తిరుపతి, చిత్తూరులో హెల్ప్‌లైన్ సెంటర్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. దీనికోసం జిల్లాలో మూడు హెల్ప్ లైన్ సెంటర్లను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఏర్పాటుచేశారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బాలాజీ కాలనీలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, చిత్తూరులో పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు ఆయా తేదీల్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
ఇందులో భాగంగా తొలిరోజు తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో 1 నుంచి 2,500, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల్లో 2,501 నుంచి 5వేల ర్యాంకు వరకు, చిత్తూరులోని పీకీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో 1 నుంచి 5వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. జిల్లాలోని ఎస్టీ విద్యార్థులు మాత్రం ఆయా తేదీల్లో తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనే సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేని విద్యార్థులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డును వెంట తీసుకురావాలి.
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
Published Mon, Jun 6 2016 3:01 AM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM
Advertisement
Advertisement