Decentralization
-
వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
వికేంద్రీకరణ అనేది ఆధునిక ప్రజాస్వామిక సూత్రం. అభివృద్ధి అనేది ఒక్కచోటు గంపగుత్తగా పోగుపడటం అనేది ప్రాంతాల మధ్య అసమానతలను పెంచుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాజెక్టును రద్దు చేయాలని వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భావించడం సముచితమైన నిర్ణయం. అయితే, చాలామంది గుర్తించాల్సినది... ప్రజలతో కూడిన అమరావతి వేరు, నూతన నగర నిర్మాణం కోసం తలపెట్టిన అమరావతి ప్రాజెక్టు వేరు. చండీగఢ్, నయా రాయ్‌పుర్, లవాసా, నోయిడాల అనుభవంతో చూస్తే కొత్త నగర నిర్మాణాలకు ఉన్న పరిమితులు అర్థం అవుతాయి. పది లక్షల జనాభా దాటిన గుంటూరు, విజయవాడలకు సంబంధం లేకుండా, రెండు నగరాలకు 30– 40 కిలోమీటర్ల దూరంలోనే మరో కొత్త నగరం అనేది ఊహకందదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల ప్రయోజనాలను పణంగా పెట్టి... పరి మిత ప్రయోజనాల కోసం దీన్ని చేపట్టడం అర్థరహితం. అందుకే అమరావతి ప్రాజెక్టును రద్దు చేయడం రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించాల్సిన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి... విశాఖ పట్నం కేంద్రంగా రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంశంపై మరో మారు కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకట నపై సమగ్ర చర్చ చేయాల్సి ఉంది. అమరావతి వేరు, అమరావతి ప్రాజెక్టు వేరు... అమరావతి ప్రాంతాన్నీ, అమరావతి ప్రాజెక్టునూ వేరువేరుగా చూడాలి. అమరావతి ప్రాంతం అంటే అక్కడి ప్రజలు. అమరావతి ప్రాజెక్టు అనేది కొత్త నగర నిర్మాణం పేరుతో రూపొందించినది. అమరావతి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని గుండు గుత్తగా వ్యతిరేకించడం నేడు జరుగుతున్న తప్పుడు ప్రచారం. చెప్పాలంటే నిజానికి ప్రస్తుత రాజధాని నిర్మాణం జరుగుతున్నది అమరావతిలో కాదు, వెలగపూడిలో. అమరావతి ప్రాజెక్టు అందరిదా? అమరావతి ప్రాజెక్టు రూపాన్ని పరిశీలిస్తే... ఎంపిక చేసుకున్న ప్రాంతంలో స్థూలంగా 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అద నంగా రైతుల నుంచి మరో 33 వేల ఎకరాల భూమి తీసుకున్నారు. అందుకు ప్రతిగా అక్కడి రైతులకు ఒకేసారి 1.50 లక్షల రుణమాఫీ చేశారు. కాగా, రాష్ట్రం మొత్తం రైతులకు 5 దఫాలుగా 50 వేల రూపాయలు మాత్రమే మాఫీ చేయడం ఈ సందర్భంగా గమనార్హం. ఇక, ప్రతి ఏటా ఎకరాకు 50 వేలు కౌలుగా అమరావతి ప్రాజెక్టు రైతులకు చెల్లించాలి. ప్రతి ఏటా మొత్తంలో 10 శాతం పెంచుకుంటూ, 10 సంవత్సరాల పాటు ఇవ్వాలి. కేవలం ప్రతి ఏటా చెల్లించే కౌలు మాత్రమే 165 కోట్ల రూపాయలు. దీనికి ప్రతి ఏటా 10 శాతం అదనంగా పెంచి ఇవ్వాలి. అభివృద్ధి చెందిన రాజధానిలో మూడవ వంతు తిరిగి ఇవ్వాలి. అంటే ఒక లక్ష ప్లాట్లు అన్నమాట! స్థూలంగా అక్కడి రైతులకు 11 వేల ఎకరాల భూమి అభివృద్ధి చెందిన రాజధానిలో ఉంటుంది. అంటే మొత్తం 50 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రాజధానిలో ప్రభుత్వ భూమి పోను, మిగిలిన భూమి అంతా ఆ 19 గ్రామాలకు చెందిన ప్రజలకు మాత్రమే చెందినదిగా ఉంటుంది. అలాంటి రాజధాని 5 కోట్ల మంది ప్రజలది ఎలా అవుతుంది? ఇది ఆచరణలో సాధ్యమా? గత తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన రాజధాని ప్రాజెక్టు ఆచరణలో సాధ్యమా? ఎందుకు ఈ అనుమానం వస్తున్నదీ అంటే... రాజధాని కార్యాలయాలు ఉండటం వేరు, కొత్త నగర నిర్మాణం చేపట్టడం వేరు. దేశంలో కొత్త నగర నిర్మాణాల రూపు రేఖలు పరి శీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. చండీగఢ్, నయా రాయ్‌పుర్ (చత్తీస్‌గఢ్), లవాసా (మహారాష్ట్ర), నోయిడా (ఉత్తరప్రదేశ్)ల అనుభవంతో చూస్తే కొత్త నగర నిర్మాణాలకు ఉన్న పరిమితులు అర్థం అవుతాయి. 10 లక్షల జనాభా దాటిన గుంటూరు, విజయవాడలకు సంబంధం లేకుండా, రెండు నగరాలకు 30–40 కిలోమీటర్ల దూరంలోనే మరో కొత్త నగరం, అందులోనూ హైదరాబాద్ స్థాయి నగరాన్ని నిర్మించడం అనేది ఊహకందదు. అందుకే నగర నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న శివరామకృష్ణన్... అమరావతి ప్రాజెక్టు కోసం రాష్ట వనరులను, శక్తి సామర్థ్యాలను వెచ్చించడం అంటే ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని హెచ్చరించారు. నూతన నగరం అవసరమేనా? 5 కోట్ల పై చిలుకు జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నగరాలు ఉంటాయి? ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు లాంటి ఎని మిది నగరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో నగరం నిర్మించడం సాధ్యమేనా? కొత్త నగరాన్ని కోరుకుంటున్నవారు చెపుతున్నది పెట్టుబడులను ఆకర్షించాలని. రాష్ట్రంలో ఐటీ కంపెనీల కోసం తిరుపతి, హిందూ పురం అత్యంత అనువయిన ప్రాంతాలు. పారిశ్రామిక అవకాశాలకు విశాఖ, కాకినాడ, శ్రీసిటీ లాంటివి అందుబాటులో ఉన్నాయి. స్వల్ప ఖర్చుతో ఈ నగరాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. వీటిని పక్కనపెట్టి... ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదా వరి జిల్లాల ప్రయో జనాలను పణంగా పెట్టి... అత్యంత వ్యయ ప్రయాసలతో, పరిమిత ప్రయోజనాల కోసం, పాలకుల వ్యక్తిగత అవసరాల (పేరు ప్రతిష్ఠలు) కోసం చరిత్రలో నిలిచిపోయే రాజధాని నిర్మాణం చేపట్టడం ప్రమాదకరం. ఆధునిక నగరాలుగా విశాఖ, తిరుపతి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రాంతాల స్వభా వాన్ని అర్థం చేసుకుంటే... విశాఖపట్నం, తిరు పతి మహా నగరాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలుస్తుంది. విశాఖ ఇప్పటికే మహానగర ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ఆ తర్వాత ఈ అవకాశం తిరుపతికి ఉన్నది. చెన్నై, బెంగుళూరు మహానగరాలకు అత్యంత సమీపంలో తిరుపతి ఉన్నది. వాతావరణ సమతుల్యత ఉన్న తిరుపతి... ఐటీ కేంద్రంగా ఆధు నిక అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. చెన్నై వరదలు వచ్చిన ప్పుడు తిరుపతికి ఉన్న సానుకూలాంశాలు ఏమిటో అర్థమయ్యాయి. శ్రీసిటీ విజయవంతం కావడాన్ని పరిగణన లోకి తీసుకొని విశాఖ, తిరుపతిలను ఆధునిక అవకాశాలను అంది పుచ్చుకునే విధంగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలి. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన అమరావతి ప్రాజెక్టును రద్దు చేయాలని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం భావించడం సముచితమైన నిర్ణయం. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా మహానగర నిర్మాణ ఆలోచనను పక్కన పెట్టాలి. రాజధానితో సహా అభివృద్ధి, నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలి. వీటికి కేటాయింపులు జరిపి, సత్వర పూర్తికి చర్యలు తీసుకోవాలి. మొత్తం ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం లాంటి విషయాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం లాగా కాకుండా... ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి అభిప్రాయాలను, అభిమతాలను పరిగణనలోకి తీసుకోవాలి. హేతుబద్ధ నిర్ణయం తీసు కొని సమతుల్యతతో కూడిన సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలి. మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త ‘రాయలసీమ మేధావుల ఫోరం’ సమన్వయకర్త, తిరుపతి ‘ మొబైల్: 94904 93436 -
అభివృద్ధికి కీలకం... వికేంద్రీకరణ
ఏ రాష్ట్రమైనా సుసంపన్నం కావాలంటే పంచాయతీ రాజ్ వ్యవ స్థను పటిష్ఠపరచాలి. మొత్తంగా దేశం అభివృద్ధి పంచాయతీ రాజ్ వ్యవస్థ బలంపైనా, అది ఏ మేర పాలనను వికేంద్రీకరిస్తుంది అన్న అంశాల పైనా ఆధారపడి ఉంటుంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని ప్రాథమిక స్థాయి సంస్థలకు అధికారాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో గుర్తించారు. స్థానిక సంస్థలకు అధికారాలు పంచడం కోసం రాజ్యాంగ సవరణకు సైతం వెనుకాడలేదు. ఫలితంగా 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థ రూపు దిద్దుకొంది. ఈ వ్యవస్థే గత 30 ఏళ్లుగా కేరళతో పాటు అనేక రాష్ట్రాల్లో అద్భుత ఫలితాలను ఇచ్చింది.కేరళ వంటి రాష్ట్రాల సామా జిక, ఆర్థిక అభివృద్ధికి అక్కడి చైతన్య వంతమైన పంచాయతీ వ్యవస్థ ముఖ్య కారణం. గ్రామ పంచాయతీ స్థాయిలోనే పాలన సమర్థంగా అందడం, మరికొన్ని ఇతర అంశాలు దీనికి కారణం. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్థల బలోపేతం, పాలన వికేంద్రీకరణ అంశాల్లో ముందు వరుసలోనే ఉన్నాయి.పరిమితమైన వనరులను దృష్టిలో పెట్టుకుంటే గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీలకు అందే నిధులు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే ఈ నిధులు తలసరి లెక్కలో విడుదల అవుతూంటాయి. పోనీ పంచాయతీలు సొంతంగా ఏవైనా వినూత్నమైన ఆదాయ వనరులను సమకూర్చుకోగలవా? ఇది కూడా వీలు కాని విషయమే. ఇలా చేసుకోగలిగితే ఆ గ్రామపంచాయతీ చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. కేరళలో కొన్ని గ్రామ పంచాయతీలు వినూత్నమైన పద్ధతుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తూండటం ఇక్కడ చెప్పుకోవా ల్సిన విషయం. 2030 నాటికి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామ పంచాయతీల బలోపేతం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవు తుంది. ఆర్థిక సహకారం, పాలన పరంగా స్వాతంత్య్రం కూడా అవసరమవుతాయి. వీటితోపాటు గ్రామ పంచాయతీల స్థాయిలో సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో సమర్థమైన, వికేంద్రీకృతమైన పరిపాలన సాగేందుకు కింది సూచనలను కూడా పరిగ ణనలోకి తీసుకోవచ్చు. దీనివల్ల మానవ వనరుల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ‘2022 నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్’ ఇచ్చిన సలహా సూచనల సాయంతో పనులు చేపట్టాలి. ప్రణా ళిక రూపకల్పన, అమలులో గ్రామపంచాయతీల్లోని ప్రజలందరూ భాగ స్వాములయ్యేలా చూడాలి. ఇందుకు తగ్గట్టుగా గ్రామ పంచాయ తీలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చాలి. దాతృత్వసంస్థల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు సమ కూరేలా వ్యస్థలను ఏర్పాటు చేయాలి. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల్లో సర్వతో ముఖాభివృద్ధి సాధించగలవని నా విశ్వాసం. – డా.డబ్ల్యూ. రాంపుల్లా రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఎన్ఐఆర్డీ మాజీ డైరెక్టర్ జనరల్ -
సీఎం జగన్ కీలక ప్రకటన.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని వెల్లడించారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని సీఎం అన్నారు. ‘‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో పెత్తందార్లు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అని జిల్లాల అభివృద్ధి. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు మీరే తోడుగా నిలవండి. మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలండి’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం, నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘పోర్టుల ద్వారా జిల్లా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. పోర్టులకు అవకాశం ఉన్నా దశాబ్ధాలుగా పట్టించుకోలేదు. శ్రీకాకుళం జిల్లా భవిష్యత్ లో మహానగరంగా ఎదగాలి. మూలపేట మూలన ఉన్న పేటకాదు.. అభివృద్ధికి మూలస్తంభం. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రం మారుతుంది. మూలపేట పోర్టు పూర్తయితే దాదాపు 35 వేల మందికి ఉపాధి లభిస్తుంది. పోర్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. భవిష్యత్ లో శ్రీకాకుళం మరో ముంబై, మద్రాస్ కాబోతుంది’’ అని సీఎం అన్నారు. చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ ‘‘పోర్టు సామర్ధ్యం 100 మిలియన్ టన్నులకు పెరగనుంది. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. గంగపుత్రుల వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి. పోర్టుతోపాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్. మన అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
మందడంలో బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి
సాక్షి, అమరావతి: మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సత్యకుమార్ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆడవాళ్లని చూడకుండా టెంట్లో నుంచి లాక్కొచ్చారన్నారు. బీజేపీ ముసుగులో టీడీపీ నాయకులు వచ్చి వీరంగం సృష్టించారని, ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వికేంద్రీకరణ మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఇదంతా చంద్రబాబు వెనుకుండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆదినారాయణ పిచ్చొడిలా మాట్లాడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ‘‘సీఎంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు దీక్ష వద్దకు వచ్చి రెచ్చగొడుతున్నారు. సత్యకుమార్ అనుచరులు దళితులపై దాడి చేశారు’’ అని ఎంపీ సురేష్ నిప్పులు చెరిగారు. చదవండి: ఊహలే వార్తలా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
వికేంద్రీకరణే మా విధానం
-
శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలి: సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
సాక్షి, ఢిల్లీ: ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్‌పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు ఇవే.. - ఏపీలో ఏకైన అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. - రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - అసెంబ్లీ, సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. - హైకోర్టు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. - ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థల్ని విస్తరించాలి. - రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. - ముఖ్యంగా(గుంటూరు-విజయవాడ మధ్య) సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. - విజయవాడ-గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుంది. ఈ ప్రాంతం భూకంప క్షేత్రం. అందుకే ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. - అన్ని జిల్లాల ప్రధాన నగరాల్లో సమాగ్రాభివృద్ధికి విధివిధానాలను రూపొందించాలి. -
టోక్యోకు టాటా..!
జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తేనే అభివృద్ధి అంటున్న కిషిదా సర్కార్ రాజధాని పొమ్మంటోంది. తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపొమ్మంటోంది. జన ప్రభంజనం ఒక్కచోటే ఉంటే ఆ ఊరు తట్టుకోవడం కష్టం. అందుకే జపాన్ ప్రభుత్వం టోక్యోకు టాటా చెప్పేవారికి భారీగా తాయిలాలు ఆశ చూపిస్తోంది జపాన్ రాజధాని టోక్యోకు ఎందుకీ పరిస్థితి వచ్చింది...? డబ్బులిచ్చి మరీ జనాన్ని వెళ్లిపొమ్మని చెప్పడానికి కారణాలేంటి ? జపాన్ రాజధాని విడిచి పెట్టి వెళ్లిపోవడానికి అక్కడ ప్రభుత్వం భారీ తాయిలాలు ప్రకటించింది. కుటుంబంలోని పిల్లలకి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్ అంటే భారత్ కరెన్సీలో రూ. 6 లక్షలు ఇస్తామని ఆశ చూపిస్తోంది. జపాన్‌లో జనాభా దేశవ్యాప్తంగా సమానంగా విస్తరించలేదు. అక్కడ నగరాలు, పట్టణాలు జనంతో కిక్కిరిసిపోతూ ఉంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి. టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో జనాభా అంతకంతకూ పెరిగిపోతోంది.అందుకే కుటుంబంలో ఒక్కో పిల్లకి 10 లక్షల యెన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జపాన్‌కు ఇదేమీ కొత్త కాదు. మూడేళ్ల క్రితం కూడా టోక్యోకి టాటా చెప్పండంటూ 3 లక్షల యెన్లు ప్రకటించించింది. జనాలెవరూ రాజధాని వీడి వెళ్లడానికి ఇష్టపడ లేదు. దీంతో ఈ సారి ఇన్సెంటివ్ను భారీగా పెంచి 10 లక్షల యెన్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెళ్లేవారికి ఈ ఇన్సెంటివ్ లభిస్తుంది. టోక్యో ఉక్కిరిబిక్కిరి జపాన్‌లో నానాటికి జనాభా తగ్గిపోతోంది. 1973 నుంచి ఆ దేశంలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. 2020–21 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6,44,000 మంది తగ్గిపోయారు. 2022 సంవత్సరం జనవరి–సెప్టెంబర్ మధ్య జపాన్‌లో కొత్తగా 5,99,636 మంది జన్మించారు. ప్రస్తుతం జపాన్ జనాభా 12.50 కోట్లు కాగా టోక్యో జనాభా 1.5 కోట్లు. దేశంలో మొత్తం జనాభాలో ఇంచుమించు 10శాతం మంది రాజధానిలోనే నివసిస్తున్నారు. ఈ నగరంలో జన సాంద్రత (చదరపు కి.మీ. నివసించేవారి సంఖ్య) 6,158గా ఉంది. జపాన్‌లో జనాభా తగ్గుతూ వస్తూ ఉంటే టోక్యోలో జనాభా గత దశాబ్దంలో 16% పెరిగింది. యువతీ యువకులు ఉపాధి అవకాశాల కోసం రాజధాని బాట పడుతున్నారు. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనాభాతో టోక్యో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. 2020 నాటికి జపాన్‌లో జనాభాలో 52% మంది మూడు అతి పెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలైన టోక్యో, ఒసాకో, నగోయాలో నివసిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో 48% మంది ఉన్నారు.2050 నాటికి ఈ మూడు నగరాల్లోనే 57% మంది నివసిస్తారని, మిగిలిన ప్రాంతాల్లో 43% మంది ఉంటారని అంచనాలున్నాయి. దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలన్నింటికీ టోక్యో కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ముప్పు పెరిగిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయా ? దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే జనాభా వికేంద్రీకరణ కూడా జరగాలని జపాన్ అధ్యక్షుడు ఫ్యూమియో కిషిదా భావిస్తున్నారు. అందుకే పల్లెలకు, ఇతర పట్టణాలకు కూడా ప్రజలు వెళ్లి స్థిరపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పల్లెల్లో కాలుష్యం లేని జీవనంపై ప్రత్యేకంగా వీడియోలు విడుదల చేస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రతీ ఒక్కరూ రాజధానిలో మకాం ఉంటే జరిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్యంతో పాటు నగరాల్లో ఉంటే సదుపాయాలన్నీ పల్లెల్లో కల్పిస్తోంది. ఏ ప్రాంతంలోనైనా జనం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కరోనా తర్వాత ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ కావడంతో టోక్యోలో ఉండాల్సిన పని లేదని, ఇతర చోట్లకు వెళ్లాలంది. 2019లో 71 కుటుంబాలు టోక్యోని వీడి వెళితే, 2021లో 1184 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2027 నాటికి ఏడాది 10 వేల కుటుంబాలు మకాం మారుస్తాయని అంచనాలు వేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారింది: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పాలన వికేంద్రీకరణపై ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించే యోచనలో సీఎం ఉన్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో జరుగుతోన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ‘త్వరలో విశాఖ నుంచి పాలన యోచనలో సీఎం ఉన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయంగా మారనుంది. ప్రతిపక్ష పార్టీలకు అసత్య ప్రచారమే పనిగా మారింది. వారి దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు.’ అని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి. జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్నాయని, ఇప్పటికే తిరుపతి, గుంటూరు-విజయవాడ, రాజమండ్రిలో పూర్తయినట్లు చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయలను ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్యటక ప్రాంతమని, విశాఖను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ శ్రేణులో జోష్ -
ఆనాడు అదరగొట్టారు.. ఈనాడు దాచిపెట్టారు.!
అమరావతి రాజధాని వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు, ఆ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా ఆహ్వానించదగినవి. ఏపీ హైకోర్టు గత మార్చి నెలలో దీనికి సంబంధించి తీర్పు వెలువరించినప్పుడే కాస్త హేతుబద్దంగా ఆలోచించేవారికి, చట్టాలు, రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారికి ఆశ్చర్యం కలిగించింది. ఇదేమిటి! మూడు నెలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఆరు నెలల్లో రాజధాని నిర్మించాలని కోర్టు చెప్పడం ఏమిటని అనుకున్నారు. సరిగ్గా ఆ భావనలకు అనుగుణంగానే సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అవి అద్బుతమైన ఆదేశాలని, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ అని తెలుగుదేశం పార్టీవారు కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియా సంస్థలు కాని ప్రచారం చేశాయి. సంపాదకీయాలు రాసి ఊదరగొట్టాయి. ఎల్లో మీడియాకు మింగుడు పడలేదా? విశేషం ఏమిటంటే ఇప్పుడు ఆ మీడియాకు ఈ స్టే ఆదేశాలు మింగుడుపడనివిగా మారాయి. అందుకే స్టే ఇవ్వని రెండు అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నించాయి. రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటుపై శాసనసభకు చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే ఇవ్వని మాట నిజమే. కానీ అందుకు న్యాయమూర్తులు కారణం కూడా చెప్పారు. ఆ అంశంపై స్టే ఇస్తే, ఇక విచారణ నిరర్ధకం అవుతుందని, అన్ని అంశాలపై లోతుగా విచారిస్తామని వారు అన్నారు. అంతవరకు అభ్యంతరం లేదు. స్టే ఆధారంగా మరో కొత్త చట్టం తెచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మాట చెప్పి ఉండవచ్చు. రాజ్యాంగంలో ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కొన్ని మౌలిక అంశాలను లేవనెత్తింది. లేని చట్టాలపై హైకోర్టు ఊహాజనితంగా తీర్పు ఇవ్వవచ్చా అన్న ప్రశ్నను ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. రాజధాని నిర్ణయం అంశం రాష్ట్రం పరిధిలోనిదని ప్రభుత్వ వాదన. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేసి, రాజధాని అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదని స్పష్టం చేసింది. బహుశా కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వబోయే అఫిడవిట్లో అదే విషయం చెప్పవచ్చు. గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ నుంచి పలు సమస్యలు ఎదుర్కుంటోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఆయా కేసులలో కొందరు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండేవి. చివరికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి న్యాయమూర్తులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, తీర్పులో పెట్టాలని కోరారు. రాజధానిపై చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు అనడంపై శాసనసభ చర్చించింది. అందులో మాట్లాడిన వక్తలంతా హైకోర్టు తీరును తప్పు పట్టారు. ఈ నేపధ్యంలో వివిధ కారణాలతో ఆలస్యంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదనను చాలావరకు బలపరిచేలా స్టే ఇచ్చినట్లు అనిపిస్తుంది. అంతిమంగా ఎలాంటి తీర్పు ఇస్తుందన్న అంశంపై మనం వ్యాఖ్యానించజాలనప్పటికీ, మొత్తం మీద ప్రభుత్వానికి చాలావరకు ఊరట అని చెప్పాలి. బాబు, దత్తపుత్రుడి నోట.. మాట రాలేదెందుకు? శాసన అధికారాలలో హైకోర్టు జోక్యాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గమనించారని అనుకోవాలి. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానింగ్ నిపుణులా అని ప్రశ్నించడం, అన్నీ హైకోర్టే చేస్తే ఇక ప్రజా ప్రతినిదులు ఎందుకు, క్యాబినెట్ ఎందుకు అని ప్రశ్నించిన తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరూ దీనిపై స్పందించకపోవడం కూడా గమనించాలి. ఈ కేసులో సుప్రీంకోర్టులో ఏ మాత్రం అనుకూలత వ్యక్తం అయినా, వారు ఈ పాటి ఇల్లెక్కి కోడై కూసేవారు. రాష్ట్ర ప్రభుత్వం దిగిపోవాలన్నంతవరకు వెళ్లేవారు. వారు మాట్లాడలేదు కాని, కొందరు అమరావతి రైతుల పేరుతో పాటు సీపీఐ నుంచి రామకృష్ణ మాత్రం స్పందించారు. హైకోర్టు రెండు అంశాలపై స్టే ఇవ్వలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని వారు కోరారు. అది మొక్కుబడి కామెంట్ అన్న సంగతి తెలుస్తూనే ఉంది. కాగా జనవరి 31 వరకు ఈ కేసును వాయిదా వేసినందున రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకు వెళ్లకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయ శాస్త్ర విద్య అభ్యసించేవారికి ఇది మంచి కేస్ స్టడీ అవుతుంది. హితేషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సుప్రీం వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నాయి: మంత్రి బొత్స
-
‘వికేంద్రీకరణ దిశగా ముందుకెళ్తాం’
విజయవాడ: అభివృద్ధి ఒకే చోట కేంద్రీకరించడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనేదే సీఎం జగన్ సంకల్పమన్నారు. వికేంద్రీకరణ దిశగా ముందుకెళ్తామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. సుప్రీం వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నాయి రాజధాని అంశానికి సంబంధించి సుప్రీం వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమరావతిపై తమ ప్రభుత్వం ఎప్పుడూ యూటర్న్ తీసుకోలేదన్నారు. రైతులతో చేసుకున్న ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు బొత్స. -
రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం: మంత్రి అంబటి
-
మేము మొదట నుంచి ఇదే చెప్తున్నాం: కన్నబాబు
కాకినాడ: పరిపాలన వికేంద్రీకరణ అంశానికి సంబంధించి ఈరోజు(సోమవారం) సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాన్ని సమర్థించేలా ఉన్నాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రజాస్వామ్య వాదులంతా హర్షిస్తున్నారని స్పష్టం చేశారు కన్నబాబు. మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని మొదటి నుంచి చెప్తున్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో చంద్రబాబు భూములు కొనిపించారు.భావి తరాలకు అన్యాయం చేసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.రియల్టర్లతో చంద్రబాబు అమరావతి యాత్ర చేయించారు’ అని అన్నారు. -
అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సజ్జల
-
‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైంది’
కర్నూలు: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి హైకోర్టులో భిన్న తీర్పులు వచ్చాయని, అయితే ఒకే ప్రాంతానికి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు సజ్జల. ఈరోజు(సోమవారం) కర్నూలులో మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘ సీఎం వైఎస్ జగన్ ఆశయాలను నెర వేరుతున్నాయి, ఆయన తీసుకున్న నిర్ణయానికి ఏపీలో ప్రజలు మద్దతు ఇస్తున్నారు..స్వాగతిస్తున్నారు. చట్టం కూడా సీఎం వైఎస్ జగన్‌కు సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు కుట్రలకు సుప్రీంకోర్టు మొట్టికాయలు కొట్టింది. ఒకే చోట రాజధాని కట్టాలని హైకోర్టు చెప్పడం సరైనది కాదు, దానిపై సుప్రీంకోర్టు తప్పుపట్టి, ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్, రామోజీ రావు కోరిక చంద్రబాబు సీఎం కావాలనేది. కానీ ఇది ప్రజలు తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని కోరిక లేదు. చంద్రబాబు సీఎం కావాలని ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారు’ అని సజ్జల పేర్కొన్నారు. చదవండి: రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు అమరావతి రాజధాని కేసు: హైకోర్టు ఆదేశాల్లో సుప్రీం స్టే విధించిన అంశాలివే -
వికేంద్రీకరణపై మీ వైఖరేంటి?
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణపై వైఖరేమిటో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కనీసం ఒకే రాజధాని అమరావతి కేంద్రీకృతంగా ఎందుకు ఉండాలో చెప్పాలని నిలదీశారు. ‘కర్నూలులో చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. రాయలసీమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధం. అసెంబ్లీలో చర్చిద్దాం రండి. మీ బండారం బయటపెడతాం’ అంటూ ప్రతి సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ప్రజలను తిట్టడానికి ఏం హక్కుంది బాబూ? ► తమ ఆకాంక్షల మేరకు న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయడంపై మీ వైఖరేమిటని ప్రశ్నించిన ప్రజలకు సమాధానం చెప్పకుండా వారిని తిట్టే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు? ► పట్టాభి నుంచి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వరకూ ప్రజలపై బూతులతో ఎదురు దాడికి దిగుతున్నారు. టీడీపీ అంటే తిట్లు, దూషణలు, పచ్చిబూతుల పార్టీగా నిరూపించుకుంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు అంటే.. ప్రజలకు ఇవే చివరి ఎన్నికలని ఎల్లో మీడియా చెబుతోంది. ఇది ఆఖరిఛాన్స్.. లేకపోతే నాశనం అవుతారని ప్రజలకు శాపం పెడతారా? ప్రజల ఆకాంక్షల మేరకే వికేంద్రీకరణ ► 1937లో శ్రీబాగ్ ఒడంబడిక కుదిరినప్పటి నుంచే వికేంద్రీకరణ డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత వికేంద్రీకరణపై విస్తృతమైన చర్చ జరిగింది. శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీలు వికేంద్రీకరణ ఆవశ్యకతను నొక్కిచెప్పినా నాటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. సరైన రోడ్డు సౌకర్యం లేని ప్రాంతంలో రాజధాని పెట్టారు. ► అక్కడ రాజధాని నిర్మించాలంటే ఏళ్లపాటు రాష్ట్ర బడ్జెట్‌ను మొత్తం అక్కడే వెచ్చించాల్సి ఉంటుంది. ఇది మిగతా ప్రాంతాలకు అన్యాయం చేయడమే. అందువల్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని అమరావతి ప్రాంతం ప్రజలకు చెబుతున్నాం. అక్కడా బైపాస్ రోడ్డు నిర్మిస్తూ, కరకట్ట రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ఎన్నడూ అమరావతిలోనే రాజధాని రావాలని కోరలేదు. బాబుకూ ఆ కోరిక ఉందేమో! ► మొన్న ఇప్పటంలో ఇళ్లు కూల్చకున్నా, కూల్చినట్లు చెప్పు చూపుతూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నేతలపై రెచ్చిపోయారు. కర్నూలులో తనను నిలదీసిన ప్రజలపై ఆగ్రహంతో ఊగిపోతూ తనకు సభ్యత ఉంది కాబట్టే చెప్పు చూపించడం లేదని జనంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. అంటే పవన్ కళ్యాణ్ అసభ్యంగా వ్యవహరించాడని చంద్రబాబు ఒప్పుకున్నట్లే. లేదంటే తనకూ ఆ కోరిక ఉందని బహిర్గతం చేసినట్లే. ‘ఇదేం ఖర్మ’ అంటూ ప్రజలు టీడీపీని తిరస్కరించారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ► రాష్ట్రంలోని అన్ని చిట్‌ఫండ్ కంపెనీలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు దాడులు చేస్తే.. తమపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని ‘ఈనాడు’ రామోజీరావు అనడం హేయం. -
అమరావతిని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు
రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించామన్నారు. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని, అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచామని తెలిపారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించాం. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని చెప్పాం. అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచాం. వెనుకబడ్డ ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లక్ష ఎకరాలకు పైగా ఉన్నాయి. నిర్మాణ వ్యయం కూడా తక్కువ. రాజధాని ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించేది. పైగా సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య కూడా ఉండదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా చంద్రబాబు మాత్రం నిర్మాణాలకు ఏ విధంగానూ అనువుగా లేని అమరావతినే ఎంచుకున్నారు. ఎలాంటి ఆలోచనా లేకుండా అప్పటికప్పుడు అమరావతి పేరు ప్రకటించారు. నిత్యం పంటలతో నందనవనంలా కళకళలాడే కృష్ణా డెల్టాలో కాంక్రీట్ పోసి నాశనం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతి ప్రాంతం తప్ప మరెక్కడైనా రాజధాని నిర్మించాలని సూచించినా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు’ అని వివరించారు. వికేంద్రీకరణ చాలా అవసరం పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రాంతీయ అసమానతలు తొలగించవచ్చని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే విజయవాడ, విశాఖలో బెంచ్‌లు పెట్టాలని అన్నారు. పరిపాలన కోసం నాలుగు జోన్లలోనూ డివిజనల్ కార్యాలయాలు పెట్టి, సచివాలయ అధికారాలు వాటికి బదిలీ చేయాలని, అప్పుడు ప్రజలకు వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. ఇటీవల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు బాగుందని, కోస్తా, కృష్ణా డెల్టా ప్రాంతాలు లాభపడుతున్నాయని అన్నారు. నెల్లూరు – తిరుపతి మధ్య కూడా పరిశ్రమలు వచ్చాయని, కర్నూలు ప్రాంతం మాత్రం వెనుకబడి పోయిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడ సర్ప్లస్ ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచేవారన్నారు. విడిపోయాక రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, ఈ పరిస్థితి మరోసారి రాకూడదంటే అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టిందని, ఇది కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెడుతుందని ఆంజనేయరెడ్డి చెప్పారు. పోలవరంపైనా బాబు తప్పుడు నిర్ణయం కేంద్ర పరిధిలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడమే పెద్ద పొరపాటుగా ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆయన తప్పిదం వల్ల ఇప్పుడు ఎస్కలేషన్ ఖర్చే దాదాపు రూ.60 వేల కోట్లకు పెరిగిపోయిందన్నారు. లేదంటే కేంద్రమే ప్రాజెక్టును పూర్తిచేసి ఇచ్చేదని చెప్పారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సమయంలోనే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్న డిమాండ్ వచ్చిందని తెలిపారు. ఆనాడు కర్నూలును రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ విడిపోయాక కూడా సీమకే అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు కర్నూలును అభివృద్ధి చేసి ఉంటే సీమ బాగుపడేదని, అమరావతి వల్ల ఎక్కువగా నష్టపోయింది రాయలసీమేనని అన్నారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మైనింగ్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించాలని సూచించారు. కేవలం ఐటీ పరిశ్రమ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రాంతాన్ని బట్టి అనువైన పరిశ్రమలు రావాలని చెప్పారు. -
Rayalaseema: మన రాయలసీమది ఘన చరిత్ర
రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అనాథ కాదు. నాటి నిజాం, ఆంగ్లేయుల పాలనతోనే కరువుసీమగా మారింది. నిజాం తమ అవసరాల కోసం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు రాయలసీమ అని నామకరణం జరిగిన రోజు 1928 నవంబర్ 18. 1800 సంవత్సరానికి పూర్వం రాయలసీమ రతనాల సీమ. రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడం, వరుస దాడుల కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠాలతో యుద్ధ భయం ఉన్న నిజాం ఆంగ్లేయులతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహారం ఇవ్వలేక సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలి వేసినాడు. బలమైన సైనిక సామర్థ్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన పాలెగాళ్లు నిలువలేకపోయినారు. అయినా ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సీమ పాలెగాళ్లు తొలి స్వాతంత్య్రోద్యమాన్ని నిర్వహించారు. అయినా ఈనాటికీ వారికి ఆ స్థానం లభించలేదు. ఆంగ్లే యులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీడెడ్ జిల్లాలుగా పిలిచారు. తెలుగులో దత్తమండలం అని పిలిచినా, సీడెడ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్థం సరికాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అనడం కన్నా, ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్తే సీమ ప్రజల మన్ననలను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు. నంద్యాల సభలో కీలక నిర్ణయం 1913లో ప్రారంభమైన ఆంధ్ర మహసభలు 1928లో నవంబర్ 17,18 తేదీలలో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు దత్తమండలం సమస్యలపై అవకాశం ఇస్తేనే సహకరిస్తామన్న ఈ ప్రాంత నేతల ఒత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రథమ దత్తమండల సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న చిలుకూరి నారా యణరావు గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదనీ, రేనాడు రాజులు, విజయనగర రాజులు పాలించిన నేపథ్యం ఉన్నందున రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందనీ ప్రతిపాదించినారు. దాన్ని పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నాటి నుంచి రాయలసీమ పేరు వాడుకలోకి వచ్చింది. అన్నమయ్య, వేమన లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన ప్రాంతం రాయలసీమ. పప్పూరి తెలుగు ప్రజలు గర్విం చదగ్గ దేశభక్తుడు. వారి జయంతిని ప్రభుత్వం అధికారి కంగా నిర్వహిస్తే సముచితంగా ఉంటుంది. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అని తెలుస్తున్నా, ఆ వైపుగా కేంద్రం దగ్గర అధికారిక గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వం దైవ కార్యక్రమం అయిన కృష్ణ పుష్కరాలను నది ప్రారంభమైన శ్రీశైలం దగ్గర కాకుండా సముద్రంలో కలిసే దగ్గర నిర్వ హించింది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ ముఖ ద్వారం ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పుష్కరాలు నిర్వహిం చారు. శ్రీశైలంలో నిర్వహిస్తే ప్రజలు పాల్గొని మన రాయల సీమలో పుష్కలంగా నీరు ప్రవహిస్తుందన్న చైతన్యం ప్రజలలో వస్తుంది. 1928లో రాయలసీమ అని నామకరణం జరిగిన సమయంలోనే, ఆంధ్రప్రాంతంతో కలిపి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలన్న చర్చలు నడుస్తున్న రోజు లలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో స్థాపించాలని 1926లో జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానాన్ని, మద్రాసు శాసనసభ తీర్మానాన్ని సైతం ఉల్లంఘించి అనం తలో ఉండాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడ, అటు పిమ్మట వైజాగ్ తరలించారు. గత అనుభవాన్ని మరిచి అమాయక సీమ పెద్దలు శ్రీభాగ్ ఒప్పందం అవగాహనతో ఆంధ్ర రాష్ట్రంగా ఉండటానికి ఇష్టపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాలకే తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా మారినపుడు పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన ‘కర్నూలు రాజధాని’ డిమాండును వదులుకున్నారు. కీలక సమయం వచ్చినపుడు తప్పుటడు గుల కారణంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ 2014లోనైనా సీమకు రాజధాని రావాల్సి ఉంది. కానీ కనీసం హైకోర్టు కూడా రాలేదు. వికేంద్రీకరణలో న్యాయం జరగాలి... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ విధానంలో భాగంగా రాజధానిలోని మూడు కీలక వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుతో బాటు న్యాయ స్వభావం ఉన్న కార్యాలయాలను కర్నూలులో నెలకొల్పడానికి ముందుకు వచ్చారు. ఈ వెసులుబాటును కూడా రాయలసీమకు రావాడాన్ని వ్యతిరేకించే పరిస్థితులు నెల కొన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ‘కేఆర్ఎంబీ’ని కర్నూలులో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రోజు వారీ సమీక్షతో సంబంధం లేని పలు కమిషనరేట్లు రాయలసీమలో ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా శ్రీభాగ్ ఒప్పందంలో కీలకమైన కృష్ణా, తుంగభద్ర నీటిని రాయలసీమకు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అది జరగాలంటే సిద్ధేశ్వరం, గుండ్రేవుల, పోతిరెడ్డిపాడు వెడల్పు, కాల్వల సామర్థ్యం పెంపు, చెరువుల పునరుద్ధరణ పనులు జరగాలి. కృష్ణా నీటిలో ఏపీ వాటానుంచి తమకు అధికంగా కేటాయింపులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో రాయలసీమ ప్రాజెక్టులైన గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ నిర్మాణం పూర్తి చేసి, రాష్టానికి నీటి అవసరాల ప్రాధాన్యతను కోర్టుల ముందుంచాలి. లేకపోతే రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు ప్రశ్నగా మిగిలిపోతుంది. (క్లిక్ చేయండి: సంక్షోభం నుంచి సంక్షేమం లోకి...) - మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరం (నవంబర్ 18 ‘రాయలసీమ’గా నామకరణం జరిగిన రోజు) -
వికేంద్రీకరణే సీమ అభివృద్ధికి దిక్సూచి
సాక్షి అమరావతి/సాక్షి నెట్వర్క్: వికేంద్రీకరణే రాయలసీమ అభివృద్ధికి దిక్సూచి అని సీమ ప్రజ ఎలుగెత్తి చాటింది. పాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి మద్దతు పలికింది. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి ద్వారా భవిష్యత్తులో వేర్పాటు వాదం రాకూడదన్నదే సీఎం జగన్ ఆలోచన అని వెల్లడించింది. పాలన వికేంద్రీకరణ చేసి, శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. 1937 నవంబర్ 16న జరిగిన శ్రీబాగ్ ఒడంబడికకు 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ఒప్పందం స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే ఉద్దే్దశంతో బుధవారం సీమ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. ర్యాలీలు, మానవ హారాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా కార్యాక్రమాలు, సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. ప్రజలు, విద్యార్థి, యువజన సంఘాలు, న్యాయవాదులు, మేధావులు పొల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఉద్యమ శంఖారావం కర్నూలు నగరంలో జేఏసీ చైర్మన్ విజయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజ్ విహార్ సర్కిల్లో వేలాది మందితో మానవహారం ఏర్పాటు చేశారు. ప్లకార్డులు పట్టుకుని మూడు రాజధానుల కోసం నినదించారు. విద్యార్థులు వినూత్నంగా ‘శ్రీబాగ్ 1937’ ఆకారంలో కూర్చొన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయ రాజధానిని సాధించుకోకపోతే భావితరాలు మనల్ని క్షమించవవన్నారు. 25న భారీ సభ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా తమ వాణిని వినిపిస్తామని చెప్పారు. ఎంపీ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు. నంద్యాల గాంధీచౌక్‌లో జేఏసీ చైర్మన్ బంగారురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ, మానవహారంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండలో భారీ ర్యాలీలు,ఆదోనిలో, ఆలూరులో రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగాయి. నందికొట్కూరులో నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్యే ఆర్థర్, ప్రజలు పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల్సిందే శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసి తీరాల్సిందేనని మేధావులు, ప్రజా సంఘాల నేతలు ఉద్ఘాటించారు. వికేంద్రీకరణకు మద్దతుగా బుధవారం వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా రౌండ్‌టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. కడపలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, డాక్టర్ ఓబుల్‌రెడ్డి, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. మైదుకూరు నియోజకవర్గం, దువ్వూరులో మేధావులు, రైతు, ప్రజా సంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ వరప్రసాద్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కమలాపురంలో బెక్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు? తిరుపతిలో జరిగిన శ్రీబాగ్ ఒప్పంద దినోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ, పలువురు మేధావులు మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో తప్ప మరెప్పటికీ శ్రీబాగ్ ఒప్పందం అమలు కాదని భూమన స్పష్టంచేశారు. శ్రీబాగ్ ఒప్పందం రాజకీయ పార్టీ ఒప్పందం కాదని, పెద్ద మనుషుల ఒప్పందమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. సూళ్లూరుపేట, నాయుడుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేశారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో మానవహారం, రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురంలో వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. శింగనమలలో ప్రభుత్వ సలహాదారు(విద్య) ఆలూరి సాంబశివారెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. గుంతకల్లులో ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉరవకొండ బుదగవిలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పెనుకొండ, మడకశిర, కదిరి ఎమ్మెల్యేలు శంకరనారాయణ, తిప్పేస్వామి, సిద్ధారెడ్డి హాజరయ్యారు. మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అందరినోటా.. వికేంద్రీకరణ మాట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో, నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో, కావలి నియోజకవర్గం బోగోలులో ర్యాలీలు నిర్వహించారు. -
Prakasam District: వికేంద్రీకరణకు మద్దతుగా మానవహారం
సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. అనంతరం వందలాది మంది కార్యకర్తలతో మానవహారం నిర్వహించి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై ఇంచార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్‌తో మురిపించి రాష్ట్ర ప్రజలను మోసం చేసారని బాలినేని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ తప్ప వెలగబెట్టింది ఏమి లేదని బాలినేని మండిపడ్డారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో శాసన రాజధాని ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ముళ్ళకంపళ్లలో రాజధాని పెట్టి ఒక వర్గాన్ని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు కలలు కన్నారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రాన్నీ కొల్లగొట్టేశాడని మంత్రి మండిపడ్డారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష -
Anantapur: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష
సాక్షి, అనంతపురం జిల్లా: ఏపీలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అనంతపురం జిల్లాకు చెందిన మేధావులు, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం నగరంలోని కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వికేంద్రీకరణ చేస్తానని ముందుకు వస్తే.. దాన్ని అడ్డుకుని స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోవడం క్షమించరాని నేరం అన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని అనంతపురం మేధావులు స్పష్టం చేశారు. అధికార అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు అడుగడుగునా అడ్డుపడటం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయటం దుర్మార్గం అని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దీక్ష జరగడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణకు బాటలు వేసిన సీఎం జగన్‌కు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేత కేవీ రమణ. కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: జగనన్న మేలును ఎన్నటికీ మరువలేం -
Sribagh Pact: వికేంద్రీకరణ శ్రీబాగ్ ఒప్పందంలోనే ఉంది
మద్రాసు నగరంలోని స్వాతంత్య్ర సమర యోధుడు కాశీనాథుని నాగేశ్వరరావు నివాస గృహం పేరే ‘శ్రీ బాగ్.’ ఆ భవనంలో 1937 నవంబర్ 16న ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం జరగింది. అదే ‘శ్రీ బాగ్ ఒప్పందం’గా జన వ్యవహారంలో నిలిచిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం... 1. విశ్వవిద్యాలయం, రాజధాని, హైకోర్టు ఒకచోట కేంద్రీకృతం కాకుండా విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో అలాగే ఉంచి.. హైకోర్టు, రాజధానిలలో ఏది కావాలో కోరుకొనే అవకాశం సీమవాసులకు ఇవ్వాలి. 2. కృష్ణ, తుంగభద్ర, పెన్నానదీ జలాల వినియోగంలో రాయలసీమ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 3. అనంతపురంలోనూ ఆంధ్ర విశ్వ విద్యాలయ కేంద్రం ఉంచాలి. 4. శాసన సభలో జనరల్ స్థానాలు జిల్లాల వారీగా సమాన నిష్పత్తిలో ఉండాలని నిర్ణయించారు. ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మ కంతోనే ఆంధ్రరాష్ట్రం సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదు చేరింది. సీమలోని సిద్ధేశ్వరంను వదిలేసి నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టారు. శ్రీ బాగ్ ఒప్పందం అటకెక్కింది. దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలి. కేవలం పాలనా రంగంలోనే కాక జలవికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలి. (క్లిక్ చేయండి: ఉత్తమాంధ్రగా నిలుపుతామంటే...) – డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, అనంతపురం (నవంబర్ 16 శ్రీ బాగ్ ఒప్పందం జరిగిన రోజు) -
AP: మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే..
మహా నగరాలు ఒకే రోజులోనో, స్వల్ప సమయంలోనో నిర్మింప బడవు. కాలక్రమంలో చారిత్రక, సామాజిక, సాంఘిక, మానవ వన రుల అవసరాలను బట్టి గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మహా నగరాలుగా అభివృద్ధి చెందుతాయి. అందుకే ‘రోమ్ వజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే’ (రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మితమవ్వలేదు) అనే నానుడి పుట్టింది. హైదరాబాద్, చెన్నయ్, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ లాంటి మహానగరాలు కూడా ఒక సంవత్స రంలోనో, స్వల్పకాలంలోనో మహానగరాలుగా ఎదిగినవి కావు. ఇది చరిత్ర. చారిత్రక దృష్టిలేనివారు; చరిత్రనుండి పాఠాలు, గుణపాఠాలు నేర్వలేనివారు... వేల కొద్ది ఎకరాల పంట భూములను సేకరించి అక్కడ రాజధాని భవనాలు నిర్మించి అత్యల్ప కాలంలోనే సింగపూర్ లాంటి నగరాలను తీసుకు వస్తామని చెబుతారు. ‘చరిత్ర తెలి యనివారు చరిత్రను సృష్టించలేరు’. అక్కడేమీ లేకున్నా రాజధాని పేరు మీద కొన్ని భవనాలు నిర్మించినంత మాత్రాన అది సింగపూర్ అవుతుందని భావించడం సరైందికాదు. ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పట్టణాలను వదిలి... ఛండీగర్ను కొత్త రాజధానిగా నిర్మించి రెండు రాష్ట్రాలకు రాజధానిని చేయడం వల్ల జరిగిందేంటి? అది నాలుగు దశాబ్దాలు గడిచినా మహానగరం కాలేదు. పట్టణంగా మాత్రమే ఉండి పోయిందన్న సంగతి మరువరాదు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంతరాలతో మూడు ప్రాంతాల సమాహారంగా ఉంది. ఇది సహజం. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లోని అసమానతలను, అంతరాలను వీలైనంతవరకు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ‘మూడు రాజధాను’లను ప్రతిపాదించింది జగన్ ప్రభుత్వం. మొత్తం బడ్జెట్ అమరావతికే ఉపయోగిస్తే రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, వ్యవసాయాభివృద్ధి, సంక్షేమ పథకాల మాటేంటి? మంచి పాలకునికి చరిత్ర తెలిసిన పాలకునికి ప్రజలు ముఖ్యం కదా! అమరావతిలో అసెంబ్లీ ఉంచి, విశాఖపట్టణంలో సచివాలయం నిర్మించి పరిపాలనా రాజధానిని చేయడం వల్ల వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న విశాఖ పట్ట ణాన్ని రాజధాని చేస్తే అత్యంత తక్కువ సమయంలో మరింత గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలా ఇక్కడ వేలకోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటుతనాన్ని రూపు మాపి సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గించడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. అమరావతిలో అసెంబ్లీ భవనాలు, శాసన రాజధాని ఉంటుంది. కాబట్టి ఇది కూడా నగరంగా అభివృద్ధి చెందుతుంది. మరో దిక్కున కర్నూలులో హైకోర్టు వల్ల అదో మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది. 3 ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఐటీ విస్తరణ, ఉద్యోగ కల్పన, సేద్యం వంటి వాటిపై దృష్టి పెట్టి సామాజిక న్యాయం బాగా జరిగేలా చూస్తే అంతకంటే మించిన సుపరిపాలనేముంది? ఆ దిశగా శర వేగంతో అడుగులేస్తున్నాడు జగన్. దీంతో భవిష్యత్తులో వేర్పాటు వాదాలు వచ్చే అవకాశం ఉండదు. ప్రజల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా సోదర భావం నెలకొంటుంది. అప్పుడే శాంతి భద్రతలు వెల్లివిరుస్తాయి. ఫలితంగా పెట్టుబడులు దేశ, విదేశాల నుంచి ఏపీకి ప్రవహిస్తాయి. అందువల్ల రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులను వ్యతిరేకించడం ఆపి రాజ ధాని నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి సహకరిస్తే శూన్యంగా మిగిలిన తెలుగు దేశానికి ఇసుమంతైనా ప్రజామోదం లభిస్తుంది. అలా కాదంటారా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. సకల జనుల వృద్ధిని ఆశించే ప్రస్తుత సీఎం జనం హృదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. (క్లిక్ చేయండి: రాజధాని పట్ల మరింత స్పష్టత) - కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీ వేత్త -
CM YS Jagan: ప్రజల దీవెనలు మన వైపే
సాక్షి, అమరావతి: ‘వికేంద్రీకరణతో సుపరిపాలన.. లంచాలకు తావు లేకుండా, వివక్ష చూపించకుండా, అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తుండటం వల్ల రాష్ట్ర ప్రజల దీవెనలు మన వైపు కన్పిస్తున్నాయి. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మీరూ, నేనూ కలిసికట్టుగా పనిచేస్తే 175 శాసనసభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమే’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. ‘డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) కింద సంక్షేమ పథకాల ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం నా బాధ్యత. అది నేను నిర్వర్తిస్తా. మీరంతా కలిసి ప్రతి గ్రామంలో మనం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకుపోవడమే కాకుండా.. వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. వాళ్ల చల్లని ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఆశీస్సులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇలా మీరూ, నేనూ కలిసికట్టుగా పనిచేస్తే 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయగలుగుతాం’ అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన వారితో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండపేట నియోజకవర్గానికి చేసిన మంచిని, అభివృద్ధిని గణాంకాలతో వివరించారు. వచ్చే ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని రావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అన్ని విధాలా సన్నద్ధం కావాలి ► మిమ్నల్ని కలవడానికి, ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి మిమ్మిల్ని కలిసి చాలా రోజులైంది. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే.. రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. ఇంత త్వరగా ఎందుకని అనుకోవచ్చు. ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సహజం. కానీ.. మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. వాటన్నింటినీ ప్రజలకు చెప్పాలి. ► రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి 2 వేల జనాభాకు 12 మంది ఉద్యోగులను అక్కడే కూర్చుని పనిచేసేట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లను ఒక వలంటీర్‌తో అనుసంధానం చేసి.. అర్హత ఉన్న ప్రతి గడప, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల కింద మంచి చేయాలని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని శాచ్యురేషన్ (సంతృప్త) విధానంలో అడుగులు వేశాం. ► మూడేళ్ల నాలుగు నెలల్లోనే ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లను డీబీటీ ద్వారా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వైఎస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాల ద్వారా మేలు చేశాం. ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా చెబుతున్నాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. 175కు 175 ఎందుకు గెలవం? ► మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఎన్ని పథకాలు అందాయి అని.. ఆధార్ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలిగే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం. ► గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92% ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా.. పథకాలు అందాయని అక్కచెల్లెమ్మలు చల్లని ఆశీస్సులు మనమీద చూపించినప్పుడు ఆ గ్రామంలో మనం తప్పకుండా గెలుస్తాం. ► గ్రామంలో గెల్చినప్పుడు నియోజకవర్గంలో గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గంలో గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175కు 175 ఎందుకు రావు? ► మండపేట మున్సిపాలిటీతో సహా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల లెక్క తీసుకుంటే.. మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 23, జెడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్ స్వీప్ చేశాం. కళ్లెదుటే కన్పిస్తున్న మార్పు ► ప్రతి గ్రామంలో కళ్లెదుటే కొట్టొ్టచ్చినట్టు మార్పు కన్పించేలా అభివృద్ధి పనులు చేశాం. గ్రామంలోకి అడుగుపెడుతూనే సచివాలయం కనిపిస్తుంది. వలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతోంది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. శరవేగంగా డిజిటల్ లైబ్రరీలు కట్టే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం. ఇవన్నీ గతంలో లేనివి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాయి. ► గతంలో పిల్లలు చదువుకునే వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి పోయి ఇంగ్లిష్ మీడియం బడులు మన గ్రామాల్లో వస్తున్నాయి. విలేజ్ క్లినిక్‌ల ద్వారా మన గ్రామంలోనే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంతా ఒకేచోట ఉంటూ.. 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తారు. ► 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేసేట్టుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఊర్లోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇంత మార్పు గతంలో జరగలేదు. వికేంద్రీకరణ (డీసెంట్రలైజేషన్) ఈ స్థాయిలోకి వెళ్లి మంచి చేయాలన్న ఆరాటం గతంలో లేదు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా మార్పు రావాలి. వై నాట్ 175? కచ్చితంగా జరుగుతుంది. ► ఈ సమావేశానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. మరింత మంచి చేయడానికే.. ► రాష్ట్రంలో ఇంత మార్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ప్రజలదగ్గరకు తీసుకుని వెళ్లి, వారికి ఇవన్నీ గుర్తు చేసి.. ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని మరింత సమర్థంగా అడుగులు వేసేందుకు మిమ్మల్ని భాగస్వాములను చేస్తున్నాం. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. ► మన ఎమ్మెల్యేగానీ మన ఎమ్మెల్యే అభ్యర్థిగానీ గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్థ, మండల స్థాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ.. మరోవైపు పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే, అటువంటి వారికి మేలు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ► ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఈ నిధులతో ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యతగా ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలు అంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. అందువల్ల ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు.. ఒక్కో రోజు కనీసం 6 గంటలు గడపాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. -
‘అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. భావితరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం నడుస్తోందని ఆయన అన్నారు. ‘అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు. నిపుణులు ఎంత చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోలేద’ని తమ్మినేని మండిపడ్డారు. జిల్లా ఆముదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని జేఏసీ ప్రతినిధులు అన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎనలేని పురోగతి ఉంటుందన్నారు. విశాఖను రాజధాని చేస్తే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
ఉత్తరాంధ్ర గర్జన.. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
మూడు రాజధానులకే మా మద్దతు
తిరుపతి తుడా: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మునిసిపల్ కార్యాలయంలో మేయర్ శిరీష అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించారు. తీర్మానాన్ని నగర మేయర్ డాక్టర్ ఆర్.శిరీష బలపరచగా.. డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. సభ్యుల్లో ఒక్కరు కూడా రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించకపోవడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మేయర్ శిరీష ప్రకటించారు. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ఆమె చెప్పారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధాని చేస్తామని చెప్పి నమ్మించారన్నారు. ఆపై తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తూ ఉమ్మడి ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ విడిపోతే కర్నూలుకు రావాల్సిన రాజధానిని కుట్రపూరితంగా, దురుద్దేశంతో అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమకు రావాల్సిన నీటి ప్రాజెక్టులను సైతం అడ్డుకున్న నీచుడు చంద్రబాబని దుయ్యబట్టారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటే.. అందుకు విరుద్ధంగా చంద్రబాబు 29 గ్రామాలకే న్యాయం జరగాలని పట్టుబట్టడం సిగ్గుచేటన్నారు. రాజధాని, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మూడు రాజధానులతోనే సాధ్యమవుతాయని చెప్పారు. భవిష్యత్తులో వేర్పాటువాదం రాకూడదన్న ముందు చూపుతోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అయితే చంద్రబాబు అండ్ కో వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు సీమవాసులంతా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఇటీవల రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన విజయవంతం చేసిన భూమన కరుణాకరరెడ్డికి మునిసిపల్ కౌన్సిల్ అభినందనలు తెలిపింది. -
ఎన్ని పోరాటాలకైనా సిద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: విశాఖ పరిపాలనా రాజధాని అయ్యేంతవరకు ఎందాకైనా వెళ్తామని, ఎన్ని పోరాటాలకైనా సిద్ధమని పలువురు వక్తలు ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వారు స్పష్టంచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు, ఈనాడు అధినేత రామోజీరావే ప్రధాన అడ్డంకిగా మారారన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వేదికగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ‘మన విశాఖ–మన రాజధాని’ పేరిట సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన బీఆర్‌ఏయూ విశ్రాంత రిజిస్ట్రార్, విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక అధ్యక్షులు ప్రొ. గుంట తులసీరావు మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని.. విశాఖను పాలనా రాజధానిగా చేయాలన్న సీఎం నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే మరో చారిత్రక తప్పిదం అవుతుందని.. విశాఖ రాజధాని వద్దన్న వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి స్వస్తి పలుకుతూ విశాఖ రాజధానే లక్ష్యంగా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉద్యమాన్ని పల్లెస్థాయికి తీసుకెళ్తామన్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి. జగన్మోహనరావు మాట్లాడుతూ.. రాయలసీమను వదిలి వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధానిని ప్రకటించిన గొప్ప మానవతావాదిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రి ఉండడం మనందరి అదృష్టమని.. భావితరాలకు విశాఖ రాజధాని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని దూరం చేసేందుకు, భావితరాల భవిష్యత్ కోసం విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండాలని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని సదస్సుకు సంఘీభావం తెలిపిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీఎం జగన్ రాయలసీమకు చెందిన వారైనా, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరాంధ్రులంతా సమర్థించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అమరావతి పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగి ఉందని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆరితేరిన ఘనుడని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేఖ, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు హారికాప్రసాద్, విద్యావేత్తలు దుప్పల వెంకట్రావు, సురంగి మోహన్‌రావు, శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి, విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
చంద్రబాబు రెండేళ్లకే హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారు: ధర్మాన
-
రాజధాని విషయంలో కేంద్ర కమిటీ అదే చెప్పింది: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తే చంద్రబాబు దానిని విస్మరించారని రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు మంచి రాజధాని అవసరం ఏర్పడిందని తెలిపారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో ఉన్నా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి రెండేళ్లకే ఖాళీ చేశారన్నారు. ఈమేరకు మన రాజధాని, మన విశాఖ సదస్సులో మంత్రి ధర్మాన ప్రసంగించారు. 'ఆంధ్రప్రదేశ్‌కి ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్ర కమిటీ చెప్పింది. ఆంధ్ర రాజకీయ పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చింది. ఒరిస్సాలో.. కటక్‌లో హైకోర్ట్, భువనేశ్వర్‌లో పరిపాలన రాజధాని ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోంది. అభివృద్ధి అసమానత ఉంటే రాష్ట్రంలో అస్థిరత ఏర్పడుతుంది. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బాబు హయాంలో అమరావతి రాజధాని కోసం 3,500 రహస్య జీఓలు ఇచ్చారని' మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో..) -
వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరంలో ‘విద్యార్థి గర్జన’
చోడవరం(అనకాపల్లి జిల్లా): మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు గర్జించారు. వికేంద్రీకరణకు మద్దతుగా భేరి మోగించారు. తమ బంగారు భవిష్యత్ కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థులంతా చోడవరం వేదికగా గళమెత్తారు. మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో చోడవరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలుత లజపతిరాయ్, దేవుడు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ, తోక పార్టీలు పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. -
ది హిందూ ఇంటర్వ్యూ: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: సీఎం ఎక్కడి నుంచి పాలించాలనే దానిపై ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి వర్గం ఉన్నచోటే సచివాలయం కూడా ఉంటుందన్నారు. చదవండి: డిజిటల్ వైద్యంలో ఏపీనే ఫ్రంట్ రన్నర్ సహజ మౌలిక సదుపాయాలున్న ఏకైక పెద్ద నగరం విశాఖ. ఆర్థిక అనుకూలత, పాలన సౌలభ్యం కోసమే రాజధానిగా విశాఖ ఎంపిక చేశామని సీఎం చెప్పారు. రూ.5 నుంచి 10వేల కోట్లతో విశాఖ పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందన్నారు. వికేంద్రీకరణ స్ఫూర్తితో విశాఖను ఎంచుకున్నామన్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖ ఉంటాయని సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమరావతి.. విజయవాడలో గానీ, గుంటూరులో గానీ లేదన్నారు. అమరావతి అనేది ఆచరణ సాధ్యం కాని రాజధాని అని, 2 పట్టణాలకు 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. -
ది హిందూ ఇంటర్వ్యూలో జగన్
-
వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణపై కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి అసలు పనికి రాదని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తేల్చి చెప్పారు. శుక్రవారం పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏయూ హిందీ విభాగంలో మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు మేధావులు, పలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగల్సిందేనని చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. రాజధాని, కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి పాలనకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమరావతి కాకుండా వేరే ప్రాంతంలో రాజధాని పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానులు ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది పాలకుడి నిర్ణయమేనని అన్నారు. ఒక ప్రాంతం మీద అభిమానంతో కాకుండా రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు. చంద్రబాబు రక్తం మరిగిన పులి పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి రక్తం రుచి మరిగిన పులి మాదిరిగానే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రవర్తన కూడా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి అంశాన్నీ వ్యతిరేకించడమే బాబు ధ్యేయమని అన్నారు. ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి లాభం పొందాలని ఆశిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని కాదని, అది ఒక కమ్మ సామాజికవర్గం వ్యాపార సామ్రాజ్యమని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటివరకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని, అందుకు సచివాలయ వ్యవస్థ, జిల్లాల విభజన నిదర్శనమని తెలిపారు. కరోనా సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వందలాది మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే రెండు రోజులు పట్టేదని, ఇప్పుడు జిల్లాల విభజనతో వారి చెంతకే కలెక్టరేట్ వచ్చిందన్నారు. అమరావతి రైతులంతా బడా బాబులే: ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఆంధ్రను విభజించినప్పుడు రాజధానికి మొదట విశాఖపట్నమే అనుకున్నా.. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కర్నూలుకు మార్చారన్నారు. ఆ తరువాత హైదరాబా«ద్‌కు మార్చి రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయడం వల్ల ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు విద్య, వైద్య, ఉద్యోగావకాశాలు సమానంగా అందుతాయని తెలిపారు. అమరావతి రైతులు అసలు రైతులే కాదని, అంతా బడాబాబులేనని విమర్శించారు. అసలు సిసలైన రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారన్నారు. వరదలొస్తే అమరావతి కొట్టుకుపోతుంది : ప్రొఫెసర్ ముత్తయ్య ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ అమరావతి రాజధానిగా అస్సులు పనికి రాదన్నారు. వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. లక్షల కోట్లు వృథా తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వాయు, జల, రోడ్డు మార్గాలు ఉన్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తద్వారా ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల పోరాటాలు విజయవంతం అవుతాయి : ప్రొఫెసర్ పుల్లారావు ప్రొఫెసర్ పుల్లారావు మాట్లాడుతూ అన్ని ప్రాంతీల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని, ప్రాంతీయ అభిమానంతో కాదని చెప్పారు. విద్యార్థులు చేసిన ఏ పోరాటమైనా విజయవంతం అవుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ కోసం విద్యార్థులను భాగస్వామ్యం చేయటం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు సూర్యనారాయణ, శోభ శ్రీ , నల్ల సత్యనారాయణ, ప్రేమానందం, కృష్ణ, రాజామాణిక్యం, బార్ కౌన్సిల్ సభ్యులు అరుణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు ఉత్తరాంధ్రకు వెన్నుపోటా?
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి యాత్ర క్యాపటలిస్టులు వెనక్కి వెళ్లారని, కానీ ఇంకా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. ఉత్తరాంధ్రకు ఏం కావాలో చెప్పాల్సింది పోయి అమరావతి కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో 22 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రేపటి నుంచి టీడీపీ వారం రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఉత్తరాంధ్రపై విషం చిమ్మి అమరావతి వైపు పెట్టుబడులు వెళ్లేలా చేస్తున్నారు. ఎంతకాలం ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు చంద్రబాబు బూట్లు నాకుతారు. ఉత్తరాంధ్ర అంటే గంజాయి సాగు జరుగుతుందని పంటలు పండవని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. మేం అమరావతికి అడ్డు పడటం లేదు.. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అది తప్పా? విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి పెట్టుబడులకు నష్టం వస్తుందని చంద్రబాబు తాబేదార్ల భయం. విశాఖలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. అమరావతి రైతులది వితండ వాదం.. భూములు ఇచ్చాం రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎలా? త్యాగం అంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులది. మీ కోసం మీరు భూములు ఇవ్వడం స్వార్థం.’ అని పేర్కొన్నారు మంత్రి అమర్నాథ్. టీడీపీ హయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్, భూముల రికార్డ్ల ట్యాంపరింగ్ జరిగిందని అందరికీ తెలుసునన్నారు మంత్రి అమర్నాథ్. వెన్నుపోటు నాయకుని వెనుక ఉన్న నాయకులు అదే ఆలోచనతో ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష విశాఖ గర్జనలో కనిపించిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి: ఉద్దానంపై ప్రేమ కాదు.. ఉత్తరాంధ్రపై ఏడుపు.. ఈనాడు, టీడీపీపై మంత్రి మండిపాటు -
మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులకు మాల మహానాడు మద్దతు ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మంగరాజు తెలిపారు. ‘‘దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. అమరావతి రైతులు ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి రాజధాని కావాలంటున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని’’ మంగరాజు హెచ్చరించారు. చదవండి: AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం -
చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై.. మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేదికాదని, నష్టం ఉండేది కాదన్నారు మంత్రి ధర్మాన. ‘భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అయినా లక్షల కోట్లతో అమరావతి ప్రతిపాదన చేశారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్. చంద్రబాబు సన్నిహితులు భూమి కొనుగోలు చేశాకే రాజధాని ప్రకటించారు. సింగపూర్ పార్లమెంట్లో ఈశ్వరన్ వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు నాటకం తెలిసింది. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయి. చంద్రబాబు నారాయణ కమిటీ వేసి 3,940 సీక్రెట్ జీవోలు ఇచ్చారు.’ అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నిపుణులు హాజరై.. విశాఖను పాలన రాజధానిగా చేయాలని కోరారు. ఇదీ చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర -
వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర
చంద్రగిరి: వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ జగన్ సేవాదళ్ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన వికేంద్రీకరణకు మద్దతుగా పలువురు నాయకులు, యువకులు ఈ పాదయాత్ర చేస్తున్నారు. చిత్తూరు నుంచి పాదయాత్రగా బయలుదేరి పూతలపట్టు, నేండ్రగుంట, చంద్రగిరి మీదుగా సాయంత్రానికి తిరుమల శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ సేవాదళ్ రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు గణేష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు శ్రీవారి మెట్టు మార్గం వద్ద వారికి మద్దతు తెలిపారు. సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం ప్రకారం వికేంద్రీకరణ మన రాష్ట్రానికి చాలా అవసరమని, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే అందరికీ మేలు కలుగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే -
మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి
సాక్షి, అనకాపల్లి: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి, మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకమై శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పాదయాత్రగా వచ్చే అమరావతి దండుయాత్ర ఉత్తరాంధ్రకు చేరకుండా, మన ఆకాంక్ష తెలిసేలా రోజుకొక నియోజకవర్గంలో బంధ్లు నిర్వహించాలని.. రాస్తారోకోలు, ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. విశాఖను పాలనా రాజధానిగా చేయాలంటూ అనకాపల్లి రింగ్ రోడ్డు సమీపంలోని పెంటకోట కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఉత్తరాంధ్ర మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజకీయ, సామాజిక, ఉద్యోగ, విద్యార్థి.. మేధావి వర్గం వారంతా పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను రాజధానిగా చేయడమే మార్గమని నినదించారు. మాజీ వీసీ, ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మ న్ లజపతిరాయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసా గింది. ఏయూ ప్రొఫెసర్ షోరాన్ రాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, జేఏసి వైస్ చైర్మన్ దేముడు నాయుడు తదితరులు మాట్లాడారు. అమరావతి యాత్ర ఆపేయాలి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమిస్తోంది. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. 1956 లోనే విశాఖ రాజధాని కావాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పటికైనా మూడు రాజధానులు ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. అమరావతి యాత్ర ఇప్పటికైనా విరమించుకోవాలని జేఏసీ హెచ్చరిస్తోంది. లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. – లజపతిరాయ్, ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అన్ని ప్రాంతాలు బావుండాలి.. అందరూ బావుండాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకోవడం లేదని కొందరు టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహులు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ విశాఖ గర్జన విజయవంతం కావడమే సమాధానం. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం ఆగదు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా పార్టీ మద్దతు ఉంటుంది. విశాఖ రాజధాని అయితే రానున్న తరానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటే, విశాఖ రాజధాని కావాల్సిందే. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పాదయాత్ర సాగే ప్రాంతాల్లో బంద్ చేపట్టాలి విశాఖ పరిపాలన రాజధాని అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లంటే రూ.ఐదారు లక్షలకోట్లు ఖర్చవుతుంది. చంద్రబా బు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ.6 వేలకోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు. మిగతా రూ.1,500 కోట్లలో రూ.వెయ్యికోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చుచేశారు. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. చంద్రబాబు నిస్సిగ్గుగా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారు. పచ్చ ముసుగు కప్పుకుని చేస్తున్న పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాలి. షాపులు స్వచ్ఛందంగా మూసి వేసి, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేపట్టాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ద్రోహులు బుద్ధి మార్చుకోవాలి అమరావతి రైతులపేరిట నిర్వహించేయాత్ర చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. తక్కువ ఖర్చుతోనే అద్భుత రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర టీడీపీ ద్రోహులు తమ బుద్ధి మార్చుకోవాలి. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తాం ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఉద్యమం ఉధృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధానిగా విశాఖను కోరుకోవడంలేదని చెప్పే ప్రతీ ఒక్కరికీ విశాఖ గర్జన ఒక సమాధానం. అమరావతి రైతుల పేరిట నిర్వహించే దండయాత్ర కారణంగానే ఈ ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది. మీరు మా ప్రాంతానికి వచ్చి, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటామంటే మేము ఎలా ఊరుకుంటాం? చంద్రబాబు, ఆయన పార్టీ నేతలంతా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాదయాత్ర చేపట్టారు. మా ఉత్తరాంధ్ర ఉద్యమకారులకు చెప్పులు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో మరోసారి మోసపోలేం. ఇప్పటికైనా పాదయాత్ర నిలిపివేస్తే మంచిదని కోరుతున్నాం. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మేము కట్టుబడి ఉంటాం. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తొడలు కొట్టడం సంస్కారమా? ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా, అందులో కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలుస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కేంద్రమే స్వయానా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు అమరావతి ఏకీకృత రాజధాని కావాలని అనడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు రైతుల ముసుగులో చేయిస్తున్న పాదయాత్రకు హైకోర్టు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. వాళ్లు వాటిని పట్టించుకోకుండా.. తొడలు కొడుతూ.. మీసాలు దువ్వుతూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటం దారుణం. ఇదేనా మీ సంస్కారం? తక్షణమే న్యాయస్థానం ఈ విషయాలను సుమోటోగా తీసుకుని పాదయాత్రను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. – దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా విశాఖ వాసులు అక్కున చేర్చుకుంటారు. అలాంటి మా ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదు. దానికోసం ఎందాకైనా ముందుకు వెళతాం. మా మౌనాన్ని అమాయకత్వం అనుకుంటే పొరపాటే. సీఎం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలుకుతున్నారు. విశాఖ పాలన రాజధాని అయితే దేశంలోనే ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. – భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ ఉద్యమం ద్వారానే సాధించుకుందాం రాజధాని అవ్వాలంటే రాష్ట్రం మధ్యలోనే ఉండనవసరం లేదు. చరిత్రను పరిశీలిస్తే.. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాధించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉద్యమం ద్వారానే పరిపాలన రాజధాని సాధించుకోవాలి. 29 గ్రామాల కోసం వారు రాజధాని అడిగితే.. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు ఏమవ్వాలి? మన డిమాండ్‌కు మద్దతివ్వని పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి. – జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) -
ఎమ్మెల్యే గాయపడితే హేళన చేస్తారా!.. వాళ్లు తిరగబడితే ఏం చేస్తారు?
సాక్షి,అనకాపల్లి: విశాఖ పరిపాలన రాజధాని అనేది భావితరాల కోసం జరిగే పోరాటమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను బలంగా వినిపించారని పేర్కొన్నారు. విశాఖ ఉద్యమాన్ని ప్రతిపక్ష పార్టీలు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కోరుకోవట్లేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘మా దగ్గరకు వచ్చి మా ప్రాంతం నాశనం అయిపోవాలని కోరుకుంటారా. పాదయాత్ర పేరుతో వచ్చే వారిని తరిమి కొట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు. చెప్పులు చూపించమని, తొడలు కొట్టమని కోర్టు ఎక్కడ చెప్పలేదు. మూడు రాజధానుల ఉద్యమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే గాయపడితే ఆయనను హేళన చేస్తున్నారు. ఎమ్మెల్యేను అభిమానించే వాళ్ళు పాదయాత్రపై తిరగబడితే ఏం చేస్తారు. మా ప్రాంతానికి వచ్చి మమ్మల్నే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనేది సీఎం ఆలోచన’ అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. కాలగర్భంలో కలిసిపోయే నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రథముడని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రథముడని కొనియాడారు. మూడు రాజధానుల ఏర్పాటు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని పేర్కొన్నారు. 29 గ్రామాల ప్రజలు రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకుంటే శాసన సభ ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. చదవండి: జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంపు -
టీడీపీ-జనసేన మధ్య పెళ్లిళ్లు, విడాకులు సహజమే: మంత్రి బుగ్గన
సాక్షి, తిరుపతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఏపీ వాణిజ్య వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్‌పై మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి. కమిటీ సమావేశంలో వ్యాపారాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. విపక్షాలకు చెందిన మీడియా ఎప్పుడూ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2019లో ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే.. ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాం. భారత దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాష్ట్రానికి రూ.12వేల కోట్లు నుంచి రూ.13,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాం. రాష్ట్రాభివృద్ధి కోసం తెచ్చిన అప్పుల వివరాలను ఏనాడు దాచిపెట్టలేదు. కాగ్, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజాలు తెలుసుకోండి’అని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన. టీడీపీ కలవని, పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ లేదని ఎద్దేవా చేశారు మంత్రి బుగ్గన. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో తప్ప అన్ని పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. 2014 నుంచి అసెంబ్లీలో టీడీపీ నేతలు మాట్లాడిన మాటలు, వాడిన భాష రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు జనసేన మధ్య ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎన్నిసార్లు విడాకులు అయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఓపిక ఉండాలి, పవన్ కల్యాణ్ వాఖ్యలు సరికావు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభవృద్ధి సాధించాలి. ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల అసమానతలు వచ్చాయి. వీటిని తొలగించడానికే అభివృద్ధి వికేంద్రీకరణ. కర్నూలులో కోర్టు, విశాఖలో సెక్రటేరియట్, గుంటూరులో అసెంబ్లీ పెట్టడం తప్పా? తాను చేసిందే సరి అంటాడు చంద్రబాబు, ఆయన పాలసీలో నిలకడ లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఒకే పార్టీతో ఎన్నిసార్లు కలుస్తారు. ప్రజాస్వామ్య విలువల్ని ఏనాడు చంద్రబాబు పాటించలేదు’ అని ఆయన టీడీపీపై ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్ -
రాజమండ్రి: వికేంద్రీకరణకు మద్దతుగా భారీ బహిరంగ సభ
సాక్షి, రాజమండ్రి: ఏపీలో వికేంద్రీకరణకు మద్దతు పెరిగిపోతోంది. ప్రజాకాంక్షను ప్రతిపక్షాల చెవులు మారుమోగిపోయేలా వినిపించేందుకు.. పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్ సీపీ. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) నగరంలోని ఆజాద్‌చౌక్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, ఎంపీ సుభాష్ చంద్రబోస్ , పార్టీజిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతి మహాపాదయాత్రను తీవ్రంగా నిరసిస్తున్నారు రాజమండ్రి వాసులు. ఇప్పటికే అడుగగడునా నిరసనలు ఎదురవుతుండగా.. రాజమండ్రిలోనూ అదే సీన్ కనిపించింది. పైగా వికేంద్రీకరణకు మద్దతుగా పలుకూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. జగనన్నది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ఈనాడు అంటేనే అబద్ధాల తడిక -
ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకే టీడీపీతో చేతులు కలిపిన పవన్
తాడికొండ : చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడని, ఆ పార్టీని రద్దు చేయాలని బహుజన పరిరక్షణ సమితి నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 749వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తన సీటు కూడా తాను గెలవలేని పవన్.. ఎన్నికల అనంతరం పెయిడ్ ఆర్టిస్టుగా మారి బాబుకు తాబేదారు అవతారమెత్తాడని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేసేందుకు టీడీపీతో చేతులు కలిపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటును తన జీవితంలో భాగంగా చేసుకున్న చంద్రబాబు.. చివరకు పవన్‌కు కూడా ఓ పోటు పొడిచి రాజకీయ సన్యాసిగా మిగల్చడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి, పులి దాసు, పల్లె బాబు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ పరిపాలన రాజధానే మా లక్ష్యం
బొబ్బిలి: వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానే తమ లక్ష్యమని బొబ్బిలి ప్రజలు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శ్రీ కళాభారతి మునిసిపల్ ఆడిటోరియంలో ఆదివారం బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలో పలువురు మేధావులు, విద్యా, వ్యాపార, న్యాయ, రాజకీయ వర్గాలకు చెందిన వారంతా పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన వికేంద్రీకరణకు మద్దతు పలికారు. మునిసిపల్ చైర్మన్ ఎస్వీ మురళీకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సి ఉన్నా.. చంద్రబాబు చేసిన పొరపాట్ల కారణంగా దాన్ని కోల్పోయామని చెప్పారు. దశాబ్దాల నాటి ప్రతిపాదన విశాఖ రాజధాని అవకాశాన్ని ఇప్పుడు జారవిడుచుకోవద్దని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, డాక్టర్ బొత్స కాశినాయుడు, భాస్కరరావు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వివిధ వర్గాల మేధావులు, ప్రజలు పాల్గొన్నారు. -
మూడు రాజధానులకే మా మద్దతు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకే తమ మద్దతని రాష్ట్ర నూర్‌బాషా(దూదేకుల) సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో స్వర్ణాప్యాలెస్ హోటల్లో ఆదివారం నూర్ బాషా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. నూర్‌బాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రసూల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిందేనన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో విభజనవాదం తలెత్తదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని తమ సంఘం స్వాగతిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నవరత్న పథకాలు నూర్‌బాషాలకు అందుతున్నాయని తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి షాన్ బాషా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.బాదుల్లా, ఉపాధ్యక్షుడు మదీనా, అధికార ప్రతినిధి, గాజుల బాజీ, యూత్ ప్రెసిడెంట్ శ్రీనుబాషా పాల్గొన్నారు. -
వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి
సాక్షి, అమరావతి: అధికారం దూరమైందనే అక్కసుతో టీడీపీ నాయకులు ప్రజలపై కక్ష పెంచుకుని అడుగడుగునా అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఏపీ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం మండిపడింది. విజయవాడలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ‘పాలనా వికేంద్రీకరణ: ప్రచారాలు, వాస్తవాలు’ అనే అంశంపై పలువురు న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చంద్రబాబు బృందం మూడేళ్లుగా అభివృద్ధిని అడ్డుకుంటోందని ధ్వజ మెత్తారు. చారిత్రక తప్పిదాలను పునరావృతం చేసేందుకు మీడియాను, న్యాయవ్యవస్థను సైతం ఉపయోగించుకుంటోందన్నారు. అమరావతి పేరు తో దోపిడీ చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలు ఎదగకుండా నీచ రాజకీయాలు చేయడం క్షమించరానిదన్నారు. ప్రభుత్వం దృష్టిలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లాలోని చివరి గ్రామం వరకు ఒక్కటేనని, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలన్నారు. చంద్రబాబు బృందం ఆయన వర్గ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ రెండు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందాలని చెబుతోందన్నారు. మరో 30ఏళ్లకు కూడా పూర్తికాని అమరావతి కోసం రూ.లక్ష కోట్ల కు పైగా వెచ్చిస్తే మిగతా ప్రాంతాలు ఏం కావాలని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయాక బాబుకు ప్రజలు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలపై పగబట్టిన బాబు చంద్రబాబు బృందం తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అమరావతి రైతులను పావులుగా మార్చేసింది. రైతులను పురిగొల్పి చంద్రబాబు తెరవెనుక ఆనందిస్తున్నారు. అమరావతి ప్రపంచ రాజధాని ఎలా అవుతుంది? భారీ నిర్మాణాలకు ఈ ప్రాంతం అనువుకాదని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. నిర్మాణాల భారం లేకుండా రాజధాని కోసం నాగార్జున వర్సిటీ భవనాలు ఇస్తామన్నా తీసుకోకుండా గడ్డి తినేందుకు అమరావతిని ఎంచుకున్నారు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇలాంటి తప్పులకు విదేశాల్లో అయితే మరణ శిక్ష విధించేవారు. అధికారం ఊడగొట్టి 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేకపోగా ప్రజలపై పగబట్టారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కోర్టులను వాడుకుంటున్నారు. అమరావతి భూములు వ్యవసాయయోగ్యమైనవి, ఇక్కడ ఆ తరహా పరిశ్రమలకే అనుకూలం. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి. – పి.విజయబాబు, రాష్ట్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మిగతా ప్రాంతాలు ఏం కావాలి? చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని బలిపెడుతున్నారు. ఆయనకు వంతపాడుతూ కొన్ని పత్రికలు, మీడియా అమరావతి రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రాంతీయ అసమానతల వల్లనే తెలంగాణ విడిపోయింది, అదే తప్పు చంద్రబాబు అమరావతి పేరుతో చేశారు. వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ చెప్పినా పట్టించుకోకుండా అమరావతి పేరుతో రూ.వేల కోట్లు వెచ్చించి అన్నీ తాత్కాలిక భవనాలే నిర్మించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వెళ్లారు. రూ.లక్షల కోట్లను అమరావతిలోనే వెచ్చిస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలి? మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. – పిళ్లా రవి, న్యాయవాది కొత్త రాజధాని నిర్మాణం అసాధ్యం ఏ దేశంలోనైనా అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరాన్నే రాజధానిగా ఎంచుకుంటారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అన్నిచోట్లా పెద్ద నగరాలను రాజధానిగా ఎంచుకున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని కలలు కంటూ చంద్రబాబు అమరావతిని ఎంచుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇలాంటి తప్పు ఏ నాయకుడూ చేయరు. రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాల్లో అధికార వికేంద్రీకరణ చేయాలి. కొత్త రాజధాని నగరం నిర్మించడం మాటలు కాదు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ ఇప్పటికీ ప్రగతి సాధించలేకపోయింది. – కొణిజేటి రమేష్, పారిశ్రామికవేత్త రెండు జిల్లాలే ముఖ్యమా? అభివృద్ధి అంటే భవనాలు, పార్కులు కాదు. సామాన్యుడు తలెత్తుకు తిరిగేలా ఉండాలి. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు ఇవ్వరట. వారికి స్థానం లేని ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది? చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిరుపేదలు, సామాన్యుల హక్కులను దోచుకున్నారు. కేవలం రెండు జిల్లాలు అభివృద్ధి చెందితే చాలా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏమైపోవాలి? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. – నామాల కోటేశ్వర్రావు, న్యాయవాది వికేంద్రీకరణ తప్పనిసరి అవసరం ఎవరైనా ఒకసారి తప్పు జరిగితే దాన్నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. పాలకులైతే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీమళ్లీ తప్పులు చేసేవారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రతిపక్ష టీడీపీ అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ రాష్ట్రంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాంతాల అభివృద్ధి టీడీపీకి అవసరం లేదా? ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డుకుంటూ మరో తప్పు చేస్తున్నారు. – డాక్టర్ చన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ సమగ్రాభివృద్థికి వెన్నుపోటు పాలకులు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనన్ని ఆటంకాలను చంద్రబాబు సృష్టిస్తున్నారు. కేంద్రీకృత అభివృద్ధితో తెలుగు ప్రజలు ఏం కోల్పోయారో చరిత్ర చూస్తే అర్థమవుతుంది. చారిత్రక తప్పిదాలను చంద్రబాబు పునరావృతం చేశారు. వాస్తవానికి అమరావతి ప్రజలు ఇక్కడ రాజధాని కావాలని అడగలేదు. చంద్రబాబు తన వర్గం వారితో రైతుల భూములు బలవంతంగా తీసుకున్నారు. సైబర్ టవర్స్ నిర్మాణం సమయంలోనూ బ్లూప్రింట్ తయారీకి ముందే తనవారితో భూములు కొనిపించారు. అదే సూత్రాన్ని ఇక్కడా అమలు చేశారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు దీనికి సూత్రధారులు. అమరావతి అంతా అవినీతిమయం. – కృష్ణంరాజు, రాజకీయ విశ్లేషకులు -
‘జనసేన అసలు రాజకీయ పార్టీనేనా? ఆ లక్షణం ఒక్కటీ లేదు’
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనకు శనివారం నాటి విశాఖ గర్జన ప్రతిరూపంగా నిలిచిందని, జోరు వానలోనూ ప్రజలు గర్జనలో పాల్గొన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖకు రాజధాని వద్దని గొంతులెత్తుతున్న వారికి ఓ కనువిప్పు అని పేర్కొన్నారు. విశాఖకు రాజధాని వద్దనే వాళ్లు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖ మీద.. ఉత్తరాంధ్ర మీద ఎందుకంత ద్వేషం అని ప్రశ్నిచారు. రాజధానికి విశాఖ దోహదపడుతుందని తెలిసి కూడా విషం కక్కుతున్నారని.. ప్రతిపక్ష పార్టీల ఆకాంక్షలు నెరవేరవన్నారు. విశాఖకు రాజధాని వచ్చి తీరడం ఖాయమని స్పష్టం చేశారు. ‘విశాఖలో ఇంటింటికెళ్లి బ్యాలెట్ పెడితే ప్రతిపక్షాలకు ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం తెలుస్తుంది. విశాఖ గర్జన జరుగుతుంటే.. రాజధాని వద్దని టీడీపీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఈ ప్రాంతానికి టీడీపీ అవసరమా? ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రజలు చొక్కా పట్టుకుని అడగాలి. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టుగా ఉంది. జనసేనకు ఓ విధానం ఉందా..? జనసేన అసలు రాజకీయ పార్టీనేనా..? జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదు. విశాఖకు రాజధాని వద్దని పవన్ ఎందుకొద్దంటున్నారు? గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పలేదా? ఎయిర్ పోర్టులో సంఘటనను చంద్రబాబు తప్పు పట్టడం పోయి.. పోలీసులను తప్పు పడతారా? ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు కదా? మంత్రులపై దాడిని ఎందుకు తప్పు పట్టరు? జనసేన రాజకీయ పార్టీ కాదు. జనసేన ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ. రాజధాని అంటే ఎయిర్ కనెక్టివిటీ.. సీ కనెక్టివిటీ ఉండాలి.. రైల్ కనెక్టివిటీ ఉండాలి. అమరావతికి ఏ కనెక్టివిటీ ఉంది? విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది.’ అని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ తీరుపై విశాఖ వాసుల ఆందోళన.. పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు -
రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు..
చాగల్లు: అమరావతి రైతుల పాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. శనివారం ఉదయం చాగల్లు మండలంలో ఎస్ ముప్పవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఊనగట్ల మీదుగా చాగల్లుకు చేరింది. చాగల్లు మండల వైఎస్సార్సీపీ నేతలతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు ఉదయం తొమ్మిది గంటలకే చాగల్లు ప్రధాన కూడలి వద్దకు చేరుకున్నారు. నల్ల చొక్కాలు, నల్ల కండువాలు ధరించారు. వీరంతా ప్లకార్డులు పట్టుకుని మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ అమరావతి యాత్రపై నిరసన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు, వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి.. అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. అమరావతి పాదయాత్రలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాల వారూ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి.. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, ఏఎంసీ చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, ఎంపీపీలు మట్టా వీరాస్వామి, జొన్నకూటి పోసిబాబు, కొవ్వూరు మునిసిపల్ చైర్మన్ భావన రత్నకుమారి, చాగల్లు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, స్థానికులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా 'గర్జించిన విశాఖ'
ఒకవైపు సముద్రం హోరు.. ఇంకో వైపు వర్షం జోరు.. మరో వైపు ఈ రెండింటితో పోటీపడుతూ జన గర్జన పోరు.. వికేంద్రీకరణ కోసం ఉద్యమ కెరటం ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసింది. పరిపాలన రాజధానికి ‘విశాఖ గర్జన’ జైకొట్టింది. వరుణ దేవుడి సాక్షిగా అశేష జనవాహిని గర్జనతో విశాఖ దిక్కులు పిక్కటిల్లాయి. థింసా నృత్యం, చెక్కభజన, కొమ్ము నృత్యం, కోలాటం, తప్పెటగుళ్లు వంటి ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఆద్యంతం వికేంద్రీకరణ నినాదాలు హోరెత్తాయి. పాలన రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తే ఖబడ్దార్.. అంటూ ఉత్తరాంధ్ర జనం నిప్పులు చెరిగారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, విశాఖపట్నం/ డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన విశాఖ గర్జన అంచనాలకు మించి విజయవంతమైంది. విశాఖపట్నానికి పరిపాలన రాజధానిగా చేయాలన్న నినాదం మిన్నంటింది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన విశాఖ గర్జన పాదయాత్ర, సభ ఆద్యంతం భారీ వర్షంలోనే కొనసాగింది. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనే నినాదాలతో పాదయాత్ర హోరెత్తింది. ఉదయం 9 గంటలకే ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద గర్జన హడావుడి ప్రారంభం కాగా.. మొదట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జేఏసీ చైర్మన్ లజపతిరాయ్‌తో పాటు పలువురు మంత్రులు నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. ఎల్ఐసీ బిల్డింగ్ నుంచి 10.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర సెవన్‌హిల్స్ హాస్పిటల్ మీదుగా సర్క్యూట్ హౌస్, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు ఆంధ్రా యూనివర్సిటీ గేటు నుంచి బీచ్ రోడ్డులోని పార్కు హోటల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు 3.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర మొత్తం వర్షంలోనే సాగింది. ఇసుకవేస్తే రాలనంతగా జన సందోహం మధ్య పాదయాత్ర గంటకుపైగా సాగింది. అక్కడ దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం గర్జన సభ మొదలైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంలోనూ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి జనం భారీగా హాజరయ్యారు. వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు జై కొట్టారు. భారీగా కురుస్తున్న వర్షం తమను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉందని ఆనందపడ్డారు. ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉప్పు పాతరేస్తామని హెచ్చరించారు. ఈ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్‌లకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడుసార్లు విభజించారని.. మళ్లీ అమరావతి మాత్రమే రాజధాని అంటే భవిష్యత్‌లోనూ ఇబ్బందులు తప్పవని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. తమ పోరాటానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఏ కార్యక్రమం నిర్వహించినా తాము మద్దతు ఇస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. మొత్తంగా సముద్రపు కెరటాల్లా ఎగసిపడ్డ జన సమూహం.. విశాఖకు జై కొట్టింది. విశాఖ గర్జనకు భారీ ర్యాలీగా తరలివస్తున్న జన సందోహం.. భారీగా పాల్గొన్న యువత ప్రధానంగా ఇన్ని రోజులుగా ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఎక్కువగా నష్టపోయింది యువతే. ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ ద్వారా పరిపాలన రాజధానిగా విశాఖ అవతరిస్తే ఇటు విద్యా రంగంతో పాటు ఉపాధి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తాయన్న ఆశ వారి మాటల్లో ధ్వనించింది. తద్వారా ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకుని ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉండదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. ర్యాలీలో వర్షం జోరులో చిందేస్తూ.. జై విశాఖ అని నినదిస్తూ యువతీ, యువకులు పోటీపడుతూ నినాదాలతో హోరెత్తించారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులు విశాఖ గర్జనలో భారీగా పాల్గొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే తమ బతుకులు మారతాయని.. ఉద్యోగాలకు వలస వెళ్లాల్సిన బాధలు తప్పుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యువకులతో పోటీ పడి మరీ యువతులు చిందేస్తూ నినాదాలతో పాదయాత్ర కొనసాగించడం విశేషం. తీన్మార్ డప్పులు.. కోబ్రా డ్యాన్స్‌లు.. సాగరతీరాన ఉత్తరాంధ్ర ఆవేదన కడలి ఘోషలా మారింది. విశాఖ పరిపాలన రాజధాని వద్దంటూ..తమ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తున్న వారికి వ్యతిరేకంగా, ఉత్తరాంధ్ర ప్రజానీకం.. కళాకారులు కడలి తరంగంలా ఎగసిపడ్డారు. విశాఖకు పరిపాలన రాజధాని వద్దంటే..పరిణామాలు మునుపటిలా ఉండవని సత్తా చూపారు. ‘గురజాడ, శ్రీశ్రీ, వంగపండు ప్రసాదరావు, రావి శాస్త్రి వంటి గొప్ప వారిని కన్న నేల ఉత్తరాంధ్ర. అలాంటి మా ప్రాంతానికి రాజధాని వద్దా? ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి మీకు పట్టదా? అమరావతి రాజధాని పేరిట మాపై దండ యాత్రకు వస్తారా? మాకు కడుపు మండదా? అంటూ నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర కళాకారులు పాటలు, నృత్యాలు, జానపద గేయాలు, గిరిజన నృత్యాలు, బిందెలు తలపై ఉంచుకుని డ్యాన్స్‌లతో ప్రదర్శననిస్తూ.. అందరూ బాగుండాలి.. అందులో మేముండాలంటూ నినదించారు. ‘మన విశాఖ.. మన రాజధాని’ పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెల్లివిరిశాయి. విశాఖ గర్జనకు హాజరైన అశేష జన సందోహంలోని ఓ భాగం తప్పెటగుళ్లతో ఉత్తరాంధ్ర వెనుకబాటును వివరిస్తూ కళాకారుల ప్రదర్శన పలువురి మన్ననలు పొందింది. పులి వేషధారణతో కళాకారులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొడుగాటి మనుషులమంటూ కాళ్లకు కర్రలు కట్టుకుని..నెత్తిన బిందెలు పెట్టుకుని వేసిన బిందెల డ్యాన్స్‌లు మురిపించాయి. పాముల వేషాలతో రెల్లి కులస్థులు వేసిన కోబ్రా డ్యాన్స్‌కు యువత సై కొట్టింది. కళాకారులతో పాటు యువత కూడా ఆ నృత్యంలో భాగస్వాములై పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తీన్మార్ డప్పులు.. కాంగో డప్పులతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. కళాకారులు వాయించిన డప్పులకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నృత్యాలు చేస్తూ విశాఖ గర్జనలో పలువురు పాలుపంచుకున్నారు. గిరిజనుల కోయ డ్యాన్సులు.. ఖాళీమాతా డ్యాన్సులు.. అష్టలక్ష్మి నృత్యాలు గర్జనకు తోడయ్యాయి. ఎటు చూసినా జన ప్రభంజనమే విశాఖలో శనివారం ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపించింది. దీనికి భారీ వర్షం తోడు కావడంతో వీధులు, రోడ్లు ‘జన’ ‘సంద్రం’గా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఏ ఉద్యమానికి రానంతగా విశాఖ గర్జనకు జనం పోటెత్తి సరికొత్త చరిత్ర సృష్టించారు. అంబేడ్కర్ సర్కిల్లో గంటన్నరకు పైగా జనం వర్షంలో నిల్చుని మన విశాఖ.. మన రాజధాని అంటూ నినదించారు. సర్వమత ప్రార్థనల అనంతరం జోరు వానలో తడిసి ముద్దవుతూ కొందరు.. గొడుగులు చేతబట్టి మరికొందరు అడుగులు ముందుకేశారు. ‘విశాఖే పరిపాలన రాజధాని’ అన్న నినాదాలతో ఉన్న జెండాలు ర్యాలీ పొడవునా రెపరెపలాడాయి. విశాఖ నగరంలో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడం గమనార్హం. అడుగడుగునా అదే ఆకాంక్ష విశాఖ గర్జనలో ఆసాంతం వికేంద్రీకరణ ఆకాంక్ష స్పష్టంగా కనిపించింది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఉత్తరాంధ్ర నలుమూలల నుంచీ జనం ఉదయమే బయలుదేరారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటుకుని.. నిలువెల్లా తడుస్తూ తమ ఆకాంక్షను బలంగా చాటారు. ఉదయం 9 గంటలకే ఎల్ఐసీ బిల్డింగ్ జంక్షన్ వద్ద కోలాహలం మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో విశాఖ గర్జన ప్రారంభమైంది. ర్యాలీ ప్రారంభమైన తర్వాత వర్షం జోరు మరింత పెరిగింది. అయినప్పటికీ వర్షంలో తడుస్తూనే పాదయాత్ర కొనసాగించారు. కొద్ది మంది గొడుగులు పట్టుకుని పాదయాత్రకు రాగా.. ప్రధానంగా యువత మాత్రం వర్షంలో నినాదాలు చేస్తూ ముందుకు అడుగులు వేశారు. విద్యార్థులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, కార్మికులు... ఇలా అన్ని వర్గాల వారు విశాఖ గర్జనలో తమ నినాదాన్ని వినిపించారు. ఎక్కడికక్కడ పాదయాత్రకు స్థానిక విశాఖ జనం సాదరంగా ఆహ్వానం పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Visakha Garjana: దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన విశాఖ (ఫొటోలు)
-
జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’
విశాఖ గర్జన.. జన సంద్రాన్ని తలపించింది. వికేంద్రీకరణకే మా ఓటు అంటూ నినదించింది. విశాఖ జన తుఫాన్లో వర్షం కూడా ‘చిన్న’ బోయింది. ప్రజా పోరాటంతో ఉత్తరాంధ్ర మురిసి ముద్దయ్యింది. వెరసి వికేంద్రీకరణే లక్ష్యంగా చేపట్టిన నేటి(శనివారం) విశాఖ గర్జన విజయవంతమైంది. ఈరోజు ఉదయం విశాఖ గర్జన ఎలా? అనే ప్రశ్న మొదలైంది. దానికి కారణం గర్జన సమయానికి వర్షం పడుతూ ఉండటమే. కానీ దాన్ని సైతం ప్రజలు లెక్క చేయలేదు. తరతరాల తమ వెనుకబాటుతనంపై పోరాటం చేసే అవకాశం రావడంతో జనం వర్షం అన్న సంగతే మరిచారు. వారిలో ఉన్నది ఒకే ఒక్క సంకల్పం. విశాఖ గర్జన సక్సెస్ చేయడమే. తమ నినాదాన్ని, తమ ఆత్మగౌరవ పోరాటాన్ని విశాఖ గర్జన వేదికగా చాటాలనుకున్నారు.. అది చేసి చూపించారు. విశాఖ గర్జనలో లక్షకు మందికి పైగా ర్యాలీలో పాల్గొనడమే ఇందుకు ఉదాహరణ. కుల, మత, వర్గ భేషజాలం లేకుండా ప్రజలంతా నడుంబిగించారు. అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రకి తమ నిరసన ఎలా ఉంటుందో చూపించారు. వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించే క్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖ అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్‌రోడ్డు వరకూ చేపట్టిన ర్యాలీలో అశేష జనవాహిని పాల్గొంది. భారీ వర్షంలోనూ సుమారు రెండున్నర గంటల పాటు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం తెలపగా, విశాఖకు రాజధాని రావాలంటూ నినాదించారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణే లక్ష్యంగా విశాఖ గర్జన
-
Visakha Garjana: విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్
Updates విశాఖ గర్జనలో జన తుఫాన్ విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ జనసంద్రమైన విశాఖ, ర్యాలీకి లక్షమందికి పైగా హాజరు సభలో మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. అందరూ బాగుండాలనే మా ఆలోచన అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం అమరావతి పాదయాత్ర చేస్తున్నది చంద్రబాబు బినామిలే: మేరుగ నాగార్జున అందరూ అభివృద్ధి చెందాలంటే 3 రాజధానుల అవసరం: మేరుగ నాగార్జున విశాఖ సభలో మంత్రి రోజా మాట్లాడుతూ.. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది జగనన్న సంకల్పం దానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలి మీ జన సునామీలో చంద్రబాబు, పవన్‌లు కొట్టుకుపోవాలి ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించండి 2024... జగనన్న వన్స్‌మోర్ కలెక్షన్లు, షూటింగ్‌ల కోసం పవన్‌కు విశాఖ కావాలి పోటీ చేయడానికి విశాఖ కావాలి కానీ విశాఖలో రాజధాని వద్దా: మంత్రి రోజా పెయిడ్ ఆర్టిస్ట్‌లను సపోర్ట్ చేస్తున్న పవన్‌ను తరిమికొట్టాలి ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్‌కు చూపించాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. ఒకవైపు జడివాన.. మరో వైపు జనవాన ఉత్తరాంధ్ర గర్జన ముందు బాబు గర్జన బలాదూర్ ఉత్తరాంధ్ర అన్ని రకాలుగా వివక్షకు గురైంది భావితరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం అంబేడ్కర్ సర్కిల్ నుంచి బీచ్‌రోడ్డుకు చేరిన ర్యాలీ. నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. భారీ వర్షంలో రెండున్నర గంటలు సాగిన ర్యాలీ దారి పొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం. విశాఖకు రాజధాని రావాలంటూ హోరెత్తిన నినాదాలు. జనసంద్రమైన విశాఖ, ర్యాలీకి లక్షమందికి పైగా హాజరు విశాఖ పరిపాలనా రాజధాని అంటూ హోరెత్తిన నినాదాలు మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజల నినాదాలు 29 గ్రామాలు కాదు.. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటూ నినాదాలు అమరావతి పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు అంటూ హెచ్చరిక చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర కోసం అందరూ గొంతెత్తి నినదించాలి: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు: మంత్రి ధర్మాన ఉత్తరాంధ్ర కోసం రాజకీయ పోరాటం చేస్తాంఫ మంత్రి ధర్మాన ప్రస్తుత పరిస్థితుల్లో వికేంద్రీకరణ చాలా అవసరం: బుగ్గన అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అచ్చెన్నాయుడికి రాజకీయ సమాధి తప్పదు చంద్రబాబుకు అచ్చెన్నాయుడు బానిస: దువ్వాడ శ్రీనివాస్ ఆ బానిసకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ప్రొఫెసర్లు ప్రపంచంలోని అద్భుత నగరాల్లో విశాఖ ఒకటి: ప్రొఫెసర్లు విశాక రాధానిని ప్రజలంతా స్వాగతిస్తున్నారు: ప్రొఫెసర్లు ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు ఇంకెన్నాళ్లు: ప్రొఫెసర్లు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే రాజధాని రావాలి వర్షంలోనే కొనసాగుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ భారీ వర్షంలోనే కొనసాగుతున్న ర్యాలీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన ప్రజానీకం మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలి మేం అందరి అభివృద్ధిని కోరుకుంటున్నాం మేం చేసేది ప్రజా పోరాటం చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ పోరాటం విశాఖ గర్జనకు భారీ ప్రజా స్పందన రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు 3 రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజా సంఘాల నినాదాలు కొడాలి నాని మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని ప్రజల ఆకాంక్షలకు అందరూ మద్దతు తెలుపుతున్నారు అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయం ఆ నలుగురి అభివృద్ధే చంద్రబాబుకు కావాలి మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రజా గళం.. వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా శనివారం జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగుతోంది. రాజకీయాలకతీతంగా భారీ ప్రదర్శన చేపట్టగా దీనికి అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదిస్తున్నారు. ‘టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర ఇప్పడు గుర్తుకువచ్చింది’ ‘విశాఖ గర్జన భయంతో ఇప్పుడు టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది. విశాఖ గర్జన విజయవంతం ఖాయం. విశాఖ రాజధాని అవకాశాన్ని వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ‘ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకే విశాఖ పరిపాలన రాజధాని. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పరిపాల రాజధానిగా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. విశాఖ గర్జనకు విశేషమైన స్పందన లభిస్తోంది’ అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. ఇక వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారికి కనువిప్పు కలగాలని విశాఖ గర్జన ర్యాలీ. వర్షం వచ్చినా విశాఖ గర్జన ర్యాలీ ఆగదు.వర్షం కంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మస్థైర్యం గొప్పది. ఉత్తరాంధ్రకు టిడిపి నాయకులు ఏం చేశారో సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను టిడిపి నేతలు దోచుకున్నారు.జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఉత్తరాంధ్ర పై టిడిపి నేతలకు ప్రేమ పుట్టుకొచ్చింది’ అని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న పవన్
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ధ్వజమెత్తారు. పవన్ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చే లక్ష్యంతో విశాఖ ప్రాంతంలో మూడు రోజులు పర్యటన పెట్టుకొన్నారని చెప్పారు. జనసేన ముసుగులో చంద్రబాబు కనుసైగలతో పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని ముందుగానే ప్రకటించినప్పటికీ, పవన్ హడావుడిగా అదే సమయంలో యాత్ర చేపట్టి ఏం సాధించదలుచుకున్నారని ప్రశ్నించారు. -
విశాఖ అత్యంత అనుకూలం.. అందరి మాటా అదే
సాక్షి, విశాఖపట్నం: ‘పరిపాలన రాజధానిగా విశాఖకే జై కొడతాం.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వికేంద్రీకరణకే సై అంటాం..’ అంటూ విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే మేధావి, వ్యాపార, పారిశ్రామిక, విద్యా, ఉద్యోగ, కార్మిక, కర్షక లోకం గొంతెత్తుతోంది. వికేంద్రీకరణ వద్దంటూ అమరావతి రైతుల పేరిట చేస్తున్న యాత్రపై భగ్గుమంటోంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాదని, కేవలం అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నేతలు నడిపిస్తున్న ఈ యాత్రను ఉత్తరాంధ్రలోకి చొరబడనీయమని స్పష్టం చేస్తోంది. వడ్డించిన విస్తరిలాంటి విశాఖలో తక్కువ పెట్టుబడితోనే పాలన రాజధానికి అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పించవచ్చని వివరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి ముక్త కంఠంతో మద్దతు పలుకుతోంది. విశాఖను పాలన రాజధాని చేయడం చారిత్రక అవసరమని నినదిస్తోంది. ఒకే ప్రాంతంలో రాజధాని ఉంటే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయిన వైనాన్ని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం విశాఖ నగరంలో భారీగా నిర్వహించ తలపెట్టిన ‘విశాఖ గర్జన’ను విజయవంతం చేస్తామని ప్రతి గొంతూ గర్జిస్తోంది. అదే సమయంలో అమరావతి యాత్రను తక్షణమే విరమించుకోవాలని అభ్యర్థిస్తోంది. లేదంటే విశాఖ పరిపాలన రాజధాని అయ్యే వరకు మున్ముందు ఎలాంటి ఉద్యమాలకైనా, త్యాగాలకైనా సిద్ధమని, వెనకడుగు వేయబోమని ప్రతిన బూనుతోంది. వికేంద్రీకరణ, విశాఖ పాలన రాజధాని ఆవశ్యకతపై వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చారిత్రక అవసరం.. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం చారిత్రక అవసరం. అప్పుడే ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది. వలసల నిర్మూలనకు వీలవుతుంది. రాజధానికి అవసరమైన అన్ని హంగులూ విశాఖలోనే ఉన్నాయి. ఇన్నాళ్లూ గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడు వికేంద్రీకరణలో భాగంగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం హర్షణీయం. – కృష్ణమోహన్, జేఏసీ సభ్యుడు, న్యాయవాది, ఏపీ బార్ కౌన్సిల్ విశాఖ అంటే వడ్డించిన విస్తరి రాజధానిగా విశాఖ ఎంతో అనుకూలం. విశాఖ అంటే వడ్డించిన విస్తరి. రాజధానికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైలు, వాయు, రోడ్డు, సముద్ర మార్గాలున్న ఏకైక నగరమిది. పరిశ్రమలతోపాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ లభిస్తున్న నగరం విశాఖపట్నం. రాష్ట్రంలో వచ్చే ప్రతి వంద రూపాయల్లో 75 రూపాయలు ఇక్కడ్నుంచే వస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. – సత్యనారాయణరెడ్డి (రఘు), చైర్మన్, ఐలా, గాజువాక వైద్యులందరి మాటా అదే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ముందుచూపుతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీకరణతో విశాఖ సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. సీఎం నిర్ణయానికి మా వైద్యుల సంఘం సంపూర్ణంగా మద్దతు తెలుపుతోంది. విశాఖ గర్జనను అన్ని వర్గాలూ విజయవంతం చేసి విశాఖ రాజధాని ఆవశ్యకతను చాటాలి. – డా.సుందరరాజు, అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కేజీహెచ్ యూనిట్ మూడు రాజధానులతో మేలు వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి. ఫలితంగా ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మౌలిక వసతులు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో వెనుకబడిన ఈ ప్రాంతంలో ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ విధానాన్ని మా చాంబర్ ఆఫ్ కామర్స్ పూర్తిగా స్వాగతిస్తోంది. – సతీష్, అధ్యక్షుడు, ది వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ గుణపాఠం కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఒక్కటే రాజధానిగా ఉండటంతో అభివృద్ధి అంతా హైదరాబాద్‌కు పరిమితమైంది. దీంతో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని అయితే మళ్లీ అదే ప్రమాదం పొంచి ఉంది. భవిష్యత్తులో మళ్లీ రాష్ట్ర విభజన సమస్యలు తలెత్తితే మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. గతాన్ని చూసైనా వికేంద్రీకరణకు అందరూ మద్దతివ్వాలి. – డి.వి.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, డీవీఆర్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి రాష్ట్రంలో మూడు రాజధానుల ఆవశ్యకత ఎంతో ఉంది. విశాఖ పరిపాలన రాజధాని అయితే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో కొన్ని పరిశ్రమలు వచ్చాయి. విశాఖ పరిసరాల్లో అనేక పరిశ్రమలు రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. రాజధాని అయితే మరిన్ని పరిశ్రమలు రావడంతో పాటు ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖ పరిపాలనా రాజధాని అయ్యే వరకు ఉద్యమానికి వెనకాడం. – మంత్రి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్టీయూసీ ఉత్తరాంధ్రులు ఉద్యమించాల్సిన తరుణమిదే ఉత్తరాంధ్ర ఎప్పట్నుంచో వెనుకబాటుతో ఉంది. ఈ ప్రాంతీయుల్లో అధికులు పేదలు. విశాఖ పాలన రాజధాని అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రాజధానిగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. విశాఖ పాలన రాజధాని, వికేంద్రీకరణ కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన తరుణమిదే. ఇది ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరి బాధ్యత. శనివారం నాటి విశాఖ గర్జనలో వికేంద్రీకరణ కోసం అంతా నినదించాలి. – పైడిరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ అన్ని విధాలా ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. విశాఖలో వ్యాపారాలు మరింతగా విస్తరించి మరెందరికో ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ హోల్‌సేల్ మార్కెట్లు లేవు. విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే అవి కూడా వస్తాయి. హైదరాబాద్‌ను మించి ఇక్కడ వ్యాపారాలు జరుగుతాయి. హెల్త్ సిటీగా విశాఖ మరింత ప్రాచుర్యం పొందుతుంది. – రాపర్తి సుబ్బారావు, వస్త్ర వ్యాపారి, గాజువాక. విశాఖ గర్జనలో పాల్గొంటున్నాం మాది గుంటూరు జిల్లా. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసిస్తున్నాను. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితేనే అందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వికేంద్రీకరణతోనే అది సాధ్యం. గతంలో ఒక్క హైదరాబాద్‌నే అభివృద్ధి చేయడం వల్ల విభజనతో అన్నింటినీ వదిలేసి రావాల్సి వచ్చింది. ఆ తప్పు పునరావృతం కాకూడదు. అందువల్లే మేమంతా వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ శనివారం జరిగే విశాఖ గర్జనలో పాల్గొంటున్నాం. – కర్నేటి సాయికృష్ణ, న్యాయ విద్యార్థి, ఏయూ, విశాఖపట్నం వికేంద్రీకరణతో ఏపీ అభివృద్ధి రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలున్న నగరం విశాఖ. ఓ వైపు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆరు వరుసల జాతీయ రహదారి, రైలు, జల రవాణా ఉన్న ఏకైక సిటీ. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించింది. విద్య, వైద్య రంగాలకు పెట్టింది పేరు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటున్న వైజాగ్.. పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే ఆత్యధిక జీడీపీ కలిగిన పది నగరాల్లో మన విశాఖ ఒకటి. విశాఖ రాజధాని కావాలి. ఇందుకు అందరూ మద్దతు పలకాలి. – మేడపాటి రమేష్ రెడ్డి, ఎండీ, స్వాతి ప్రమోటర్స్ -
విశాఖకు జై!.. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన
సాక్షి, విశాఖపట్నం: తరతరాల వెనుకబాటు తనంపై తమ గొంతు వినిపించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి వేచి చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం నిర్వహించనున్న విశాఖ గర్జనలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 1956లోనే రాజధానిగా విశాఖ ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ వీలు కాలేదని, ఇన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు తమ చిరకాల కోరిక నెరవేరబోతున్న సమయంలో అడ్డుకునే వారికి బుద్ది చెప్పేలా శాంతియుతంగా గర్జనను నిర్వహిచేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ నినదిస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ గర్జనకు మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం పూర్తి మద్దతు తెలిపింది. విశాఖ గర్జన విజయవంతానికి వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు మాత్రం గర్జనకు దూరంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో గాజువాకలో ఘోరంగా ఓడించారన్న అక్కసుతో ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా తన వాణిని కాస్త జనవాణిగా వినిపించేందుకు జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖకు శనివారమే వస్తుండడం గమనార్హం. టీడీపీ నేతలు కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంపై విషం చిమ్ముతున్నారు. తమ హయాంలో జరిగిన భూకబ్జాలను కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్టుగా.. భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నేతలే వాటి గురించి మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైగా ఇదే రోజు ఉత్తరాంధ్ర నేతలందరూ ఆ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యేందుకు సిద్ధమవ్వడంపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. శుక్రవారం ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతిరాయ్, మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు జేఏసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేధావులు ర్యాలీ జరిగే రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ‘విశాఖ గర్జన’ జెండాను, పాటను ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీ రూట్‌మ్యాప్‌ను పోలీసులకు అందజేశారు. ఉత్తరాంధ్ర, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల వారీగా వెళ్లేలా వలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. యాత్రలో పాల్గొనే వారందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా వలంటీర్లు సహాయ పడతారు. సాగర తీరాన మూడున్నర కిలోమీటర్ల మేర సుమారుగా లక్ష మందితో గర్జన జరగనుంది. ర్యాలీ సాగేదిలా.. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ బిల్డింగ్.. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభం కానుంది. జైలు రోడ్డు జంక్షన్, సెవెన్ హిల్స్ హాస్పిటల్ జంక్షన్, వాల్తేర్ క్లబ్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేర్ జంక్షన్ మీదుగా ఆర్కే బీచ్ రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, మేధావులు నివాళులర్పించి.. ర్యాలీ ప్రారంభిస్తారు. ర్యాలీ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం, ఇక్కడ ప్రజలు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటం, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుండటంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశాఖ గర్జన నేపథ్యంలో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. -
అమరావతి పెట్టుబడిదారుల కోసం ఉత్తరాంధ్రులకు వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని, అందరికీ సమన్యాయం చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార వికేంద్రీకరణ తలపెట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేవలం తన అనుయాయులను పెత్తందారులను చేయడానికే చట్టబద్ధంగా ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను చంద్రబాబు పక్కనబెట్టి నారాయణ, సుజనాచౌదరిల కమిటీ చెప్పిన అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరి సొమ్ముతో తమ మందిమాగధులకు మేలు చేసేది రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి సహా మూడు ప్రాంతాలూ అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నామని, కానీ అమరావతి రైతుల ముసుగులోని పెట్టుబడిదారులు మాత్రం ఉత్తరాంధ్ర నాశనం అయిపోవాలని దేవుడికి మొక్కడానికి అరసవల్లి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి స్థానిక టీడీపీ నాయకులు మద్దతు పలకడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు. దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్‌ను కాపాడాల్సింది పోయి చంద్రబాబు ప్రయోజనాల కోసం పణంగా పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హడావుడిగా శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమన్నారు. గతంలో మాదిరిగానే ప్రజలు అమాయకులని వెన్నుపోటు పొడుద్దామంటే కుదరదని హెచ్చరించారు. వికేంద్రీకరణపై టీడీపీ విషప్రచారాన్ని వారే తిప్పికొడతారని, కుట్రల్లో భాగమైన పాదయాత్రను అడ్డుకుంటారని స్పష్టం చేశారు. జెడ్పీ చాంబర్లో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. టీడీపీ నాయకులు చేస్తున్న విషప్రచారాన్ని ఖండించారు. ఆ ప్రకటనల వెనుకనున్న అసలు విషయాన్ని వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... టీడీపీ ప్రచారం: భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినది మేమే. 400 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసేసుకుంది. వాస్తవ విషయం: విమానాశ్రయం కోసం గత టీడీపీ ప్రభుత్వం 2,750 ఎకరాలను జీఎంఆర్‌కు ఇస్తూ ఒప్పందం చేసుకుంది. ఆ భూసేకరణపై 150 వరకూ కేసులు హైకోర్టు విచారణలో ఉన్నా వాటిని పరిష్కరించకుండానే, ఓ ఒక్క నిర్వాసితుడికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండానే చంద్రబాబు ఎన్నికల ముందు ఆదరాబాదరాగా శంకుస్థాపన చేసేశారు. అశోక్ గజపతిరాజు అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా ఏ ఒక్క అనుమతీ తీసుకురాలేదు. రైతులతో మాట్లాడి ఆ కేసులన్నీ ఉపసంహరింపజేసినదీ, నిర్వాసితులకు న్యాయం చేసినదీ, కేంద్రం నుంచి అనుమతులన్నీ తెచ్చినదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుంది. విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదనే జీఎంఆర్ నుంచి 547 ఎకరాలను ప్రభుత్వం వెనక్కుతీసుకుంది. ఐదు గ్రామాల నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం ఇచ్చింది. అన్ని సౌకర్యాలతో కాలనీలు సిద్ధం చేసింది. టీడీపీ ప్రచారం: గిరిజన యూనివర్సిటీకి టీడీపీ హయాంలోనే భూమి సేకరించేశాం. రూ.10 కోట్ల ఖర్చుతో కాంపౌండ్ వాల్‌నూ కట్టేశాం. వాస్తవ విషయం: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది. ఇతర రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలన్నీ గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ వాటి లక్ష్యాన్ని పక్కనబెట్టి టీడీపీ పాలనలో మైదాన ప్రాంతమైన కొత్తవలస మండలంలో స్థల సేకరణ చేశారు. సొంత కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రూ.10 కోట్లతో మంజూరు చేసిన చేసిన ప్రహరీ కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశంతో వారికి అందుబాటులో ఉండేలా సాలూరు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీపంలోనే రైలు, రోడ్డు, విమాన ప్రయాణ సదుపాయాలు ఉండేలా మెంటాడ మండలంలో సుమారు 500 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తే, కేంద్ర కమిటీ దానికి మొగ్గు చూపించింది. దీన్ని పార్లమెంట్లో ఆమోదం పొందేలా ప్రధానమంత్రి, కేంద్ర హోమ్‌మంత్రితో మాట్లాడి సాధించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. ఆ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ నియమించినదీ, తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అన్ని గిరిజన ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనే ఆయన కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరుచేశారు. మరో మెడికల్ కాలేజీ త్వరలోనే పార్వతీపురం మన్యం జిల్లాకూ మంజూరు చేయనున్నారు. టీడీపీ ప్రచారం: అమరావతి రైతులకు మద్దతుగా అన్నివర్గాల వారితో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. పాదయాత్రకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తాం. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టడం తప్ప ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధీ చేయలేదు. వాస్తవ విషయం: జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న అటు అశోక్‌కు తప్ప మిగతా టీడీపీ నాయకులెవ్వరికీ ఇక్కడ జరిగిన అభివృద్ధిపై అవగాహన లేదు. గణాంకాలు చూస్తే తెలుస్తుంది. టీడీపీ పాలనలో ఏమి జరిగిందో, వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను పూర్తి చేసింది వైఎస్సారే. కాలువ, మిగులు పనులకు ఇటీవలే రూ.125 కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనికి అడ్డంకిగానున్న సారిపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి రూ.77 కోట్లను కేటాయించినది మా ప్రభుత్వమే. వీటన్నింటినీ విస్మరించి వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలపై విషప్రచారం చేయడానికి టీడీపీ నాయకులకు తగదు. విశాఖ రాష్ట్ర పరిపాలన రాజధాని గాకుండా అడ్డుకోవడానికే జరుగుతున్న అమరావతి పాదయాత్రకు మద్దతు పలకడం సమంజసం కాదు. కాదని ఆ విధానానికే కట్టుబడి ఉంటే 2024 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజధాని వల్ల ఉత్తరాంధ్రకు ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలకు మేలు జరుగుతుంది. దాని కోసం అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. -
ఉత్తరాంధ్రలో మిన్నంటిన వికేంద్రీకరణ నినాదం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మార్మోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ విధానానికి ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామం నుంచి మద్దతు లభిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు అన్ని వర్గాల వారు ఏకమై నినదిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు ఏకతాటిపై నిలిచి గర్జించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని తపన పడుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ పరిపాలన రాజధాని కావాలి ► విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా బీచ్ రోడ్డులో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సందర్శించారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలని ఆకాంక్షించారు. ► విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్లపాలెం జంక్షన్లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ► గాజువాక నియోజకవర్గంలోని బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అంతకు ముందు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతిలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు. 66వ వార్డులో కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు. ► భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పలు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలియజేశారు. ► విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గోపాలప ట్నం కుమారి కల్యాణమండపంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో బెహరా భాస్కరరావు విశాఖ గర్జన పోస్టర్ ఆవిష్కరించారు. గవర కమ్యూనిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 52వ వార్డు శాంతినగర్‌లో డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పలు సంఘాలతో సమావేశం నిర్వహించారు. శ్రీహరిపురం వైçష్ణవి ఫంక్షన్హాల్లో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతవాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారు. 59వ వార్డులో ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో అంబేడ్కర్ సేవా సంఘం సభ్యులు విశాఖ గర్జనకు సంఘీభావం తెలియజేశారు. ► పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట జంక్షన్లో నాన్ పొలిటికల్ పెందుర్తి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోనూ అదే జోరు ► పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి అడ్డురోడ్డు వరకు జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల నుంచి వందలాది మంది అన్ని వర్గాల వారు ఈ ర్యాలీకి తరలివచ్చారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు. ► వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో గంధవరం నుంచి చోడవరం వరకు 10 కి.మీ.. రావికమతం మండలంలో కొత్తకోట నుంచి రావికమతం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం కొత్తూర్ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ► అనకాపల్లిలోని బెల్లం మార్కెట్లో వర్తకులు వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. -
Andhra Pradesh: ఉవ్వెత్తున ఉద్యమం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ విధానం గ్రామగ్రామాన నినదిస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలని తపిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మరోసారి ముక్కలు చెక్కలు కాకుండా సీఎం దూరదృష్టితో కాపాడుతున్నారంటూ ప్రజలంతా బాసటగా నిలుస్తున్నారు. అనవసర వ్యయాన్ని, పెనుభారాన్ని భరించే పరిస్థితిలో రాష్ట్రం ఏమాత్రం లేదని, అందుకే అన్ని సదుపాయాలున్న విశాఖ పరిపాలన రాజధాని కావాలని స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే సమన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే గర్జిస్తామంటూ మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చారు. మానవహారాలు, భారీ ర్యాలీలు, పూజలతో ప్రజల ఆకాంక్షను చాటి చెబుతున్నారు. విశాఖపట్నంలో ర్యాలీల హోరు విశాఖ నగరం సహా పలు ప్రాంతాల్లో బుధవారం భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో యువత, మేధావులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవీఎంసీ 77వ వార్డు నమ్మిదొడ్డి జంక్షన్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నినాదాలతో హోరెత్తించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వికేంద్రీకరణకు మైనారిటీ సంఘాలు మద్దతు పలికాయి. గోపాలపట్నం ప్రధాన రహదారిలో మసీదు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. విశాఖ పరిపాలన రాజధానిగా కావాలని కోరుతూ పెందుర్తిలో నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అదీప్‌రాజ్ పాల్గొన్నారు. వేపగుంట కూడలిలో వందలాది మందితో ర్యాలీ చేశారు. ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనలో అంతా పాల్గొనాలని కోరుతూ ప్రయాణికులకు, స్థానికులకు, పాదచారులకు, చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు. పరవాడ సినిమా హాలు కూడలిలో రాజకీయేతర జేఏసీ భారీ మానవహారం నిర్వహించి ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు అంటూ నినదించింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకి మంత్రి గుడివాడ అమర్నా«ధ్, నగర మేయరు గొలగాని హరి వెంకటకుమారి హాజరయ్యారు. ఈనెల 15న జరిగే విశాఖ గర్జనకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానులకు మద్దతుగా గాజువాకలో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో.. పరిపాలనా రాజధానిగా విశాఖకు మద్దతుగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న పాన్‌షాప్ వద్ద మూడు రాజధానులే మేలంటూ ప్లెక్సీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో వెంకటేశ్వరస్వామి ఆర్చ్ నుంచి బుచ్చెయ్యపేట నాలుగు రోడ్ల జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బుచ్చెయ్యపేట జంక్షన్లో మానవ హారంగా ఏర్పడి మూడు రాజధానులు కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికేంద్రీకరణ, విశాఖ పరిపాలనా రాజదాని కోరుతూ బుచ్చింపేట నుంచి జె.పి.అగ్రహారం వరకు వివిధ అభివృద్ధి సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో.. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు రోజులుగా జరుగుతున్న రిలే దీక్షలు బుధవారంతో ముగిశాయి. నరసన్నపేటలో జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం సందర్శించారు. ఈ నెల 15న నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశాఖ గర్జనకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో స్పీకర్ తమ్మినేని సీతారాం వికేంద్రీకరణ అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, విశాఖ రాజధాని సాధన కోసం యువత, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించారు. బాడంగి మండలం భీమవరంలో జరిగిన సదస్సులో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ విశాఖ గర్జనకు రావాలని పిలుపునిచ్చారు. బాడంగి మండలంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. అల్లూరి జిల్లాలో.. మూడు రాజధానులకు మద్దతుగా చింతపల్లిలోని ముత్యాలమ్మ దేవాలయంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మత్స్యరాస వెంకటలక్ష్మి 108 కొబ్బరి కాయలు కొట్టారు. 26 జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్‌కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడేలా దీవించాలని మొక్కుకున్నారు. -
టీడీపీ బినామీలు గోబ్యాక్.. గోబ్యాక్
సాక్షి, పశ్చిమ గోదావరి: రైతులుగా చెప్పుకుంటూ అమరావతి పేరిట పాదయాత్ర చేపట్టివాళ్లకు రెండో రోజూ(బుధవారం) నిరసన సెగ తగిలింది. జిల్లాలోని తణుకు పట్టణంలో పాదయాత్రకు వ్యతిరేకంగా అడుగడుగునా నిరసనలు దర్శనమిచ్చాయి. టీడీపీ బినామీలు గోబ్యాక్.. గోబ్యాక్ నినాదాలు చేశారు అక్కడి ప్రజలు. వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మద్య చిచ్చు వద్దంటూ సందేశాలతో పట్టణంలో అమరావతి యాత్రకు స్వాగతం పలికాయి. గోబ్యాక్ సందేశాలతో బ్యానర్లు వెలిశాయి. ఇంకోవైపు మూడు రాజధానులే కావాలంటూ ప్రజలు ఫ్లకార్డులు సైతం ప్రదర్శించారు. ఇదీ చదవండి: చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్ -
రాజధాని కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ)/ఆనందపురం (విశాఖపట్నం)/నక్కపల్లి/ఇరగవరం: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో మంగళవారం భారీ పాదయాత్ర జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజలు కదంతొక్కారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మత్స్యకార డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లవరపు జాన్‌వెస్లీ, మత్స్యకారుల వేషధారణలో పలువురు నాయకులు, ప్రజలు ఉత్సాహంగా కదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ విశాఖపట్నం రాజధాని కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు రాజధానులకే తమ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని, మూడు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని పేర్కొన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతూ భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, జేఏసీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనందపురం జంక్షన్‌లోని జాతీయ రహదారిపై బైఠాయించి విశాఖ రాజధాని మా హక్కు అంటూ నినదించారు. అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డులో వెంకటేశ్వర కల్యాణమండపంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు డాక్టర్లు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు పాల్గొన్నారు. 3 రాజధానుల కోసం తీర్మానం చేస్తాం: మేయర్ విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి తెలిపారు. నవంబర్ 4న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానం ఆమోదిస్తామని చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఆమె మాట్లాడారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ ప్రాంతంలో సమాధి అవుతాయని ఆమె చెప్పారు. -
విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు
సొంత ప్రాంతంపై ఎటువంటి వారికైనా మమకారం ఉంటుంది. తమ ప్రాంత ప్రగతికి అవకాశం వస్తే హర్షిస్తారు.. స్వాగతిస్తారు.. సహకరిస్తారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిలో అవేవీ మచ్చుకైనా లేవు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప తన ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదన్నట్లు విర్రవీగుతున్నారు. పదవులు ఇచ్చిన అధినేత మోచేతి నీళ్లు తాగుతూ.. వారి పన్నాగాలకు వంతపాడుతూ సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి బాటలు వేసే విశాఖ రాజధానికి అడ్డం పడుతూ.. విషం కక్కుతున్నారు. అమరావతే అజెండాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెగేసి చెబుతూ ఉత్తరాంధ్రకు ద్రోహం తలపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలు బాగు కోరకుండా.. విశాఖ రాజధాని వద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలు మండి పడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని గెలిపించి తప్పు చేశామని టెక్కలి నియోజకవర్గ ఓటర్లు అంతర్మథనం చెందుతున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో అమరావతి రాజధానిగానే తాను ఎన్నికలకు వెళ్తానని అచ్చెన్నాయుడు ఓటర్లకు సవాల్ విసురుతున్నారు. ప్రజల కంటే తమ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, అమరావతిలో వారికున్న భూములే ముఖ్యమని చెప్పకనే చెబుతున్నారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కోరుతున్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి తమ గళం విప్పుతున్నారు. కానీ టీడీపీ నేతలకు మాత్రం ఇది రుచించడం లేదు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానికైనా సిద్ధమవుతున్నారే తప్ప అమరావతిని వదులుకునేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ రైతుల యాత్రకు మద్దతునిస్తూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. జిల్లాలో అచ్చెన్నాయుడు అండ్ కో తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. దద్దమ్మలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా మూడు రాజధానుల కోసం తాము రాజీనామా చేస్తాం.. అమరావతి కోసమని రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడుకు సవాల్ కూడా విసురుతున్నారు. (క్లిక్: జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి) ఓట్లేసిన ప్రజలు దద్దమ్మలా... మీకు ఓటేసినందుకు ప్రజలు దద్దమ్మలా కన్పిస్తున్నారా.. అచ్చెన్నాయుడు? చంద్రబాబు పంచన చేరి ఆయన చెప్పిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెలుగుదేశం నాయకులంతా ప్రయత్నిస్తున్నారా? ఇంతకాలం వివిధ సందర్భాల్లో రాజధాని పేరిట జరిగిన ఏర్పాటులో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలే బుద్ధి చెబుతారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖను పాలనా రాజధానిగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి ఇక్కడి టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించాల్సింది పోయి వ్యతిరేకించడం దారుణం. చంద్రబాబుతో సహా ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులంతా అభివృద్ధి నిరోధకులు. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. నరసన్నపేట: మూడో రోజు రిలే దీక్షలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రజల మనోభావాలతో అచ్చెన్న ఆటలు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అచ్చెన్నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాకుండా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అచ్చెన్నాయుడు తాపత్రయపడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలడా..! టెక్కలి: వికేంద్రీకరణకు మద్ధతుగా నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆత్మ సాక్షిగా ముందుకు సాగాలి.. ఉత్తరాంధ్ర నాయకులు ఆత్మసాక్షిగా ముందుకు సాగాలి. ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలి. విశాఖపట్నం రాజధానిగా అవకాశం లభించింది. ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు వైస్ చాన్స్‌లర్, ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ అభిమానం అందరికీ ఉంటుంది మన ప్రాంతం అన్న అభిమానం అందరికీ ఉంటుంది. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతున్నారు. పార్టీకి సైతం నచ్చజెప్పేలా నాయకులు ఉండాలి. ఉత్తరాంధ్ర ప్రగతికి విశాఖపట్నం రాజధాని కావటం మంచి అవకాశం. దీన్ని స్వాగతించాలి. – ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పూర్వపు రిజిస్ట్రార్ -
పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించాడు?
-
రామోజీ నీకు ఇదే నా ఛాలెంజ్
-
రామోజీకి నైతిక విలువలు లేవు.. పుట్టుకే అనైతికం: విజయసాయిరెడ్డి
-
‘మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చూసుకుందాం’
సాక్షి, విశాఖపట్టణం: విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయన్నారు. విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. టీడీపీ, ఎల్లోమీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కొన్ని పత్రికలు కులం అనే ఇంకుతో విషపు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘వైఎస్ఆర్సీపీపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈనాడు దాని అనుబంధ కుల పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. విషపు రాతలతో కొత్తదారులు అన్వేషిస్తున్నారు. ఇంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించటం శోచనీయం. వికేంద్రీకరణపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. దసపల్లా భూముల విషయంలో బిల్డర్లు, యజమానులు క్లారిటీ ఇచ్చారు. సుప్రీం తీర్పును అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ చర్యలతో 400 కుటుంబాలకు మేలు జరిగింది. 64 ప్లాట్ యజమానుల్లో 55 మంది చంద్రబాబు సామాజిక వర్గం వారే. ఉత్తరాంధ్రలో కాపులు, వెలమలు, యాదవులు, కళింగులు ఎక్కువగా ఉన్నారు. కానీ, భూములు మాత్రం చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో ఉన్నాయి. కొన్ని పత్రికలు టీడీపీ కరపత్రం కంటే దిగజారిపోయాయి. కుల పత్రికలపై ఉమ్మి వేసే పరిస్థితి ఏర్పడింది. రామోజీకి నైతిక విలువలు లేవు.. పుట్టుకే అనైతికం.’అని తీవ్రంగా మండిపడ్డారు విజయసాయిరెడ్డి. రామోజీ, చంద్రబాబుకు సవాల్.. ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ విచారణకు తాను సిద్ధమని.. రామోజీ, చంద్రబాబు సిద్ధమేనా అంటూ సవాల్ చేశారు విజయ సాయి రెడ్డి. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుందన్నారు. ‘మీడియా రంగంలోకి నేను వస్తున్నా.. రామోజీ చూసుకుందాం. ఒక్క ఫిలింసిటీలోనే 2,500 ఎకరాలు ఆక్రమించుకున్నారు. పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? మార్గదర్శి డిపాజిటర్లను మోసం చేసిన వ్యక్తి రామోజీ.ఆస్తులపై విచారణకు చంద్రబాబు, రామోజీ సిద్ధమా?’ అంటూ సవాల్ చేశారు. ఇదీ చదవండి: అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ -
‘విశాఖను పరిపాలన రాజధానిగా ఆపే ధైర్యం ఎవరికి లేదు’
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ సాధనకై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మేధావులు, ఉద్యోగులు, వివిధ రంగా నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, మేధావులు, వివిధ రంగాలు నిపుణులు ఏమన్నారంటే ► సమావేశం సందర్భంగా పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఈ నెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం. ►పరిపాలన రాజధానిగా చేయడాన్ని స్వాగతిస్తున్నాం ►ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలని అరసవల్లి పాదయాత్ర చేస్తారా? ►రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ►విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ►విశాఖను పరిపాలన రాజధానిగా కాపాడుకొనేందుకు ఎటువంటి త్యాగలుకైనా సిద్ధం. ►వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు, అయ్యన్న, బండారుకు తగిన బుద్ధి చెబుదాం. ►ఉత్తరాంధ్ర ప్రజలు మనస్ఫూర్తిగా విశాఖను పరిపాలన రాజధానిగా కోరుకుంటున్నారు. ►లక్షలు కోట్ల పెట్టి ఖర్చు అమరావతి నిర్మించడానికి డబ్బులు ఎక్కడివి? ►హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పది ఏళ్ళ సమయం ఉన్న ఎందుకు చంద్రబాబు అమరావతి వచ్చారు? ►ఈ నెల 15 తేదీన జరిగే విశాఖ గర్జనను విజయవంతం చేస్తాం. ►విశాఖను పరిపాలన రాజధానిగా ఆపే ధైర్యం ఎవరికి లేదు. -
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు
-
జనం చూపు వికేంద్రీకరణ వైపు
సాక్షి, పాడేరు/నిడదవోలు: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అఖిలపక్ష నేతలు, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాడేరులోని ప్రభుత్వ కాఫీ అతిథి గృహం సమావేశ మందిరంలో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో, నిడదవోలులోని రోటరీ ఆడిటోరియంలో విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నేతలు వికేంద్రీకరణకే జై కొట్టారు. పాడేరులో గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, గ్రూప్–1 రిటైర్డ్ అధికారి ఓండ్రు రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా అల్లూరి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు పోరాటానికి ముందుకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. త్వరలో జిల్లాలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి, వికేంద్రీకరణకు మద్దతుగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యం. దేశంలో అనేక ప్రాంతాల ప్రజలు తమ రాష్ట్రాల్లో వికేంద్రీకరణను కోరుకుంటున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తున్నాను. – గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ జార్ఖండ్‌లో నాలుగు రాజధానులు.. ఏపీలో వికేంద్రీకరణకు సీఎం జగన్ కట్టుబడి ఉండడంతో అభినందిస్తూ జార్ఖండ్ సీఎం కూడా ఆ రాష్ట్రంలో వికేంద్రీకరణకు సిద్ధమవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో నాలుగు ప్రధాన పట్టణాలను గుర్తించి నాలుగు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మూడు రాజధానుల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. గిరిజన ప్రాంతాల ప్రజలంతా మూడు రాజధానులను కోరుకుంటున్నారు. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే నిడదవోలులో వికేంద్రీకరణకు మద్దతు తెలియజేస్తున్న నాయకులు, మేధావులు విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. అమరావతిలో కొంత మంది రైతులు చేస్తున్న అమరావతి రాజధాని ఉద్యమం వెనుక అనేక కుట్రలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్‌ను ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వెనుకబడి పోయాయి. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. – చెట్టి పాల్గుణ, అరకులోయ ఎమ్మెల్యే వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడం తగదు రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఓర్వలేక చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ముంపు గ్రామాలను పట్టించుకోని చంద్రబాబు అమరావతిలోని రైతుల కోసం మాత్రమే మాట్లాడడం దారుణం. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును గిరిజనులంతా స్వాగతిస్తున్నారు. – నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే ఒక్క రాజధానితో బాబుకే లాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితమైతే మిగిలిన ప్రాంతాలు నష్టపోతాయి. అమరావతి వల్ల చంద్రబాబు, ఆయన అనుచర గణానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది. 5 వేల ఎకరాలు రాజధాని కోసం సరిపోతుంది. అయితే చంద్రబాబు 35–40 వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. రైతులు నష్టపోకూడదని సీఎం జగన్ అక్కడి రైతులందరికీ కౌలు ఇస్తున్నారు. – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే వికేంద్రీకరణతోనే సుపరిపాలన వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు తన బినామీల సౌలభ్యం కోసం అమరావతి పాదయాత్ర చేయిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే టీడీపీ నాయకులు, వారి వర్గీయులు భూములు కొన్నారు. ఇప్పుడు వారు నష్టపోకూడదనే దొంగ యాత్రలకు శ్రీకారం చుట్టారు. – భూపతి ఆదినారాయణ, మున్సిపల్ చైర్మన్, నిడదవోలు చంద్రబాబు నాటకాలు ప్రజలకు తెలుసు అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. నాడు అమరావతికి భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకత చూపారు. వారిని చంద్రబాబు మోసం చేశారు. ఒకే రాజధాని ఏర్పాటు చేయడం కన్నా మూడు రాజధానులు ఏర్పాటు చూస్తే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయి. – బూరుగుపల్లి సుబ్బారావు, తూర్పు గోదావరి జిల్లా రైతు సలహా మండలి చైర్మన్ టీడీపీ దొంగ నాటకాలు ఆపాలి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం, సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్టంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందడానికి ఇదే సరైన మార్గమని అందురూ మద్దతు తెలుపుతున్నారు. కొందరు టీడీపీ నాయకులు, నకిలీ రైతులు స్వార్థ కోసమే అమరావతి పోరాటం చేస్తున్నారు. ఇకనైనా టీడీపీ నాయకులు దొంగ నాటకాలను ఆపాలి. – ఎస్కే వజీరుద్దీన్, మైనారిటీ నాయకుడు, నిడదవోలు -
అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ
సాక్షి, అల్లూరి జిల్లా: విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో గిరిజన సంఘాల అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీలకతీతంగా అన్ని వర్గాలను ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. 'శ్రీకృష్ణ కమిషన్ కూడా వెనుక బడిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి నినాదం అని మండిపడ్డారు. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో ఎలా యాత్ర చేపడతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాటలకు తలొగ్గి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు వికేంద్రీకరణపై విమర్శలు చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు కూడా అమరావతి రాజధాని ఇష్టం లేదన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు అయితే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నేతల్లో కూడా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు వినడం మాని ఇప్పటికైనా టీడీపీ నాయకులు బయటకు రావాలని కోరారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌ను విడిచి రావడంతో ఏపీకి నష్టం జరిగిందని ఆదివాసీ ఐక్యవేదిక అభిప్రాయపడింది. విభజన సమయంలోనే వికేంద్రీకరణ జరిగి ఉంటే అమరావతిలో పెట్టిన డబ్బు వృథా అయ్యేది కాదని స్పష్టం చేసింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని గిరిజన ఉపాధ్యాయ సంఘం తెలిపింది. గిరిజనుల అభివృద్ధి విశాఖ రాజధానితోనే సాధ్యమని, విశాఖ కేంద్రంగా రాజధాని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఒకే చోట అభివృద్ధి ఎప్పటికైనా ప్రమాదకరని, గిరిజనులు ప్రాజెక్టుల కోస భూములు త్యాగం చేశారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. అమరావతి రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదని పేర్కొంది. -
వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు
-
వికేంద్రీకరణే విశాఖ వాణి
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా, కేంద్రీకరణకు వ్యతిరేకంగా విశాఖ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ నెల 15న భారీ ర్యాలీ నిర్వహించాలని నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. అన్ని వర్గాల వారు పాల్గొనే ఈ ర్యాలీని నగరంలోని డాబా గార్డెన్స్ అంబేడ్కర్ జంక్షన్ నుంచి చేపట్టనున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డాక.. శనివారం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. వికేంద్రీకరణకు మద్దతుగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావులు ఈ సమావేశంలో ప్రకటించారు. జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, పారిశ్రామిక, విద్యావేత్తలు, ఉద్యోగ, కార్మిక, న్యాయవాద సంఘాల నేతలు, జర్నలిస్టు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత లజపతిరాయ్ మాట్లాడుతూ.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. విశాఖ పాలనా రాజధాని అయ్యేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ దేవుడు మాట్లాడుతూ అసమానతలతో కూడిన కేంద్రీకరణ వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారని, అందుకే ఆర్థిక, సామాజిక వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. ఇందుకు హైదరాబాదే ఉదాహరణ అన్నారు. కేంద్రీకరణతో నష్టాలు, వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం అమలు కాకుండా ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయని, వాటిని సమైక్యంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, విశాఖ పాలనా రాజధాని కోసం స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్ఎస్ శివశంకర్ సూచించారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యే ఎస్కే రెహమాన్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధి ఎస్.రవీంద్ర, ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మత్స్యకార నేత శాంతారాం, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు సీహెచ్ వెంకట్రావు, విజయ్‌కుమార్, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి కారుమూరి, వంక రవీంద్రనాథ్, తదితరులు ఉప్పెనలా తరలిరావాలి ఈనెల 15 విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ప్రజలు ఉప్పెనలా తరలి వచ్చి, తమ ఆకాంక్షను తెలియజేయాలి. ఆదివారం నుంచి మండల, వార్డు, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి విశాఖ పాలనా రాజధాని ఆవశ్యకతను అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయాలి. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అవసరమైతే రాజీనామా చేస్తా విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి మద్దతుగా అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సంపద అంతా అమరావతిలోనే కేంద్రీకృతమైతే భవిష్యత్తులో ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రైవేటు భూములు అవసరం లేదు. ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన సమయంలోనే విశాఖను రాజధానిగా చేయాల్సింది. కానీ చంద్రబాబు స్వార్థంతో చేయలేదు. – అవంతి శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నా.. మూడు రాజధానులకు మద్దతుగా నేను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సిద్ధం చేశాను. దానిని జేఏసీ చైర్మన్ లజపతిరాయ్‌కు అందజేస్తున్నా. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తన పదవికి రాజీనామా చేయాలి. అప్పుడు ఎన్నికలకు వెళదాం. ఆ ఎన్నికల్లో గెలిచిన వారి నిర్ణయాన్ని ప్రజల మనోభావాలుగా గుర్తించడానికి టీడీపీ సిద్ధమా? – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే హేలన, సవాళ్లతో యాత్రలా? అమరావతి రైతుల పేరిట చేస్తున్న పాదయాత్రలో ఉత్తరాంధ్ర వాసులను హేలన చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. పాదయాత్ర అంటే ఇలా చేస్తారా? టీడీపీ సహా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్రకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టిస్తున్న వారికి మన నిరసన తెలపాల్సిందే. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ అత్యధికులు వికేంద్రీకరణ వైపే మొగ్గు రాష్ట్రంలో 75 శాతం మంది వికేంద్రీకరణకే మొగ్గు చూపుతున్నారు. కేవలం 5 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. 20 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 80 శాతం మంది అనుకూలంగా, 15 శాతం మంది తటస్థంగా, 5 శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించాలి. విశాఖ రాజధాని అయితే రాష్ట్రమంతటికీ మేలు జరుగుతుంది. – బాలమోహన్‌దాస్, ఏఎన్‌యూ పూర్వ వైస్ ఛాన్సలర్ బాబు నేతృత్వంలోనే పాదయాత్ర చంద్రబాబు నేతృత్వంలోనే అమరావతి రైతుల పేరిట పాదయాత్ర జరుగుతోంది. అమరావతే అభివృద్ధి చెందాలని పనిగట్టుకుని ఎల్లో మీడియా అదేపనిగా వారికి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తోంది. ఏపీకి ఆర్థిక పరిపుష్టి వికేంద్రీకరణతోనే సాధ్యం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల వారంతా చాలా నష్టపోతారనడంలో సందేహం లేదు. – కేకే రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ -
వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు: జేఏసీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలకు సూచించారు. 75 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ప్రపంచంలో 14 దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో 6 రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి. అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి.’ అని పేర్కొన్నారు జేఏసీ కన్వీనర్. ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ కో కన్వీనర్ దేవుడు మాడ్లాడుతూ.. ఇంకా ఉపేక్షిస్తే మన మనుగడకే ఇబ్బంది వస్తుందని ప్రజలకు సూచించారు. అమరావతికి ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మరోవైపు.. విశాఖ పరిపాలన రాజధాని కావాలన్నారు మేధావుల ఫోరం అధ్యక్షులు. కర్నూలు రాజధాని కాకముందే విశాఖ రాజధాని ప్రతిపాదన ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకు సిద్ధం.. వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అవంతి, కరుణం ధర్మశ్రీ. విశాఖ రాజధాని కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధంమని వెల్లడించారు అవంతి. స్పీకర్ ఫార్మాట్లో జేఏసీ కన్వీనర్‌కు కరుణం ధర్మశ్రీ రాజీనామా లేఖ. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంమని సవాల్ చేశారు. మరోవైపు.. విశాఖ రాజధానిపై రెఫరెండానికి తాము సిద్ధమని తెలిపారు మంత్రి అమర్నాథ్. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేంగా చేస్తున్నయాత్రపై నిరసన తెలియజేస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు -
మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అమరావతి పేరుతో చంద్రబాబు బినామీల రాజధాని కట్టాలని చూశారని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరారవు మండిపడ్డారు. శనివారం వికేంద్రీకరణకు మద్దతుగా తణుకు నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి మనల్ని తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు. తన స్వార్థం కోసం అసైన్డ్ భూముల చట్టాన్ని కూడా మార్చారని మండిపడ్డారు. 'నూజవీడులో రాజధాని వస్తుందని నమ్మి భూములు కొన్న చాలా మంది రైతులు చనిపోయారు. అమరావతి చుట్టూ తన అనుయాయులతో భూములు కొనిపించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందులో అమరావతి ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. 29 గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కాదు. భూములు ఇవ్వమన్న రైతులకు సీపీఎం, సీపీఐ, జనసేన నాడు మద్దతుగా నిలిచి ఇప్పుడు మాట మార్చాయి. 29 గ్రామాల ప్రజలు కోసం మూడు ప్రాంతాల ప్రజలు మోసపోవాలా?. మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది' అని మంత్రి కారుమూరి నాగేశ్వరారవు వ్యాఖ్యానించారు. చదవండి: (స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ) -
వికేంద్రీకరణ కోసం రాజీనామాకు నేను సిద్ధం: కరణం ధర్మశ్రీ
-
స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈక్రమంలోనే విశాఖపట్నంలో వికేంద్రీకరణకు మద్దతుగా జరుగుతున్న జేఏసీ మీటింగ్‌లో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే వికేంద్రీకరణ వ్యతిరేకంగా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అమరావతికి మద్దతుగా అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని కరణం ధర్మశ్రీ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే, ఈనెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వికేంద్రీకరణ జేఏసీ ప్రకటించింది. టూ టౌన్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపింది. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది. చదవండి: (Visakhapatnam: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: అవంతి శ్రీనివాస్) -
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి: అవంతి శ్రీనివాస్
-
అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదు: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ సమావేశమైంది. ప్రొఫెసర్ లజపతిరాయ్ అధ్యక్షతన విశాఖపట్నంలో శనివారం ఉత్తరాంధ్ర మేధావులు భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.., ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖకు రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జేఏసీ ఆవిర్భవించింది. రాజకీయేతర జేఏసీలో ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాల భాగస్వామ్యం ఉంటుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి సహా కర్నూలు, విశాఖ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అవసరమైతే విశాఖ రాజధాని కోసం నా పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చదవండి: (వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు) విశాఖకు మద్దతుగా భారీ ర్యాలీ అక్టోబర్ 15 న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో మండల, నియోజక వర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. -
విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ ఏర్పాటు
-
Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటెల్ ఏర్పాటు, వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. అంబేద్కర్ యూనివర్శిటీ మాజీ ఉప కులపతి హనుమంతు లజపతిరాయ్ జేఏసీ కన్వినర్‌గా నియమితులయ్యారు. జేఏసీలో సభ్యులుగా ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అక్టోబర్ 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.