
'కొత్త జిల్లాల ఉద్యమానికి మద్దతు'
కొత్త జిల్లాలపై జరుగుతున్న ఉద్యమానికి జేఏసీ మద్దతిస్తుందని కోదండరామ్ చెప్పారు.
జోనల్ వ్యవస్థపై లోతైన చర్చ జరగాలని కోదండరామ్ సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలు-డివిజన్లపై జేఏసీ అభిప్రాయాలను ప్రభుత్వానికి వెల్లడిస్తామన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.