Bhumana karunakara Reddy
-
చంద్రబాబు.. ఇంత నీచంగా వ్యవహరించాలా?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయభాంత్రులకు గురిచేశారు. ఓటింగ్ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయమేంటి?. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం తిరుపతి మేయర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి. మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం’ అని కామెంట్స్ చేశారు. -
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
సాక్షి, తిరుపతి: ‘రామోజీరావు నాకు చాలా సన్ని హితులు. నేను ఆయనను 15 సార్లకుపైగా కలి శా. ఒకసారి వెళ్లి కలిసినప్పుడు రామోజీరావు.. ‘కరుణాకర్‌రెడ్డి గారు.. రూ.2వేల కోట్లు జగన్ నుంచి ఇప్పిస్తే ఈనాడంతా మీ గురించే రాస్తాం’ అన్నారు. ఇది వాస్తవం.. ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం. తన బిడ్డలు, మనవళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీ చెప్పగలరా’ అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీ కుమారుడు సుమన్ తనకు బాగా తెలుసన్నారు. ఒకసారి కలిసిన సమయంలో సుమన్ తన తండ్రి అన్నమాటలను తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. రామోజీÆకి తాను పుట్టలేదన్నారని.. అటువంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసినట్టయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. 1974లో రాడికల్ స్టూడెంట్ నాయకుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో ‘చక్రపాణి’ సినిమాను బెనిఫిట్ షోగా వేశామని తెలిపారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబుని తాను శ్రీధర్, హైకోర్టు అడ్వకేట్ సారధి వెళ్లి కలిశామన్నారు. ఆ సమయంలో బాబు కూర్చొని, ఆయన స్నేహితుడు పడుకుని ఉన్నాడన్నారు. సినిమా టికెట్ కొనుగోలు చేయాలని అడిగితే.. నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న రూ.2లను బాబు దొంగిలించి తన చేతిలో పెట్టారని తెలిపారు. -
అయోధ్యకు లక్ష వెంకన్న లడ్డూలు
తిరుమల: అయోధ్యలో సోమవారం జరుగనున్న బాల రాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ప్రసాదం అయిన లక్ష లడ్డూలను రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆదివారం అందజేశారు. తొలుత రామ మందిరానికి చేరుకున్న కరుణాకరరెడ్డికి రామ మందిర ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులతో మాట్లాడారు. కలియుగంలో తిరుమలలో స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి అని చెప్పారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామ మందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. రసరమ్యంగా అయోధ్యకాండ అఖండ పారాయణం లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం జరిగిన 6వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తిసాగరంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయోధ్యకాండలోని 18 నుంచి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు కె.రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, మారుతి శ్లోక పారాయణం చేశారు. -
టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ప్రారంభం
సాక్షి,తిరుమల: టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ పేరుతో ఇతర వెబ్సైట్ వస్తుండటంతో టీటీడి తాజా వెబ్సైట్ పేరు మార్పు చేసింది. శ్రీవారి భక్తులు ఇకపై టీటీడీ సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ తెలుసుకోవచ్చు. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టీటీడీ వెబ్సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.inను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరు మార్పుని 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్' లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్లైన్ బుకింగ్‌ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్ సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్‌సైట్‌ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్‌సైట్‌ను tirupatibalaji.ap.gov.inగా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.inగా కొత్త పేరుని పెట్టారు. ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు. -
శాస్త్రోక్తం కైశికద్వాదశి ఆస్థానం
తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం శాస్త్రోక్తం నిర్వహించారు. ఉదయం 4.45 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు.తిరుమల వసంత మండపంలో శ్రీతులసి దామోదర పూజ ఘనంగా నిర్వహించారు. అలాగే తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి శాస్త్రోక్తం జరిపారు. 26న కార్తీక పర్వదీపోత్సవం..27న పౌర్ణమి గరుడసేవ శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. కాగా, పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 27న గరుడసేవ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. -
టీటీడీ నిధులతో నిర్మాణాలకు పెద్దపీట
తిరుమల: టీటీడీ నిధులతో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి సమీపంలోని పుదిపట్ల జంక్షన్ నుంచి వకుళమాత ఆలయం వద్ద జాతీయ రహదారి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.21.10 కోట్లతో టెండర్ ఆమోదం. ఇది పూర్తయితే తిరుపతికి పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. ► ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రూ.1.65 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి పనులకు టెండర్ ఆమోదం. ► తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రుయా ఆస్పత్రిలో నూతన టీబీ వార్డు నిర్మాణానికి రూ.1.79 కోట్లతో టెండర్ ఆమోదం. ► స్విమ్స్ ఆస్పత్రిలో మరింత మంది రోగుల సౌకర్యం కోసం రూ.3.35 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనంపై మరో రెండు అంతస్తుల నిర్మాణానికి టెండరు ఆమోదం. ► స్విమ్స్‌లో నూతన కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి రూ.74.24 కోట్లతో టెండర్ ఖరారు. ► స్విమ్స్ ఆస్పత్రి భవనాల ఆధునికీకరణకు, పునర్నిర్మాణానికి రూ.197 కోట్లతో చేపట్టే పనులకు పరిపాలనా అనుమతికి ఆమోదం. మూడేళ్లలో దశలవారీగా చేపట్టేందుకు నిర్ణయం. ► నడక దారుల్లో భక్తుల భద్రత కోసం డిజిటల్ కెమెరా ట్రాప్‌లు, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్, కంట్రోల్ రూమ్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్ల మంజూరుకు ఆమోదం. ► కరీంనగర్లో శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్ల పనులకు టెండర్ ఆమోదం. 23న విశేష హోమం ► శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వద్దగల సప్తగోప్రదక్షిణ మందిరంలో ప్రారంభం. ఇందుకోసం టికెట్ ధర రూ.1000గా నిర్ణయం. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొనవచ్చు. ఈనెల 16న టీటీడీ ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తారు. ► టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రాష్ట్ర ప్రభుత్వ జీవో 114 విధివిధానాలకు లోబడి టీటీడీలో అమలుకు నిర్ణయం. ► తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ కలంకారీ, శిల్పకళలో ప్రాథమిక శిక్షణ సాయంకాలం కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం. -
అయ్యో.. ఆరేళ్లకే నూరేళ్లు!
తిరుమల/కోవూరు: తిరుమల కొండపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలిపిరి నడకదారిలో శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ వన్యమృగం చేసిన దాడిలో మృత్యువాత పడింది. నరసింహస్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం, పోతిరెడ్డిపాళేనికి చెందిన దినేష్ కుమార్, తన భార్య శశికళ, కుమార్తె లక్షిత (6), కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వారంతా అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల కంటే ముందుగానే ఆ చిన్నారి నడుస్తుండడంతో వేరే భక్తుల గుంపులో కలిసి వెళ్లి ఉంటుందని తల్లిదండ్రులు తొలుత భావించి వెతకడం ప్రారంభించారు. ఎంతకూ కనపడకపోవడంతో చివరికి భద్రతా సిబ్బందికి తెలిపారు. రాత్రి 10.30కు తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్మోహన్రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. రాత్రి నుంచి 70 మంది టీటీడీ, అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం సమీపంలోని నడకదారి నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పూర్తిగా ముఖాన్ని జంతువు తినడంతోపాటు కాలిని తీవ్రంగా గాయపర్చింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. చిరుత లేదా ఎలుగుబంటి దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ సాయినాథ్ చౌదరి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కలిచివేసింది: ఈఓ ధర్మారెడ్డి చిన్నారి మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి టీటీడీ నుంచి రూ.5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పారు. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించామన్నారు. బాలిక నరసింహస్వామి ఆలయానికి సమీపంలో నడకదారి నుంచి పక్కకు అటవీ ప్రాంతంలోకి ఆడుకుంటూ వెళ్లినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఎందుకంటే.. బాలిక ఆటవస్తువులు అటవీ ప్రాంతంలోనే దొరికాయని తెలిపారు. ఈ సమయంలో వన్యమృగం దాడిచేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు. భద్రత విషయంలో రాజీలేదు: భూమన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆయన అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యంలేదని చెప్పారు. పోతిరెడ్డిపాళెంలో విషాదఛాయలు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి వన్యమృగం దాడిలో మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న పోతిరెడ్డిపాళెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలిక మృతి వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. దినేష్ ఇంటి వద్దకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వెంటనే టీటీడీ బోర్డు చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డికి ఫోన్‌చేసి బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అధికారులతో అత్యవసర సమావేశం అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మరింత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో జరిపిన అత్యవసర సమావేశంలో ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటుకు సమగ్ర నివేదిక అందించాలని డీఎఫ్ఓను ఆదేశించామన్నారు. వన్యమృగాన్ని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ 100 మంది భక్తుల గుంపునకు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారుల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్నపిల్లలతో నడకమార్గాల్లో వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఈఓ విజ్ఞప్తి చేశారు. సీసీఎఫ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బోన్ల ద్వారా నడక మార్గాల్లో సంచరించే వన్యమృగాలను బంధిస్తామన్నారు. -
శ్రీహరి కరుణ
ఆ కలియుగ వేంకటేశ్వరుడికి సేవచేసే భాగ్యం దక్కడం అత్యంత అరుదు. అదే రెండో పర్యాయం ఆ స్వామికి సేవ చేయడమంటే నిజంగా అదృష్టమే. అది ఆ శ్రీహరి కరుణే! ఈ అరుదైన అవకాశం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి దక్కింది. ఆయనను టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో భూమన టీటీడీ చైర్మన్‌గా నియమితులవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మరోమారు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆయన స్థానంలో ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా భూమన చేతికి టీటీడీ పగ్గాలు రావడం ఇది రెండోసారి. 2006–2008 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్‌గా కొనసాగారు. సంస్కరణలకు మారుపేరు భూమన గతంలో భూమన కరుణాకరరెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చి టీటీడీ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. ఇందులో కొన్ని విశేష ఆదరణ పొంది దేశవిదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాయి. అందులో మచ్చుకు కొన్ని.. ► దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అసమానతలు, అంటరానితనాన్ని నిర్మూలించడానికి భూమన నడుంబిగించారు. దళితవాడల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి దేవుడి వద్ద అందరూ సమానమనే భావన సమాజానికి చాటిచెప్పారు. ► కల్యాణోత్సవాలు సైతం నిర్వహించారు. అప్పట్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పేదలైన శ్రీవారి భక్తులు వివాహాన్ని చేయలేని స్థితిలో ఉన్న వారి కోసం కల్యాణమస్తు అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ► ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసి ఏడాదిలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించారు. ► శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేలా 2007లో ఎస్వీబీసీ భక్తి చానల్‌ను స్థాపించారు. ఇది దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం నాలుగు భాషల్లో భక్తులకు శ్రీవారి వైభవాన్ని ప్రసారం చేస్తోంది. ► చైతన్య రథయాత్ర, ఎస్వీబీసీ చానల్ ఏర్పాటు, విద్యాధన పథకం, టీటీడీ స్కూల్ పిల్లలకు ఉచిత పుస్తకాలు, మహిళా క్షురకులు, షెడ్యూల్ కులాలకు చెందిన వారికి అర్చకులుగా ట్రైనింగ్, ఉచిత లడ్డూ, శ్రవణం ప్రాజెక్ట్, పీఠాధిపతులతో ధార్మిక సదస్సులు, రాజంపేట సమీపంలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఇలా.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అరుదైన అవకాశం ముఖ్యమంత్రులైన తండ్రీకొడుకుల వద్ద టీటీడీ చైర్మన్‌గా కొనసాగే అరుదైన అవకాశం భూమనకు దక్కింది. ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ప్రజాప్రస్థానం పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. 2006 నుంచి రెండేళ్లపాటు టీటీడీ చైర్మన్‌గా కొనసాగారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఈనేపథ్యంలో 2012 ఉప ఎన్నికల్లో.. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున తిరుపతి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనపై నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.ఆ కలియుగ వేంకటేశ్వరుడికి సేవచేసే భాగ్యం దక్కడం అత్యంత అరుదు. అదే రెండో పర్యాయం ఆ స్వామికి సేవ చేయడమంటే నిజంగా అదృష్టమే. అది ఆ శ్రీహరి కరుణే! ఈ అరుదైన అవకాశం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి దక్కింది. ఆయనను టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో భూమన టీటీడీ చైర్మన్‌గా నియమితులవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
తిరుపతి పాత పేర్లు తెలుసా? ఆ ఆధ్యాత్మిక నగరం ఆవిర్భవించింది నేడే!
తిరుమలను తలచుకుంటే.. గోవింద నామం మనస్సులో మార్మోగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనో నేత్రం ఎదుట ప్రత్యక్షమవుతారు. ఏడు కొండలవాడు కొలువైన తిరుమల ఆలయంతోపాటు ఆయన పాదాల చెంత ఉన్న తిరుపతి నగరం ఆవిర్భావమూ ఆసక్తికరమే. కలియుగం (కలియుగం మొదలై ఫిబ్రవరి 13వ తేదీ నాటికి 5,125 ఏళ్లు పూర్తయింది)లో శ్రీనివాసుడు ఏడు కొండలపై శిలారూపంలో కొలువుదీరగా.. ఆ స్వామిని కొలిచే భక్తుల ఆవాసాల కోసం ఏడు కొండల దిగువన తిరుపతి వెలసింది. పూర్వం తిరుమల చుట్టూ అడవులు, కొండల నడుమ అలరారే శ్రీవారి ఆలయం మాత్రమే ఉండేది. భక్తులు క్రూర జంతువుల భయంతో గుంపులుగా కాలినడకన తిరుమల యాత్ర చేసేవారు. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ధ్వజారోహణం మాత్రమే తిరుమల కొండపై నిర్వహించేవారు. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే నిర్వహించేవారు. ప్రతిరోజూ తిరుచానూరు నుంచి తిరుమలకు వెళ్లి రావటం ఇబ్బందిగా ఉండటంతో అర్చకులు కపిల తీర్థం వద్ద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతం పేరు కొత్తూరు, కోటవూరుగా పిలిచేవారు. – (సాక్షి, ఏపీ నెట్వర్క్) రామానుజాచార్యులచే శంకుస్థాపన శ్రీనివాసుని పూజా కైంకర్యాలను వైఖానస సంప్రదాయంలో కొనసాగించాలని నిర్దేశించిన జగద్గురువు రామానుజాచార్యులు అర్చకుల నివాసాల కోసం తిరుచానూరు–తిరుమల మధ్య నేటి పార్థసారథి ఆలయ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. శ్రీరంగం నుంచి శ్రీరంగనాథస్వామి శిలావిగ్రహాన్ని తెప్పించి పార్థసారథి సన్నిధికి పక్కన ప్రతిష్టించేందుకు ఆలయాన్ని నిర్మించారు . ఆ విగ్రహాన్ని తరలించే సమయంలో స్వల్పంగా దెబ్బ తినటంతో దాన్ని పక్కన పెట్టి.. ఆ ఆలయంలో గోవిందరాజస్వామిని తిరుమలేశుని ప్రతిరూపంగా ప్రతిష్టించారు. పక్కనపెట్టిన రంగనాథస్వామి విగ్రహం ప్రస్తుతం మంచినీళ్ల కుంట ఒడ్డున దర్శనమిస్తోంది. ఆ తర్వాత 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన గోవిందరాజస్వామి ఆలయం నాలుగు వైపులా మాడ వీధులు, అందులో అర్చకుల నివాసాలకు రామానుజాచార్యులు శంకుస్థాపన చేశారు. ఆ బ్రాహ్మణ అగ్రహారాన్నే తర్వాత గోవిందపట్నంగా.. రామానుజపురంగా పిలిచేవారు. ఆ తరువాత 1220–40 మధ్యకాలం నుంచి తిరుపతిగా పేరొందింది. అప్పటినుంచి తిరుపతిలో ఆవాసాలు, ఆలయాలు పెరుగుతూ వచ్చి ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంది. 120 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపిన రామానుజాచార్యులు మూడుసార్లు తిరుమలకు వచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆయన తన 112వ ఏట గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ, మాడ వీధులకు శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం తిరుపతి ఆవిర్భవించి ఈ నెల 24వ తేదీకి 893 సంవత్సరాలు అవుతోంది. వెలుగులోకి తెచ్చిన భూమన వెలుగుచూసిన అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమగ్ర అధ్యయనం చేయించి 2022 ఫిబ్రవరి 24న తొలిసారిగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 893వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్టు భూమన ప్రకటించారు. ఆ వేడుకల్లో భాగంగా నగర వాసులందరూ భాగస్వాములయ్యే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు నాలుగు మాడవీధుల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరమ పవిత్రం తిరుపతి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పరమ పవిత్రమైనది. ముక్కోటి దేవతలు శ్రీగోవిందరాజస్వామిని కొలుస్తారు. ఇక్కడ స్థానికులతో పాటు అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉన్నారు. తిరుపతి ప్రాముఖ్యత గురించి తెలియజేయాలన్నదే నా తపన. ప్రతి ఒక్కరూ నగర ప్రాభవాన్ని కాపాడుకోవాలి. తిరుపతి వైభవాన్ని చాటిచెబుదాం. శ్రీవారి నిలయమైన తిరుపతి ఆవిర్భావ వేడుకలను కలిసిమెలసి జరుపుకుందాం. – భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి -
మూడు రాజధానులకే మా మద్దతు
తిరుపతి తుడా: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మునిసిపల్ కార్యాలయంలో మేయర్ శిరీష అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించారు. తీర్మానాన్ని నగర మేయర్ డాక్టర్ ఆర్.శిరీష బలపరచగా.. డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. సభ్యుల్లో ఒక్కరు కూడా రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించకపోవడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మేయర్ శిరీష ప్రకటించారు. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ఆమె చెప్పారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధాని చేస్తామని చెప్పి నమ్మించారన్నారు. ఆపై తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తూ ఉమ్మడి ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ విడిపోతే కర్నూలుకు రావాల్సిన రాజధానిని కుట్రపూరితంగా, దురుద్దేశంతో అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమకు రావాల్సిన నీటి ప్రాజెక్టులను సైతం అడ్డుకున్న నీచుడు చంద్రబాబని దుయ్యబట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటే.. అందుకు విరుద్ధంగా చంద్రబాబు 29 గ్రామాలకే న్యాయం జరగాలని పట్టుబట్టడం సిగ్గుచేటన్నారు. రాజధాని, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మూడు రాజధానులతోనే సాధ్యమవుతాయని చెప్పారు. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకూడదన్న ముందు చూపుతోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అయితే చంద్రబాబు అండ్ కో వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు సీమవాసులంతా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఇటీవల రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన విజయవంతం చేసిన భూమన కరుణాకరరెడ్డికి మునిసిపల్ కౌన్సిల్ అభినందనలు తెలిపింది. -
Tirupati: రాయలసీమ గర్జన.. తిరుపతి జన సంద్రం (ఫొటోలు)
-
చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే భూమన
-
'రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే'
సాక్షి, తిరుపతి: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని, రాయలసీమ హక్కులు కాపాడాలని కోరుతూ ప్రజలు ఏకమవుతున్నారు. శనివారం తిరుపతి వేదికగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన, వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. ఈ మహా ప్రదర్శనలో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే ఉందంటూ నినాదాలు చేశారు. మహాప్రదర్శనతో తిరుపతి జనసంద్రంగా మారింది. మహార్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. రాయలసీమకు బాబు చేసిందేమీ లేదు. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భూమన పేర్కొన్నారు. -
రైతుల యాత్ర పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ యాత్ర చేయిస్తున్నారు : ఎమ్మెల్యే భూమన
-
కన్యాశుల్కం నాటకంతో సాంఘిక దురాచారాలను రూపుమాపారు: భూమన
-
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితునిగా ‘భూమన’కు అనుమతి
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితునిగా కొనసాగేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి హైకోర్టు అనుమతిచ్చింది. 52 మందిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలను సవాలు చేస్తూ పిల్ దాఖలు కావడం.. ఆ జీఓలపై స్టే విధించడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ భూమన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. భూమన స్థానిక ఎమ్మెల్యే అయినందున ఆయన విషయంలో స్టే ఉత్తర్వులను సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆహ్వానితుల విషయంలో స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం నిమిత్తం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి, పిటిషనర్లకు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. -
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన పర్యటన
-
జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీశ్రీ
తిరుపతి కల్చరల్ : తన రచనలతో జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. మానవ వికాస వేదిక, రాజా చంద్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం శ్రీశ్రీ స్వీయ దస్తూరితో రాసిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీశ్రీతో తనకున్న అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రస్థానం గీతాలను ఆలపించారు. శ్రీశ్రీ రచనలు జన హృదయాలను ప్రభావితం చేసేలా సాగాయన్నారు. చలం చెప్పినట్లు శ్రీశ్రీ కవిత్వం తెలుగు జాతిని ఊగించి, శాసించి, లాలించిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తిరుపతితో పాటు వ్యక్తిగతంగా శ్రీశ్రీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తన సోదరుడు భూమన కారణంగా శ్రీశ్రీ ప్రభావం తనపై పడిందన్నారు. ఆయనతో ఉన్న తనకున్న అనుభవాలను, మధురస్మతులను పంచుకుననారు. చిన్ననాటి నుంచి ఆయన రచనలు తనపై ఎంతో ప్రభావం చూపాయన్నారు. ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. కలాన్ని జయించిన వ్యక్తి శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీరంగం కవిత్వం చదవని వారు రచయితలే కాదని నమ్ముతున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీవారు అయితే ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటి డబ్బింగ్ సినిమా రచనకు ఆధ్యుడు శ్రీశ్రీనే అని గుర్తు చేసుకున్నారు. ఆయన అక్షర విలువను ఎంచడం ఎవరి తరం కాదన్నారు. ఎన్ని సిరులు వెళ్లినా శ్రీశ్రీ మాత్రం మననుంచి వదలి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అద్భుత కవితల ప్రవకర్త శ్రీశ్రీ అని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని ఆకాశం నుంచి నేల మీదకు దింపారని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కళాపోషకుడిగా తెలుగు వైభవాన్ని చాటిన ఘనుడని కొనియాడారు. తన బిడ్డకు రాజకీయ వారసత్వంతో పాటు సాంస్కతిక వారసత్వాన్ని అందించారన్నారు. కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరానికి, యువతరానికి శ్రీశ్రీ రచనలు ఓ చైతన్య దీపికలుగా నిలుస్తాయన్నారు. అంతటి మహనీయుడు రచించిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం మహద్భాగ్యమని తెలిపారు. పుస్తక ప్రచురణ కర్తకు రూ.20 వేలు బహుమతిగా అందజేశారు. పుస్తకావిష్కరణ చేసిన అభినయ్ రెడ్డి తిరుపతి నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేతుల మీదుగా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని రచయిత నామిని సుబ్రహ్మణ్యంనాయుడికి, రెండో ప్రతిని విశ్రాంత ప్రిన్సిపల్ పెద్ది సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, రాజాచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుర్గాప్రసాద్, కార్పొరేషన్ మేయర్ శిరీషా, మానవ వికాస వేదిక కనీ్వనర్లు సాకం నాగరాజు, శైలకుమార్, పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. -
మహిళలకు బ్రహ్మాస్త్రం దిశా యాప్ : భూమన కరుణాకర్ రెడ్డి
-
ఎమ్మెల్యే భూమనకు మరోసారి కరోనా
సాక్షి, తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మరోసారి కరోనా సోకింది. బుధవారం ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో గురువారం ఆయనకు రుయా ఆస్పత్రిలో మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు బీపీ, షుగర్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. (కరోనా కష్టంతో 9.6% క్షీణత) ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్ ఏలూరు టౌన్: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: కరోనా బారినపడి కోలుకుంటున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తాను క్షేమంగా ఉన్నానని ఎమ్మెల్యే భూమన ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆకాక్షించారు. కాగా, తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో భూమన కరుణాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
మానవ జీవితమంటే సేవ చేయటమే
-
ప్రాణాలకు తెగించి వైద్యబృందం సేవలు
తిరుపతి తుడా: కనిపించని శత్రువుతో ప్రాణాలకు తెగించి వైద్య బృందం అనితరమైన సేవలు అందిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రశంసించారు. రానున్న క్లిష్ట సమయంలో మరింత సేవలు అందించాల్సి ఉందన్నారు. బుధవారం రుయా ఆసుపత్రిలో కోవిడ్–19పై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా, నగరపాలక కమిషనర్ గిరీషా, జేసీ–2 వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణుచరణ్, రుయా హెచ్ఓడీలు, డాక్టర్లతో సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా విపత్తులో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. జిల్లా కలెక్టర్ కోరితే అవసరమైన పక్షంలో శ్రీవారి సేవకుల సేవలు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబోవు రోజుల్లో కేసుల తీవ్రత అధికం : కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ, రాబోవు 15 రోజుల్లో కేసుల నమోదు తీవ్రత అధికంగా ఉండబోతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సేవలు విస్తృతం చేస్తామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లను ఎస్వీ మెడికల్ కళాశాల హెచ్ఓడీలు పర్యవేక్షించాలన్నారు. పేషెంట్ పరిస్థితిని వారి బంధువులకు వివరించడానికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా మృతులకు అంత్యక్రియలకు గోవిందధామంలో మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పాజిటివ్ అని తేలిన అర్ధగంట లోపు బాధితులు కోవిడ్ చికిత్సకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలను గుర్తుచేశారు. డాక్టర్లు అందరూ వైద్య సేవల్లోకి రావాలని, నాన్ మెడికల్ విధుల్లో అవసరమైన డాటా ఎంట్రీ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. సాధారణ రోగులకు వార్డులు కష్టతరంగా ఉందని, ఆక్సిజన్ ప్లాంట్–12 కేఎల్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు కోరారు. త్వరలో 200మంది నర్సింగ్ స్టాఫ్ నియామకం అనంతరం రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ చాంబర్లో రుయా వైద్య అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్ సమావేశమయ్యారు. ఆసుపత్రిలో శానిటేషన్ మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. శానిటేషన్ సరిలేని చోట ఫోన్‌నంబర్ ఏర్పాటు చేసి ఆ నంబరుకు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రుయాకు సంబంధించి ఏ అవసరాలు ఉన్నా జేసీ వీరబ్రహ్మం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. త్వరలో 200 మంది నర్సింగ్ స్టాఫ్‌ను జిల్లాలో నియమించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. రుయా డెవలప్మెంట్ కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్, ఏపీఎంఐడీసీ ఈఈ ధనుంజయరావు, డ్వామా పీడీ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ పెంచలయ్య, డీసీహెచ్ఎస్ సరళమ్మ, ఎస్వీ మెడికల్ ప్రిన్సిపల్ జయభాస్కర్, డాక్టర్లు సంధ్య, జమున, సరస్వతి, నాగమునీంద్రుడు, సుబ్బారావు, ఫయీమ్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతికి అరుదైన ఘనత, భూమన ఆనందం
సాక్షి, తిరుపతి: తిరుపతి దేశంలో గార్బేజ్ ఫ్రీ సిటీగా దేశంలో గుర్తింపు పొందటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో భూమన మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా త్రిబుల్ స్టార్స్ లో తిరుపతికి మొదటి ర్యాంకు రావడం మంచి పరిణామన్నారు. ఇందు కోసం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడ్డారని, పారిశుధ్య కార్మికులు చేసిన కృషి చాలా గొప్పదని భూమన కరుణాకర్ రెడ్డి కొనియాడారు. ఆధ్యాత్మిక నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చి దిద్దారని భూమన అన్నారు. (త్రీస్టార్.. తిరుపతి వన్) ఇదే విషయం గురించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరిష మాట్లాడుతూ... గార్బేజ్ ఫ్రీ సిటీగా దేశవ్యాప్తంగా త్రిబుల్ స్టార్స్‌లో తిరుపతి మొదటిస్థానం రావడం చాలా గర్వంగా ఉందన్నారు. దీని కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీనిని సాధించడంలో తిరుపతి ప్రజల సహకారం మరువలేనిదని, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో చాలా సహకరించారని కొనియాడారు. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు) -
కరోనా నియంత్రణకు భూమన యాగం
-
చైతన్య రథసారథి
తిరుపతి తుడా:కరోనాపై యుద్ధంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిరంతరం ప్రజలకు అవగాహన కలిగిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తమ ప్రాణాలకు తెగించి నగరంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్వయంగా చెత్త సేకరణ రిక్షా తొక్కుతూ.. వారిలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఆయన ప్రధాన కూడళ్లకు వెళ్లి ప్రజలకు కరోనా తీవ్రతను వివరించారు. -
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
-
కరోనాకు స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం
-
మూడు రాజధానులు ముద్దంటూ తిరుపతిలో భారీ ర్యాలీ
-
టీటీడీ సంచలన నిర్ణయం
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లా వాసులుకు వరం ప్రకటించాలని నిర్ణయించింది. టీటీడీలోని జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తిలో జిల్లా వాసులుకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు భూమాన్ కరుణాకర్ రెడ్డి మంగళవారం బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రతిపాదన చేశారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన టీటీడీ పాలనమండలి.. ప్రభుత్వ అనుమతులకు పంపింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తే.. ఇప్పటి నుంచి వెలువడే ఉద్యోగాల భర్తీలో అధిక భాగం జిల్లా వాసులకు దక్కే అవకాశం ఉంది. తాజా నిర్ణయంపై చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. -
ప్రజలందరకీ ఈ సేవలు ఉచితం: డిప్యూటీ సీఎం
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు గురువారం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. క్రమంలేని ఆహార అలవాట్ల వల్ల, శరీరానికి విటమిన్లు సరిగ్గా అందక పోవడం వల్ల దృష్టి లోపం ఎక్కువగా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరికీ అలాంటి లోపం రాకూడదనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలందరికి ఈ సేవలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో మొదలు పెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరు కంటి జబ్బులతో భాదపడకూడదన్నదే సీఎం జగన్ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన భూమన .. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి కంటి పరీక్షలు చేయిస్తామని, విద్యార్థులందరిలో వెలుగు నింపడమే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. అదే విధంగా నిమ్మనపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్లో మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా.. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు యాదమరిలోని హై స్కూళ్లో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే ఎన్ ఎస్ బాబు ప్రారంభించారు. -
భూమన.. మరోసారి స్వామి సేవకు
సాక్షి,తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి మరోసారి శ్రీవారికి సేవ చేసే అవకాశం లభించింది. ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. భూమనతో పాటు మరో ఆరుగురికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూమన కరుణాకరరెడ్డి తుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో టీటీడీ ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీవేంకటేశ్వర కల్యాణోత్సవాలు, దళిత గోవిందం వంటి సాహసోపేత కార్యక్రమాలు చేపట్టారు. టీటీడీ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తెలియజెప్పేందుకు ఎస్వీబీసీ చానల్‌ను ప్రారంభించారు. తాళ్లపాక అన్నమాచార్యుని 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత భూమనకే దక్కింది. టీటీడీ ఏర్పడి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సమయంలో భూమన కరుణాకరరెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో టీటీడీ వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణమస్తు సామూహిక వివాహాలు నిర్వహించారు. వధూవరులకు బంగారు తాళిబొట్లు ఇచ్చి ‘గోవిందుడు అందరివాడేలే’ అని చాటి చెప్పారు. ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తెలుగు సంస్కృతి వికాస వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాష బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. శ్రీనివాసంలో రచయితలకు టీటీడీ గదులు కేటాయిస్తే అందుకు సంబంధించిన మొత్తం అద్దెను తన సొంత నిధులు చెల్లించి మన్ననలు పొందారు. ఇలా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి మరోసారి స్వామివారి సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం గమనార్హం. -
రుయా పేరును భ్రష్టుపట్టించారు
సాక్షి, తిరుపతి : ‘రాయలసీమకే తలమానికమైన రుయా ఆస్పత్రిని భ్రష్టుపట్టించారు..గత ప్రభుత్వ హయాంలో నిధులను అడ్డంగా దోచుకున్నారు.. ఇక మీ ఆటలు సాగవు..మీరు మారి ఆస్పత్రి నిర్వహణలో మార్పు తీసుకురండి..లేకపోతే చర్యలు తప్పవు’ అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆస్పత్రి అధికారులను హెచ్చరిం చారు. రుయాలో కే ట్యాక్స్ వ్యవహారం వెలుగులోకి రావడం.. సూపరింటెండెంట్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం..ఆస్పత్రి అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే సోమవారం ఆస్పత్రిలో పర్యటిం చారు. అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర విభాగాన్ని, కోడెల తనయుడు బినామీ పేరుతో నిర్వహిస్తున్న ల్యాబ్‌ను పరి శీలించారు. భూమన మాట్లాడుతూ పేద రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన గత పాలకులు రుయా వేదికగా దోపిడీకి పాల్పడ్డారన్నారు. మీడియాలో రుయా అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. దీనిపై అధికారుల్లో చలనం లేకపోవడం బాధాకరమని మండిపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ రుయాను సందర్శించి కోడెల తనయు డు కనుసన్నల్లో నడుస్తున్న ప్రైవేట్ ల్యాబ్‌ను రద్దు చేయాలని ఆదేశించినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా అవినీతి అక్రమాల్లో మార్పు రాలేదా అని నిలదీశారు. మాజీ సూపరింటెండెంట్ సిద్ధానాయక్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రోగులకు అన్యాయం చేస్తూ అక్రమార్కులకు మేలు చేసేలా వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు. ఇక అవినీతికి ముగిం పు పలికి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సెంట్రల్ ల్యాబ్ నిర్వహణను తక్షణం మెడికల్ కళాశాల, రుయా సంయుక్తంగా నిర్వహించాలని ఆదేశించారు. జనరిక్ మందుల షాపులు కేటాయించాలని నెలన్నర క్రితం ఆదేశాలు వచ్చినా అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రుయా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రుయా ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ సరస్వతీదేవి, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి, సీఎంఓ డాక్టర్ వెంకట్రమణ, రుయా వర్కింగ్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, సభ్యులు డాక్టర్ హేమకుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్కే బాబు, ఎంఎస్ మణి, పి.రాజేంద్ర, హి మాం సాహెబ్, నరేంద్రనా«థ్ కుసుమకుమారి, లక్ష్మీరెడ్డి, శ్రీదేవి, కిరణ్, పవన్ పాల్గొన్నారు. -
‘కోడెల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా’
సాక్షి, తిరుపతి: రుయా ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండి పడ్డారు. సోమవారం రుయా ఆస్పత్రిని సందర్శించిన భూమన కోడెల తనయుడి బినామీలు అక్రమాలకు పాల్పడుతుంటే.. మీరు ఎందుకు సహకరిస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబీకుల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా అని ప్రశ్నించారు. నెల నెలా కోడెల కుటుంబీకుల బినామీలు రూ. 40 లక్షలు దోచుకుంటుంటే.. మీరేందుకు మౌనంగా ఉన్నారని ఆస్పత్రి యాజమాన్యం మీద మండి పడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మీ తీరు మారదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ చెప్పిన తర్వాత కూడా కోడెల కుమారుడి బినామీ ల్యాబ్‌ను ఎందుకు మూయించలేదని అధికారులను ప్రశ్నించారు. మీ చర్యల వల్ల మాకు కూడా వాటాలు అందుతున్నట్లు జనాల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. సాయంత్రం లోగా అక్రమ ల్యాబ్‌ను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. -
కౌలు రైతులకు రుణాలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి
సాక్షి, చిత్తూరు అర్బన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుపక్షపాతి. వారికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ చాటిచెప్పేవారు. ఎలాంటి నష్టమొచ్చినా అండగా నిలిచేవారు. అందుకే ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నామకరణం చేసింది. రైతు రాజ్య మని చాటిచెప్పింది. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సేవా కార్యక్రమాలను మిన్నంటించారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. గంగాధరనెల్లూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో ఐదుగురు రైతులకు సన్మానం చేశారు. కలెక్టర్ నారాయణభరత్ గుప్త, అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.14 కోట్లు, కౌలు రైతులకు రూ.40 లక్షల రుణాలను అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని 217 పంచాయతీల్లో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గంగాధర నెల్లూరులో కౌలు రైతులకు రుణాలు పంపిణీ చేస్తున్నఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్త తిరుపతిలో పింఛన్లుపంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి,ఎమ్మెల్సీ, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి నగర కమిషనర్ గిరీషా ♦ తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అక్కారాంపల్లెలో రైతు దినోత్సవం నిర్వహించి ఐదుగురు ఆదర్శరైతులను సన్మానించారు. ఆటోనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పింఛన్లను పంపిణీ చేశారు. తుడా సర్కిల్ వద్ద ఇమాంసాహెబ్, నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బైరాగిపట్టెడలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ♦ చంద్రగిరిలో ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలను అందించారు. పెంచిన వైఎస్సార్ భరోసా కానుకలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేశారు. రూ.18.86 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. ♦ నగరి నియోజకవర్గంలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. నలుగురు ఆదర్శ రైతులకు దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ♦ పీలేరులో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ రైతుల ను సన్మానించి వారికి ప్రశంసాపత్రాలను పంపిణీ చే శారు. అనంతరం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీచేశారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ♦ చిత్తూరులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో లబ్ధిదారులకు పింఛన్ అందచేశారు. గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల్లో పర్యటించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించారు. బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి, పేదలకు అన్నదానం చేయగా, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ♦ మదనపల్లెలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా, సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి పాల్గొన్నారు. ఆరుగురు ఉత్తమ రైతులను సన్మానిం చారు. అనంతరం కౌలు రైతులకు చెక్కులను అందించారు. ఆధునిక యంత్రాలతో కూడిన స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. వైఎస్సార్ పింఛన్ కానుక కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ♦ పలమనేరు నియోజకవర్గంలో రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో పట్టుపరిశ్రమ రైతులకు ప్రోత్సాహకాలను అందించారు. ఐదుగురు ఉత్తమ రైతులను సన్మానించారు. స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. 400గ్రూపులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి కింద రూ.22 కోట్లు చెక్కులను అందించారు. ♦ పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆధ్వర్యంలో రైతు దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించారు. రైతు దినోత్సవంలో భాగంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ భరోసా కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. రూ.2.49 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందచేశారు. ♦ సత్యవేడు నియోజకవర్గంలో రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. రైతు దినోత్సవంలో భాగంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది ఆదర్శ రైతులను సన్మానించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ♦ తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆధ్వర్వంలో రైతు దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు. ♦ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. నలుగురు ఆదర్శరైతులను సన్మానించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. రూ.19.35 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందచేశారు. ♦ పుంగనూరులో రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, మాజీ ఎంపీపీ నరసింహులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు ఆదర్శ రైతులను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. పుంగనూరులో జరిగిన కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి మునిసిపల్ ఎంప్లాయీస్ యూని యన్ నాయకులు ఫకృద్దీన్ షరీఫ్ పాల్గొన్నారు. ♦ కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో రైతు దినోత్సవ కార్యక్రమంలో అధికారులు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. రూ.16.54 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. -
తిరుపతిని సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుతా..
సాక్షి, తిరుపతి: నగరంలోని మురికివాడల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని అభివృద్ధి చేసి సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుతామని తిరుపతి వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్ లో ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..టిటిడీలో పని చేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని, అలాగే టిటిడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని తెలిపారు. తిరుపతిలో సంపూర్ణ మధ్యనిషేధానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో దశల వారీగా మధ్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి హామీని గుర్తు చేశారు. స్థానికుల సమస్యల పట్ల సత్వరమే స్పందిస్తానని, ఎల్లప్పుడు వారికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. -
తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా భూమన కరుణాకరరెడ్డి నామినేషన్
-
చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారు
-
‘పరామర్శకు వెళ్లి పొత్తుల గురించి మట్లాడలేదా’
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టాల హక్కులను సాధించే క్రమంలో కేటీఆర్ వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగిందని అన్నారు. ఈ భేటీపై వక్రభాష్యాలు చెబుతూ.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శలు గుప్పించారు. బాబు నలభయ్యేళ్ల రాజకీయ చరిత్ర అవినీతి మయం, దుర్గంధ భరితం, భరింపశక్యం కానటువంటిదని ఎద్దేవా చేశారు. నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్‌తో రాజకీయ పొత్తుల గురించి మాట్లాడింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కేసీఆర్ వస్తే ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేసి దగ్గరుండి సపర్యలు చేస్తారు. మీ మంత్రివర్గ సహచరురాలు పరిటాల సునీత ఇంట్లో వివాహానికి ఆహ్వానిస్తారు. కేసీఆర్ తలపెట్టిన చంఢీయాగంలో పాల్గొంటారు. కానీ, మేం కేటీఆర్‌తో భేటీ అయితే బురద జల్లుతారు’ అని ధ్వజమెత్తారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అనేక రుగ్మతలతో భాదపడుతున్నారని, కొత్తగా ఆయనకు మానసిక రుగ్మత కూడా వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే వణికిపోతూ.. బాబుకు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు కాపాడటం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో మొదటినుంచి పోరాటం చేస్తున్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఉద్ఘాటించారు. -
కేసీఆర్ చంఢీయాగంలో చంద్రబాబు పాల్గొనలేదా?
-
ప్రజాసంకల్పయాత్రకు గుర్తుగా విజయసంకల్ప స్థూపం ఏర్పాట్లు
-
600లకు పైగా హామీలిచ్చి ప్రజలందరినీ మోసం చేశారు
-
‘చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజా వంచన తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడు తన అనుభవాన్నాంతా స్వార్థం కోసం వాడుకున్నారు తప్పా రాష్ట్రానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఆరువందలకు పైగా హామీలిచ్చిన చంద్రబాబు.. రైతులు,డ్వాక్రా మహిళలు, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ మోసం చేశారని ఆరోపించారు. తన పాలనలో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. -
‘నిన్ను చూసి నవ్వుకుంటున్నారు బాబు’
సాక్షి, నెల్లూరు: తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 31లోగా హైకోర్టు భవనాలు సిద్ధం చేస్తామని గతంలో చంద్రబాబు అఫడవిట్ ఇచ్చారని, దానికి అనుగుణంగా హైకోర్టును విభజిస్తే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అఫడవిట్ ఇచ్చి ఇప్పుడు తగిన సమయం ఇవ్వలేదని అనడం ఏంటని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రెండు రకాల మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టు విభజనకు, ప్రతిపక్షానికి ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మకై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. డిసెంబర్ 15లోగా హైకోర్టు భవనం సిద్ధం చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిన చంద్రబాబు ఆవిధంగా మాట నిలబెట్టుకోలేకపోయ్యారని మండిపడ్డారు. -
శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి సెంట్రల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల రెండో వారంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులతో భూమన సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 8, లేదా 9వ తేదీ నాటికి ప్రజా సంకల్పయాత్ర ముగిసే అవకాశాలున్నాయన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో దివంగత వైఎస్సార్ ఇచ్ఛాపురంలో ప్రజా ప్రస్థానాన్ని ముగించిన తరహాలోనే.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను కూడా ఇచ్ఛాపురం బహిరంగ సభతో ముగిస్తారని చెప్పారు. అదే రోజే వైఎస్ జగన్ తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారని, ఆ మర్నాడు ఉదయమే అతిథి గృహం నుంచి కారులో బయలుదేరి అలిపిరికి చేరుకుంటారని తెలిపారు. శ్రీవారి మెట్టుదారిన తిరుమలకు నడిచి వెళ్లి, శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారని కరుణాకరరెడ్డి వివరించారు. వైఎస్ జగన్ సుమారు 140 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3,600 కిలోమీటర్ల మేరకు పాదయాత్రను కొనసాగించారని.. సుమారు 2.70 కోట్ల మంది ప్రజలను వైఎస్ జగన్ ప్రత్యక్షంగా కలుసుకున్నారన్నారు. చరిత్రలో ప్రజా సంకల్ప యాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. -
హోదాపై బాబు జిమ్మిక్లు చేస్తున్నారు: భూమన
సాక్షి, శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ధర్మపోరాట ధీక్ష పేరుతో కొంగ జపంచేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే ముద్దు అని అసెంబ్లీలో తీర్మానాలు చేసిన బాబు ఇప్పుడు మాత్రం దొంగ ధీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం రామానమజపం అయిందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ కనిప్పించడం లేదని విమర్శించారు. టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తన నాలుగున్నర లక్షల కోట్ల దోపిడిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్వేతపత్రం మరో అబద్దపు ప్రచార జిమ్మక్‌గా మార్చుకున్నారని భూమన వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు తగిన గుణపాఠం చెప్పారు: భూమన
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నాయుడు ఏపీలో అక్రమంగా సంపాదించిన కొట్ల రూపాయలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. గురువారం తిరుపతిలో గాలి వీధిలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తెలంగాణలో అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూసారు. కానీ తెలంగాణా ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే 2019లో ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూడా బాబుకు తగిన బుద్ధి చెపుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా భూమన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. -
డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు భరోసా : భూమన కరుణాకరరెడ్డి
చిత్తూరు, తిరుపతి సెంట్రల్ : జననేత జగన్ సీఎం కాగానే డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలను చెల్లిస్తారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు వేమూరి జ్యోతి ప్రకాష్, రాజారెడ్డిల ఆధ్వర్యంలో తిరుపతి నగరం ఐదో డివిజన్ కొర్లగుంట మారుతీనగర్ మహిళా సంఘాల ప్రతినిధులు శ్రీలత, రాధ, దేవి, భాగ్యలక్ష్మి, కస్తూరి, సావిత్రి, లక్ష్మి, ధనలక్ష్మి, జయమ్మ, సుబ్బమ్మ, ప్రేమకుమారి, ప్రమీల, నిర్మల, చిట్టెమ్మ, మోహన, తనూజ, సంధ్య, మంజుల, గిరిజ, మమత, సుజాత గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీలో చేరారు. వారికి భూమన కరుణాకరరెడ్డి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు చెల్లిస్తారన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం, ప్రాధాన్యం లభిస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్.జగన్‌ను సీఎంగా గెలిపించుకోవడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎస్కే.బాబు, దుద్దేల బాబు, ఎంవీఎస్ మణి, చెలికం కుసుమ, ఆరె అజయ్‌కుమార్, వాసుయాదవ్, చింతా రమేష్‌యాదవ్, బత్తల గీతాయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, తొండమల్లు పుల్లయ్య, రామకృష్ణారెడ్డి, రవి, చిమటా రమేష్, శాంతారెడ్డి, పద్మజ, పుష్పాచౌదరి పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
-
బీసీఏఎస్ నివేదిక మా అనుమానాలు నిజం చేస్తోంది
-
‘ఆ నివేదిక మా అనుమానాన్ని నిజం చేసేలా ఉంది’
విజయనగరం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. విజయనగరంలో భూమన విలేకరులతో మాట్లాడుతూ..బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) నివేదికతో వైఎస్ జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటన వెనక కుట్ర కోణం ఉందన్న విషయం మరోసారి బట్టబయలైందన్నారు. బీసీఏఎస్ నివేదిక మా అనుమానాన్ని నిజం చేసేలా ఉందన్నారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావుకు అక్టోబర్ నెల వరకు మాత్రమే విమానాశ్రయంలో అనుమతి ఉందన్న సివిల్ ఏవియేషన్ రిపోర్టులోని అంశం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశాలేవీ ఎందుకు బయటపెట్టడం లేదని అడిగారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. కేసు నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని తాము మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. సిట్ దర్యాప్తు ప్రభుత్వ కనుసన్నల్లో కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం సిట్ అంటే కూర్చొనేలా స్టాండ్ అంటే నిల్చొనేలా సిట్ దర్యాప్తు ఉందని ఎద్దేవా చేశారు. అందుకే తాము ఓ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. -
‘ఇది ముమ్మాటికీ బాబు సర్కారు కుట్రే’
సాక్షి, తిరుపతి : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ముమ్మాటికీ చంద్రబాబు సర్కారు కుట్రేనని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన భూమన.. వైఎస్ జగన్‌ను తుద ముట్టించేందుకు దుండగుడు ప్రయత్నించాడని.. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌కు లభిస్తున్న ఆదరణ చేసి ఓర్వలేకే చంద్రబాబు ఇలా దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అలిపిరి వద్ద చంద్రబాబు మీద దాడి జరిగిన వెంటనే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పందించి ఆయనను పరామర్శించారని.. గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష కూడా చేశారని భూమన గుర్తుచేశారు. కానీ మానవత్వం లేని చంద్రబాబు.. సీఎం హోదాలో ఉండి కూడా ప్రతిపక్ష నేతను కనీసం పరామర్శించకపోగా ఆయన మీదే నిందలు వేయడం దారుణమన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి రావు కాబట్టే సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. -
న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తాం
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో న్యాయం కోసం రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి, గవర్నర్‌ను కలిసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించామని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఘటనకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన వ్యూహంపై శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు సమావేశమై చర్చించారు. అనంతరం కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హత్యాయత్నంతో భుజానికి గాయం అయినప్పటికీ ప్రజలకోసం పాదయాత్ర చేయడానికి జగన్ సిద్ధమయ్యారని.. అయితే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని పార్టీ నేతలంతా విన్నవించనున్నట్లు తెలిపారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీపైన, తమ అధినేతపై బురద చల్లడమే పనిగా..చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్తున్నారన్నారు. జగన్ కేసులో చంద్రబాబు ఏ1, డీజీపీ ఏ2 అన్నారు. డీజీపీ ఠాకూర్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. సరైన విచారణ జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం నియమించిన సిట్ కాకుండా వేరే ఏజెన్సీ ద్వారా విచారణ జరగాలని కోరారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి మాట్లాడుతూ కొన్ని టీవీ చానళ్లలో జగన్మోహన్రెడ్డి ఏపీ పోలీసుల దర్యాప్తును వద్దని, తెలంగాణా పోలీసుల విచారణ కావాలని వ్యాఖ్యనించినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని.. అలాంటి వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ దురుద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. లోకేష్ మాటలే డీజీపీ పలికారు.. మరో సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ మంత్రి లోకేష్ ట్విట్టర్లో వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుది నేరచరిత్ర విద్యార్థి దశనుంచే చంద్రబాబుకు నేరచరిత్ర ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు గతం, వర్తమానం రెండూ రక్తసిక్తమేనన్నారు. చదువుకునే రోజుల్లోనే ఎస్వీ యూనివర్సిటీలో కుల రాజకీయాలను పెంచిపోషించిన చంద్రబాబు.. నేడు రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడయ్యాడని దుయ్యబట్టారు. వంగవీటి రంగా, జర్నలిస్ట్ పింగళి దశరథరామ్‌ను హత్య చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ సెక్రటరీ రాఘవేంద్రరావును లారీతో తొక్కించి హత్య చేయించడంలోనూ ఆయన పాత్ర ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేయించి, నిందితులకు ఆశ్రయం కల్పించి వారిని కాపాడారని ఆరోపించారు. -
నిధులు ఇవ్వకుండా దాతల సాయం కోరుతారా..?
-
తుఫాన్ బాధితులకు చంద్రబాబు ఏం చేశారు..?
-
అధికారులు స్పందించకపోవడానికి కారణం బాబే
-
‘అధికారులు స్పందించకపోవడానికి కారణం బాబే’
తిరుపతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చేస్తోన్న ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. తుపాను ఘటనను చంద్రబాబు తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రసాద మాధ్యమాల యావలో పడ్డారని, నిరసన తెలుపుతున్న బాధితులను తాట తీస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడిని దుయ్యబట్టారు. నిరసన తెలుపుతున్న బాధితుల ఫోటోలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని రాజధాని అమరావతిలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని దుబారా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నేను నిద్రపోను..వాళ్లను నిద్రపోనివ్వను నేను నిద్ర పోను అధికారులను నిద్రపోనివ్వను అంటూ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ప్రచార పిచ్చిలో ఉన్న చంద్రబాబు, బాధితులను పట్టించుకోవడం మర్చిపోయారని వెల్లడించారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు. నిరసన తెలుపుతున్న వారిని వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా చిత్రీకరించారని వివరించారు. అధికార జులుంతో చంద్రబాబు బరితెగి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిత్లి తుపాను సంభవించిన వెంటనే బాధితులను ఆదుకోవడానికి రెండు బృందాలను పంపారని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నిరసన తెలపడానికి వెళ్తుంటే ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డుకున్న ఘటనను గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లు..నాలుగు లక్షల కోట్లు నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని భూమన ఆరోపించారు. చంద్రబాబు తన చేతగాని తనాన్ని వైఎస్ జగన్ మీద నెట్టడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా కరువులు, తుపాన్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కరువుతో సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లా అల్లాడుతోంది..కానీ చంద్రబాబు పట్టించుకున్నపాపాన పోలేదని మండిపడ్డారు. తాను స్వయంగా ఉద్దానంలో ప్రాంతంలో పర్యటించానని, ఆ ప్రాంతమంతా మరణ మృదంగం మోగుతోందని చెప్పారు. కన్నబిడ్డల్లాంటి కొబ్బరి, జీడి చెట్లు కూలిపోతే చంద్రబాబు ముష్టి వేసినట్లు చాలీచాలనంత నష్టపరిహారం ప్రకటించారని భూమన ధ్వజమెత్తారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో బీజేపీ విఫలం తుపాను బాధితులను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ తీరును వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సు 10 మందిని పొట్టన పెట్టుకున్నా ఇంతవరకూ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని తెలిపారు. 10 రోజుల్లో వైఎస్ జగన్ తుపాను బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. సునీతవి తప్పుడు అభియోగాలు మంత్రి పరిటాల సునీత వైఎస్ జగన్ మీద తప్పుడు అభియోగాలు మోపారని భూమన వ్యాఖ్యానించారు. 2003 ఏప్రిల్‌లో సునీత భర్త పరిటాల రవీంద్ర తనకు ఏమన్నా జరిగితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని చెప్పిన విషయం గుర్తుకు లేదా అని సునీతని ప్రశ్నించారు. ఈ విషయం సునీతకు తెలియదా లేక మరిచిపోయారా అని అడిగారు. -
ఘాటులేఖ రాస్తాననటం హాస్యాస్పదం: భూమన
సాక్షి, విజయనగరం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగ భృతి లేక కొత్త ఉద్యోగాలపై ప్రతిపాదనలే పంపొద్దనడం దారుణమన్నారు. ఇంతకంటే దగాకోరుతనం మరొకటి లేదన్నారు. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడిలా హెచ్ఓడీలకు ఖాళీల ప్రతిపాదనలు పంపొద్దనడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రధాని మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా లేఖ రాస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో జతకట్టి ప్రత్యేక హోదా అంటేనే అదేదో భూతమన్నట్లు, హోదా గురించి మాట్లాడితే బూతు అన్నట్లు వ్యవహరించిన విషయం మరిచిపోయారా బాబు అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా నినాదాన్ని, దాని ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాతే భయంతో హోదా అంశాన్ని భుజానకెత్తుకున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. -
యువతను నిలువునా మోసం చేశారు
-
చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర : భూమన
సాక్షి, విజయనగరం : ప్రపంచంలో ఏ రాజకీయ నేతకు కూడా సాధ్యం కాని మహా పాదయాత్రను వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చైనా కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్‌కు కూడా సాధ్యం కాని మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను నేడు వైఎస్ జగన్ పూర్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 269వ రోజు పాదయాత్ర విజయనగరం జిల్లాలోకి విజయవంతంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల సంక్షేమ, యోగక్షేమాలు తెలుసుకునేందుకే ఆయన ఈ యాత్రను చేపట్టారని తెలిపారు. ఆయనకు దారిపొడవున ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. -
చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర
-
కాపులంతా జగన్ వెంటే
సాక్షి, తిరుపతి తుడా : కాపులు సీఎం చంద్రబాబునాయుడి మోసాలను గుర్తించారని, అందుకే వారంతా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ కుటుంబా నికి అత్యంత ఆప్తులుగా ఉన్న నైనారు కుటుంబానికి చెందిన నైనారు మధుబాల బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. భూమన కరుణాకరరెడ్డి నివాసంలో జరి గిన ఈ కార్యక్రమంలో నైనారు మధుబాలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరుణాకరరెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ నైనారు కుటుంబంతో తనకు చిన్ననాటి నుంచి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆ కుటుంబం పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం గత ఎన్నికల్లో కాపులను వాడుకున్న సీఎం చంద్రబాబు వారిని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలతో చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతను నిజం చేస్తూ కుల రాజకీయాలే ఆయన్ను ముంచనున్నాయని జోస్యం చెప్పారు. కాపులకు వైఎస్సార్ సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. నైనారు మధుబాల మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాపు నాయకులు దుద్దేల బాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బాలిశెట్టి కిశోర్ మాట్లాడుతూ కాపు ఉద్యమానికి జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు తెలపడంతో బలిజలు వైఎస్సార్ సీపీపై నమ్మకంతో ఉన్నారన్నారు. పార్టీ ఎస్సీ సెల్ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు టి.రాజేంద్ర, అజయ్‌కుమార్ మాట్లాడుతూ మానవత్వమే వైఎస్సార్సీపీ కులమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమకుమారి, బొమ్మగుంట రవి, బండ్ల లక్ష్మీపతి పాడి శివప్రసాద్ యాదవ్, పుల్లయ్య, రాధామాధవి, శైలజ, లక్ష్మీరెడ్డి, వాసుయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, గీతా యాదవ్, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనలో అపచారాలు: భూమన
సాక్షి, హైదరాబాద్: తిరుమలలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్యాయాలు, ఘోరాలు జరుగు తున్నాయని, కలియుగ దైవం వెలసిన చోట తీవ్ర అపచారాలు చోటు చేసుకుంటున్నా యని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుమలను వీఐపీలకు సపర్యలు చేసే సత్రంగా మారుస్తున్నారనే ఆవేదనతో ప్రధాన అర్చకుడైన రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేస్తే పదవీ విరమణ పేరుతో పాలక మండలి ఆయనపై వేటుకు సిద్ధమైందన్నారు. శ్రీవారి ఆలయంలో ఎప్పుడూ జరగని ఘోరాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు టీటీడీ సమాధానం చెప్పకుండా చర్యలకు దిగటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
గర్వపడేలా చెప్పుకునే నాయకుడు వైఎస్ జగన్
-
టీడీపీ గోడలను బద్దలు కొట్టగల ధీరుడు ఆయనే..
సాక్షి, కడప : ఒట్టి చేతులతో టీడీపీ గోడలను పగుల గొట్టగల ధీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గోడలను ఆయన ఇప్పటికే బద్దలు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ను వ్యతిరేకించే వాడు మానవ ద్వేషి అయి ఉంటాడని భూమన అన్నారు. మహానేత వైఎస్ఆర్ ఆలోచనలే తమ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. సిద్ధాంతం లేదని విమర్శించే వారికి ఇదే తమ సమాధానమని భూమన పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీకి పరిపూర్ణ ఆలోచన ఉందని, రాజకీయం అంటే అధికారం అనే సిద్ధాంతం చంద్రబాబుదని విమర్శించారు. జీవితాంతం గర్వపడేలా చెప్పుకునే నాయకుడు జగన్ అని, అధికారం ఒకరు వేస్తే తీసుకునే భిక్ష కాదని, పోరాడి సాధించుకునే హక్కు అన్న వ్యక్తి వైఎస్ జగన్ అని భూమన పేర్కొన్నారు. 10 జన్‌పథ్‌లో నిటారుగా వైఎస్ జగన్ నిల్చున్నారని, వందసార్లు కుంగదీయడానికి ప్రయత్నించినా లొంగని మనిషిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాకుండా.. తండ్రి ఆశయ సాధన కోసం జగన్ పోరాటం చేస్తున్నారని, అటువంటి నేతకు మనం చేదోడు వాదోడుగా ఉందామని పిలుపునిచ్చారు. 5 కోట్ల ఆంధ్రులకు వైఎస్సార్ పాలనను అందిద్దామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. -
ప్రజాస్వామ్యానికి తప్పుడు భాష్యం
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దీక్షల పేరిట కొత్త సమస్యలను సృష్టించడం ప్రజాస్వామ్యానికి తప్పుడు భాష్యం చెప్పడమే అవుతుందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. దీక్షల పేరిట బీజేపీ డ్రామాలు ఆడటం సరికాదని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చీడలాంటివని చెప్పారు. ఆయన గురువారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సజావుగా జరగనీయలేదని ప్రధాని అనడాన్ని ఖండిస్తోందన్నారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం లేకుండా ఏఐఏడీఎంకేతో రచ్చ చేయించింది బీజేపీయేనని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో చర్చ జరిగితే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏవిధంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు కారణమయ్యాయో, ఏయే హామీలు ఇచ్చి మోసం చేశాయో అవన్నీ ప్రజలకు తెలిసేవన్నారు. ‘‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 14న అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, వినతిపత్రాలు సమర్పించి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. నాలుగేళ్లుగా హోదా అనే మాటకు సమాధి కట్టారు. హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రత్యేక హోదాకు తానే హీరో అయినట్లు ప్రచారం చేసుకుంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు. -
శతమానం భవతి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛారణలు, అభిమానుల అప్యాయతలు, అభినందనల నడు మ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరి గాయి. పద్మావతీపురంలోని భూమన ఇల్లు గురువారం ఉదయం 7 గంట లకే పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలా డింది. మల్లం రవిచంద్రారెడ్డి, కొమ్ము చెంచయ్య, దుదే ్దల బాబు తదితర సన్నిహితులు తెచ్చి న 60 కిలోల కేక్‌ను భూమన కట్ చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. పార్టీ యువజననేత ఇమాం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను భూమన ప్రారంభించారు. వివిధ సందర్భాల్లో తీసిన భూమన కరుణాకర రెడ్డి ఫొటోలను ఎగ్జిబిషన్లో ఉంచారు. సంప్రదాయబద్ధంగా షష్టిపూర్తి... ఉదయం 9 గంటలకు ఆవరణలో షష్టిపూర్తి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లిపీటలపై కూర్చున్న భూమన దంపతులను హాజరైన ప్రముఖులందరూ ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, రైల్వేకోడూరు, సూళ్లూరుపేట శాసనసభ్యులు కళత్తూరు నారాయణస్వామి, డాక్టర్ సునీల్‌కుమార్, దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, కిలివేటి సంజీవయ్య ఈ కార్యక్రమానికి హాజరై భూమన దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీటీడీ వేదపండితులు, ప్రధానార్చకులు రమణ దీక్షితులు, డాలర్ శేషాద్రి కూడా హాజరై భూమన దంపతులను ఆశీర్వదించారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకుండా వేడుకల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను సమకూర్చారు. వైఎస్సార్సీపీకి చెందిన శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాస్, ఆదిమూలం, పోకల అశోక్‌కుమార్, బాలిశెట్టి కిషోర్, దామినేటి కేశవులు, కేతం జయచంద్రారెడ్డి, ఎస్కే బాబు, చిత్తూరు బీజేపీ నేత సీకే బాబు, తిరుపతి బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, శాం తారెడ్డి, భూమన స్నేహితుడు సైకం జయచంద్రారెడ్డి, జనసేన యువనేత కిరణ్‌రాయల్ తదితరులు భూమనకు అభినందనలు తెలిపారు. మ«ధ్యాహ్నం 3 గంటల వరకూ ఆహూతులందరికీ విందు భోజన ఏర్పాట్లు చేశారు. -
ప్రజాసంక్షేమం పట్టని బాబు ప్రభుత్వం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్టీఆర్ కట్టిన కోటలో నాడు చంద్రబాబు రూపంలో మొలిచిన ఒక గంజాయి మొక్క ఇప్పుడు వటవృక్షమై రాష్ట్రాన్ని దహించివేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం, విజయనగరం రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంక్షేమం కాకుండా కేవలం ధనవంతులు, పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు పాలన చూసి విసిగి వేసారిపోయిన ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. శ్రీకాకుళంలోని ఆనందమయి కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో భాగంగా మంగళవారం శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందినవారికి నిర్వహించారు. ‘వైఎస్సార్సీపీ ఆవిర్భావం, పార్టీ భావజాలం, రాజన్న పాలన’ అంశంపై భూమన ఉద్వేగంగా ప్రసంగించారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలోనూ కరువు, కాటకాలే గాక అవినీతి, ఆశ్రిత బంధుప్రీతితో ప్రజలు అనేక కష్టాలు అనుభవించారన్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో భరోసా నింపారన్నారు. ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్సార్ తన పాలనలో ప్రతిక్షణం ప్రజారంజక పాలన కోసమే తపించారని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచానికే స్ఫూర్తిదాయంగా నిలిచిందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి అకాల మరణంతో నిర్వీర్యమైపోయిన ఆయన ఆశయాలే ఊపిరిగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని వివరించారు. నాడు తన తండ్రి రగిల్చిన స్ఫూర్తిని గుండెనిండా నింపుకుని, ఆయన మిగిల్చిన ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మూడువేల కిలోమీటర్ల పాదయాత్రకు సంకల్పించారని తెలిపారు. చైనాలో మావోసేటుంగ్ చేపట్టిన పాదయాత్ర తర్వాత ప్రపంచంలో ప్రజల సంక్షేమంకోసం సాగుతున్న గొప్పయాత్ర జగన్ ప్రజాసంకల్పయాత్ర అని అభివర్ణించారు. వైఎస్సార్ సాకారం చేసి చూపించిన సంక్షేమ రాజ్యస్థాపనకోసం ఆయన కుమారుడిగా జగన్ ప్రజాక్షేత్రంలో నిరంతర పోరు సాగిస్తున్నారని చెప్పారు. జగనన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో వారి ఆశీర్వాదంతో పార్టీని విజయతీరాలకు చేర్చాలని భూమన పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.పార్థసారధి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్టీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణు, కుంభా రవిబాబు, రెడ్డి శాంతి తదితరులు పాల్గొన్నారు. -
భూమన, ఎంపి వరప్రసాద్ అరెస్టు
-
ఇది సర్కారు కుట్రే..
– భూమనను మళ్లీ రమ్మన్న సీఐడీ – ఉద్దేశపూర్వకంగానే గొంతునొక్కే ప్రయత్నం – తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రతిపక్షాన్ని అన్ని విధాలా అణచి వేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. నోరెత్తి నిలదీసే నేతలను లక్ష్యం చేసుకుని నిర్బంధానికి గురి చేస్తోంది. ప్రజలను చైతన్యవంతం చేసే ఉద్యమాలను అరెస్టులతో అణగదొక్కుతోంది. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి నినదిస్తారో అటువంటి వారిని గుర్తించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ తిరుపతికి ఓ ప్రత్యేకత ఉంది. ఉద్యమాలు మొదలయ్యేది ఇక్కడి నుంచే. రాజకీయంగా చైతన్యవంతమైన తిరుపతి కేంద్రంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అధికార పార్టీ హామీలను ప్రజలకు వివరించడమే కాకుండా ప్రభుత్వ మోసాలను ఎండగట్టడంలో భూమన కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలో జరిగే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ భూమన పార్టీ శ్రేణులకు సారధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గొంతు నొక్కడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రతిపక్షనేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తుని ఘటనకు సంబంధించి విచారణ పేరిట భూమనను వేధింపులకు గురిచేయడంతో పాటు ప్రతిపక్ష నేతల్లో భయాందోళనలు నెలకొల్పాలని చూస్తోందని రాజకీయ మేథావులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఇటీవల రాష్ట్ర బంద్ నిర్వహించిన విపక్షనేతలను నిర్ధాక్షిణంగా అరెస్టులు చేయించిన సర్కారు తీరును నిదర్శనంగా పేర్కొంటున్నారు. భూమనకు రెండోసారి పిలుపు... తూర్పుగోదావరి జిల్లా తునిలో జనవరి 31నకాపుగర్జన సందర్భంగా విధ్వంస కాండ చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి విచారణకు హాజరు కమ్మని సీఐడీ పోలీసులు ఈ నెల 2న తిరుపతిలో తొలి విడత నోటీసులను భూమనకు అందజేశారు. 6,7 తేదీల్లో గుంటూరు కేంద్రంగా భూమనను సీఐడీ 16 గంటల పాటు విచారించింది. మళ్లీ 19న విచారణకు రమ్మని శనివారం కబురు చేసింది. -
హోదా ఇవ్వాలన్న ఆలోచన మోదీకి లేదు
సాధించే సంకల్పం బాబుకు లేదు: భూమన ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంత మాత్రం లేదని, కేంద్రంపై పోరాడి సాధించాలన్న సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేనేలేదని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిపాద సన్నిధైన తిరుపతిలో వాగ్దానం చేసిన మోదీ.. ఇప్పుడు ఇవ్వకపోతే కచ్చితంగా నేర స్తుడవుతారన్నారు. పదిహేనేళ్లు కావాలని చెప్పి ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబుకు.. ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అర్హత లేదన్నారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ శవమై పోయిందని, హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయనని, పోరాడనని చంద్రబాబు చెప్పడం వల్ల టీడీపీ జీవచ్ఛవంలా మారిందని భూమన అన్నారు. బీజేపీ, టీడీపీ మాటలతో మోసపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు రగిలి పోతున్నారన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు దానిని నీరు గార్చేందుకు ప్రయత్నించారని, ప్రజల్లో ఉద్యమిస్తున్నపుడు మాత్రం హోదా సాధనే లక్ష్యమంటున్నారని ధ్వజమెత్తారు. ఇపుడు రాజ్యసభలో చర్చ పేరుతో కాంగ్రెస్, టీడీపీ నాటకానికి తెరలేపాయన్నారు. అసలు రాజ్యసభలో చర్చ గాని, బిల్లుగాని అవసరం లేదనే విషయం తెలిసి కూడా చంద్రబాబు చర్చకు రెడీ అన్నారని, పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశం ఓటింగ్‌లో నెగ్గక పోతే దానిని సాకుగా చూపి ఇక ఆ అంశాన్ని ముగించాలనే కుట్రతో టీడీపీ ఉందన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఇదంతా అవసరం లేకుండా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్నారు. దానికోసం చంద్రబాబు ఒత్తిడి చేయక పోవడం దారుణమన్నారు. -
'చంద్రబాబుది రక్తంతో తడిసిన చరిత్ర'
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రక్తంతో తడిసిన చరిత్ర అని వైఎస్ఆర్ సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ చేపట్టాలని వారన్నారు. రాప్తాడులో నిన్న ఉదయం హత్యకు గురైన ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ నేతలు పరామర్శించారు. పరామర్శించినవారిలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంత వెంకటరామి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్ది, అమర్నాథ రెడ్డి, తిప్పారెడ్డి, వై. విశ్వేశ్వర రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, చాంద్ బాషా,కేతిరెడ్డి వెంకట్రామ రెడ్డి, పోతుదుర్తి ప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి, భూమన మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని త్వరలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని చెప్పారు. వైఎస్ఆర్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు హత్యాకాండకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. -
'తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు'
తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికపై పోటీకి అభ్యర్థిని నిలపవద్దని టీడీపీ తమను కోరినట్లు వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరిన నేపథ్యంలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు పార్టీ పీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు భూమన స్పష్టం చేశారు. -
వైఎస్ఆర్ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు
- భూమన కరుణాకరరెడ్డి తిరుపతి : దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. కోటకొమ్మలవీధిలోని పార్టీ కార్యాలయంలో వర్ధంతి ఏర్పాట్లపై చర్చించేందుకు సోమవారం పాలగిరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ తిరుపతి నగర శాఖ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. వైఎస్.రాజశేఖరరెడ్డికి తిరుపతితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దమనకాండ సాగిస్తోందని అయితే అలాంటి వాటికి భయపడకుండా ధైర్యంగా కార్యకర్తలు వైఎస్ఆర్ ఆశయాల సాధన ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి రోజున 2 వేల మందికి తగ్గకుండా పేదలకు అన్నదానం చేయాలని, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎంవీఎస్.మణి, షపీఅహమ్మద్ ఖాద్రి, పుల్లయ్య, ఆదికేశవులురెడ్డి, మాజీ ఎంపీపీ తిరుమలయ్య, మాజీ ఎంపీటీసీ మదన్‌మోహన్‌రెడ్డి, టీ.రాజేంద్ర, కొమ్ము చెంచయ్యయాదవ్, హర్ష, గోపీయాదవ్, మౌలా, మునిరామిరెడ్డి, నాగిరెడ్డి, బొమ్మగుంట రవి, కే.అమరనాథరెడ్డి, తాళ్లూరు ప్రసాద్, జీవకోన మహబూబ్‌బాషా, బచ్చుమునికృష్ణ, పెరుమాళ్, చెలికం కుసుమ, పునీత, లక్ష్మి, లతారెడ్డి, శాంతారెడ్డి, గౌరి, పుష్పలత, లక్ష్మీకాంతమ్మ, ఎంకే. నాగరాజు, చానూ పాల్గొన్నారు. -
బాబు గూబ గుయ్‌మనేలా శంఖారావం
ఫ్యాను గాలికి టీడీపీ కొట్టుకుపోతుంది.. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: తిరుపతి ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి పూరించనున్న ఎన్నికల శంఖారావం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గూబ గుయ్ మనేలా ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే భూమ న కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పరిధిలోని కొర్లగుంట, గాంధీరోడ్డు ప్రాంతాల్లో బుధవారం పార్టీ నాయకు డు జ్యోతిప్రకాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా కిరణ్, చం ద్రబాబు కుమ్మక్కు రాజకీయాలతో అధిక భారాలు మోపి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. దీం తో విసిగిపోయిన ప్రజలు జగనన్న పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నా రు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గాలికి టీడీపీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుందన్నారు. సోనియాగాంధీకి తొత్తులుగా వ్యవహరించి తెలుగుజాతిని ముక్కలు చేసిన దుర్మార్గులు కిరణ్, చంద్రబాబు అని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ద్రోహులైన కిరణ్, చంద్రబాబుకు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఆరు నెలల పాటు రాష్ట్ర సమైక్యత కోసం అలుపెరగని ఉద్యమ, పోరాటాలు చేసింది ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమేనని గుర్తు చేశారు. తాను గెలుపొందిన రెండేళ్ల కాలంలో నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే ఎన్నిక ల్లో వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని విజ్ఞ ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ నాయకులు పుల్లయ్య, కేతం జయచంద్రారెడ్డి, పి. అమరనాథరెడ్డి, టి. రాజేం ద్ర, బాలమునిరెడ్డి, తాలూరి ప్రసాద్, రామకృష్ణయ్య, చెలికం కుసుమ, గీత, శారద, దుర్గ, శాంతారెడ్డి, బోయళ్ల రాజేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలన అంటే రాక్షసపాలనను ఆహ్వానించడమే
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడమంటే రాక్షస పాలనను ఆశించడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. వేతనాలు పెంచాలని కోరిన అంగన్వాడీ మహిళలను కనికరం లేకుండా గుర్రాలతో తొక్కించిన, అలాగే కరెంటు చార్జీలు తగ్గించాలని పోరాడిన వారిని కాల్చిచంపిన ఘన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడేసిన, అనేక ప్రభుత్వరంగ సంస్థలను మూసేసిన చరిత్ర కూడా బాబుదేనన్నారు. సహచర ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలతో కలసి భూమన శనివారం అసెంబ్లీ మీడియాపాయింట్లో మాట్లాడారు. ‘‘చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆయన భజనపరులు చేస్తున్న ప్రచారం వింతగా ఉంది. బెల్టుషాపులు విచ్చలవిడిగా పెంచడం, వ్యవసాయాన్ని దండగ అనడం, ప్రభుత్వరంగ సంస్థల్ని మూసివేయడం, అవినీతికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చడం చేసినందుకా ఆయన పాలనను తిరిగి కోరుకుంటున్నది? నరకాసురుడు, దుర్యోధనుడు, హిరణ్యాక్షుడు తరహా రాక్షస పాలన చంద్రబాబుది. ఆయన పాలనను తిరిగి కోరుకోవడమంటే అఘోరాలు.. శ్మశానంలో ఉండి దయ్యాలను ఆహ్వానించినట్లే’’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన వద్దేవద్దని ప్రజలు కంకణం కట్టుకున్నారని భూమన చెప్పారు. ‘‘1980వ దశకంలో ఇళ్లముందు ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండేది. ఇప్పుడు ‘ఓ చంద్రబాబూ నువ్వు మళ్లీ అధికారంలోకి రాకు’ అని ప్రజలు రాసుకుంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు. -
మాది రాష్ట్రాన్ని కాపాడే పోరాటం: వైఎస్సార్సీపీ
-
మాది రాష్ట్రాన్ని కాపాడే పోరాటం: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను ముగించడాని కంటే ముందే ఓటింగ్ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం పునరుద్ఘాటించింది. వైఎస్సార్సీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, కాటసాని రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చర్చ పూర్తయిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తే తెలంగాణ ఎమ్మెల్యేలు ఆ ప్రక్రియను అడ్డుకునే అవకాశాలున్నాయి కాబట్టే ముందు ఓటింగ్ నిర్వహించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందో లేదో ఎమ్మెల్యేలకు సైతం స్పష్టత లేని పరిస్థితి నెలకొందని, బిల్లుపై ఏ విధంగా ముందుకెళుతున్నారో కనీసం బీఏసీ సమావేశం నిర్వహించైనా సభ్యులకు చెప్పాల్సిన అవసరముందన్నారు. తాము రాష్ట్రాన్ని కాపాడేందుకు పోరాడుతుంటే.. కాంగ్రెస్, టీడీపీ నేతలు మాత్రం తమ పార్టీలను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటింగ్ నిర్వహిస్తే ఎలాంటి వైఖరి అనుసరించాలో స్పష్టత లేని కారణంగానే కాంగ్రెస్, టీడీపీలు తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తమ పార్టీపై విమర్శలు చేసే బదులు విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో చంద్రబాబు ఎందుకు సూటిగా చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. అన్ని పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బిల్లుపై ముందుగా ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను వ్యూహాత్మకంగా నీరుగార్చారని చెప్పారు. సీఎం కిరణ్ సభా నాయకుడిగా ఓటింగ్ నిర్వహించాలని ఎందుకు పట్టుబట్టడంలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో బాబు మౌనంగా ఉండటంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. -
విభజనకు పూర్తి వ్యతిరేకం: భూమన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి, సంప్రదాయాలకు విరుద్ధంగా, కేవలం ఓట్లు-సీట్ల కోసం సభలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఐదో, పదో ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం దుర్మార్గమంటూ తప్పుబట్టారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు, పార్లమెంటులో చిదంబరం ఇచ్చిన హామీకి ఈ బిల్లు వ్యతిరేకమని, దాన్ని ఓడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉదయం సభ ప్రారంభమయ్యాక వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకరు పోడియుం వుుందుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అనంతరం భూవున వూట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తవు పార్టీ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ‘‘సమైక్యాంధ్ర కోసం మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోని అనేక పార్టీల అధినేతలను కలిశారు.మా పోరాటానికి వుద్దతివ్వా ల్సిందిగా విన్నవించారు. సమైక్య తీర్మానం చేయూల్సిందిగా సభా నియమావళిలోని 77, 78 నిబంధనల కింద స్పీకర్‌కు నోటీసిచ్చాం. విభజనను వ్యతిరేకిస్తూ 164వ నిబంధన కింద పిటిషన్ సవుర్పించాం. 2013 డిసెంబరు 23, 24 తేదీల్లో రాష్ట్రపతికి అఫిడవిట్లు సవుర్పించాం. అసెంబ్లీ సవూవేశాలు జరిగేందుకు వుుందే సమైక్య తీర్మానం చేయూల్సిందిగా కూడా కోరాం’’ అని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం నిర్ణయుం తీసుకోవడవుంటే రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్టు కోయుడం కాదన్నారు. ‘‘తండ్రిలాగా నిర్ణయుం తీసుకోవున్నాం. అంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే మా అభిప్రాయుం’’ అని భూమన పునరుద్ఘాటించారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నది వైఎస్సార్సీపీ ఒక్కటేనన్నారు. తెలంగాణ పట్ల తక్కువ భావం లేదు: వుంత్రి శైలజానాథ్ వూట్లాడిన తీరు ఉరికంభమెక్కిన వ్యక్తిని ఉరి తీసే తలారే దీర్ఘాయుష్మాన్‌భవ అని ఆశీర్వదించినట్టుగా ఉందని భూమన ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు నిర్ణయుం తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉండి వూట్లాడటం దారుణవున్నారు. 2 కళ్ల సిద్ధాంతంతో టీడీపీ ప్రజల అభిప్రాయూలను గౌరవించడం లేదంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ వాళ్లు ఆత్మను అవ్ముకానికి పెట్టారని దుమ్మెత్తిపోశారు. 2,700 ఏళ్లుగా తెలుగువారు కలిసే ఉన్నారని తెలిపారు. సీమాంధ్రులు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల పట్ల తవుకు ఏనాడూ తక్కువ అభిప్రాయుం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి వైఎస్ అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. వైఎస్, జగన్‌లపై అభాండాలా! సభలో విభజన చర్చలో పాల్గొంటున్న ఇతర పార్టీల సభ్యులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై, వైఎస్ జగన్‌పై అభాండాలు వేయడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. హైదరాబాద్ కు వెళ్లాలంటే వీసా కావాలా అన్న వైఎస్‌ను విభజనవాది అని విమర్శిస్తారా అంటూ భూమన మండిపడ్డారు. తెలంగాణ కోసమే ఆయన రోశయ్యు కమిటీ వేశారనడం సరికాదన్నారు. రోశయ్యు కమిటీ వేసిన సందర్భంగా, పరిశీలించాల్సిన వివిధ అంశా లను వివరించి, దర్యాప్తు చేయాలని వూత్రమే వైఎస్ చెప్పారని గుర్తు చేశారు. వైఎస్‌ను తూల నాడుతున్నా, ఆయన ప్రాపకం తో అధికారంలో ఉన్నవారు నిస్తేజంగా ఉండడం చూస్తే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని మరోసారి రుజువవు తోందన్నారు. నష్టపోతావుని తెలిసీ: ‘‘ఒక ప్రాంతంలో రాజకీయుంగా నష్టపోతావుని తెలిసి కూడా వైఎస్సార్సీపీ సమైక్యాంధ్రే కావాలని కోరుతోంది. టీడీపీలో వూత్రం సగం వుంది విభజన కావాలని, మిగతా సగం సమైక్యాంధ్ర అంటున్నారు. వారు కూడా లోపల వూత్రం విభజనే కావాలంటున్నారు’’ అంటూ భూమన ఎద్దేవా చేశారు. తాము టీడీపీలాగా స్వార్థ రాజకీయుం కోసం ఆలోచించలేదన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన చేయుగా, మీ నాయుకుడైన చంద్రబాబుతో సమైక్యాంధ్ర అనిపించండని డివూండ్ చేశారు. భూమన ప్రసంగంలోని ప్రధానాంశాలు ఇదివరకు ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఎస్సార్సీ లేదా శాసనసభల తీర్మానాలతో ఏర్పడ్డాయి. ఈ బిల్లు అందుకు పూర్తి భిన్నం జల వివాద ట్రిబ్యునళ్లున్నా సమైక్య రాష్ట్రంలో కర్ణాటక, మహారాష్ట్రలతో పోరాడుతున్నాం. రాష్ట్రం విడిపోతే ఘర్షణ పడాల్సి వస్తుంది హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలంటే 50, 60 ఏళ్లయినా సాధ్యం కాదు. 75 % పన్నులు హైదరాబాద్ నుంచే వస్తున్నాయి మా ప్రాంత పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల చుట్టూ తిరగాలా? బిల్లుపై చర్చలో పాల్గొనబోం. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడానికి ఓటింగ్‌లో పాల్గొంటాం ముద్దుకృష్ణమ వ్యాఖ్యలతో స్తంభించిన సభ టీడీపీ శాసనసభా పక్ష ఉపనాయకుడు ముద్దు కృష్ణమ శనివారం శాసనసభలో వైఎస్సార్సీపీ పక్ష నాయకురాలు విజయమ్మ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సభ స్తంభించింది. బాబును ఓడించడం కష్టసాధ్యమని భావించే వైఎస్.. చిన్నారెడ్డి నేతృత్వంలో 41 మంది ఎమ్మెల్యేలతో సోనియాకి లేఖ ఇప్పించారని ముద్దుకృష్ణమ విమర్శించారు. చర్చ సమయంలో సభలో ఉంటే సోనియా పీకనొక్కుతారన్న భయం తో విజయమ్మ వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియంలోకి వెళ్లి తమ శాసనసభా పక్ష ఉపనాయకురాలికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తరువాత కూడా వారు అదే డిమాండ్ చేశారు. పోడియం వద్దే నిల్చుని.. ‘బాబు తన వైఖరి వెల్లడించాలి.. 2 కళ్ల సిద్ధాంతం నశించాలి.. సభ్యుల హక్కులు కాపాడాలి’ అంటూ నినాదాలు చేశారు. -
బాబు పెద్ద అవకాశవాది: వైఎస్సార్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది ఆకాశమంత అవకాశవాదమని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో విభజన డిమాండ్ చేయిస్తూ, సీమాంధ్ర వారితో సమైక్య నినాదాలు వినిపిస్తున్న చంద్రబాబు దోబూచులాట తేటతెల్లమవుతోందని దుయ్యబట్టింది. బాబుది అవకాశవాదమైతే, కిరణ్ది బూటకపు సమైక్యవాదమని ధ్వజమెత్తింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని మొదట్నుంచీ చెబుతున్న దానికే కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి,అమరనాథరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డితో కలసి గొల్ల బాబూరావు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ‘‘విభజన వల్ల కలిగే నష్టాలను గ్రహించి ఇకనైనా కళ్లు తెరవండి. అని మా శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ సీఎం,ప్రతిపక్ష నేతను కోరారు. కానీ, వారిద్దరూ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసేందుకు సంఘీభావం తెలుపలేదు. ఆ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలనే డిమాం డ్కు అంగీకరించనందునే మా పార్టీ వాకౌట్ చేసింది’’ అని వివరించారు.