Big Rally For 3 Capitals In Tirupati | Tirupati MLA Bhumana Karunakar Reddy About AP 3 Capitals In Rally - Sakshi
Sakshi News home page

రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా చేసింది శూన్యం​: భూమన

Published Sat, Oct 29 2022 10:56 AM | Last Updated on Sat, Oct 29 2022 3:17 PM

Big Rally for 3 Capitals in Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని, రాయలసీమ హక్కులు కాపాడాలని కోరుతూ ప్రజలు ఏకమవుతున్నారు. శనివారం తిరుపతి వేదికగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన, వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు.

ఈ మహా ప్రదర్శనలో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే ఉందంటూ నినాదాలు చేశారు. మహాప్రదర్శనతో తిరుపతి జనసంద్రంగా మారింది.  

మహార్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. రాయలసీమకు బాబు చేసిందేమీ లేదు. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అని​ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భూమన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement