మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి?
‘ఎక్స్’లో నిలదీసిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ఏటా డిసెంబర్ 21న అందచేసిన ట్యాబ్‌లను ఈ ఏడాది ఎందుకు ఇవ్వడం లేదో పిల్లలు, తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. ట్యాబ్‌లు ఇచి్చన సమయంలో పిల్లలతో తాను దిగిన ఫొటోను కూడా వైఎస్ జగన్ అటాచ్ చేశారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే....
ఏటా డిసెంబర్ 21న ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతికి వచ్చిన పిల్లలకు ట్యాబ్‌లు అందించి పిల్లల చదువులను వెన్నుతట్టి ప్రోత్సహించే కార్యక్రమం చేశాం. పేదింటి తలరాతలను మార్చే శక్తి చదువులకే ఉందని నమ్మి దృఢంగా అడుగులు వేశాం. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యారి్థ, వారి తల్లితండ్రులు ట్యాబ్స్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఆ చిన్నారులకు, తల్లితండ్రులకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబూ?..
మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి?
⇒ ప్రతి ఏటా రూ.15 వేల అమ్మ ఒడి ఏది?
⇒ ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఎక్కడ?
⇒ 3వ తరగతి నుంచే పిల్లలకు ‘టోఫెల్’ ఎక్కడ?
⇒ 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన ఎక్కడ?
⇒ ఐఎఫ్‌పీ ప్యానల్స్‌తో ఆరో తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూములతో బోధన ఎక్కడ?
⇒ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే నాడు నేడు పనులు ఎక్కడ?
⇒ రోజుకో మెనూతో గోరుముద్ద ఏది?
⇒ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఎక్కడ?
⇒ విద్యా దీవెన, వసతి దీవెన ఎక్కడ?
తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తానని మాయమాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు గారు.. 45 లక్షల మంది తల్లుల తరఫున అడుగుతున్నా... 84 లక్షల మంది పిల్లలకు సమాధానం చెప్పండి... మీ హామీ ఏమైంది? దగాపడ్డ లక్షల మంది తల్లులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మేం ఏటా జూన్‌లోనే ఇచి్చన అమ్మ ఒడిని ఈ ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు?
Comments
Please login to add a commentAdd a comment