సాక్షి, శ్రీకాకుళం: మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై.. మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేదికాదని, నష్టం ఉండేది కాదన్నారు మంత్రి ధర్మాన.
‘భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అయినా లక్షల కోట్లతో అమరావతి ప్రతిపాదన చేశారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్. చంద్రబాబు సన్నిహితులు భూమి కొనుగోలు చేశాకే రాజధాని ప్రకటించారు. సింగపూర్ పార్లమెంట్‌లో ఈశ్వరన్ వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు నాటకం తెలిసింది. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయి. చంద్రబాబు నారాయణ కమిటీ వేసి 3,940 సీక్రెట్ జీవోలు ఇచ్చారు.’ అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నిపుణులు హాజరై.. విశాఖను పాలన రాజధానిగా చేయాలని కోరారు.
ఇదీ చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర
Comments
Please login to add a commentAdd a comment