ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుందని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుందని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో మిగిలిన ఇంజనీరింగ్ సీట్లతో పాటు ఫార్మాడీ కోర్సులకూ ఈ విడతలో కేటాయింపు జరగనుంది. మొదటివిడతలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోని వారు ఈ నెల 23న ఆయా సేవా కేంద్రాల్లో పరిశీలన చేయించుకోవాలి.
ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్సు, ఎన్‌సీసీ, సీఏపీ, దివ్యాంగ అభ్యర్థులు విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సేవా కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలి. వెబ్ ఆప్షన ్ల నమోదు అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది. 24వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లకు గడువు ఉంది. 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థుల ఫోన్‌కు సంక్షిప్త సమాచార రూపంలో కేటాయింపు సీట్ల వివరాలు అందిస్తారు. ఇతర వివరాల కోసం ’హెచ్‌టీటీపీ://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కన్వీనర్ సూచించారు.