చంద్రబాబు.. ఇంత నీచంగా వ్యవహరించాలా?: భూమన | YSRCP Bhumana Karunakar Reddy Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. ఇంత నీచంగా వ్యవహరించాలా?: భూమన

Published Mon, Feb 3 2025 11:37 AM | Last Updated on Mon, Feb 3 2025 12:00 PM

YSRCP Bhumana Karunakar Reddy Serious Comments On CBN Govt

సాక్షి, తిరుపతి: తిరుపతిలో మున్సిపల్‌ ఎన్నికల వేళ కూటమి నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను భయభాంత్రులకు గురిచేశారు. ఓటింగ్‌ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలపై వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన కరుణాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎ‍స్సార్‌సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్‌ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయమేంటి?. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.

అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం తిరుపతి మేయర్‌ శిరీష మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. మహిళా కార్పొరేటర్‌ అని కూడా చూడకుండా దాడి చేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి. మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం’ అని కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement