సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనానంతరం తొలిసారిగా వేరుగా నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్‌కు అనూహ్యరీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అపరాధరుసుము లేకుండా చివరి తేదీ నాటికి 2,51,061 మంది దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌కు 1,66,901 మంది, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు 81,746 మంది, రెండింటికీ కలిపి 1,207 మంది దరఖాస్తులు అందజేశారు.
తెలంగాణ నుంచి 25,599 మంది
ఏపీ ఎంసెట్‌కు తెలంగాణ నుంచి 25,599 మంది దరఖాస్తు చేశారు. ఏపీ ఎంసెట్‌లో తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీని కూడా ఒక ప్రాంతంగా చేర్చి 15 శాతం కోటా అమలుకు చర్యలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేస్తే వారిని స్థానికేతరులుగా గుర్తించారు.
హైదరాబాద్‌లో 40 పరీక్ష కేంద్రాలు
తెలంగాణ ప్రాంతం నుంచి 25 వేల మందికి పైగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసినందున వారికోసం హైదరాబాద్‌లో 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 106 కేంద్రాలు కావాలని ఉన్నత విద్యామండలి టీ. ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో 40 కేంద్రాల్లో అందించేందుకు ఆ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఆ ప్రభుత్వం నుంచి అనుమతిపత్రం వచ్చిన వెంటనే కేంద్రాల ఏర్పాటును అధికారికంగా ప్రకటించన్నట్టు తెలిపాయి.
2.51 లక్షలు దాటిన ఎంసెట్ దరఖాస్తులు
Published Tue, Apr 14 2015 3:42 AM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM
Advertisement