
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు ఏపీ ఉన్నత విద్యామండలి మరో అవకాశాన్ని కల్పించింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్ ఆన్‌లైన్ పరీక్షలకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 7వ తేదీ వరకూ గడువు పొడిగించింది. ఈ మేరకు సెట్స్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధీర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.