సాక్షి, రాజమండ్రి: ఏపీలో వికేంద్రీకరణకు మద్దతు పెరిగిపోతోంది. ప్రజాకాంక్షను ప్రతిపక్షాల చెవులు మారుమోగిపోయేలా వినిపించేందుకు.. పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్ సీపీ. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) నగరంలోని ఆజాద్‌చౌక్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ భారీ బహిరంగ సభకు మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, ఎంపీ సుభాష్ చంద్రబోస్ , పార్టీజిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.
ఇదిలా ఉంటే.. అమరావతి మహాపాదయాత్రను తీవ్రంగా నిరసిస్తున్నారు రాజమండ్రి వాసులు. ఇప్పటికే అడుగగడునా నిరసనలు ఎదురవుతుండగా.. రాజమండ్రిలోనూ అదే సీన్ కనిపించింది. పైగా వికేంద్రీకరణకు మద్దతుగా పలుకూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. జగనన్నది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఈనాడు అంటేనే అబద్ధాల తడిక
Comments
Please login to add a commentAdd a comment