ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు
బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్–17 పరీక్షకు అన్‌లైన్ దరఖాస్తు గడువు ఈ నెల 21వ తేదీ వరకూ పొడిగించినట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారంతో గడువు ముగిసిందని, విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువు పెంచామన్నారు, ఇప్పటి వరకూ అన్‌లైన్‌లో 2.54 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఉర్ధూ అనువాదం కావాలనుకునే అభ్యర్థులకు కర్నూలులో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
అన్‌లైన్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థికి హాల్‌టిక్కెట్‌లో కేటాయించిన సమయానికి పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించేందుకు మాక్‌టెస్టులు నిర్వహిస్తామని, గతంలో ఓఎంఆర్ షీటుపై జవాబులు దిద్దడానికి అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చునని కన్వీనర్ సాయిబాబు వివరించారు.