటున్నట్లు తెలిపారు. -
ఏపీ ఎంసెట్ మెడికల్‌లో తెలంగాణ హవా
టాప్ 10లో ఆరుగురు తెలంగాణ వారే - 2, 3, 5, 6, 8, 9 ర్యాంకులు కైవసం - వెబ్సైట్లో ర్యాంకు కార్డులు - ఓఎంఆర్ షీట్లపై అభ్యంతరాలకు 26వ తేదీ దాకా అవకాశం సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో ఏకంగా ఆరింటిని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యర్ల సాత్విక్‌రెడ్డి రెండో ర్యాంకు, అమ్మకోల యజ్ఞప్రియ మూడు, ఇక్రాం ఖాన్ ఐదు, శొంటి సాహితీ సావిత్రి ఆరో ర్యాంకు సాధించారు. వరంగల్ జిల్లాకు చెందిన బలభద్ర గ్రీష్మ మీనన్‌కు 8, నల్లగొండకు చెందిన దారం శివకుమార్‌కు 9వ ర్యాంకు వచ్చాయి. ఏపీ విద్యార్థుల్లో 85.24 శాతం మంది ఉత్తీర్ణులు కాగా తెలంగాణ విద్యార్థులు 95.48 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. నిజానికి వీటిని ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలతో పాటే విడుదల చేయాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్లను ‘నీట్’ ద్వారానే చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా వేశారు. నీట్‌ను ఏడాదిపాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో శనివారం విడుదల చేశారు. ఏపీ ఎంసెట్‌ను ఏప్రిల్ 29న ఆంధ్రప్రదేశ్‌లోని పలు కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లో కూడా నిర్వహించడం తెలిసిందే. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 98,752 మంది రాయగా 86,494 మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 22,589 మంది హాజరవగా 21,569 మంది అర్హత సాధించారు. వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లు విద్యార్థులకు వారి ర్యాంకులను ఎసెమ్మెస్‌ల రూపంలో పంపించారు. వేరే బోర్డుల నుంచి ఎంసెట్‌కు హాజరైన 6,669 మంది విద్యార్థులకు వారి ఇంటర్ మార్కులు వెల్లడి కాకపోవడంతో ఇంకా ర్యాంకులు కేటాయించలేదు. అర్హత సాధించిన విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, ఏపీ ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్, కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఓఎంఆర్ షీట్లు www.apeamcet.org వెబ్సైట్లో శనివారం నుంచే అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యంతరాలుంటే 26వ తేదీ దాకా పరిశీలించుకోవచ్చన్నారు. టాపర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ‘నీట్’ తప్పనిసరి కావడంతోఏపీలో అందుకవసరమైన సిలబస్, విధివిధానాల రూపకల్పనకు త్వరలో కమిటీ వేస్తామని చెప్పారు. నీట్ గందరగోళం నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందొద్దనే ఎంసెట్ మెడికల్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశామన్నారు. శనివారం తనను కలిసిన ఎంసెట్ మెడిసిన్ టాపర్ మాచాని హేమలతను బాబు అభినందించారు. -
ఏపీ ఎంసెట్ లో తెలంగాణ హవా..
హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 మెడికల్, అగ్రికల్చర్ విభాగాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ లో ఆరుగురు తెలంగాణ విద్యార్థులు స్థానం సంపాదించారు. ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలను విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు విడుదల చేశారు. యర్ల సాత్విక్ రెడ్డి 155(రెండో ర్యాంకు), అమ్మకుల యజ్ఞప్రియ 153(3వ ర్యాంకు), ఇక్రమ్ కాన్ 152(5వ ర్యాంకు), సావిత్రి 152(6వ ర్యాంకు), బలభద్ర గ్రీష్మ మీనన్ 150(8వ ర్యాంకు), శివకుమార్ 150(9వ ర్యాంకు)లు టాప్ టెన్ లో నిలిచారు. ఓవరాల్ గా టాప్ టెన్ లో ఆరుగురు బాలికలు ఉన్నారు. టాప్ టెన్ లో తెలంగాణ విద్యార్థుల మార్కులు, జిల్లా వివరాలు: 2 యర్ల సాత్విక్ రెడ్డి 155 రంగారెడ్డి 3 అమ్మకుల యజ్ఞప్రియ 153 హైదరాబాద్ 5 ఇక్రమ్ ఖాన్ 152 హైదరాబాద్ 6 సాహితి 152 హైదరాబాద్ 8 బలభద్ర గ్రీష్మ మీనన్ 150 వరంగల్ 9 శివకుమార్ 150 నల్లగొండ -
ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 మెడికల్, అగ్రికల్చర్ విభాగం ఫలితాలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ఫలితాలు విడుదలచేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నీట్‌ను వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్సు ఇవ్వడంతో ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలకు మార్గం సుగమమైంది. గత కొన్ని రోజులుగా నీట్ వివాదంపై తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతుండగా ప్రస్తుతం ఈ ఏడాదికి మినహాయింపు ఇస్తూ ఆర్డినెన్స్ రావడం వారికి శుభసూచకంగా మారింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించినదే అయినా వాటితో పాటు అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు పరీక్ష రాసిన వారి ఫలితాలు కూడా విడుదల కాలేదు. దీంతో శనివారం అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలు వెలువడనుండడంతో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. టాప్ టెన్ లో ఆరుగురు బాలికలు ఉన్నారు. టాపర్ల పేర్లు, మార్కులు, హాల్ టికెట్ల వివరాలు: 1 మాచాని హేమలత 156 (966490185) 2 యర్ల సాత్విక్ రెడ్డి 155 (975460062) 3 అమ్మకుల యజ్ఞప్రియ 153 (974440097) 4 చిట్లూరి నేహ 152 (960590122) 5 ఇక్రమ్ ఖాన్ 152 (974420323) 6 సాహితి 152 7 పెద్దిరెడ్ల శైజల 150 8 బలభద్ర గ్రీష్మ మీనన్ 150 9 గారం శివకుమార్ 150 10 కొండా సాయి ప్రతాప్ రెడ్డి 150 -
నేడు ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు
♦ ఉదయం 11 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్న సీఎం ♦ అభ్యర్థుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారానూ సమాచారం ♦ ‘నీట్’ వాయిదాతో ఊపిరిపీల్చుకున్న విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 మెడికల్, అగ్రికల్చర్ విభాగం ఫలితాలను శనివారం ప్రకటించనున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీటిని విడుదల చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు శుక్రవారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. నీట్‌ను వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్సు ఇవ్వడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ , వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, నరసింహారావు, సెట్ల అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి రఘునాథ్, ఆ శాఖాధికారులతో సమావేశమై చర్చించారు. ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాకినాడ జేఎన్టీయూ అధికారులతోనూ మాట్లాడారు. అనంతరం శనివారం ఉదయం 11 గంటలకు సీఎం చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు విలేకరులతో చెప్పారు. వచ్చే ఏడాదిలో నీట్‌కు వీలుగా రాష్ట్ర విద్యార్థులను సన్నద్ధం చేస్తామని, నిపుణులతో చర్చించి రాష్ట్ర సిలబస్‌లో సీబీఎస్ఈ తరహాలో మార్పులు, చేర్పులు చేయనున్నామని వివరించారు. కాగా, కృష్ణా జిల్లా కైకలూరులో మంత్రి కామినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ శనివారం విడుదల చేయనున్న ఎంసెట్ మెడికల్ ఫలితాలను అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారమివ్వనున్నట్లు చెప్పారు. ఫలితాలు సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో అందుబాటులో ఉంటాయి. ఉత్కంఠతో 98వేల మంది విద్యార్థులు నీట్ కారణంగా నిలిచిపోయిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఫలితాల విడుదలకు కొన్ని రోజులుగా విద్యార్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎంసెట్ అగ్రి, మెడికల్ విభాగం పరీక్షకు 1,03,222 మంది దరఖాస్తు చేయగా ఏప్రిల్ 29న జరిగిన పరీక్షకు 98,750 మంది హాజరయ్యారు. వీరిలో ఏపీలోని 13 జిల్లాల్లో 76,159 మంది, తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంలో జరిగిన పరీక్షకు 22,591 మంది ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించినదే అయినా వాటితో పాటు అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు పరీక్ష రాసిన వారి ఫలితాలు కూడా విడుదల కాలేదు. దీంతో శనివారం అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలు వెలువడనుండడంతో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌కు సంబంధించి 12 ప్రభుత్వ, 14 ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో 1,900, ప్రైవేటు కాలేజీల్లో 2వేలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ డెంటల్ కాలేజీలు 2 ఉండగా అందులో 140 సీట్లు, 12 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,160 సీట్లు ఉన్నాయని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. -
రేపు ఎంసెట్ మెడికల్ ఫలితాలు
హైదరాబాద్ : ఏపీ ఎంసెట్ మెడికల్ ఎంట్రెన్స్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నీట్ వాయిదా వేయడంతో ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలకు మార్గం సులబం కావడంతో రేపు ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫలితాలను విడుదల చేస్తారని ఆయన తెలిపారు. -
నేటి నుంచి ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు
వెబ్సైట్లో డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్/కాకినాడ: ఏపీ ఎంసెట్-2016 ఇంజనీరింగ్ ర్యాంకు కార్డులు సిద్ధమయ్యాయి. వీటిని అభ్యర్థులు గురువారం నుంచి ఈ నెల 24 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ ఇంజనీరింగ్ అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్జీ’ వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు వివరించారు. వీటిపై అభ్యంతరాలుంటే పరిశీలనకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రుసుమును ఏపీ ఆన్లైన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలన్నారు. దీనిపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశామని, తుది నిర్ణయం కమిటీదేనని కన్వీనర్ స్పష్టంచేశారు. ఇంటర్ ర్యాంకులు రాని వారు డిక్లరేషన్ ఇవ్వాలి రెగ్యులర్ ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఎవరికైనా ర్యాంక్ కేటాయించకపోతే వారు దరఖాస్తులో ఇంటర్ హాల్‌టిక్కెట్ సంఖ్యను తప్పుగా నమోదు చేసి ఉంటారని చెప్పారు. అలాంటి విద్యార్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు డౌన్లోడ్ చేసుకున్న డిక్లరేషన్ ఫారం పూరించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఎంసెట్ కార్యాలయంలో అందజేయాలని వివరించారు. ఇతర ఇంటర్మీడియట్ బోర్డుల అభ్యర్థులు ఫారం-డితో పాటు ఇంటర్ మార్కులు, మార్కుల ధ్రువపత్రంపై గెజిటెడ్ అధికారి సంతకంతో అందజేయాలని సూచించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్.. తెలుసుకోవాల్సినవెన్నో..
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్.. మే 27న నోటిఫికేషన్.. జూన్ 27 నాటికి క్లాసుల ప్రారంభం టీఎస్ ఎంసెట్.. మే 15న పరీక్ష.. జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్.. జూలై 1 నాటికి క్లాసుల ప్రారంభం.. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ సమాచారం మొత్తం సీట్లు: 1,57,074 ప్రభుత్వ కళాశాలలు: 17 ప్రైవేటు కాలేజ్‌లు: 305 కౌన్సెలింగ్ తేదీలు కౌన్సెలింగ్ ప్రకటన: మే 27, 2016 సర్టిఫికెట్ వెరిఫికేషన్: జూన్ 6 వెబ్ ఆప్షన్స్ నమోదు: జూన్ 9 నుంచి 18 వరకు సీట్ అలాట్మెంట్: జూన్ 22 క్లాసుల ప్రారంభం: జూన్ 27 టీఎస్ ఎంసెట్ ఇన్ఫో.. ఇంజనీరింగ్ దరఖాస్తులు: 1.43 లక్షలు ఎంసెట్ తేదీ: మే 15 ఫలితాలు: మే 27లోపు కౌన్సెలింగ్ నోటిఫికేషన్: జూన్ మొదటి వారం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ: జూన్ 20 నాటికి పూర్తి క్లాసుల ప్రారంభం: జూలై 1 నుంచి సీట్లు: గత ఏడాది గణాంకాల ప్రకారం మొత్తం సీట్లు 1,26,468. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని కళాశాలల గుర్తింపు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం.. మొత్తం 1,26,468 సీట్లకుగాను 20 వేల సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఇంజనీరింగ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ తేదీలు కూడా వెల్లడించారు.. మరోవైపు.. తెలంగాణ ఎంసెట్‌కు సర్వం సిద్ధమైంది. మే 15న టీఎస్ ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను సైతం ప్రకటించారు. ఇప్పుడు విద్యార్థుల కర్తవ్యం సరైన బ్రాంచ్, కాలేజ్ ఎంపిక. మెచ్చిన కాలేజీ, నచ్చిన బ్రాంచ్‌లో సీటు రాకుంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఔత్సాహికులకు సలహాలు.. సూచనలు.. తొలి ప్రాధాన్యం బ్రాంచ్ ఎంపిక విద్యార్థులు బ్రాంచ్ ఎంపికను తొలి ప్రాధాన్యంగా భావించాలి. తమ ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా వ్యవహరించాలి. క్రేజ్ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోకూడదు. ఆ బ్రాంచ్‌తో నాలుగేళ్లు చదవాలి. కాబట్టి ఆ కాలంలోనూ, తర్వాత ఆ బ్రాంచ్కుండే ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇష్టం లేని బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుంటే అకడమిక్‌గా రాణించలేకపోవచ్చు. కాలేజ్.. ఎంపికలో కీలక కసరత్తు ఏఐసీటీఈ నిబంధనలు కాలేజ్ ఎంపికలో ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకు అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? గుర్తించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్సైట్లో లభిస్తుంది. ప్రత్యక్షంగా కళాశాలలను పరిశీలించి కూడా సమాచారం తెలుసుకోవాలి. టీచింగ్ - లెర్నింగ్ కళాశాలలో బోధన పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలిస్తుంటాయి. ఎన్బీఏ గుర్తింపు ఎన్బీఏ గుర్తింపు బ్రాంచ్‌లా వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు మొత్తం బ్రాంచ్‌లలో ఒకట్రెండు బ్రాంచ్లకే ఎన్బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్బీఏ అక్రెడిటెడ్ అని వెబ్సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటన లిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థుల ఆదరణ గతేడాది సదరు కాలేజ్‌లో సీట్ల భర్తీ విషయంలో ఓపెనింగ్- క్లోజింగ్ ర్యాంకుల వివరాలు సేకరించాలి. ఉదాహరణకు ఓయూసీఈ, ఏయూసీఈ వంటి యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అదే విధంగా కొన్ని ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో ఈసీఈ, సీఎస్ఈ, ట్రిపుల్ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే.. ఆయా కళాశాలల పనితీరు ఆధారంగా అవి విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. నచ్చిన కాలేజ్ కోరుకున్న కళాశాలలో సీటు రాకపోవచ్చు. అలాంటి పరిస్థితికి కూడా ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. ఇష్టంలేని కాలేజ్‌లో చేరాల్సి వస్తే.. అకడమిక్‌గా రాణించేందుకు కృషిచేయాలి. సెల్ఫ్‌లెర్నింగ్ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా ఎంతో సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ-లెర్నింగ్ పోర్టల్స్, ఆన్లైన్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ లేబొరేటరీ వంటి సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు, అమలవుతున్న కరిక్యులంను పరిగణనలోకి తీసుకుంటే మెచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్‌లో సీటు వచ్చినా విద్యార్థులు క్లాస్ రూమ్‌లో నేర్చుకునేది 40 నుంచి 50 శాతం మధ్యలోనే. మిగతాదంతా వాస్తవ పరిస్థితుల ఆధారంగా స్వీయ లెర్నింగ్‌పై ఆధారపడి ఉంటోంది. మెచ్చిన బ్రాంచ్ ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా మెచ్చిన బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశం లేదనిపిస్తే.. ప్రత్యామ్నాయంగా సదరు బ్రాంచ్‌కు అనుబంధంగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్లవైపై దృష్టిసారించాలి. వీటి ద్వారా లభించే అవకాశాల గురించి తెలుసుకోవాలి. ప్లేస్‌మెంట్స్ ఇంజనీరింగ్‌లో చేరుతున్న ప్రతి విద్యార్థి ప్రధాన ఉద్దేశం భవిష్యత్‌లో మంచి అవకాశాలు అందుకోవడమే అనేది నిస్సందేహం. కాబట్టి కాలేజీని ఎంపిక చేసుకునే క్రమంలో.. సదరు కళాశాలలో గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్స్ గణాంకాలు పరిశీలించాలి. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి.. వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయో గమనించాలి. జేఎన్టీయూ పరిధిలోని కళాశాలల సంఖ్య, అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య పరంగా మరో పది రోజుల్లో స్పష్టత వస్తుంది. ఇప్పటికే 58 కళాశాలలకు వాటి ప్రమాణాలలేమి కారణంగా నోటీసులు ఇచ్చాం. కొన్ని కళాశాలలు బ్రాంచ్‌ల వారీగా క్లోజర్ దరఖాస్తు చేసుకున్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే గతేడాది కంటే కొంత మేర సీట్లు తగ్గుతాయి. - ప్రొఫెసర్.ఎన్.యాదయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ-హైదరాబాద్ ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు వెల్లడయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్‌లు, ఆ బ్రాంచ్‌ల బోధనలో పేరు గడించిన ఇన్స్టిట్యూట్ల గురించి అన్వేషణ సాగించాలి. తమ ర్యాంకు పరిధికి సదరు బ్రాంచ్‌లో గత ఏడాది సీటు లభించిన కాలేజ్‌ల వివరాలు తెలుసుకుని వాటిలో బెస్ట్ కాలేజ్‌లతో జాబితా రూపొందించుకుని సిద్ధంగా ఉండాలి. -ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబా, కన్వీనర్, ఏపీ ఎంసెట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్‌మెంట్స్ పరంగా కంపెనీలు కోరుకునే స్కిల్స్, విద్యార్థుల్లో వాటిని పెంపొందించేందుకు కొన్ని కళాశాలలు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ల పేరుతో స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణనిస్తున్నాయి. అప్పుడే అకడమిక్ నైపుణ్యాలతోపాటు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా అలవడతాయి. కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు విద్యార్హతల సర్టిఫికెట్లు కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ (ఫీజు రీయింబర్స్మెంట్ అర్హులు) ఎంసెట్ హాల్‌టికెట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ నివాస ధ్రువీకరణ పత్రం ప్రత్యామ్నాయాలెన్నో ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి లేకపోయినా.. బ్రాంచ్, కాలేజీ నచ్చినా నచ్చకున్నా ముందు బీటెక్‌లో చేరదాం.. ఆ తర్వాత ఆలోచిద్దాం..! అనే ధోరణి ఎంత మాత్రం సరికాదు అంటున్నారు నిపుణులు. మెచ్చిన బ్రాంచ్‌లో, నచ్చిన కాలేజ్‌లో సీటు రాకపోతే డిగ్రీ కోర్సులపై దృష్టిపెట్టొచ్చు. ఇవేకాకుండా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉండే ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీనే కావాలనుకునే విద్యార్థులు ఇటు బీఎస్సీ చేస్తూనే ఏఎంఐఈ, ఏఎంఐఈటీఈ వంటి ఇన్స్టిట్యూట్లలో మెంబర్షిప్ ద్వారా బీటెక్ తత్సమాన అర్హత గల సర్టిఫికెట్ సొంతం చేసుకోవచ్చు. ఐఐఎస్ఈఆర్ వంటి జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
ఏపీ ఇంజనీరింగ్ ఫలితాలే విడుదల
- బాలురే టాపర్లు.. టాప్ టెన్‌లో తెలంగాణ విద్యార్థులు - 27న అడ్మిషన్ల నోటిఫికేషన్.. జూన్ 27 నుంచి తరగతులు - సుప్రీం తీర్పుతో మెడిసిన్ ఫలితాలు నిలిపివేత సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సోమవారం రాత్రి ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ ఎంట్రన్స్‌కు సంబంధించిన నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంసెట్‌లోని ఇంజనీరింగ్ ఫలితాల వరకు మాత్రమే విడుదల చేసి.. మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను నిలిపివేసింది. సోమవారం పొద్దుపోయాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలలో టాప్ టెన్ ర్యాంకుల్లో బాలుర హవా కొనసాగింది. ఇంజనీరింగ్‌లో మొత్తం 1,89,246 మంది దరఖాస్తు చేయగా అందులో 1,79,465 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,31,580 మంది ర్యాంకులు సాధించారు. మొత్తం హాజరైన వారిలో 81.36 శాతం మంది ఇంజనీరింగ్ ప్రవేశాలకు అర్హత పొందగా అందులో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 82.67 శాతం మంది, బాలురు 80.05 శాతం మంది అర్హత సాధించారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంకు విశాఖ జిల్లాకు చెందిన సత్తి వంశీకృష్ణారెడ్డికి దక్కగా రెండో ర్యాంకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చప్పిడి లక్ష్మీనారాయణ సాధించాడు. ఈ ఫలితాల్లో ఏపీలోని జిల్లాల వారీగా చూస్తే.. కృష్ణా జిల్లా(78.37%) అగ్రస్థానంలో నిలవగా.. విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉంది. అయితే.. హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన విద్యార్థుల్లో 88.48 శాతం మంది అర్హత సాధించడం గమనార్హం. వెబ్సైట్లో ఓఎమ్మార్ షీట్లు ఎంసెట్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ఓఎమ్మార్ షీట్లను ఈనెల 17వ తేదీనుంచి 21వ తేదీవరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపర్చనున్నామని సాయిబాబు తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే పరిశీలించుకోవచ్చని, ఈనెల 25వ తేదీలోగా అభ్యంతరాలు తెలియచేయాలనుకొనే జనరల్ అభ్యర్థులు రూ. 5 వేలు, ఎస్సీఎస్టీ అభ్యర్థులు 2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. కాగా, ఎంసెట్‌లో మెడికల్ ఫలితాలు వాయిదా వేసినా అగ్రికల్చర్ అనుబంధ సబ్జెక్ట్ ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మరోవైపు మెడికల్ పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులు ఫలితాలు విడుదల కాకపోవడంతో నిరాశకు గురయ్యారు. ముఖ్యమైన తేదీలు.. మే 27న అడ్మిషన్లకు నోటిఫికేషన్ జూన్ 6న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూన్ 9 నుంచి 18 వరకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్ల నమోదు జూన్ 22న సీట్ల కేటాయింపు జూన్ 27వ తేదీనుంచి తరగతుల ప్రారంభం. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో టాప్ టెన్ ర్యాంకర్లు ర్యాంక్ అభ్యర్థి మార్కులు 1 సత్తి వంశీకృష్ణారెడ్డి 158 2 చప్పిడి లక్ష్మీనారాయణ 157 3 కొండా విఘ్నేష్ రెడ్డి 157 4 మూల్పూరు ప్రశాంత్ రెడ్డి 156 5 గంటా గౌతమ్ 156 6 దిగుమూర్తి చేతన్‌సాయి 155 7 తాళ్లూరి సాయితేజ 154 8 అబ్బే జెడ్ జార్జి 154 9 ఎస్.ఎస్. సాయి దినేష్ 154 10 ఎన్. జైకృష్ణ సాయివినయ్ 154 -
ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల
- విశాఖలో ఏపీ ఎంసెట్ 2016 ఫలితాలు విడుదల - ఇంజినీరింగ్ ఫలితాలు మాత్రమే విడుదల - సుప్రీంకోర్టు తీర్పుతో మెడిసిన్ ఫలితాలు నిలిపివేత - సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేశాకే మెడిసిన్ ఫలితాలు విడుదల - విశాఖలో విడుదల చేసిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం: జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేశారు. అయితే ఇంజినీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 'నీట్'పై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు నేపథ్యంలో ఫలితాలు విడుదలలో జాప్యం ఏర్పడినట్టు ఆయన చెప్పారు. సీడీల రూపంలో ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పుడు ఇంజినీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుతో మెడిసిన్ ఫలితాలను నిలిపివేసినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేశాకే మెడిసిన్ ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి గంటా తెలిపారు. ఈ ఫలితాలను ఏయూ వర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు విశాఖపట్నంలో విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులున్నారు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. ఎంసెట్ ఫలితాలను www.sakshieducation.com వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. -
'నీట్' తీర్పు తర్వాతే ఎంసెట్ ఫలితాలు: గంటా
విశాఖపట్నం: 'నీట్'పై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయం చేసిన తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. 'నీట్'పై తీర్పు కాపీని వెబ్ సైట్ లో పెడతామని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఎంసెట్ ఫలితాల విడుదలపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు మంత్రి వెల్లడించారు. ముందు ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల చేసి తర్వాత మెడికల్ రిజల్ట్ ఇవ్వాలని భావించామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర్పు ఇంకా రాకపోవడంతో ఫలితాల విడుదల ఆలస్యమైందని వివరించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, ఈ రోజు రాత్రికి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నేడు వీలుకాకుంటే రేపు ఉదయం ఫలితాలు విడుదల చేస్తామన్నారు. 'నీట్'పై స్పష్టత రాకుండా హడావుడిగా ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలనుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ ఎంసెట్ ఫలితాలపై సస్పెన్స్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలపై గందరగోళం నెలకొంది. 'నీట్'పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఎంసెట్ ఫలితాల విడుదలపై సందిగ్ధం ఏర్పడింది. ఫలితాలు విడుదల చేయాలా, వద్దా అనే దానిపై మంత్రులు, ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దానికి అనుగుణంగా ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయం చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఇంజినీరింగ్ ఫలితాలు ముందుగా విడుదల చేసిన తర్వాత మెడికల్ ఫలితాలు విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ఈ సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సివుంది. ఉన్నతాధికారులతో మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు సంప్రదింపులు జరుపుతున్నారు. -
నేడు ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు
విశాఖలో విడుదల చేయనున్న మంత్రులు బాలాజీచెరువు(కాకినాడ): జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులున్నారు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఏయూ వ ర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని, ప్రత్తిపాటి విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలకు, ఆర్టీసీకి కృత జ్ఞతలు తెలిపారు.ఫలితాలనుwww.apeamcet.org,ww.manabadi.co.in,www.vidyavision.com,www.kabconsultants.com,www.scholls9.com, www.sakshieducation.com వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చన్నారు -
రేపే ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు
బాలాజీచెరువు(కాకినాడ): జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఏయూ వర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని, ప్రత్తిపాటి విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలకు, ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలను "WWW.Apeamcet.org, www.sakshieducation.com, www.manabadi.co.in, www.vidyavision.com,www.kabconsultants.com, www.scholls9.com లలోతెలుసుకోవచ్చన్నారు. -
రేపు సాయంత్రం ఏపీ ఎంసెట్ ఫలితాలు
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ప్రవేశ పరీక్షా-2016 ఫలితాలను ఈనెల 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తొలుత 9న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని తెలపగా, నీట్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పును చెప్పనుండడంతో ఫలితాలను సాయంత్రం విడుదల చేస్తామని చెప్పారు. 10న ఉదయం విడుదల కానున్న టెన్త్ ఫలితాలు : పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 10న ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. విశాఖ ఆంధ్రా వర్సిటీ సెనెట్ హాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఏపీ ఎంసెట్ కీ అభ్యంతరాలపై 6న నిపుణుల కమిటీ భేటీ
9న విశాఖలో ఫలితాలు విడుదల కన్వీనర్ సాయిబాబు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు(ఎంసెట్)కు సంబంధించి ప్రాథమిక కీపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ఈ నెల 6న నిపుణుల కమిటీని సమావేశపర్చాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ప్రాథమిక కీపై ఇప్పటివరకు 12 అభ్యంతరాలు రాగా అందులో ఎక్కువ మెడికల్ విభాగానికి సంబంధించినవే. రానున్న రెండురోజుల్లో మరిన్ని అభ్యంతరాలు వచ్చే అవకాశాలున్నాయి. వీటన్నిటినీ నిపుణుల కమిటీ ముందుం చనున్నామని, వారిచ్చే సూచనలను అనుసరించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఈనెల 9న ఫైనల్ కీ, ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఈ ఫలితాలను విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారని వివరించారు. మెడికల్‌లో 23వ ప్రశ్నను డిలీట్ చేయాలి ఇలా ఉండగా ఎంసెట్ మెడికల్ ప్రశ్నపత్రంలోని 23వ ప్రశ్నలో ఒక పదం ఇంగ్లిష్ వెర్షన్లో ఒకరకంగా, తెలుగు వెర్షన్లో మరో రకంగానూ ఇచ్చారని, దీనివల్ల విద్యార్థులు సరైన సమాధానాన్ని గుర్తించడంలో సందిగ్ధతకు లోనయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ఎంసెట్ కన్వీనర్‌కు నివేదించారు. ఆ ప్రశ్నలో ఒక పదం 'nucleolides' అని ఇంగ్లిష్‌లో ఉండగా అదే ప్రశ్నను తెలుగు అనువాదంలో 'nucleotides' అని ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారని, కొంతమందికి నష్టం కలుగుతోందని వివరించారు. ఈ ప్రశ్నను తొలగించి ర్యాంకులు ప్రకటించాలని కన్వీనర్‌ను కోరారు. -
ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎంసెట్
♦ ఇంజనీరింగ్‌లో 94.84 శాతం ♦ అగ్రికల్చర్, మెడికల్‌లో 95.67 శాతం హాజరు సాక్షి, హైదరాబాద్/బాలాజీ చెరువు(కాకినాడ): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(ఏపీ ఎంసెట్-2016) శుక్రవారం ముగిసిందని ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌లో 94.84 శాత ం మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 95.67 శాతం మంది హాజరైనట్లు వివరించారు. తెలంగాణలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో అనూహ్య స్పం దన లభించింది. ఇంజనీరింగ్ విభాగానికి 1,89,232 మంది దరఖాస్తు చేయగా 1,79,462 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి 1,03,222 మంది దరఖాస్తు చేసుకోగా 98,750 మంది హాజరయ్యారు.కాకినాడ జేఎన్టీయూలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంజనీరింగ్ పరీక్షకు జీ2 సెట్ కోడ్‌ను విడుదల చేశారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి మంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. ఎంసెట్‌లో రెండు తప్పులు దొర్లాయి. ఇంజనీరింగ్ గణితంలో సెట్-బీలోని 31వ ప్రశ్నలో చిన్న తప్పు దొర్లింది. ప్రశ్నలో 2 అంకెకు బదులు ఇంగ్లీషు జెడ్‌ను ముద్రించడంతో ఇబ్బందులు ఎదురయ్యా యి. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో బోటనీలో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో సమాధానం లేదని నిపుణులు చెప్పారు. -
రేపే ఏపీ ఎంసెట్
బాలాజీచెరువు(కాకినాడ): ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించే ఏపీ ఎంసెట్-2016కు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 355 కేంద్రాల్లోనూ, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ 191 కేంద్రాల్లోను జరుగుతుందన్నారు. హైదరాబాద్ జోన్-ఎలో 12, జోన్-బిలో 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రూ. 10 వేల ఫైన్‌తో హాజరయ్యే 88 మందికి కాకినాడ జేఎన్టీయూలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. -
29న ఏపీ ఎంసెట్
* హాజరు కానున్న 25,094 మంది * నిమిషం ఆలస్యమైనా అనుమతించరు * ప్రాంతీయ సంచాలకుడు సుబ్రహ్మణ్యం వెల్లడి ఏయూక్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్‌కు విశాఖ రీజియన్ నుంచి 25,094 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ప్రాంతీయ సంచాలకుడు ఆచార్య టి.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 18,076 విద్యార్థులు, మెడికల్ విభాగంలో 7,518 విద్యార్థులు ఈ నెల 29న పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. విశాఖ రీజియన్ పరిధిలో 33 కేంద్రాలలో ఇంజినీరింగ్, 15 కేంద్రాలలో మెడికల్ ప్రవేశ పరీక్ష జరగనుందని తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. సమాధానాలను నలుపు, నీలం బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే గుర్తించాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్, ఆన్లైన్ దరఖాస్తు, బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే తీసుకురావాలని తెలిపారు. రిస్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురాకూడదని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలలో ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చేస్తోందని తెలియజేశారు. అభ్యర్థులకు ఉచిత బస్ సౌకర్యం మహారాణిపేట : ఈ నెల 29న ఆంధ్ర, వచ్చే నెల 2న తెలంగాణ ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జేసీ-2 డి.వెంకటరెడ్డి తెలిపారు. పరీక్ష ముందు రోజు, పరీక్ష రోజు బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లు చూపించి బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. -
ఏపీ ఎంసెట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నిమిషం లేటైనా నో ఎంట్రీ: కన్వీనర్ సాయిబాబు సాక్షి,హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్.సీహెచ్.సాయిబాబు తెలిపారు. గతంలో మాదిరిగానే పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని బుధవారం ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. పరీక్ష సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంజనీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెడిసిన్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి అన్ని రకాల ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్లతో పాటు ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా అనుమతించబోమని తెలిపారు. సందేహాల నివృత్తికి 0884-2340535, 2356255, 0884-23405459 (ఫ్యాక్స్), 18004256755(టోల్‌ఫ్రీ) నంబర్లను గానీ apeamcet2k16@gmail.com ద్వారా గానీ సంప్రదించాలని కన్వీనర్ సాయిబాబు సూచించారు. -
'ఇకపై ఆన్లైన్లో ఏపీ ఎంసెట్'
విజయవాడ : వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌ను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అన్ని సెట్లు ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన ఎంసెట్ సమన్వయకర్తలు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఎంసెట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 29 వ తేదీన ఎంసెట్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకూడదని ఆదేశించారు. ఈ పరీక్షకు చేతి గడియారాలకు అనుమతి లేని దృష్ట్యా ప్రతి కేంద్రంలో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద భద్రతపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. -
హైదరాబాద్‌లో 25 ఏపీ ఎంసెట్ కేంద్రాలు
సాక్షి, హైదరబాద్: ఏపీ ఎంసెట్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. గతంలో కన్నా ఈసారి రెట్టింపు సంఖ్యలో 44వేల మంది అభ్యర్థులు ఉస్మానియా (తెలంగాణ) వర్సిటీ పరిధి నుంచి ఏపీ ఎంసెట్‌కు దరఖాస్తు చేశారు. గతేడాది25వేల మంది మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. ఈసారి అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో పరీక్ష కేంద్రాల సంఖ్యను కూడా పెంచారు. తెలంగాణ నుంచి దరఖాస్తు చేసిన వారు పరీక్ష రాయడానికి హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, కూకట్పల్లి రీజనల్ కేంద్రాల పరిధిలో పరీక్ష కేంద్రాలను ఎంసెట్ నిర్వాహకులు ఖరారు చేశారు. ఆయా కేంద్రాలకు ఎంతమందిని విద్యార్థులను కేటాయించాలో కూడా నిర్ణయించారు. పరీక్ష కేంద్రాలివే: మెహిదీపట్నం రీజియన్ పరిధిలో భాస్కర ఇంజనీరింగ్ కాలేజీ, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (మొయినాబాద్), జేబీ ఇంజనీరింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ అండ్ టెక్నాలజీ (ఎన్కేపల్లి, మొయినాబాద్), కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (చిల్కూరు, మొయినాబాద్), విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హిమాయత్‌నగర్), ఆల్ హబీబ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (దామెరగిద్ద, చేవెళ్ల), జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ (షేక్‌పేట్, హైదరాబాద్), జి.పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (మెహిదీపట్నం), సెయింట్‌ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ (సంతోష్‌నగర్ కాలనీ, మెహిదీపట్నం), చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గండిపేట, రాజేంద్రన గర్), మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కోకాపేట్, రాజేంద్రనగర్). కూకట్పల్లి రీజియన్ పరిధిలో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (బాచుపల్లి, నిజాంపేట్), రిషి ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (జేఎన్టీయూ దగ్గర, నిజాంపేట్), డీఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (బౌరంపేట్, కుత్బుల్లాపూర్), డీఆర్కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ప్రగతి నగర్, బౌరంపేట్, కుత్బుల్లాపూర్), హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంటు (గౌడవెల్లి, మేడ్చల్), ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గండిమైసమ్మ క్రాస్‌రోడ్, కుత్బుల్లాపూర్), మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (దుండిగల్, కుత్బుల్లాపూర్), నరసింహారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంటు, మల్లారెడ్డి కాలేజ్ఆఫ్ ఇంజనీరింగ్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (మైసమ్మగుడ, దూలపల్లి), సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ (మైసమ్మగుడ, దూలపల్లి). -
ఏపీ ఎంసెట్‌కు నగరంలోనూ కేంద్రాలు
వెల్లడించిన సెట్ కన్వీనర్ సాయిబాబు సాక్షి, హైదరాబాద్ /బాలాజీచెరువు(కాకినాడ): ఏపీ ఎంసెట్‌కు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలు జోన్-ఏ పరిధిలో, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్ ప్రాంతాలను జోన్-బీ పరిధిలో ఉన్నాయని వివరించారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు సకల చర్యలు ఎంసెట్ నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన నిఘా పెడుతున్నట్లు వివరించారు. ఇంటర్మీడియెట్ హాల్ టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంసెట్ ఈమెయిల్ (apeamcet2k16@ gmail.com)కు ఈనెల 20వ తేదీలోగా పంపించాలని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ సంక్షిప్త సమాచారం అందించామన్నారు. హాల్ టికెట్ నంబర్‌ను సరిచేయించుకోకపోతే వారు ఎంసెట్ హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోలేరని వివరించారు. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు సవరణలకు అవకాశం ఆన్లైన్ దరఖాస్తుల్లో సమాచారం పొందుపర్చడంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ చెప్పారు. ఎంసెట్ హాల్ టికెట్లను ఏప్రిల్ 21 నుంచి 27వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884-2340535, 0884-2356255 నంబర్లలో సంప్రదించవచ్చని సాయిబాబు సూచించారు. -
ఏపీ ఎంసెట్‌కు 2,02,249 దరఖాస్తులు
బాలాజీచెరువు (కాకినాడ) : ఏపీ ఎంసెట్-2016కు ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలకు సంబంధించి ఇప్పటివరకూ 2,02,249 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ సీహెచ్.సాయిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్టును ఈ నెల 20వ తేదీలోగా ఎంసెట్ ఈ-మెయిల్‌కు పంపించాలన్నారు. మూడేళ్లుగా ఎంసెట్ రాస్తున్నవారి జాబితా తమవద్ద ఉందని, వారు పరీక్షకు ఎందుకు హాజరవుతున్నారన్న విషయంపై ఇంటెలిజెన్స్ విభాగంతో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. మే 2న జరిగే తెలంగాణ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884-2340535, 2356255 ఫోన్ నంబర్లలో సంప్రందించవచ్చని సాయిబాబు సూచించారు. -
ఏపీ ఎంసెట్‌కు హైదరాబాద్‌లో రీజినల్ సెంటర్లు
కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా) : ఏపీ ఎంసెట్-16కు సంబంధించి హైదరాబాద్‌లో రెండు రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కన్వీనర్ సీహెచ్ సాయిబాబు కాకినాడలో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెహదీపట్నం పరిసరాల్లో టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌస్, ఇబ్రహీంపట్నం, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి ప్రాంతాలను హైదరాబాద్ జోన్-ఎగా, చందానగర్, బీహెచ్ఈఎల్ , పటాన్చెరువు, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, ధూలపల్లి ప్రాంతాలను జోన్-బిగా కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కావాలనుకుంటే రీజినల్ సెంటర్లను మార్చి 2, 3, 4 తేదీల్లో మార్చుకోవాలని, ఆన్లైన్ దరఖాస్తుల్లో మార్పులకు ఏప్రిల్ 3 నుంచి 9 వరకూ అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు లక్షా పదివేల దరఖాస్తులు వచ్చాయన్నారు.