► కర్నూలు, నంద్యాలలో పరీక్ష
► నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కర్నూలు(జిల్లా పరిషత్) : ఏపీ ఎంసెట్-2015 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించే ఈ పరీక్షకు కర్నూలులో ఇంజనీరింగ్‌కు 12, మెడికల్‌కు 11, నంద్యాలలో ఇంజనీరింగ్‌కు 5, మెడిసిన్‌కు 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్/అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు కర్నూలు పట్టణ, నంద్యాల రీజనల్ కో-ఆర్డినేటర్లు డాక్టర్ వి. సతీష్‌కుమార్, డాక్టర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలులోని పరీక్ష కేంద్రాల్లో ఇంజనీరింగ్‌కు 7,526 మంది, మెడిసిన్‌కు 6,337 మంది, నంద్యాల పరీక్ష కేంద్రాల్లో ఇంజనీరింగ్‌కు 1,886, మెడిసిన్‌కు 552 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వారు వివరించారు.
కర్నూలులో పరీక్ష కేంద్రాలు
ఇంజనీరింగ్: 1, 2 కేంద్రాలు జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏ, బీ సెంటర్లు, మూడో కేంద్రం జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు, 4- మాంటిస్సోరి హైస్కూల్, ఎ.క్యాంపు, 5- ఉస్మానియా కళాశాల, 6- వాసవి మహిళా కళాశాల, పెద్దమార్కెట్, 7- సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లీష్ స్కూల్, సుంకేసుల రోడ్డు, 8- బృందావన్ ఇంజనీరింగ్ కళాశాల(బిట్స్), పెద్దటేకూరు, 9- సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాల, 10- కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 11- ప్రభుత్వ పురుషుల కళాశాల, బి.క్యాంపు, 12- సెయింట్ జోసఫ్ బాలికల జూనియర్ కళాశాల, ఆత్మకూరు రోడ్డు.
మెడిసిన్: 1, 2- జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏ,బీ సెంటర్లు, 3- జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు, 4- మాంటిస్సోరి హైస్కూల్, ఎ.క్యాంపు, 5- ఉస్మానియా కళాశాల, 6- వాసవి మహిళా కళాశాల, 7- సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ స్కూల్, సుంకేసుల రోడ్డు, 8- బృందావన్ ఇంజనీరింగ్ కళాశాల, 9- సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, 10. కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, 11- ప్రభుత్వ పురుషుల కళాశాల, బి.క్యాంపు.
నంద్యాలలో పరీక్ష కేంద్రాలు
ఇంజనీరింగ్: 1- పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల, 2- రామకృష్ణ డిగ్రీ కాలేజి, 3- డీఎస్సీ, కేవీఎస్‌సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 4- ఎస్‌పీవై రెడ్డి డిగ్రీ కళాశాల, 5- ఏవీఆర్ ఎస్‌వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ
మెడిసిన్: 1- ఈఎస్‌ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, 2- ఏవీఆర్ ఎస్‌వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజి.
ఉచిత బస్సు సౌక ర్యం
కర్నూలులోని జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, బృందావన్ ఇంజనీరింగ్ కళాశాలల వారు తమ కళాశాలలో పరీక్ష రాసే విద్యార్థుల కోసం కర్నూలు రాజవిహార్ సెంటర్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.
► విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రతిని పరీక్షకు తీసుకెళ్లాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అభ్యర్థి ఫొటో అతికించి దానిపై గెజిటెడ్ లేదా వారు చదివిన కళాశాల ప్రిన్సిపల్‌తో సంతకం చేయించుకోవాలి.
► ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించి తీసుకురావాలి
► అభ్యర్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
► పరీక్ష రాసేందుకు బ్లాక్/బ్లూ పాయింట్ బాల్ పెన్ మాత్రమే ఉపయోగించాలి
► ఓఎంఆర్ షీటుపై విద్యార్థి పేరు, హాల్‌టికెట్ నెంబర్, ఫొటోగ్రాఫ్ ప్రింట్ చేసి ఉంటాయి. అవి సరిగ్గా ఉన్నదీ లేనిది సరిచూసుకోవాలి. అది సరిగ్గా లేకపోయినా, ఓఎంఆర్ షీటు చిరిగి పోయి ఉన్నా వెంటనే ఇన్విజిలేటర్ సహాయంతో మార్చుకోవాలి.
► ప్రశ్నపత్రం ఇచ్చాక దానిపై ఉన్న బుక్‌లెట్ సంఖ్య, బుక్‌లెట్ కోడ్ ఓఎంఆర్ షీటుపై, నామినల్ రోల్‌పై నింపాలి. జాగ్రత్తగా చూసి నింపి తేడాలు లేకుండా చూడాలి
► కాపీయింగ్‌కు పాల్పడినా, సెల్‌ఫోన్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
రేపు ఏపీ ఎంసెట్
Published Thu, May 7 2015 3:15 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement