4 లక్షల మందితో సకల జనుల సమర భేరి | RTC JAC Plans To Open Meeting With 4 Lakh People On 30th | Sakshi
Sakshi News home page

4 లక్షల మందితో సకల జనుల సమర భేరి

Published Mon, Oct 21 2019 2:24 AM | Last Updated on Mon, Oct 21 2019 9:51 AM

RTC JAC Plans To Open Meeting With 4 Lakh People On 30th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిన నేపథ్యంలో సమ్మె మలిదశ కార్యాచరణ పటిష్టంగా ఉండేలా చూడాలని ఆర్టీసీ కార్మికులు సంఘాల జేఏసీ తీర్మానించింది. సమ్మెపై హైకోర్టులో జరిగే తదుపరి విచారణ వరకు ఉధృతంగా నిరసనలు కొనసాగించాలని ఆదివారం జరిగిన రాజకీయ అఖిలపక్ష నేతలతో సమావేశంలో నిర్ణయించింది. దీనికి సంపూర్ణ మద్దతు అందిస్తామని రాజకీయ పార్టీలు కూడా తేలి్చచెప్పాయి. సమ్మె కార్యాచరణలో భాగంగా ఈ నెల 30న కనీసం 4 లక్షల మందితో సకల జనుల సమర భేరీ పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 3 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, మరో లక్ష మంది సాధారణ ప్రజలు హాజరయ్యేలా రాజకీయ పారీ్టలతో కలసి జనసమీకరణ జరపాలని నిశ్చయించారు. ఈలోగా ఇతర నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నారు. 

అఖిలపక్ష భేటీలో ఎవరేమన్నారంటే..
కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవించకపోవడం దారుణం. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు. దానికి మద్దతు ఇస్తున్నట్టుగా పోలీసులు దమనకాండను కొనసాగిస్తున్నారు. ప్రజలు మా ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఆరీ్టసీని విధ్వంసం చేసే కుట్రను అడ్డుకొని ప్రజారవాణా సంస్థను కాపాడుకునేందుకు సహకరించాలి.– ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ

కార్మికుల వెంట నడుస్తాం 
ఆర్టీసీ కార్మికులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాల్లో మా నేతలు పాల్గొంటారు. ప్రజాప్రతినిధుల ములాఖత్‌లో మేమూ పాల్గొంటాం. వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.  – తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), ఎస్‌.వెంకటేశ్వరరావు (న్యూడెమొక్రసీ)

ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి 
ఆర్టీసీ పరిరక్షణకు నడుంబిగించాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం విడ్డూరం. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పౌరసమాజం మద్దతు ఉంది. – ఎల్‌.రమణ, టీడీపీ

కోర్టు తీర్పును గౌరవించాలి. 
కోర్టు ఆదేశాన్ని గౌరవించి కారి్మకులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఆర్టీసీ జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.  – కోదండరాం, టీజేఎస్‌

పుస్తకాలు చదివి నేర్చుకున్నదిదేనా? 
వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే ముఖ్యమంత్రి నేర్చుకున్నది ఇదేనా? ప్రజలు శక్తిమంతులు, వారి ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టమంటూ హైకోర్టు వ్యాఖ్యానించినా కేసీఆర్‌ పెడచెవిన పెట్టడం వల్ల ఆయనకే నష్టం.  – డాక్టర్‌ చెరుకు సుధాకర్, ఇంటి పార్టీ

న్యాయవ్యవస్థపై గౌరవం లేకుంటే ఎలా? 
న్యాయవ్యవస్థపైనా ప్రభుత్వానికి గౌరవం లేకుంటే ఎలా? ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా చర్చలకు ఎందుకు పిలవట్లేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని అక్కడి ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మిగుల బడ్జెట్‌ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తోంది.  – మంద కృష్ణమాదిగ  .

మలిదశ సమ్మె కార్యాచరణ ఇలా..

  •  నేడు అన్ని డిపోల వద్ద కారి్మకుల కుటుంబ సభ్యులు బైఠాయించి దీక్షలు. 
  • 22న అద్దె బస్సుల డ్రైవర్లు, యజమానులు, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు (ఇక నుంచి విధులకు హాజరు కావద్దని, తమ పొట్ట కొట్టొద్దని) విన్నపాలు. 
  • 23న మండలస్థాయి ప్రజాప్రతినిధులు మొదలు ఎంపీల వరకు కలసి ఆర్టీసీ పరిస్థితిపై వివరణ. 
  • 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు సహా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ మహిళా ఉద్యోగుల నిరాహార దీక్షలు.
  •  25న ప్రజాసంఘాలు, సాధారణ ప్రజలతో కలసి రాస్తారోకోలు. 
  •  26న ఆర్టీసీ కారి్మకుల పిల్లల ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు. 
  • 27న దీపావళి వేడుకలకు దూరం. కొన్ని పారీ్టల నేతలు మాత్రం కార్మికుల కుటుంబాలను తమ ఇళ్లకు ఆహా్వనించి వారితో కలిసి దీపావళి జరుపుకోనున్నట్టు ప్రకటించారు.  
  • 28న (సోమవారం) సమ్మెపై హైకోర్టులో ఒకవైపు వాదనలు కొనసాగిస్తూనే మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగింపు. 
  • 30న సకల జనుల సమర భేరీ బహిరంగ సభ నిర్వహణ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement