Three Capitals
-
అచ్చెన్నాయుడుకు కౌంటర్ ఇచ్చిన బొత్స సత్యనారాయణ
-
విశాల హితం.. రామోజీ రాతల్లో ఖతం
దేశంలో తీర ప్రాంతాల్లో వెలసిన రాజధానులు ఆ రాష్ట్ర ప్రగతికి పునాదులు వేశాయన్నది కళ్లెదుట కనిపించే నిజం. అందుకే రాష్ట్ర విశాల హితమే ధ్యేయంగా సీఎం జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. రామోజీకి మాత్రం ఇది గిట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు అండ్ బ్యాచ్ సాగించే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తింటుందనే. ఆ సంకుచిత ధోరణితో ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని రామోజీ, చంద్రబాబు బృందం తెగ ఆరాట పడిపోయింది. రాజధాని గురించి ముందుగా లీకులిచ్చింది కూడా ఈ భూ దందాల కోసమేనని ఎవరినడిగినా చెబుతారు. అమరావతి పాలనా రాజధాని కాదంటే ఆ పరిసరాల్లో ముందస్తుగా అడ్డగోలుగా ఎల్లో బ్యాచ్ కొన్న భూముల విలువ పడిపోతుందని రామోజీ భయం. అందుకే శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నా, జగన్ గట్టి సం కల్పం వల్ల శాసనసభలో బిల్లుకు ఆమోదం లభించింది. ఇది నచ్చని బాబు బ్యాచ్ అడ్డుపడి కోర్టు కెక్కింది. ఇదే విషయాన్ని నంద్యాల సభలో సీఎం జగన్ ప్రస్తావిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు గురించి మాట్లాడితే దానికి రామోజీ వక్రభాష్యం చెబుతూ ఏడుపుగొట్టు.. వెకిలి.. వెటకారపు రాతలతో కథనాన్ని అచ్చేశారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులను ఏర్పాటు చేసిన మాట చట్టసభల సాక్షిగా నిజం. మూడు రాజధానులకు బల ప్రదర్శన ద్వారా తొలుత శాసన మండలిలో చంద్రబాబు అండ్ కో బృందం అడ్డుపడింది. మళ్లీ శాసన సభ ఆమోదించిన తర్వాత మండలి ఆమోదించక తప్పలేదు. ఆ తరువాత న్యాయస్థానానికి వెళ్లి మూడు రాజధానులు ఏర్పాటు కాకుండా ఈ బృందమే అడ్డుకుంది. ఈ పరిణామంతో మూడు రాజధానుల కార్యకలాపాలు వాయిదా పడ్డాయే తప్ప.. వాటి ఏర్పాటు అక్షరాలా నిజం. ఇదే విషయాన్ని నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దీనికి ఈనాడు రామోజీ వెటకారంతో పైత్యం జోడించి సిగ్గులేని కథనం అచ్చువేశారు. అమరావతిని చంపేశారంటూ పచ్చి అబద్ధాలను వండి వార్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. అమరావతిలో బాబు చేపట్టి పూర్తి చేయకుండా వదిలేసిన పనుల్లో అవసరమైన పనులనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. రామోజీ ఈ అవాస్తవాలను ప్రచారం చేయడానికి ప్రధాన కారణం తనకు ఇష్టుడైన చంద్రబాబు అండ్ కో బ్యాచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలిపోయిందనే అక్కసే తప్ప మరొకటి కాదు. తొలి నుంచి పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా అన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది వైఎస్సార్సీపీ విధానం. అందులో భాగంగానే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చట్టం చేయడం.. చంద్రబాబు అండ్ కో బృందం న్యాయస్థానానికి వెళ్లి ఈ చర్యను అడ్డుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అడ్డుకోబోయింది మీ బాబే అమరావతి రైతుల పేరుతో ఒక వైపు కృత్రిమ పోరాటం చేయిస్తూ, మరో పక్క న్యాయస్థానంలో అడ్డుకుంది మీ బాబే రామోజీ. జనం అమాయకులు కాదు. మీరు ఏది రాస్తే దాన్నే జనం నమ్ముతారనుకోవడం మీ అజ్ఞానం, అవివేకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో వ్యవస్థల్లో గొప్ప విప్లవాత్మక మార్పులను తెచ్చారనేది వాస్తవం. మీరు అంగీకరించకపోయినా నీతి ఆయోగ్‌తో పాటు ప్రపంచ బ్యాంకు తదితర గొప్ప సంస్థలు జగన్ ప్రభుత్వానికి కితాబిచ్చాయి. మీ చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయలేకపోతే, సీఎం జగన్ చేసి చూపించి, కుప్పంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేశారు. ఈ విషయాన్నే ఆయన తన ప్రసంగంలో చెప్పారు. ఇందులో ఆత్మస్తుతి, పరనింద ఏముందీ రామోజీ? గ్రామ, వార్డు సచివాయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో చదువుకున్న 10–11 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇది జగమెరిగిన సత్యం. ఎవరూ కాదనలేని నిజం. రైతుల కోసం ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. విలేజ్, వార్డు క్లినిక్స్‌ను ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. బాబు ఐదేళ్ల పాలనలో జిల్లాలను పునర్ వ్యవస్థీకరించాలనే ఆలోచనే చేయలేదు. జగన్ 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. ఇది పరిపాలన వ్యవస్థలను మరింతగా ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు చేయలేకపోయిన, సాధించలేకపోయిన నాలుగు పోర్టుల నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వలంటీర్లను ఏర్పాటు చేసి లంచాల్లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న విషయం కళ్లెదుట కనిపించే వాస్తవం. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీతో పాటు మధ్యలో రూపాయి దుర్వినియోగం కాకుండా నేరుగా వారి ఖాతాలకు చేరుతోంది. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న నిజాలు రామోజీ. మీరు కాదన్నా.. వెటకారం చేసినా రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తున్న వాస్తవాలివి. రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలిలా.. ♦ మహిళా సాధికారత, మహిళా సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని నోబల్ గ్రహీత దుఫ్లో కొనియాడారు. ♦ ఐక్య రాజ్య సమితి ఛాంపియన్ అవార్డుకు రైతు భరోసా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. గ్రామ స్థాయిలో ఆర్బీకెల ఏర్పాటు చేయాలనే వినూత్న ఆలోచనను ఎఫ్ఏఒ కంట్రీ డైరెక్టర్ టోమియో పిచిరి అభినందించారు. ♦ ఏపీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. ♦ ప్రతి 2000 జనాభాకు ఆరోగ్య సంరక్షణ అందిస్తున్న ఏపీ ప్రభుత్వ చర్యలను డబ్యుఈఎఫ్ హెల్త్ కేర్ చీఫ్ డా.శ్యామ్ బిషెన్ ప్రశంసించారు. ♦ 31.88 లక్షల మంది మహిళలు, పిల్లలకు లబ్ధి చేకూరేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణను నీతి ఆయోగ్ ప్రశంసించింది. ♦ విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అమ్మ ఒడి పథకం వల్ల అక్షరాస్యత రేటు పెరుగుతోందని నోబెల్ గ్రహీత జాన్ బి.గూడెనఫ్ ప్రశంసించారు. ♦ విద్య, ఆరోగ్య, సామాజిక రంగ పెట్టుబడుల్లో ఏపీ పురోగతిని ప్రపంచ బ్యాంకుప్రశంసించింది. ♦ కోవిడ్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచం మొత్తం నేర్చుకోవాలని యూకే మాజీ డిప్యుటీ హైకమిషనర్ అండ్రూ ఫ్టెమింగ్ కొనియాడారు. -
బహుజనుల అవిశ్రాంత పోరు
తాడికొండ: రాజధాని పేరిట అమరావతిలో కులవాదుల అరాచకాలు, అవినీతిని ప్రపంచానికి తెలియజేసేందుకు... రాజ్యాంగబద్ధంగా పేదలకు లభించిన హక్కులను కాపాడేందుకు... మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను చాటిచెప్పేందుకు బహుజన పరిరక్షణ సమితి అవిశ్రాంత పోరాటం సాగిస్తోంది. రాజధాని ఒక కులానిది కాదని.. అందరిదని చాటిచెబుతోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తోంది. భవిష్యత్‌లో మరో వేర్పాటువాద ఉద్యమానికి నేడు అమరావతిలో కులవాదుల వ్యవహారశైలి, నిర్ణయాలు కారణం కాకూడదని పోరాడుతోంది. ఈ మేరకు మూడు రాజదానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 1,200వ రోజుకు చేరనున్నాయి. ఎక్కడ అన్యాయం జరిగిందో.. అక్కడే పోరాటం రాష్ట్ర ప్రభుత్వం 2019, డిసెంబర్ 17న అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించింది. దీనిని వ్యతిరేకిస్తూ అమరావతి ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో టీడీపీ నాయకులు దొంగ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేయకుండా కోరుక్టు వెళ్లి స్టేలు తీసుకువచ్చారు. అయితే, మూడు ప్రాంతాల సమానాభివృద్ధితోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ఖజానా మొత్తం ఒకే ప్రాంతానికి దోచిపెట్టడం కారణంగా అందరి హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ బహుజన పరిరక్షణ సమితి నాయకులు 2020, ఫిబ్రవరి 9న ఉద్యమం చేపట్టారు. ఎక్కడ రాజధాని పేరిట బహుజనులు, పేదల భూములు దోచుకున్నారో.. ఎక్కడ అమాయకులకు అన్యాయం జరిగిందో అక్కడే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత, బహుజన సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రత్యక్షంగా 67 సంఘాలు, పరోక్షంగా దాదాపు 240 సంఘాల నేతలు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కులవాదులు, పెత్తందారులు, ఆరి్థక ఉగ్రవాదులు పలుమార్లు ప్రయతి్నంచినప్పటికీ బహుజన నేతలు వెరవకుండా నిరి్వరామంగా తమ పోరాటం కొనసాగిస్తున్నారు. మూడు రాజధానుల ద్వారానే బహుజనులకు మేలు 1,199వ రోజు రిలే నిరాహార దీక్షలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మూడు రాజధానుల ద్వారానే బహుజనుల ఆర్థిక, సామాజిక ఎదుగుదల సాధ్యమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 1,199వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేదల కోసం చేసిన ఒక్క మంచిపని అయినా ఉంటే చూపించి ఓట్లు అడగాలని సూచించారు. విభజన అనంతరం బాబు చేసిన తప్పుడు పనుల కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి పేరుతో కేవలం గ్రాఫిక్స్లను ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఈ ప్రాంతంలో ముందస్తు వ్యూహంతో బినామీల ద్వారా పెట్టుబడులు పెట్టి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి రూ.లక్షల కోట్లు లాభాలు పొందారని ఆరోపించారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొని నిరసన తెలియజేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు (ఫైల్) -
ఓటు దొంగలు.. బాబు అండ్‌కో
తాడికొండ: ఎన్నికలు సమీపిస్తుండడంతో బహుజనుల ఓట్లు దోచుకునేందుకు రాష్ట్రంలో బాబు అండ్ కో బ్యాచ్ అడ్డగోలుగా తిరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 1,049వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో శనివారం పలువురు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న పలు పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లు వేయించుకునేందుకు బహుజనులకు వల విసురుతున్నారన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఏం చేశాడో చెప్పి ప్రజల్లోకి రావాలని లేకుంటే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహుజనుల కలలు సాకారం చేస్తుంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, బీజేపీలోని బాబు బంధువు పురందేశ్వరి.. బాబును గద్దెనెక్కించేందుకే ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న చంద్రబాబు.. అన్ని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించేందుకు పావులు కదుపుతున్నాడని చెప్పారు. రిలే నిరాహార దీక్షలో సమితి నాయకులు కారుమూరి పుష్పరాజు, బేతపూడి సాంబయ్య, పులి దాసు, మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో బహుజన నేతలు -
బహుజనుల పోరాటానికి 951 రోజులు
తాడికొండ: అమరావతిలో అందరికీ సమాన హక్కులు.. అన్ని కులాల వారికీ సమాంతర జీవన హక్కులు కల్పించాలని కోరుతూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం శనివారం 951వ రోజుకు చేరింది. బహుజనుల హక్కులను హరిస్తూ.. కులవాదంతో చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా 2020 మార్చి 9న రిలే దీక్షలు చేపట్టిన ఉద్యమం ఇప్పటికీ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నుంచి అసెంబ్లీకి వెళ్లే సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దంటూ న్యాయస్థానం నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చిన కులవాదుల ఆట కట్టించేందుకు బహుజన పరిరక్షణ పేరుతో 266 దళిత సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటానికి దిగాయి. ఇందులో 70 సంఘాలు ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమం నిర్వహిస్తుండగా.. 194 సంఘాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పక్క రాష్ట్రాల నుంచి మద్దతు తెలిపాయి. ఒకే అంశంపై సుదీర్ఘంగా పోరాటం చేసిన ఏకైక ఉద్యమం బహుజన పరిరక్షణ సమితి ఉద్యమంగా ఈ ఉద్యమం చరిత్రకెక్కింది. బహిరంగ నిరసనతో కడకంటూ పోరాటం.. అమరావతిలో 54 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలతోపాటు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. కులవాదులు కోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చారు. సీఆర్డీయే చట్టంలో పొందుపరచిన ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించి.. శాటిలైట్ సిటీ కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. పేదలు ఈ ప్రాంతంలో ఉంటే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందంటూ కులవాదంతో అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య అందకుండా చేసేందుకు కుట్ర పన్నిన కులవాదులు కార్పొరేట్ స్కూళ్లతో కుమ్మక్కై తప్పుడు కేసులు వేయించారు. పూలింగ్ పేరిట ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా.. రైతుల ముసుగులో కులవాదులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ అమరావతి పేరిట దొంగ ఉద్యమం చేపట్టారు. ఇలాంటి ఆగడాలపై బహుజన పరిరక్షణ ఉద్యమం కన్నెర్ర చేసింది. వారి ఆగడాలను ఎండగడుతూ బహుజనుల కలలు సాకరమయ్యే వరకు కడకంటూ పోరాటం కొనసాగిస్తోంది. అడ్డంకులు ఎదురైనా.. 2020 నవంబర్‌లో ఉద్దండరాయుని పాలెంలో ఎంపీ నందిగం సురేష్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బహుజన పరిరక్షణ సమితి నాయకులు వెళితే అమరావతి శిబిరంలో ఉన్న కులవాదులు రాళ్లతో దాడి చేశారు. బహుజనులపై కవ్వింపు చర్యలకు పాల్పడి దుర్భాషలాడుతూ దాడులకు తెగబడ్డారు. దీనిపై కూడా పోలీసు కేసులు నమోదయ్యాయి. కాగా, 2021 ఫిబ్రవరి 21న కులవాదులంతా కలిసి ఆటోలలో ఉద్యమానికి వస్తున్న మహిళలపై దాడులకు తెగబడ్డారు. రైతుల ముసుగులో ఉన్న విచక్షణ రహితంగా దాడులు చేయడంతో మహిళలు సైతం దెబ్బలు తిని ఇబ్బందులకు గురయ్యారు. వీటన్నింటిని తట్టుకుని నిలబడి ఉద్యమం చేస్తున్న వారిపై బెదిరింపులకు పాల్పడినా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. ‘ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటే బాబుకు మంచిది’ శనివారం నాటి 951వ రోజు దీక్షలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుతో అయినా చంద్రబాబు తన తప్పుడు విధానాలను మార్చుకోవాలని.. కోర్టు తీర్పును స్వాగతించి పేదలకు ఈ ప్రాంతంలో అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. అలా కాదని వ్యవస్థలను ప్రలోభాలకు గురిచేసి బహుజనుల్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇస్తే వామపక్షాలు, ఇతర పార్టీలు స్వాగతించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం, న్యాయవాది పెరికే వరప్రసాద్, వివిధ సంఘాల నాయకులు నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం, పులి దాసు, బొలిమేర శ్యామ్యూల్, పల్లె బాబు, కారుమూరి పుష్పరాజ్ తదితరులు ఉన్నారు. -
మూడు రాజధానుల దీక్షా శిబిరంపై దాడి.. చంద్రబాబు డైరెక్షన్ మేరకే
తాడికొండ/సాక్షి, అమరావతి : అమరావతి దీక్ష శిబిరంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మూడు రాజధానుల శిబిరం వద్ద నిరసన తెలిపిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలపై బీజేపీ ముసుగులోని టీడీపీ మాజీ మంత్రి అనుచరులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడులను బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య చోటుచేసుకున్న ఘర్షణగా చిత్రీకరిస్తూ టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రాజకీయ డ్రామాకు తెరతీశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డిని నాటి సీఎం చంద్రబాబు టీడీపీలోకి లాక్కుని.. మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 2019లో అధికారం కోల్పోగానే చంద్రబాబు కనుసైగల మేరకే ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతి దీక్షలు 1200వ రోజుకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం మందడంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆదినారాయణరెడ్డి.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో కలిసి వెళ్లారు. ఆ శిబిరంలో సీఎం జగన్‌పై ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తాళ్లాయపాలెం జంక్షన్‌లోని మూడు రాజధానుల శిబిరంలో 915వ రోజు దీక్షలు చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలకు తెలిసింది. కాసేపటి తర్వాత ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్, వారి అనుచరులు విజయవాడకు బయలుదేరారు. వారి వాహన శ్రేణి మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకోగానే.. బహుజన పరిరక్షణ సమితి నాయకులు రోడ్డు పక్కన నిల్చొని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆదినారాయణరెడ్డి డౌన్ డౌన్.. అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. అంటూ నినదించడంతో ఆదినారాయణరెడ్డి అనుచరులు వారిపై విచక్షణా రహితంగా దాడులకు దిగారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై విరుచుకు పడ్డారు. మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగారు. వారు ప్రతిఘటించడానికి సిద్ధమవుతుండగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనకు కారణమైన ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, ఈపూరి ఆదాం, బేతపూడి సాంబయ్య, బొలిమేర శామ్యూల్, కారుమూరి పుష్పరాజ్, ఇందుపల్లి సుభాషిణి, మల్లవరపు సుధారాణి, తదితరులు డిమాండ్ చేశారు. అనంతరం దీక్ష శిబిరాన్ని సందర్శించిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు శిబిరం వద్ద ఉన్న మహిళలను జుట్టు పట్టుకొని తన్నారని చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందన్నారు. ఆదినారాయణరెడ్డి కోసమే.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీరుపై బహుజనులు నిరసన తెలపడంలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ ఘటన సమయంలో ‘నా పేరు ఎవరూ ఎత్తలేదు.. ఆదినారాయణరెడ్డి కోసమే ఆరా తీశారు. ఆయన నా కారు ఎక్కలేదు. ఉదయం నేను, ఆయన కలిసి వెళ్లాం. సభ నుంచి ఆయన కాస్త ముందుగా వచ్చారు. ఆ విషయం వారికి తెలియదు. ఎవరో నా కారుపై దాడి చేశారు’ అని వివరించారు. కాగా, సత్యకుమార్ కారుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పారు. ఈ ఘటన గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందన్నారు. అమరావతి రైతులపై 3,500 కేసులా? అమరావతి రైతులపై 3,500 కేసులు నమోదు చేశారని, ఇదెక్కడ న్యాయమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. అమరావతి దీక్షలు 1200వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరు మండలం మందడంలోని దీక్షా శిబిరంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు లీగల్‌గా, పర్సనల్‌గా, పార్టీ పరంగా, టెక్నికల్‌గా అన్ని విధాలా సాయం చేస్తామని స్పష్టం చేశారు. కేసు నమోదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పులిపాటి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో వెంటనే జోక్యం చేసుకుని, నివారించామన్నారు. గుర్తు తెలియని వ్యక్తి బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై రాయి విసిరి పొలాల్లోకి పారిపోయాడని చెప్పారు. తమపై ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారంటూ మూడు రాజధానుల ఆందోళనకారులు ఫిర్యాదు ఇచ్చారని, ఈ ఘటనపై త్వరితగతిన దర్యాప్తు చేస్తామని తెలిపారు. చదవండి: ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి -
‘హోల్‌సేల్‌గా అవినీతి చేశాడు కాబట్టే చంద్రబాబును..’
సాక్షి, విజయవాడ: మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని, అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి కుండబద్ధలు కొట్టారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోల్‌సేల్ ఎవరో.. రిటైల్ ఎవరో ఏపీ ప్రజలకు స్పష్టంగా తెలుసని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు హోల్‌సేల్‌గా అవినీతికి చేశాడు కాబట్టే.. ప్రజలు హోల్‌సేల్‌గా ఇంటికి పంపించారని మంత్రి బొత్స సెటైర్ వేశారు. అంతేకాదు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బొత్స వ్యాఖ్యానించారు. -
అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ..
-
వికేంద్రీకరణే మా విధానం: సజ్జల
-
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం: మంత్రి అంబటి రాంబాబు
-
మూడు రాజధానులే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలసీ: అంబటి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అంబటి రాంబాబు మరోమారు స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదు అంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని పేర్కొన్నారు. 'వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధానం మూడు రాజధానులే. దీనికి కారణమేమిటంటే సమతుల్యం. మూడు ప్రాంతాలను సమానంగా చూసుకోవాలనే భావన. ఇంతకుముందు మనకు ఈ రాష్ట్రంలో చాలా అనుభవాలు ఉన్నాయి. రీజినల్ ఫీలింగ్స్ ఉన్నాయి. దాని వల్ల ఒకసారి దెబ్బతిన్నాం. తెలంగాణ ఫీలింగ్‌తో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వంటి గొప్ప ప్రదేశాన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ అలా ఉండకుండా అన్ని చోట్లా అభివృద్ధి జరగాలనే సదుద్దేశంతో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మూడు రాజధానులు అవసరం. మూడు రాజధానులంటే ఒకటి రాయలసీమకి, ఒకటి కోస్తా ఆంధ్రకి, ఒకటి ఉత్తరాంధ్రకి ఇచ్చి అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచడంతో పాటు, ఓన్ చేసుకునే విధానాన్ని చేయటం. దీని వల్ల భవిష్యత్తులో ఏ విధమైన ఆందోళన, అభద్రతా భావం ఏ ప్రాంతానికీ ఉండకూడదనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది తప్ప మరొకటి కాదు. అది మా పాలసీ. ఆ పాలసీకే కట్టుబడి ఉన్నాం. మీరు దాని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు.' అని అంబటి అన్నారు. చదవండి: అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ -
మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. రాజధానిపై నిర్ణయం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని గతంలో కేంద్రం విస్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడంపై కేంద్రం వైఖరి ఏమిటని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసిందని, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 మేరకు నూతన రాజధాని ఏర్పాటుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నివేదికను తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందని తెలిపారు. అనంతరం అమరావతిని రాష్ట్ర రాజధాని నగరంగా ప్రకటిస్తూ 2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. కాలక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ చట్టం–2020ని రద్దు చేసిందని తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాల ను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సంఘటిత అభివృద్ధి చట్టం–2020 (ఏపీడీఐడీఏఆర్)ని తీసుకొచ్చిందని వివరించారు. ఈ చట్టం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఈ చట్టాన్ని రద్దుచేసిందన్నారు. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ అప్పీల్ (సివిల్)ను దాఖలు చేసిందని, ప్రస్తుతం ఈ అంశం విచారణ దశలో ఉందని మంత్రి చెప్పారు. హైవే నిర్మాణాల్లో వేస్ట్ మెటీరియల్ వినియోగం జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, ఇను ము, స్టీల్, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాలను విరి విగా వినియోగిస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2019 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏపీలో 209 కిలోమీటర్ల మేర జాతీయ రహదార్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగించినట్లు తెలిపారు. అదేవిధంగా హైవేల నిర్మాణంలో 359 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ఫ్లైయాష్ (థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద), 7.28 లక్షల టన్నుల నిర్మాణ కూల్చివేత వ్యర్థాలు వినియోగించామని, 68 కిలోమీటర్లు మేర రహదారి నిర్మాణంలో ఇనుము, స్టీల్ స్లాగ్ వ్యర్థాలు వాడామని వివరించారు. దేశంలోని అన్ని జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, ఇనుము, నిర్మాణ రంగ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు, ఫ్లైయాష్ వినియోగించే విధంగా తమ శాఖ విధానపరమైన మార్గదర్శకాలు జారీచేయడంతోపాటు, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మాన్యువల్స్ ప్రచురించినట్టు చెప్పారు. సున్నా/తక్కువ ఉద్గారాల ప్రాంతాల్లో ఈ–వాహనాలకు అనుమతి దేశంలో సున్నా/తక్కువ ఉద్గారాలున్న ప్రాంతాల్లోనే ఈ–వాహనాలను అనుమతిస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సున్నా/తక్కువ ఉద్గారాలున్న ప్రాంతాలు గుర్తించడానికి అధ్యయనం తమ శాఖకు తెలియదని వైఎస్సార్సీపీ సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీలో 192 రహదారి పనులు పూర్తి ఆంధ్రప్రదేశ్‌లో 1,490 కిలోమీటర్ల మేర 192 రహదారి పనులు పూర్తయ్యాయని కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఏపీలో 3,285 కిలోమీటర్ల పనులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నెల 2వ తేదీ నాటికి తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహదారి మినహాయించి పూర్వ 13 జిల్లాల్లోని 2,308.58 కిలోమీటర్ల మేర 298 రహదారి పనులు మంజూరుకాగా 1,490 కిలోమీటర్ల మేర 192 రహదారుల పనులు పూర్తయ్యాయని వివరించారు. చాలా ప్రాజెక్టులు కరోనా, వరదల వల్ల ఆలస్యమైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికకు మరింత సమయం జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక ఇవ్వడానికి మరింత సమయం పడుతుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయమంత్రి నారాయణస్వామి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ ప్యానల్ వైస్‌చైర్మన్ హోదాలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4.32 గంటల నుంచి గంటసేపు ఆయన సభాకార్యక్రమాలు నిర్వహించిన సమయంలో సభ్యులు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించారు. -
మాకు సంబంధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని పరిణామాల నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై స్పందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఆంశాలు తమకు సంబంధించినవి కావని, వాటిపై స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కేంద్రం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డాయి. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ రాజధాని. ఆ తర్వాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని వస్తుంది. అనంతరం చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్రం ఏపీ రాజధాని నిమిత్తం ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని ఐఏఎస్ విశ్రాంత అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతృత్వంలో 2014 మార్చి 28న నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2014 ఆగస్టు 30న నివేదిక ఇచ్చింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆ నివేదిక పంపింది. అనంతరం 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని నూతన రాజధానిగా ఆదేశాలు ఇచ్చింది. చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం ఏపీలోని రాజ్‌భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, అసెంబ్లీ, మండలి ఇతర సదుపాయాలకు కేంద్రం ఆర్థికసాయం చేయాలని ఉంది. దీనిమేరకు కేంద్ర ప్రభుత్వం గృహ, పట్టణ వ్యవహారాలశాఖ నుంచి రూ.వెయ్యి కోట్ల సహా రూ.2,500 కోట్లు విడుదల చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం–2020, ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్, ఇన్‌క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్ యాక్ట్–2020లను చేసింది. దీన్ని రాష్ట్ర గెజిట్‌లో ప్రచురిస్తూ.. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా పేర్కొంది. ఈ రెండు చట్టాలు రూపొందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించలేదు..’ అని కౌంటరులో పేర్కొంది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు కేంద్రానికి సంబంధించినవి కాదని స్పష్టం చేసింది. అందువల్ల ఈ దశలో స్పందించడం లేదని, తదుపరి అవసరమైతే స్పందిస్తామని పేర్కొంది. -
ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై కుండబద్దలు కొట్టిన వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో రెండు ప్రశ్నలకు గట్టి జవాబే ఇచ్చినట్లనిపిస్తుంది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశంతో పాటు, మూడు రాజధానుల గురించి ఆయన మాట్లాడిన తీరు గమనించాల్సిందే. ప్రత్యేక హోదాకు సంబంధించి భారతీయ జనతా పార్టీని కూడా ఆయన ఏకిపారేశారు. వామపక్షాలు తరచూ ఈ మధ్య టిీడీపీ జోలికి పోకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నాయి. బీజేపీకి వైసీపీ భయపడిపోతోందని వారు అంటుంటారు. అందుకే ప్రత్యేక హోదా గురించి నిలదీయడం లేదని వారు ఆరోపిస్తుంటారు. టీడీపీ వారు బీజేపీని ఒక్క మాట అనకపోయినా వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ మాత్రం ఆ పార్టినీ తప్పుపట్టకుండా, ఎలాగోలా ఆ పార్టీ పంచన చేరాలని ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయి పార్లమెంటులో మాట్లాడుతూ బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ఆ రోజుల్లో ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ,బీజేపీలు విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యాయని, తత్పలితంగానే ఈ రెండు పార్టీలకు ఏపీలో జీరో ఫలితాలు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటున్నదని, కానీ అది ఎప్పటికీ ముగియదని, ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగదని విజయసాయి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నారు. ప్రధాని మోదీని కానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కానీ కలిసి వినతిపత్రాలు ఇచ్చే సందర్భంలోను కచ్చితంగా ప్రత్యేక హోదా ఒక పాయింట్ గా ఉంటోంది. చదవండి: సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయినా ఏపీలో ప్రతిపక్షం వైసీపీపై దాడి చేస్తుంటుంది. చిత్రంగా బీజేపీని ఒక్క మాట అనని టీడీపీ కూడా వైఎస్సార్సీపీనే తప్పుపడుతూ ప్రత్యేక హోదా సాధనలో విఫలం చెందిందని అంటుంది. విశేషం ఏమిటంటే అసలు ప్రత్యేక హోదాపై పలు రకాలుగా మాటలు మార్చింది తెలుగుదేశం పార్టీనే. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు బాధ్యతలను తమకు అప్పగించాక , ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. దానిపై ప్రజలు తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. దాంతో భయపడి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ తన మాట మార్చుకుని ప్రత్యేక హోదా పాట పాడసాగారు. కానీ వైఎస్సార్సీపీ మాత్రం ఒకే మాట మీద నిలబడుతోంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి పార్లమెంటులో ఘాటుగానే స్పీచ్ ఇచ్చారు. ఇక మూడు రాజధానుల విషయంలో న్యాయ వ్యవస్థను ఆయన ధైర్యంగా తప్పుపట్టారు. పలు రాష్ట్రాలలో రెండు రాజధానులు ఉన్న సంగతిని గుర్తు చేస్తూ, ఏపీకి ఎందుకు ఒప్పుకోరని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ తన పరిధి అధిగమించి తీర్పు ఇచ్చిందని ఆయన ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని స్పష్టంగా చెప్పినా, న్యాయ వ్యవస్థ భిన్నమైన తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ది కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీపై వివక్ష చూపుతున్నట్లుగా ఉందని కూడా విజయసాయి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాబోతున్న తరుణంలో వైఎస్సార్సీపీ తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిందని చెప్పవచ్చు. ఈ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తను ఈ రెండు విషయాలలో ఎక్కడా రాజీపడలేదని రుజువు చేసుకుందని అనుకోవచ్చు! -హితైషి -
‘ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్‌కు ఇష్టం లేదా?’
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర బాగుపడటం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదనే విషయం నిన్నటి సభ ద్వారా మరోసారి అర్ధమైందని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అసలు పవన్ మాటలకు చేతలకు పొంతనే లేదని ధర్మాన విమర్శించారు.ఈరోజు (శుక్రవారం) మాట్లాడిన ధర్మాన.. ‘ ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్‌కు ఇష్టం లేదా?, పవన్ మాటలకు చేతలకు పొంతన లేదు. ప్రజా నాయకులు హుందాగా ఉండాలి. పుస్తకాలు చదవడం కాదు.. అందులో ఉండే భావజాలాన్నిఅర్థం చేసుకోవాలి. అమరావతిలో రాజధాని అనేది రియల్టర్ల కోసమే. విశాఖ రాజధానితో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినష్టపోయాం. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదనే వికేంద్రీకరణ. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.కిడ్నీ బాధితుల కోసం పలాసలోనే ఆస్పత్రి ఏర్పాటు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాలు ఆత్మ గౌరవంగా ఉండేలా సీఎం జగన్ పాలన.’ అని మంత్రి ధర్మాన తెలిపారు. -
పవన్.. మూడు ముక్కలాటతో పోలికా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రణస్థలంలో యువశక్తి కార్యక్రమంలో ఆయనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తున్నాననుకుని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు. జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని వ్యంగ్యంగా అనబోయి బొక్కా బోర్లపడినట్లు అనిపిస్తుంది. ఆయన స్వోత్కర్ష ఎంత అయినా ఫర్వాలేదు. కానీ ప్రజల ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకుని మాట్లాడాలి. మూడు ముక్కలాటతో మూడు రాజధానులను పోల్చడం అంటే ఏమైనా తెలివైన చేష్ట అవుతుందా? ఒకప్పుడు పవన్ కళ్యాణే విశాఖ, కర్నూలలో పర్యటించినప్పుడు ఇవే తన మనసుకు రాజధానులు అని ప్రకటించారు. తద్వారా అక్కడి ప్రజల సెంటిమెంట్ ను మాట్లాడారని అంతా అనుకున్నారు. కానీ యువశక్తి ప్రోగ్రాంలో ఆయన విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయడాన్ని పరోక్షంగా వ్యతిరేకించారని అనుకోవాలి. ఆయన ఎక్కడా అమరావతి పేరు తీయలేదు. అంతవరకు భయపడి ఉండవచ్చు. నేరుగా అమరావతే రాజధానిగా ఉండాలని చెబితే మిగిలిన ప్రాంతంలో జనసేనకు నష్టం జరుగుతుందని భయపడి ఉండాలి. అలాకాకుండా మూడు ముక్కలాట అనడం ద్వారా ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్ ను గాయపర్చినట్లు అనిపిస్తుంది. విశాఖ రాజధాని అయితే ఒక ముక్క ఎలా అవుతుంది. రాష్ట్రంలో విభజన వాదం రాకుండా ఉండడానికి, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడానికి ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రతిపాదన తెచ్చారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తెలుగుదేశం , జనసేన అదినేతలు, మరికొన్ని రాజకీయ పక్షాలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. కారణాలు ఏమైనా ఆ విషయం చెప్పడం తప్పులేదు. కాని పవన్ కళ్యాణ్ తాను విశాఖను ఎందుకు కార్యనిర్వాహక రాజధానిగా వద్దంటున్నది చెప్పలేదు. అలాగే కర్నూలులో న్యాయ రాజధాని ఎందుకు అక్కర్లేదో చెప్పడం లేదు. ఆయన మిత్రపక్షంగా ప్రస్తుతానికి ఉన్న బిజెపి కాని, వామపక్షాలు కాని కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.తెలుగుదేశం, జనసేనలు మాత్రమే అన్నీ ఒకే చోట ఉండాలని భావిస్తున్నాయి. ఆ విషయాన్ని ఆయన కచ్చితంగా చెప్పలేదు. ఈ విషయాన్ని పక్కనపెడితే పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడిన తీరు, అరే, ఒరే,తురే అంటూ మాట్లాడిన పద్దతి ఒక పార్టీ అధినేతగా ఏ మాత్రం తగదని చెప్పకతప్పదు. గత ఏభై ఏళ్లలో పార్టీ అధినేతలు ఎవరూ ఇలా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు కొన్నిసార్లుదూషణలకు దిగుతున్నా, అరే,ఓరే వరకు వెళ్లలేదు. వైసీపీలో కొందరు నేతలు బూతులు మాట్లాడుతున్నారని అంటున్న పవన్ కళ్యాణ్ వారిని మించి బూతులు మాట్లాడడం దారుణంగా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీనేతలు ఎవరూ బూతులు మాట్లాడినట్లు అనిపించదు. టీడీపీ , వైసీపీమధ్య అలాంటి వివాదాలు ఉండవచ్చు కాని జనసేన పక్షాన ఎందుకు ఆయన ఇలా మాట్లాడారో అర్ధం కాదు. ఏదో చిన్న స్థాయి నేతలు ఇలా ఉపన్యసించారంటే వారిని తప్పుపట్టి సరిచేయవచ్చు. కాని ఏకంగా పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం ఏ మాత్రం పద్దతి కాదని చెప్పక తప్పదు. ఇదే సందర్భంలో ఆయన చెప్పుతో కొడతానని మరోసారి అంటున్నారు. బహుశా ఈ మాటలు అంటే అక్కడకు వచ్చిన యువకులు ఉత్సాహపడతారని అనుకున్నారేమో!లేక ఆ ఊపులో వైసిపివారిని లేదా తమకు నచ్చని ఇతరులను ఇలా చెప్పుతో కొట్టాలని ఆయన భావవేమో తెలియదు. ఇంతా చేస్తే ఆయనకు తన సభకు వచ్చిన జనం మీద నమ్మకం లేదని అంటున్నారు. తన సభకు జనం వచ్చినా ఓట్లు వేయడం లేదని ఆయనే ఒప్పుకుంటున్నారు. ఎందుకు ఓట్లు పడడం లేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలికాని ప్రజలను నిందిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది?తాను ఈ పదేళ్లలో ఎన్నిసార్లు మాటలు మార్చింది.. ఉదాహరణకు కాపు అన్న అంశంపై ఎన్నిరకాలుగా మాట్లాడింది ఆయన వీడియోలు వేసుకుని చూస్తే తెలుస్తుంది. ఒకటని కాదు.. అనేక అంశాలలో ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తన ఎజెండా ఏమిటో చెప్పకుండా జనరల్‌గా మాట్లాడి రోడ్లు వేస్తా, వలసలు ఆపుతా, జెట్టిలు కడతా.. ఫలానా కేసులో నిందితులకు శిక్ష వేయిస్తా.. ఇలాంటి హామీలతో జనం నమ్ముతారా? అసలు వలసలకు ఎవరు కారణం. 1953 నుంచి ఇంతవరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ,టీడీపీలే కదా? ఈ మూడేళ్లలోనే కదా వైసీపీఅదికారంలోఉన్నది?వారిని తప్పుపడితే పోనే ఒకే అనుకుందాం. కానీ అసలు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయంలో ఏమి బాధ్యత లేదా? ఆయన పాలనలో వలసలు ఆగిపోయాయని చెప్పదలించారా?నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలు వారి, వారి అవసరాల రీత్యా వలస వెళుతుంటారు. అది జీవన ప్రక్రియలో ఒక భాగం. ఆ మాటకు వస్తే గుంటూరు జిల్లాలో పుట్టిన పవన్ కళ్యాణ్ తదుపరి ఎన్ని జిల్లాలకు వెళ్లారు. చివరికి హైదరాబాద్ కు వలస వెళ్లి ఎందుకు స్థిరపడ్డారు? ఆయన పుట్టిన ఊరులోనో, లేక తండ్రి ఉద్యోగం చేసిన ఊరులోనో, రిటైరైన ఊరులోనే స్థిరపడి ఉంటే పవన్ కు ఈ అవకాశాలు వచ్చేవా? కాకపోతే ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు పెంపిందించాలని అనడం తప్పుకాదు.అలాకాకుండా జగన్ పై ద్వేషభావంతో పవన్ మాట్లాడడం వల్ల ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌కే కాదు.. తమకు కూడా చెప్పులు ఉన్నాయని ఆయన చూపించారు. రాజకీయ వ్యభిచారం తదితర అంశాలపై కూడా పవన్‌ను విమర్శించారు. జనసేన నేతలు వాటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబుతో పొత్తు ఉంటుందని చెప్పడానికి, ఏభై నాలుగు సీట్లు అడుగుతున్నామని సంకేతం ఇవ్వడానికి పవన్ ఈ సభ పెట్టినట్లుగా ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నట్లు చెప్పలేకపోవడం ఆయన బలహీనత. గౌరవప్రదంగా పొత్తు ఉండాలని అన్నారు కానీ ఏది గౌరవమో చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి పదవిలో వాటా ఇవ్వకపోయినా గౌరవప్రదమే అని అనుకుంటున్నారా? లేక ఏభై నాలుగు సీట్లలో ఎన్నిసీట్లు ఇస్తే గౌరవం అని ఆయన చెప్పదలిచారు. ఇలాంటివాటిపై భవిష్యత్తులో ఏమైనా స్పష్టత ఇస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా పవన్ సభ లో విషయం కన్నా విసిగింపే ఎక్కువగా ఉందేమో!ఎందుకంటే ఆయన ఏ విషయంలోను క్లారిటీ ఇవ్వలేకపోవడమే కారణం. -
రేపు కర్నూలు లో రాయలసీమ గర్జన సభ
-
బిగ్ క్వశ్చన్ : సుప్రీం తీర్పుపై ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్
-
మూడు రాజధానులకు మద్దతుగా నెల్లూరులో విద్యార్థుల భారీ ర్యాలీ
-
Anantapur: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష
సాక్షి, అనంతపురం జిల్లా: ఏపీలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అనంతపురం జిల్లాకు చెందిన మేధావులు, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం నగరంలోని కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వికేంద్రీకరణ చేస్తానని ముందుకు వస్తే.. దాన్ని అడ్డుకుని స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోవడం క్షమించరాని నేరం అన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని అనంతపురం మేధావులు స్పష్టం చేశారు. అధికార అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు అడుగడుగునా అడ్డుపడటం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయటం దుర్మార్గం అని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దీక్ష జరగడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణకు బాటలు వేసిన సీఎం జగన్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేత కేవీ రమణ. కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: జగనన్న మేలును ఎన్నటికీ మరువలేం -
ఉత్తమాంధ్రగా నిలుపుతామంటే...
ఉత్తరాంధ్ర అన్ని రంగాలలోనూ వెనకబడి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రభుత్వరంగ సంస్థలు, రోడ్డు, రైలు, విమాన, నౌకా రవాణా వ్యవస్థలతో అనుసంధానమైన ప్రాంతం అయినప్పటికీ వెనుకబాటుతనం మాత్రం జనాన్ని వీడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు, పరిశ్రమలకు స్థానం కల్పించిన నేల ఇది. వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార రంగాలకు ఆయువు పట్టుగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతున్న ప్రాంతం. సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లిన విజయనగరం, పోరాటాల నేల శ్రీకాకుళం, ఆదివాసీ మన్యం తన సిగలో పెట్టుకున్న విశాఖ... ఈ మూడు జిల్లాల సమాహారమే ఉత్తరాంధ్ర ప్రాంతం. 2019లో ముఖ్యమ్రంతి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో దార్శనికతతో విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించారు. ఇది మూడు ప్రాంతాల అభివృద్ధికీ ఉప యుక్తంగా నిలుస్తున్న అంశం. రాష్ట్ర సమగ్ర వికాసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి నినాదంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం కొద్దిమంది వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు. అమరావతి నుంచి అరస వల్లి వరకు రైతుల పాదయాత్ర పేరుతో పెట్టుబడిదారులు ఉత్తరాంధ్రపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటి చర్య. ఒకవైపు పెట్టుబడి దారులను ప్రోత్సహిస్తూ, యాత్రను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి ఎల్లో పత్రికలూ, ఛానళ్లూ అదే సమయంలో ఉత్తరాంధ్రపై విషపు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తన పత్రికా ప్రయాణాన్ని ప్రారంభించి నేడు అతిపెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించిన ‘ఈనాడు’ రాతలు మహారోత పుట్టిస్తున్నాయి. కేవలం కొందరి కరపత్రంగా ఇది మారిపోయి ఇష్టారాజ్యంగా వారికి నచ్చినట్లు వండి వడ్డిస్తూ ఉత్రరాంధ్రపై విషం కక్కుతున్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పత్రికలు, సమాచార మాధ్యమాలే అప్రజాస్వామిక విధానాలను అవలంబించడం బహుశోచనీయం. ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు, మనో భావాలు, అభివృద్ధి, వికాసం వంటివి ఈ పచ్చపత్రికలు, టీవీ చానళ్లకు, వాటిని నడిపిస్తున్న వారికి పట్టవు. కొందరికి దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రజల ఓట్లు, తద్వారా పదవులు పొందడానికి విశాఖ నగరం కావాలి. ఈ ప్రాంతం, ప్రజలు అభివృద్ధి చెందుతామంటే మాత్రం వీరు ఓర్వలేక పోతున్నారు. నేడు సాంకేతిక విప్లవం పుణ్యాన వీళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు రాష్ట్రంలో ప్రజలంతా చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడే ప్రతీ వ్యక్తినీ, వ్యవస్థనూ ఉత్తరాంధ్ర ప్రజలు ఊరికే వదలరు. ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం ఆరంభం అయితే దానిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. పోరాటాల పురిటిగడ్డ శ్రీకాకుళం నుంచి ఉద్యమ స్ఫూర్తినీ, విజయనగరం నుంచి సాంస్కృతిక వారసత్వాన్నీ, విశాఖ నుంచి విజయగీతికనూ అందుకుని ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపి ‘ఉత్తమ ఆంధ్ర’గా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలంతా వెన్నంటి నిలుస్తారు. కేవలం 29 గ్రామాల ప్రజల కోసం 26 జిల్లాలతో కూడిన రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టాలంటే ప్రజలు సహించరు. పరిపాలనా రాజధానిగా విశాఖ కాకుండా అడ్డుకునే ప్రతీ వ్యవస్థకూ, పార్టీకీ ఎదురొడ్డి నిలుస్తూ... అసాంఘిక శక్తులను, విద్వేషాలు రగిలించే వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలిస్తారు ప్రజలు. రాష్ట్ర సమగ్ర వికాసం లక్ష్యంగా, అభివృద్ధి మంత్రంగా... ప్రజలంతా ముందడుగు వేస్తారు. తూర్పు తీరం నవ చరిత్రకు నాందీ వాచకంగా నిలుస్తుంది! - డాక్టర్ టి. షారోన్ రాజు విభాగాధిపతి, విద్యావిభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం -
రాజధానిని వదులుకుంటే చరిత్ర క్షమించదు..
టెక్కలి: విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని వక్తలు నొక్కి వక్కాణించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొని విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు కావాల్సిందేనంటూ తీర్మానించారు. ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాశయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో రాజధానికి శ్రీకారం చుట్టారని, దీనికి మనమంతా మద్దతు తెలపాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలో విశాఖను పరిపాలన రాజధానిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి చెప్పారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే భావితరాలు మనల్ని క్షమించవని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖలో రాజధాని కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎవరు అడ్డుపడినా ఊరుకోం.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ పాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అడ్డుపడినా తొక్కుకుంటూ రాజధానిని ఏర్పాటు చేసుకుంటాం. – ప్రొఫెసర్ గుంట తులసీరావు, శ్రీకాకుళం నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్. మద్దతిద్దాం.. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి. – పేడాడ పరమేశ్వరరావు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నేత ఉత్తరాంధ్ర నుంచి వలస నివారణ విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును ఉద్యోగ సంఘాల తరఫున పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలను నివారించవచ్చు. విశాఖలో రాజధాని వలన కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో చర్చా వేదికలు నిర్వహించాలి. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నేత ఇప్పుడు వదిలేస్తే.. చరిత్ర క్షమించదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉత్తరాంధ్రపై అభిమానంతో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓ సువర్ణావకాశం. ఇలాంటి అవకాశాన్ని విడిచి పెడితే చరిత్ర మనల్ని క్షమించదు. విశాఖ రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు. భావి తరాల భవిత కోసం.. విశాఖలో రాజధాని వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యపరచాలి. రాజధాని ఏర్పాటుతో భావి తరాల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. విశాఖలో రాజధాని సాధన కోసం టెక్కలి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాలి. – దానేటి శ్రీధర్, వైద్యుడు, జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్. -
మూడు రాజధానుల కోసం గళమెత్తిన విద్యార్థి లోకం
ఒంగోలు సబర్బన్: మూడు రాజధానుల కోసం విద్యార్థి లోకం గళమెత్తింది. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఒంగోలు నగరం మార్మోగింది. శనివారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముంగమూరు రోడ్డు జంక్షన్ నుంచి లాయర్ పేట షిర్డీ సాయిబాబా గుడి వరకు సాగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ జరిగిన నాడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీతో పాటు దాని తోక పార్టీలు అమరావతే రాజధాని కావాలని పట్టుబట్టడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలే కారణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవశ్యమని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో మోసపోయింది చాలదన్నట్లు అమరావతి ఒక్కదానినే రాజధానిని చేయాలని టీడీపీ పట్టుబట్టడం వెనుక ఆంతర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయం నిర్మిస్తే వర్షం వస్తే వర్షపు నీరు కారి బకెట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాల్సింది పోయి ఏ ప్రాంతం ఏమైపోతే మాకేమి.. అమరావతి ఒక్కటే బాగుపడితే చాలు అన్న చందంగా చంద్రబాబు ఉండటాన్ని మిగతా ప్రాంతాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రేల్లా అమర్నాథరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాదు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దాట్ల యశ్వంత్, విద్యార్థి విభాగం నాయకులు కొండూరు నవీన్, కృష్ణారెడ్డి, పురిణి శ్రీనివాసులురెడ్డి, నరశింహ, శ్రీకాంత్‌రెడ్డి, చంద్ర, హరీష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
AP: మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే..
మహా నగరాలు ఒకే రోజులోనో, స్వల్ప సమయంలోనో నిర్మింప బడవు. కాలక్రమంలో చారిత్రక, సామాజిక, సాంఘిక, మానవ వన రుల అవసరాలను బట్టి గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మహా నగరాలుగా అభివృద్ధి చెందుతాయి. అందుకే ‘రోమ్ వజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే’ (రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మితమవ్వలేదు) అనే నానుడి పుట్టింది. హైదరాబాద్, చెన్నయ్, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ లాంటి మహానగరాలు కూడా ఒక సంవత్స రంలోనో, స్వల్పకాలంలోనో మహానగరాలుగా ఎదిగినవి కావు. ఇది చరిత్ర. చారిత్రక దృష్టిలేనివారు; చరిత్రనుండి పాఠాలు, గుణపాఠాలు నేర్వలేనివారు... వేల కొద్ది ఎకరాల పంట భూములను సేకరించి అక్కడ రాజధాని భవనాలు నిర్మించి అత్యల్ప కాలంలోనే సింగపూర్ లాంటి నగరాలను తీసుకు వస్తామని చెబుతారు. ‘చరిత్ర తెలి యనివారు చరిత్రను సృష్టించలేరు’. అక్కడేమీ లేకున్నా రాజధాని పేరు మీద కొన్ని భవనాలు నిర్మించినంత మాత్రాన అది సింగపూర్ అవుతుందని భావించడం సరైందికాదు. ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పట్టణాలను వదిలి... ఛండీగర్ను కొత్త రాజధానిగా నిర్మించి రెండు రాష్ట్రాలకు రాజధానిని చేయడం వల్ల జరిగిందేంటి? అది నాలుగు దశాబ్దాలు గడిచినా మహానగరం కాలేదు. పట్టణంగా మాత్రమే ఉండి పోయిందన్న సంగతి మరువరాదు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంతరాలతో మూడు ప్రాంతాల సమాహారంగా ఉంది. ఇది సహజం. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లోని అసమానతలను, అంతరాలను వీలైనంతవరకు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ‘మూడు రాజధాను’లను ప్రతిపాదించింది జగన్ ప్రభుత్వం. మొత్తం బడ్జెట్ అమరావతికే ఉపయోగిస్తే రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, వ్యవసాయాభివృద్ధి, సంక్షేమ పథకాల మాటేంటి? మంచి పాలకునికి చరిత్ర తెలిసిన పాలకునికి ప్రజలు ముఖ్యం కదా! అమరావతిలో అసెంబ్లీ ఉంచి, విశాఖపట్టణంలో సచివాలయం నిర్మించి పరిపాలనా రాజధానిని చేయడం వల్ల వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న విశాఖ పట్ట ణాన్ని రాజధాని చేస్తే అత్యంత తక్కువ సమయంలో మరింత గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలా ఇక్కడ వేలకోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటుతనాన్ని రూపు మాపి సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గించడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. అమరావతిలో అసెంబ్లీ భవనాలు, శాసన రాజధాని ఉంటుంది. కాబట్టి ఇది కూడా నగరంగా అభివృద్ధి చెందుతుంది. మరో దిక్కున కర్నూలులో హైకోర్టు వల్ల అదో మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది. 3 ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఐటీ విస్తరణ, ఉద్యోగ కల్పన, సేద్యం వంటి వాటిపై దృష్టి పెట్టి సామాజిక న్యాయం బాగా జరిగేలా చూస్తే అంతకంటే మించిన సుపరిపాలనేముంది? ఆ దిశగా శర వేగంతో అడుగులేస్తున్నాడు జగన్. దీంతో భవిష్యత్తులో వేర్పాటు వాదాలు వచ్చే అవకాశం ఉండదు. ప్రజల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా సోదర భావం నెలకొంటుంది. అప్పుడే శాంతి భద్రతలు వెల్లివిరుస్తాయి. ఫలితంగా పెట్టుబడులు దేశ, విదేశాల నుంచి ఏపీకి ప్రవహిస్తాయి. అందువల్ల రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులను వ్యతిరేకించడం ఆపి రాజ ధాని నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి సహకరిస్తే శూన్యంగా మిగిలిన తెలుగు దేశానికి ఇసుమంతైనా ప్రజామోదం లభిస్తుంది. అలా కాదంటారా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. సకల జనుల వృద్ధిని ఆశించే ప్రస్తుత సీఎం జనం హృదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. (క్లిక్ చేయండి: రాజధాని పట్ల మరింత స్పష్టత) - కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీ వేత్త -
KSR కామెంట్ : రాజధానిపై కృత నిశ్చయం
-
‘అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. భావితరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం నడుస్తోందని ఆయన అన్నారు. ‘అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు. నిపుణులు ఎంత చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోలేద’ని తమ్మినేని మండిపడ్డారు. జిల్లా ఆముదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని జేఏసీ ప్రతినిధులు అన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎనలేని పురోగతి ఉంటుందన్నారు. విశాఖను రాజధాని చేస్తే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
మూడు రాజధానులకే మా మద్దతు
తిరుపతి తుడా: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మునిసిపల్ కార్యాలయంలో మేయర్ శిరీష అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించారు. తీర్మానాన్ని నగర మేయర్ డాక్టర్ ఆర్.శిరీష బలపరచగా.. డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. సభ్యుల్లో ఒక్కరు కూడా రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించకపోవడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మేయర్ శిరీష ప్రకటించారు. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ఆమె చెప్పారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధాని చేస్తామని చెప్పి నమ్మించారన్నారు. ఆపై తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తూ ఉమ్మడి ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ విడిపోతే కర్నూలుకు రావాల్సిన రాజధానిని కుట్రపూరితంగా, దురుద్దేశంతో అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమకు రావాల్సిన నీటి ప్రాజెక్టులను సైతం అడ్డుకున్న నీచుడు చంద్రబాబని దుయ్యబట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటే.. అందుకు విరుద్ధంగా చంద్రబాబు 29 గ్రామాలకే న్యాయం జరగాలని పట్టుబట్టడం సిగ్గుచేటన్నారు. రాజధాని, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మూడు రాజధానులతోనే సాధ్యమవుతాయని చెప్పారు. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకూడదన్న ముందు చూపుతోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అయితే చంద్రబాబు అండ్ కో వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు సీమవాసులంతా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఇటీవల రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన విజయవంతం చేసిన భూమన కరుణాకరరెడ్డికి మునిసిపల్ కౌన్సిల్ అభినందనలు తెలిపింది. -
రాజధాని పట్ల మరింత స్పష్టత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుందని ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలన్న ఆయన కృత నిశ్చ యాన్ని మరోసారి తెలియజేస్తోంది. గత టరమ్‌లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు పదేళ్లపాటు ఉమ్మడి రాజ ధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదలి సడన్‌గా విజయవాడకు వచ్చి కూర్చున్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో చంద్రబాబు పట్టు బడిన సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ షరతు మేరకు ఆయన హైదరాబాద్‌ను రాత్రికి రాత్రే వదలిపెట్టారు. దీంతో హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన వందల కోట్లు వృధా అయ్యాయి. అప్పుడు చంద్రబాబు కూర్చున్న ప్రదేశమే రాజధాని అయినప్పుడు, ఇప్పుడు జగన్ చెబుతున్నట్లుగా ఆయన విశాఖవెళ్లి కూర్చుంటే అదే రాజధాని అనుకోవచ్చు కదా. జగన్ మూడు రాజధానుల విధానం ప్రకటించినప్పటి నుంచి ఆయన ప్రతిపాదన ముందుకు వెళ్లకుండా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుపుల్లలు వేస్తోంది. దానికి మరికొన్ని ఇతర రాజకీయ పక్షాలు కూడా వంతపాడుతున్నాయి. అయిన ప్పటికీ జగన్ మాత్రం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయా లన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకు ఆయన చూపుతున్న కారణాలు కూడా ఆలోచించదగినవే. విశాఖలో అయితే లక్షల కోట్ల వ్యయం చేయకుండానే రాజధాని భవన సముదాయాలను నిర్మించుకోవచ్చన్నది ఒక భావన. ఇది వాస్తవమే. ఆనాటి సీఎం చంద్రబాబు ‘అమరావతి’ పేరుతో 33 వేల ఎకరాల భూమిని సమీకరించడం, దానిని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉండడం, తొలి దశలోనే ప్రాథమిక సదు పాయాలకే 1,08,000 కోట్ల రూపాయలు అవసరమని, కనుక నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. కేంద్రం ఆ లేఖను పక్కన పెట్టేసింది. తాను ఇవ్వదలిచిన 1,500 కోట్లను ఇచ్చి చేతులు దులుపుకుంది. దాంతో మొత్తం వ్యయభారం అంతా ఏపీ ప్రభుత్వంపైన పడుతుంది. మరి ఒక్క ప్రదేశంలో అంత మొత్తం ఎప్పటికి వ్యయం చేయాలి. అసలు చంద్రబాబు రైతుల నుంచి అన్నివేల ఎకరాలు సేకరించి, వారికి కోట్ల రూపాయల లాభం వస్తుందని ఆశ చూపించడం ఎంత వరకు సమంజసం? ఇన్ సైడ్ ట్రేడింగ్, అస్సైన్డ్ భూముల కుంభ కోణాల గురించి చెప్పనవసరం లేదు. ప్రజలందరికీ అక్కడ జరిగిన భాగోతం తెలుసు. టీడీపీ నేతలు, ఒక వర్గానికి చెందినవారు అత్యధికంగా వేల ఎకరాల భూమి కొన్న తీరు వెలుగులోకి వచ్చాక అంతా విస్తుపోవడం జరిగింది. తాజా వార్తల ప్రకారం సుమారు వెయ్యి ఎకరాల అస్సైన్డ్ భూములను పేద దళితుల నుంచి బలవంతులైన రాజకీయ నేతలు, దళారులు లాక్కుని, అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేయించు కున్నారో కథలు, కథలుగా చెబుతున్నారు. ఇక్కడ మరో సంగతి ఏమిటంటే అమరావతిగా గుర్తించిన గ్రామాలలో గజం ఇరవై వేల నుంచి ముప్పైవేల వరకు ధర పలికినా, ప్రభుత్వం మాత్రం గజం ధర ఐదువేల లోపే ఉంచింది. అంటే మిగిలినదంతా బ్లాక్ మనీగానే లావాదేవీలు సాగాయన్నమాట. ఇక అవుటర్ రింగ్ రోడ్డు మాయాజాలం మరో కథ. పలుకుబడి కలిగిన ఆసాములు తమ భూములు రాజధాని భూ సమీకరణలో పోకుండా జాగ్రత్తపడ్డారని ఆరోపణలు వచ్చాయి. అందులో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ, చంద్రబాబు మకాం చేసిన కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్‌కు చెందిన భూములు కూడా ఉన్నాయని ప్రభుత్వం ఆధార సహితంగా వెల్లడించింది. ఇన్ని తంతులు ఇక్కడ జరిగితే ఎక్కడా వార్తలు ఇవ్వని ఈనాడు, తదితర టీడీపీ మద్దతు మీడియా సంస్థలు విశాఖలో కబ్జాలు జరుగు తున్నాయనీ, మరొకటనీ విషం కక్కుతున్నాయి. కబ్జాల వంటి నేరాలు అన్ని పట్టణాలలో జరుగుతూనే ఉంటాయి. వాటిని ప్రభుత్వాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాయి. గతంలో టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై ఆనాటి ప్రభుత్వమే సిట్ నియమించింది. మరి అప్పుడు కబ్జాలు జరిగినా ఫర్వాలేదని ఈనాడు మీడియా భావించిందా? హైదరా బాద్‌లో నిత్యం కబ్జా వార్తలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన హైదరాబాద్ రాజధాని నగరంగా పనికి రాదని ఎన్నడైనా ఈనాడు రాసిందా? మరి విశాఖ విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికి ఒకే కారణం కనిపి స్తుంది. అమరావతిలో టీడీపీకి, ఈనాడు వంటి మీడియా సంస్థలకు వ్యాపార ప్రయోజనాలు ముడిపడి ఉండడం కావచ్చు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అయితే రాజకీయంగా టీడీపీకి నష్టం కలుగుతుందన్న భావన కావచ్చు. విశాఖ రాజధాని అయితే దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది. సముద్ర తీర ప్రాంత నగరాలలో ఒక ముఖ్యమైన నగరంగా ఉన్న విశాఖకు ప్రపంచ స్థాయిలో పోటీ పడే అవకాశం వస్తుంది. పోనీ అమరావతే తక్కువ వ్యయంతో సకాలంలో అభివృద్ధి చెందే అవకాశం ఉందా అంటే అది జరిగే పని కాదని అర్థం అవుతుంది. అందువల్లే అప్పట్లో చంద్రబాబు తాత్కాలిక భవనాల నిర్మాణం పేరుతో కథ నడిపారు. ఆయన నవ నగరాలని చెబుతూ అన్నిటినీ అమరావతిలోనే నిర్మిస్తామని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేశారు. తాము కట్టే పన్నుల డబ్బు అంతా ఒక ప్రాంతంలో, అదీ ఒక వర్గం ఎక్కువగా ఉన్న చోట వారికి లబ్ధి చేకూరేలా చంద్రబాబు అమరావతి నిర్మాణం చేస్తున్నారని వివిధ ప్రాంతాల ప్రజలు భావించి టీడీపీని ఘోరంగా ఓడించారు. పోనీ అమరావతిగా చెప్పిన ప్రాంతంలో అయినా గెలిచారా అంటే అదీ జరగలేదు. కేవలం ఒక వర్గం కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారనీ, మిగిలిన సామాజిక వర్గాలు అనుమానించి టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి. ఈ విషయాలను గమనించకుండా చంద్రబాబు తన ఓటమి తర్వాత కూడా మళ్లీ అమరా వతి పాట అందుకున్నారు. రైతుల పేరుతో కొందరిని ఆందోళనకు పురికొల్పారు. పాద యాత్రల ప్రహసనం సృష్టించారు. అమరావతి నుంచి అరసవెల్లి పాద యాత్రలో కొందరు రైతులు, మహిళలు, టీడీపీ నేతలు తొడలు చరచడం, చెప్పులు చూపడం వంటివి చేసి ఉత్తరాంధ్ర ప్రజలలో సెంటిమెంట్ రగలడానికి కారకులయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సంబంధం లేకుండా వారి ఇష్టం వచ్చినట్లు యాత్రలు సాగించి రాజకీయ డ్రామాలు సృష్టించబోయి బొక్క బోర్లాపడి, చివరికి రామచంద్రాపురం నుంచి సర్దుకుని వెనుదిరి గారు. మళ్లీ పాదయాత్ర చేస్తారా? లేదా అన్నది వేరే విషయం. కానీ ఈలోగా విశాఖపట్టణంలోనూ, ఉత్తరాంధ్ర అంతటా విశాఖ రాజధాని కావాలన్న నినాదం ఊపు అందు కుంది. విశాఖతోపాటూ, వివిధ పట్టణాలలో దీనికి సంబం ధించిన సదస్సులు, ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి. అలాగే రాయల సీమలో కూడా ఇదే తరహా ఉద్యమాలు వచ్చాయి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీనే దీనికి నిద ర్శనం అని చెప్పాలి. కర్నూలు తదితర పట్టణాలలో కూడా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమకు ఇవ్వాలన్న డిమాండ్‌కు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది. నిజానికి విశాఖ రాజధాని అయితే మొత్తం రాష్ట్రానికి ప్రయోజనం. తాజాగా అక్కడ ప్రధాని మోదీ పలు భారీ కార్య క్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఐటీ పరిశ్రమ కూడా అక్కడ పెరగడానికి ఆస్కారం ఉంది. రాజధాని విషయంలో చంద్ర బాబు చేసిన తప్పును సరిచేయడానికి జగన్ సంకల్పించారు. అమరావతిని సైతం అభివృద్ధి చేస్తామని ఆయన చెబుతున్నారు. తమ ప్రతిపాదన మూడు ప్రాంతాల సమతుల అభివృద్ధికి ఉప యోగపడుతుందని ఆయన వివరిస్తున్నారు. కాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఒక చిత్రమైన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి శాసనం చేసే హక్కులేదనీ, ఆరు నెలల్లో రాజధాని నిర్మించాలనీ హైకోర్టు వ్యాఖ్యా నించడంపై వివిధ వర్గాలలో వ్యతిరేకత వచ్చింది. ఏపీ శాసన సభ సైతం ఈ తీర్పును వ్యతిరేకిస్తూ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తాను వెళ్లి విశాఖలో కూర్చుంటాననీ, తానెక్కడ ఉంటే మంత్రులూ, ప్రభుత్వ కార్యదర్శులూ అక్కడే ఉంటారనీ, అప్పుడు అదే రాజధాని అవుతుందని అంటున్నారు. ఏదో రకంగా ఈ సమస్యకు సత్వర పరిష్కారం వస్తే మంచిదని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ.. పిటిషన్లో కీలక అంశాలివే..
న్యూఢిల్లీ: అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక అంశాలివే.. ►రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదు ►రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. ►శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం ►తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం ►రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది ►ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు ►రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు ►రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి ►2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి ►అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం ►రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది ►రైతుల తో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు ►వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు ►రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం ►అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది , ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది -
విశాఖ రాజధాని కోసం విద్యార్థుల గర్జన
చోడవరం: వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ రాజధాని ఎంత అవసరమో విద్యార్థి భేరి ఎలుగెత్తి చాటిందని, మూడు రాజధానులు ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం ఆగదని ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.లజపతిరాయ్ స్పష్టంచేశారు. వలస బతుకుల కష్టాల నుంచి విముక్తి కలగాలన్నా, విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభించాలన్నా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం జరిగిన ‘విద్యార్థి భేరి’ రాజధాని నినాదాలతో హోరెత్తింది. వేలాదిమంది విద్యార్థులు తరలిరావడంతో పట్టణంలో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. స్థానిక శివాలయం జంక్షన్ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు సుమారు కిలోమీటరున్నర మేర భారీ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, డాక్టర్లు ర్యాలీని ముందుండి నడిపించారు. ర్యాలీ అనంతరం కాలేజీ గ్రౌండ్ వద్ద జరిగిన సభకు చోడవరం జేఏసీ కన్వీనర్ కాండ్రేగుల డేవిడ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, మరింత ఉధృతం చేస్తామన్నారు. మూడు రాజధానుల కోసం ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉద్యమాలు ఉధృతమయ్యాయన్నారు. అడ్డుకునే వారి ఆటలు సాగవు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కొన్ని శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. విద్యార్థులు మూడు రాజధానులకు తమ మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ఊరే లేనిచోట పూర్తిస్థాయి రాజధాని నిర్మించడం ఎంత కష్టమో అందరికీ తెలుసునని, మూడుచోట్ల రాజధానులు ఏర్పాటుచేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి గానీ ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం కొన్ని పార్టీలకు అవసరంలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో సాధించుకోలేకపోతే విశాఖ రాజ ధాని ఎప్పటికీ కాదన్నారు. విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ అండ్ పెట్రోలియం కారిడార్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మి, వైఎస్సార్సీపీ నేత చొక్కాకుల వెంకట్రావు, ఉత్తరాంధ్ర జేఏసీ వైస్ కన్వీనర్ దేముడు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. -
మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న మహోన్నత ఆశయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనారాజు పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా విజయవాడలో సోమవారం మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా ముగిసింది. యోనారాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు దీక్షలు తలపెట్టామని, ఏలూరు జిల్లాలో పూర్తిచేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. -
ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి వర్గం ఉన్నచోటే సచివాలయం కూడా ఉంటుందన్నారు. చదవండి: డిజిటల్ వైద్యంలో ఏపీనే ఫ్రంట్ రన్నర్ సహజ మౌలిక సదుపాయాలున్న ఏకైక పెద్ద నగరం విశాఖ. ఆర్థిక అనుకూలత, పాలన సౌలభ్యం కోసమే రాజధానిగా విశాఖ ఎంపిక చేశామని సీఎం చెప్పారు. రూ.5 నుంచి 10వేల కోట్లతో విశాఖ పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. వికేంద్రీకరణ స్ఫూర్తితో విశాఖను ఎంచుకున్నామన్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటాయని సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమరావతి.. విజయవాడలో గానీ, గుంటూరులో గానీ లేదన్నారు. అమరావతి అనేది ఆచరణ సాధ్యం కాని రాజధాని అని, 2 పట్టణాలకు 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. -
‘సీమ’ గుండె చప్పుడిది
వికేంద్రీకరణకు మద్దతు దిశగా యావత్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తోంది. మొన్న విశాఖ దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తే, ఇప్పుడు తిరుపతి జనసంద్రంగా మారి కదంతొక్కింది. రాయలసీమ గుండె చప్పుడు ప్రతిధ్వనించింది. పదులు.. వందలు కాదు.. వేలాది మంది ఆధ్యాత్మిక నగరిలో మూడు రాజధానులకు మద్దతుగా పెద్ద పెట్టున నినదించారు. మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు.. ఇలా ఒక్కరేంటి, అన్ని వర్గాల వారు రోడ్డుపైకి వచ్చి తమ ఆకాంక్షను బలంగా చాటారు. ‘సీఎం జగనన్న వికేంద్రీకరణ బాటలో నడుద్దాం.. న్యాయ రాజధాని సాధిద్దాం.. మన ఆత్మగౌరవం కాపాడుకుందాం.. స్వార్థ రాజకీయాలకు చరమగీతం పాడుదాం..’ అంటూ ప్రతినబూనారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఇటు రాయలసీమకు, అటు ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలి. అది ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు. రాయలసీమను రతనాల సీమగా మార్చే సత్తా సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే ఉంది. మనం కొంత కాలంగా పోగొట్టుకున్న దానిలో కొంతైనా తిరిగి ఇవ్వాలని కోరడం కోసమే ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన. ఇది రాయలసీమ గుండె చప్పుడు’ అని వికేంద్రీకరణను కాంక్షిస్తూ వేలాది మంది ప్రజలు నినదించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులకు మద్దతుగా.. రాయలసీమ హక్కులు, కర్నూలులో న్యాయ రాజధాని సాధనే లక్ష్యంగా సాగిన ఈ మహా ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన గాంధీ రోడ్డు మీదుగా నాలుగు కాళ్ల మండపం, తిలక్ రోడ్డు, తిరుపతి మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. తిరుపతి నగరంలోని ప్రతి గడప నుంచి ప్రజలు తరలి వచ్చారు. స్థానికులు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ కళాశాలల విద్యార్థులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల రాకతో నగరం జనసంద్రంగా మారింది. ప్ల కార్డులు చేతబట్టి.. ‘కర్నూలును న్యాయ రాజధాని చేయాలి’ అని కొందరు, జై జగన్ అంటూ మరి కొందరు.. పదండి ముందుకు మూడు రాజధానుల కోసం’ అంటూ ఇంకొందరు నినదిస్తూ ముందుకు సాగారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. దారి పొడవునా ప్రజలు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గాందీరోడ్డులో సాగుతున్న రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన తిరుపతి వేదికగా సీమ రాజధానికి విత్తనం తిరుపతి వేదికగా రాయలసీమ రాజధానికి విత్తనం నాటాం. మిగిలిన జిల్లాల వారూ నీరు పోస్తారు. తద్వారా రాజధాని మొక్క మహావృక్షమై కల సాకరమవుతుంది. సీఎం వైఎస్ జగన్ పాలన పట్ల, నిర్ణయం పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనేందుకు ఈ మహా ప్రదర్శనే నిదర్శనం. తిరుపతి చరిత్రలో మునుపెన్నడూ రానంతగా జనం ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడం సీఎం జగన్‌కే సాధ్యం అని సీమ ప్రజలు నమ్ముతున్నారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాష్ట్రానికి, రాయలసీమకు చేసింది శూన్యం. సీమ గడ్డమీద పుట్టిన చంద్రబాబు సీమకే ద్రోహం చేశారు. ఈ రోజు సీమ ప్రజలు నీరు తాగుతున్నారంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలంతా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల దిశగా ముందుకు వెళ్తున్నారు. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం లక్ష్యం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాయలసీమ మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దాన్ని వ్యతిరేకిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే ప్రాంతంలో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించాలనుకోవటం దుర్మార్గం. లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతంలో ఖర్చు చేసి, తన అనుయాయుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొమ్ముకాసే విధంగా రాయలసీమలోని పుట్టి పెరిగిన చంద్రబాబు వ్యవహరించటం శోచనీయం. దుష్టచతుష్టయం సహకారంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటుతున్న చంద్రబాబుకు, ఆయన కోటరీకి ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన చెంపపెట్టు. మన పిల్లల ఉద్యోగ, ఉపాధి కోసం సీఎం జగన్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఐటీ కాన్సెప్ట్ సిటీని నిర్మించనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా 7 సెజ్‌లు నిర్మిస్తున్నారు. – మద్దెల గురుమూర్తి, తిరుపతి ఎంపీ సీమ ఆకాంక్షకు ఈ ప్రదర్శనే సాక్ష్యం రాయలసీమకు న్యాయ రాజధాని కావాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. అందుకు ఈ ఒక్క నగరంలో ఈ మహా ప్రదర్శనే సాక్ష్యం. అమరావతి యజమానుల వద్ద బానిసలుగా ఉన్న తిరుపతిలోని కొందరు రాయలసీమ ఆకాంక్షను గుర్తించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలియజెప్పాలి. ఇక్కడికి వచ్చిన ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. తిరుపతిలో శుక్రవారం సమావేశమైంది అఖిలపక్షం కాదు.. ఆ పేరుతో 2024లో పోటీ చేయనున్న మిత్రపక్షాలు. ఈ ప్రాంత వాసులై ఉండీ, ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా పావులు కదపడం సిగ్గుచేటు. ముసుగు తీసి బయటకు వచ్చి, మా అజెండా ఇదీ అని చెప్పుకునే ధైర్యం లేని మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 85 ఏళ్ల క్రితం రాయలసీమకు కృష్ణా, గోదావరి జలాల్లో అధిక వాటా ఇస్తామని చెప్పి, ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు. రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. రాయలసీమ ప్రజల గొంతు ఎండిపోకుండా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. – శైలుకుమార్, మానవ వికాస వేదిక కన్వీనర్ -
మూడు రాజధానుల కోసం .. తిరుపతి గర్జన
-
Tirupati: రాయలసీమ గర్జన.. తిరుపతి జన సంద్రం (ఫొటోలు)
-
చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే భూమన
-
'రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే'
సాక్షి, తిరుపతి: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని, రాయలసీమ హక్కులు కాపాడాలని కోరుతూ ప్రజలు ఏకమవుతున్నారు. శనివారం తిరుపతి వేదికగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన, వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. ఈ మహా ప్రదర్శనలో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే ఉందంటూ నినాదాలు చేశారు. మహాప్రదర్శనతో తిరుపతి జనసంద్రంగా మారింది. మహార్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. రాయలసీమకు బాబు చేసిందేమీ లేదు. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భూమన పేర్కొన్నారు. -
ఈ ప్రశ్నలకెవురు జెబాబు సెప్తారు?
ఆగండాగండి. దండయాత్ర కాదు, ధర్మయాత్ర అంటన్నారు కదా, యీ ప్రశ్నలకి జెబాబులు చెప్తారా? ఒకప్పుడు గోదావరి నుంచి మహానది దాకా కళింగదేశమట. ఇప్పుడంత లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాల ఉత్తరాంధ్ర వుండీది, అదిపుడు ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర అయ్యింది. ఈ ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్యం, ఉపాధి, పశుసంపద, భూమి, సాగు నీటివసతులు, రోడ్లు, విద్యుత్... ఇలాగ యే రంగం తీసుకోండి... అన్ని జిల్లాలకంటే యెందుకు ఆఖరిస్తానాల్లో వున్నాయి? నాగావళి, వంశధార, జంఝావతి, వేగావతి, మహేంద్రతనయ వంటి పద్దెనిమిది జీవనదులుండగా మా సాగుభూముల్లో మూడు వంతుల నేలకి సాగునీటి సదుపాయాలెందుకు లేవు? రాష్ట్రంలోని యే ప్రాంతానికీ లేని మూడు వందల యాభయి కిలోమీటర్ల సముద్రతీర మున్నాది. వేలకోట్ల రూపాయల మత్స్యసంపద దొరక తాది? అయితే మా మత్స్యకారులెందుకు గుజరాత్, భివాండీ వంటి ప్రాంతాలకు వలసలు పోవాల్సివచ్చింది? గుడిసెల్లో గుండెలరచేతిల పెట్టుకొని మా మత్స్యకార మహిళలు సముద్రానికెందుకు దీనంగా మొక్కవల సొస్తన్నాది? ఎక్కడా లేని అయిదు వందల కిలోమీటర్ల అడవులున్నాయి మా ఆరు జిల్లాలలోన. రాష్ట్రంలోని మిగిలిన చోటనున్న ఆదివాసీలకంటే ఎక్కువ ఆదివాసీలున్నారు. అయినా ఎందుకక్కడ యింకా రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు. స్కూళ్లు లేవు, విద్యుత్ లేదు, ఉపాధి లేదు. ఆది వాసీలు కూడా ఎందుకు రెక్కలు కొట్టుకొని వలసలు పోవల సొస్తంది? పాతిక లక్షల ఎకరాల సారవంతమయిన సాగుభూమి వుంది. అయితే ఎందుకీ జిల్లాల రైతులు అప్పులపాలయి నారు? కారు చవగ్గా యీ భూముల్ని అటునిండొచ్చిన మీ జిల్లాల పెద్దరైతులు కొనేసి, పెద్దపెద్ద కమతాలు కట్టు కోలేదా? మా నేలలో మా రైతోళ్లని పాలేర్లు చేయలేదా? మాకున్న యేకైక నగరం విశాఖపట్నం. అదిపుడు మీ జిల్లాల నుండొచ్చిన వ్యాపారస్తుల దుకాణమయిపోలేదా? అక్కడి ఆసుపత్రులెవురివి? అక్కడి లాడ్జింగులెవురివి? అక్కడి కాలేజీలు, యూనివర్సిటీ లెవురివి? కాంట్రాక్టు లెవురివి? కంపెనీ లెవురివి? విశాఖపట్నంలో పాలనా రాజధాని యేర్పాటు మాత్రమే కాదు... ఉత్తరాంధ్ర జిల్లాల అభివృధ్దికి యీ ప్రాంతానికి చెందిన ప్రతినిధులతో ఒక ప్రత్యేక పాలనా వ్యవస్థ యేర్పాటు కావాలని కూడా అడుగుతున్నాం, తప్పంటారా? డార్జిలింగ్ అటానమస్ హిల్ కౌన్సిల్ పద్ధతిలో ఉత్తరాంధ్రాలోని ఆదివాసీ ప్రాంతాలైన భద్రగిరి, సీతంపేట, అరకు, పాడేరు, సాలూరు, మందస వంటి ప్రాంతాలతో హిల్ యేరియా కౌన్సిల్ యేర్పాటు చేయాలంటున్నాం, తప్పంటారా? ఆదివాసీ ప్రాంత సహజ వనరులనూ, ఖనిజాలనూ రకరకాల అభివృద్ధి ప్రణాళికల పేరిట కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే చర్యలను విరమించుకోవాలి. గిరిజన యూనివర్సిటీని పూర్తిస్ధాయిలో ప్రారంభించాలంటున్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రా వెనకబడడానికి కారణం పారిశ్రామికీకరణ జరగకపోవడం. అందుచేత మూడు జిల్లాల్లో వ్యవసాయాధార పరిశ్రమలు, సహజ వనరుల వెలికిదీసే పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు యేర్పాటు చేయాలి. మూసివేతకు గురయిన కర్మాగారాలనన్నీటినీ తెరిపించాలని నినదిస్తన్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్రాంతమయిన ఉద్దానంలో... జీడి, మునగ, కొబ్బరి, పనస వంటి పంటలకు కిట్టుబాటు ధర కల్గించడమేగాక, జీడి, కొబ్బరి వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ కర్మాగారాలూ నిర్మిస్తే, ఉపాధి అవకాశాలూ కలుగుతాయి. ఉద్దానం మంచినీటి సమస్యను పరిష్కరించాలి. ఉద్దానం కిడ్నీవ్యాధికి సంబం ధించిన పరిశోధనలు జరపాలి. వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యసదుపాయాలు అందించాలంటన్నాం, తప్పంటారా? మొత్తం కోస్తాంధ్రాలో 72 శాతం భూమికి సాగునీరు అందుతుండగా, ఉత్తరాంధ్రకు 42 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. 7 శాతం భూమి మాత్రమే రెండు పంటలకు అనువుగా వుంది. పెండింగులో వున్నటు వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ తక్షణమే పూర్తిచేసే చర్యలను చేపట్టాలంటున్నాం తప్పా? పంటలకు గిట్టు బాటు ధరలు కావాలంటన్నాం. వేయికోట్లకు పైగా ఆదాయమొచ్చే మత్స్యసంపదను మల్టీనేషనల్ కంపెనీలు కాజేస్తున్నాయి. మత్స్యకారులకు తీరని నష్టం జరుగు తోంది. సముద్రజలాల్లో మత్స్యకారుల వేటకు సంబంధించిన ప్రాంతంపై మత్స్యకారులకే అధికారముండాలి. కోల్డ్‌స్టోరేజీలు నిర్మించాలి. తుఫానుషెల్టర్లు నిర్మించాలంటన్నాం, తప్పంటారా? విశాఖలో రైల్వే జోన్ ఉత్తరాంధ్రకు లబ్ది జరిగేవిధంగా యేర్పాటు కావాలంటున్నాం, తప్పా? ఏటకేటా ఉత్తరాంధ్ర నుంచి యాభయి వేలమంది ఉపాధికోసం వలసపోతన్నారు. వలసలు ఆగాలనడుగుతున్నాం. తప్పంటారా? మా నేల ఎవరెవరి పుణ్యానోయిన్నేళ్లు నిరాదరణకు గురయ్యింది, ఇంకా నిరాదరణకు గురి చేస్తామంటే ఎలా సహిస్తాం? పాలనా రాజధాని విశాఖకు వస్తే వైసీపీ నేతల రియలెస్టేట్కి లాభమంటన్నారుకదా, మరి అమరావతిలో రియలెస్టేట్ జరిగిందని అర్థం కదా మీ మాటలకి? (క్లిక్ చేయండి: ఏనాడైనా మంచిని చూస్తున్నారా?) అసలు విశాఖకు పాలనాకేంద్ర రావడం వలన మీకొచ్చిన నష్టమేమిటి? మీకు వచ్చే దేనిని మేము తీసుకుంటున్నాం? మీరిచ్చిన భూములకు ధరలు తగ్గించమని మేమడిగినామా? మీకిచ్చిన ప్లాటులను ప్రభుత్వం వెనక్కి తీసుకోమని అనంటన్నామా? మీ అమరావతిలో అసెంబ్లీ వొద్దుగాక వొద్దని మీలాగ మీ అమరావతికి యాత్ర తీసినామా? మీ జోలికి రాలేదు, మీ ఊసెత్తలేదు, మీ ముక్కు మీద మసి అననలేదు. మరేల మా నేల మీదకి దండయాత్ర కొస్తన్నారు? మీకిది దరమ్మా? మీకిది నేయమా? మీకిది తగునా? ‘విశాఖ ఉక్కు’ కోసం పోరాడుతున్నట్టే పాలనాకేంద్రం కోసమూ పోరాడతా.. అడ్డుగా వొస్తన్న మిమ్మళ్ని ఎందుకొదిలేస్తాం? ఎందుకొదిలీయాలి? (క్లిక్ చేయండి: ‘అలా’ అనకూడదంటే ఎలా?) – కళింగ కరువోడు -
మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులకు మాల మహానాడు మద్దతు ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మంగరాజు తెలిపారు. ‘‘దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. అమరావతి రైతులు ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి రాజధాని కావాలంటున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని’’ మంగరాజు హెచ్చరించారు. చదవండి: AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం -
మూడు రాజధానులపై ఎందుకంత ఆక్రోశం : స్పీకర్ తమ్మినేని
-
చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై.. మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేదికాదని, నష్టం ఉండేది కాదన్నారు మంత్రి ధర్మాన. ‘భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అయినా లక్షల కోట్లతో అమరావతి ప్రతిపాదన చేశారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్. చంద్రబాబు సన్నిహితులు భూమి కొనుగోలు చేశాకే రాజధాని ప్రకటించారు. సింగపూర్ పార్లమెంట్లో ఈశ్వరన్ వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు నాటకం తెలిసింది. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయి. చంద్రబాబు నారాయణ కమిటీ వేసి 3,940 సీక్రెట్ జీవోలు ఇచ్చారు.’ అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నిపుణులు హాజరై.. విశాఖను పాలన రాజధానిగా చేయాలని కోరారు. ఇదీ చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర -
వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర
చంద్రగిరి: వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ జగన్ సేవాదళ్ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన వికేంద్రీకరణకు మద్దతుగా పలువురు నాయకులు, యువకులు ఈ పాదయాత్ర చేస్తున్నారు. చిత్తూరు నుంచి పాదయాత్రగా బయలుదేరి పూతలపట్టు, నేండ్రగుంట, చంద్రగిరి మీదుగా సాయంత్రానికి తిరుమల శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ సేవాదళ్ రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు గణేష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు శ్రీవారి మెట్టు మార్గం వద్ద వారికి మద్దతు తెలిపారు. సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం ప్రకారం వికేంద్రీకరణ మన రాష్ట్రానికి చాలా అవసరమని, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే అందరికీ మేలు కలుగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే -
అమరావతి అసైన్డ్ అక్రమాలు.. పచ్చ గద్దల కొత్త చిట్టా
వడ్డాది శ్రీనివాస్ ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరోదారన్న సామెత చంద్రబాబుకు, ఆయన పచ్చ గ్యాంగ్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏమీ లేని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు మాత్రమే డిమాండ్ చేస్తుండగా.. యావత్ రాష్ట్ర ప్రజలంతా అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ మూడు రాజధానులకు జై కొడుతున్నారు. న్యాయమైన వీరందరి ఘోషను ఏమాత్రం వినిపించుకోని బాబు అండ్ కో ఎందుకు ఇంతగా ఒక్క అమరావతి కోసమే పట్టుపట్టిందంటే వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. భూ సమీకరణకు అవతల కారుచౌకగా కొట్టేసిన భూములను కాపాడుకునేందుకే ఈ తాపత్రయమని స్పష్టమవుతోంది. ఆ భూములను బంగారు బాతుగా మార్చుకునే అవకాశం చేజారిపోతోందన్న భయం వారిని బెంబేలెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసైన్డ్ భూములను ఎల్లో గ్యాంగ్ కాజేసే నాటికే ఆ ప్రాంతంలో ఎకరం రూ.కోటి పలుకుతోంది. ప్రభుత్వం లాక్కుంటే ఏమీ ఇవ్వదనే ఆందోళనతో అసైన్డ్ రైతులు తమ భూములను చంద్రబాబు బినామీలకు విక్రయించారు. ఆ తర్వాత వాటిని టీడీపీ నేతలే ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదైంది. ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా టీడీపీ నేతలే భూ సమీకరణ కింద ఇచ్చినట్టు రికార్డుల్లో పొందుపరిచారు. ఈ కుట్ర అంతా 2014 జూన్ నుంచి 2015 డిసెంబర్‌లోగా పూర్తి చేశారు. ఆ తర్వాత తాపీగా అసైన్డ్ భూములకు కూడా పరిహారం చెల్లిస్తామంటూ 2016 ఫిబ్రవరి 17న గత సర్కారు జీవో 41 జారీ చేసింది. ఇలా టీడీపీ పెద్దలు ఏకంగా 964 ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. నాటి సీఎం చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ప్రకారమే అభివృద్ధి చేసిన తర్వాత అమరావతిలో భూముల విలువ ఎకరా కనీసం రూ.4 కోట్లు. అంటే వారు సొంతం చేసుకున్న అసైన్డ్ భూముల విలువ ఏకంగా రూ.4 వేల కోట్లు! అప్పటికే రాజధాని ఎక్కడ వస్తుందో వారికి ముందే తెలుసు కాబట్టి చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతిలో భూ సమీకరణ పరిధికి అవతల వేలాది ఎకరాలను బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటి విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అసైన్డ్ భూముల దోపిడీ వాటికి అదనం. అమరావతిలో టీడీపీ నేతలు కొల్లగొట్టిన అసైన్డ్ భూములు (మార్క్ చేసినవి) 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన ప్రాంతాన్ని కోర్ క్యాపిటల్‌గా చంద్రబాబు సర్కారు మాస్టర్ ప్లాన్‌లో ప్రకటించింది. అదే ప్రాంతంలో ఎల్లో గ్యాంగ్ అసైన్డ్ భూములను కాజేసింది. 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటి? అనే విషయంపై అధికారుల దర్యాప్తులో బండారం మొత్తం బయట పడింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. ఆ స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. అందులో 20 గ్రామాల పరిధిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. ఇక ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా వదల్లేదు. ఏకంగా 328.13 ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ పెద్దలు తమ బినామీల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డులు తారుమారు చేశారు. 2014 నాటి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్లతో సహా ఉన్న వివరాలకు, భూ సమీకరణ కింద తీసుకున్నట్లు సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న వివరాలు సరిపోలడం లేదు. ఆ భూములన్నీ అసైన్డ్ జాబితాలోని 3, 4 కేటగిరీల కిందకు వస్తాయి. వెరసి టీడీపీ పెద్దలు ఏకంగా 964.88 ఎకరాల అసైన్డ్ భూములను కాజేశారు. ఇదిగో.. దందా ఇలా.. ►అమరావతి పరిధిలోని వెంకటపాలెం రెవెన్యూ సర్వే నంబరు 295/10తో ఉన్న 1.02 ఎకరాల అసైన్డ్ భూమి రికార్డుల ప్రకారం గొర్రెముత్తు కాంతారావు అనే రైతు పేరిట 2015 వరకు ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద ఇచ్చినట్లుగా సీఆర్డీఏ రికార్డుల్లో బడే ఆంజనేయులు పేరుతో ఉంది. అందుకు ప్రతిగా రాజధానిని అభివృద్ధి చేసిన తర్వాత ఎకరాకు 800 గజాల కమర్షియల్ స్థలం, 200 గజాల నివాస స్థలాన్ని బడే ఆంజనేయులుకు ఇస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్ భూమి హక్కుదారు కాంతారావు కాగా, సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది మాత్రం బడే ఆంజనేయులతో కావడం గమనార్హం. ►అమరావతిలోని మందడంలో ‘454/3సీ’ సర్వే నంబరుతో 1.50 ఎకరాల అసైన్డ్ భూమి పిల్లి వెంకయ్య అనే రైతుకు అసైన్ చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అదే భూమిని గుమ్మడి సురేశ్ భూ సమీకరణ కింద ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదైంది. ఎకరాకు 800 గజాల కమర్షియల్ స్థలం, 200 గజాల నివాస స్థలం గుమ్మడి సురేశ్‌కు ఇస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్ భూమి హక్కుదారు వెంకయ్య కాగా, సీఆర్డీఏ నుంచి అభివృద్ధి చేసిన భూమిని పొందేది గుమ్మడి సురేశ్. సీఆర్డీఏ రికార్డుల్లో ఇలాంటి చిత్రాలెన్నో కనిపిస్తాయి. వీరంతా పాత్రధారులు కాగా, అసలు సూత్రధారులు టీడీపీ పెద్దలే. ►వెంకటపాలెంలో సర్వే నంబరు 296/5తో ఉన్న 0.94 ఎకరాల అసైన్డ్ భూమి అన్నూరి హేమలత అనే రైతు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద కొట్టి కృష్ణ దొరబాబు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. ►కురగల్లు సర్వే నంబరు 500/1తో ఉన్న 0.72 ఎకరాలు కత్తిపోగు కోటేశ్వరరావు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమిని శీలం శ్రీను అనే వ్యక్తి ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో ఉంది. ఇదే గ్రామంలో సర్వే నెం 501/1తో ఉన్న 0.80 ఎకరాల అసైన్డ్ భూమి బుల్ల కోటమ్మ పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, గడిపర్తి శ్రీను సీఆర్డీఏకు ఇచ్చినట్లు నమోదైంది. పాదయాత్ర అసలు గుట్టు ఇదే.. అమరావతిలో బినామీల పేరిట అసైన్డ్ భూములను కాజేసిన టీడీపీ నేతలు భూ సమీకరణ పరిధికి అవతల కూడా వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. వాటిలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ, ఆయన సన్నిహితుడు లింగమనేని రమేశ్, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కుటుంబం, పి.నారాయణ, పరిటాల సునీతలతోపాటు టీడీపీ హయాంలో మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు చెందిన వేలాది ఎకరాలున్నాయి. ఆ భారీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కోసమే మూడు రాజధానుల విధానాన్ని చంద్రబాబు అండ్ కో వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రైతుల ముసుగులో పెత్తందారులు, రియల్ ఎస్టేట్ సిండికేట్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ, సీఆర్డీఏ రికార్డుల సాక్షిగా బట్టబయలైంది. ఓ బ్రాహ్మణుడు పాల కోసం మేకను కొనుక్కొని వెళ్తుంటే దారిలో ముగ్గురు దొంగలు ఒకరి తర్వాత ఒకరు అటకాయించి అది మేక కాదు.. కుక్క అని నమ్మబలుకుతారు. ముగ్గురూ అదే మాట చెప్పడంతో ఆయన తన వెంట ఉన్నది కుక్కేనని భ్రమించి మేకను వదిలేసి వెళ్లిపోతాడు. ఇదే అదనుగా కాచుకున్న ఆ ముగ్గురు దొంగలు మేకను అపహరిస్తారు. ఈ కథ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సరిగ్గా అదే రీతిలో గత ప్రభుత్వ హయాంలో పచ్చ దొంగలు అమరావతిపై గద్దల్లా పడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులను భయాందోళనలకు గురిచేసి.. అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములను కాజేశారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం రాదంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా బెదిరించి కారుచౌకగా కొట్టేశారు. ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి జపం చేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకుంటూ మూడు రాజధానులపై విషం చిమ్ముతున్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం
-
మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి
సాక్షి, అనకాపల్లి: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి, మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకమై శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పాదయాత్రగా వచ్చే అమరావతి దండుయాత్ర ఉత్తరాంధ్రకు చేరకుండా, మన ఆకాంక్ష తెలిసేలా రోజుకొక నియోజకవర్గంలో బంధ్లు నిర్వహించాలని.. రాస్తారోకోలు, ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. విశాఖను పాలనా రాజధానిగా చేయాలంటూ అనకాపల్లి రింగ్ రోడ్డు సమీపంలోని పెంటకోట కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఉత్తరాంధ్ర మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజకీయ, సామాజిక, ఉద్యోగ, విద్యార్థి.. మేధావి వర్గం వారంతా పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను రాజధానిగా చేయడమే మార్గమని నినదించారు. మాజీ వీసీ, ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మ న్ లజపతిరాయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసా గింది. ఏయూ ప్రొఫెసర్ షోరాన్ రాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, జేఏసి వైస్ చైర్మన్ దేముడు నాయుడు తదితరులు మాట్లాడారు. అమరావతి యాత్ర ఆపేయాలి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమిస్తోంది. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. 1956 లోనే విశాఖ రాజధాని కావాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పటికైనా మూడు రాజధానులు ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. అమరావతి యాత్ర ఇప్పటికైనా విరమించుకోవాలని జేఏసీ హెచ్చరిస్తోంది. లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. – లజపతిరాయ్, ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అన్ని ప్రాంతాలు బావుండాలి.. అందరూ బావుండాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకోవడం లేదని కొందరు టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహులు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ విశాఖ గర్జన విజయవంతం కావడమే సమాధానం. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం ఆగదు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా పార్టీ మద్దతు ఉంటుంది. విశాఖ రాజధాని అయితే రానున్న తరానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటే, విశాఖ రాజధాని కావాల్సిందే. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పాదయాత్ర సాగే ప్రాంతాల్లో బంద్ చేపట్టాలి విశాఖ పరిపాలన రాజధాని అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లంటే రూ.ఐదారు లక్షలకోట్లు ఖర్చవుతుంది. చంద్రబా బు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ.6 వేలకోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు. మిగతా రూ.1,500 కోట్లలో రూ.వెయ్యికోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చుచేశారు. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. చంద్రబాబు నిస్సిగ్గుగా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారు. పచ్చ ముసుగు కప్పుకుని చేస్తున్న పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాలి. షాపులు స్వచ్ఛందంగా మూసి వేసి, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేపట్టాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ద్రోహులు బుద్ధి మార్చుకోవాలి అమరావతి రైతులపేరిట నిర్వహించేయాత్ర చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. తక్కువ ఖర్చుతోనే అద్భుత రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర టీడీపీ ద్రోహులు తమ బుద్ధి మార్చుకోవాలి. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తాం ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఉద్యమం ఉధృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధానిగా విశాఖను కోరుకోవడంలేదని చెప్పే ప్రతీ ఒక్కరికీ విశాఖ గర్జన ఒక సమాధానం. అమరావతి రైతుల పేరిట నిర్వహించే దండయాత్ర కారణంగానే ఈ ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది. మీరు మా ప్రాంతానికి వచ్చి, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటామంటే మేము ఎలా ఊరుకుంటాం? చంద్రబాబు, ఆయన పార్టీ నేతలంతా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాదయాత్ర చేపట్టారు. మా ఉత్తరాంధ్ర ఉద్యమకారులకు చెప్పులు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో మరోసారి మోసపోలేం. ఇప్పటికైనా పాదయాత్ర నిలిపివేస్తే మంచిదని కోరుతున్నాం. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మేము కట్టుబడి ఉంటాం. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తొడలు కొట్టడం సంస్కారమా? ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా, అందులో కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలుస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కేంద్రమే స్వయానా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు అమరావతి ఏకీకృత రాజధాని కావాలని అనడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు రైతుల ముసుగులో చేయిస్తున్న పాదయాత్రకు హైకోర్టు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. వాళ్లు వాటిని పట్టించుకోకుండా.. తొడలు కొడుతూ.. మీసాలు దువ్వుతూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటం దారుణం. ఇదేనా మీ సంస్కారం? తక్షణమే న్యాయస్థానం ఈ విషయాలను సుమోటోగా తీసుకుని పాదయాత్రను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. – దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా విశాఖ వాసులు అక్కున చేర్చుకుంటారు. అలాంటి మా ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదు. దానికోసం ఎందాకైనా ముందుకు వెళతాం. మా మౌనాన్ని అమాయకత్వం అనుకుంటే పొరపాటే. సీఎం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలుకుతున్నారు. విశాఖ పాలన రాజధాని అయితే దేశంలోనే ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. – భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ ఉద్యమం ద్వారానే సాధించుకుందాం రాజధాని అవ్వాలంటే రాష్ట్రం మధ్యలోనే ఉండనవసరం లేదు. చరిత్రను పరిశీలిస్తే.. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాధించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉద్యమం ద్వారానే పరిపాలన రాజధాని సాధించుకోవాలి. 29 గ్రామాల కోసం వారు రాజధాని అడిగితే.. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు ఏమవ్వాలి? మన డిమాండ్‌కు మద్దతివ్వని పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి. – జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) -
విశాఖ కోసం రాజీనామా!.. మంత్రి ధర్మానను వారించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా కార్య నిర్వాహక రాజధాని సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు తన రాజీనామాను అంగీకరించాలన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలసిన మంత్రి ధర్మాన కొందరు ప్రగతి నిరోధకులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదని, తన రాజీనామాను అనుమతించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిసింది. దీన్ని సున్నితంగా తిరస్కరించిన సీఎం జగన్ వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. తాను సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని, సర్పంచ్ నుంచి రెవెన్యూ మంత్రి వరకూ వివిధ బాధ్యతలు సమర్ధంగా నిర్వహించినట్లు ధర్మాన ఈ సమావేశంలో పేర్కొన్నారు. దీని వెనుక దివంగత వైఎస్సార్ ఆశీస్సులు, ప్రోత్సాహం మెండుగా ఉన్నాయన్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టాక పరిపాలనలో సమూల మార్పులు తెచ్చారని ప్రశంసించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశం వివరాలివీ.. ►ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తు, సమగ్రాభివృద్ధి, పరిపాలన రాజధానిగా విశాఖను సాధించుకోవడంతో పోలిస్తే ఈ పదవులు, హోదాలు గొప్పవని నేను భావించడం లేదు. ►అనేక అవకతవకలు, ఆశ్రిత పక్షపాతం, ఏకపక్ష ప్రయోజనాలు, కేంద్రీకృతమైన సంపద కోసం సమగ్రాభివృద్ధిని విస్మరిస్తూ గత సర్కారు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసింది. నాడు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కగా నేడు ధనబలం, ఓ వర్గం మీడియా సహకారంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతూ కుటిల యత్నాలు చేస్తున్నారు. రూ.లక్షల కోట్లు వెచ్చించి అమరావతిని మరో హైదరాబాద్‌లా తయారు చేయడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం. ►రాజ్యాంగ వ్యవస్థలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలని మీరు (సీఎం జగన్) తీసుకున్న నిర్ణయం ద్వారా మూడు ప్రాంతాల ప్రగతికి బాటలు వేయడం కాకుండా చారిత్రక శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించినట్లయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది కొత్త ఆశలు చిగురింపజేసింది. యువత ఆశలు మొగ్గ తొడిగాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిపోతున్న ప్రాంత ప్రజలకు గౌరవంగా బతకొచ్చనే ధైర్యాన్నిచ్చింది. తమ మధ్యే రాష్ట్ర పరిపాలన జరుగుతుందని వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, గృహిణులు ఉత్తేజితులయ్యారు. ►దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా లెక్కలకెక్కిన శ్రీకాకుళం వాసిగా, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధిగా విశాఖలో పాలనా రాజధాని ఒక్కటే ఈ ప్రాంత అభివృద్ధికి తారక మంత్రమని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నా. వికేంద్రీకరణ సూత్రంతో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి అంతా మద్దతివ్వాలి. ఈ దిశగా ఆలోచించినప్పుడు ఉత్తరాంధ్ర ఉజ్వల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతోంది. పొట్ట చేత పట్టుకుని పరాయి ప్రాంతాలకు వెళుతున్న వలసలు ఆగిపోతున్న దృశ్యం కళ్ల ముందు కనిపిస్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. చదవండి: ‘ఎన్ని మందలు కలిసి వచ్చినా.. సీఎం జగన్‌పై పైచేయి సాధించలేరు’ -
పాదయాత్ర అడ్డుకోవడానికి మీరెవరు?
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అమరావతి మద్దతుదారుల పాదయాత్రను అడ్డుకోవడానికి మంత్రులు, అధికార వైసీపీ నేతలు ఎవరంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదని.. మూడు రాజధానుల గురించి ఎవరూ నోరెత్తకూడదన్నది వైసీపీ ఆలోచన అని.. తమది పొలిటికల్ పార్టీ అని.. తమకూ ఓ వైఖరి ఉంటుందని చెప్పారు. ప్రత్యేక విమానంలో సోమవారం విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చి, అక్కడ నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ మళ్లీ మూడు ముక్కలుగా విడిపోవాలా. అదా వైసీపీ కోరిక? తిప్పికొడితే 13 జిల్లాలు, వాటిని 26 ముక్కలు చేశారు. దానికి పాలనా సౌలభ్యం అన్నారు. దీనికీ అంతు ఉండాలిగా. ఎక్కడో ఒకచోట ఆగాలి. దీనిని ప్రజలు కూడా గ్రహించాలి. ఉత్తరాంధ్ర, కులం, మతం అంటూ కొట్టుకుంటూ ఉంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. విశాఖ ఘటనలకు సంబంధించి మా పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు. వాళ్ల కాన్వాయి మీద దాడి జరగాలని వాళ్లే ప్లాన్ చేసుకుని మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు. మా కేడర్‌కు మనోధైర్యం ఇచ్చా. విశాఖ ఘటనలపై హైకోర్టులో పిటిషన్ వేశాం. తెలంగాణ రాష్ట్ర సాధన నిర్వీర్యం అవుతుంది న్యాయ వ్యవస్థకు కూడా అప్పీల్ చేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజున జరుగుతున్న దానిని సునిశితంగా గమనించండి. రాష్ట్ర న్యాయ శాఖను కూడా అభ్యర్థిస్తున్నా. అలాగే, రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. అలా చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఇందుకు పత్రికాధిపతులు, చానల్స్ యజమానుల సహకారం కోరుతున్నా. ఇక రాష్ట్రంలో జరిగే విషయాలను బీజేపీకి చెప్పవచ్చుగా అని విశాఖలోని కొందరు జర్నలిస్టులు నన్ను ప్రశ్నించారు. కానీ, ఇక్కడ యుద్ధం మీరే చేయండి అని బీజేపీ అగ్రనాయకులు అంటారు. నేను ఢిల్లీకి వెళ్లను. ఇక్కడే తేల్చుకుంటా.. వైసీపీ అధికారంలోకి రాకుండా పోరాడుతా. కోర్టు అంశాలతో పాటు గవర్నర్‌ను కలిసే అంశాలపై చర్చిస్తా.’ అని చెప్పారు. బెజవాడకు పవన్ పయనం అంతకుముందు.. మూడు రోజుల పాటు విశాఖలో మకాం వేసి హంగామా చేసిన పవన్ తాను ఆశించిన ఫలితం దక్కకపోవడంతో విజయవాడకు తిరిగొచ్చారు. ఈనెల 16న జనవాణి కోసం 15వ తేదీ సాయంత్రం ఆయన విశాఖ వెళ్లారు. అదే రోజు మంత్రుల కార్లపై విశాఖ విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ హోటల్‌కు వెళ్లిపోవడం.. ఆ మర్నాడు జనవాణి జరిగే పోర్టు స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో జనవాణిని నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత అరెస్టయిన జనసేన రౌడీమూకలను విడిచిపెట్టే వరకు విశాఖలోనే ఉంటానని పవన్ బీరాలు పలికారు. కానీ, సోమవారం మధ్యాహ్నం విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పవన్ సోము వీర్రాజు భేటీ విజయవాడ నోవాటెల్ హోటల్లో బసచేసిన పవన్‌కల్యాణ్‌తో సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న సంఘటనలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. తమకు లభిస్తున్న ఆదరణను చూడలేక అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. విశాఖలో జరిగిన దాడి పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించగా.. వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని వారు చెప్పారు. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రాంగా అభివర్ణించారు. జన స్పందన లేకపోవడంతో కుట్రకు తెరలేపారని, ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతామని వారిద్దరూ స్పష్టంచేశారు. -
రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు
రాజమహేంద్రవరం రూరల్ : అమరావతి రైతు పాదయాత్రకు తూర్పుగోదావరిజిల్లా కాతేరులో నిరసన సెగ తగిలింది. సోమవారం సాయంత్రం కాతేరు వెంకటాద్రిగార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు మల్లయ్యపేట గాంధీ బొమ్మ సమీపంలో స్థానికులు ప్లకార్డులు, నల్లబెలూన్లు చేబూని నిరసన వ్యక్తం చేశారు. వారికి వైఎస్సార్సీపీ శ్రేణులు తోడయ్యాయి. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. అంటూ నినాదాలు చేస్తూ గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. నిరసనకారులను పాదయాత్రికులు కవ్వించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమరావతి పాదయాత్రికులు తారాజువ్వలు వదులుతూ నిరసనకారులను రెచ్చగొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలనూ నియంత్రించారు. -
విశాఖ రాజధాని కోసం నినదించిన విద్యార్థి లోకం
ఆమదాలవలస: విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కోసం విద్యార్థులు ఉద్యమించారు. రియల్ ఎస్టేట్ రాజధాని తమకు వద్దని.. మూడు రాజధానులే ముద్దంటూ నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో మూడు రాజధానులకు మద్దతుగా సోమవారం విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విదార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వీడి.. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే.. విశాఖ రాజధాని అయితేనే సాధ్యమంటూ గొంతెత్తారు. బైక్ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ ప్రాంగణానికి చేరుకుంది. రాజధానిని సాధించే వరకూ పోరాటం ఆగదు : స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసుకునే వరకూ పోరాటం ఆపొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాజధాని సాధన అన్నది ఉత్తరాంధ్ర ప్రజలందరి బాధ్యతని చెప్పారు. భావి తరాల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని.. దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకనుగుణంగా న్యాయమూర్తులు సహకరించి.. రాజధానుల నిర్మాణాలకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ అభివృద్ధి చెందితేనే ఉత్తరాంధ్రకు విస్తృతంగా పరిశ్రమలొస్తాయని, తద్వారా యువతకు మెండుగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగి.. వలసలు ఆగిపోతాయని స్పీకర్ వివరించారు. తొలుత వైఎస్సార్ కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి స్పీకర్ నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. -
ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకే టీడీపీతో చేతులు కలిపిన పవన్
తాడికొండ : చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడని, ఆ పార్టీని రద్దు చేయాలని బహుజన పరిరక్షణ సమితి నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 749వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తన సీటు కూడా తాను గెలవలేని పవన్.. ఎన్నికల అనంతరం పెయిడ్ ఆర్టిస్టుగా మారి బాబుకు తాబేదారు అవతారమెత్తాడని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేసేందుకు టీడీపీతో చేతులు కలిపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటును తన జీవితంలో భాగంగా చేసుకున్న చంద్రబాబు.. చివరకు పవన్‌కు కూడా ఓ పోటు పొడిచి రాజకీయ సన్యాసిగా మిగల్చడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి, పులి దాసు, పల్లె బాబు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ పరిపాలన రాజధానే మా లక్ష్యం
బొబ్బిలి: వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానే తమ లక్ష్యమని బొబ్బిలి ప్రజలు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శ్రీ కళాభారతి మునిసిపల్ ఆడిటోరియంలో ఆదివారం బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలో పలువురు మేధావులు, విద్యా, వ్యాపార, న్యాయ, రాజకీయ వర్గాలకు చెందిన వారంతా పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన వికేంద్రీకరణకు మద్దతు పలికారు. మునిసిపల్ చైర్మన్ ఎస్వీ మురళీకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సి ఉన్నా.. చంద్రబాబు చేసిన పొరపాట్ల కారణంగా దాన్ని కోల్పోయామని చెప్పారు. దశాబ్దాల నాటి ప్రతిపాదన విశాఖ రాజధాని అవకాశాన్ని ఇప్పుడు జారవిడుచుకోవద్దని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, డాక్టర్ బొత్స కాశినాయుడు, భాస్కరరావు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వివిధ వర్గాల మేధావులు, ప్రజలు పాల్గొన్నారు. -
మూడు రాజధానులకే మా మద్దతు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకే తమ మద్దతని రాష్ట్ర నూర్‌బాషా(దూదేకుల) సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో స్వర్ణాప్యాలెస్ హోటల్లో ఆదివారం నూర్ బాషా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. నూర్‌బాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రసూల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో విభజనవాదం తలెత్తదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని తమ సంఘం స్వాగతిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నవరత్న పథకాలు నూర్‌బాషాలకు అందుతున్నాయని తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి షాన్ బాషా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.బాదుల్లా, ఉపాధ్యక్షుడు మదీనా, అధికార ప్రతినిధి, గాజుల బాజీ, యూత్ ప్రెసిడెంట్ శ్రీనుబాషా పాల్గొన్నారు. -
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానుల ఉద్యమం అంతం కాదని.. ఆరంభం మాత్రమే అని ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అన్నారు. విశాఖ గర్జన విజయవంతం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉద్యమకారులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై జేఏసీ కమిటీతో చర్చిస్తామన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విశాఖ గర్జన’ విజయోత్సవ సభలో మాట్లాడారు. ‘అమరావతి ప్రజలంటే మాకు కోపం లేదు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బావుండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు.. ఏనాడూ మాకు రాజధాని కావాలని డిమాండ్ చేయలేదు. అన్నింటికీ తల ఊపుతూనే వచ్చాం. ఇకపై కూడా అన్యాయం జరుగుతుంటే అలానే తల ఊపుతూ కూర్చోలేం. మా మంచితనాన్ని అమాయకత్వమనుకుంటే పొరపాటే’ అని హెచ్చరించారు. వికేంద్రీకరణను అందరూ స్వాగతించాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అత్యంత వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని, విశాఖను పరిపాలన రాజధాని చేసి పేదరికంలో ఉన్న తమ బతుకులు మారుస్తామంటే అభినందించాల్సింది పోయి అడ్డుకోవడం దారుణం అని టీడీపీ, జనసేన వైఖరిపై అజపతిరాయ్ మండిపడ్డారు. అమరావతి–అరసవల్లి యాత్ర ద్వారా మా ప్రాంతంలో మా దేవుని దగ్గరకి వచ్చి మా ప్రాంతంలో రాజధాని వద్దని మా నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర జేఏసీ సభ్యులు ప్రొఫెసర్ విజయకుమార్, కొల్లూరి సూర్యనారాయణ, పాల్, బాల మోహన్‌దాస్, షరన్ రాజ్, ఎస్ఎస్ శివశంకర్, డాక్టర్ పి.రామారావు, పైలా కృష్ణమోహన్, దువ్వాడ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మూడు పెళ్లిళ్లే జనసేన విధానం!
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులు మా పార్టీ విధానమైతే.. పవన్ కల్యాణ్‌ది మూడు పెళ్లిళ్ల (ఇప్పటికి) విధానమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పెళ్లి చేసుకున్న చోటల్లా రాజధాని పెట్టమంటారా? అని పవన్ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పవన్ కల్యాణ్‌కు సంస్కృతి, సంప్రదాయాలు తెలియవని, ఒకవిధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరినీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సలహా ఇస్తాడేమోనని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ వంటి ఉగ్రవాదులకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్నాడని నాలుగు రోజుల క్రితమే చెప్పానని, ఆ విధంగానే ఆయన విశాఖలో దిగగానే ఆ పార్టీకి చెందిన సైకోలు తమ పార్టీ నేతలపై దాడులకు దిగారన్నారు. చంద్రబాబు నాయుడు బాణి వినిపించడానికే.. జనవాణి పేరుతో పవన్ కల్యాణ్ విశాఖ వచ్చాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గడాఫీతో పోల్చడం దారుణం అని మండిపడ్డారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. బాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన ► ప్యాకేజీ స్టార్ అనే పదానికి అర్థం ఏమిటో విశాఖ ప్రజలకు పవన్ కల్యాణ్ బాగా అర్థం అయ్యేలా చెప్పాడు. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర జేఏసీ సభ ఉంటే.. సాయంత్రం దానిని నేను డైవర్ట్ చేస్తానని చంద్రబాబు తరఫున పవన్ కల్యాణ్ రెడీ అయ్యాడు. తన విశాఖ పర్యటనను మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పటం సిగ్గు చేటు. ► చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల, చంద్రబాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన. దీనికి బాబు సేన అని పేరు పెడితే బాగుంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని ఈనాడు పత్రిక టార్గెట్ చేయటం, ఉత్తరాంధ్రలో ప్రైవేటు వ్యక్తుల భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం మీద నెట్టటానికి టీడీపీ, ఎల్లో మీడియా, దానితోపాటు జనసేన, ఇతర పార్టీలు ప్రయత్నం చేయటం.. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరు? ► మంత్రులపై రాళ్లు వేసిన వారిని అరెస్టు చేస్తే తప్పా? పవన్ కల్యాణ్ మద్దతు మీడియా, ఎల్లో మీడియా, బాబు మీడియా.. ఏం చెప్పింది? జనసేన వారే దాడి చేశారని చెప్పలేదా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలు అంటాడు.. ఎవరైనా పవన్ కల్యాణ్‌పై దాడి చేశారా? ► ఒకపక్క బీజేపీతో కాపురం చేస్తూ వారు అమ్మేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్, బాబు తన పార్ట్నర్గా ఉండి అమ్మేసిన ప్రత్యేక హోదా.. విశాఖ రైల్వే జోన్.. ఇవన్నీ ‘విశాఖ గర్జన’ ఉద్యమం రోజునే పవన్‌కు గుర్తుకు రావడం వెనుక డ్రామా ఏంటో అందరికీ తెలుసు. ► తుపాకీతో కాల్చాలన్న కోరిక ఉన్నవాడిని.. ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ బెదిరించే వాడిని.. సోషల్ ఎలిమెంట్ అంటారా? యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా? జనసేన కార్యకర్తలు హత్యాయత్నం చేసిన విషయాన్ని ఎల్లో మీడియానే నిన్న వీరగాధ అన్నట్టు చూపింది. అది నిజం అయినప్పుడు.. 307 సెక్ష¯Œన్ కింద పోలీసులు కేసులు పెట్టక శాలువాలు కప్పి, సన్మానాలు చేస్తారా? 3 నెలల కిందటే టికెట్ బుక్ చేసుకున్నావా? ► పవన్ కల్యాణ్ విజ్ఞత కలిగిన నాయకుడే అయితే, శనివారం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనకు, తమ కార్యకర్తలు, నాయకులే బాధ్యులు అని హుందాగా ఒప్పుకునే వారు. పవన్‌కు ఆ హుందాతనం లేక పోగా, ఆ దాడులు తమకు తామే చేయించుకున్నామని ఆరోపణలు చేయడం శోచనీయం. ► పవన్ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనను ఖండించాల్సింది పోయి.. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టడాన్ని తప్పు పట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. తాను విశాఖ పర్యటన కార్యక్రమాన్ని మూడు నెలల కిందటే ఖరారు చేసుకున్నానని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రెండు నెలల కిందటే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్.. మూడు నెలల క్రితమే టికెట్ ఎలా బుక్ చేసుకుంటారు? ► విశాఖ గర్జన కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచేందుకే పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలపై తమ పార్టీ సైకోలను ఉసిగొలిపిన పవన్ ఒక రాజకీయ ఉగ్రవాది. తనవెంట వచ్చే వారంతా తనకు ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్నాడు. సెలబ్రిటీలను చూసేందుకు వచ్చిన వారంతా ఓట్లేస్తే ఈ పాటికి ఎంతో మంది సినిమా నటులు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వారు. -
అమరావతికే మా మద్దతు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరం లేదని, ముందు నుంచీ తాము అమరావతికే మద్దతిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ప్రకటించక ముందే తాము జనవాణి షెడ్యూల్‌ను ఖరారు చేశామన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు వస్తుండగా ప్రజలకు అభివాదం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఓ ఐపీఎస్ అధికారి తన కారెక్కి లోపల కూర్చోవాలని చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. తమ పార్టీ ఏం చేయాలో కూడా వైఎస్సార్సీపీ చెబుతుందా? అని ప్రశ్నించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించినా తాను గౌరవంగా వ్యవహరించానని చెప్పారు. వంద మందికిపైగా జనసేన నాయకులను అరెస్ట్ చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం దారుణమన్నారు. వారిని విడిచిపెట్టే వరకు జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి గురించి నిజానిజాలు తెలియాలన్నారు. మంత్రులకు సరైన భద్రత లేకపోవటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు. కోడి కత్తిలా ఇది కూడా ఒక ప్లాన్‌లా అనిపిస్తుందన్నారు. తనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని పదేపదే విమర్శించే వారికి అంత ఈర‡్ష్య ఎందుకని ప్రశ్నించారు. వారు కూడా విడాకులిచ్చి పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కాగా విశాఖలో ఈ నెల 31 తేదీ వరకు ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పేర్కొంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నోటీసు అందించారు. దీనిపై పవన్ కల్యాణ్ సంతకం చేసి తిరిగి పోలీసులకు అందజేశారు. -
ఉత్తరాంధ్ర అంతటా అదే నినాదం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మారుమోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ నినాదం ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామంలోనూ ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. మూడు రాజధానుల ఏర్పాటుతో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు ఊరూ వాడా ఏకమై మద్దతు పలుకుతోంది. శుక్రవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, భారీ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. విశాఖ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే గర్జిస్తామంటూ మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు నినదించారు. నేడు అన్ని దారులూ విశాఖ గర్జన వైపే - విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వ వార్డులో వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 46, 50, 51వ వార్డుల్లోని డీఎల్బీ గ్రౌండ్, మురళీనగర్ పార్కు, ఈస్ట్ పార్కు వద్ద వాకర్స్‌తో సమావేశమై వికేంద్రీకరణ ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సతీష్, కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు పాల్గొన్నారు. - విశాఖ తూర్పు నియోజకవర్గంలోని పలు వార్డుల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు శుక్రవారం ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. భీమిలి నియోజవర్గంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో విశాఖ గర్జనకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. పరిపాలనా వికేంద్రీరణకు మద్దతుగా తగరపువలస పీఏసీఎస్‌లో సొసైటీ అధ్యక్షుడు అక్కరమాని రామునాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు సమావేశం అయ్యారు. చిట్టివలస బంతాట మైదానం నుంచి ర్యాలీగా విశాఖ గర్జనకు వెళ్లాలని తీర్మానించారు. - భీమిలి, తగరపువలసకు చెందిన వంద మంది ఆటో కార్మికులు భీమిలి నుంచి తగరపువలస వరకు మద్దతుగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పీఎం పాలెం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి కొమ్మాది కూడలి వరకు జగుపిల్ల నరేష్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. - విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో ఎన్ఏడీ యునైటెడ్ క్రైస్ట్ చర్చిలో, పలు విద్యా సంస్థల్లో, ఎన్ఏడీ టాసిన్ మసీదుల్లో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు పలకాలని కోరారు. - పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి రాంపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మూడు మండలాల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి విశాఖ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. - గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి ఆధ్వర్యంలో 65, 66, 67, 68, 75 వార్డుల్లో విద్యార్థులతో, అగనంపూడిలో మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, దేవాన్‌రెడ్డి, పల్లా చినతల్లి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. - అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శుక్రవారం నక్కపల్లిలో కాపు కార్పొరేషన్ డైరక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కళాశాల విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉపమాక రోడ్డు వరకు ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో విద్యార్థులతో కలసి మానవ హారం నిర్వహించారు. -
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను గౌరవిస్తాము: మంత్రి ధర్మాన
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండేందుకు విశాఖను ఒక రాజధానిగా చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బార్ ప్రతినిధులు ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను తాము గౌరవిస్తామని, కానీ రైతులను అడ్డం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ మాఫియాను మాత్రం సహించబోమని చెప్పారు. ఉత్తరాంధ్రవాసులు ఎప్పుడూ రాజధానికి దూరంగానే ఉన్నారని, ఇన్నాళ్లకు దగ్గరగా రాజధాని ఏర్పాటుకు అవకాశం వచ్చిందని, దాన్ని జారవిడుచుకోవద్దని చెప్పారు. ఉత్తరాంధ్రలో రాజధాని ఉంటే భావితరాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. అధికార వికేంద్రీకరణ అవసరాన్ని ఆ కమిటీ సూచించిందన్నారు. పెద్ద క్యాపిటల్ ఈ రాష్ట్రానికి పనికిరాదని చెప్పిందన్నారు. చంద్రబాబు అందుకు భిన్నంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత కమిటీ నివేదికల ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపారు. srikaరాజధాని ఏర్పాటుకు ముందు చంద్రబాబు దొనకొండ, నూజివీడు అంటూ రోజుకో పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాలకు అనుగుణంగా రాజధాని ప్రకటన చేశారని తెలిపారు. ఆ రోజు జీ టు జీ ఒప్పందం జరిగిందని చెప్పారని, కానీ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అది నిజం కాదని చెప్పారని అన్నారు. మన ప్రాంత ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని న్యాయవాదులు ఉద్యమాల్లో కీలక పాత్రను పోషించాలని కోరారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫల్గుణరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వాసుదేవరావు, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ నాయకులు ఎమ్మెస్ వినయ్ భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి పెట్టుబడిదారుల కోసం ఉత్తరాంధ్రులకు వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని, అందరికీ సమన్యాయం చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార వికేంద్రీకరణ తలపెట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేవలం తన అనుయాయులను పెత్తందారులను చేయడానికే చట్టబద్ధంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను చంద్రబాబు పక్కనబెట్టి నారాయణ, సుజనాచౌదరిల కమిటీ చెప్పిన అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరి సొమ్ముతో తమ మందిమాగధులకు మేలు చేసేది రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి సహా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ అమరావతి రైతుల ముసుగులోని పెట్టుబడిదారులు మాత్రం ఉత్తరాంధ్ర నాశనం అయిపోవాలని దేవుడికి మొక్కడానికి అరసవల్లి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి స్థానిక టీడీపీ నాయకులు మద్దతు పలకడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు. దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్‌ను కాపాడాల్సింది పోయి చంద్రబాబు ప్రయోజనాల కోసం పణంగా పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమన్నారు. గతంలో మాదిరిగానే ప్రజలు అమాయకులని వెన్నుపోటు పొడుద్దామంటే కుదరదని హెచ్చరించారు. వికేంద్రీకరణపై టీడీపీ విషప్రచారాన్ని వారే తిప్పికొడతారని, కుట్రల్లో భాగమైన పాదయాత్రను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. జెడ్పీ చాంబర్లో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. టీడీపీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని ఖండించారు. ఆ ప్రకటనల వెనుకనున్న అసలు విషయాన్ని వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... టీడీపీ ప్రచారం: భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినది మేమే. 400 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసేసుకుంది. వాస్తవ విషయం: విమానాశ్రయం కోసం గత టీడీపీ ప్రభుత్వం 2,750 ఎకరాలను జీఎంఆర్‌కు ఇస్తూ ఒప్పందం చేసుకుంది. ఆ భూసేకరణపై 150 వరకూ కేసులు హైకోర్టు విచారణలో ఉన్నా వాటిని పరిష్కరించకుండానే, ఓ ఒక్క నిర్వాసితుడికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండానే చంద్రబాబు ఎన్నికల ముందు ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసేశారు. అశోక్ గజపతిరాజు అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా ఏ ఒక్క అనుమతీ తీసుకురాలేదు. రైతులతో మాట్లాడి ఆ కేసులన్నీ ఉపసంహరింపజేసినదీ, నిర్వాసితులకు న్యాయం చేసినదీ, కేంద్రం నుంచి అనుమతులన్నీ తెచ్చినదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుంది. విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదనే జీఎంఆర్ నుంచి 547 ఎకరాలను ప్రభుత్వం వెనక్కుతీసుకుంది. ఐదు గ్రామాల నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం ఇచ్చింది. అన్ని సౌకర్యాలతో కాలనీలు సిద్ధం చేసింది. టీడీపీ ప్రచారం: గిరిజన యూనివర్సిటీకి టీడీపీ హయాంలోనే భూమి సేకరించేశాం. రూ.10 కోట్ల ఖర్చుతో కాంపౌండ్ వాల్‌నూ కట్టేశాం. వాస్తవ విషయం: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది. ఇతర రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలన్నీ గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ వాటి లక్ష్యాన్ని పక్కనబెట్టి టీడీపీ పాలనలో మైదాన ప్రాంతమైన కొత్తవలస మండలంలో స్థల సేకరణ చేశారు. సొంత కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రూ.10 కోట్లతో మంజూరు చేసిన చేసిన ప్రహరీ కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశంతో వారికి అందుబాటులో ఉండేలా సాలూరు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీపంలోనే రైలు, రోడ్డు, విమాన ప్రయాణ సదుపాయాలు ఉండేలా మెంటాడ మండలంలో సుమారు 500 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తే, కేంద్ర కమిటీ దానికి మొగ్గు చూపించింది. దీన్ని పార్లమెంట్లో ఆమోదం పొందేలా ప్రధానమంత్రి, కేంద్ర హోమ్‌మంత్రితో మాట్లాడి సాధించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. ఆ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ నియమించినదీ, తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అన్ని గిరిజన ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే ఆయన కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరుచేశారు. మరో మెడికల్ కాలేజీ త్వరలోనే పార్వతీపురం మన్యం జిల్లాకూ మంజూరు చేయనున్నారు. టీడీపీ ప్రచారం: అమరావతి రైతులకు మద్దతుగా అన్నివర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. పాదయాత్రకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టడం తప్ప ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. వాస్తవ విషయం: జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న అటు అశోక్‌కు తప్ప మిగతా టీడీపీ నాయకులెవ్వరికీ ఇక్కడ జరిగిన అభివృద్ధిపై అవగాహన లేదు. గణాంకాలు చూస్తే తెలుస్తుంది. టీడీపీ పాలనలో ఏమి జరిగిందో, వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను పూర్తి చేసింది వైఎస్సారే. కాలువ, మిగులు పనులకు ఇటీవలే రూ.125 కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనికి అడ్డంకిగానున్న సారిపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి రూ.77 కోట్లను కేటాయించినది మా ప్రభుత్వమే. వీటన్నింటినీ విస్మరించి వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలపై విషప్రచారం చేయడానికి టీడీపీ నాయకులకు తగదు. విశాఖ రాష్ట్ర పరిపాలన రాజధాని గాకుండా అడ్డుకోవడానికే జరుగుతున్న అమరావతి పాదయాత్రకు మద్దతు పలకడం సమంజసం కాదు. కాదని ఆ విధానానికే కట్టుబడి ఉంటే 2024 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజధాని వల్ల ఉత్తరాంధ్రకు ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలకు మేలు జరుగుతుంది. దాని కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. -
'విశాఖ రాజధాని'ని.. ఈసారి చేజార్చుకోం
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధిలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది.. 1956లో రాజధాని అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకూడదనే అందరం ఏకతాటిపైకి వచ్చామని ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వివరించారు. కుటిల బుద్ధితో చేస్తున్న పాదయాత్రని ఎలా స్వాగతించగలమని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనతో రాజధాని పోరు మొదలవుతుందనీ.. భవిష్యత్తులో నాన్ పొలిటికల్ జేఏసీ అన్ని సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తుందని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ లజపతిరాయ్ పునరుద్ఘాటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఎదురుచూస్తోంది 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రాంతాన్ని రాజధాని చెయ్యాలనే అంశంపై ఓటింగ్ జరిగింది. ఇందులో 61 మంది ఎమ్మెల్యేలు విశాఖపట్నం అని.. 58 మంది కర్నూలు అని ఓటువేశారు. 20 మంది ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. అప్పటికే కర్నూలుని రాజధానిగా చెయ్యాలని నిర్ణయించుకున్న నాటి ప్రభుత్వం.. 1956 ఏప్రిల్ 1 నుంచి విశాఖపట్నంని రాజధానిగా చేస్తామంటూ అసెంబ్లీ తీర్మానించింది. కానీ, ఇది అమల్లోకి రాకపోయినా.. అప్పటి నేతలు పోరాడలేకపోయారు. అప్పటినుంచి అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటికి సీఎం వైఎస్ జగన్ మరో అవకాశాన్ని కల్పించారు. దీన్ని వదులుకునే ప్రసక్తేలేదు. ఇప్పటికే రెండు తప్పులు చేశాం. మళ్లీ అమరావతిని మాత్రమే అభివృద్ధిచేస్తే.. చారిత్రక తప్పిదం అవుతుంది. ఇప్పుడైనా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులువేయకపోతే.. భవిష్యత్తులో మరోసారి విభజన ఉద్యమం తలెత్తక తప్పదు. కుటిల బుద్ధితో వస్తే ఎందుకు స్వాగతించాలి? కొందరు కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఎదగాలని.. మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదనే కుటిలబుద్ధితో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే దుర్మార్గపు ఆలోచనలతో వస్తే ఎందుకు స్వాగతించాలి. ఇక రాజధాని కోసం చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేసేందుకు నాన్‌పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. విశాఖలో రాజధాని ఏర్పాటయ్యేంత వరకూ పోరాటంచేస్తాం. 15న విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని చాటిచెబుతున్నాం. ఆ తర్వాత ప్రతి గ్రామంలోనూ విద్యార్థి నుంచి పింఛన్ తీసుకునే వృద్ధుల వరకూ.. వికేంద్రీకరణ తదనంతరం జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పిస్తాం. దూర ప్రస్తావన అప్రస్తుతం? విశాఖ రాజధాని అయితే.. భౌగోళికంగా మిగతా ప్రాంతాలకు దూరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నారు. కానీ, ఈ వాదనలో బలంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర సచివాలయంలో పనికోసం వచ్చే వారి శాతం 0.01 కూడా వుండదు. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చాక.. ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. అందుకే దూర ప్రస్తావన అప్రస్తుతమనే చెప్పాలి. ఇక గత కొన్ని దశాబ్దాలుగా అనేక రాష్ట్రాల్లో రాజధానులున్న ప్రాంతాల చుట్టుపక్కలున్న జిల్లాల తలసరి ఆదాయం, ఆయా జిల్లాల వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. మూడు రాజధానులవల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల సమన్వయ అభివృద్ధికి దోహదమవుతుంది. క్రమంగా జీడీపీ కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
‘రియల్ ఎస్టేట్’ను కాపాడుకునేందుకే యాత్ర
కొవ్వూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల ధరలు ఎక్కడ తగ్గిపోతాయో, తమ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న స్వార్థంతోనే అమరావతి పేరుతో వారు పాదయాత్ర చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. అమరావతి రైతుల యాత్ర ముసుగులో పచ్చమీడియా సహకారంతో ఒక బూటకపు యాత్ర చేస్తున్నారని.. కానీ, రాష్ట్రంలో ఎక్కడా ఈ యాత్రను ప్రజలు స్వాగతించడంలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పచ్చమీడియాను అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి సానుభూతి పొందాలని టీడీపీ ఆరాటపడుతోందన్నారు. ప్రజల్లో ఏదో రకంగా అలజడి సృష్టించి గొడవలు పెట్టుకునేందుకు రెచ్చగొట్టడం.. తద్వారా లబ్ధిపొందాలనే టీడీపీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదించినట్టు గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో అన్ని విధాలుగా నష్టపోయామని.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటుచేస్తోందని వివరించారు. -
ఉత్తరాంధ్ర కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
చోడవరం (అనకాపల్లి జిల్లా): విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో జరిగింది. ప్రమాదంలో యువకుడితో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఎంపీటీసీ సభ్యుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చోడవరం మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూడా పాల్గొన్నారు. బైక్ ర్యాలీ అనంతరం స్థానిక కొత్తూరు జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మానవహారంలో పాల్గొన్న పీఎస్‌పేటకు చెందిన సీహెచ్ శ్రీనివాసరావు అనే యువకుడు అకస్మాత్తుగా పక్కనే ఉన్న తన మోటారు సైకిల్‌ను తీసుకొచ్చి మానవహారం మధ్యలో పడేశాడు. అప్పటికే బాటిల్‌తో తెచ్చుకుని ఉన్న పెట్రోల్‌ను మోటారు సైకిల్‌పై, తన ఒంటిపై పోసుకున్నాడు. మానవహారంలో ఉన్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో పాటు మిగతా ఉద్యమకారులు పరుగెత్తుకుని వచ్చి అతని వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న అగ్గిపెట్టె వెలిగించి బైక్‌పై వేయడంలో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించగా అక్కడ ఉన్న ఉన్నవారంతా వారించి అతనిని దూరం లాక్కెళ్లి.. అతనికి అంటుకున్న మంటలను ఆర్పారు. ఘటనలో ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న చోడవరం–8వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు పుట్రేటి శ్యామ్‌ప్రసాద్‌కు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు పుల్లేటి అప్పారావు, పతివాడ అప్పారావులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసరావుతో సహా వీరందరినీ చికిత్స కోసం చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణత్యాగానికి సిద్ధం ఆత్మహత్యాయత్నం అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో వెనుకబడి ఉందని, తనలాంటి నిరుద్యోగులెందరో ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సిన దుస్థితి ఉందన్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలన్నదే తన కోరికని.. ఇందుకోసమే ప్రాణత్యాగానికి సిద్ధమైనట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మాట్లాడుతూ తమ సహనాన్ని పరీక్షించొద్దని, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు. ప్రజా ఉద్యమం ఉధృతం అవ్వకముందే అమరావతి పాదయాత్రను ఆపాలని డిమాండ్ చేశారు. -
ఉత్తరాంధ్రలో మిన్నంటిన వికేంద్రీకరణ నినాదం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మార్మోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ విధానానికి ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామం నుంచి మద్దతు లభిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు అన్ని వర్గాల వారు ఏకమై నినదిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు ఏకతాటిపై నిలిచి గర్జించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని తపన పడుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ పరిపాలన రాజధాని కావాలి ► విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా బీచ్ రోడ్డులో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సందర్శించారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలని ఆకాంక్షించారు. ► విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్లపాలెం జంక్షన్లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ► గాజువాక నియోజకవర్గంలోని బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అంతకు ముందు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతిలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు. 66వ వార్డులో కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ► భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పలు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలియజేశారు. ► విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గోపాలప ట్నం కుమారి కల్యాణమండపంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో బెహరా భాస్కరరావు విశాఖ గర్జన పోస్టర్ ఆవిష్కరించారు. గవర కమ్యూనిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 52వ వార్డు శాంతినగర్‌లో డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పలు సంఘాలతో సమావేశం నిర్వహించారు. శ్రీహరిపురం వైçష్ణవి ఫంక్షన్హాల్లో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతవాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారు. 59వ వార్డులో ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో అంబేడ్కర్ సేవా సంఘం సభ్యులు విశాఖ గర్జనకు సంఘీభావం తెలియజేశారు. ► పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట జంక్షన్లో నాన్ పొలిటికల్ పెందుర్తి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోనూ అదే జోరు ► పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి అడ్డురోడ్డు వరకు జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల నుంచి వందలాది మంది అన్ని వర్గాల వారు ఈ ర్యాలీకి తరలివచ్చారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు. ► వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో గంధవరం నుంచి చోడవరం వరకు 10 కి.మీ.. రావికమతం మండలంలో కొత్తకోట నుంచి రావికమతం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం కొత్తూర్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ► అనకాపల్లిలోని బెల్లం మార్కెట్లో వర్తకులు వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. -
Andhra Pradesh: ఉవ్వెత్తున ఉద్యమం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ విధానం గ్రామగ్రామాన నినదిస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలని తపిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మరోసారి ముక్కలు చెక్కలు కాకుండా సీఎం దూరదృష్టితో కాపాడుతున్నారంటూ ప్రజలంతా బాసటగా నిలుస్తున్నారు. అనవసర వ్యయాన్ని, పెనుభారాన్ని భరించే పరిస్థితిలో రాష్ట్రం ఏమాత్రం లేదని, అందుకే అన్ని సదుపాయాలున్న విశాఖ పరిపాలన రాజధాని కావాలని స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే సమన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే గర్జిస్తామంటూ మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చారు. మానవహారాలు, భారీ ర్యాలీలు, పూజలతో ప్రజల ఆకాంక్షను చాటి చెబుతున్నారు. విశాఖపట్నంలో ర్యాలీల హోరు విశాఖ నగరం సహా పలు ప్రాంతాల్లో బుధవారం భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో యువత, మేధావులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవీఎంసీ 77వ వార్డు నమ్మిదొడ్డి జంక్షన్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నినాదాలతో హోరెత్తించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వికేంద్రీకరణకు మైనారిటీ సంఘాలు మద్దతు పలికాయి. గోపాలపట్నం ప్రధాన రహదారిలో మసీదు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. విశాఖ పరిపాలన రాజధానిగా కావాలని కోరుతూ పెందుర్తిలో నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అదీప్‌రాజ్ పాల్గొన్నారు. వేపగుంట కూడలిలో వందలాది మందితో ర్యాలీ చేశారు. ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనలో అంతా పాల్గొనాలని కోరుతూ ప్రయాణికులకు, స్థానికులకు, పాదచారులకు, చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు. పరవాడ సినిమా హాలు కూడలిలో రాజకీయేతర జేఏసీ భారీ మానవహారం నిర్వహించి ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు అంటూ నినదించింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి మంత్రి గుడివాడ అమర్నా«ధ్, నగర మేయరు గొలగాని హరి వెంకటకుమారి హాజరయ్యారు. ఈనెల 15న జరిగే విశాఖ గర్జనకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానులకు మద్దతుగా గాజువాకలో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో.. పరిపాలనా రాజధానిగా విశాఖకు మద్దతుగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న పాన్‌షాప్ వద్ద మూడు రాజధానులే మేలంటూ ప్లెక్సీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో వెంకటేశ్వరస్వామి ఆర్చ్ నుంచి బుచ్చెయ్యపేట నాలుగు రోడ్ల జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బుచ్చెయ్యపేట జంక్షన్లో మానవ హారంగా ఏర్పడి మూడు రాజధానులు కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజదాని కోరుతూ బుచ్చింపేట నుంచి జె.పి.అగ్రహారం వరకు వివిధ అభివృద్ధి సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో.. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు రోజులుగా జరుగుతున్న రిలే దీక్షలు బుధవారంతో ముగిశాయి. నరసన్నపేటలో జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం సందర్శించారు. ఈ నెల 15న నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాఖ గర్జనకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో స్పీకర్ తమ్మినేని సీతారాం వికేంద్రీకరణ అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, విశాఖ రాజధాని సాధన కోసం యువత, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించారు. బాడంగి మండలం భీమవరంలో జరిగిన సదస్సులో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ విశాఖ గర్జనకు రావాలని పిలుపునిచ్చారు. బాడంగి మండలంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. అల్లూరి జిల్లాలో.. మూడు రాజధానులకు మద్దతుగా చింతపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మత్స్యరాస వెంకటలక్ష్మి 108 కొబ్బరి కాయలు కొట్టారు. 26 జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్‌కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడేలా దీవించాలని మొక్కుకున్నారు. -
‘అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు’
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదు. ఒక్కచోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలు వెనుకబడతాయి. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆవేదన కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. దీనిపై చంద్రబాబు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. కొన్ని వర్గాల అభివృద్ధి కోసమే అమరావతి రాజధాని ప్రతిపాదన. వనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా అందించాలి. గత అనుభవాలతో ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలి. అందరికీ న్యాయం జరగాలనే మూడు రాజధానుల నిర్ణయం. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. కొంత మంది చేతుల్లో ఉండే రాజధాని మనకు అవసరమా?. అన్ని ప్రాంతాల వారు నివసించే పరిస్థితి ఒక్క విశాఖలోనే ఉంది. అమరావతిలో వేరే వర్గం నివసించే పరిస్థితి లేదు. విశాఖకు పరిపాలన రాజధాని వస్తే మీకు వచ్చిన నష్టమేంటి?. ఉత్తరాంధ్రకు ఒక్కసంస్థనైనా చంద్రబాబు తీసుకువచ్చారా?. టీడీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారు. విశాఖలో సెంటిమెంట్ లేదని అంటారా.. అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు. -
రాజధాని కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ)/ఆనందపురం (విశాఖపట్నం)/నక్కపల్లి/ఇరగవరం: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో మంగళవారం భారీ పాదయాత్ర జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు కదంతొక్కారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మత్స్యకార డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లవరపు జాన్‌వెస్లీ, మత్స్యకారుల వేషధారణలో పలువురు నాయకులు, ప్రజలు ఉత్సాహంగా కదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ విశాఖపట్నం రాజధాని కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు రాజధానులకే తమ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని, మూడు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని పేర్కొన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, జేఏసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనందపురం జంక్షన్‌లోని జాతీయ రహదారిపై బైఠాయించి విశాఖ రాజధాని మా హక్కు అంటూ నినదించారు. అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డులో వెంకటేశ్వర కల్యాణమండపంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు డాక్టర్లు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు పాల్గొన్నారు. 3 రాజధానుల కోసం తీర్మానం చేస్తాం: మేయర్ విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి తెలిపారు. నవంబర్ 4న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానం ఆమోదిస్తామని చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఆమె మాట్లాడారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ ప్రాంతంలో సమాధి అవుతాయని ఆమె చెప్పారు. -
విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు
సొంత ప్రాంతంపై ఎటువంటి వారికైనా మమకారం ఉంటుంది. తమ ప్రాంత ప్రగతికి అవకాశం వస్తే హర్షిస్తారు.. స్వాగతిస్తారు.. సహకరిస్తారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిలో అవేవీ మచ్చుకైనా లేవు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప తన ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదన్నట్లు విర్రవీగుతున్నారు. పదవులు ఇచ్చిన అధినేత మోచేతి నీళ్లు తాగుతూ.. వారి పన్నాగాలకు వంతపాడుతూ సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి బాటలు వేసే విశాఖ రాజధానికి అడ్డం పడుతూ.. విషం కక్కుతున్నారు. అమరావతే అజెండాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెగేసి చెబుతూ ఉత్తరాంధ్రకు ద్రోహం తలపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలు బాగు కోరకుండా.. విశాఖ రాజధాని వద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలు మండి పడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని గెలిపించి తప్పు చేశామని టెక్కలి నియోజకవర్గ ఓటర్లు అంతర్మథనం చెందుతున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో అమరావతి రాజధానిగానే తాను ఎన్నికలకు వెళ్తానని అచ్చెన్నాయుడు ఓటర్లకు సవాల్ విసురుతున్నారు. ప్రజల కంటే తమ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, అమరావతిలో వారికున్న భూములే ముఖ్యమని చెప్పకనే చెబుతున్నారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కోరుతున్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి తమ గళం విప్పుతున్నారు. కానీ టీడీపీ నేతలకు మాత్రం ఇది రుచించడం లేదు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానికైనా సిద్ధమవుతున్నారే తప్ప అమరావతిని వదులుకునేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ రైతుల యాత్రకు మద్దతునిస్తూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. జిల్లాలో అచ్చెన్నాయుడు అండ్ కో తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. దద్దమ్మలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా మూడు రాజధానుల కోసం తాము రాజీనామా చేస్తాం.. అమరావతి కోసమని రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడుకు సవాల్ కూడా విసురుతున్నారు. (క్లిక్: జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి) ఓట్లేసిన ప్రజలు దద్దమ్మలా... మీకు ఓటేసినందుకు ప్రజలు దద్దమ్మలా కన్పిస్తున్నారా.. అచ్చెన్నాయుడు? చంద్రబాబు పంచన చేరి ఆయన చెప్పిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెలుగుదేశం నాయకులంతా ప్రయత్నిస్తున్నారా? ఇంతకాలం వివిధ సందర్భాల్లో రాజధాని పేరిట జరిగిన ఏర్పాటులో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలే బుద్ధి చెబుతారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖను పాలనా రాజధానిగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి ఇక్కడి టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించాల్సింది పోయి వ్యతిరేకించడం దారుణం. చంద్రబాబుతో సహా ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులంతా అభివృద్ధి నిరోధకులు. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. నరసన్నపేట: మూడో రోజు రిలే దీక్షలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రజల మనోభావాలతో అచ్చెన్న ఆటలు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అచ్చెన్నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాకుండా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అచ్చెన్నాయుడు తాపత్రయపడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలడా..! టెక్కలి: వికేంద్రీకరణకు మద్ధతుగా నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆత్మ సాక్షిగా ముందుకు సాగాలి.. ఉత్తరాంధ్ర నాయకులు ఆత్మసాక్షిగా ముందుకు సాగాలి. ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలి. విశాఖపట్నం రాజధానిగా అవకాశం లభించింది. ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు వైస్ చాన్స్‌లర్, ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ అభిమానం అందరికీ ఉంటుంది మన ప్రాంతం అన్న అభిమానం అందరికీ ఉంటుంది. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతున్నారు. పార్టీకి సైతం నచ్చజెప్పేలా నాయకులు ఉండాలి. ఉత్తరాంధ్ర ప్రగతికి విశాఖపట్నం రాజధాని కావటం మంచి అవకాశం. దీన్ని స్వాగతించాలి. – ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పూర్వపు రిజిస్ట్రార్ -
వికేంద్రీకరణ కోసం చేయిచేయి కలిపి..
వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. – టెక్కలి చైతన్యదీపం వెలిగించి.. వికేంద్రీకరణకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమై పాటిమీద సెంటర్, ఓవర్ బ్రిడ్జి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, గణపతి సెంటర్ల మీదగా పార్టీ కార్యాలయం వద్దకు చేరకుంది. ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. – నిడదవోలు -
పవన్ నోట పూటకో మాట!
మరో ఉద్యమం రాదా? ‘కేవలం రాజధాని (అమరావతి) చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర ఏం కావాలి? రాయలసీమ ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి? తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా ఇంకో ఉద్యమం రాదా?’ – 2018లో గుంటూరు జిల్లాలో పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు ఎందుకీ గర్జన..? ‘విశాఖలో ఎందుకీ గర్జన? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? వలసలు ఆపలేకపోయినందుకా? రుషికొండను ధ్వంసం చేసి మీకోసం భవనం నిర్మిస్తున్నందుకా? వైఫల్యాలు దాచేసి కులాల మధ్య చిచ్చు రేపినందుకా? విద్యుత్ చార్జీలు భారీగా పెంచినందుకా?’ – తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్లు సాక్షి, అమరావతి: కేవలం అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏం కావాలని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశ్నలు కురిపించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖ గర్జన సభపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో పవన్ జనసేన బహిరంగ సభలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లు వైరల్ అవుతున్నాయి. పవన్ మాట ఎందుకు మారుస్తున్నారంటూ పలువురు రీ ట్వీట్ చేశారు. మీపై ఏమి ప్రభావం చూపాయో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. 15 నుంచి పవన్ విశాఖ పర్యటన పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది. 15, 16, 17వ తేదీల్లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. 16న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి బొత్స హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే నినాదంతో జేఏసీ ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మహానేత వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చంద్రబాబు ప్రాంతీయ విభేదాలు తేవాలని చూస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దోపిడీకి అడ్డుపడుతున్నారనే బాధ చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అచ్చెన్నాయుడు ఎందుకు వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు ఏం చేశారని నిలదీశారు. అచ్చెన్నాయుడు పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ వాళ్ళు సహనం కోల్పోతున్నారని.. ఎల్లో మీడియాతో కలిసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో పేదలకు పెట్టిన ఒక మంచి పథకమైన అచ్చెన్నాయుడు చెప్పాలని, కనీసం అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టు అయిన కట్టించారా అని ప్రశ్నించారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రారంభించింది వైఎస్సార్. హెల్త్ సిటీని తీసుకువచ్చింది రాజశేఖర రెడ్డి. బ్రాండేక్స్ కంపెనీ తీసుకువచ్చింది మహనేతనే. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఏపీలోని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నారు. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు తెలిసిన వారు టీడీపీ నేతలు. మన సీఎంకు అటువంటి మాయలు తెలియవు’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చదవండి: ఎన్టీఆర్ చావుకు కారణమైన వారిని తరిమికొట్టాలి: కొడాలి నాని -
‘విశాఖను పరిపాలన రాజధానిగా ఆపే ధైర్యం ఎవరికి లేదు’
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ సాధనకై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మేధావులు, ఉద్యోగులు, వివిధ రంగా నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, మేధావులు, వివిధ రంగాలు నిపుణులు ఏమన్నారంటే ► సమావేశం సందర్భంగా పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం. ►పరిపాలన రాజధానిగా చేయడాన్ని స్వాగతిస్తున్నాం ►ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలని అరసవల్లి పాదయాత్ర చేస్తారా? ►రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ►విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ►విశాఖను పరిపాలన రాజధానిగా కాపాడుకొనేందుకు ఎటువంటి త్యాగలుకైనా సిద్ధం. ►వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు, అయ్యన్న, బండారుకు తగిన బుద్ధి చెబుదాం. ►ఉత్తరాంధ్ర ప్రజలు మనస్ఫూర్తిగా విశాఖను పరిపాలన రాజధానిగా కోరుకుంటున్నారు. ►లక్షలు కోట్ల పెట్టి ఖర్చు అమరావతి నిర్మించడానికి డబ్బులు ఎక్కడివి? ►హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పది ఏళ్ళ సమయం ఉన్న ఎందుకు చంద్రబాబు అమరావతి వచ్చారు? ►ఈ నెల 15 తేదీన జరిగే విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం. ►విశాఖను పరిపాలన రాజధానిగా ఆపే ధైర్యం ఎవరికి లేదు. -
జనం చూపు వికేంద్రీకరణ వైపు
సాక్షి, పాడేరు/నిడదవోలు: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అఖిలపక్ష నేతలు, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాడేరులోని ప్రభుత్వ కాఫీ అతిథి గృహం సమావేశ మందిరంలో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో, నిడదవోలులోని రోటరీ ఆడిటోరియంలో విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు వికేంద్రీకరణకే జై కొట్టారు. పాడేరులో గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, గ్రూప్–1 రిటైర్డ్ అధికారి ఓండ్రు రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా అల్లూరి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు పోరాటానికి ముందుకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలో జిల్లాలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి, వికేంద్రీకరణకు మద్దతుగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యం. దేశంలో అనేక ప్రాంతాల ప్రజలు తమ రాష్ట్రాల్లో వికేంద్రీకరణను కోరుకుంటున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తున్నాను. – గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ జార్ఖండ్‌లో నాలుగు రాజధానులు.. ఏపీలో వికేంద్రీకరణకు సీఎం జగన్ కట్టుబడి ఉండడంతో అభినందిస్తూ జార్ఖండ్ సీఎం కూడా ఆ రాష్ట్రంలో వికేంద్రీకరణకు సిద్ధమవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో నాలుగు ప్రధాన పట్టణాలను గుర్తించి నాలుగు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మూడు రాజధానుల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. గిరిజన ప్రాంతాల ప్రజలంతా మూడు రాజధానులను కోరుకుంటున్నారు. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే నిడదవోలులో వికేంద్రీకరణకు మద్దతు తెలియజేస్తున్న నాయకులు, మేధావులు విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. అమరావతిలో కొంత మంది రైతులు చేస్తున్న అమరావతి రాజధాని ఉద్యమం వెనుక అనేక కుట్రలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్‌ను ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వెనుకబడి పోయాయి. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. – చెట్టి పాల్గుణ, అరకులోయ ఎమ్మెల్యే వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడం తగదు రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఓర్వలేక చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ముంపు గ్రామాలను పట్టించుకోని చంద్రబాబు అమరావతిలోని రైతుల కోసం మాత్రమే మాట్లాడడం దారుణం. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును గిరిజనులంతా స్వాగతిస్తున్నారు. – నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే ఒక్క రాజధానితో బాబుకే లాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితమైతే మిగిలిన ప్రాంతాలు నష్టపోతాయి. అమరావతి వల్ల చంద్రబాబు, ఆయన అనుచర గణానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది. 5 వేల ఎకరాలు రాజధాని కోసం సరిపోతుంది. అయితే చంద్రబాబు 35–40 వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. రైతులు నష్టపోకూడదని సీఎం జగన్ అక్కడి రైతులందరికీ కౌలు ఇస్తున్నారు. – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే వికేంద్రీకరణతోనే సుపరిపాలన వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు తన బినామీల సౌలభ్యం కోసం అమరావతి పాదయాత్ర చేయిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే టీడీపీ నాయకులు, వారి వర్గీయులు భూములు కొన్నారు. ఇప్పుడు వారు నష్టపోకూడదనే దొంగ యాత్రలకు శ్రీకారం చుట్టారు. – భూపతి ఆదినారాయణ, మున్సిపల్ చైర్మన్, నిడదవోలు చంద్రబాబు నాటకాలు ప్రజలకు తెలుసు అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. నాడు అమరావతికి భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకత చూపారు. వారిని చంద్రబాబు మోసం చేశారు. ఒకే రాజధాని ఏర్పాటు చేయడం కన్నా మూడు రాజధానులు ఏర్పాటు చూస్తే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి. – బూరుగుపల్లి సుబ్బారావు, తూర్పు గోదావరి జిల్లా రైతు సలహా మండలి చైర్మన్ టీడీపీ దొంగ నాటకాలు ఆపాలి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్టంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందడానికి ఇదే సరైన మార్గమని అందురూ మద్దతు తెలుపుతున్నారు. కొందరు టీడీపీ నాయకులు, నకిలీ రైతులు స్వార్థ కోసమే అమరావతి పోరాటం చేస్తున్నారు. ఇకనైనా టీడీపీ నాయకులు దొంగ నాటకాలను ఆపాలి. – ఎస్కే వజీరుద్దీన్, మైనారిటీ నాయకుడు, నిడదవోలు -
వికేంద్రీకరణే విశాఖ వాణి
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా, కేంద్రీకరణకు వ్యతిరేకంగా విశాఖ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ నెల 15న భారీ ర్యాలీ నిర్వహించాలని నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. అన్ని వర్గాల వారు పాల్గొనే ఈ ర్యాలీని నగరంలోని డాబా గార్డెన్స్ అంబేడ్కర్ జంక్షన్ నుంచి చేపట్టనున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డాక.. శనివారం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. వికేంద్రీకరణకు మద్దతుగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావులు ఈ సమావేశంలో ప్రకటించారు. జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, పారిశ్రామిక, విద్యావేత్తలు, ఉద్యోగ, కార్మిక, న్యాయవాద సంఘాల నేతలు, జర్నలిస్టు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత లజపతిరాయ్ మాట్లాడుతూ.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. విశాఖ పాలనా రాజధాని అయ్యేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ దేవుడు మాట్లాడుతూ అసమానతలతో కూడిన కేంద్రీకరణ వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారని, అందుకే ఆర్థిక, సామాజిక వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. ఇందుకు హైదరాబాదే ఉదాహరణ అన్నారు. కేంద్రీకరణతో నష్టాలు, వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం అమలు కాకుండా ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయని, వాటిని సమైక్యంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, విశాఖ పాలనా రాజధాని కోసం స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్ఎస్ శివశంకర్ సూచించారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యే ఎస్కే రెహమాన్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధి ఎస్.రవీంద్ర, ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మత్స్యకార నేత శాంతారాం, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు సీహెచ్ వెంకట్రావు, విజయ్‌కుమార్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి కారుమూరి, వంక రవీంద్రనాథ్, తదితరులు ఉప్పెనలా తరలిరావాలి ఈనెల 15 విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ప్రజలు ఉప్పెనలా తరలి వచ్చి, తమ ఆకాంక్షను తెలియజేయాలి. ఆదివారం నుంచి మండల, వార్డు, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి విశాఖ పాలనా రాజధాని ఆవశ్యకతను అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయాలి. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అవసరమైతే రాజీనామా చేస్తా విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి మద్దతుగా అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సంపద అంతా అమరావతిలోనే కేంద్రీకృతమైతే భవిష్యత్తులో ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రైవేటు భూములు అవసరం లేదు. ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన సమయంలోనే విశాఖను రాజధానిగా చేయాల్సింది. కానీ చంద్రబాబు స్వార్థంతో చేయలేదు. – అవంతి శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నా.. మూడు రాజధానులకు మద్దతుగా నేను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సిద్ధం చేశాను. దానిని జేఏసీ చైర్మన్ లజపతిరాయ్‌కు అందజేస్తున్నా. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తన పదవికి రాజీనామా చేయాలి. అప్పుడు ఎన్నికలకు వెళదాం. ఆ ఎన్నికల్లో గెలిచిన వారి నిర్ణయాన్ని ప్రజల మనోభావాలుగా గుర్తించడానికి టీడీపీ సిద్ధమా? – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే హేలన, సవాళ్లతో యాత్రలా? అమరావతి రైతుల పేరిట చేస్తున్న పాదయాత్రలో ఉత్తరాంధ్ర వాసులను హేలన చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. పాదయాత్ర అంటే ఇలా చేస్తారా? టీడీపీ సహా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్రకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టిస్తున్న వారికి మన నిరసన తెలపాల్సిందే. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ అత్యధికులు వికేంద్రీకరణ వైపే మొగ్గు రాష్ట్రంలో 75 శాతం మంది వికేంద్రీకరణకే మొగ్గు చూపుతున్నారు. కేవలం 5 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. 20 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 80 శాతం మంది అనుకూలంగా, 15 శాతం మంది తటస్థంగా, 5 శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించాలి. విశాఖ రాజధాని అయితే రాష్ట్రమంతటికీ మేలు జరుగుతుంది. – బాలమోహన్‌దాస్, ఏఎన్‌యూ పూర్వ వైస్ ఛాన్సలర్ బాబు నేతృత్వంలోనే పాదయాత్ర చంద్రబాబు నేతృత్వంలోనే అమరావతి రైతుల పేరిట పాదయాత్ర జరుగుతోంది. అమరావతే అభివృద్ధి చెందాలని పనిగట్టుకుని ఎల్లో మీడియా అదేపనిగా వారికి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తోంది. ఏపీకి ఆర్థిక పరిపుష్టి వికేంద్రీకరణతోనే సాధ్యం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల వారంతా చాలా నష్టపోతారనడంలో సందేహం లేదు. – కేకే రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ -
మూడు రాజధానుల కోసం.. ముందడుగు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాల సమగ్రా భివృద్ధి సత్వర రీతిలో సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు. గతంలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల ఏ రీతిన నష్టపోయామో కళ్లారా చూశామని, ఇకపై అలాంటి తప్పిదం చోటుచేసుకోకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని విధాలా మద్దతుగా నిలుస్తామని ఊరూ వాడా ఎలుగెత్తి చాటుతున్నారు. కేవలం 29 గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తూ పాదయాత్ర పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న టీడీపీ తీరును ఎండగడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీలు.. దీక్షలు.. పూజలు.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ప్రజలు తమ వాణి వినిపిస్తున్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి ముందుకు కదలండని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రశ్నల బాణాలు సంధిస్తున్నారు. నాతవరం/అనకాపల్లి రూరల్/తణుకు అర్బన్/ ఇరగవరం/ అత్తిలి/ప్రొద్దుటూరు: రాష్ట్రాన్ని విడదీసేందుకు చంద్రబాబు కుట్రలో భాగంగా సాగుతున్న అమరావతి పాదయాత్రను ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం ఆయన వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పి.జగ్గంపేట నుంచి 1500 బైక్‌లతో గన్నవరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చేపట్టిన ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర వచ్చే సమయానికి నర్సీపట్నం ప్రాంతంలో రౌడీలతో అల్లర్లు సృష్టించేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుట్ర పన్నారని, దానిని అందరూ కలిసి తిప్పికొట్టాలని ఎమ్మెల్యే గణేష్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడిలో మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. గిరిజనులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, విద్యార్థులు, యువతీ యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కాగా, పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమనేది తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శుక్రవారం జరిగిన అనకాపల్లి మండల పరిషత్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, జెడ్పీటీసీ వరలక్ష్మి హాజరయ్యారు. తణుకులో కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న గుబ్బల తమ్మయ్య, పార్టీ శ్రేణులు వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. తణుకులో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, తణుకు మండల అధ్యక్షుడు పోలేపల్లి వెంకట ప్రసాద్, ఇరగవరంలో పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, అత్తిలిలో ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి భరణీ ప్రసాద్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేవుడా.. బాబుకు మంచి బుద్ధి ప్రసాదించు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పెన్నానది ఒడ్డునున్న అమృతేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. -
తెలంగాణలో కూడా మూడు రాజధానులు ఉండాలి : ప్రొపెసర్ వినోద్
-
ప్రజల ఆశ, శ్వాస మూడు రాజధానులే
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశ, శ్వాస మూడు రాజధానులేనని వైఎస్సార్సీపీ నాయకులు పునరుద్ఘాటించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బద్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదిచెన్నకేసవవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మూడు రాజధానులకు మద్దతుగా 101 టెంకాయలు కొట్టారు. వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధిచెందుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా కడపలోని ఎర్రముక్కపల్లెలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో వైఎస్సార్సీపీ నాయకులు 101 టెంకాయలు కొట్టి , ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, టీఎస్సార్, ఎన్. సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, శ్యాంసన్ పాల్గొన్నారు. పులివెందులలోని అంకాలమ్మ గుడిలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికేంద్రీకరణ కావాలని కోరుతూ కమలాపురంలో వైఎస్సార్సీపీ నాయకులు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. పెండ్లిమర్రి వీరభద్ర స్వామి ఆలయంలో మండల కన్వీనర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరపునాయినిపల్లెలోని అభయాంజనేయస్వామి ఆలయంలో మండల కన్వీనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టారు. -
AP: వికేంద్రీకరణే ముద్దు
సాక్షి నెట్వర్క్: ఒకే ప్రాంతంలో అభివృద్ధిని కేంద్రీకరించడం తగదని, వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటయ్యేందుకు అడ్డుగా ఉన్న విఘ్నాలను తొలగించాలని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు బుధ, గురువారాల్లో ఆలయాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాల మేరకు పాలనా వికేంద్రీకరణకు అమ్మవారి ఆశీస్సులు కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీకనకదుర్గమ్మ, తిరుపతిలోని గంగమ్మ, శ్రీశైలంలో భ్రమరాంబ, విజయనగరంలో పైడి తల్లి, విశాఖలో కనక మహాలక్ష్మీ ఆలయాలతో పాటు ఇతర ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. గుంటూరులోని పోలేరమ్మ గుడి వద్ద 303 కొబ్బరికాయలు కొడుతున్న ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, స్థానికులు నియోజకవర్గ స్థాయిలో ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, అందుకు పాలనా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని ఇందుకోసం దుర్గమాత ఆశీస్సులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉండాలని వారు ఆకాంక్షించారు. మూడు రాజధానులకు అడ్డు పడుతున్న వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు పూజలు నిర్వహించారు. ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సన్నిధిలో కొబ్బరికాయ కొడుతున్న మంత్రి వేణుగోపాల్ విఘ్నాలు తొలగించమ్మా.. ► ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మంత్రి జోగి రమేష్ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్దికి కలిగే విఘ్నాలు, ఆటంకాలు పోవాలని, దుష్టశక్తులు కలిగించే విఘ్నాలు తొలగిపోవాలని దుర్గమ్మను ప్రార్థించానన్నారు. మంత్రి రోజా రాజగోపురం ఎదుట 108 కొబ్బరి కాయలు కొట్టారు. వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానన్నారు. ► వేమూరు నియోజకవర్గంలోని చుండూరులో శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మేరుగ నాగార్జున, రేపల్లెలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు పూజలు నిర్వహించారు. ► విశాఖపట్నం, అమరావతి, కర్నూలు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు వేగవంతంగా జరిగేలా దీవించాలంటూ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లిలో నూకాంబిక దేవాలయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తణుకు మండలం సజ్జాపురంలోని శ్రీఏవుళ్లమ్మ తల్లి ఆలయంలో కొబ్బరికాయలు కొడుతున్న మంత్రి కారుమూరి ► విశాఖను పరిపాలనా రాజధాని చెయ్యాలంటూ వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు కేవీ బాబా, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ.రెహమాన్, ఐ.హెచ్.ఫరూఖ్ అక్కయ్యపాలెం మెయిన్రోడ్లోని తాజ్‌బాగ్ దర్గాలో చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ► శ్రీకాకుళంలోని ఏడురోడ్లు కూడలి వద్ద దుర్గాదేవి ఆలయంలో, బలగలోని శ్రీ బాల త్రిపుర కాల భైరవ ఆలయంలో, గైనేటి వీధి నీలమ్మ తల్లి ఆలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి శ్రీ పాల పోలమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. దుర్గమ్మ సన్నిధిలో టెంకాయలు కొడుతున్న మంత్రి రోజా ► విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకరు కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు శ్యామలాంబ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ► ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆలయాల వద్ద పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గంలో పూజలు నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్ ర్యాలీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొబ్బరి కాయలు కొట్టారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 3 రాజధానులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ► తూర్పుగోదావరి జిల్లా చాగల్లులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ కొబ్బరికాయలు కొట్టారు. తునిలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సన్నిధిలో మంత్రి వేణు వేపాలకృష్ణ కొబ్బరికాయలు కొట్టారు. ► తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డెప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతలో మల్లాలమ్మ ఆలయం వద్ద టెంకాయ కొడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ► కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం గూళ్యం గ్రామంలోని గాదిలింగేశ్వరస్వామికి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 101 కొబ్బరి కాయలు కొట్టారు. కర్నూలు వినాయక ఘాట్‌లో కర్నూలు, నంద్యాల ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పూజలు నిర్వహించారు. వికేంద్రీకరణకు మద్దతుగా నంద్యాల జిల్లా అయ్యలూరు మసీదులో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా ప్రార్థనలు చేశారు. -
మూడు రాజధానులకు మద్దతుగా ప్రత్యేకపూజలు
-
Dharmana Prasada Rao: వికేంద్రీకరణతోనే సమన్యాయం
స్వతంత్రం రాక ముందు మద్రాస్‌కు, స్వాతంత్య్రం వచ్చాక కర్నూలుకు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్‌కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. పరిపాలనా వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాల వాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. అలా ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పాలనా రాజధానిగా త్వరగా, తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు. జూన్ 2, 2014. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తేదీ. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తూ భారతదేశ పార్లమెంట్ చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’ (రీ–ఆర్గనైజేషన్ యాక్ట్, 2014) అమలులోకి వచ్చిన రోజు. ఈ చట్టం చేసే ముందు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విధివిధానాల పరిశీలన కోసం కేంద్ర ప్రభు త్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2010 ఫిబ్రవరి నుంచి ఉమ్మడి రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటించింది. పది నెలలు పర్యటించి చేసిన అధ్యయనంలో వివిధ అంశాలను ప్రస్తా విస్తూ నివేదికను సమర్పించింది. తొలుత రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరడానికి అంగీకరించకపోవడం, ఆ తర్వాత 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఆర్థిక, సామాజిక పరిపాలనా అంశాల్లో కొన్ని భద్రతలు కల్పించడంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఒకటి కావడం, ఆ తర్వాత తెలంగాణతో కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడం వంటి పరిణామాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5లో హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ఉండి, ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగు తుందని, ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుందని పేర్కొ న్నారు. సెక్షన్ 6లో కేంద్ర ప్రభుత్వం నియమించే నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలు నాటి నుండి ఆరు నెలల లోపు ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని కోసం వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసి తగిన సూచనలు, సిఫారసులు చేస్తుందని ఉంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించి, కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ రతన్ రాయ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సైన్స్ అండ్ పాలసీ డైరెక్టర్)ను, సభ్యులుగా ఆరోమార్ రెవి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్), శ్రీ జగన్ షా (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్), ప్రొఫెసర్ కె. రవీంద్రన్ (న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్)లను నియమించింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ఈ కమిటీకి అపార అనుభవం ఉంది. ఈ కమిటీ రాష్ట్రంలో 11 జిల్లాలు పర్యటించి ప్రజలను ప్రజా సంఘాలను కలిసింది. వారితో సంప్రదింపులు జరిపింది. వారి సూచనలు, సలహాలు తీసుకుంది. 4728 ప్రజా విజ్ఞప్తుల్ని పరిశీలించి వాటన్నింటినీ క్రోడీకరించింది. 187 పేజీలతో తన నివేదికను నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ‘‘హైదరాబాద్‌లో కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు; మంత్రిత్వ శాఖల కేంద్రీకరణకు అనేక సంవత్సరాలు పట్టింది. అన్నేళ్లుగా రాజధాని పేరిట హైదరాబాద్‌లో జరిగిన ఈ కేంద్రీకృత అభివృద్ధే విభజన డిమాండ్‌కు కీలకాంశం. కాబట్టి ఒకే ఒక పెద్ద రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధ్యం కాదు’’ అని ఆ నివేదికలో కమిటీ అభిప్రాయపడింది. అలాగే గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా నిర్మాణం మొదలు పెట్టడం) రాజధాని కూడా ఆమోదయోగ్యం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆనాటి ప్రభుత్వం ఈ సూచనను పట్టించుకోలేదు. పైగా అత్యంత విచారకరమైన విషయమేమిటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో భూలభ్యత గురించి అడిగినప్పుడు ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించకపోవడం! అసలు కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఒక అభిప్రాయానికొచ్చి విభజన చట్టానికి వ్యతిరేకంగా తానే ఒక కమిటీ నియమించుకుంది. అర్హతలూ, అనుభవం, నైపుణ్యం ఏ మాత్రం లేని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కమిటీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. అందులో సభ్యులుగా ఉన్న వారిని చూస్తే వారి ఆలోచన, సామర్థ్యం, రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదనుకునే బాధ్యతా రాహిత్యం, ఇతర ప్రాంతాల అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతుంది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్, బొమ్మిడాల శ్రీనివాస్, జీవీకే సంజయ్ వంటివారు ఆనాటి కమిటీ సభ్యులు. రాజ్యాంగబద్ధంగా, శాసన సమ్మతంగా ఏర్పాటైన శివరామ కృష్ణన్ నివేదికను తొక్కిపెట్టి, ఏ చట్టంలోనూ పేర్కొనని నారాయణ కమిటీని అడ్డం పెట్టుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించారు! దాని కోసం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) చట్టం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య. రాజ్యాంగ సభలో 1949 మే 27న ‘రాజధాని ఎక్కడ ఉండాలి?’ అనే విషయంపై చర్చ జరిగినా, రాజ్యాంగంలో ప్రస్తావన జరగలేదు. రాజధాని ఒకటే ఉండాలని గాని, ఒకే చోట ఉండాలి గాని ఎక్కడా నిర్దేశించలేదు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలు ఒకేచోట ఉండాలని నిర్ణయించలేదు. ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి అనుకూల మని భావించిన చోట పార్లమెంటును సమావేశపరిచే అధికారం ఉంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోర్టు విచారణలు ఎక్కడ జరపాలో నిర్ణయించే అధికారం ఉంది. వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు సూచించమని రిటైర్డ్ అధికారి నాగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానత లను దృష్టిలో పెట్టుకొని పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర సమగ్రా భివృద్ధిని సూచిస్తూ తన నివేదికను 2019 డిసెంబర్ 20న ప్రభుత్వానికి సమర్పించింది. ఆ కమిటీ నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. సెక్రటేరియట్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సమ్మర్ అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్ విశాఖపట్నంలో; రాష్ట్ర శాసన సభ, హైకోర్ట్ బెంచ్, మినిస్టర్స్ క్వార్టర్స్ అమరావతి, మంగళగిరిల్లో; హైకోర్ట్ ప్రిన్సిపల్ సీట్, సంబంధిత కోర్టులు కర్నూలులో పెట్టాలని సూచించింది. అసలు ఈ పరిపాలన వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాలవాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. ఆ ఆకాంక్షలు, కోరికలు తీరే రోజులు సమీపిస్తున్నాయని పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పరిపాలన రాజధానిగా అతి త్వరగా తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు. రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల్లో ఇతర రాష్ట్రాలు, దేశాలతో విశాఖపట్నం అనుసంధానం కలిగి ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలమైనది. అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాలలోని చాలా కంపెనీలు విశాఖపట్నంలో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. విశాఖపట్నం మొదటి నుంచీ జీడీపీకి కీలక వాటాను అందిస్తున్నా తిరిగి తగినంత ప్రభుత్వ నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామని ప్రశ్నించుకుంటే... చుట్టూ తిరిగి, తెలుగుదేశం ఐదేళ్లు పాలన ఒక కల లాగే మిగిలిపోయి, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 6 ముందు నిలబడ్డాం. మన ముందు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం శివరామకృష్ణన్ రిపోర్ట్ ఉంది. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలంటే వికేంద్రీకరణ ఒకటే సూత్రమనే తారకమంత్రం వినిపిస్తోంది. సమాన అభివృద్ధి అనే విధానాన్ని పట్టిం చుకోకపోతే భవిష్యత్తు పట్ల యువత ఆశలు కునారిల్లిపోతాయి. ప్రజా స్వామ్య ప్రభుత్వంపట్ల విశ్వాసం సన్నగిల్లిపోతుంది. స్వతంత్రం రాక ముందు నుండి మద్రాస్‌కు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్నూ లుకు, ఏపీ ఏర్పడ్డాక హైదరాబాద్‌కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. -వ్యాసకర్త: ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి -
3 రాజధానులకు మద్దతుగా ప్రత్యేక పూజలు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ)/ఇచ్ఛాపురం రూరల్/చినగంజాం: మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ, వాటికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం ఆలయాల్లో కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖపట్నం పెదవాల్తేర్‌లోని శ్రీకరకచెట్టు పోలమాంబ ఆలయంలో అమ్మవారికి వీఎంఆర్డీఏ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని పూర్ణామార్కెట్ వెలంపేటలోని దుర్గాలమ్మ ఆలయంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు నేతృత్వంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పూజలు చేసి వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జింక్ ఆంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నర్తు రామారావుయాదవ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న జిల్లా టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బాపట్ల జిల్లా వంకాయలపాడులోని సంతానవేణుగోపాలస్వామి ఆలయంలో జెడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భవనం శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు. -
రాష్ట్ర సమగ్రాభివృధ్దికి అదే ఏకైక మంత్రం: సజ్జల
తాడేపల్లి : రాజధానిగా అమరావతే ఉండాలంటూ చంద్రబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి పిలుపునిచ్చారు. సోమవారం వైఎస్సార్సీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల. దీనికి ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘మన రాజకీయ లక్ష్యం అధికార వికేంద్రీకరణ. రాష్ట్ర సమగ్రాభివృధ్దికి అదే ఏకైక మంత్రం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బాగుండాలి.. అందులో అమరావతి ఒక భాగంగా ఉండాలి. ఇదే నినాదంగా ప్రజలలోకి వెళ్లాలి. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకుండా ఉండేందుకే 3 రాజధానులు. రాజధానిగా అమరావతే ఉండాలంటూ చంద్రబాబు, అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వికేంద్రీకరణపై ప్రజావేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు జరుగుతున్నాయి. మొన్న కాకినాడ, ఈరోజు రాజమండ్రిలలో జరిగాయి. 3 రాజధానులకు ప్రజల మద్దతు ఉంది’ అని పార్టీ నేతలకు సూచించారు. -
వికేంద్రీకరణకే జై
సాక్షి ప్రతినిధి, కాకినాడ/ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్ర భవిష్యత్తు బంగారు బాట పట్టాలంటే మూడు రాజధానులతో కూడిన వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని పలువురు మేధావులు జైకొట్టారు. స్వాతంత్య్రానంతరం నాలుగుసార్లు రాజధాని మార్పుతో జరిగిన నష్టాన్ని గుర్తించి యువత పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అధికారం అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనకు సంఘటితంగా మద్దతు తెలపాలని వక్తలంతా అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఉద్యమ స్ఫూర్తితో యువత, విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణపై కాకినాడలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎంఏ, ప్రొఫెసర్లు, వైద్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థి, వ్యాపార, వాణిజ్య, జర్నలిస్టు, రవాణా, ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులతోపాటు 52 అసోసియేషన్ల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాజనీతి శాస్త్రజ్ఞుడు ప్రొ. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అభివృద్ధిని కాంక్షించే ప్రపంచమంతా వికేంద్రీకరణ వైపు అడుగులేస్తున్న వైపే మనం కూడా అడుగులు వేయాలన్నారు. చాలా దేశాల్లో పరిపాలన అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండటాన్ని మనం ఆకళింపుచేసుకోవాలన్నారు. ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధి బాదం సుందరరావు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో అధికారులు అటూఇటూ తిరగాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనేది ఒట్టి మాటన్నారు. తానే రాజు.. తానెక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చిరంజీవినీకుమారి అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధిలో సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. బాబు ఒక్కటైనా శాశ్వత కట్టడం కట్టారా? కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక్కటైనా శాశ్వత భవనం నిర్మించారా అని ప్రశ్నించారు. 23 గ్రామాల ప్రజలు అమరావతే రాజధాని అంటూ పాదయాత్ర చేసి.. మిగిలిన రాష్ట్రమంతా కలిసి వికేంద్రీకరణ కోసం పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు చిట్లా కిరణ్, వాడ్రేవు రవి, ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ, ఈషా ఫౌండేషన్ కృష్ణప్రియ మాట్లాడుతూ.. వ్యవస్థలు కేంద్రీకృతమైతే జరిగే నష్టాన్ని గుర్తించి సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రతిపాదిస్తున్న వికేంద్రీకరణకే ఓటేయాలన్నారు. ఇక వికేంద్రీకరణ కోసం మేధావులు మౌనం వీడి ప్రజల తరఫున గళం వినిపించాలని యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ అధ్యక్షుడు బయ్యా రాజేంద్రకుమార్, మైనార్టీ ప్రతినిధి సయ్యద్ సాలార్ పిలుపునిచ్చారు. టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ది చెందకూడదని చంద్రబాబు, ఎల్లోమీడియా కుట్ర పన్నుతున్నాయన్నారు. మేధావులంతా కలిసి ఐక్య కార్యచరణకు సిద్ధంకావాలన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రూ.5 లక్షల కోట్లు ఖర్చుచేసినా అమరావతి నిర్మాణం సాధ్యంకాదన్నారు. ఇక ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత స్పందిస్తూ.. భవిష్యత్తులో రాష్ట్రం ఐక్యంగా ఉండాలంటే వికేంద్రీకరణ అనివార్యమన్నారు. సీఎం తలపెట్టిన మూడు రాజధానుల కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మాజీమంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు అన్నారు. మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, షర్మిలారెడ్డి వివిధ రంగాల ప్రతినిధులూ పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర ప్రగతి మరోవైపు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో జరిగిన చర్చావేదికలో కూడా 26 జిల్లాలూ సమాన ప్రగతి సాధించాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరని ఉత్తరాంధ్ర మేధావుల ఫోరం అభిప్రాయపడింది. వికేంద్రీకరణ జరగకపోతే భవిష్యత్తులో కళింగాంధ్ర, సీమాంధ్ర ఉద్యమాలు తప్పదని వక్తలు హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం దూరదృష్టితో, మేధావుల సూచనలతో మూడు రాజధానుల నిర్ణయానికి వచ్చిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొ.బిడ్డిక అడ్డయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమాన అభివృద్ధి సాధించాలన్నారు. ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ కె. తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆలోచనలకు అందరి మద్దతు అవసరమన్నారు. ఇక ఉత్తరాంధ్ర వెనుకబాటుకు శాశ్వత పరిష్కారం విశాఖపట్నం పరిపాలనా రాజధానేనని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యుడు అట్టాడ అప్పలనాయుడు, న్యాయవాది బైరి దామోదరరావు అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలను గౌరవించి మూడు రాజధానులకు మద్దతివ్వాలని ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ కెంబూరు చంద్రమౌళి, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని అరసవల్లికి రావటం నిజంగా హాస్యాస్పదమని.. ఉద్యమాలకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని.. వీర గుణ్ణమ్మ స్ఫూర్తితో జిల్లాలో ఉద్యమం సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరై మాట్లాడారు. -
అమరావతి యాత్ర.. ఉత్తరాంధ్రలో జనం ఊరుకుంటారా?
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయం ఉత్తరాంధ్రలో బలమైన సెంటిమెంట్‌గా మారుతోంది. తాజాగా ఆ ప్రాంత మేధావులు, రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయాలన్న ప్రతిపాదన చేసుకున్నారు. దీనిపై వారు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, అవసరమైతే విశాఖ , ఉత్తరాంధ్ర ప్రాంతం వారు కూడా క్రమంగా ఉద్యమ బాట పట్టేలా ఉన్నారు. దీనికి ఒకటే కారణం కనిపిస్తోంది. తమ ప్రాంతాభివృద్దికి వచ్చే అవకాశాన్ని అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాని, తెలుగుదేశం పార్టీవారు కాని చెడగొట్టేపనిలో ఉన్నారన్న భావన కలగడమే. రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీవారు అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రను నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అమరావతిలోని కొన్ని గ్రామాలలోనే మొత్తం రాజధాని కార్యాలయాలు ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను వీరు వ్యతిరేకిస్తున్నారు. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం తప్పుకాదు. కానీ, ఇతర ప్రాంతాలవారిని రెచ్చగొట్టేలా, మూడు రాజధానులకు మద్దతు ఇచ్చే నేతల ఊళ్లలో తొడలు కొడుతూ, చెప్పులు చూపుతూ చేస్తున్న హడావుడి చాలా ఇబ్బందికరంగా మారింది. తొలుత తిరుపతి వరకు పాదయాత్ర చేసిన వీరు ఇప్పుడు అరసవల్లి వరకు అంటూ నేరుగా వెళ్లకుండా, ఏవేవో రూట్లలో వెళుతూ అలజడి సృష్టించడానికి యత్నిస్తున్నారు. దీనితో సహజంగానే ఇతర ప్రాంతాలలోని ప్రజలకు తీవ్ర అసహనం కలుగుతుంది. తమ ప్రాంతంలో రాజధాని చేయవద్దని తమ ఉత్తరాంధ్రకే పాదయాత్ర పేరుతో రావడం అంటే తమను రెచ్చగొట్టడమేనని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అందుకే పోటీ పాదయాత్రను తలపెట్టారు. అంతేకాక, ప్రతివారం, పదిహేను రోజులకు ఒకసారి సమావేశం అయి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అంటే ఏమిటి ?అమరావతి నుంచి పాదయాత్ర విశాఖకు దగ్గరకు వచ్చేసరికి ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా, ప్రజలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే లక్ష్యంతోనే అమరావతి - అరసవల్లి పాదయాత్రను ప్లాన్ చేశారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. దానిని బలపరిచే విధంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడకు వెళ్లి ఆయన కార్యాలయం వద్ద,సినిమా ధియేటర్ వద్ద టీడీపీ నేతలు కొందరు చేసిన గలభా తీవ్ర అభ్యంతరకరమైనది. ఒక మహిళ వాహనం మీద నిలబడి తొడగొట్టిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. వీరు పాదయాత్ర చేస్తున్నది తొడలు కొట్టడానికా అన్న వ్యాఖ్యలు వచ్చాయి. వీరిలో అసలు రైతులు ఎంతమంది అన్నదానిపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అది వేరే విషయం. ఒక్క మాట మాత్రం వాస్తవం. రాష్ట్రం అంతా ఏమైపోనివ్వండి.. తమ గ్రామాల పరిధిలోనే రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో వీరు చేస్తున్న ఈ యాత్ర ప్రధానంగా తెలుగుదేశంకు రాజకీయ ఊపిరి పోయడానికే అనిపిస్తుంది. అందుకే టీడీపీ నేతలే పలువురు వారితో కలిసి ఆయా చోట్ల నడుస్తున్నారు.అయితే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ఈ పాదయాత్ర చేసేవారి వద్దకు వెళ్లి నేరుగా కలవడానికి సంకోచిస్తున్నట్లుగా ఉంది. ఆయన కాని, ఆయన కుమారుడు కాని వారి వద్దకు వెళ్లి సంఘీభావం తెలపలేదు. తమ పార్టీ నేతలను మాత్రం పంపి ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి కారణం నేరుగా తాము అమరావతి పాదయాత్రలో కలిస్తే ఉత్తరాంధ్రలో పార్టీకి బాగా నష్టం వస్తుందన్న భయం కావచ్చు.ఈ నేపధ్యంలో విశాఖలో కూడా రాజధాని ఆకాంక్షను ప్రజలకు బలంగా తెలియచేయడానికి వీలుగా రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. పలువురు మేధావులు విశాఖను పరిపాలనా రాజధాని చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించారు. ముంబై, హైదరాబాద్ లతో విశాఖ పోటీ పడగలుగుతుందని, అమరావతి ఎప్పటికి పోటీ పడుతుందని వారు ప్రశ్నించారు. అమరావతలో లక్షల కోట్లు వ్యయం చేస్తే తప్ప అబివృద్ది కాదని, కాని విశాఖలో అంత డబ్బు అవసరం ఉండదని, అనతికాలంలోనే లక్ష కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు. అమరావతిలో వంద అడుగుల లోతుకు వెళ్ళి పునాదులు తీయవలసి ఉంటుంది. అదే విశాఖలో అయితే ఆ ఇబ్బంది ఉండదు. తీర ప్రాంతం, టూరిజం, పరిశ్రమల రంగాలలోను. ఇటీవలికాలంలో ఐటి రంగంలోను విస్తరిస్తున్న విశాఖ రాజధాని అయితే రాష్ట్రప్రజలందరికి మేలు జరుగుతుందని మేధావులు చెబుతున్నారు. రౌండ్ టేబుల్ సదస్సులోమంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ వ్యాఖ్యలే చేశారు. అమరావతిలోని 500 కుటుంబాల కోసం మొత్తం రాష్ట్ర సంపద అంతా తాకట్టు పెట్టాలని అనడం బావ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల పన్నులు, ఆదాయం అంతా మట్టిలో పోయాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. పాదయాత్ర పేరుతో టీడీపీవారు రెచ్చగొడుతున్నారని, తాము తలచుకుంటే వారికి అడ్డు తగలడం పెద్ద పని కాదని, కాకపోతే సంయమనం పాటిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఒక జడ్జి అమరావతి రాజదాని గురించి చేసిన వ్యాఖ్యలను కూడా బొత్స తప్పు పట్టారు.1953 లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు విశాఖను రాజధాని చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, చివరి నిమిషంలో కర్నూలు ఎంపిక జరిగిందని ఈ సదస్సులో పాల్గొన్న మేదావులు వివరించారు.అది నిజమే ఆనాటి ప్రముఖ నేత టంగుటూరి ప్రకాశం పంతులు విశాఖ ను రాజధాని చేద్దామని ప్రతిపాదించారు.కాని అది సాధ్యపడలేదు. నిజంగానే అప్పుడే కనుక విశాఖ రాజధానిగా ఆంద్ర రాష్ట్రం ఏర్పడి ఉంటే , ఉమ్మడి రాష్ట్రం అవసరం ఉండేదికాదు. రాజధాని ఇబ్బంది అసలే ఉండేదికాదు. ఈపాటికి హైదరాబాద్‌కు పోటీగా అభివృద్ధి అయి ఉండేది. కాని అప్పటి సెంటిమెంట్లు, రాజకీయాలు వేరుగా ఉండేవి. ప్రస్తుతం అమరావతి లో శాసన రాజధాని ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా,కొందరు కావాలని ,అసలు రాజధానే లేకుండా పోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతుందో కాని,ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల కోరికలు కూడా నెరవేర్చాలన్న వారి ఆకాంక్ష తీరుతుందో లేదో చెప్పలేం. సుప్రింకోర్టు తీర్పుపై ఇది ఆధారపడి ఉంటుంది. కొద్ది నెలల క్రితం మూడు రాజధానులు చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయినా అమరావతి-అరసవల్లి పాదయాత్రను తెలుగుదేశం ప్లాన్ చేయడం కుట్ర రాజకీయం తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా వీరి పాదయాత్ర విశాఖవైపు వెళ్లే కొద్ది అక్కడి ప్రజలలో అలజడి పెరుగుతుంటుంది. టీడీపీ వారికి కూడా అదే కావాలి. ఈ వివాదం వల్ల ఉద్రిక్తతలు ఏర్పడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లవచ్చన్నది వారి ప్లాన్ గా చెబుతున్నారు.ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్ర నుంచి పోటీ పాదయాత్ర చేపడితే ప్రజల మనోగతం అర్దం అవుతుందని మూడు రాజదానులకు మద్దతు ఇస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికలలో విజయవాడ, గుంటూరు వంటి చోట్ల కూడా వైఎస్సార్సీపీ గెలిచింది. అంటే దాని అర్థం రాజధాని అంశం ప్రజలను ప్రభావితం చేయడం లేదని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎలాగొలా ప్రజలలో అమరావతిపై సానుకూలత తేవడం కోసం టీడీపీ నానా పాట్లు పడుతోంది. కాని ఉత్తరాంధ్ర రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి ప్రముఖులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలిపారు. మరి అమరావతి పాదయాత్రికులు విశాఖ వెళ్లి కూడా తొడకొడతారా? చెప్పులు చూపుతారా? అక్కడి ప్రజలు వీటిని భరిస్తారా అన్నది భవిష్యత్తులో చూడాల్సిందే. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో విద్యార్థుల మానవహారం
-
అమరావతికి వ్యతిరేకం కాదు : జోగి రమేష్
పెడన: రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకేచోట రూ.3 లక్షల కోట్లు ఖర్చుచేస్తే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. కృష్ణా జిల్లా పెడన మార్కెట్ యార్డు ప్రాంగణంలో సోమవారం వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి జోగి రమేష్ పాల్గొని పెడన మండలంలోని 2,121 మంది లబ్ధిదారులకు రూ.3,97,68,750 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన కుటుంబం, బంధువులు, సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే అభివృద్ధి చెందాలనే విధంగా అమరావతిని ఏకైక రాజధాని చేయాలని కంకణం కట్టుకుని అమరావతి–అరసవల్లి పాదయాత్రకు వ్యూహరచన చేశారని దుయ్యబట్టారు. రైతుల పేరుతో చేస్తున్న ఈ పాదయాత్ర చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు. అమరావతి కావాలా.. లేక చేయూత కావాలా.., అమరావతి కావాలా... లేక ఆసరా కావాలా.. అని మంత్రి ప్రశ్నించడంతో తమకు ఆసరా కావాలి.. చేయూత కావాలంటూ మహిళలు నినదించారు. -
శ్రీకాకుళం టు అమరావతి
సాక్షి, విశాఖపట్నం: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తు బంగారుమయమవుతుందని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్తకంఠంతో చాటి చెప్పారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకతాటిపై నిలిచేలా శాంతియుతంగా ఉద్యమాలను నిర్వహించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వాసులు శ్రీకాకుళం నుంచి అమరావతి వరకూ పాదయాత్ర చేపట్టి కేవలం 29 గ్రామాలు ముఖ్యమా? లేక రాష్ట్రమంతటా అభివృద్ధి జరగడం ముఖ్యమా? అనే అంశంపై ప్రతి గడపలోనూ చర్చ జరిగేందుకు సమాయత్తమవ్వాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాంధ్ర మేధావుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ మాజీ ఉపకులపతి హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఉపముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్ససత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్తో పాటు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, దుంపల రవీంద్రబాబు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు, మేధావి వర్గాల ప్రతినిధులు, ఉద్యోగ, న్యాయవాద, వైద్య, అధ్యాపక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి పంచవర్ష ప్రణాళికలోనే.. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. దీనికి 61 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. చివరి నిమిషంలో కర్నూలుకు మార్చారు. వికేంద్రీకరణ భావన ఇప్పటిది కాదు. 1951 మొదటి పంచవర్ష ప్రణాళికలో వికేంద్రీకరణ అంశాన్ని మూడో లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా మూడు రాజధానులను ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన అందరిలో ఉంది. ఒకేచోట రాజధాని ఉంటే ప్రకృతి విపత్తులు వస్తే మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్ రాజధాని విషయంలోనూ ఇటీవల అదే జరిగింది. – ప్రొ.హనుమంతు లజపతిరాయ్, మాజీ ఉపకులపతి 29 గ్రామాలా.. రాష్ట్రాభివృద్ధా? రాజధానిగా అమరావతి పనికిరాదని అన్ని కమిటీలు చెప్పాయి. 29 గ్రామాలు ముఖ్యమా? లేక రాష్ట్రం మొత్తం ముఖ్యమా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. 19 దేశాల్లో, 13 రాష్ట్రాల్లో రాజధాని వికేంద్రీకరణ జరిగింది. హైకోర్టు సీట్ ఒకచోట, బెంచ్ ఒక చోట ఉన్న రాష్ట్రాలు, దేశాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే క్వార్టర్లు కాకుండా మూడు చోట్లా ఎమ్మెల్యే హాస్టళ్లు నిర్మించాలి. – ప్రొ.బాలమోహన్‌దాస్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ విశాఖ రెడీమేడ్ రాజధాని విశాఖ మహా నగరం అన్ని సదుపాయాలున్న రెడీమేడ్ క్యాపిటల్. అతి తక్కువ ఖర్చుతో రాజధానిని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ఎవరూ కాదనే ప్రసక్తే ఉండదు. టూరిజం, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్ పరంగా ప్రధాన నగరం. ఇలాంటి నగరాన్ని విడిచిపెట్టి రాజధాని ఎక్కడో ఉండటం సరికాదు. మూడు రాజధానులే సబబు. ప్రభుత్వ నిర్ణయం పర్ఫెక్ట్. – జీఎస్ఎన్ రాజు, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ 70 ఏళ్లుగా ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం అన్ని ప్రాంతాలు, మతాల వారికి విశాఖ భద్రమైన నగరం. ముఖ్యమంత్రి నిర్ణయానికి పూర్తి మద్దతు పలుకుతున్నాం. వైజాగ్‌లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని గతంలో 200 రోజుల పాటు పోరాటం చేశాం. రాజధానితో పాటు బెంచ్ కూడా నెలకొల్పాలి. – కృష్ణమోహన్, బార్‌కౌన్సిల్ సభ్యుడు సులువుగా అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి ఏది మంచిదో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ దానికే మద్దతిస్తుంటుంది. వికేంద్రీకరణతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. రాష్ట్రం మొత్తం ప్రగతి పథంలో పయనించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందే. విశాఖ అన్నింటికంటే పెద్ద నగరం. దీన్ని అభివృద్ధి చేయడం చాలా తేలిక. ఒక రాజధానిని పునాదుల నుంచి అభివృద్ధి చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. హైదరాబాద్‌తో పోటీ పడాలంటే కచ్చితంగా విశాఖకే సాధ్యమవుతుంది. పరిశ్రమలు, ఐటీ సంస్థలు రావాలంటే విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావాల్సిందే. దీనివల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ ముందుకెళ్తాయి. – పైడా కృష్ణప్రసాద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సంక్షోభ రాష్ట్రంపై మరింత భారం అమరావతి నిర్మాణంతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఏపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. పుత్రజయని రాజధానిగా మలేషియా నిర్మించింది. అక్కడ ఇప్పటికీ ప్రజలు నివసించడం లేదు. అమరావతి కూడా అదే మాదిరిగా మారుతుంది. ఇలాంటి సదస్సులతో ప్రజలను చైతన్యం చేయాలి. శ్రీకాకుళం నుంచి అమరావతికి యాత్ర చేపట్టాలి. – శివశంకర్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ ఉద్యమంలో ముందుంటాం.. విశాఖను రాజధానిగా ప్రతి ఒక్కరూ పరిగణించాలి. సీఎం నిర్ణయంతో మూడు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలి. రాజధానిగా విశాఖకు సంబంధించిన ఏ ఉద్యమంలోనైనా మా ఉద్యోగుల సంఘం ముందు వరుసలో ఉంటుంది. – పోలాకి శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రికల్ బీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు భావితరాలు క్షమించవు.. విశాఖను రెండో ముంబైగా పోలుస్తూ హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందే కీలక ప్రాంతమని దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ గతంలోనే చెప్పారు. అలాంటి నగరాన్ని వదిలేసి ఎక్కడో రాజధాని ఏర్పాటు తప్పిదమే. ఇప్పటికే హైదరాబాద్‌లో అన్నీ అభివృద్ధి చేసి ఒక తప్పు చేశాం. మరోసారి పునరావృతం చేస్తే భావితరాలు క్షమించవు. – షంషుద్దీన్, ముస్లిం సంఘాల ప్రతినిధి అందరి నగరం విశాఖ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే విభజన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు విశాఖలో నివసిస్తున్నారు. – పల్లవి, ఏయూ చీఫ్ వార్డెన్, స్పోర్ట్స్ డైరెక్టర్ పాదయాత్ర ఎవరి కోసం.? అమరావతి రైతుల పాదయాత్ర ఎవరి కోసం? లోకేష్‌ను సీఎం చేయాలనే దుర్భుద్ధితో చంద్రబాబు ఈ పాదయాత్ర చేయిస్తున్నారు. మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది. – పాకా సత్యనారాయణ, న్యాయవాది విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ 729 రోజులుగా మందడంలో నిరసన కార్యక్రమా లు చేస్తున్నాం. చంద్రబాబుకు పేదల అభివృద్ధి ఇష్టం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకుని కోర్టులో పిల్‌వేశారు. దుర్భుద్ధితో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. –పెరికె వరప్రసాద్, దళిత జేఏసీ నాయకుడు బాబు బినామీల యాత్ర అది చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. గతంలో చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపించాం. పాదయాత్రను కూడా అదేమాదిరిగా తిప్పికొట్టాలి. – కాంతారావు, ఏయూ విద్యార్థి జేఏసీ నాయకుడు నాడు.. దొంగ లెక్కలతో రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని రాజ్యాంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. 2014–15లో రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే 42 శాతం మంది విశాఖకు మద్దతిచ్చారు. 22 శాతం మంది విజయవాడ, 25 శాతం గుంటూరుకు మద్దతిచ్చారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్ని ఎంపిక చేశారు. నాడు విశాఖను రాజధానిగా ఎందుకు ఎంపిక చేయలేదని చంద్రబాబు, నారాయణను నిలదీస్తే గుంటూరు, విజయవాడ కలిపి 47 శాతం అయిందంటూ దొంగ లెక్కలు చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరం. అంత డబ్బుతో 200 మెడికల్ కాలేజీలు, 200 స్టీల్ ప్లాంట్లు వస్తాయి. సీఎం జగన్ నిర్ణయానికి అంతా మద్దతు పలకాలి. – వాసుపల్లి గణేష్‌కుమార్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే క్షుద్రశక్తులు.. వెన్నుపోటు రాజకీయాలు రూ.3 లక్షల కోట్లు రెవెన్యూ వచ్చే విశాఖకు రాజధానిగా అన్ని హక్కులున్నాయి. కొన్ని క్షుద్రశక్తులు, ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. నెత్తిపై తన్నేవారిని చూస్తూ ఊరుకోలేం. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో శాంతియుతంగా పోరాడతాం. – కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే విస్తృతంగా చాటి చెప్పాలి.. వికేంద్రీకరణ ద్వారా ఉత్తరాంధ్రకు ఒనగూరే, ప్రయోజనం, మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే అభివృద్ధిపై ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలి. మేధావులు ఈ తరహా సదస్సులను నిర్వహించాలి. రాజకీయ అజెండాతో చేపట్టిన పాదయాత్ర లాంటి కార్యక్రమాలను విరమించుకోవాలని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చే చర్యలకు సున్నితంగా తెర దించాలని భావిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి -
ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమే: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని ఆయన వివరించారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకే కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నాం. టాప్-5 సిటీస్‌లో విశాఖ ఉంది. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.3 రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. అమరావతికి మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి’ అని తెలిపారు. -
మూడు రాజధానులపై రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ మాట్లాడుతూ.. ‘జెండాలు లేకుండా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం సంతోషం. పరిపాలన రాజధానిగా కావలసిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయి. రోడ్డు, రైల్వే, విమానాశ్రయం, పోర్టు కనెక్టివిటీ ఉంది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని వద్దని చెప్పింది. నారాయణ కమిటీ మాత్రమే అమరావతి రాజధాని అని తెలిపింది. బోస్టన్, జీఎన్ రావు, పరిపాలన వికేంద్రీకరణ చేయమని చెప్పాయి. హైకోర్టును కర్నూలుకు తరలించి గుంటూరు, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధానిగా అందరూ కోరుకుంటున్నారు. విశాఖ రాజధానిగా వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులు సమయం ఆసన్నమైంది’ అని వెల్లడించారు. 29 గ్రామాలు కోసం చంద్రబాబు తాపత్రయం పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలపై కవాతు చేయడానికి వస్తున్నారు. 29 గ్రామాలు కోసం చంద్రబాబు తాపత్రయం పడుతున్నారు. పాదయాత్రను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఉత్తరాంధ్ర ప్రజలు 5 లక్షల ఎకరాలు అభివృద్ధి కోసం త్యాగం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగం కోసం ఎవరు మాట్లాడరు. అమరావతి రైతులకు కౌలు ఇస్తున్నారు. -కొయ్య ప్రసాద్ రెడ్డి, ఉత్తరాంధ్ర రక్షణ సమితి అధ్యక్షుడు హైదరాబాద్ తరహా అభివృద్ధికి విశాఖ మాత్రమే అనువైనది ఉత్తరాంధ్ర రాజధాని విశాఖను పరిపాలన రాజధానిగా గుర్తిస్తే ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. తక్కువ వ్యయంతో రాజధానిగా నిర్మాణానికి విశాఖ అనువైన ప్రదేశం. విశాఖ రాజధానిగా మారితే పెట్టుబడులు అన్ని రంగాల్లో వస్తాయి. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరగాలంటే విశాఖ మాత్రమే అనుకూలమైన ప్రదేశం. -పైడా కృష్ణ ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు -
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకం, సశాస్త్రీయం. రాజకీయ కారణాల వల్ల రాజధానుల నిర్మాణం ‘మూరెడు ముందుకు, బారెడు వెనుక’కు చందంగా సాగుతోంది. అయినా ఎప్పటికైనా విభిన్న భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక కారణాల రీత్యా మూడు పరిపాలనా కేంద్రాల ఏర్పాటు కావలసిందే. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర ప్రాంతాల మధ్య అభివృద్ధి, యాస, భాషల్లో ఎప్పటి నుంచో తేడాలు ఉన్నాయి. ఇందుకు భౌగోళికపరమైన వాతావరణం, నేలల స్వభావం, సముద్ర తీరం వంటివి కూడా కారణాలే. కారణాలు ఏవైనా మధ్యాంధ్ర జిల్లాలైన ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆర్థికంగా మిగతా ప్రాంతాల కంటే బాగా అభివృద్ధి చెందాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలు ఇప్పటికీ వెనక బడే ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయడానికే పరిపాలనను వికేంద్రీకరిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. శాసన రాజధానిగా ఇప్పటికే మధ్యాంధ్రలో ఉన్న అమరావతిని కొనసాగించాలనీ, న్యాయరాజధానిగా కర్నూలును చేసి, అందులో హైకోర్టును ఏర్పాటు చేయాలనీ; రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధానిని దగ్గర చేయాలనీ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. ఇప్పటికే దేశంలో పాలనా వికేంద్రీకరణను పాటిస్తున్న రాష్ట్రాలు పది దాకా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ రాయ్‌పూర్‌లో ఉంటే... హైకోర్టు బిలాస్పూర్లో పనిచేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ, పరిపాలన విభాగం గాంధీనగర్‌లో ఉంటే, హైకోర్టు అహ్మదాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. కేరళకు సంబంధించి తిరువనంతపురంలో సెక్రటేరియేట్, అసెంబ్లీ ఉంటే... కొచ్చిలో హైకోర్టు పని చేస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో, అసెంబ్లీ, సచివాలయం ఉన్నాయి. జబల్పూర్లో హైకోర్టు నడుస్తోంది. మహారాష్ట్రలో సమ్మర్ క్యాపిటల్ ముంబై, వింటర్ క్యాపిటల్ నాగ్‌పూర్‌లో ఉంటాయి. ఇక ఒడిశాలోని భువనేశ్వర్‌లో పరిపాలన విభాగం ఉంటే కటక్‌లో హైకోర్టు ఫంక్షన్లో ఉంది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఉంటే... పరిపాలన విభాగం జోధ్‌పూర్‌లో హైకోర్టు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పరిపాలన, అసెంబ్లీ విభాగాలు ఉంటే... అలహాబాద్‌లో హైకోర్టు పనిచేస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో అసెంబ్లీ, సెక్రటేరియేట్ ఉన్నాయి. నైనిటాల్లో హైకోర్టు ఉంది. (క్లిక్: ఇది ఉత్తరాంధ్ర మనోభావాలపై దండయాత్ర!) ఏపీలో నెలకొన్న భిన్న భూభౌతిక పరి స్థితులు, వాతావరణ పరిస్థితులు, సాంస్కృతిక వైరుధ్యం, ఆహారం, ఆహార్యం, ఆర్థిక అసమానతల రీత్యా రాజధాని విస్తరణ సహే తుకమే. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఏళ్లుగా పేరుకు పోయిన భిన్న వైరుధ్యాలను రూపుమాపే కార్యక్రమాలు రూపొందించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే నేటికీ ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కళింగసీమ ఉద్యమ నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రజల మధ్య ఏకరీతి మానసిక స్థితి, ఏకాత్మతాభావం, సోదర భావం పెంపొం దించే కార్యాచరణ అమలు చేయాలి. అనేక మతాలు, భాషలు, జాతులు, సంస్కృతులు, భూభౌతిక వైవిధ్యాలతో కూడిన భారత దేశాన్ని ఒకే జాతిగా పెనవేయడానికి ప్రజల మధ్య సోదరభావం సృష్టించే వరకు వికేంద్రీకరణ మాత్రమే తారక మంత్రం! (క్లిక్: అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!) - కౌడె సమ్మయ్య, జర్నలిస్టు -
3 రాజధానులపై హైకోర్టు తీర్పును రద్దు చేయండి
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ తన రాజధానిని నిర్ణయించుకునే స్వతఃసిద్ధ అధికారం ఉంటుందని తెలిపింది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించిన తరువాత రాజధాని వ్యవహారంలో దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, అయినప్పటికీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీర్పు వెలువరించిందని ప్రభుత్వం తన పిటిషన్లో నివేదించింది. రాజ్యాంగంలోని అధికరణలు 3, 4లను అనుసరించి కేంద్రం తీసుకొచ్చిన చట్టం ద్వారా రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పడం లౌకిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 258 ద్వారా కేంద్రం బదలాయించిన అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం తెచ్చిందని హైకోర్టు తన తీర్పులో చెప్పిందని, వాస్తవానికి రాజ్యాంగంలోని లిస్ట్ రెండు 5వ ఎంట్రీలోని అధికారాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చిందని ప్రభుత్వం వివరించింది. అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ కేంద్రం బదలాయించిన అధికారం ద్వారా సీఆర్డీఏ చట్టాన్ని చేసినట్లు ఎక్కడా చెప్పలేదని నివేదించింది. పైపెచ్చు రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోనిదంటూ కేంద్రమే లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు నివేదించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో గుర్తు చేసింది. ► అధికరణ 258 కింద ఉన్న కార్యనిర్వాహక, పాలన అధికారాలను మాత్రమే బదలాయించడం జరుగుతుంది కానీ శాసనాధికారాన్ని కాదని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. సీఆర్డీఏ చట్టాన్ని కేంద్రం బదలాయించిన అధికారం ద్వారానే చేశామని అనుకుంటే, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన కమిటీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని భావించాల్సి ఉంటుందని వివరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేయడానికి ఇది ఓ ప్రధాన కారణమని నివేదించింది. కేంద్రం ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా తీసుకున్న నిర్ణయం కేంద్ర చట్టానికి విరుద్ధమైనప్పుడు దాన్ని హైకోర్టు సమర్థించగలదా? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న అని తెలిపింది. ► ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిర్వర్తించలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. ల్యాండ్ పూలింగ్ స్కీం అమలుకు నిర్దేశించిన కాల పరిమితిని 2024 వరకు సీఆర్డీఏ ఇప్పటికే పొడిగించిందని, అందువల్ల ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరపాల్సిన ఎంత మాత్రం లేదని నివేదించింది. ఒప్పందాలకు అనుగుణంగా సీఆర్డీఏ, ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రశ్నించింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 58, ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించటాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన యజమానులకు అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్లో సవాల్ చేసింది. సమగ్ర బిల్లుతో మళ్లీ ముందుకు వస్తాం ► శాసనసభకు చట్టం చేసే హక్కు లేదన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి: మంత్రి గుడివాడ ► తన రియల్ఎస్టేట్ బినామీల కోసం విద్వేషాలు సృష్టిస్తున్న చంద్రబాబు సాక్షి, విశాఖపట్నం: రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసమే రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా జరిగే అభివృద్ధిని దీన్ని ద్వారా సుప్రీంకు తెలియజేశామన్నారు. శాసనసభకు చట్టంచేసే హక్కు లేదనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. మూడు రాజధానులపై మళ్లీ అసెంబ్లీలో సమగ్ర బిల్లుతో ముందుకు వెళతామని ప్రకటించారు. శనివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ► హైకోర్టు తీర్పుపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించామని, శాసనసభకు రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ ఇచ్చిన తీర్పు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీసేవిధంగా ఉంది. ఆర్టికల్–3, 4 ప్రకారం రాజధాని ఎంపిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని గతంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. ► శాసనసభ ఉనికినే ప్రశ్నించే విధంగా తీర్పులు వస్తే రాష్ట్ర ప్రగతికి విఘాతం కలుగుతుంది. ► రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తుంటే, 29 గ్రామాల కోసం, తన రియల్ ఎస్టేట్ బినామీల కోసం చంద్రబాబు చిచ్చు, విద్వేషాలను రేకెతిస్తున్నారు. ► అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. అమరావతిని పూర్తిగా అభివృద్ధి చేయడానికి 2024 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది. -
మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
ఢిల్లీ: మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. రాజధానిగా అమరావతి ఉండాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతే రాజధానిగా ఉండాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొనడం శాసనవ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమేనని తన పిటిషన్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. అలాగే, అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులని ప్రభుత్వం పిటిషన్లో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత.. మళ్లీ ఆ చట్టంపై ఆలోచన చేస్తామని చెప్పిన తర్వాత.. వచ్చే చట్టం ఎలా ఉంటుందో తెలియకుండానే తీర్పు ఇవ్వడం సరైనదేనా అంటూ ప్రభుత్వం పిటిషన్లో ప్రశ్నించింది. ఏపీ రాజధాని నిర్ణయం ఒక కమిటీ సూచనకు అనుగుణంగా ఉంటుందన్నారు. అయితే, కమిటీ సూచనకు సంబంధం లేకుండా రాజధానిని నిర్ధారించారు. దానినే రాజధానిగా ఉంచాలని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ప్రభుత్వం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వానికి డెలిగేట్‌గా సర్వహక్కులతో అసెంబ్లీ చట్టం చేసింది. ఆ చట్టం కింద ఇచ్చిన నోటిఫికేషన్లను వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. ఒక చట్టం రాకుండానే ఆ చట్టం రూపురేఖలు ఎలా ఉంటాయో తెలియకుండానే ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం ఎంత వరకు సబబు అంటూ ప్రభుత్వం ప్రశ్నించింది. ఇది అధికార విభజనకు విరుద్ధం కాదా? అని పిటిషన్లో పేర్కొంది. -
మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలా? అమరావతి కావాలా?
సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలా? అమరావతి ఒక్కటే చాలా అని టీడీపీ వాళ్లు ప్రజల్లోకి వెళితే ఏం కావాలో వారే చెబుతారు. 29 గ్రామాల్లో టీడీపీ నేతలు, వారి బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు 26 జిల్లాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతాన్ని వాళ్ల స్వార్థం కోసం వాడుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ప్రజలు మా పారీ్టకి ఎంతలా బ్రహ్మరథం పట్టారో మరిచిపోయారా? అసెంబ్లీకి రాలేని చంద్రబాబు, ప్రజల్లోకి వెళ్లలేని లోకేశ్ మాపై విమర్శలు చేస్తారా? లోకేశ్ ఓ పిల్లిబిత్తిరి. అలాంటివాడు సీఎంను ఏకవచనంలో మాట్లాడతాడా? వైఎస్ జగన్ సీఎం కాగానే ఒకే నోటిఫికేషన్‌తో 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. మరో 2.60 లక్షల మందిని వలంటీర్లుగా తీసుకుని ప్రజలకు సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనూ నియామకాలు చేపట్టారు. కొడాలి నాని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఆడవాళ్లను ఇళ్ల మీదకు పంపిస్తారా? ఎమ్మెల్యేల ఇళ్లపైకి వెళ్లి భయపెడతామంటే సహించం. -
మూడే ముద్దు.. అమరావతి యాత్రలో ఊహించని షాక్
సాక్షి, గుంటూరు: అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న వాళ్లకు ఊహించని షాక్ తగిలింది. యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ.. ఉమ్మడి గుంటూరులోని చాలా చోట్ల వ్యతిరేక ఫ్లెక్సీలు వాళ్లకు స్వాగతం పలికాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇవాళ ఆ యాత్ర సాగనుంది. అయితే.. రాత్రికి రాత్రే జంపని, వేమూరు ప్రాంతాల్లో కారుమూరు వెంకటరెడ్డి పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ అందులో హైలైట్ చేసి ఉంది. మూడు రాజధానుల వల్ల కలిగే ఉపయోగాలు, అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మరోసారి హైదరాబాద్‌లాగా దెబ్బ తినకూడదనే ఉద్దేశంతోనే.. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆ అభివృద్ధి అన్ని ప్రాంతాలకు అందుతుందని ఆ ఫ్లెక్సీ ద్వారా యాత్ర చేసేవాళ్లకు అర్థం అయ్యేలా వివరించింది ఉంది. అంతేకాదు అసలు మీ యాత్ర ఎందుకంటే వేసిన ప్రశ్నతో.. యాత్ర చేసే వాళ్లు కంగుతిన్నారు. స్థానికంగా వీటి గురించి చర్చ నడుస్తోంది. ఇదీ చదవండి: పేదలంతా కళ్యాణమస్తు వినియోగించుకోండి -
Andhra Pradesh: వికేంద్రీకరణే..!
సాక్షి, అమరావతి: మూడేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజాభ్యుదయమే లక్ష్యంగా తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, వికేంద్రీకరణ దిశగా వేసిన అడుగుల గురించి నేడు అసెంబ్లీ వేదికగా చర్చించనుంది. వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించనుంది. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని, అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ తీసుకున్న నిర్ణయాలను, రాబోయే కాలంలో చేయనున్న మేలును, ప్రతిపక్షం తీరును మరోమారు ప్రజల దృష్టికి తీసుకెళ్లనుంది. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా సాకారం చేసిన మహా సామాజిక విప్లవం గురించి మాట్లాడనుంది. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని చాటనుంది. 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని చేకూర్చారు. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక.. ఎన్నికల మేనిఫెస్టో అమలు, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించారు. ఇప్పటికే 98.44 శాతం హామీలను అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. 1.30 లక్షల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించారు. ఇటీవల వీరి ప్రొబేషన్ కూడా పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో వేతనాలు ఇస్తున్నారు. ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాల స్థానంలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేసి పరిపాలనను వికేంద్రీకరించారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (నగదు బదిలీ) రూపంలోనే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.65 లక్షల కోట్లు జమ చేశారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా ఆసరా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణ మాఫీ హామీ ఇచ్చి, మహిళల ఓట్లు వేయించుకుని గద్దెనెక్కారు. ఆ తర్వాత ఆ హామీ గురించి పూర్తిగా విస్మరించారు. బాబు దెబ్బకు డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యమైపోయాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ పరిస్థితిలో తన పాదయాత్రలో అక్కచెల్లెమ్మల కష్టాలు కళ్లారా చూసిన వైఎస్ జగన్ వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు.. ఎన్నికల నాటి వరకు బ్యాంకుల్లో ఉన్న వారి అప్పులను నాలుగు విడతలుగా చెల్లిస్తూ వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేశారు. దీనికి తోడు 45 ఏళ్ల వయసు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750.. వరుసగా నాలుగేళ్లు ఇస్తూ వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండు పథకాలతో పాటు ఇతరత్రా ప్రభుత్వ సాయం వల్ల మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేలా చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ.. కార్పొరేట్ కంపెనీల ద్వారా సహకారం అందిస్తూ పలు చర్యలు తీసుకున్నారు. పండుగలా వ్యవసాయం.. కాదనగలరా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఒక దశలో వ్యవసాయం దండగ అని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ‘బాబు మాటలు తప్పు’ అని నిరూపిస్తూ విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చారు. రైతు భరోసా పథకంతో రైతన్నలకు పెట్టుబడి సాయం అందిస్తూ వస్తున్నారు. 10,750 ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)లు ఏర్పాటు చేసి రైతులకు విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అండగా నిలుస్తున్నారు. పంటకు నష్టం చేకూరితే లబ్ధి చేకూర్చడానికి ఈ–క్రాప్ ద్వారా భరోసా ఇస్తున్నారు. అన్ని ఆర్బీకేల్లోనూ పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో పరికరాలు ఏర్పాటు చేశారు. 7.13 లక్షల మంది రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందజేసేలా కార్యాచరణ రూపొందించారు. కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూమ్‌లు, గోదాముల నిర్మాణం సత్వరమే పూర్తి చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నారు. మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్.. ‘పేద పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువు మాత్రమే. వారిని ఉన్నత చదువులు చదివిస్తే అది వారి తల రాత మారుస్తుంది’ అని గట్టిగా నమ్మిన సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అమ్మ ఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్, బైజూస్‌తో ఒప్పందం, ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, బై లింగువల్ టెక్టŠస్ బుక్స్ పంపిణీ, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు స్కిల్స్ అప్‌గ్రేడేషన్ ప్రొగ్రాం, ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో మార్పులు చేపట్టారు. ఇలా వీటన్నింటి కోసం ఈ మూడేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.53 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. 2025లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యేలా ఈ నవంబర్‌లో 8వ తరగతి విద్యార్థులు 4.72 లక్షల మందికి రూ.606.18 కోట్ల ఖర్చుతో బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. వీరికి విద్యను బోధించే 50,194 మంది టీచర్లకూ రూ.64.46 కోట్లతో ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. మీ ఆరోగ్యం.. మా బాధ్యత ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు కింద ఆధునికీకరించి.. మెరుగైన వైద్యం అందించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఎవరూ ఊహించని విధంగా పలు మార్పులు చేశారు. వైద్య ప్రక్రియలను 3.100కు పైగా వైద్య ప్రక్రియలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. కొత్తగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల ద్వారా కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టను అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తద్వారా గ్రామీణుల ముంగిటకు వైద్యాన్ని తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది.. విశ్రాంతి తీసుకునే సమయంలో వైద్యుల సూచన మేరకు ఆరోగ్య ఆసరా పథకం కింద సాయం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల దిశగా అడుగులు ఇన్ఫోసిస్, అసెంచర్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరెన్నో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఒక్క గ్రీన్ ఎనర్జీలో రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. సత్యవీడు, కొప్పర్తి సెజ్‌లలోని పరిశ్రమల్లో లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. నాటికి, నేటికి ఎంత తేడా! టీడీపీ సర్కార్ హయాంలో ఏ సంక్షేమ పథకం కింద లబ్ధి పొందాలన్నా.. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. లంచాలు ఇచ్చినా ప్రయోజనం చేకూర్చేవారు కాదని ప్రజలు నాటి రోజులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఒక్కరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా అర్హతే ప్రమాణికంగా ఇతర పార్టీలకు ఓట్లేసిన వారికి సైతం సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్రతి ఇంటికీ వెళ్లి చేసిన మంచిని వివరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఇలా ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు వారు ఏవైనా సమస్యలు చెబితే వాటిని పరిష్కరించడానికి, అక్కడ ప్రాధాన్యత పనులను తక్షణమే చేపట్టడానికి రూ.20 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తున్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కావాలి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలతో పాటు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో భాగంగా వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధితో పాటు పాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేయడంతో రాష్ట్ర విభజనతో మనకు ఎంతగా నష్టం జరిగిందో స్పష్టమవుతోంది. లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పొరపాటు ఇకపై జరక్కుండా ఉండాలంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం అత్యంత ఆవస్యకం అనే విషయం గురించి పాలక పక్షం సభలో స్పషీ్టకరించనుంది. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవ్వడం ద్వారా కలిగే చేటు గురించి ఉదాహరణలతో వివరించాలని నిర్ణయించింది. 9 గంటలకు అసెంబ్లీ గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో పాటు ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాల అనంతరం శాసన సభా వ్యవహరాల సలహా కమిటీ సమావేశమై, సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏయే అంశాలను చర్చకు చేపట్టాల్లో ఖరారు చేయనుంది. అసెంబ్లీ ఉప సభాపతిగా అధికార పక్షం ఇప్పటికే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప సభాపతి ఎన్నిక ఏ తేదీన చేపట్టాల్లో కూడా శాసన సభా వ్యవహారాల సలహా కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణలపై గురువారం అసెంబ్లీలో అధికార పక్షం స్వల్ప కాలిక చర్చను చేపట్టనుంది. -
ధనస్వామ్యం దండయాత్ర!
మన స్వరాజ్యానికి మొన్ననే అమృతోత్సవం జరుపుకొన్నాం. స్వరాజ్యం సురాజ్యం కావాలంటే ప్రజలే ప్రభువులు కావాలని మన రాజ్యాంగం చాటి చెప్పింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రిపబ్లిక్ డే కూడా మరో రెండేళ్లలో అమృతోత్సవం తలుపు తట్టబోతున్నది. ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్ చెప్పారు. అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాల్లో అణువణువునా ఇదే స్ఫూర్తి ప్రవహించింది. ప్రజలందరి చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలి. భారత రాజ్యాంగానికి హృదయంగా భావించే పీఠిక ఇదే విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పింది. కొన్ని చారిత్రక కారణాల వలన సమాజంలోని విశాల జనబాహుళ్యానికి వెనకబాటు తనం వారసత్వంగా లభించింది. వారందరినీ ముందు వరసలో ఉన్నవారి సరసన నిలబెట్టడానికి ప్రభుత్వం పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. అప్పుడే సమాజంలోని ప్రజలందరి మధ్యన ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. రాజ్యాంగ ఆదేశాలు అటకెక్కిన ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. డబ్బున్నవాడే ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాగలిగే దుస్థితికి ప్రజాస్వామ్యం దిగజారుతున్నది. విద్య అంగడి సరుకైన ఫలితంగా నాణ్యమైన విద్య కలవారి బిడ్డలకే రిజర్వయి పోయింది. పేద పిల్లలకు నాసిరకం చదువు తప్ప గత్యంతరం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి గతంలో ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ సందర్భంగా కాలగమనంలోని ఒక కీలక ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. పి.వి. నరసింహారావు ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆర్థిక వ్యవస్థను సరళీకరించవలసిన అనివార్య పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఈ కర్తవ్యాన్ని ఆయన వ్యక్తిగత శ్రద్ధతో నిర్వహించారు. క్రమంగా గ్లోబల్ ఎకానమీతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానం మొదలైంది. బహుళజాతి కంపెనీలు, వాటి గురుపీఠమైన ప్రపంచ బ్యాంకు రంగప్రవేశం చేశాయి. వారికి దేశంలో కమీషన్లు పుచ్చుకొని పనులు చేసిపెట్టగల రాజకీయ దళారుల అవసరం ఏర్పడింది. ప్రైవేటీకరణ జోరు పెరగడంతో గనులు, వనులు, సహజ వనరులపై పెత్తనానికి పెట్టుబడి దారులు పోటీపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారితో వారికి అవసరాలు పెరిగిపోయాయి. తమ ప్రయో జనాలకు అనుకూలంగా మెలిగే నాయకుల కోసం వారు అన్వేషించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆయనది సంక్షేమ ఎజెండా. పేదల అనుకూల ఫిలాసఫీ. స్వదేశీ విదేశీ పెట్టుబడి దారులకు పనికివచ్చే నాయకుడు కాదు. అదే సమయంలో హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లందరికీ ఎన్టీ రామారావు పట్ల విరక్తి కలిగింది. ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వారికి నచ్చలేదు. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేశారు. కథ ఈ రకంగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల కంటే రెండేళ్ల ముందుగానే ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో లక్షమంది సమక్షంలో లక్ష్మీపార్వతిని భార్యగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో ఎన్టీఆర్‌తోపాటు లక్ష్మీపార్వతి కూడా పాల్గొని ప్రసంగించారు. అప్పుడు లేని ఆగ్రహం గెలిచిన తర్వాత ఏడాదిలోపే పార్టీ ఎమ్మెల్యేలకు కలగడం విడ్డూరమే. కానీ ఈ విడ్డూరమే చరిత్రగా నమోదైంది. అసలు జరిగింది వేరు. సరళీకరణతో అందివస్తున్న అవకాశాలను వేగంగా ఆక్రమించుకోవాలనుకునే స్వార్థపూరిత శక్తులకు చంద్రబాబులో ఒక నమ్మకమైన సేవకుడు కనిపించాడు. ప్రపంచ బ్యాంకు ఆకాంక్షల మేరకు లక్షలాది మంది రైతుల్ని వ్యవసాయ రంగం నుంచి తరిమేసేవాడు, విద్య – వైద్య రంగాలను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించగలిగేవాడు, ప్రభుత్వ ఉద్యోగుల్ని కోతకోసేవాడు చంద్రబాబులో కనిపించాడు. మీడియాతో సహా సమస్త వ్యవస్థలూ చంద్రబాబుకు సహకరించాయి. నిశ్శబ్దంగా ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారు. నిస్సహాయంగా ఆయన మరణించారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడానికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందువల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావజాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామాజిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మానవీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధప్రదేశ్‌లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు. అధికార పీఠాలకు ఆమడదూరంలో ఉంటున్న అనేక సామాజిక వర్గాలను గుర్తించి వారి నుంచి ఎంపిక చేసిన వారికి వివిధ స్థాయుల్లో పదవులు కల్పించారు. ఆ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల దగ్గర్నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు సింహభాగం పదవులను బలహీన వర్గాలకు కేటాయించారు. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్దపీట వేశారు. అన్ని విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళలకు అర్ధభాగం పదవులను కేటా యించారు. రాజకీయ సాధికారత దిశగా బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వేసిన తొలి అడుగులివి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తు న్నది. ఈ మూడేళ్లలో రెండేళ్ల కాలాన్ని కోవిడ్ కాటువేసినప్పటికీ సగటున ఒక్కో విద్యార్థి మీద వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేసింది. ఇప్పుడు అదనంగా ఏటా 24 వేల రూపాయల విలువైన ‘బైజూస్’ కంటెంట్‌ను ఉచితంగా అందివ్వబోతున్నది. అన్ని వర్గాల నుంచి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అత్యంత నాణ్యమైన విద్యను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రపం చంతో పోటీ పడగల మెరుగైన మానవ వనరులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజారోగ్య వ్యవస్థ కొత్త పుంతలు తొక్కబోతున్నది. ప్రతి ఇంటినీ గడువు ప్రకారం ఒక ఫ్యామిలీ డాక్టర్ సందర్శించే దిశగా, ప్రతి వ్యక్తి ఆరోగ్య ప్రొఫైల్ కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటైంది. వ్యవసాయా భివృద్ధిలో రైతుకు అండగా నిలబడేందుకు ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్ల ప్రయోగాన్ని కళ్లారా చూసేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు ఏపీకి వస్తున్నాయి. ప్రజల సాధికారత, ప్రభుత్వ వ్యవహారాల పారదర్శకత, అధికార వికేంద్రీకరణ అనే మూడు అంశాలు సమాజ ప్రజా స్వామ్యీకరణ స్థాయిని నిర్ధారిస్తాయి. అత్యున్నత స్థాయి ప్రజా స్వామ్యీకరణ మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. ఉన్నత స్థాయి ప్రజాస్వామ్యీకరణ ఉన్నత స్థాయి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఇప్పుడు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జీఎస్డీపి గ్రోత్ రేట్ జాబితాలో అగ్రస్థానంలో నిలబడిన ఆంధ్రప్రదేశ్ ఇదే విషయాన్ని నిర్ధా రించింది. ప్రభుత్వ పథకాల అమలులో ఒక్క పైసా వృథా కాని విధంగా పారదర్శక పంపిణీ విధానాన్ని రూపొందించింది. అధికార వికేంద్రీకరణను గ్రామస్థాయికి తీసుకొనిపోయింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు వికేంద్రీకరణలో చిట్టచివరి మెట్టు. ఈ వికేంద్రీకరణలో భాగంగానే రాష్ట్ర రాజధానిని కూడా విభిన్నమైన అభివృద్ధి దశల్లో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతాల మధ్య విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ చర్య ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టనీయడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబుకు వివిధ కారణాలు దోహదపడ్డాయి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం తన నైజమని అనేక సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిలో ఆయనకు సంక్షోభం కనిపించింది. దాన్ని సొంత అవకాశంగా మలుచుకునే ప్రయత్నంలోనే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. తనమీద నమ్మకంతో 34 వేల ఎకరాల భూమిని స్వయంగా రైతులు ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించారని ఆయన చెప్పుకుంటారు. ఈ భూమిలో చాలా భాగాన్ని బాబు అనుయాయులు ముందుగానే కొనుగోలు చేసి రైతుల పేరుతోనే పూలింగ్‌కు అప్పగించారని, మిగిలిన రైతులను తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన పరిస్థితికి నెట్టివేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికంటే ముందుగానే పూలింగ్ ప్రాంతానికి వెలుపల వేలాది ఎకరాల భూమిని తన అనుయాయుల చేత, తన వర్గీయుల చేత కొనిపించారనీ, ఇది అక్షరాల ఇన్సైడర్ ట్రేడింగేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజధాని పేరుతో ప్రపంచంలోనే పెద్దదైన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ఆయన ప్లాన్ చేశారు. ఈ వెంచర్‌పై కళ్లు చెదిరే లాభాలు ఆర్జించడం కోసం తన వారి చేత వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టించినట్టు సమాచారం. ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అనే పేరు ఇప్పటికే ఈ వెంచర్‌కు స్థిరపడిపోయింది. మహిళా సాధికారతలో భాగంగా పేద వర్గాల మహిళల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చింది. ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో కూడా ఒక 50 వేల మంది పేద వర్గాల మహిళలకు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో గగ్గోలు పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కింది. పేద వర్గాలకు పట్టాలివ్వడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించింది. ఇది పక్కా రియల్ ఎస్టేట్ వెంచరే అన్న అంశాన్ని ఈ చర్య నిర్ద్వంద్వంగా నిరూ పించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పేదలకు పట్టాలివ్వాల్సిందేననీ, అందుకు అవసరమైన చట్ట సవరణలు చేయాలనీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రకటించారు. ‘ఇది పాదయాత్ర కాదు, విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండయాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ విజన్‌కు చంద్రబాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆవిష్కృతుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలాసఫీ, అమలు చేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీ రామారావును గద్దె దించేంతవరకు మాయోపాయాలకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లో మీడియాగా అవతరించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విషసర్పాల అవతారం దాల్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారత కోసం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను సహించలేకపోతున్నది. ఆయన మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా నిందా ప్రచారాలకు దిగజారుతున్నది. వారి సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రైతాంగ పోరాటం అనే ముద్ర వేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కుయుక్తులు ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతున్నాయి. చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా ఆగడాల మీద, దుష్ప్రచారాల మీద బలహీన వర్గాల ప్రజలు అతి త్వరలో ప్రజాకోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయబోతున్నారు. తమ బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించినందుకూ, ‘అమ్మ ఒడి’పై దుష్ప్రచారం చేసినందుకూ అమ్మల సంఘం ఛార్జిషీటు సిద్ధ మవుతున్నది. బలహీన వర్గాల ఇళ్ల పట్టాలను కోర్టు ద్వారా అడ్డు కునే ప్రయత్నం చేసి నందుకు ఆ మహిళలంతా నేరారోపణ పత్రాన్ని రచిస్తున్నారు. రాజధాని ప్రాంతం నుంచి బలహీన వర్గాలను వెలివేస్తున్నందుకు ఆ వర్గాలు యెల్లో కూటమిపై అట్రాసిటీ అభియోగం చేయ బోతున్నాయి. ప్రజా కోర్టులో ఇక సందడే సందడి. ధనస్వామ్యం దండయాత్రలను పేదవర్గాలు చీల్చి చెండాడే సందడి. ‘ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రక టించారు. ‘ఇది పాదయాత్ర కాదు విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండ యాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగ ణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపి స్తున్నారు. జగన్ విజన్‌కు బాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. సీఎంగా చంద్రబాబు ఆవిష్కృ తుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలా సఫీ, అమలుచేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడి స్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ను గద్దె దించేంతవరకు మాయోపాయా లకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లోమీడియాగా అవతరించింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విష సర్పాల అవతారం దాల్చాయి. ఆయన సీఎంగా బాధ్యత లను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారతకోసం జగన్ చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయ నకు పెరుగుతున్న ఆదరణను సహించ లేకపోతున్నది.’ ‘చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడా నికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందు వల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపా దించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావ జాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామా జిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మాన వీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీక రించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు.’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కులవాదులకు తగిన శాస్తి తప్పదు
తాడికొండ: తమకు హక్కులు అందకుండా కుట్ర పన్నుతున్న కులవాదులకు తగిన శాస్తి తప్పదని, కోర్టులో వేసిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోపోతే బాబు అండ్ కోను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. మూడు రాజధానులకు మద్దతుగా వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 691వ రోజుకు చేరుకున్నాయి. పలువురు ప్రసంగిస్తూ, కులవాదమే అజెండాగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమంలో టీడీపీ నాయకులు, ప్యాకేజీ పార్టీలు, దళిత దళారులు మినహా ప్రజల మద్దతు లేదన్నారు. అధికారంలో ఉండి భూములిచ్చిన రైతులకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నట్టేట ముంచిన చంద్రబాబును నిలదీయకుండా ఉండేందుకు ముందస్తు ఎత్తుగడతో అమరావతి ఉద్యమం పేరుతో దొంగ దీక్షలకు శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. అరసవెల్లి పేరుతో చందాల యాత్రలకు శ్రీకారం చుట్టిన అమరావతి జేఏసీ నాయకులకు కోట్లాది రూపాయలు ఎక్కడనుంచి అందుతున్నాయో నిఘా వేసి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఎత్తుగడలు వేస్తున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో సమితి నాయకులు గురునాథం, సాంబయ్య, జోషి, ఈపూరి ఆదాం, దాసు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం) -
మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి
కడప కల్చరల్: మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఒనగూరే ప్రయోజనాల గురించి నగరాలు మొదలుకుని మండల స్థాయి వరకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కడప నగరంలోని మానస ఇన్ హోటల్లో ఫోరం రాయలసీమ అధ్యక్షుడు లయన్ కె.చిన్నపరెడ్డి అధ్యక్షతన డాక్టర్ గాజులపల్లె రామచంద్రారెడ్డి రాసిన భావితరాల భవిత–మూడు రాజధానులు పుస్తక పరిచయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి ఇత ర అతిథులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోనే మిగతా ప్రాంతాలు ఎంతో వెనుకబడి రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి స్థితిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ జరగాలన్నారు. ∙నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ దశాబ్దాలుగా మన ప్రాంతం అలసత్వానికి గురైందని, డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలను కూడా లెక్క చేయకుండా పోరాడారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పాలనా వికేంద్రీకరణ వల్లనే మన జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ వస్తున్నాయన్నారు. వైఎస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం రాయలసీమ అధ్యక్షుడు లయన్ కె.చిన్నపరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ విజన్‌కు మారుపేరుగా నిలిచారని కొనియాడారు. ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయిలో కూడా మూడు రాజధానుల వల్ల కలిగే మేలు గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కావడం సీమ వెనుకబాటు తనానికి కారణమన్నారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు శాంతమూర్తి మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమని చెప్పారు. ఫోరం సభ్యుడు డాక్టర్ జాన్‌బాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లాంటి పథకంతో డాక్టర్ వైఎస్సార్ తెలుగు ప్రజలకు దేవుడయ్యాడని, నేడు జగన్ అంతకుమించిన పథకాలు చేపట్టి విజన్ గల నాయకుడిగా పేరు పొందారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి రత్నకుమారి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు తగిన గౌరవం ఈ ప్రభుత్వంలోనే లభిస్తోందన్నారు. డాక్టర్ తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సీమకు అన్యాయం జరిగినా ఈ ప్రాంత వాసులు ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. ఫోరం సభ్యుడు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి నేతను దూరం చేసుకోవద్దని సూచించారు. జోజిరెడ్డి, రాయలసీమ టూరిజం సంస్థ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజు ప్రసంగించారు.