jac meeting
-
చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై.. మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేదికాదని, నష్టం ఉండేది కాదన్నారు మంత్రి ధర్మాన. ‘భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అయినా లక్షల కోట్లతో అమరావతి ప్రతిపాదన చేశారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్. చంద్రబాబు సన్నిహితులు భూమి కొనుగోలు చేశాకే రాజధాని ప్రకటించారు. సింగపూర్ పార్లమెంట్లో ఈశ్వరన్ వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు నాటకం తెలిసింది. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయి. చంద్రబాబు నారాయణ కమిటీ వేసి 3,940 సీక్రెట్ జీవోలు ఇచ్చారు.’ అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నిపుణులు హాజరై.. విశాఖను పాలన రాజధానిగా చేయాలని కోరారు. ఇదీ చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర -
విశాఖకు రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి: అవంతి
-
రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం: మంత్రి అమర్నాథ్
-
విశాఖ గర్జన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జేఏసీ మీడియా సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రేపు(శనివారం) విశాఖ గర్జనలో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలుపుతామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఒక వర్గం మీడియా దెబ్బతీస్తోందన్నారు. మా పోరాటంలో భాగస్వామ్యం కాకపోయినా హాని చేయొద్దన్నారు. మేం అమరావతి, రాయలసీమ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ తమ పోరాటానికి సంఘీభావం తెలపాలని మంత్రి కోరారు. విశాఖను రాజధానిగా సాధించుకుని తీరతామన్నారు. చదవండి: టీడీపీ బినామీలు గో బ్యాక్.. వికేంద్రీకరణ ముద్దు అంటూ నినాదాలు విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల హక్కు: అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల హక్కు అన్నారు. విశాఖకు రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. విశాఖలో రూ.5వేల కోట్లు పెడితే బ్రహ్మాండమైన రాజధాని అవుతుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు: జేఏసీ కన్వీనర్ ఉత్తరాంధ్ర దశాబ్ధాలుగా వెనుకబడి ఉందని జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలిపేలా విశాఖ గర్జన జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. జేఏసీ ఉద్యమం అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని జేఏసీ కో కన్వీనర్ దేవుడు అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకుని తీరతామన్నారు. -
‘బొటనవేలు దెబ్బకు ప్రతికారం తీర్చుకుంటాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపే క్రమంలో తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అరెస్టు సందర్భంగా దాడిని ఖండిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. అఖిల పక్ష నాయకులుంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దుర్మార్గానికి నిన్నటి ప్రెస్‌మీట్ పరాకాష్ట అని దుయ్యబట్టారు. ప్రశ్నలు అడిగే వారిపై ముఖ్యమంత్రి దబాయించారు కానీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. నిన్నటి సమావేశంలో అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలే మాట్లాడారని, వీధి నాయకుడి తరహాలో కేసీఆర్ మాట్లాడారని ఆరోపించారు. ఆర్టీసీకి చట్ట ప్రకారం ఇచ్చే దాని కంటే చాలా తక్కువ ఇచ్చారని, సంస్థ నష్టాలకు కారణం కార్మికులే కారణం అనడం దురదృష్టకరమన్నారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని, ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం వదిలి కేసీఆర్ ప్రైవేటు సంస్థ యజమానిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలతో అందరినీ ఏకం చేసేలా మాట్లాడారని, అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బోటన వేలు గురుదక్షిణ తీసుకున్నట్టు..కుట్రపూరితంగా దొర కేసీఆర్... దక్షిణగా రంగారావు వేలు తీసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ) కేసీఆర్‌తో కలిసి పోరాటం చేసిన పార్టీ అని, ఉద్యమ సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావేనని గుర్తు చేశారు. బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటామని, సమ్మెను ముందుకు తీసుకెళ్తామన్న కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. అలాగే ‘ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా, కోర్టు మాటలు పట్టించుకునే అవసరం లేనట్టు మాట్లాడారు. యూనియన్లను సహించం..దరఖాస్తులు చేసుకుంటే ఉద్యోగులను చేర్చుకోవడంపై ఆలోచిస్తా అని అంటున్నారు. మోటారు వాహన చట్టం అమలు చేస్తామనడం విజ్ఞత గల ముఖ్యమంత్రికి తగదు. హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయంతోనే ఇలా గర్వంతో మాట్లాడుతున్నారు. ఆర్టీసీనే కాదు టీఎన్జీవో, టీజీవోలు భ్రమలో ఉన్నారు. యూనియన్లు నన్నేమీ చేయడం లేదన్నట్టుగా మాట్లాడారు’ అని కేసీఆర్ మాట్లాడిన తీరుపై తమ్మినేని మండిపడ్డారు. పోలీసులు చర్యను చరిత్ర క్షమించదు పోటు రంగారావు వేలు పోయేలా చేసిన కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమై ఆర్టీసీ పోరాటంలోకి దిగామని, కార్మికుల పట్ల పోలీసుల చర్యలను చరిత్ర క్షమించబోదని పేర్కొన్నారు. ఉద్యమకారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, రేపటి నుంచి నిరవదిక దిక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరు తెలంగాణ వచ్చాక హిట్లర్, నిజాం వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని సీపీఐ ఎంఎల్ సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. హుజూర్నగర్ గెలుపు ధీమాతో మాట్లాడిన మాటలు రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టిపారేశారు. కార్మికుల ఉధ్యమాన్ని చెడగొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసారని, ధన.. అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను బానిసలుగా మర్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రశ్నించే సమాజాన్ని కేసీఆర్ భరించలేక పోతున్నారని, ఆదే ఆయన పరిపాలించేందుకు అర్హుడు కాదన్నది తేలిందన్నారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరని ఎద్దేవా చేశారు. పశువులను తీసుకెళ్లే వ్యాన్‌లో ఉధ్యమకారులను తరలిస్తున్నారని మండిపడ్డారు. నరహంతక విధానాలను ఎదిరించి పోరాటం కొనసాగిస్తామని, యూనియన్ లకు వ్యతిరేకంగా మాడుతున్న కేసీఆర్ తీరును ప్రతిగటించాలని ఆయన పిలుపునిచ్చారు. -
4 లక్షల మందితో సకల జనుల సమర భేరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిన నేపథ్యంలో సమ్మె మలిదశ కార్యాచరణ పటిష్టంగా ఉండేలా చూడాలని ఆర్టీసీ కార్మికులు సంఘాల జేఏసీ తీర్మానించింది. సమ్మెపై హైకోర్టులో జరిగే తదుపరి విచారణ వరకు ఉధృతంగా నిరసనలు కొనసాగించాలని ఆదివారం జరిగిన రాజకీయ అఖిలపక్ష నేతలతో సమావేశంలో నిర్ణయించింది. దీనికి సంపూర్ణ మద్దతు అందిస్తామని రాజకీయ పార్టీలు కూడా తేలి్చచెప్పాయి. సమ్మె కార్యాచరణలో భాగంగా ఈ నెల 30న కనీసం 4 లక్షల మందితో సకల జనుల సమర భేరీ పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 3 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, మరో లక్ష మంది సాధారణ ప్రజలు హాజరయ్యేలా రాజకీయ పారీ్టలతో కలసి జనసమీకరణ జరపాలని నిశ్చయించారు. ఈలోగా ఇతర నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నారు. అఖిలపక్ష భేటీలో ఎవరేమన్నారంటే... కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవించకపోవడం దారుణం. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు. దానికి మద్దతు ఇస్తున్నట్టుగా పోలీసులు దమనకాండను కొనసాగిస్తున్నారు. ప్రజలు మా ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఆరీ్టసీని విధ్వంసం చేసే కుట్రను అడ్డుకొని ప్రజారవాణా సంస్థను కాపాడుకునేందుకు సహకరించాలి.– ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ కార్మికుల వెంట నడుస్తాం ఆర్టీసీ కార్మికులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాల్లో మా నేతలు పాల్గొంటారు. ప్రజాప్రతినిధుల ములాఖత్‌లో మేమూ పాల్గొంటాం. వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), ఎస్.వెంకటేశ్వరరావు (న్యూడెమొక్రసీ) ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ఆర్టీసీ పరిరక్షణకు నడుంబిగించాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం విడ్డూరం. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పౌరసమాజం మద్దతు ఉంది. – ఎల్.రమణ, టీడీపీ కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆదేశాన్ని గౌరవించి కారి్మకులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఆర్టీసీ జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – కోదండరాం, టీజేఎస్ పుస్తకాలు చదివి నేర్చుకున్నదిదేనా? వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే ముఖ్యమంత్రి నేర్చుకున్నది ఇదేనా? ప్రజలు శక్తిమంతులు, వారి ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టమంటూ హైకోర్టు వ్యాఖ్యానించినా కేసీఆర్ పెడచెవిన పెట్టడం వల్ల ఆయనకే నష్టం. – డాక్టర్ చెరుకు సుధాకర్, ఇంటి పార్టీ న్యాయవ్యవస్థపై గౌరవం లేకుంటే ఎలా? న్యాయవ్యవస్థపైనా ప్రభుత్వానికి గౌరవం లేకుంటే ఎలా? ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా చర్చలకు ఎందుకు పిలవట్లేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని అక్కడి ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మిగుల బడ్జెట్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తోంది. – మంద కృష్ణమాదిగ . మలిదశ సమ్మె కార్యాచరణ ఇలా.. నేడు అన్ని డిపోల వద్ద కారి్మకుల కుటుంబ సభ్యులు బైఠాయించి దీక్షలు. 22న అద్దె బస్సుల డ్రైవర్లు, యజమానులు, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు (ఇక నుంచి విధులకు హాజరు కావద్దని, తమ పొట్ట కొట్టొద్దని) విన్నపాలు. 23న మండలస్థాయి ప్రజాప్రతినిధులు మొదలు ఎంపీల వరకు కలసి ఆర్టీసీ పరిస్థితిపై వివరణ. 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు సహా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ మహిళా ఉద్యోగుల నిరాహార దీక్షలు. 25న ప్రజాసంఘాలు, సాధారణ ప్రజలతో కలసి రాస్తారోకోలు. 26న ఆర్టీసీ కారి్మకుల పిల్లల ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు. 27న దీపావళి వేడుకలకు దూరం. కొన్ని పారీ్టల నేతలు మాత్రం కార్మికుల కుటుంబాలను తమ ఇళ్లకు ఆహా్వనించి వారితో కలిసి దీపావళి జరుపుకోనున్నట్టు ప్రకటించారు. 28న (సోమవారం) సమ్మెపై హైకోర్టులో ఒకవైపు వాదనలు కొనసాగిస్తూనే మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగింపు. 30న సకల జనుల సమర భేరీ బహిరంగ సభ నిర్వహణ. -
'ప్రజల బతుకులు మారాలి'
తూప్రాన్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాల్సి ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగే కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో తూప్రాన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అంటే నాయకులు బాగుపడటం కాదు.. ప్రజల బతుకులు మారాలి అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం ఈనెల 3వ తేదీన హైదరాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటాయని చెప్పారు. -
‘డాక్టర్’ మారితే మేలు
► సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కోదండరాం వ్యాఖ్య ► పాలకుల ఇష్ట ప్రకారం కాదు.. ప్రజలకు తగ్గ పాలన ఉండాలి ► భూ నిర్వాసితుల హక్కుల పరిరక్షణకు 29న ధర్నా ► తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం ► రాజకీయ నేతలను లోకాయుక్త పరిధిలోకి తేవాలి ► ఫిరాయింపుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘పాలకుల ఇష్ట ప్రకారం కాదు, ప్రజల అవసరాలకు తగినట్టుగా పరిపాలన ఉండాలి. ఒక డాక్టరు మందు ఇవ్వకుంటే ఇంకొక డాక్టర్ దగ్గరకు పోకుండా ఉంటమా? ఇప్పుడున్న డాక్టరు వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నా. డాక్టరు వైఖరి మారకుంటే ఏమైతదో మీరే చూస్తరు’అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది. కోదండరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకున్నారు. ప్రజా సమస్యలు, వివిధ అంశాలపై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడంలేదని, ప్రజలు పార్టీలకతీతంగా పునరంకిత ఉద్యమానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటున్నామని, సామాజిక తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ఎంత పెద్ద ఉద్యమాలకైనా సిద్ధమని ప్రకటించారు. ఉద్యోగులు, రైతులు, మహిళా సమస్యలపై కచ్చితంగా నిలబడతామని స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు వ్యతిరేకంగా, 2013 చట్టానికి తూట్లు పొడిచే చర్యలకు వ్యతిరేకంగా నిర్వాసితుల హక్కుల కోసం పోరాడుతామన్నారు. నిర్వాసితుల హక్కులను కాపాడుకోవడానికి ఈ నెల 29న ధర్నా చేపడతామని ప్రకటించారు. ‘నాయకుల’ను లోకాయుక్త పరిధిలోకి తేవాలి రాజకీయ నాయకులను లోకాయుక్త పరిధిలోకి తీసుకురావాలని కోదండరాం డిమాండ్ చేశారు. జనవరిలో విద్యా రంగ సమస్యలపై అధ్యయనంతోపాటు వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఫిబ్రవరిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్చిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై అధ్యయనం చేసి, నివేదికను ప్రజల ముందుపెడతామన్నారు. ఏప్రిల్‌లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై అధ్యయనం, కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వ వర్సిటీలు, చిన్న పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, హెల్త్‌కార్డులను ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని, ధాన్యం కొనుగోలుకు కృషి చేయాలని, వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు చట్టబద్ధంగా దక్కిన భూమిని గుంజుకుంటున్నారని, వారి భూములను తిరిగివ్వాలని కోరారు. మహిళలకు సాధికారత, భద్రత కల్పించాలని, ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై స్పీకర్‌దే బాధ్యత సమైక్య రాష్ట్రంలో విలువల్లేని రాజకీయాలున్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనైనా విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయని ఆశించామని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాల్లేవని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాల్సిందేనని, ఆ బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్‌ను చట్టబద్ధం చేసి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. లోకాయుక్త వ్యవస్థను పెంపొందించాలని, రాజకీయ నాయకులను దీని పరిధిలోకి తేవాలని కోరారు. జోనల్ వ్యవస్థ రద్దుతో తీవ్ర పరిణామాలు జోనల్ వ్యవస్థతో తీవ్ర నష్టం, నిరుద్యోగులపై తీవ్రమైన పరిణామాలుంటాయని కోదండరాం ఆందోళన వెలిబుచ్చారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదముందన్నారు. దీనిపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని, నివేదిక వచ్చిన తర్వాతనే జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఆర్థిక విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. జేఏసీ నేత ముఖ్యమంత్రి అయినా.. వేదిక మీద ఉన్న జేఏసీ నేతల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అయినా.. ప్రజల సమస్యల కోసం పని చేయడానికి జేఏసీ కొనసాగుతుందని కోదండరాం స్పష్టం చేశారు. పాలకులను వ్యతిరేకించడమే జేఏసీ లక్ష్యం కాదని, ప్రజల సమస్యల కోసం పాలకులను ప్రశ్నించడానికి పునరంకితమైన సంస్థ అని తెలిపారు. జేఏసీ రాజకీయ వేదిక కాదని, జేఏసీగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమస్యలపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదించి, ప్రజల్లో ప్రచారం చేసిన తర్వాత సమస్య పరిష్కారం కాకుంటే అవసరమైతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. నిజాం షుగర్స్‌పై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అసంబద్ధంగా ఉందన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, క్రమంగా రైతులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులకు పంచశీల సూత్రాలు నిర్దేశించారు. జేఏసీ పూర్తిస్థాయి కమిటీ ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్‌గా తెలంగాణ జేఏసీకి పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు. కన్వీనర్‌గా పిట్టల రవీందర్, కో చైర్మన్లుగా నల్లపు ప్రహ్లాద్, ఖాజా మొహీనుద్దీన్, ఇటిక్యాల పురుషోత్తం, కో కన్వీనర్లుగా బిక్షపతి, డి.పి.రెడ్డి, వి.సంధ్య, జి.శంకర్, భైరి రమేశ్, తన్వీర్ సుల్తానా, అధికార ప్రతినిధులుగా జి.వెంకట్ రెడ్డి, గురజాల రవీందర్రావు, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్, ముత్తయ్య, దేశపాక శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, రామగిరి ప్రకాశ్ ఎన్నికయ్యారు. అలాగే ఎడిటోరియల్ కమిటీ, నిర్మాణ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, పబ్లిసిటీ కమిటీలను కూడా ప్రకటించారు. -
'ఒత్తిడులు, విమర్శలతో వెనక్కి తగ్గం'
నల్లగొండ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకునే క్రమంలో జేఏసీగా భవిష్యత్‌లో మరింత క్రియాశీలకమవుతామని, ఈ క్రమంలో ఎన్ని ఒత్తిడులు, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలను నిర్మించడమే లక్ష్యంగా ముందుకెళతామని ఆయన స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో గురువారం జరిగిన జేఏసీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ఎవరెన్ని మాటలు అన్నా వెనక్కు తగ్గేది లేదని.. సద్విమర్శలను స్వీకరిస్తామని, నిబద్ధతతో నిలబడి నిజాయితీగా పనిచేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలతోనే అంతా అయిపోదని, అది కేవలం ఒక అంశం మాత్రమేనని, పౌరపాత్రను ఎన్నికల వరకే కుదించడానికి వీల్లేదని అంబేద్కర్ పదే పదే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రజల తరఫున పనిచేసే సంస్థగా భవిష్యత్‌లో మరింత బాధ్యతాయుతంగా, క్రియాశీలకంగా పనిచేస్తామని కోదండరాం పునరుద్ఘాటించారు. -
'కొత్త జిల్లాల ఉద్యమానికి మద్దతు'
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలపై జరుగుతున్న ఉద్యమానికి జేఏసీ మద్దతిస్తుందని జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామన్నారు. జోనల్ వ్యవస్థపై లోతైన చర్చ జరగాలని కోదండరామ్ సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలు-డివిజన్లపై జేఏసీ అభిప్రాయాలను ప్రభుత్వానికి వెల్లడిస్తామన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. -
పీఆర్సీ జీవోలకోసం ఎదురుచూపు
ఫిట్మెంట్ అమలుకే మూడు నెలలు ♦ మిగతా జీవోలు వచ్చేదెప్పుడు? అమలయ్యేదెప్పుడు? ♦ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ♦ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం ♦ పెన్షనర్ల అదనపు పెన్షన్‌కోసం గొంతెత్తాలని నిశ్చయం.. ♦ కార్యాచరణపై త్వరలో జేఏసీ సమావేశం సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు ఉద్యోగులను ఉస్సూరుమనిపిస్తోంది. 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటన చేశాక.. అమలుకు ఆరునెలల సమయం పట్టింది. సీఎం ప్రకటన తర్వాత జీవో రావడానికే మూడు నెలలు, జీవో వచ్చాక అమలు చేయడానికి మరో మూడు నెలల సమయం తీసుకున్నారు. ఫిట్మెంట్ ప్రకటన చేసినరోజే.. పీఆర్సీ సిఫారసులను సూత్రప్రాయంగా ఆమోదిస్తున్నామని సీఎం ఘనంగా ప్రకటించారు. అయితే ఆరునెలల తర్వాత కూడా పీఆర్సీ సిఫారసుల అమలుకు ప్రాథమిక కసరత్తును పూర్తి చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీంతో వీటికి సంబంధించిన జీవోలు వచ్చేదెప్పుడు? అమలయ్యేదెప్పుడు? అని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫారసుల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించడానికి జేఏసీ కార్యవర్గం త్వరలో సమావేశం కానుంది. కాగా 75 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ ప్రస్తుతం అమల్లో ఉంది. దీన్ని 70 ఏళ్ల వయసునుంచే అమలు చేయాలని పీఆర్సీ స్పష్టంగా చెప్పింది. అయితే పెన్షనర్లకు ఫిట్మెంట్ అమలు చేస్తూ ఇచ్చిన జీవోలో పీఆర్సీ సూచించినట్లుగా అదనపు పెన్షన్ అంశాన్ని పేర్కొనలేదు.దీంతో 70 ఏళ్లు నిండినవారికి అదనపు పెన్షన్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఉద్యోగసంఘాలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చాయి. దీనిపైనా జేఏసీ సమావేశంలో చర్చించనున్నారు. పీఆర్సీ చేసిన సిఫారసులు.. ♦ 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ ♦ పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ రూ.200 నుంచి రూ.350కు పెంపు ♦ మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పిల్లల సంరక్షణ సెలవు ♦ అర్ధవేతన సెలవుల్ని పదవీ విరమణ సమయంలో నగదుగా మార్చుకునే అవకాశాన్ని స్థానికసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బందికీ పునరుద్ధరణ ♦ పే స్కేళ్లు పెరిగిన నేపథ్యంలో.. వివిధరకాల అలవెన్సుల పెంపు. స్పెషల్ పే పెంపు ♦ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంపు. ♦ అంత్యక్రియల ఖర్చు రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంపు ♦ నగరాలు/పట్టణాల పరిధిని 8 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు పెంచాలన్న ఉద్యోగ సంఘాల వినతిని పీఆర్సీ పట్టించుకోలేదు. ప్రభుత్వమైనా ఈ మేరకు జీవో ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ♦ 25 ఏళ్ల సర్వీసు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హత కల్పిస్తూ ఎనిమిదేళ్ల సర్వీసు వెయిటేజీ. ♦ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగినిలకూ ప్రభుత్వ ఉద్యోగినిల మాదిరే వేతనంతో కూడిన ప్రసూతి సెలవు . ♦ ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) మొత్తాన్ని రూ.12,500 నుంచి రూ.18,750కు పెంపు. ♦ పిల్లల చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజు రూ.1000 నుంచి రూ.2,500కు పెంపు . డీఏ మంజూరుకు ఎంతకాలం? ఉద్యోగులకు సంబంధించి జనవరి, జూలైలో.. ఏటా రెండుసార్లు కొత్త డీఏ ప్రకటిస్తారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ప్రకటించే డీఏను బట్టి రాష్ట్రంలో డీఏను నిర్ణయిస్తారు. పదో పీఆర్సీ సిఫారసు ప్రకారం కేంద్రంలో 1 శాతం డీఏ పెరిగితే రాష్ట్రంలో 0.524 శాతం పెంచాలని సూత్రీకరించడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్రం 6 శాతం డీఏ ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంచాల్సి ఉంటుంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతోసహా దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు కొత్త డీఏను మంజూరు చేశాయి. జూలై నుంచి మరోసారి డీఏ పెంపు అమలు కావాల్సి ఉన్నా.. జనవరి నుంచి రావాల్సిన డీఏ గురించి కూడా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో రొటీన్‌గా పెంచాల్సిన డీఏకోసం ఎంతకాలం ఎదురుచూడాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.