![Margani Bharat Fires On Rajahmundry Tdp Leaders](/styles/webp/s3/article_images/2024/06/8/Margani-Bharat-Fires.jpg.webp?itok=qotJyr_3)
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని ఆ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలాకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారని ధ్వజమెత్తారు.
రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. రాజమండ్రిలో మోరంపూడి శిలా ఫలాకాన్ని టీడీపీ నేతలు కూల్చేసినా ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం. శిలాఫలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పటం ఎంతవరకు కరెక్ట్. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు.. రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూకలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు. దానిని మాత్రమే ప్రతిఘటించాం’’ అని మార్గాని పేర్కొన్నారు.
![](/sites/default/files/inline-images/29.png)
‘‘అమరావతిలో కూల్చేసిన ప్రజావేదిక ఎన్జీటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. ఉండ్రాజవరం, జొన్నాడ కైకలూరు, తేతలి నాలుగు ఫ్లై ఓవర్లు మంజూరు చేసిన జీవో కాపీలు కూడా చూపించాం. నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు 2020లోనే మంజూరు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా బాధ్యత ఉంది. తమకు ఇంకా మంచి చేస్తారని ప్రజలు భావించి వారికి విజయాన్ని కట్టబెట్టారు. ఇచ్చిన హామీలు ఎంతమేర నిలబెట్టుకుంటారో చూద్దాం’’ అని మార్గాని భరత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment