EAMCET counseling
-
వచ్చే నెలలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రెండో దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నవంబర్ మొదటి వారంలో నిర్వహించే వీలుందని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు తుది గడువు ఈ నెల 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. హైకోర్టు తీర్పుతో కొత్తగా వచ్చే కంప్యూటర్ సైన్స్ గ్రూపు సీట్లను రెండో కౌన్సెలింగ్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు తొలి విడత సీట్లు పొందిన విద్యార్థుల్లో కొంతమంది జాతీయ విద్యాసంస్థల్లోకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే సీట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అన్ని సీట్లు కలిపి 50 వేల వరకూ ఉంటాయి. వీటిల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 30 వరకూ సెల్ఫ్ రిపోరి్టంగ్ చేస్తారు. జేఎన్టీయూహెచ్ పీహెచ్డీ వెబ్ నోటిఫికేషన్ విడుదల కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): జేఎన్టీయూహెచ్ ఫుల్‌టైమ్ పీహెచ్డీ వెబ్ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి డాక్టోరియల్ ఫెలోషిప్ స్కీమ్‌లో భాగంగా అన్ని ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు గత ఐదేళ్ల కాలంలో నెట్, గేట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నిర్దేశిత ఫీజు, ధ్రువీకరణ పత్రాలు అడ్మిషన్ విభాగానికి పంపాలని అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట రమణారెడ్డి తెలిపారు. -
ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు ముగిసింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు శనివారం సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 14 యూనివర్సిటీ కాలేజీలు, 164 ప్రైవేటు కాలేజీల పరిధిలో 70,135 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా 50,137 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియలో కన్వీనర్ కోటాలో 71.49 శాతం సీట్లు భర్తీ కాగా, మరో 19,998 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 4,603 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చినా కూడా వారికి ఏ కాలేజీలోనూ సీటు రాలేదు. తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. తొలి విడత కౌన్సెలింగ్ సాగిందిలా.. ఎంసెట్–20 ఇంజనీరింగ్ స్ట్రీమ్ తొలి విడత కౌన్సెలింగ్ ఈనెల 12 నుంచి 22 వరకు జరిగింది. ఈనెల 20 వరకు సర్టిఫికెట్ల పరీశీలన చేయగా, 22 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంట్రీ చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 55,785 మంది హాజరు కాగా, 54,981 మంది విద్యార్థులు 25,20,770 ఆప్షన్లు ఎంట్రీ చేశారు. మొత్తం 50,288 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ఇంజనీరింగ్ కేటగిరీలో 50,137 సీట్లు, ఫార్మసీ కేటగిరీలో 151 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 23,806 సీట్లు ఖాళీగా ఉండగా, వీటిలో ఇంజనీరింగ్ కేటగిరీలో 19,998 సీట్లు, ఫార్మసీ కేటగిరీలో 3,808 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వర్సిటీ కాలేజీల్లో 98.1శాతం సీట్లు భర్తీ.. ఇంజనీరింగ్ కోర్సుల సీట్ల కేటాయింపులో యూనివర్సిటీ కాలేజీలు ముందు వరుసలో ఉన్నాయి. రాష్ట్రంలో 14 వర్సిటీ కాలేజీల్లో 3,151 ఇంజనీరింగ్ సీట్లుండగా, వీటిలో తొలి విడత కౌన్సెలింగ్‌లో 3,091 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ప్రస్తుతం 60 సీట్లు మిగిలిపోయాయి. 164 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 66,984 సీట్లకుగాను 47,046 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 70.23 శాతం సీట్లు కేటాయించగా, 19,938 సీట్లు మిగిలిపోయాయి. 13 యూనివర్సిటీ కాలేజీలు, 35 ప్రైవేటు కాలేజీల్లో వంద శాతం సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 3 కాలేజీల్లో ఒక్క సీటు కూడా విద్యార్థులకు కేటాయించకపోవడం గమనార్హం. ఫార్మసీ కాలేజీల్లో 4.02 శాతం కేటాయింపు.. ఫార్మసీ కాలేజీల్లో 4.02% సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీ కేటగిరీలో 119 కాలేజీల్లో 3,959 సీట్లకు 151 సీట్లు కేటాయించారు. 3,808 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 3 యూనివర్సిటీ కాలేజీల్లో 80 సీట్లు ఉండగా, 56 సీట్లు కేటాయించగా, 24 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 116 ప్రైవేటు కాలేజీల్లో 3,879 సీట్లకు గాను 95 సీట్లు కేటాయించారు. ఫార్మా–డీ కేటగిరీలో 56 ప్రైవేటు కాలేజీల్లో 546 సీట్లలో 30 కేటాయించారు. మిగతా 516 ఖాళీగా ఉన్నాయి. ఈ కోర్సుల్లో 100 శాతం కేటాయింపు.. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో పలు కోర్సు ల్లో నూరు శాతం సీట్లు కేటాయించారు. ఇందులో కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమాటిక్స్, మెకానికల్ (మెక్‌ట్రోనిక్స్), కంప్యూటర్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, అగ్రికల్చర్, ఫుడ్‌సైన్స్, డెయిరీయింగ్, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో వంద శాతం సీట్లు కేటాయించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాతే.. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో రిపోర్టు చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే కేటాయించిన సీటు రద్దవుతుంది. ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ తేదీలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అందులో పాల్గొనే విద్యార్థులు వెబ్సైట్ నుంచి వివరాలు పొందాలి. తొలివిడత కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని నిర్దేశించిన తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. -
నేటి నుంచి ఎంసెట్ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి జూలై 1 వరకు విద్యార్థులు ఆన్లైన్లో (tseamcet.nic.in)రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేసుకునేలా ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. అలాగే ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కాగా, ఫీజులు పెంచాలని ఆరు కాలేజీలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు రావడం, వాటిపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 27 నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలంటే కాలేజీల వారీగా ఫీజుల వివరాలను అందుబాటులో ఉంచా ల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈలోగా ఫీజుల వ్యవహా రంపై స్పష్టత వస్తే 27 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. లేదంటే కొంత ఆలస్యం కానుంది. ఎంచుకున్న సమయంలో వెరిఫికేషన్.. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్ణీత తేదీల్లో నిర్ణీత ర్యాంకుల వారు, వారికి కేటాయించిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో చేయించుకునే వారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. స్లాట్ బుకింగ్ ద్వారా తమకు సమీపంలో ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఎంచుకొని నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించింది. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు 27వ తేదీ నుంచి జూలై 3 వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ప్రతి గంటకు ఒక స్లాట్‌గా విభజించి వెరిఫికేషన్ చేయనున్న నేపథ్యంలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని నిర్ణీత తేదీలో నిర్ణీత సమయంలో తాము ఎంచుకున్న హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రవేశాల క్యాంపు కార్యాలయ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. లక్ష మంది హాజరు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం గత నెల 3, 4, 6 తేదీల్లో నిర్వహించిన ఎంసెట్ రాసేందుకు 1,42,216 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు. వాటి ఫలితాలను ఎంసెట్ కమిటీ ఈ నెల 9న విడుదల చేసింది. అందులో 1,08,213 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,989 మంది రిజిస్టర్ చేసు కోగా 68,550 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 63,758 మంది అర్హత సాధించారు. ఎంసెట్ అర్హత సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేలా (లేటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఈ నెల 24 నుంచి 26 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఈసెట్ ద్వారా 10,221 సీట్లను ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో కంప్యూటర్ సైన్స్‌లో 2,421 సీట్లు, ఈసీఈలో 2,291, మెకానికల్‌లో 1,398, ఈఈఈలో 1,183, సివిల్‌లో 1,154, ఫార్మసీలో 1,015 సీట్లు, ఐటీలో 530 సీట్లు, ఇతర విభాగాల్లో మిగతా సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఈసెట్ వెబ్ఆప్షన్లు కూడా 24వ తేదీ నుంచి 27 వరకు ఇచ్చుకునేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాలేజీల వారీగా వివరాలు చూసుకొని విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. -
రేపటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
ఖమ్మంకల్చరల్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం తొలిరోజు నుంచే ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ 28వ తేదీ నుంచి ప్రారంభమై.. అదేరోజు కళాశాలలు, సీట్ల కోసంవెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు పేర్కొంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కలుపుకొని సుమారు 5వేల మందికిపైగా విద్యార్థులు వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. షెడ్యూల్ ఇలా.. ఈనెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ అదేరోజు నుంచి జూన్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్థులకు సీట్లను జూన్ 8వ తేదీన కేటాయిస్తారు. ఫీజు చెల్లింపు, కళాశాలల్లో రిపోర్టింగ్ జూన్ 8వ తేదీ నుంచి 12వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. ర్యాంకులవారీగా... మే 28వ తేదీన ఒకటో ర్యాంకు నుంచి 10వేల ర్యాంకు, మే 29న 10,001వ ర్యాంకు నుంచి 25వేల ర్యాంకు, మే 30న 25,001వ ర్యాంకు నుంచి 40వేల ర్యాంకు, మే 31న 40,001వ ర్యాంకు నుంచి 54వేల ర్యాంకు, జూన్ 1న 54,001వ ర్యాంకు నుంచి 68వేల ర్యాంకు, జూన్ 2న 68,001 నుంచి 82వేల ర్యాంకు, జూన్ 3న 82,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు పొందిన విద్యార్థుల వరకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న రెండు కళాశాలల్లో కోఆర్డినేటర్లను నియమించారు. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితోపాటు అదనంగా మరికొందరు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించారు. సమర్పించాల్సిన పత్రాలు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆరు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఇంటర్ టీసీతో హాజరుకావాల్సి ఉంటుంది. పీహెచ్సీ, ఎన్సీసీ, సీఏపీ కోటాకు చెందిన విద్యార్థులు మాత్రం హైదరాబాద్‌లోని ఎస్వీ భవన్, మాసబ్ ట్యాంక్ ఏరియాలో జరిగే కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకావాల్సి ఉంటుంది. ఏర్పాట్లు పూర్తి చేశాం.. సోమవారం నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్లో రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పనిచేసిన అనుభవంతో ఎలాంటి అక్రమాలు, తప్పిదాలు జరగకుండా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తాం. కౌన్సెలింగ్ కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైనా విద్యార్థులు సహకరించాలి. – కె.సుదర్శన్‌రెడ్డి, ఖమ్మం జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్ -
చూడాలా... చేరాలా?
- ఎన్ఐటీ సీటు కోసం చూడాలా.. ఎంసెట్ సీటుతో కాలేజీలో చేరాలా! - ఈ నెల 30న ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి స్పెషల్ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీటొచ్చినందుకు సంతోషపడాలా? దాన్ని వదులుకొని ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో సీటు కోసం ఎదురుచూడాలా?.. ఎటూ తేల్చుకోలేక రాష్ట్రంలోని విద్యార్థులు సతమతమవుతున్నారు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థ ల్లో సీటు కోసం ఈనెల 30న జరిగే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు పాల్గొన వచ్చని సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) ఇటీవల ప్రకటించింది. మరోవైపు ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు ఈ నెల 29లోగా కాలేజీల్లో చేరాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీల్లో అందజేయాలని స్పష్టం చేసింది. కన్వీనర్ కోటా ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసినందున సర్టిఫికెట్లు ఇచ్చాక కాలేజీలు తిరిగి ఇవ్వవు. అవి లేకపోతే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీల్లో చేరే అవకాశం ఉండదు. దీంతో 30న జరిగే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 6,510 సీట్ల భర్తీకి చర్యలు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 6,510 సీట్లను భర్తీ చేయాలని సీఎస్ఏబీ (ఛిట్చb.nజీఛి.జీn) నినిర్ణయించింది. ఇందుకు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌ను ఈనెల 30న నిర్వ హిస్తామని ప్రకటించింది. అందులో ఎన్ఐటీల్లో 400కు పైగా, ట్రిపుల్ఐటీల్లో 2 వేల వరకు సీట్లున్నాయి. మిగతా సీట్లు సెంట్రల్ గవర్న మెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లో (జీఎఫ్‌టీఐ) ఉన్నట్లు వెల్లడించింది. వాటిల్లో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మంచి కాలేజీల్లో సీట్లు రాని విద్యార్థులు ఆ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్రంలో ఎంసెట్ చివరి దశ ప్రవేశాల్లో భాగంగా 22న సీట్ల కేటాయింపును ప్రకటించిన ప్రవేశాల కమిటీ.. 29లోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రకటించింది. దీంతో స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీటొస్తే.. పరిస్థితి ఏంటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర కాలేజీల్లో చేరే గడువును ఈనెల 30 వరకు పొడిగించాలని కోరుతున్నారు. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల షెడ్యూలు ఇదీ.. 29–7–2017 సాయంత్రం 4 గంటల వరకు ఫీజు చెల్లింపు 29–7–2017 రాత్రి 11:59 గంటల వరకు చాయిస్ ఫిల్లింగ్ (వెబ్ ఆప్షన్లు) 30–7–2017 మధ్యాహ్నం 2 గంటలకు సీట్ల కేటాయింపు 31–7–2017 నుంచి ఆగస్టు 2 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ -
8 నుంచి ‘ఎంసెట్’ ధ్రువపత్రాల పరిశీలన
సాక్షి అమరావతి: ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఎంపీసీ విభాగానికి గానూ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన వివరాలు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో ఉన్నాయి. దివ్యాంగులు, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్సు, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల అభ్యర్థులు మాత్రం విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కేంద్రంలో హాజరుకావాలి. వీరికి 8 నుంచి 15 వరకు పరిశీలన ఉంటుంది. ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీలకు జూన్ 8 నుంచి 17 వరకు ఉంటుంది కాగా ఎస్టీ అభ్యర్థుల పరిశీలనకు 13 కేంద్రాలు ఏర్పాటుచేశారు. -
23 నుంచి ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుందని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో మిగిలిన ఇంజనీరింగ్ సీట్లతో పాటు ఫార్మాడీ కోర్సులకూ ఈ విడతలో కేటాయింపు జరగనుంది. మొదటివిడతలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోని వారు ఈ నెల 23న ఆయా సేవా కేంద్రాల్లో పరిశీలన చేయించుకోవాలి. ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్సు, ఎన్సీసీ, సీఏపీ, దివ్యాంగ అభ్యర్థులు విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సేవా కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలి. వెబ్ ఆప్షన ్ల నమోదు అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది. 24వ తేదీ వరకు వెబ్ఆప్షన్లకు గడువు ఉంది. 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థుల ఫోన్‌కు సంక్షిప్త సమాచార రూపంలో కేటాయింపు సీట్ల వివరాలు అందిస్తారు. ఇతర వివరాల కోసం ’హెచ్‌టీటీపీ://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కన్వీనర్ సూచించారు. -
68,747కు చేరిన కన్వీనర్ కోటా సీట్లు
- మరో 19 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు - వాటిల్లోని నాలుగు కాలేజీలు జనరల్ కౌన్సెలింగ్ లోకి మిగతా వాటిల్లో మైనారిటీ కోటాలో భర్తీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల సంఖ్య పెరిగింది. ముందుగా ప్రకటించిన ప్రకారం కన్వీనర్ కోటాలో 65,379 సీట్లు అందుబాటులోకి రాగా, తాజాగా ఆ సంఖ్య 68,747కు చేరింది. హైకోర్టు ఆదేశాలతో మరో 19 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. దీంతో వాటిల్లోని కొన్ని కాలేజీలు జనరల్ కౌన్సెలింగ్ పరిధిలోకి వస్తుండటంతో 3 వేల సీట్లు అదనంగా వచ్చాయి. వాటిని ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెబ్ ఆప్షన్ల జాబితాలో చేర్చింది. విద్యార్థులు వాటిల్లోనూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మరోవైపు ఎంసెట్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్లో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొత్తగా మరిన్ని కాలేజీలు రావడంతో వెబ్ ఆప్షన్లను మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 13 కాలేజీల్లో ఫీజులు ఖరారు అనుబంధ గుర్తింపు లభించిన మిగతా కాలేజీలు మైనారిటీ కేటగిరీలో సొంతంగా ప్రవేశాలు చేపట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆయా కాలేజీల్లో లోపాలు ఉండటంతో జేఎన్టీయూహెచ్ మొదట వాటికి అనుబంధ గుర్తింపు నిరాకరించింది. దీంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా.. అనుబంధ గుర్తింపును మంజూరు చేసింది. మరోవైపు గురువారం 5 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం.. శుక్రవారం మరో 13 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా వచ్చిన కాలేజీల్లో షాదాన్కు రూ.38 వేలు, సయ్యద్ హస్మిమ్కు రూ.35 వేలు, ఖదీర్ మెమోరియల్ కాలేజీకి రూ.50 వేలు, మెదక్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు రూ.45 వేలు, రాయల్ ఇన్స్టిట్యూట్కు రూ.35 వేలు, షాదాన్ ఉమెన్స్ కాలేజీకి రూ.35 వేలు, నవాబ్ షా ఆలామ్ఖాన్ కాలేజీకి రూ.68 వేలు, శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీకి రూ.45 వేలు, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి రూ.35 వేలుగా నిర్ణయించింది. అలాగే షాదాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి రూ. 35 వేలు, షాదాన్ ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీకి రూ.35 వేలు, అన్వరుల్ ఉలుమ్ కాలేజీకి రూ.42 వేలు, అదే యాజమాన్యానికి చెందిన మరో కాలేజీకి రూ.70 వేలుగా ఫీజును నిర్ణయించింది. ఆప్షన్లు ఇచ్చుకున్నది 55,019 మంది ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 1 నుంచి 90 వేల ర్యాంకు వరకు విద్యార్థుల్లో 57,122 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, శుక్రవారం రాత్రి వరకు అందులో 55,019 మంది విద్యార్థులు 27,26,753 ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక 45,001 నుంచి 90 వేల ర్యాంకు లోపు విద్యార్థులు శనివారం ఉదయం 10 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. 90,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థులకు శుక్రవారం లాగిన్ ఐడీలను పంపించామని, వారు కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు. ఇప్పటివరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నవారు.. 9, 10 తేదీల్లో ఇచ్చే వారు మొత్తంగా 10, 11 తేదీల్లో వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. -
ముగిసిన ఎంసెట్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ -2016 వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన బుధవారంతో ముగిసింది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ఈ నెల ఆరో తేదీన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. చివరి ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి కాగా, ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఈనెల 18వ తేదీ వరకు సమయం ఉంది. అలాగే 19, 20 తేదీల్లో ఆప్షన్లు మార్చుకోవచ్చు. గతంతో పోల్చితే.. గత ఏడాదితో పోల్చుకుంటే జిల్లా నుంచి కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థుల సంఖ్య 192 తగ్గింది. గత ఏడాది మొదటి కౌన్సెలింగ్‌లో 3,017 మంది హాజరవ్వగా.. ఈసారి 2,825 మంది హాజరయ్యారు. ఎంసెట్ రాసిన, ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య పెరిగినప్పటికీ.. కౌన్సెలింగ్‌కు హాజరైన వారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఎంసెట్ రాసి ర్యాంకు సాధించిన వారిలో కొంతమంది డిగ్రీలో చేరేందుకు ఇష్టపడుతున్నట్టు తెలిసింది. అలాగే అనుకున్న బ్రాంచ్, కళాశాలల్లో సీటు రాకపోరుున వారు కూడా డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. దరఖాస్తుల చేసిన వారి వివరాలు ఈ ఏడాది జిల్లా నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 5,918 మంది దరఖాస్తు చేసుకోగా, 5328 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 3,954 మంది అర్హత సాధించారు. గతంతో పోల్చుకుంటే పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగింది. అయితే కౌన్సెలింగ్‌కు హాజరు మాత్రం తగ్గింది. 2013లో 4,196, 2014లో 4,850, 2015లో 4,711 మంది పరీక్ష రాశారు. కౌన్సె లింగ్‌కు హాజరైన వారి వివరాలు చూస్తే.. 2012లో 2,340, 2013లో 3,950 (పక్కా జిల్లాల విద్యార్థులు ఎక్కువగా హాజరయ్యారు), 2014లో 2,206, 2015 లో 3017, 2016లో 2,825 మంది హాజరయ్యూరు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో ప్రస్తుతం ఏడు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2,562 సీట్లు ఉన్నాయి. గత కొన్నేళ్ల నుంచి ప్రవేశాలు పరిశీలిస్తే 2012లో 3,628 సీట్లకు 1605, 2013లో 3,132 సీట్లకు 1599, 2014లో 3,014 సీట్లకు 1585 , 2015లో 2,688 సీట్లకు 1901 నిండాయి. అయితే జిల్లాలో కళాశాలలు 10 నుంచి ఏడుకు, సీట్లు 3,628 కన్వీనర్ సీట్ల నుంచి 2,562కు తగ్గాయి. ప్రస్తుతం జిల్లా విద్యార్థులు పక్క జిల్లాల కళాశాలకు ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ అడ్మిషన్లు కష్టం. ఏటా శత శాతం ప్రవేశాలు రెండు కళాశాలల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రవేశాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. -
22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి చౌటుప్పల్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోని అశోకా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాబ్ మేళాను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి, జూలై మొదటి వారంలో మొదటి విడత కౌన్సెంగ్ను, రెండో వారంలో రెండో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామన్నారు. ఆగష్టు 15వ తేదీ నుంచి కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విజిలెన్సు తనిఖీలు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఏఐసీటీఈ నిబంధనల మేరకు నడుపుతున్న కళాశాలలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ సమావేశంలో జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జగ్మోహన్దాస్, కళాశాల చైర్మన్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
రాత్రి 7.30కి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
నర్సీపట్నం: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం, అధికారులు ప్రకటనలు గుప్పించినా విద్యార్థులకు మాత్రం అవస్థలు తప్పలేదు. ప్రభుత్వ నిర్దేశించిన 9 గంటల సమయానికి విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఆన్లైన్లో సైట్ ఎంతకీ ఓపెన్ కాలేదు. పది గంటలకు ఓపెన్ అవుతుందని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ రావడంతో కౌన్సెలింగ్ సిబ్బంది కంప్యూటర్ల ముందు వేచి చేశారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం నుండి పడిగాపులు పడ్డారు. ఇక ఓపిక నశించి చాలా మంది ఇంటి ముఖం పడుతున్న తరుణంలో రాత్రి 7 గంటల తరువాత సైట్ ఓపెన్ అయింది. అధికారులు హడావుడిగా కౌన్సెలింగ్ ప్రారంభించారు. 1 నుండి 5 వేల ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉన్నా 15 మంది మాత్రమే నమోదు చేసుకోగలిగారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు అవస్థలు పడ్డారు. పట్టణానికి దూరంగా ఉండటం వలన భోజనం చేయడానికి కూడా వీలేకుండా పోయింది. మొదటి రోజు కౌన్సెలింగ్ నిర్వహించడంలో అధికారులు విఫలం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ రామచంద్రరావు మాట్లాడుతూ సర్వర్‌లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తిందన్నారు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
తిరుపతి, చిత్తూరులో హెల్ప్‌లైన్ సెంటర్లు తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. దీనికోసం జిల్లాలో మూడు హెల్ప్ లైన్ సెంటర్లను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఏర్పాటుచేశారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బాలాజీ కాలనీలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, చిత్తూరులో పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు ఆయా తేదీల్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో 1 నుంచి 2,500, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల్లో 2,501 నుంచి 5వేల ర్యాంకు వరకు, చిత్తూరులోని పీకీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో 1 నుంచి 5వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. జిల్లాలోని ఎస్టీ విద్యార్థులు మాత్రం ఆయా తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేని విద్యార్థులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డును వెంట తీసుకురావాలి. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
► జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలు సిద్ధం ► నేడు ఒకటో ర్యాంకు నుంచి 5 వేల ► ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించేందుకు నిర్ధేశించిన ఏపీ ఎంసెట్-2016 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలను సిద్ధం చేశారు. గుంటూరు నగర పరిధిలో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 15వ తేదీ వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. కౌన్సెలింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే సోమవారం మాత్రం కౌన్సెలింగ్ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 18 వరకూ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఎస్టీ విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్‌లో హాజరు కావాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు వెంట తీసుకెళ్లాల్సిన ధ్రువీకరణ పత్రాలు.. ఎంసెట్-2016 ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఇంటర్ మార్కుల జాబితా, పాస్ సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ స్టడీ సర్టిఫికెట్, టెన్త్ లేదా తత్సమాన అర్హత పరీక్ష మెమో, రెసిడెన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, దివ్యాంగులు, ఇతర కేటగిరీలకు చెందిన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను చూపాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం చూపితేనే ఫీజుల చెల్లింపు ఫీజు రీయింబర్స్మెంట్ పొందగోరు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని విధిగా తీసుకెళ్లాలి. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు కలిగిన ఓసీ, బీసీలు, రూ.2 లక్షలకు మించని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆయా సర్టిఫికెట్ల రెండు సెట్ల జెరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించిన తరువాత ఒక సెట్ జెరాక్స్ కాపీలను తీసుకుని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను తిరిగి విద్యార్థులు ఇచ్చేస్తారు. ప్రత్యేక విభాగాలకు విజయవాడలో.. దివ్యాంగులు, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హాజరవ్వాలి. నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఒకటో ర్యాంకు నుంచి 1,200 ర్యాంకు వరకూ, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1,201 ర్యాంకు నుంచి 2,400 ర్యాంకు వరకూ, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2,401 ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 3,701 ర్యాంకు నుంచి 5,000 ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరుకావాలి. -
ఐసెట్‌లో 95.55 శాతం ఉత్తీర్ణత
- ఫలితాలు విడుదల చేసిన కేయూ వీసీ చిరంజీవులు - రాష్ట్ర విద్యార్థులకు టాప్-10లో 7 ర్యాంకులు - రెండో ర్యాంకు సాధించిన మహారాష్ట్ర విద్యార్థి - 3 నుంచి వెబ్సైట్లో ర్యాంకు కార్డులు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 19న నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2016 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కాకతీయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ టి.చిరంజీవులు మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. 95.55 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు. 72,474 మంది విద్యార్థులు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా, 66,510 మంది పరీక్షకు హాజరయ్యారని, అందులో 63,549 మంది అర్హత సాధించారని తెలిపారు. 154 మార్కులతో కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన విద్యార్థి గాజుల వరుణ్ మొదటి ర్యాంకు సాధించినట్లు వివరించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన విద్యార్థి వివేక్ విశ్వనాథన్ అయ్యర్ రెండో ర్యాంకు సాధించాడు. ఫైనల్ కీని వెబ్సైట్లో (www.tsicet.org)అందుబాటులో ఉంచినట్లు చిరంజీవులు తెలిపారు. విద్యార్థులు జూన్ 3 నుంచి ర్యాంకు కార్డులను వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ తర్వాత ఐసెట్ కౌన్సెలింగ్ రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ తరువాత ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని, ప్రవేశాల షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేస్తుందని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ తెలిపారు. గతేడాది లెక్కల ప్రకారం రాష్ట్రంలో 347 కాలేజీలు ఉండగా, వాటిలో 41,796 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అందులో 49 ఎంసీఏ కాలేజీల్లో 2,966 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అయితే గతేడాది వాటిలో 60 నుంచి 70 సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు పేర్కొన్నారు. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ తర్వాతే ఎన్ని కాలేజీలు, ఎన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయన్నది తేలుతుందని చెప్పారు. ఎంసీఏ కోర్సుకు ఆదరణ కరువైన నేపథ్యంలో ఎంబీఏలో ప్రవేశాల కోసమే పరీక్ష నిర్వహించే అంశాన్ని ఉన్నత విద్యా మండలి ఆలోచిస్తోందని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. -
కొత్త బంగారులోకం
జాగ్రత్తలు అవశ్యం మంచి స్నేహమే ఉత్తమ మార్గం సానుకూల దృక్పథం అవసరం ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకాలజిస్టుల సలహా ఇంటర్ పూర్తవగానే భవిష్యత్తుపై కొత్త ఆశలు ఇంజినీరింగ్ వైపు నడిపిస్తాయి. ఇంజినీరింగ్ అంటేనే కొత్త ప్రపంచం. ఎంసెట్ కౌన్సెలింగ్ అనంతరం విద్యార్థులు ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్‌లో అడుగుపెట్టారు.. మునుపెన్నడూ లేని చదువులు.. కొత్త వాతావరణం.. విభిన్న మనస్తత్వాల మధ్య కొత్త స్నేహాలు. అందరితో కలిసి నాలుగేళ్లు సాగాలి. ప్రతి అంశం పట్లా జాగ్రత్తగా మెలిగితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. దూకుడు మీదున్న వయసు ఎన్నో రకాలుగా ప్రేరేపిస్తుంది. ఫలితంగా దురలవాట్లు. ర్యాగింగ్, మానసిక ఒత్తిడి.. ఇలాంటి వాటికి లొంగకుండా నడుచుకోవాలి. వీటిపై తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు కన్నేసి ఉంచాలి. వీటన్నింటిపైనా అవగాహన కల్పించడం కోసం ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో నైపుణ్యాలే అదనపు అర్హతలు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువొక్కటే సరిపోదు. నైపుణ్యాలు, కమ్యూనికేషన్, పాఠ్యాంశాలపై విషయ పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం తప్పనిసరి. ఈ నాలుగేళ్లలో సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి. మనం ఏ విషయంలో ఇంకా మెరుగు పడాలో గుర్తించి దానికి అధిక సమయం కేటాయించాలి. దేశవ్యాప్తంగా ఏటా ఏడు లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంటున్నారు. ఇందులో కేవలం 15 శాతం మందినే ఉద్యోగాలు వరిస్తున్నాయి. 85 శాతం మార్కులు సాధించినా నైపుణ్యాలు లేక ఉద్యోగం దక్కడం గగనమై పోయింది. నిరంతరం సాధన చేస్తేనే ఈ అవరోధాన్ని దాటడం కష్టం కాదని విద్యార్థులు గుర్తించాలి. భాష, వ్యాకరణ దోషాలు కూడా ప్రధాన అడ్డంకిగా మారాయి. ఈ నాలుగే ళ్లలో వీటిని సవరించుకుంటే విజయానికి దగ్గరైనట్లే. సానుకూల దృక్పథం అలవర్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. కఠిన శిక్షలు తప్పవు.. విద్యార్థులు తమ భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకోవద్దు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ చాలామందికి శిక్ష లు పడ్డాయి. ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. ర్యాగింగ్ చేసినట్లు గుర్తిస్తే.. తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. తరగతుల నుంచి బహిష్కరించడం, కళాశాలలో అడ్మిషన్ రద్దు చేయడం, పరీక్షలకు అనుమతించక పోవడం, ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టడం తదితర శిక్షలు ఉంటాయి. ర్యాగింగ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాలల యాజమాన్యాలపై కూడా చర్యలు తప్పవు. అనుబంధ గుర్తింపు రద్దు వంటి తీవ్ర చర్యలు ఉంటాయి. - స్వాతిలక్రా, అదనపు పోలీస్ కమిషనర్ (సిట్ అండ్ క్రైమ్) ఇలా చేస్తే మేలు.. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలి. సబ్జెక్ట్ అర్థం కాకున్నా వినడం ద్వారా కొంతైనా అవగతమవుతుంది. బుర్రకెక్కని విషయాలను అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలి. అంతేగాక తోటివారితో చర్చిస్తే కూడా తొందరగా అర్థమవుతుంది. అంత సులువుగా మర్చిపోరు. స్నేహం మంచిదే కానీ.. సీనియర్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటూ తోటివారితో చనువుగా మెలగాలి. ఆనందంతో పాటు బాధలను పంచుకునే స్నేహానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. చేసే ఏ పనికైనా మంచి.. చెడుని విశ్లేషించి అడుగేయాలి. ఇంజినీరింగ్‌లోనే అధిక మంది విద్యార్థులు దురలవాట్ల బారిన పడుతున్నారని సర్వే చెబుతోంది. మొబైల్, చాటింగ్, వాట్సప్, ఫేస్బుక్ తదితర సోషల్ వెబ్సైట్లకు వీలైనంత తక్కువ సమయం కేటాయించాలి. మొదటి నుంచే వీటి వాడకాన్ని నియంత్రించుకోవడం ఉత్తమం. మానసిక నిపుణుల మాట.. ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. కళాశాల పరిస్థితులు, తోటివారి న డవడిక, సీనియర్ల కదలికలపై దృష్టి సారించాలి. ఒంటరితనం వద్దు. నలుగురి మధ్య అధికంగా ఉండడానికి ప్రయత్నించండి. ఖాళీ సమయాన్ని లైబ్రరీకి కేటాయించాలి. పుకార్లను నమ్మొద్దు. చూసి, విన్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. సీనియర్లు అందరూ చెడ్డవారు కాదన్న భావనతో ఉండాలి. అయితే, ఎవరు మంచో.. చెడో నిశితంగా పరిశీలించాలి. చెడు స్నేహాన్ని దూరంగా పెట్టండి. అప్పుడప్పుడు ఆటలూ ఉండాలి. తల్లిదండ్రులకు సలహాలివి.. కళాశాల నుంచి రాగానే పిల్లలతో కచ్చితంగా మాడ్లాడాలి. ఆ రోజు విషయాలు ఏంటో తెలుసుకోవాలి. ఒత్తిడి ఫీలైతే అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అవసరమైతే సలహాలివ్వాలి. వారి అభిరుచులకు పిల్లలు కొంత సమయం వెచ్చించేలా వీలు కల్పించాలి. ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం పొందుతారు. ప్రవర్తన, నడవడిక, మాట తీరును ఎప్పటికప్పుడు గమనించాలి. తేడా గమనిస్తే దగ్గరకు తీసుకుని వివరాలు అడగండి. తల్లిదండ్రులతో మొదలవ్వాలి.. యువతకు అతివేగం మీదున్న మోజు వారి ప్రాణాలను మింగేస్తుందన్న వాస్తవాన్ని విద్యార్థులు గుర్తించడం లేదు. ఈ క్రమంలో ఎదుటివారూ ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, రాష్ రైడ్ వల్ల కలిగే నష్టాలపై మొదట తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలి. ఇంటి నుంచి ఎలా వెళ్తున్నారో.. తిరిగి సురక్షితంగా ఎలా రావాలో మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. మా బాధ్యతగా విద్యార్థులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో యాజమన్యాలు భాగమవ్వాలి. - దివ్య చరణ్‌రావు, అదనపు డీసీపీ (ట్రాఫిక్ -2), సైబరాబాద్ కౌన్సిలింగ్ తప్పనిసరి.. కళాశాల వాతావరణానికి విద్యార్థులు అలవాటు పడేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. ఈ సమయంలో చదువు కంటే.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ర్యాగింగ్ చేస్తారన్న భయంతో చాలా మంది విద్యార్థులు కాలేజీల్లో అడుగు పెడుతున్నారు. ఇతర విద్యార్థుల నుంచి సంజ్ఞలు, చూపులు ఎదురైనా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటివారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రతి 100 మంది విద్యార్థుల్లో 15 నుంచి 20 శాతం సున్నిత మనస్తత్వ వ్యక్తులు ఉంటారు. ర్యాగింగ్‌పై ఫిర్యాదులను యాజమాన్యాలు నేరుగానే కాకుండా మెయిల్, బాక్స్ పద్ధతి ద్వారా అందేలా చూడాలి. విషయాన్ని నమ్మకమైన స్నేహితులకు, తల్లిదండ్రులకు చెప్పాలి. - డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సైక్రియాటిస్ట్ (మెడిసిటీ) -
‘ఎంసెట్ కౌన్సెలింగ్ చేపట్టాలి’
హైదరాబాద్: ప్రభుత్వం సోమవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తిచేశారు. కౌన్సెలింగ్ ఇప్పటికి 3 సార్లు వాయిదాపడిందని, దానిని ప్రారంభించకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. శనివారం సచివాలయంలో కడియంను శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాసరావు, గుడుగు భాస్కర్, బి.రాజుగౌడ్, సింగం నగేష్, జూకంటి ప్రవీణ్, పి.లింగం కడియంకు వినతిపత్రాన్ని సమర్పించారు. -
వారు బీసీలకు చెందినవారే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి తమ కులాలను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించిన వారికి ఊరట లభించింది. బీసీ కులాల నుంచి తొలగింపునకు గురైన కులాలకు చెందిన విద్యార్థులను బీసీలుగా పరిగణించాలని సోమవారం స్పష్టం చేసింది. తొలగింపునకు గురైన కులాల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరైతే వారిని బీసీలుగా పరిగణించాలని, కొత్త ధ్రువీకరణ పత్రాల కోసం ఒత్తిడి తీసుకురావొద్దని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేశారు. రాష్ట్రంలోని బీసీ కులాల జాబితా నుంచి 26 కులాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై గత వారం రోజులుగా విచారణ జరుగుతోంది. బీసీ కమిషన్ సిఫారసులు లేకపోయినా ప్రభుత్వం తమ కులాలను బీసీల జాబితా నుంచి తొలగించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ లేదని, ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వం తమను బీసీ కులాల జాబితా నుంచి తొలగించిందని వాపోయారు. తమ పిల్లలు ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుంటున్నారని, ఇన్నేళ్లు వారు బీసీలుగా కొనసాగుతూ వచ్చారని, ఇప్పుడు ప్రభుత్వ ఏక పక్ష చర్యల వల్ల వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 112 కులాలే ఉన్నట్లు బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి స్పష్టం చేశారని, దీంతో 26 కులాలను బీసీ కులాల జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ కోర్టుకు నివేదించారు. -
ముగిసిన ఎంసెట్ కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగావిద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. ఈనెల 12 నుంచి తొమ్మిది రోజుల పాటు కొనసాగిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధి లో మొత్తం 11,500మంది విద్యార్థులు హాజరయ్యారు. శుక్రవారం వరకూ జిల్లా లో 10,181 మంది విద్యార్థులు హాజరు కాగా, శనివారం 612మంది హాజరయ్యా రు. మొత్తం తొమ్మిది రోజులు కలిపి 10,793 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 1,27,501 ర్యాంకు నుంచి ఆపై చివరి ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆన్లైన్లో ఆప్ష న్లు నమోదు చేసుకునేందుకు తుది గడు వు ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు వాటిని మార్చుకుని తాజాగా ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈనెల 22,23 తేదీ ల్లో వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. జిల్లాలోని 46 ఇంజినీరింగ్ కళాశాలల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 26న సీటు అలాట్మెంట్ తరువాత జిల్లాలోని కళాశాలల్లో బ్రాంచ్‌ల వారీగా భర్తీ అయిన సీట్ల వివరాలపై స్పష్టత రానుంది. -
నేటితో ముగియనున్న ఎంసెట్ కౌన్సెలింగ్
నేడు 1,20,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు పరిశీలన గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ర్యాంకులు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగియనుంది. శుక్రవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధిలో 1,504 మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాలలను ఎంచుకునేందుకు 134 మంది విద్యార్థులు హాజరయ్యారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 363 మంది, వెబ్ కౌన్సెలింగ్‌కు 33 మంది, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 343 మంది, వెబ్ కౌన్సెలింగ్‌కు 35 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 306 మంది, వెబ్ కౌన్సెలింగ్‌కు 24 మంది, ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలనకు 492 మంది, వెబ్ కౌన్సెలింగ్‌కు 42 మంది హాజరయ్యారు. నేటి కౌన్సెలింగ్ శనివారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 1,20,001 ర్యాంకు నుంచి 1,22,500 వరకు, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1,22,501 ర్యాంకు నుంచి 1,25,500 వరకు, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 1,25,501 ర్యాంకు నుంచి 1,27,500 వరకు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 1,27,501 ర్యాంకు నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి. 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు శని, ఆదివారాల్లో కళాశాలల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళుతూ మృత్యు ఒడిలోకి..
కలవచర్ల (నిడదవోలు): ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళుతూ ఓ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన నిడదవోలు మండలంలోని కలవచర్ల గ్రామ శివారున ఉన్న పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన సత్తి నాగదుర్గ శాంతికుమార్ (22) ఇంటర్మీడియెట్ పూర్తిచేశాడు. కాకినాడలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళ్లేందుకు ఉదయం తన స్నేహితుడు బండారు సారుు నరేంద్రతో కలిసి మోటార్‌సైకిల్‌పై బయలుదేరాడు. కలవచర్ల శివారును ఉన్న బంకు వద్ద పెట్రోల్ పోరుుంచుకుని నిడదవోలు వైపుగా బంకులో నుంచి బయటకు వస్తున్నాడు. అదే సమయంలో నిడదవోలు నుంచి పెరవలి మండలం ఖండవల్లివైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో మోటార్‌సైకిల్ ఎగిరిపడగా నాగదుర్గ శాంతి కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున బండారు సాయినరేంద్ర స్వల్పగాయూలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. నిడదవోలు రైల్వేస్టేషన్ వరకూ మోటార్ సైకిల్‌పై వచ్చి అక్కడి నుంచి రైలులో కాకినాడ వెళ్దామని వీరు అనుకున్నారు. తమతో సరదాగా మాట్లాడిన శాంతికుమార్ కొద్దిక్షణాల్లోనే దుర్మరణం పాలవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని బంకు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కానూరుకు చెందిన సత్తి సత్యనారాయణ, మంగతాయారు దంపతులకు ముగ్గురు కుమారులలో నాగదుర్గ శాంతి కుమార్ పెద్దవాడు. చిన్నతనంలోనే తం డ్రి సత్యనారాయణ మరణించడంతో శాంతికుమార్ కానూరులో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నం టారుు. నిడదవోలు రూరల్ ఎస్సై నరేంద్రకుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుని మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం
హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి నేడు ఒకటి నుంచి 15 వేల ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన 14 నుంచి వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కేంద్రాల పరిధిలో శుక్రవారం ఒకటో ర్యాంకు నుంచి 15 వేల ర్యాంకు వరకు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 14 నుంచి వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. నూతన విధానం అమలు.. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ ఏడాది నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని కళాశాలలను ఎంచుకునేందుకు ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలో హెల్ప్‌లైన్ కేంద్రంలో ఇచ్చే పాస్‌వర్డ్‌ను విద్యార్థులు భద్ర పరచుకోవాలి. సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థి సంబంధిత కళాశాలకు వెళ్లి రిపోర్టు చేయాల్సిన విధానం గత ఏడాది వరకు ఉండేది. తాజా మార్పుల ప్రకారం సీట్ అలాట్మెంట్ అయ్యాక విద్యార్థి కోరుకున్న కళాశాలలో సీటు రాని పక్షంలో తనకు ఇచ్చిన పాస్వర్డ్ ఆధారంగా ఆన్లైన్లో పూరించే వివరాల్లో ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ రైట్ మార్క్ వేస్తే సరిపోతుంది. దీంతో తదుపరి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. ఇందుకోసం వెబ్ కౌన్సెలింగ్ సమయంలో ఇచ్చే పాస్‌వర్డ్‌ను విద్యార్థులు అత్యంత గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది. నేటి కౌన్సెలింగ్ ఇలా.. గుంటూరు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటో ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకు, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3,701 ర్యాంకు నుంచి 7,500 ర్యాంకు వరకు, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 7,501 ర్యాంకు నుంచి 11,200 ర్యాంకు వరకు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 11,201 ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు హాజరుకావాలి. ఎస్టీ విభాగ విద్యార్థులు తమ సర్టిఫికెట్ల పరిశీలనకు గుంటూరులో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాల్సి ఉంది. ఏఎన్‌యూలో.. ఏఎన్‌యూ: ఏఎన్‌యూ ఆన్లైన్ సెంటర్లో ఎంసెట్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏఎన్‌యూ ఆన్లైన్ కౌన్సెలింగ్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సింహాచలం, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. రామచంద్రన్‌లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ఓపెన్, బీసీ కేటగిరీల అభ్యర్థులు 900 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారు 450 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియెట్ ఒరిజినల్ మార్కుల జాబితాలు, ఆరు నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హత ఉన్నవారు ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్ కార్డు , అన్ని పత్రాల ఒక సెట్ జిరాక్సు కాపీలను తప్పకుండా తెచ్చుకోవాలని సూచించారు. -
నేటినుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
ఏలూరు సిటీ : ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే ఎంసెట్-15 అభ్యర్థులకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏలూరులో సెయింట్ థెరిస్సా మహిళ స్వయం ప్రతిపత్తి కళాశాల, భీమవరంలో ఎస్‌ఎంటీబీ సీతా పాలిటెక్నిక్ కళాశాల, తణుకులోని ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లతో ఆయా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎస్టీ అభ్యర్థులు మాత్రం తణుకులోని హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లాలి. శుక్రవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. 14నుంచి విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకుని అప్షన్లు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు విధిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల ఫొటోస్టాట్ కాపీలు తీసుకెళ్లాలి. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్టు, హాల్‌టికెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ మార్కుల సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, నివాస, ఆదాయ, అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డుతో హాజరుకావాలి. సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్ ఇలా ఈనెల 12న 1నుంచి 15వేల ర్యాంకు వరకు, 13న 15,001నుంచి 30 వేల వరకు, 14న 30,001నుంచి 45000 వరకు, 15న 45,001నుంచి 60వేల వరకు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఈనెల 16న 60,001 నుంచి 75 వేల వరకు, 17న 75,001నుంచి 90వేల వరకు, 18న 90,001నుంచి 1,05,000వరకు, 19న 1,05,001నుంచి 1,20,000వరకు, 20న 1,20,001 నుంచి చివరి ర్యాంకు వారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్ షెడ్యూల్ ఇదీ : ఈనెల 14, 15 తేదీల్లో 1వ ర్యాంకు నుంచి 30వేల ర్యాంకు వరకు, 16, 17 తేదీల్లో 30,001 నుంచి 60వేల వరకు, 18, 19 తేదీల్లో 60,001 నుంచి 90 వేల వరకు, 20, 21 తేదీల్లో 90,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్స్‌ను అవకాశం ఇస్తారు. 22, 23 తేదీల్లో విద్యార్థులకు ఆప్షన్లను మార్పు చేసుకునే అవకాశం కల్పించారు. 26న విద్యార్థులు ఎంపిక ఆధారంగా సీట్లు కేటాయింపు జరుగుతుంది. వికలాం గులు, సైనికుల పిల్లలు, ఆంగ్లో ఇండియన్స్, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ కేటగిరీ విద్యార్థులకు విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.900, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 ఫీజు చెల్లించాలి. విద్యార్థులు ్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీలో లాగిన్ అవ్వాల్సి ఉంది. -
ఎంసెట్ కౌన్సెలింగ్ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ లేకపోవడమంటే ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు తెలంగాణాలో ని 174 కళాశాలలకు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్ వర్తిస్తుందని బుధవారం తీర్పు ఇవ్వడంపై వారి అభిప్రాయాలు. -కురబలకోట పరిశీలించాలి సుప్రీం కోర్టు తీర్పు నిరాశ కలిగించింది. కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌన్సెలింగ్‌లో ఓ కళాశాలలో చేరి అది ఇష్టపడక మరో కళాశాలకు వెళ్లాలనుకున్న వారికి ఇక చాన్స్ ఉండదు. మొదటి విడత కౌన్సెలింగ్ కూడా అస్తవ్యస్తంగా సాగింది. -ఎం.అమరావతి, డెరైక్టర్, విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు ప్రభుత్వం చొరవ చూపాలి రాష్ట్ర ఎంసెట్ విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ లేకపోవడం ఒక విధంగా రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యమే. తన వాదనను గట్టిగా వినిపించకపోవడం వల్లే ఇలా జరిగిందని భావించాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే మరో పిటిషన్ దాఖలు చేయాలి. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడాలి. -ఎన్వీ.రమణారెడ్డి, కరస్పాండెంట్, గోల్డన్‌వ్యాలీ ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు ఏడాది నష్టపోవాల్సిందేనా ఇప్పటికే ప్రారంభమైన డిగ్రీలో చేరలేక రెండో విడత కౌన్సెలింగ్ లేక విద్యార్థులు అవస్థల పాలయ్యారు. మేనేజ్మెంట్లో చేరడానికి ఆర్థిక స్థోమత లేనివారు సంవత్సర కాలాన్ని పోగొట్టుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలి. -మారుతీ ప్రసాద్, పీఆర్వో, మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, అంగళ్లు -
సాక్షి మీడియా అక్షర యజ్ఞం
-
తప్పెవరిది? శిక్షెవరికి? Part - 3
-
తప్పెవరిది? శిక్షెవరికి? Part - 2
-
తప్పెవరిది? శిక్షెవరికి? Part - 1
-
ఏం ‘సెట్టో’!
- రెండోవిడత ఇక కలే.. - నిరాశలో ఎంసెట్ అభ్యర్థులు - అగమ్యగోచరంగా 3వేల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్ - కళాశాలల మార్పిడికి అవకాశం ఇవ్వాలని విన్నపం శాతవాహన యూనివర్సిటీ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎమరుపాటుగా వ్యవహరించిన విద్యార్థులకు సుప్రీంకోర్టు గట్టి షాకే ఇచ్చింది. ఇప్పటికే ఆలస్యమైనందున రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వలేమంటూ తీర్పునివ్వడంతో మొదటి కౌన్సెలింగ్‌కు వెళ్లని విద్యార్థుల పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఇటు ఎంసెట్‌లో సీటు రాక, అటు డిగ్రీలో చేరే సమయం దాటిపోయి అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఇక షరతులతో కూడిన అనుమతి తెచ్చుకున్న కళాశాలలు రెండో విడతపైనే గంపడు ఆశలు పెంచుకోగా... సుప్రీం తీర్పు వాటికి అశనిపాతమే అయింది. ఎంసెట్ ఎంట్రెన్స్ పూర్తయ్యాక రాష్ట్ర విభజన ప్రక్రియతో అడ్మిషన్లలో గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఆగస్టు 14 నుంచి 23 వరకు కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టింది. సీట్ల కేటాయింపు 31 వరకు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలలకు అనుమతి రాకపోగా... వాటిలో చేరాలనుకున్న విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ప్రతీసారి రెండుసార్లు కౌన్సెలింగ్ ఉంటుండడంతో ఈసారి కూడా అలాగే ఉంటుందనే భావనతో అప్పుడు మళ్లీ సీటు మార్చుకోవచ్చని కౌన్సెలింగ్‌లో ఉన్న కొన్ని కళాశాలలను ఆప్షన్‌గా ఎంచుకున్నారు. మరోదఫా కౌన్సెలింగ్‌కు అనుమతి నిరాకరించడంతో ఇప్పు డు ఆ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. నచ్చని కళాశాలలో చదవలేక, నచ్చిన కళాశాలను ఎంచుకునే అవకాశం లేక కొట్టుమిట్టాడుతున్నారు. సీటు వచ్చి కొందరు... కౌన్సెలింగ్‌కు వెళ్లక మరికొందరు. జిల్లాలో సుమారు 3 వేల మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలకొద్ది కళాశాలలకు అనుమతి రాకపోగా జిల్లాలోనూ ఏడు కళాశాలలకు అనుమతి రాలేదు. వీటిలో తమకు నచ్చిన కళాశాలలు కూడా ఉండడంతో కొందరు విద్యార్థులు రెండో దశ కౌన్సెలింగ్‌లో సీటు మార్పిడి చేసుకుందామనే ఉద్దేశంతో ఏదో కళాశాలను ఆప్షన్‌గా ఎంచుకున్నారు. విద్యార్థులు ఎంచుకున్న కళాశాలల్లో రిపోర్ట్ చేసేందుకు అధికారులు ఈ నెల 5 తుది గడువుగా సూచించారు. ఈలోపు రాష్ట్రవ్యాప్తంగా 174 కళాశాలలు హైకోర్టునాశ్రయించి షరతులతో కూడిన అనుమతి తెచ్చుకున్నాయి. ఇందులో జిల్లాకు చెందిన ఏడు కళాశాలలు ఉన్నాయి. వెంటనే ఆయా కళాశాలలు తమ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చంటూ... రెండో కౌన్సెలింగ్‌లో అవకాశం ఉంటుందంటూ జోరుగా ప్రచారం చేశాయి. దీంతో పలువురు విద్యార్థులు మొదటి కౌన్సెలింగ్‌లో ఎంచుకున్న కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదు. వీరితోపాటు మరో 3 వేల మంది వరకు విద్యార్థులు రెండోదశ కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు. కానీ, వీరి ఆశలేవీ నెరవేరే అవకాశం లేకుండా పోయింది. కొందరు విద్యార్థులు ఫీజు కేటగిరీ ఎక్కువలో ఉన్న కళాశాలను ఎంపిక చేసుకుని, ఇప్పుడు మార్చుకునే అవకాశం లేక... అంత ఫీజు చెల్లించలేక తలలు పట్టుకుంటున్నారు. నూతన ప్రవేశాలకు ఇవ్వకున్నా కనీసం కళాశాలల మార్పిడికైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో తమ కళాశాలలో చేరవచ్చంటూ విద్యార్థులను కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లనీయకుండా... కొన్ని కళాశాలలు ముందస్తుగానే సర్టిఫికెట్లు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు విద్యార్థులు స్పష్టత కోసం కౌన్సెలింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నా అక్కడ ఎలాంటి సమాచారం లేక నిరాశతో వెనుదిరుగుతున్నట్లు సమాచారం. -
ఇంజ‘నీరు’గారుతోంది!
ప్రొద్దుటూరు: ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణలో తీవ్ర జాప్యం కావడంతో చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ను కాదనుకుని డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. అనేక మంది పొరుగు రాష్ట్రాలైన చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇంజనీరింగ్ కోర్సులలో చేరారు. దీంతో జిల్లాలో ఈ ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. జిల్లాలో మొత్తం 22 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీ, పులివెందులలో ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. మిగతా 20 కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ కాని పరిస్థితి నెలకొంది. అడ్మిషన్ల తీరు చాలా అధ్వానంగా ఉందనే చర్చ జరుగుతోంది. సాధారణంగా జూన్ లేదా జూలై నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమైతే ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే రాష్ట్ర విభజన పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మరింత జాప్యం ఏర్పడింది. మే 22న నిర్వహించిన ఎంసెట్ పరీక్షకు జిల్లాలో 7100 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 2542 మంది మెడిసిన్ పరీక్షకు హాజరయ్యారు. జూన్ నెలలోనే ఎంసెట్ ఫలితాలు వెలువడినా కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించబోమని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో కౌన్సెలింగ్‌పై చివరకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 7వ తేదీ నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. కర్నాటక, తమిళనాడులోని పలు కళాశాలలు జూలై, ఆగస్టు నెలల్లోనే తరగతులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులు సిలబస్ పూర్తి కావడం ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని గమనించి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. మరికొందరు డిగ్రీ కోర్సుల్లో చేరారు. దీంతో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య రెండు అంకెలకు మించలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. ఈ ఏడాది రాష్ట్ర విభజన జరిగిందని, మన విద్యార్థులు ఎక్కువగా జిల్లాలోనే చేరుతారని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే తీరా అడ్మిషన్ల పరిస్థితి చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయినా రెండో విడత కౌన్సెలింగ్ జరగలేదు. దీనికితోడు ఇంకా తరగతులు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో గతంలో కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడగా ఈ ఏడాది ప్రొద్దుటూరు, పులివెందులలోని ప్రభుత్వ కళాశాలలతోపాటు 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 9120 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ముగిసిన తొలివిడత కౌన్సెలింగ్‌లో 2958 సీట్లు భర్తీ అయ్యాయి. -
పీజీ కాలేజీలపై తేలని లెక్కలు
* అఫిలియేషన్లపై జేఎన్టీయూహెచ్ స్టాండింగ్ కమిటీ తర్జనభర్జన * కాలేజీల యాజ మాన్యాల పడిగాపులు * ముంచుకొస్తున్న వెబ్ కౌన్సెలింగ్ గడువు సాక్షి, హైదరాబాద్ : మరో 48గంటల్లో పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జేఎన్టీయూహెచ్ పరిధిలో కళాశాలల అఫిలియేషన్‌పై ఇంతవరకు స్పష్టత రాలేదు. లోపాలను సరిదిద్దుకునే విషయమై యాజమాన్యాల నుంచి హామీలు తీసుకొని, అన్ని కళాశాలలను పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు రెండురోజులు ఆయా కళాశాలల నుంచి లోటుపాట్లు సరిదిద్దిన నివేదిక (డీసీఆర్)లను జేఎన్టీయూహెచ్ అధికారులు స్వీకరించారు. నివేదికలను పరిశీలించిన యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ తుది నిర్ణయం వెలువరించడంలో తర్జనభర్జన పడుతోంది. వర్సిటీ పరిధిలోని ఎంటెక్, ఎంఫార్మసీ కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చే అంశంపై ఆది వారం మధ్యాహ్నం వైస్‌చాన్సలర్ నివాసంలో సమావేశమైన స్టాండింగ్ కమిటీ సభ్యులు తుది నిర్ణయాన్ని ఆయనకే వదిలేసినట్లు తెలిసింది. యాజమాన్యాలకు టెన్షన్ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అఫిలియేషన్ దక్కక తీవ్రంగా నష్టపోయిన తమ కళాశాలలకు పీజీఈసెట్ కౌన్సెలింగ్కైనా అవకాశం కల్పిస్తారో, లేదోన ని యాజమాన్యాలకు టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాలు యాజమాన్యాలకు సానుకూలంగా ఉన్నా, వాటిని అమలు చేయడంలో జేఎన్టీయూహెచ్ అధికారులు ఎలాంటి వైఖరిని అవలంభిస్తారోనన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. ఈనేపథ్యంలో.. పలు కళాశాలల యాజమాన్యాలు వర్సిటీ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు జేఎన్టీయూహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. వీసీ, రిజిస్ట్రార్లు యూనివర్సిటీలో కనిపించకున్నా, వారి ఇళ్లవద్ద అర్ధరాత్రి వరకు పలువురు యాజమాన్య ప్రతినిధులు పడిగాపులు కాస్తున్నారు. శనివారం రాత్రి వీసీని కలిసేందుకు సెక్యూరిటీ అనుమతించకున్నా, గేటు తోసుకొని లోనికి వెళ్లిన యాజమాన్య ప్రతినిధులకు, వీసీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన ఆరోగ్యం బాగోలేనందున విసిగించవద్దని వీసీ చెప్పాగా, తాము వారం రోజులుగా టెన్షన్ భరించలేకపోతున్నామని యాజ మాన్యాలు వాపోయాయి. ఆదివారం వీసీ ఇంట్లో స్టాండింగ్ కమిటీ సమావేశం ఉందని తెలిసి మరికొందరు యాజమాన్య ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అరుుతే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. జేఎన్టీయూహెచ్ జాబితా రాలేదు.. జేఎన్టీయూహెచ్లో పరిస్థితి ఇలా ఉంటే..వర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలల జాబితా కోసం పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 10నుంచి వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ ఉన్నందున జాబితాను 24గంటల ముందు ఇస్తే తప్ప, కళాశాలల పేర్లను కౌన్సెలింగ్‌లో చేర్చలేమని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ నిమిత్తం జేఎన్టీయూకే నుంచి 202, జేఎన్టీయూఏ నుంచి 106, కాకతీయ యూనివర్సిటీ నుంచి 42, ఏఎన్‌యూ నుంచి 10, ఓయూ నుంచి 10 ఎంటెక్, ఎంఫార్మసీ కళాశాలల జాబితాలు అందినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో అఫిలియేటెడ్ కళాశాలలు ఉన్న జేఎన్టీయూహెచ్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదని వెబ్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్ పూర్తి
సాక్షి, విజయవాడ : ఎంసెట్ కౌన్సెలింగ్ తొలి దశ పూర్తయింది. ఇప్పటికే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తయింది. రెండో విడత, మూడో విడతల కౌన్సెలింగ్‌ను కూడా సెప్టెంబర్ 10వ తేదీలోపు పూరిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ-సెట్ కౌన్సెలింగ్‌ను కూడా పూర్తిచేసిన అధికారులు పాలిసెట్ కౌన్సెలింగ్‌పై కసరత్తు చేస్తున్నారు. ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విజయవాడలోని మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలకు 7,267 మంది, వెబ్ ఆప్షన్స్ ఎంపికకు 1, 290 మంది విద్యార్థులు హాజరయ్యారు. వెబ్ ఆప్షన్లు ఇచిన విద్యార్థుల మొబైల్ నంబర్లకు శనివారం ఎంసెట్ కన్వీనర్ పాస్‌వర్డ్‌ను పంపారు. దాని సాయంతో వెబ్సైట్లోకి ప్రవేశించి ఆప్షన్ల మేరకు కేటాయించిన కళాశాలను గుర్తించి, దానిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. నగరంలోని హెల్ప్‌లైన్ సెంటర్లో దాన్ని సమర్పిస్తే ఆడ్మిషన్ నంబర్ వేసి మళ్లీ విద్యార్థులకు కాపీ అందజేస్తారు. దాన్ని తీసుకువెళ్లి ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందాల్సి ఉంటుంది.అడ్మిషన్ల నంబర్ల కేటాయింపు కోసం హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్లాల్సిన వివరాలతో మళ్లీ అధికారులు షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. సోమవారం నుంచే ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 1 నుంచి సీట్ల కేటాయింపు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు శనివారం ఎంసెట్ కన్వీనర్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రోజుకు 50 వేల మందికి హైల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా సీట్లు కేటాయించనున్నారు. నిర్ణయించిన షెడ్యూల్ తేదీల్లో హాజరుకాని విద్యార్థులు సెప్టెంబర్ ఐదో తేదీన ఎలాట్మెంట్ నంబర్లు తీసుకోవచ్చు 2,900 మంది ఈ-సెట్ విద్యార్థులకు ప్రవేశం మరోవైపు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ-సెట్ విద్యార్థుల ప్రవేశానికి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల అయిన క్రమంలో 26 నుంచి నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా సీట్ల ఎలాట్మెంట్ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 2,900 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు లెటర్లు కేటాయించారు. పాలిసెట్‌కు నామమాత్రంగా హాజరు ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు నామమాత్రంగానే హాజరయ్యారు. వరుస సెలవులు రావడంతో సోమవారం కూడా కొనసాగించనున్నారు. ఇప్పటి వరకు రెండు హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా 2,850 మందికే సీట్ల ఎలాట్మెంట్ ప్రక్రియ పూర్తిచేశారు. స్పెషల్ ఫీజులు ముందే చెల్లించవద్దు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆడ్మిషన్లు పొందే సమయంలోనే స్పెషల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆంధ్రా లయోలా కళాశాల ఎంసెట్ క్యాంపు ఆఫీసర్ శ్రీరంగం విద్యార్థులకు సూచించారు. ఎంసెట్ మొదటి కౌన్సెలింగ్ మాత్రమే ముగిసిందన్నారు. వారం వ్యవధిలో రెండు, మూడు కౌన్సెలింగ్‌లు కూడా ఉంటాయన్నారు. విద్యార్థులు అడ్మిషన్ల సమయంలోనే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. -
అను‘మతి’ లేని ప్రచారం
నిజామాబాద్ అర్బన్ : ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాల కోసం జిల్లా వి ద్యార్థులకు చిక్కులు వచ్చి పడ్డాయి. జిల్లాలో ఉన్న మొ త్తం పది ఇంజినీరింగ్ కళాశాలలకుగాను, జేఎన్టీయూ కేవలం మూడు కళాశాలలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా ఏడింటిని పక్కన పెట్టింది. అయినా, ఆ ఏడు కళాశాలలు విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రచారాలు చేస్తున్నాయి. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినా విద్యార్థులను అసత్య ప్రచారాలతో మోసం చేస్తున్నాయి. ప్రవేశాల వేళ ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుండడంతో ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసంవిద్యార్థులు ఆరాట పడుతున్నారు. కళాశాల ఎంపికలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తల మునకలయ్యారు. బంగారు భవిష్యత్తు కోసం మంచి కళాశాల, దగ్గరి ప్రాంతాన్ని ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి సరైన విధి విధానాలు తెలియక అవస్థలు పడుతున్నారు. కళాశాలకు అఫిలియేషన్ రద్దయినా, కౌన్సెలింగ్ జాబితాలో కళాశాలల పేరు లేకున్నా, కొన్ని కళాశాలలు కౌన్సెలింగ్ సెం టర్ల వద్ద జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో పది ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కేవలం మూడు కళాశాలలకు మాత్రమే జేఎన్టీయూ ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చిం ది. మిగతా ఏడు కళాశాలలకు అనుమతి ఇవ్వలేదు. జిల్లాలో అనుమతి పొందిన మూడు కళాశాలలలో మహిళా కళాశాల విభాగంలో కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాల (కిట్స్) మాత్రమే ఉంది.జిల్లాలో మొత్తం 3,060 సీట్లకుగాను ఏడు కళాశాలలకు అనుమతి లేకపోవడంతో 1,060 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్థా నికంగా చదివే విద్యార్థులు కళాశాలలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరగా చేసుకుని, అనుమతి లేకున్నా కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రవేశాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద సందడి ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ప్రైవేట్ కళాశాలల ప్రచార సందడి నెలకొంది. జిల్లా కేం ద్రంలోని గిరిరాజ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. పాలి టెక్నిక్ కళాశాల వద్ద సీట్ల భర్తీకి అనుమతి లేని మూడు కళాశాలల వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ కళాశాలలో గల బ్రాంచ్‌లు, కళాశాలల కోడ్లతో సహా జోరుగా ప్రచారం చేపడుతున్నాయి. దీంతో విద్యార్థులు కళాశాల ఎంపికలో అయోమయానికి లోనవుతున్నారు. -
మొరాయించిన ఇంటర్నెట్. .ఆగిన కౌన్సెలింగ్
నంగునూరు: ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం వచ్చిన విద్యార్థులకు చుక్కెదురైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ మొరాయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరగంట వరకు నెట్ వస్తుందంటూ అధికారులు చెప్పడంతో అక్కడే పడిగాపులు కాశారు. వివరాల్లోకి వెళితే... నంగునూరు మండలం రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు రోజులుగా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 89, రెండో రోజు 144, మూడో రోజు 117 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించారు. సోమవారం గజ్వేల్, సిద్ధిపేట, దుబ్బాక మండలాల నుంచి 85 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం వచ్చి పేర్లను నమోదు చేసుకున్నారు. కౌన్సిలింగ్ కోసం సర్వం సిద్ధం చేసిన అధికారులు ఇంటర్నెట్ రాకపోవడంతో కొద్ది సేపు వేచి చూశారు. మధ్యాహ్నం వరకు కూడా రాకపోవడంతో కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ నాగేశ్వర్రావు, బీఎస్ఎన్ఎల్ శాఖ జేఈ, డీజీఎంలతో ఫోన్లో మాట్లాడారు. కేబుల్ సమస్య వల్ల ఇంటర్నెట్ ఆగిపోయిందని వారు సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 8 గంటలకు వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు వేచి చూసిన చాలా మంది విద్యార్థులు ఇతర సెంటర్లను వెనుదిరిగి వెళ్లిపోయారు. నాలుగున్నర ప్రాంతంలో ఇంటర్నెట్ పని చేయడంతో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంటర్నెట్ సమస్య వల్ల సాయంత్రం వరకు కౌన్సెలింగ్ నిలిచిపోయిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్న 45 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కౌన్సెలింగ్ కోసం కరీంనగర్‌కు వెళ్లిన విద్యార్థులు కరీంనగర్: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ కోసం రాజగోపాల్‌పేటలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రంలో కంప్యూటర్లు మొరాయించడంతో ఇక్కడి విద్యార్థులు 50 మంది కరీంనగర్‌లోని మహిళా పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కేంద్రానికి వస్తారంటూ అసిస్టెంట్ కోఆర్డినేటర్ కె.సాంబయ్య అధికారులకు సమాచారమిచ్చారు. కానీ, కౌన్సెలింగ్ సమయం ముగిసే సరికి 14 మంది మాత్రమే హాజరయ్యారని, వారి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశామని అధికారులు తెలిపారు. కాగా మిగతా 36 మంది కౌన్సెలింగ్ కోసం ఎక్కడికి వెళ్లారనే విషయం తేలలేదు. కొనసాగిన ఎంసెట్ కౌన్సెలింగ్ మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఎంసెట్ 4వ రోజు కౌన్సెలింగ్ కొనసాగింది. 75,001 నుంచి 1 ఒక లక్ష వరకు ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించారు. 4వ రోజు 110 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ వెంకటరాంరెడ్డి తెలిపారు. ఈ నెల 19న సమగ్ర సర్వే ఉన్నందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 20న లక్ష నుంచి1,25,000 ర్యాంకు సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు 2 జతల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. -
పద్మావతి మహిళా వైద్య కళాశాలకు..డీమ్డ్ వర్సిటీ హోదా!
ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల భర్తీ! వచ్చే ఏడాది ప్రత్యేక సెట్ నిర్వహణకు సన్నాహాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(స్విమ్స్) నేతృత్వంలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలకు డీమ్డ్ వర్సిటీ హోదా సాధించేం దుకు ఆ సంస్థ యాజమాన్యం ప్రణాళిక రచించింది. అనుబంధంగా నర్సింగ్, డెం టల్, పారా మెడికల్ కాలేజీలతోపాటు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా డీమ్డ్ వర్సిటీ హోదా పొంది.. అత్యుత్తమ వైద్య నిపుణులను అందించడానికి వ్యూహం రచించింది. వివరాల్లోకి వెళితే.. స్విమ్స్ నేతృత్వంలో ఏర్పాటుచేస్తున్న పద్మావతి మహిళా వైద్య కళాశాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోం ది. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 150 సీట్లను భర్తీ చేయాల ని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక సెట్ ద్వారా సీట్లను భర్తీ చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో డీమ్డ్ వర్సిటీ హోదా పొందడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. బోధనాసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్, డెంటల్, పారామెడికల్ కాలేజీలతో పాటూ వైద్యరంగంలో పరిశోధన కేంద్రాన్ని కూడా నెలకొల్పితేనే డీమ్డ్ వర్సిటీ హోదా పొందవచ్చు. స్విమ్స్‌కు సమీపంలో బీవీబీ ప్రాంతంలో భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. గతేడాది స్విమ్స్‌ను తనిఖీ చేసిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చింది. ఈలోగా మెటర్నిటీ ఆస్పత్రికి రూ.వంద కోట్ల వ్యయంతో మూడు వందల పడకలతో నిర్మించిన భవనాన్ని పద్మావతి మహిళా వైద్య కళాశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. కానీ.. పద్మావతి మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతించిన సమయంలో మెటర్నిటీ భవనాన్ని స్విమ్స్ యాజమాన్యం చూపించలేదు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎలాంటి అవాంతరాలు ఉండవు. మెటర్నిటీ భవన వివాదాన్ని పరిష్కరించుకుని.. నర్సింగ్, డెంటల్, పారామెడికల్ కాలేజీలు, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భవనాలను నిర్మించేం దుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. వీటికి భూమి కేటాయింపునకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం భూమిని కేటాయించిన తక్షణమే యుద్ధప్రాతిపదికన నర్సింగ్, డెంటల్, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన భవనాలను నిర్మించి.. సంబంధిత విభాగాల నుంచి కాలేజీల ప్రారంభానికి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. 2015 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఈ ప్రక్రియను పూర్తిచేసి.. డీమ్డ్ వర్సిటీ హోదా సాధించాలని భావిస్తున్నారు. పద్మావతి మహిళా మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 150 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐలకు కేటాయించనున్నారు. ఒక్కో సీటుకు 20 వేల అమెరికన్ డాలర్లు ఫీజుగా నిర్ణయించారు. మరో 15 శాతం ఇతర రాష్ట్రాల విద్యార్థులకు.. తక్కిన 70 శాతం సీట్లను మన రాష్ట్ర విద్యార్థులకు కేటాయించారు. వీరికి ఫీజు రూ.60 వేలుగా నిర్ణయించారు. వచ్చే ఏడాది డీమ్డ్ వర్సిటీ హోదా పొందాక ప్రత్యేక సెట్ నిర్వహించి.. పద్మావతి మహిళా మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, డెంటల్, పారా మెడికల్ సీట్లను భర్తీ చేయనున్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 387 మంది హాజరు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దర్గామిట్ట ప్రభుత్వ మహిళాపాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో జరుగుతున్న ఎంసెట్- 2014 కౌన్సెలింగ్ పక్రియలో ఆదివారం 387 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 159 మంది అభ్యర్థులు, బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 228 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. సోమవారం జరిగే కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 1,20,001 నుంచి 1,27,000 ర్యాంక్ వరకు, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 1,27,001 నుంచి 1,35,000 ర్యాంక్ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని ప్రిన్సిపల్స్ నారాయణ, రామ్మోహన్రావు తెలిపారు. అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. బ్రాంచ్, కళాశాల ఎంపికలో అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి ఎదురైంది. మంచి కళాశాల, ఇష్టమైన బ్రాంచ్ని ఎన్నుకోవాలని హెల్ప్‌లైన్ సెంటర్లకు వచ్చిన విద్యార్థులను మధ్యవర్తులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. తమవద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లలో వెబ్ ఆప్షన్ చేస్తామని విద్యార్థులను ఒత్తిడికి గురిచేశారు. ప్రక్రియపై పూర్తిగా అవగాహన లేని విద్యార్థులను ప్రలోభ పెట్టేందుకు గురిచేశారు. ప్రైవేటు కళాశాల ప్రతినిధులు తమ కళాశాలలో చేరితే అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. మరికొన్ని ప్రైవేటు కళాశాలలు మరి కొంత ముందుకెళ్లి ప్రక్రియకు ముందే విద్యార్థుల వద్ద నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకున్నారు. ఈ ప్రక్రియలో కళాశాలను మార్పించుకోవాలంటే ఆ విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కళాశాల పనితీరు, ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకునేలోపే వారి అడ్మిషన్లు అయిపోవడంతో చేసేదేమీలేక చాలా మంది విద్యార్థులు ముందుకెళ్లి పోయారు. రూల్స్‌కు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలు చేసే ఆగడాలను మౌనంగా భరించాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు. దర్గామిట్ట బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 60 మంది, వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్‌లో 100 మంది ఆప్షన్ల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఆప్షన్ల ఎంపిక ప్రక్రియపై అవగాహన లేని అభ్యర్థులకు సహాయ పడతామని ప్రిన్సిపల్స్ పేర్కొన్నారు. ప్రైవేటు అభ్యర్థుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని, నేరుగా తనను సంప్రదించాలని వారు కోరారు. -
వెబ్ ఆప్షన్లపై తస్మాత్ జాగ్రత్త
శాతవాహన యూనివర్సిటీ: జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు రెండు రోజులుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరవుతున్నారు. కొందరు విద్యార్థులు గతంలో తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. ఎంసెట్ సర్టిఫికె ట్ల పరిశీలనతోనే ఇంజినీరింగ్ కళాశాలలో చేరడం కాదు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కళాశాల ఎంపిక విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలిన ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ నితిన్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాంబయ్య సూచిస్తున్నారు. ఆదివారం నుంచే వెబ్ఆప్షన్లు ప్రారంభ మ య్యా యి.సందేహాలుంటే 9666670193నిసంప్రదించొచ్చు. కొత్తగా వన్ టైం పాస్వర్డ్.. గతంలో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టడానికి స్క్రాచ్ కార్డు ఇచ్చేవారు. అందులోని సీక్రెట్ కోడ్ ద్వారా విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేవారు. కానీ దీనిలో పీఆర్వోల జోక్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు విన్పించాయి. దీంతో ఈసారి పీఆర్వోలకు చెక్ పెడుతూ రాష్ర్ట ఉన్నత మండలి.. వన్‌టైం పాస్వర్డ్ అనే ఆప్షన్ తెచ్చింది. ఈ విధానంలో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థి ఇచ్చే ఫోన్ నంబరే కీలకం. ఒకసారే ఉపయోగించకునేలా ఒక సీక్రెట్ పాస్వర్డ్ విద్యార్థి సెల్‌ఫోన్‌కు మేసేజ్ రూపంలో వస్తుంది. ఆ పాస్ వర్డ్‌ను ఉపయోగించుకుని విద్యార్థి నచ్చిన కోర్సులో... కోరుకున్న కళాశాలలో చేరొచ్చు. కాబట్టి విద్యార్థి తన ఫోన్ నెంబర్విషయంలో గోప్యతను పాటిస్తూ కౌన్సెలింగ్ సెంటర్లో ఇవ్వాలి. విద్యార్థి ఎంచుకునే ఆప్షన్లను లేదా కళాశాలను మార్చాలనుకున్న మళ్లీ వన్‌టైం పాస్వర్డ్ మొదటి ఇచ్చిన నంబర్‌కు మాత్రమే వస్తుంది. తమ కళాశాలలో చేర్చుకోవడానికి యత్నించే పీఆర్వోలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇంజినీరింగ్ కోర్సులో చేరిన వారికి తాయిలాలిచ్చేందుకూ పలు కళాశాలల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న వెబ్ ఆప్షన్లు.... ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే వెబ్ఆప్షన్లు చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల, ఉజ్వల పార్క్ సమీపంలోని పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ఈ ఆప్షన్లను ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ఆప్షన్తో కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 17, 18వ తే దీల్లో 1 నుంచి 50 వేల ర్యాంకు వరకు, 20, 21 తే దీల్లో 50001 నుంచి లక్ష ర్యాంకు వరకు, 22, 23 తేదీల్లో 100001 వ ర్యాంకు నుంచి 1,50, 000 ర్యాంకు వరకు, 24, 25 తేదీల్లో 1,50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థుల మొదట ఉంచిన ఆప్షన్లు మార్చాలనుకుంటే 26 వ తే దీన 1 వ ర్యాంకు నుంచి లక్ష లోపు ర్యాంకులు ఉన్న వాళ్లు, 27న లక్ష ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులు వారి ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఈ నెల 30న విద్యార్థులకు ఏ కళాశాలల సీటు వచ్చిందనే మేసేజ్ వస్తుంది. సెప్టెంబర్ 1 సంబంధిత క ళాశాలకు వెళ్లి అన్ని విషయాలు కనుక్కోవచ్చు. విద్యార్థికి కళాశాల నచ్చకుంటే రెండో కౌన్సెలింగ్ మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. తనిఖీలతో ఆరు కళాశాలలు ఔట్.? కౌన్సెలింగ్‌కు ముందు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 6 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి రద్దు చేసినట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం జిల్లాలోని 12 ఇంజనీరింగ్ కళాశాలలకే వెబ్ ఆప్షన్ పెట్టాలనే విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అనుమతి రాని కళాశాలల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. వసతులు సమకూర్చి మళ్లీ అనుమతులను తెచ్చుకునేందకు ఆయా కళాశాల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కౌన్సెలింగ్‌కు 699 మంది హాజరు ఆదివారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లావ్యాప్తంగా 699 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్సారార్ కళాశాల సెంటర్లో 348 మంది, మహిళా పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో 351 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 మంది ఉన ్నట్లు క్యాంపు ఆఫీసర్ తెలిపారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
ఖమ్మం : ఎంసెట్ కౌన్సెలింగ్ బుధవారం జిల్లాలోని మూడు కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు ఒకటి నుంచి 25 వేల లోపు ర్యాంకుల వారికి జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 505 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఓసీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 401 మంది, భద్రాచలం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 39 మంది, కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల కేంద్రానికి 65 మంది విద్యార్థులు హాజరయ్యారని ఖమ్మం సెంటర్ ఎంసెట్ నిర్వాహకులు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవని, తిరిగి ఈనెల 16న కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. శనివారం 25,001వ ర్యాంకు నుంచి 50 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు హాజరు కావాలని సూచించారు. ఈనెల 17 నుంచి కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. వెబ్ ఆప్షన్ ఎలా ఎంపిక చేసుకోవాలో వివరించేందుకు కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీంతో విద్యార్థులకు వెబ్ ఆప్షన్ సందర్భంగా తలెత్తే అనుమానాలు, ఇతర విషయాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. అయితే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిపివేయాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించడంతో పలువురు విద్యార్థులు ఆయా పత్రాలను చూపించలేక పోయారు. ఈ విషయం కౌన్సెలింగ్ సెంటర్ అధికారుల దృష్టికి తీసుకరావడంతో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని సర్టిఫికెట్లు పరిశీలించారు. -
నేడు కౌన్సెలింగ్‌కు సెలవు
కల్లూరు రూరల్: జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రెండు కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 209 మంది విద్యార్థులు హాజరైనట్లు కో ఆర్డినేటర్ సంజీవరావ్ తెలిపారు. బి.తాండ్రపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 101 మంది, రాయలసీమ యూనివర్సిటీలో 108 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ వై.విజయభాస్కర్, సంజీవరావ్ పేర్కొన్నారు. శనివారం పాలిటెక్నిక్ కళాశాలలో 90001 నుంచి 97వేలు, ఆర్‌యూలో 97,001 నుంచి 1,05,000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సెలింగ్‌కు 111 మంది హాజరు నూనెపల్లె: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 111 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం 75,001 నుంచి 90వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా అభ్యర్థులకు సర్టిఫికెట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు క్యాంప్ కన్వీనర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. 11 మంది ఎస్సీ, 100 మంది ఓసీ, బీసీ అభ్యర్థులు హాజరైనట్లు ఆయన చెప్పారు. శనివారం 90,001 నుంచి 1,05,000 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చని తెలిపారు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు కూడా రావచ్చన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కౌన్సెలింగ్‌కు జరగదన్నారు. క్యాంపులో సిస్టమ్ అధికారులుగా మంజునాథ్, సుబ్బరాయుడు, అధ్యాపకులు రాజశేఖర్ రెడ్డి, లలిత, రఘునాథ్ రెడ్డి, చీఫ్ వెరిఫికేషన్ అధికారిగా కృష్ణమూర్తి, వెంకట్రావు వ్యవహరించారు. 17 నుంచి వెబ్ కౌన్సెలింగ్: ఎంసెట్ కౌన్సెలింగ్ లో పాల్గొన్న అభ్యర్థులకు ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు క్యాంప్ అధికారి తెలిపారు. వెబ్ ఆప్షన్ల తర్వాత 26, 27 తేదీల్లో సవరణ ఉంటుందని చెప్పారు. అయితే తెలంగాణాలో ఈనెల 19న సర్వే నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగ్ ఉండదని ఆయన చెప్పారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ సందడి ఆరంభం
సజావుగా దరఖాస్తుల పరిశీలన తొలిరోజు 105 మంది ఎంసెట్ అభ్యర్థులు విశాఖపట్నం: చాలా రోజులుగా ఎదురు చూ స్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకా రం చుట్టడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రారంభ ప్రక్రియ ధ్రువపత్రాల పరిశీ లన మొదలు కావడంతో ఉపశమనం పొం దారు. గురువారం కంచరపాలెం పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగు కాలేజీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను రాష్ట్ర మాన వ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కెమికల్ కళాశాల వ ద్ద ప్రారంభించారు. గురువారం 1వ ర్యాంకు నుంచి 5000ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. ఉద యం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలుసు న్న విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల, కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్నారు. వీరు వేచిఉండడానికి ప్రత్యేకం గా ఏర్పాట్లు చేశారు. ధ్రువపత్రాల పరిశీలన, న మోదు ప్రక్రియ సవ్యంగా సా గింది. వెయ్యిలోపు ర్యాంకర్ల లో అల్లూరి తనూజ(640), అశ్విన్ కుమార్ జైన్ (759) లు మాత్రమే హాజరయ్యారు. 105 మంది హాజరు: తొలిరోజు 105 మంది మాత్రమే హాజరయ్యారు. 2500 లోపు ర్యాం కర్లు 30మంది, 2501నుంచి 5000లలోపు ర్యాంకర్లు 70మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. క్యాంపు ఆఫీసర్లుగా ఆర్జేడీ కె.సంధ్యారాణి, కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేముడు వ్యవహరించారు. నేడు 5001 నుంచి 10000 వరకూ.. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా రెండోరోజు శుక్రవారం 5001ర్యాంకు నుంచి 10000 వరకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. 5001నుంచి 7500వరకు పాలిటెక్నిక్ కళాశాల, 7501నుంచి 10000 వరకు కెమికల్ ఇంజినీరింగు కళాశాలకు హాజరు కావాలి. ఎస్టీ కేటగిరి విద్యార్థులు అందరూ పాలిటెక్నిక్ కళాశాలకు హాజరు కావాలి. గురువారం హాజ రుకానివారు కూడా శుక్రవారం ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవచ్చు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాట్లు పూర్తి యూనివర్సిటీ క్యాంపస్: ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఎంతోకాలం గా ఎదురుచూస్తున్న విద్యార్థుల ఆశ ఫలి స్తోంది. పలు అడ్డంకుల మధ్య వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. తొలిరోజైన గురువారం 1 నుంచి ఐదువేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థుల పత్రాలను పరిశీలించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వీలుగా స్క్రాచ్ కార్డులు ఇస్తారు. ఈనెల 23 వరకు పత్రాల పరిశీలన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 57 కేంద్రాలు ఇందుకోసం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతిలో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థుల పత్రాలను పరిశీలిస్తారు. జిల్లాలో 35 కళాశాలలు జిల్లాలో 35 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో తిరుపతిలో 20 కళాశాలలుండగా మిగిలిన ప్రాంతాల్లో 15 ఉన్నాయి. ఇవన్నీ జేఎన్టీయూ అనంతపురంకు అనుబంధంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల అదనంగా ఉన్నాయి. ఎస్వీ యూనివర్సిటీకి వస్తే కెమికల్ ఇంజనీరింగ్స్, మెకానికల్ ఇంజనీరింగ్స్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ఒక్కొక్క బ్రాంచ్‌లో 40 సీట్లు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఒక్కో బ్రాంచ్‌లో సీట్లను 60కి పెంచారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 120 సీట్లు, ఈసీఈలో 120 సీట్లు, ఈఈఈలో 60, మెకానికల్‌లో 60 సీట్లు ఉన్నాయి. మిగిలిన 35 కళాశాలల్లో ఈసీఈ, ఈఈఈ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ఒక్కొక్క బ్రాంచ్‌లో 600 సీట్లు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకుంటే సుమారు 25 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంసెట్‌లో అర్హత సాధించిన వారు 18 వేల వరకు ఉన్నారు. వీరిలో 30 శాతం మంది ఇప్పటికే తమిళనాడు, క ర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. దీని వల్ల ఈ యేడాది కూడా సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు తెచ్చుకోవాల్సినవి ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాల్సి ఉంది. అలానే ఎంసెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, తప్పనిసరిగా కౌన్సెలింగ్‌కు తెచ్చుకోవాలి. ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. ఏర్పాట్లు పూర్తి ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం నిర్వహించే ధ్రువీకరణపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం 1 నుంచి 5 వేల ర్యాంకుల మధ్య ఉన్నవారి పత్రాలను పరిశీలిస్తాం. ఈ ప్రక్రియ ఈనెల 23 వరకు జరుగుతుంది. విద్యార్థులు ఏ హెల్ప్ లైన్ సెంటర్ కైనా హాజరు కావచ్చు. -ఎల్ఆర్.మోహన్‌కుమార్‌రెడ్డి, కో-ఆర్డినేటర్ -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
నూనెపల్లె/కర్నూలు రూరల్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంజనీరింగ్‌లో చేరికకు నేటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ కన్వీనర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ, బి.తాండ్రపాడులోని పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ చేపడతామన్నారు. ఆర్యూ ప్రొఫెసర్ సంజీవరావు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని.. గురువారం ప్రారంభం కానున్న కౌన్సెలింగ్ 23వ తేదీతో ముగుస్తుందన్నారు. ఆగస్టు 15న సెలవు దినంగా ప్రకటించినట్లు చెప్పారు. నంద్యాలలో ఎస్సీ, ఓసీ, బీసీ అభ్యర్థులకు, కర్నూలులో ఎస్టీలతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఎస్సీ,ఎస్టీలు రూ.300, ఓసీ, బీసీలు రూ.600 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వికలాంగులు, సీఏపీ, ఎన్సీసీ, ఆర్మీ, గేమ్స్(సెంట్రలైజ్డ్ విభాగం) కేటగిరీల అభ్యర్థులకు 7 నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంకు సమీపంలో ఉన్న సాంకేతిక విద్యా భవనంలో సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ చేపడతారన్నారు. ఇదిలాఉండగా ఆప్షన్లపై ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల కాకపోవడం కొంత ఆందోళనకు కారణమవుతోంది. -
బీసీ విద్యార్థులకు కామన్ ఫీజు గండం
ఎచ్చెర్ల క్యాంపస్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అమలుచేస్తున్న నిబంధనలు బీసీ విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. పదివేల ర్యాంకు దాటి న విద్యార్థులు కామన్ ఫీజు స్ట్రక్చర్ దాటిన కళాశాలలో చేరితే అదనపు ఫీజు భరించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం కామన్ ఫీజుతో సంబంధంలేకుండా మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా ఇదే నిబంధన అమలుచేస్తారా, మార్పుచేసి న్యాయం చేస్తారా అన్న సందిగ్ధం విద్యార్థుల్లో నెల కొంది. పస్తుతం జిల్లాలోని కళాశా లల ను ఉదాహరణగా తీసుకుంటే రాష్ట్ర ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయించిన ఫీజు రూ .35 వేలు కాగా రాజాం సమీపంలోని జీఎంఆర్ ఐటీలో రూ.80,400, టెక్కలి సమీపంలోని ఐతంలో రూ.68,000 పీజు స్ట్రక్చర్ ఉంది. మిగతా ఆరు కళాశాలల్లో కామన్ ఫీజ్‌కు అటుగా, ఇటుగా ఫీజు ఉంది. 10 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులు ఈ కళాశాల్లో చేరితే అదనపు ఫీజు భ రించాల్సి వస్తోంది. దీంతో ఈ ఫీజు చెల్లించే సామర్థ్యం లేని విద్యార్థులు కామన్ ఫీజు కళాశాలలను ఎంపిక చేసుకోవలసి వస్తోంది. ఇతర జిల్లాల్లో రూ.లక్ష దాటి ఫీజు స్ట్రక్చర్ ఉన్న కళాశాలలు కూడా ఉన్నాయి. ఇటు వంటి కళాశాలల్లో విద్యార్థులు చేరితే కామన్ ఫీజు మినహాయించి రూ.65 వేలు విద్యార్థులు బరించ వల్సి ఉంటుంది. కామన్ ఫీజు కంటే ఎక్కువ సొమ్మును విద్యార్థులు ఫీజురూపంలో చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోతున్న జిల్లా విద్యార్థులు జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ. దీంతో పాటు బీసీలు ఎక్కువ. విషయ పరిజ్ఞానం ఉన్నా మొదటి ప్రయత్నంలో పట్టణ ప్రాంతాల విద్యార్థులతో పోటీ పడి ర్యాంకు సాధించడం సాధ్యం కాదు. ఈ నేపధ్యంలో మన జిల్లా విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. మరోవైపు 10 వేలు ర్యాంకు లోపు విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ సంస్థల్లో, యూనివర్సిటీల్లో చేరే వీలుంటుంది. ఈ ఏడాది మన జిల్లా నుంచి 4,850 మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరు కాగా, 10 వేలు లోపు ర్యాంకులు సాధించిన వారు 1000 లోపు ఉంటారని అంచనా. 10 నుంచి 20 వేలు మధ్య ర్యాంకు సాధించిన వారు 3 వేలు దాటి ఉంటారు. వీరందరూ ర్యాంక్ సీలింగ్ నిబంధన వల్ల కామన్ ఫీజు స్ట్రక్చర్ దాటి ఉన్న కళాశాలలను మిస్ అవుతున్నారు. ఈ ఏడాది నిబంధనలు సడలించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మెంట్‌పై స్పష్టత కరువు ఇప్పటికే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం రీయింబర్స్ మెంట్‌పై ఎలాంటి స్పష్టత తెలపలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ అమల్లో మార్పులు చేస్తుందా? పాత విధానాన్నే అమలు చేస్తుందా? అన్న సందిగ్ధం నెలకొంది. విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం ర్యాంక్ సీలింగ్ వల్ల విద్యార్థులకు మంచి కళాశాలలో సీటు లభించే అవకాశం ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించక కామన్ ఫీజ్ కళాశాలలు ఎంచుకోవాల్సి వస్తోంది. ర్యాంకులతో ఫీజు రీయింబర్స్‌మెంట ముడిపెట్టటం కంటే సీటు లభించిన కళాశాల బట్టి ఫీజులు చెల్లించే నిబంధన అమలుచేస్తే మంచిది. 10 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులకు ప్రతిభ లేనట్లు చెప్పలేం. మెరుగైన కళాశాల్లో చేరితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు సైతం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. -ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ -
ఎట్టకేలకు.. సెట్టయ్యింది!
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మోక్షం - 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన - జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు గుంటూరు ఎడ్యుకేషన్ :ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ర్యాంకులు విడుదలై దాదాపు రెండు నెలలు గడిచిన తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చింది. జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మే 22న జరిగిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 19,250 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 47 ఇంజినీరింగ్ కళాశాలల్లో 20 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. చురుకుగా ఏర్పాట్లు.. కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 23 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ర్యాంకర్లు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు.. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా కమ్ పాస్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, 2014 జనవరి ఒకటో తేదీ తరువాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. అంగవైకల్యం, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 300 చెల్లించాలి. ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగేదిలా తేదీ ర్యాంకు (నుంచి.. వరకూ) 7న ఒకటి నుంచి 5,000 8న 5,001 నుంచి 10,000 9న 10,001 నుంచి 15,000 10న 15,001 నుంచి 20,000 11న 20,001 నుంచి 38,000 12న 38,001 నుంచి 56,000 13న 56,001 నుంచి 75,000 14న 75,001 నుంచి 90,000 16న 90,001 నుంచి 1,05,000 17న 1,05,001 నుంచి 1,20,000 18న 1,20,001 నుంచి 1,35,000 19న 1,35,001 నుంచి 1,50,000 20న 1,50,001 నుంచి 1,65,000 21న 1,65,001 నుంచి 1,80,000 22న 1,80,001 నుంచి 1,95,000 23న 1,95,001 నుంచి చివరి వరకూ -
ఎదురు చూపు
మార్కాపురం: ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రతిష్టంభన విద్యార్థుల్లో గందరగోళానికి దారి తీస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, రాష్ట్ర విభజన ఏర్పడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత రాకపోవడం, సుప్రీంకోర్టులో కౌన్సెలింగ్‌పై, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విచారణ సాగుతుండటంతో ఎప్పుడు కౌన్సెలింగ్ జరుగుతుందో, తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలువురు విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చదువు నిమిత్తం వెళ్తుండగా, మరి కొంత మంది ఇతర డిగ్రీలపై ఆసక్తి చూపుతున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అక్టోబర్ 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో మన రాష్ట్రంలో కూడా కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత లేదు. పలువురు విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌లో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్‌లో ర్యాంక్‌లు వచ్చిన విద్యార్థులు ప్రతి రోజు ఉన్నత విద్యామండలి కార్యాలయానికి ఫోన్ చేస్తున్నప్పటికీ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ ప్రాంత విద్యార్థులు కౌన్సెలింగ్‌లో తాము హైదరాబాదులోని కళాశాలలను ఆప్షన్‌గా ఎంచుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా, రాదా అన్న అనుమానం ఏర్పడింది. 1956 ప్రాతిపాదికన తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఇక్కడి విద్యార్థులను ఆందోళనకు గురిచే స్తోంది. స్థానిక డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రీ ఇంజినీరింగ్ కోర్సులో పలువురు విద్యార్థులు చేరారు. కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురు చూస్తున్నారు. -
మీ విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తారా? లేదా?
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూటిప్రశ్న హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని నెపం నెడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజల ను మోసం చేస్తున్నారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రుణమాఫీ నుంచి అక్కడి ప్రజల దృష్టిని మళ్లించేందుకే దొంగ నాటకాలాడుతున్నారని, దీనిని ఆంధ్రా ప్రజలు ఆలోచించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారా? లేదా? అనేది తేల్చకుండా నిందలను తమపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పేరుతో ఫీజులు చెల్లిస్తామని ప్రకటించామని, అదే చంద్రబాబు మాత్రం పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? పేరు మార్చుకొని అమలు చేస్తారా? అనేది తేల్చడం లేదన్నారు. అక్కడి మం త్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు మొదట్లో తమ విద్యార్థుల ఫీజులను చెల్లిస్తామని చెప్పి, నాలుగు రోజులకే మాట మార్చారని విమర్శించారు. ఫీజుల చెల్లింపునకు స్థానికత అనేది తెలంగాణ అంతర్గత వ్యవహారమని, దానితో చంద్రబాబుకు సంబంధమేమిటని మంత్రి ప్రశ్నిం చారు. నిధులు, నీళ్లు, నియామకాల విషయాల్లోనే ఉద్య మం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాము తెలంగాణ విద్యార్థులకే ఫీజులను ఇస్తామని పునరుద్ఘాటించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను బాబు ఇచ్చినప్పుడే అక్కడి ఇతర పార్టీలు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పాయని, అయినా తనకు విస్డమ్ ఆఫ్ ఎకానమీ ఉందంటూ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని రుణాలను మాఫీ చేస్తామని దొంగ మాటలు చెప్పిన ఆయన.. ఇప్పుడు షరతులు పెడుతూ ఇంటికి ఒకటే రుణం మెలిక పెట్టడం మోసం కాదా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మోసాలను అక్కడి ప్రజలు గ్రహించి దాడి చేస్తారనే భయంతోనే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు చెప్పడమే మీ విస్డమ్ ఆఫ్ ఎకాన మా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టులో ఉన్న వారిలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సరిచేస్తామన్నారు. నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఏమంటారు?
తెలంగాణ సర్కారు అభ్యర్థనపై మీ అభిప్రాయమేంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏఐసీటీఈలకు సుప్రీం కోర్టు ప్రశ్న విచారణ ఆగస్టు 4కు వాయిదా సాక్షి, న్యూఢిలీ: ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగిం చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)ని కూడా వైఖరి వెల్లడించాలని సూచించింది. ఎంసెట్ కౌన్సెలింగ్ ఏఐసీటీఈ నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం జూలై 31వతేదీ లోగా పూర్తి కావాలి. అయితే తమది కొత్త రాష్ట్రం కావటం, తగిన యంత్రాంగం లేనందున కౌన్సెలింగ్ గడువును అక్టోబరు 31 వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం జూలై 16న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ సుధాంశుజ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఏపీ ప్రభుత్వం, ఏఐసీటీఈలను ఇంప్లీడ్ చేసి పిటిషన్ కాపీలను అందచేయాలని ఆదేశించింది. సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా వైఖరి చెప్పాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది గంగూలీని ధర్మాసనం ఆదేశించింది. విద్యార్థు లు నష్టపోతారని, ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా వేయొద్దని అభ్యర్థించడంతో అఫిడవిట్ దాఖలుకు ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సర్కారు ఈ కేసు విచారణ వాయిదా పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించారు. సమయం సరిపోకపోవటం తో విచారణ వేళలో అందచేయలేదు. తక్షణం కౌన్సెలింగ్‌కు ఆదేశించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని అఫిడవిట్లో కోరారు. ‘కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన షెడ్యూల్ మేరకు కౌన్సెలింగ్ నిర్వహణకు మేం సిద్ధం. షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు జరపని పక్షంలో విద్యార్థులు నష్టపోవడమే కాకుండా సాంకేతిక విద్యావిధానం దెబ్బతింటుందని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠతకు గురవుతున్నారు. అందువల్ల తక్షణం కౌన్సెలింగ్ ప్ర క్రియ చేపట్టాలి.’ అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
జిల్లాలో 42 శాతం ఇంజినీరింగ్ సీట్ల ఖాళీ
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా 42 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధిత రెండో విడత వెబ్ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించారు. కళాశాలల్లోని మొత్తం సీట్లలో 70 శాతం ఎంసెట్ ర్యాంకర్లతో భర్తీ చేయాలి. మిగిలిన 30 శాతం కళాశాల యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు అనుమతించారు. 70 శాతం సీట్లను ఎంసెట్ కన్వీనర్ కోటాలో ర్యాంకులు సాధించిన మెరిట్ విద్యార్థులతో భర్తీ చేస్తారు. జిల్లాలోని మొత్తం 18 ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా (70 శాతం) ఇంజినీరింగ్ అన్ని విభాగాల కింద మొత్తం 6489 సీట్లుండగా 3792 సీట్లు (58.43 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 26.97 సీట్లు (41.57 శాతం) ఖాళీగా మిగిలిపోయాయి. 11 ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 శాతానికిపైగా, ఏడు కళాశాలల్లో 50 శాతంలోపు భర్తీ అయ్యాయి. వీటిలోని మూడు కళాశాలల్లో పది అంత కంటే తక్కువ సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పేస్, రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రస్తుతం రైజ్ గాంధీలో మాత్రమే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో 98 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల మూడో స్థానంలో కొనసాగుతుండగా ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాల ఐదు స్థానాలు ఎగబాకి సీట్ల భర్తీలో నాలుగో స్థానంలో నిలిచింది. అధిక సంఖ్యలో సివిల్ సీట్ల భర్తీ సీట్ల భర్తీలో సివిల్ విభాగం అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలోని 18 కాలేజీల్లోని పదిహేనింటిలో మాత్రమే సివిల్ విభాగం ఉంది. ఈ 15 కళాశాలల్లోని ఎనిమిదింటిలో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీ విభాగంలో అత్యధికంగా సీట్లు మిగిలిపోయాయి. ఒక్క కళాశాల్లోనూ ఐటీ సీట్లు వంద శాతం భర్తీ కాలేదు. ఐదు కళాశాలల్లో ఐటీలో అసలు ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. ఆటోమొబైల్ విభాగం ఒక్క కళాశాలలో మాత్రమే ఉండగా అన్ని సీట్లూ భర్తీ అయ్యాయి. మెకానికల్, ఈసీఈ విభాగాల్లోనూ ఆరు కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఒకప్పుడు ఇంజినీరింగ్‌లో రారాజులా వెలిగిన సీఎస్ఈ విభాగంలో కేవలం మూడు కళాశాలల్లో మాత్రమే అన్ని సీట్లు నిండాయి. ఈఈఈ విభాగంలో మూడు కళాశాలల్లో మాత్రమే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్‌పై తగ్గుతున్న ఆసక్తి ఇంజినీరింగ్ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులకు మార్కెట్లో ఉద్యోగాలు లభించడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు కూడా విద్యార్థులను ఇంజినీరింగ్ విద్యకు దూరం చేస్తున్నాయి. మార్కెట్ అవసరాలకు దీటుగా ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంలో కళాశాలలు విఫలమవుతున్నాయి. ఇంజినీరింగ్ చదివి నిరుద్యోగులుగా మిగిలిపోయే కంటే డిగ్రీ చదవడం మేలని విద్యార్థులు భావిస్తున్నారు. ఫలితంగా ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లు మిగిలిపోతున్నాయి. జూనియర్ కళాశాలల జిల్లాస్థాయి క్రీడాపోటీలు వాయిదా ఒంగోలు స్పోర్ట్స్, న్యూస్‌లైన్: జూనియర్ కళాశాలల జిల్లాస్థాయి బాలికల క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో అథ్లెటిక్స్‌తోపాటు అన్ని క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాల్సి ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా పోటీలు వాయిదా వేసినట్లు ఆర్ఐఓ పీ మాణిక్యం తెలిపారు. పోటీలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
సీమ పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ ఏర్పాటు
వైవీయూ, న్యూస్‌లైన్: రాయలసీమ పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ ఏర్పాటైంది. కడప నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం రాయలసీమకు చెందిన 34 కళాశాలల నుంచి 74 మంది ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్‌గా కడప పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎన్. రాఘవరెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అనంతపురం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. సూర్యనారాయణరెడ్డిని కన్వీనర్‌గా, కడపకు చెందిన ఎం. తిప్పేస్వామిని ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కార్యచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా రెండు మూడు రోజుల్లో రీ షెడ్యూలు వస్తే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటామని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి నోటీసును త్వరలో ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీమ జిల్లాల పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, లైబ్రేరియన్లు, పీడీలు, ఏఓలు పాల్గొన్నారు. -
సజావుగా కౌన్సెలింగ్
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం సజావుగా సాగింది. మద్దిలపాలెంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు ధ్రువ పత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. కంచరపాలెంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు కౌన్సెలింగ్‌కు ఆటంకం ఏర్పడడంతో ఆ కేంద్రాలను వి.ఎస్.కృష్ణా కాలేజీకి మార్పు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడన్నా సజావుగా జరుగుతుందా అనే ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో ఉదయం ఆరు గంటలకే వీరంతా ఇక్కడికి చేరుకున్నారు. కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండడం, పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఉదయం 10.30 గంటలకు విద్యార్థులు, తల్లిదండ్రులను ర్యాంకు కార్డు ఆధారంగా కేంద్రాల్లోకి అనుమతించారు. సర్టిఫికెట్ల పరిశీలన : తొలుత 1 నుంచి 1000 లోపు ర్యాంకుల అభ్యర్థులను పిలవడంతో వీరిలో 378 ర్యాంకు అభ్యర్థి యు.నమ్రత తొలి రిజిస్ట్రేషన్‌కు హాజరయింది. ఆమె సర్టిఫికెట్ల సమాచారం పూర్తిగా నిర్ధారణ కాకపోవడంతో గాజువాకకు చెందిన 778 ర్యాంకర్ సూరంపూడి మణికంఠ కు తొలి రిజిస్ట్రేషన్ పత్రం స్క్రాచ్ కార్డును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.చంద్రశేఖర్ అందజేశారు. తర్వాత 378 ర్యాంకర్ నమ్రత పూర్తి సమాచారాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేయడంతో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ పరిశీలన పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన గంటకే సర్వర్ డౌన్ కావడంతో సుమారు గంట పాటు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన నిలిచిపోయింది. నిర్వాహకులు హైదరాబాద్ అధికారులతో సంప్రదించి సర్వర్‌ను పునరుద్ధరించారు. రాత్రి 10 గంటల వరకు ప్రక్రియ నిర్వహించగా 10 వేల ర్యాంకులకు 360 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగిన విద్యార్థిని డి.వసంత క్యాలిపర్స్ సహాయంతో కౌన్సెలింగ్‌కు వచ్చింది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరగనుంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి 10001 నుంచి 20000 ర్యాంకర్ల వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ తప్పుల తడక!
(న్యూస్‌లైన్, శ్రీకాకుళం ఫీచర్స్) : ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఎలాగైనా జరిపించి తీరాలన్న అధికారుల పట్టుదల విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. శిక్షణ లేని సిబ్బందితో విద్యార్థుల దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాల పరిశీలనను జరిపిస్తుండటంతో కౌన్సెలింగ్ తప్పుల తడకగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పాలిటెక్నిక్‌ల సిబ్బంది ఎంసెట్ కౌన్సెలింగ్‌ను బహిష్కరించటంతో సీమాంధ్రలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో మొదటి రెండు రోజులూ కౌన్సెలింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు జిల్లా కలెక్టర్ల సాయంతో కౌన్సెలింగ్ నిర్వహణకు నడుం కట్టారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో సర్టిఫికెట్ల పరిశీలనను నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలన కీలకం. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు, లోకల్ స్టేటస్‌కు సంబంధించిన పత్రాలను సిబ్బంది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. రెండ్రోజుల కిందట రాజమండ్రిలో జరిగిన కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనలోనే 150 తప్పులు జరిగినట్లు సమాచారం. శ్రీకాకుళం పాలిటెక్నిక్‌లో గురువారం జరిగిన కౌన్సెలింగ్‌లో అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వీరు తాత్కాలిక సిబ్బంది కావడంతో జవాబుదారీతనం ఉండటం లేదు. ఎస్వీ యూనివర్సిటీ పరిధికి చెందిన ఓ విద్యార్థినిని నాన్‌లోకల్(రాష్ట్రేతర) కేటగిరీలోకి మార్చేశారు. పాలిటెక్నిక్ లెక్చరర్ ఒకరు దీనిని గమనించి అధికారులను హెచ్చరించారు. అధికారుల దృష్టికిరాని ఇలాంటి తప్పులు మరెన్ని జరిగి ఉంటాయోనని ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వేరే సిబ్బందితో ఎలా చేయిస్తారు..? శిక్షణ లేని సిబ్బందితో కౌన్సెలింగ్ నిర్వహించడంపై పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్(పాలా) అధ్యక్షుడు చంద్రశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కౌన్సెలింగ్ ముగిసి సీట్లు కేటాయించిన తర్వాత విద్యార్థులు కోర్టులను ఆశ్రయించే ప్రమాదం ఉందన్నారు. అనుభవం లేని సిబ్బందితో కౌన్సెలింగ్ నిర్వహించకూడదని ఎంసెట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, అధికారుల తొందరపాటు నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను గందరగోళంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ ఏర్పాటుకు చర్యలు ‘పాలా’తో తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ల నాయకులు తెగతెంపులు చేసుకోవడంతో సమైక్యాంధ్ర పాలిటెక్నిక్ టీచర్స్ జేఏసీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సీమాంధ్రలోని పాలిటెక్నిక్‌లలో ఉన్న పాలా, నాన్ పాలా సభ్యులంతా కలిసి జేఏసీగా ఏర్పడి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చంద్రశేఖర్ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. రెండ్రోజుల్లో జేఏసీ సభ్యుల వివరాలు, కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు. -
గాడిలో పడిన ఎంసెట్ కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిచిన సంఘటనతో దిగివచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. కౌన్సెలింగ్ ప్రారంభమైన మూడు రోజుల వ్యవధిలో జిల్లాలోని రెండు పాలిటెక్నిక్ కళాశాల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరగక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి జరిగే సర్టిఫికెట్ల పరిశీలనలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మార్పులు చేసింది. ర్యాంకుల వారీగా పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరుకావాల్సిన విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపారు. గుంటూరు నగరపరిధిలో నల్లపాడు పాలిటెక్నిక్‌లో హాజరుకావాల్సిన విద్యార్థులు సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోనూ, గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హాజరుకావాల్సిన వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లాలని ప్రభుత్వ మహిళా కళాశాల కౌన్సెలింగ్ కేంద్రం కోఆర్డినేటర్ సీహెచ్ పుల్లారెడ్డి న్యూస్‌లైన్‌కు తెలిపారు. ఎస్టీ విభాగానికి చెందిన విద్యార్థులు తమ సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఏఎన్‌యూలో హాజరుకావాలి. బుధవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 355 మంది విద్యార్థుల హాజరయ్యారు. నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన.. ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు 45,001 నుంచి 60,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 45,001 నుంచి 49,000 వరకు, 57,001 నుంచి 60వేల ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 49,001 నుంచి 57,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి. నేటి నుంచి వెబ్ కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం గురువారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. ఒకటి నుంచి 40 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు గురు, శుక్రవారాల్లో జరిగే వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లు ఎంచుకోవాలి. విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పొందిన స్క్రాచ్‌కార్డుతో హెల్ప్‌లైన్ కేంద్రాలతో పాటు ఇంటర్నెట్ కేంద్రాల నుంచి ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకునే వీలుంది. -
జేఎన్టీయూలో ఎంసెట్ కౌన్సెలింగ్ నేడు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: ఎంసెట్ కౌన్సెలింగ్ రెండో రోజూ మంగళవారం కూడా జరగలేదు. సమ్మె ప్రభావంతో కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపి వేసినట్టు పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ టీఆర్ఎస్ లక్ష్మి మంగళవారం ప్రకటించారు. బుధవారం నుంచి జేఎన్టీయూలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు తమకు ఉత్తర్వులు అందాయని తెలిపారు. దీంతో కౌన్సెలింగ్‌కు సంబంధించి సామగ్రిని జేఎన్టీయూకు తరలిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగుల సమ్మె వల్ల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నిలిచిపోవడంతో రెండో రోజు మంగళవారం కూడా అభ్యర్థులు అరకొరగానే హాజరై కౌన్సెలింగ్ జరగకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా నిపుణులైన వారిచే ధ్రువీకరణ పత్రాలు పరిశీలన జరగాల్సి ఉంది. ఇందుకు సుమారు 10 మంది అధ్యాపకులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉండాలి. అరుుతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాలిటెక్నికల్ అధ్యాపకులు, సిబ్బంది విధులు బహిష్కరించడంతో కౌన్సెలింగ్‌కు బ్రేక్ పడింది. మంగళవారం నాటి కౌన్సెలింగ్‌కు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు హాజరై ఇంటిముఖం పట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టు టౌన్ ఎస్ఐ వై.కృష్ణకిశోర్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. కనీసం మూడో రోజైనా కౌన్సెలింగ్ జరుగుతుందా? అన్న అనుమానాలు నెలకొన్నారుు. అభ్యర్థుల పడిగాపులు... ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో రెండో రోజు కూడా బ్రేక్ పడడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యూరు. వచ్చిన కొద్దిపాటి మంది అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచే కళాశాలలో పడిగాపులు కాశారు. పది గంటల ప్రాంతంలో సిబ్బంది వచ్చి కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించడంతో ఏం చేయూలో తోచక అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేకపోతే ఎలాగని సిబ్బందిని నిలదీశారు. ఈ నెల 30 వరకు అవకాశం ఉందని, సమ్మె కారణంగానే జరగలేదని దీనిని గ్రహించాలని సిబ్బంది కోరారు. దీంతో చేసేది లేక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. -
కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ రెండో రోజు కూడా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని రెండు హెల్ఫ్‌లైన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 15001 నుంచి 22500 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 159 మంది సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారని సెంటర్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ పి.నర్సింహ తెలిపారు. ఎన్జీ కాలేజీ హెల్ప్‌లైన్ సెంటర్లో 22501 నుంచి 30 వేల వరకు ర్యాంకు అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంగా 152 మంది పాల్గొన్నారని వెరిఫికేషన్ అధికారి కోటేశ్వర్రావు తెలిపారు. నేడు 45 వేల ర్యాంకు వరకు బుధవారం 30,001 నుంచి 37500 ర్యాంకు వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో, 37501 నుంచి 45 వేల ర్యాంకు వరకు ఎన్జీకాలేజీ హెల్ఫ్‌లైన్ సెంటర్‌కు హాజరుకావాల్సి ఉంది. -
రెండో రోజూ ఎంసెట్ కౌన్సెలింగ్ బంద్
జేఎన్టీయూ, న్యూస్‌లైన్ : అనంతపురంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు రెండో రోజు మంగళవారం కూడా అడ్డుకున్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రాలకు సమైక్యవాదులు ఉదయం ఆరు గంటలకే చేరుకుని కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులను వెనక్కు పంపించేశారు. మొదటి రోజు జరగనందున కనీసం రెండో రోజైనా జరుగుతుందనే ఆశతో కౌన్సెలింగ్ వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. పాలిటెక్నిక్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో కౌన్సెలింగ్‌కు ప్రిన్సిపాల్ మాత్రమే హాజరయ్యారు. ఎస్కేయూలో కౌన్సెలింగ్ కేంద్రానికి తాళం వేసి.. విద్యార్థులను వెనక్కు పంపారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది సమ్మెలో ఉన్నారని.. ఒక్కడితో కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదన్నారు. కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని, అక్కడి నుంచి నిర్ణయం రాగానే మొదలు పెడతామన్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు కౌన్సెలింగ్ తేదీలు పత్రికల్లో ప్రకటించే వరకు కౌన్సెలింగ్‌కు రావద్దన్నారు. -
ప్రశాంతంగా ఎంసెట్ కౌన్సెలింగ్
గుణదల, న్యూస్‌లైన్ : విజయవాడలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ రెండవరోజు ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. సమైక్యవాదులు కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు రాకపోవటంతో నిర్ణీత సమయంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. మాచవరంలోని ప్రభుత్వ ఎస్ఆర్ఆర్ కళాశాల, గుణదల ఆంధ్ర లయోల కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది సమైక్యాంధ్రకు మద్దతుగా రెండవరోజు కూడా విధులు బహిష్కరించటంతో ఆ కేంద్రం వద్ద కౌన్సెలింగ్ జరగలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మిగతా కేంద్రాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర లయోల కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ సక్రమంగానే జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన కౌన్సెలింగ్‌లో 355 మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలోనూ కౌన్సెలింగ్ సజావుగానే సాగింది. ఇక్కడ 313 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. మౌలిక వసతుల లేమి.... కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం తాగటానికి మంచినీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఆన్లైన్ ప్రక్రియకు పలుమార్లు ఆటంకం కలగటంతో ప్రక్రియ ఆలస్యం అవుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నేటి కౌన్సెలింగ్ వివరాలు... బుధవారం జరగబోయే కౌన్సెలింగ్ ప్రక్రియలో లయోలా కళాశాలలో 25,001 నుంచి 30 వేల ర్యాంకు గల విద్యార్థులు హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో 40,001 నుంచి 45 వేల ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
సమ్మె ఆపండి: సీమాంధ్ర ఉద్యోగులకు జేపీ విజ్ఞప్తి
కోస్తా, రాయలసీమ ప్రభుత్వ ఉద్యోగులు తాము చేపట్టిన సమ్మె ఆపాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సహచర నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోనైనా, ఆంధ్రాలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ఉద్యమాలలో పాల్గొనడం మంచి సంప్రదాయం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులు కాబట్టే వారికి ప్రత్యేక ఉద్యోగ భద్రతా ఏర్పాట్లున్నాయని, రాజకీయ కారణం కోసం వారు సమ్మెకు దిగడం సరికాదని సూచించారు. ఉద్యోగులు ఎంసెట్ కౌన్సిలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె వల్ల కౌన్సిలింగ్ మొదటి రోజు చాలా మంది విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవకాశం లేకుండా పోయిందన్నారు. తాము ఎవరి తరుఫున పోరాటం చేస్తున్నామని చెబుతున్నారో, ఆ ప్రజలు విద్యార్థుల మీదే యుద్ధాన్ని ప్రకటించినట్టయిందన్నారు. ఉద్యోగులకు ఏవైనా అభ్యంతరాలుంటే నల్ల బ్యాడ్జీలు ధరించో.. ఎక్కవసేపు పనిచేసో.. సాయంత్రం సమయాల్లో సమావేశాలు నిర్వహించో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించాలి తప్ప, ఈ రకంగా సమ్మెలకు దిగడం మంచిది కాదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి ప్రజలకు నష్టం కలిగించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగులు రాజకీయ పార్టీల ఉచ్చులో చిక్కుకొని సాటి ఉద్యోగులతో ఘర్షణకు దిగే ధోరణికి స్వస్తిచెప్పాలని కోరారు. లోక్‌సత్తా బహిరంగ సభలు రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల మీద రాష్ట్ర ప్రజల మధ్య అవగాహన పెంచి, సామరస్య పరిష్కారం దిశగా వారిని నడిపించేందుకు లోక్‌సత్తా పార్టీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో బహిరంగసభలను నిర్వహిస్తోందని జయప్రకాష్‌నారాయణ ప్రకటించారు. హైదరాబాద్ ఆదాయం, ఉద్యోగుల పరిస్థితి, ఇతర వనరులకు సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహస్య వైఖరి వీడి బైటపెట్టాలని డిమాండ్ చేశారు. తాబట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనే ధోరణి కాకుండా సామరస్య పరిష్కారం దిశగా చర్చలకు ఈ వేళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు తగిన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. పార్టీ నిర్వహించే సభల వివరాలను ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో కొన్ని లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం కోసం తప్ప, ఇక్కడి ప్రజల పట్ల ప్రేమతో కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యవ హారం సొంత వ్యవహారంగా చూడడం వల్లే, పార్లమెంటరీ లేదా కేబినేట్ కమిటీ వేయకుండా కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆంటోని కమిటీ వేసిందన్నారు. హైదరాబాద్, ఆదాయం, ఉద్యోగుల సమస్య, నీటి వనరులు, రాయలసీమ- ఈ అంశాలన్నింటిపై ప్రజలలోకి తీసుకెళ్లి బహిరంగ సభలలో చర్చ చేస్తామని, వారిలో అవగాహన పెంచి పరిష్కారంలో భాగస్వాముల్ని చేస్తామన్నారు. ఇంకా సమస్య ఉంటే పరిస్థితులను బట్టి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనపై సంక్షోభానికి సంబంధించి ఈ తతంగమంతా పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందన్నారు. ప్రజల మధ్య ఈర్ష్యాభావాల్ని ప్రేరేపించడం నికృష్ణ రాజకీయం, నీచ నాయకత్వమని విమర్శించారు. అందరి ప్రయోజనాలను సమన్వయం చేస్తూ అందరికీ ఎదిగే అవకాశాలను కల్పించడం జన రాజకీయమని వ్యాఖ్యానించారు. సభలు, సమావేశాలు, కరప్రతాలు వంటి మార్గాల ద్వారా రాష్ట్రంలోని సంకోభాన్ని నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు, వ్యవస్థలో మార్పునకు దీన్నో అవకాశంగా వినియోగించుకునేందుకు లోక్‌సత్తా పార్టీ కృషి చేస్తోందని జయప్రకాష్ణారాయణ అన్నారు. -
ఎంసెట్ కౌన్సిలింగ్‌కు మరో 3 కేంద్రాలు
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సిలింగ్‌కు కొత్తగా 3 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (శ్రీకాకుళం), జేఎన్టీయూ (విజయనగరం), గవర్నమెంట్ డిగ్రీ మహిళా కాలేజ్ (ఒంగోలు) లలో కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆప్షన్లు ఇవ్వలేకపోయిన విద్యార్థులు ఆందోళన చెందవలసిన అవసరంలేదని మండలి తెలిపింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన తర్వాతే సీట్ల కేటాయింపు జరుగుతుందని మండలి పేర్కొంది. అవకాశం కోల్పోయిన విద్యార్థులకు మరోసారి షెడ్యూల్ విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి తెలిపింది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా సీమాంధ్రలో కౌన్సిలింగ్‌కు చాలా మంది విద్యార్థులు హాజరుకాలేకపోయిన విషయం తెలిసిందే. -
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతం
ఖమ్మం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ సోమవారం జిల్లాలోని మూడు సెంటర్లలో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం మండల పరిధిలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, భద్రాచలంలోని ఎటపాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి విడత ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. 1నుంచి 15 వేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మూడు సెంటర్లలో కలిపి 321 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మెలు, ఆందోళనల నేపథ్యంలో పలువురు ఉద్యోగులు కౌన్సెలింగ్‌ను బహిష్కరించారు. పలు చోట్ల విద్యార్థి సంఘాలు కూడా కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నాయి. ఇది గమనించిన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు మన జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పక్క జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగే అవకాశం ఉందని కౌన్సెలింగ్ అధికారులు చెపుతున్నారు. మంగళవారం జరిగే కౌన్సెలింగ్‌లో 15, 001వ ర్యాంకు నుంచి 30 వేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని వారు సూచించారు. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో సోమవారం జరిగిన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 250 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ జిల్లా కో ఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే పలువురు విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. కౌన్సెలింగ్ సజావుగా నిర్వహించడంతోపాటు, విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొత్తగూడెం మండల పరిధిలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం, పాల్వంచ, సత్తుపల్లి, మధిర ప్రాంతాల నుంచి సుమారు 54 మంది హాజరైనట్లు ఎంసెట్ అసిస్టెంట్ క్యాంప్ అధికారి ఎన్.వి.ఆర్.కె.శర్మ తెలిపారు. ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఇక్కడ 10.30 గంటల వరకు ప్రారంభం కాలేదు. భద్రాచలం పట్టణ సమీపంలోని ఎటపాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సారిగా ఎంసెట్ కౌన్సెల్సింగ్ నిర్వహించారు. తొలిరోజున 1 నుంచి 15 వేల లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. తొలిరోజున 17 మంది విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ గుణశేఖరన్ తెలిపారు. రెండవ రోజున 15,001 ర్యాంకు నుంచి 30 వేల లోపు ర్యాంకర్ల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు చెప్పారు. -
ప్రారంభం కాని ఎంసెట్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: అనుకున్నట్లే జరిగింది. ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం ముందు సర్కారు ఎత్తులు పారలేదు. ఎంత ఒత్తిడి చేసినా అధ్యాపకులు లొంగలేదు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. మిణుకుమిణుకుమంటున్న ఆశతో రవాణా సౌకర్యాలు లేకపోయినా అష్టకష్టాలు పడి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. గంటల తరబడి వేచి చూసి ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసినా.. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు గుర్తున్నా.. ఉప ముఖ్యమంత్రి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ మొండిగా కౌన్సెలింగ్ ప్రారంభించాలని ఆదేశించడంతో విద్యార్థులకు కష్టనష్టాలే మిగిలాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌ను సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ తీర్మానం మేరకు బహిష్కరించారు. కౌన్సెలింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి ప్రకటించడంతో శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రానికి సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తొమ్మిది గంటల నుంచి ప్రవేశాల దరఖాస్తు పత్రాలను ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ దత్ విద్యార్థులకు అందజేశారు. అయితే రిజిస్ట్రేషన్ కౌంటర్ మాత్రం ప్రారంభించలేదు. దరఖాస్తులు పూర్తి చేసిన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం నిరీక్షించారు. అధ్యాపకులు మాత్రం హెల్ప్‌లైన్ సెంటర్లో విధులకు హాజరు కాలేదు. మిగతా జిల్లాల్లో కౌన్సెలింగ్ పరిస్థితిని టీవీ చానళ్ల ద్వారా తెలుసుకున్న వీరు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. మరోపక్క ప్రిన్సిపాల్ దత్‌కు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ కన్వీనర్, జిల్లా కలెక్టర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఎలా అయినా ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని, కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నది వాటి సారాంశం. ఇదే విషయాన్ని అయన అధ్యాపకులకు వివరించి, విధుల్లోకి రావాలని కోరగా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులు బహిష్కరిస్తున్నట్లు వారు తేల్చి చెప్పారు. ఎస్మా, నో వర్క్-నో పే వంటి బెదిరింపులకు ప్రభుత్వం పాల్పడుతున్నా అధ్యాపకులు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కూడా వారి బాటలోనే నడిచారు. ఫలితంగా 1 నుంచి 15వేల ర్యాంకర్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగలేదు. ఈ ర్యాంకుల మధ్య జిల్లాకు చెందినవారు 130 నుంచి 150 మంది వరకు ఉంటారని అధికారుల అంచనా. కాగా ఉదయం ఎనిమిది గంటలకే హెల్ప్‌లైన్ కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు 11గంటల వరకు వేచి చూసి నిరాశతో వెనుదిరిగారు. ముందు జాగ్రత్త చర్యగా పాలిటెక్నిక్ కళాశాల గేటు ముందు,సహాయ కేంద్రం ముందు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 22, 23 తేదీల్లో 40 వేల లోపు ర్యాంకు పొందినవారు ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే 23లోగావీరందరి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి కావాలి. అసలు పరిశీలనే ప్రారంభం కాకపోతే మొత్తం ప్రక్రియను వాయిదా వేయాల్సింది. ఎందు కంటే రాష్ట్రం యూనిట్‌గా కౌన్సెలింగ్ జరుగుతుంది. విద్యార్థులు తమ ర్యాంకును బట్టి నచ్చిన కళాశాలలు, బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చు కోవాలి. ఏ ఒక్కచోట ఇవి జరగకపోయినా రాష్ట్రమంతటా కౌన్సెలింగ్ నిలిచిపోతుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పాలిటెక్నిక్ అధ్యాపకులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వ ఒత్తిడికి వారు లొంగడంలేదు. ఇంకా బెదిరిస్తే బోధన, మూల్యాంకన మాత్రమే తమ విధుల్లో భాగమని.. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడం అదనపు బాధ్యతలని తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కూడా ప్రారంభమయ్యే అవకాశం లేదు. కౌన్సెలింగ్ వాయిదా అనివార్యంగా కనిపిస్తోంది. -
ఆగిన ఎంసెట్ కౌన్సెలింగ్
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: తిరుపతిలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచి పోయింది. సోమవారం ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్‌ను ఉద్యోగులు బహిష్కరించారు. దీంతో గత్యం తరం లేక కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. ఉన్నత విద్యాశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. తిరుపతిలో ఎస్వీ పాలిటెక్నిక్ , ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో కౌన్సెలింగ్ జరపాలని నిర్ణయించారు. దీంతో ఈ రెండు కేంద్రాల వద్ద పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడానికి వచ్చిన సమైక్యవాదులను పోలీసులు నిలువరించారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే 8 మంది సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలించారు. అప్పటికే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఎంసెట్ సిబ్బంది విధులను బహిష్కరించినట్లు అధ్యాపకులకు సమాచారం అందింది. వెంటనే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్ విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు విధులను బహిష్కరించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసర్ ఎన్.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించామన్నారు. విధుల్లో ఉన్న 20 మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం విధులు బహిష్కరించడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేశామన్నారు. కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో వారం రోజులుగా బస్సులు తిరగడం లేదన్నారు. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని సమయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే విద్యార్థులు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్ జరగనివ్వమన్నారు. ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో.. పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ కోసం ఇతర జిల్లాల నుంచి కూడా అభ్యర్థులు తల్లిదండ్రులను వెంటబెట్టుకొని పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే మూడు రోజుల నుంచి కౌన్సెలింగ్ సిబ్బంది సమ్మెలో ఉండడంతో వారు విధులకు హాజరు కాలేదు. దీంతోపాటు ఉద్యమకారులు, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం ప్రతినిధులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని ధర్నాకు దిగారు. కౌన్సెలింగ్ సెంటర్ ఎదుట మానవహారం నిర్మించి రాస్తారోకో చే శారు. క్యాంప్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డితో చర్చలు జరిపి కౌన్సెలింగ్‌ను ఆపేయాలని కోరారు. దీంతో సుధాకర్‌రెడ్డి అభ్యర్థులతో, వారి తల్లి దండ్రులతో చర్చించి, పరిస్థితిని తిరుపతి ఆర్డీవోకు వివరించి కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అభ్యర్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు. చిత్తూరులో భారీ భద్రత నడుమ ఎంసెట్ కౌన్సెలింగ్ చిత్తూరు(టౌన్): చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం పోలీసుల భారీ భద్రత నడుమ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కళాశాల వద్దకు చేరుకున్న సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా విద్యార్థులు హాజరు కాలేరని, కౌన్సెలింగ్ వాయిదా వేయాలంటూ డిమాండ్ చే స్తూ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో 8 మంది సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సోమవారం 80 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. దీనికి అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డీవో పెంచల్ కిషోర్, ఎంసెట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. -
కౌన్సెలింగ్‌పై ఉత్కంఠ!
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ తగులుతోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు దూరమని ఉద్యోగులు ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై ఎట్టకేలకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అనువైన పరిస్థితులు కానరావడం లేదు. ఈ ఏడాది మే 10న నిర్వహించిన ఇంజినీరింగ్ అర్హత పరీక్షకు జిల్లాలో 17, 582 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మే నెలాఖరులో ప్రకటించారు. పరీక్షకు హాజై రెన విద్యార్థులంతా దాదాపుగా ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి అర్హత సాధించారు. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం నుంచి విశాఖలో పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు దీక్షలో పాల్గొంటున్నారు. వీరితో పాటు జిల్లాని అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం, పాడేరు ప్రభుత్వ కళాశాలల సిబ్బంది మద్దతు తెలుపుతున్నారు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్‌లోని ఉద్యోగులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా విధులను బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మాకుమ్మడి సెలవులు పెట్టారు. ఈ నెల 19 నుంచి హెల్ప్ సెంటర్లలో విధులకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు. దీనికితోడు విధులను బహిష్కరిస్తున్నట్టు పాలా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంధ్రశేఖర్ మరోమారు ప్రకటించారు. కన్వీనర్ నుంచి ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.దేముడు చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో... ప్రధానంగా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వీటి ఆధారంగానే విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తారు. ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులంతా సమ్మెలో ఉండటం వల్ల వీటిని పొందే అవకాశం లేదు. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు బస్సుల ఇబ్బంది తలెత్తనుంది. సమైక్యాంధ్ర సమ్మె వల్ల రోడ్లపై ఆందోళనలతో వాహనాలు తిరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తే అధికశాతం మంది విద్యార్థులు హాజరు కాకపోవడమే కాకుండా, ధ్రువపత్రాలు లేక మరికొంతమంది అనర్హులుగా పరిగణించబడతారు. దీంతో కౌన్సెలింగ్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. -
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్:ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది. ఈనెల 19న నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ ౩ వరకూ ఆప్షన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 4న ఆప్షన్ల మార్పుకు సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. సెప్టెంబర్ 5న సీట్ల కేటాయింపును నిర్వహిస్తుండగా, 11 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని పేర్కొంది. గతంలో హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు తెలిపింది. -
ఎంసెట్ కౌన్సెలింగ్పైనీలినీడలు
సాక్షి, మంచిర్యాల : ‘సాంకేతిక విద్య కోర్సులకు సంబంధించి.. జూన్ 30లోగా తొలి విడత అడ్మిషన్లు పూర్తి చేసి.. ఆగస్టు ఒకటో తేదీన ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభించండి..’ - మే నెలలో సుప్రీం కోర్టు ఆదేశం. ‘జూన్ 28లోగా.. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ , ఫీజుల నోటిఫై వివరాలు సమర్పించాలి.’ - జూన్ 26న ఏఎఫ్ఆర్సీ, ఉన్నత విద్యాశాఖ, ఎంసెట్ కన్వీనర్లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నౌషద్ అలీ ఆదేశం. ‘రాష్ట్రంలో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఆగస్టులో తరగతుల ప్రారంభించలేం. కొంత గడువు ఇవ్వండి..’ - గత నెల సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ పిటీషన్. ఆగస్టు మూడో తేదీ దాటింది.. అయినా.. ఇంత వరకు తొలి విడత అడ్మిషన్లు పూర్తి కాలేదు.. అసలు కౌన్సెలింగ్ తేదే ప్రకటించలేదు. ఇదీ మన సర్కార్ పనితీరు. ఎంసెట్ పరీక్ష ఫలితాలు వెలువడి నేటికి 60 రోజులైంది. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయి.. ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంత వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు.. కనీసం కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం.. కాదు మేమే భర్తీ చేసి మీకు వివరాలు అందజేస్తామని కాలేజీ యాజమాన్యాలు భీష్మించుకుని కూర్చోవడంతో కౌన్సెలింగ్‌కు బ్రేక్‌పడింది. ప్రస్తుతం ఆ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. కోర్టు తీర్పు చెప్పాలంటే.. ప్రభుత్వం కోర్టుకు భర్తీ ఆవశ్యకత, నివేదిక సమర్పించాలి. కానీ ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఒక్కరు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జిల్లాలో ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన వెయ్యికి పైగా మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులకు ఎదురుచూపులే..! మే నెల 10న ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 1,673 మంది పరీక్ష రాశారు. గత నెల 5న ఫలితాలు విడుదలయ్యాయి. వీరిలో వెయ్యికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. జూన్ నెల 30లోగా తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి అదే నెల 16న కౌన్సెలింగ్ తేదీ ప్రకటించి.. 30లోగా పూర్తి చేయాలి. జూలై రెండో వారంలో తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. ఫలితాలు ప్రకటించి 60 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు ప్రభుత్వం కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించలేదు. మరోపక్క.. కొందరు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నారు. వీరికి ఇతర రాష్ట్రాల్లోనూ సీట్లు వచ్చాయి. కానీ.. మన రాష్ట్రంలోనే ఇంజినీరింగ్ చేద్దామనే ఆలోచనతో ఆ కాలేజీల్లో చేరలేదు. కౌన్సెలింగ్‌కు జరుగుతున్న ఆలస్యం వీరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికి రెండుసార్లు కోర్టుకు..! నోటిఫికేషన్ విడుదలలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌రెడ్డి, నేహా, మీనా విద్యార్థులు జూన్ నెల 25న హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నౌషద్ అలీ జూన్ 28లోగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ , ఫీజుల నోటిఫై వివరాలు సమర్పించాలని ఏఎఫ్ఆర్సీ, ఉన్నత విద్యాశాఖ, ఎంసెట్ కన్వీనర్లను ఆదేశించారు. దీంతో ఫీజుల నోటిఫైపై కసరత్తు చేసిన ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల వివరాలు సమర్పించింది. కానీ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి.. నేరుగా అడ్మిషన్లు చేపట్టాలా..? ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలా..? అనే వ్యవహారం ఇంకా తేల్చలేదు. దీంతో హైదరాబాద్‌కు చెందిన లీలాకృష్ణ అనే మరో విద్యార్థి మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి రామమోహనరావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఁకౌన్సెలింగ్ నిర్వహిస్తే.. నిర్వహించండి లేదా తప్పుకోండి. విద్యార్థులే ప్రత్యామ్నాయం చూసుకుంటారని* ఘాటుగా స్పందించింది. జీవో 66పై ‘స్టే’ ఎత్తివేయండి..! ఈ విద్యా సంవత్సరం నుంచి.. వృత్తి విద్యా కాలేజీల్లో ఆన్లైన్ ద్వారానే మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లు చేపట్టాలని మూడు నెలల క్రితం ప్రభుత్వం జీవో 66 విడుదల చేసింది. జీవోపై సవాలు చేస్తూ.. ప్రైవేట్ యాజ మాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. స్పందించిన కోర్టు జీవోపై స్టే విధించి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 66పై స్టే ఎత్తివేయాలని కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేసింది. అయినా కోర్టు నుంచి ఇంత వరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. మేనేజ్మెంట్ కోటా కింద ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రూ.90 వేల ఫీజును ఖరారు చేసింది. కానీ చాలా కాలేజీల్లో యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి రావడంతో.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. కౌన్సెలింగ్ ఇక ఎప్పుడు ప్రారంభవుతుందో.. క్లాసులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి ఉంది