ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల | AP EAMCET -2016 medical results released by chandra babu | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల

Published Sat, May 21 2016 11:44 AM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల - Sakshi

ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల

హైదరాబాద్:  ఏపీ ఎంసెట్-2016 మెడికల్, అగ్రికల్చర్ విభాగం ఫలితాలను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.  విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ఫలితాలు విడుదలచేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నీట్‌ను వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్సు ఇవ్వడంతో ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలకు మార్గం సుగమమైంది. గత కొన్ని రోజులుగా నీట్ వివాదంపై తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతుండగా ప్రస్తుతం ఈ ఏడాదికి మినహాయింపు ఇస్తూ ఆర్డినెన్స్ రావడం వారికి శుభసూచకంగా మారింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించినదే అయినా వాటితో పాటు అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు పరీక్ష రాసిన వారి ఫలితాలు కూడా విడుదల కాలేదు. దీంతో శనివారం అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలు వెలువడనుండడంతో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. టాప్ టెన్ లో ఆరుగురు బాలికలు ఉన్నారు.

టాపర్ల పేర్లు, మార్కులు, హాల్ టికెట్ల వివరాలు:

1 మాచాని హేమలత 156 (966490185)
2 యర్ల సాత్విక్ రెడ్డి 155 (975460062)
3 అమ్మకుల యజ్ఞప్రియ 153 (974440097)
4 చిట్లూరి నేహ 152 (960590122)
5 ఇక్రమ్ ఖాన్ 152 (974420323)
6  సాహితి 152
7 పెద్దిరెడ్ల శైజల 150  
8 బలభద్ర గ్రీష్మ మీనన్ 150  
9 గారం శివకుమార్ 150  
10 కొండా సాయి ప్రతాప్ రెడ్డి 150
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement