
తాడికొండ : చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడని, ఆ పార్టీని రద్దు చేయాలని బహుజన పరిరక్షణ సమితి నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 749వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తన సీటు కూడా తాను గెలవలేని పవన్.. ఎన్నికల అనంతరం పెయిడ్ ఆర్టిస్టుగా మారి బాబుకు తాబేదారు అవతారమెత్తాడని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేసేందుకు టీడీపీతో చేతులు కలిపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటును తన జీవితంలో భాగంగా చేసుకున్న చంద్రబాబు.. చివరకు పవన్‌కు కూడా ఓ పోటు పొడిచి రాజకీయ సన్యాసిగా మిగల్చడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి, పులి దాసు, పల్లె బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment