ashwathama reddy
-
ఆర్టీసీలో మళ్లీ కార్మిక సంఘాల ఉద్యమబాట
సాక్షి, హైదరాబాద్: ‘దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ కార్మికులను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. కార్మిక సంఘాల అస్థిత్వం ఆర్టీసీలో లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోంది. సంఘాలు లేవని కార్మికులపై పనిభారం పెంచి వేధిస్తున్నారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబీకులకు కారుణ్య నియామక వెసులుబాటు వర్తించకుండా చేస్తున్నారు. ఇక ఈ నిర్లక్ష్యాన్ని సహించం. రోడ్డెక్కి ఉద్యమిస్తాం’ అని ఆర్టీసీ సంఘాలు హెచ్చరించాయి. దాదాపు రెండున్నరేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు మళ్లీ రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) పేరుతో ఉద్యమానికి సిద్ధమయ్యాయి. గతంలో గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉండి సీఎం ఆగ్రహానికి గురై ఆర్టీసీకి దూరమైన అశ్వత్థామరెడ్డి మళ్లీ టీఎంయూ గూటికి చేరారు. ఆదివారం టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన్ను సంఘం గౌరవాధ్యక్షుడిగా తిరిగి ఎంపిక చేశారు. ఆయన ఆధ్వర్యంలో సంఘం ఉద్యమబాట పట్టనుందని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. బాండ్ల తాలూకు చెల్లింపులేమాయె? గతంలో జరిగిన వేతన సవరణ బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించేందుకు జరిగిన ఒప్పందం అమలు కాలేదు. 2020 అక్టోబర్‌తో గడువు ముగిసి నా బాండ్ల తాలూకు చెల్లింపులు జరగకపోవటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కొక్కరికి రూ. లక్షన్నరకు తగ్గకుండా లబ్ధి చేకూరాల్సి ఉన్నా అందకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2019 నుంచి అందాల్సిన 6 డీఏలనుకూడా వర్తింప చేయ కపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. 1,200 కుటుంబాలకు కారుణ్య నియామకాల రూ పంలో ఉద్యోగావకాశాలు రావాల్సి ఉన్నా అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలను మనుగడలో లే కుండా చేసినందుకే ఉద్యోగులకు అన్యా యం జరుగుతోందని ఆరోపిస్తూ ఇప్పుడు అన్ని సంఘాలు సంయుక్తంగా ఉద్యమబా ట పడుతున్నాయి. అన్ని ప్రధాన సంఘాల తో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీక్ష జర గాల్సి ఉన్నా పోలీసు అనుమతి రాక వాయి దా పడింది. త్వరలో డిపోల ముందు నిరసన ప్రదర్శనలు, నల్లబ్యాడ్జీలతో నిరసనలు వరుసగా చేయాలని నిర్ణయించారు. ఇటీవల బల్క్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడాన్నీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మునుపటి ధరలకే డీజిల్ అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. -
‘అశ్వద్ధామ రెడ్డిని టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: అశ్వద్ధామ రెడ్డి బయట ఉంటే ఆయన అవినీతికి జైల్లో పెడతారని భయపడి... మళ్లీ యూనియన్‌లో చేరతానని అంటున్నారు. ఆయనను టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం అంటూ థామస్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నర నుంచి అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేశారు. దాంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కార్మికులు ఉద్యోగాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. టీఎంయూలో అశ్వద్ధామ రెడ్డిని నామినేట్ చేసింది నేనే. నన్ను తొలగిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆర్టీసీని సర్వనాశనం చేసింది ఆయనే’’ అన్నారు. (చదవండి: రోజుకో రూ.కోటి.. చేతులెత్తేశారు!) అంతేకాక ‘‘థామస్ రెడ్డిని మళ్ళీ బస్ భవన్‌లోకి ట్రాన్స్ఫర్ చేయండి.. జిల్లా నుంచి రప్పించండి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. థామస్ రెడ్డి వల్ల కార్మికులు కష్టాలు తీరతాయని సీఎం చెప్పారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పటికీ మాకు తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్లో కూడా డ్యూటీ లేకున్నా, బస్సులు నడవకున్నా మాకు జీతాలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా మాకు జీతాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఇప్పటికే చాలా బస్సులు పాడైపోయాయి.. 2000 కొత్త బస్సులు కొనాలని కోరుతున్నాం.. కార్మికులు ఆందోళనలో ఉన్నారు.. ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
తీవ్ర విభేదాలు.. రెండుగా చీలిన టీఎంయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్ రెడ్డి నేడు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. అయితే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్‌రెడ్డి సహా ఆయన మద్దతుదారులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. (చదవండి: అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది) ఇక ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఈ భేటీలో మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిన తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ రెండు చీలిపోయింది. -
అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిపై ఆ సంఘం పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఈ మేరకు చర్చించారు. అశ్వత్థామరెడ్డి సంఘం నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానం లో మరొకరు ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. కోవిడ్ నిబంధనల్లో మినహాయింపులు ఇస్తూ వంద మందితో సమావేశాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రావటంతో ఈ భేటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి సరిగా లేని తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. ఇలాంటి పరిస్థితిలో సంఘం దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకు అశ్వత్థామరెడ్డి నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఒకవేళ అశ్వత్థామరెడ్డి తప్పుకోవాలని నిర్ణయిస్తే, కార్మిక సంఘాలు పునరుత్తేజం పొందేవరకు అదే స్థానంలో ఉండాలని పేర్కొనటం విశేషం. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. -
అశ్వద్ధామ రెడ్డికి షోకాజ్ నోటీస్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్ధామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె తర్వాత లాంగ్ లీవ్‌లో ఉన్న అశ్వద్ధామ రెడ్డి నెలలు గడుస్తున్నా విధులకు హాజరు కాకపోవటంతో ఆర్టీసీ యాజమాన్యం ఈ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా, సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలని విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ, దీర్ఘకాల సెలవుల అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. అయినప్పటికి మరోసారి ఎక్స్ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం ఆయన దరఖాస్తు చేయగా రెండోసారి కూడా యాజమాన్యం తిరస్కరించింది. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు. అయినప్పటికి ఆయన విధుల్లో చేరకపోవటంతో షోకాజ్ నోటీస్ జారీచేశారు. -
అశ్వత్థామరెడ్డికి చుక్కెదురు...
సాక్షి, హైదరాబాద్: సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలంటూ దాఖలు చేసిన అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, సంస్థ ఉన్నతికి సిబ్బంది అంతా కలసి శ్రమించాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో సెలవు మంజూరు చేయలేమంటూ అధికారులు అప్పట్లోనే స్పష్టం చేశారు. తాజాగా ఆయన మరోసారి ఎక్స్ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం దరఖాస్తు చేయగా రెండోసారి తిరస్కరించారు. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు. చదవండి: కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి -
కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి
చంపాపేట: కార్మికుల సంక్షేమం కోసం సంఘాలు, యూనియన్ల ఏర్పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కని, వాటిని కాలరాయాలని చూస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని చంద్రాగార్డెన్‌లో మంగళవారం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి ఏర్పాటు చేసిన కేంద్రకమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవిధానం మానుకోక పోతే మళ్ళీ ఆందోళన బాట పట్టక తప్పదన్నారు. బస్సుల సంఖ్యను కుదించటం వల్ల కార్మికులు డ్యూటీల కోసం బస్‌డిపోల ముందు పడిగాపులు కాయటమే కాకుండా ఓవర్‌లోడ్ ప్యాసింజర్‌తో కార్మికులు పని ఒత్తిడికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బస్ డిపోలో విధినిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలపై అవగాహన లేని వ్యక్తులను కార్మిక సంక్షేమ సభ్యులుగా నియమించటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. -
ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదు
-
సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ తరపున ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్ వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్ కమిషన్ చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు -
దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గురువారం ఉదయం మహాత్మాగాంధీ బస్టాండులో విధుల్లో చేరి, ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవుకోసం దరఖాస్తు చేశారు. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, సుధలు ఇప్పటికే విధుల్లో చేరారు. ఆర్టీసీ పోస్టుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు. ‘రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దంటూ కార్మికులతో అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధం. దీనిపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం. శుక్రవారం ధర్నాలు కొనసాగుతాయి’ అని అశ్వత్థామరెడ్డి అన్నారు. -
హైకోర్టు సూచనతోనే సమ్మె విరమించాం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేశారని జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అన్నారు. హైకోర్టు సూచన మేరకే తాము సమ్మె విరమించామని అన్నారు. శుక్రవారం వీఎస్టీలోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. తాము అడిగిన 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఆర్టీసీలో భవిష్యత్‌లో యూనియన్లు ఉండవని సీఎం చెబుతున్నారని, వ్యవస్థ ఉన్నంత కాలం ట్రేడ్ యూనియన్లు ఉంటాయని చెప్పారు. డిపోలకు ఇద్దరు చొప్పున కార్మికులను నియమిస్తామని చెబుతున్నారని, ఇది రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. కార్మికుల ద్వారా ఓటింగ్ పెట్టి నిర్ణయించాలన్నారు. ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన సమ్మెలు ఎన్నడూ జరగలేదని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సమ్మెలు జరిగాయన్నారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయారు’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని ఆరోపించారు. 52 రోజుల పాటు సమ్మె పేరుతో కార్మికుల జీవితాలతో చేలగాటమాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అశ్వత్థామరెడ్డి నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన రవినాయక్.. సోమవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మరోవైపు ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నామని, మంగళవారం ఉదయం నుంచి ఉద్యోగులందరూ విధుల్లో పాల్గొనాలని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. దీంతో ఉదయం 6.00 నుంచే అన్ని డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల జేఏసీ మరోసారి వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కార్మికులంతా రేపు ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. అలాగే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మికులకు సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను అడ్డుకోవద్దని యాజమాన్యాన్ని కోరారు. కార్మికులదే నైతిక విజయమని తెలిపిన ఆయన.. ఇందులో ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలువలేదని వ్యాఖ్యానించారు. అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపు విధులకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను రక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల రక్షణ కోసమే పోరాటం చేశామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు సహకరించిన కార్మికులకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇది పోరాటానికి నాంది మాత్రమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని, కార్మికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమ్మె విరమించినట్టు వెల్లడించారు. సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారానికే తప్ప.. విధులను విడిచిపెట్టడానికి కాదని స్పష్టం చేశారు. సమ్మెకు ముందు ఉన్నటువంటి వాతావరణం కల్పించి ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధులు నిర్వర్తించేలా చూడాలని జేఏసీ నాయకులు కోరారు. కాగా, అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైన సమ్మె.. 52 రోజుల పాటు కొనసాగింది. అయితే వారం రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె చట్టబద్ధమా, వ్యతిరేకమా నిర్ణయించే అధికారం లేబర్ కోర్టుకు ఉందని తెలుపడంతో జేఏసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గింది. కానీ మరసటి రోజే సమ్మె కొనసాగిస్తున్నట్టు జేఏసీ మరో ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గత నాలుగు రోజులుగా కార్మికులు విధుల్లోకి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని తిప్పి పంపిస్తున్నారు. -
ఆ ప్రాంతాల్లో రేపు ‘సేవ్ ఆర్టీసీ’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కార్మికులకు ధన్యవాదాలు చెప్పారు. గత 51 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారని అన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుందని వెల్లడించారు. జేఏసీ సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇవాళ అన్ని బస్ డిపోల ముందు మానవహారాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. రేపు డిపోలు, బస్టాండ్ల వద్ద, ప్రధాన కూడళ్లలో ‘సేవ్ ఆర్టీసీ’పేరుతో నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. -
సమ్మె కొనసాగిస్తాం..
అఫ్జల్‌గంజ్: ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని, ఈ విషయంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మరోసారి జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎంజీబీఎస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నేడు ఆర్టీసీ మహిళా ఉద్యోగులతో మానవహారం, మౌన దీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అన్ని డిపోల ముందు ప్రొఫెస ర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించి మానవహారాలుగా ఏర్పడి నిరస న తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రైవేటీకరణ సాధ్యం కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి శనివారం స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడవద్దని, ప్రైవేటీకరణ అనేది చట్టంలో లేదని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని, సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఆదివారం ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతారని వెల్లడించారు. అన్ని డిపోల కార్మికులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలిన పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు కార్మికుల దీక్ష 50వ రోజుకు చేరింది. వివిధ జిల్లాల్లో కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మంలో బస్‌డిపో నుంచి బస్టాండ్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌లోకి కార్మికులు, అఖిల పక్ష నాయకులు చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. డిపోకి వస్తున్న బస్సులను మహిళా కండక్టర్లు ఆపేసి వాటి టైర్లలోని గాలి తీశేసారు. కొత్తగూడెం పట్టణంలో సీపీఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల కోసం నాయకులు విరాళాలు సేకరించారు. నిజామాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీని ధర్నాచౌక్ నుంచి ప్రారంభించగా బస్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు. బోధన్‌లో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లాలో ప్రైవేటీకరణకు నిరసనగా బస్టాండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో బస్టాండ్ ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ నుంచి ఐబీ వరకు దాదాపు 200 మంది కార్మికులు ర్యాలీ తీశారు. కరీంనగర్ జిల్లాలో బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఖనిలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో కార్మికులు మానవ హారం నిర్మించారు. -
ఆర్టీసీ సమ్మె: ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. సమ్మెకు కొనసాగింపుగా శనివారం అన్ని డిపోల వద్ద సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. సమ్మెపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ శనివారం మరోసారిభేటీ అవుతుందని, దీనిలో భవిషత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాలేదని, సమ్మెకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. (చదవండి: ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే) కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రస్తుతం కార్మిక కోర్టులో విచారణజరుగుతోన్న విషయం తెలిసిందే. కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో సమ్మెను విరమించాలని జేఏసీ ఇటీవల నిర్ణయించింది. బేషరుతుగా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది. కానీ కార్మికుల విజ్ఞప్తికి ప్రభుత్వనుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా ఉద్యోగాల్లో చేరేందుకు అనేక మంది కార్మికులు గురువారం ఉదయం నుంచి డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే వారి చేరికపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకుఎవరిని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దని డిపో మేనేజర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
ఆర్టీసీ సమ్మె విరమణ పేరిట మోసం..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. సమ్మెలో ఇప్పటివరకు 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు. ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని పేర్కన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. -
ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వ స్పందన?!
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఆర్టీసీ కార్మికులు 47 రోజులపాటు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. గత అక్టోబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినప్పటికీ.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువశాతం దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వారు నెలన్నరకుపైగా తమకు వచ్చే జీతాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందుకు, సమాజం ముందుకు తీసుకురాగలిగారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల ఖర్చులు ఇలా అనేక సమస్యలు వెంటాడినా కార్మికులు మూకుమ్మడిగా నిలబడి ఉద్యమం చేశారు. ఈ సమ్మెకాలంలో పలువురు కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి.. ఆత్యహత్యలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మెను విరమణకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మళ్లీ సమ్మెకు పూర్వం ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం కల్పించాలని, విధుల్లోకి చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. సుదీర్ఘ సమ్మె నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమించి.. తిరిగి విధుల్లోకి చేరేందుకు సమ్మతించిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ సమ్మె విషయంలో ఒకింత చురుగ్గా వ్యవహరించారు. పలుమార్లు సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అంగీకరించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వెంటనే విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ గతంలో రెండుసార్లు కార్మికులకు డెడ్‌లైన్ విధించారు. ఆ డెడ్లైన్లకు పెద్దగా కార్మికుల నుంచి స్పందన రాలేదు. కానీ, హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కోరినట్టు బేషరతుగా విధుల్లోకి చేరేందుకు కార్మికులు ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను సైతం కార్మికులు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘంగా నిర్వహించిన సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో నెట్టింది. ప్రజలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా దసరా పండుగ సమయంలో సమ్మె చేపట్టడం.. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవ్వడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే, 50వేలమంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు వారికి విధుల్లో చేరేందుకు గడువు ఇచ్చింది. తాజాగా కూడా ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కార్మికులను బేషరతుగా ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. -
ఆర్టీసీ సమ్మె విరమణ..!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు. సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్నటినుంచి తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడటంతో సమ్మె విరమణకే జేఏసీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే, ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులు సమ్మె విరమణకు ఓకే చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై విషయంలో కార్మిక సంఘాల జేఏసీ సందిగ్ధంలో పడింది. కేసు కార్మిక న్యాయస్థానానికి చేరడం, డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం జేఏసీ ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయింది. హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి బుధవారం న్యాయవాదులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. విడివిడిగా సమావేశాలు... ఒకటిగా సమాలోచనలు.. సమ్మెకు సంబంధించి హైకోర్టులో వాదనలు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం కార్మికుల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్న ఆశతో ఉన్న కార్మికులు... తాజా పరిణామాలతో కొంత ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం మాత్రం సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని సమ్మె విషయాన్ని తేలిస్తే బాగుంటుందంటూ జేఏసీ నేతలపై ఒత్తిడి వచ్చింది. దీంతో జేఏసీలోని కార్మిక సంఘాలు విడివిడిగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలవారీగా కమిటీ ప్రతినిధులను ఆహ్వానించి అభిప్రాయ సేకరణ జరిపాయి. టీఎంయూ, ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కార్మికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమ్మె విషయంపై చర్చిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు కొందరు అలా.. మరికొందరు ఇలా 46 రోజులపాటు ఉధృతంగా సమ్మె కొనసాగించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఇప్పటికే రెండు నెలలపాటు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని పెద్ద సంఖ్యలో కార్మికులు అభిప్రాయపడ్డారు. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసి ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని, తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సమ్మెను కొనసాగిస్తే ఉద్యోగ భద్రత కరువైందన్న ఆందోళనతో మరికొందరు మరణించే ప్రమాదం ఉన్నందున ఈ విషయాన్ని కూడా పరిగణించాలని కొందరు సూచించారు. సూపర్వైజర్ల సంఘం భేటీలో మాత్రం ఎక్కువ మంది సమ్మెను విరమించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా భిన్న వాదనలు వినిపించడంతో కార్మిక సంఘాలు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయాయి. అనంతరం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జేఏసీ భేటీ అయింది. అప్పటివరకు సంఘాలుగా కార్మికుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ఇందులో చర్చించారు. జేఏసీలో కూడా మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మొండిపట్టుతో ఉన్నందున కార్మికులు కూడా సమ్మెను కొనసాగించాలంటూ ఓ సంఘానికి చెందిన నేతలు పేర్కొన్నారు. సమ్మె విరమించాక ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టత కోరి దానిపై నిర్ణయం తీసుకుంటే మంచిదంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మధ్యవర్తిత్వం నెరపడం సరికాదని మరొకరు పేర్కొన్నారు. వెరసి మరికొంత సమ యం తీసుకొని తుది నిర్ణయానికి రావాలని తీర్మానించారు. ఇందుకు న్యాయవాదులతో కూడా చర్చించాలని నిర్ణయించారు. కోర్టు పేర్కొన్న విషయాలపైనా కూలంకషంగా చర్చించాలని, ఇం దుకు న్యాయవాదులతో మాట్లాడాలని నిర్ణయించి తుది నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేశారు. జేఏసీ నిర్ణయానికి కార్మికులు కట్టుబడతామన్నారు: అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ జేఏసీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపోలకు సంబంధించిన కమిటీల ప్రతినిధులు తేల్చిచెప్పారని సమావేశానంతరం అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం న్యాయవాదులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇప్పటివరకు మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. మరోవైపు బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన జేఏసీ–1, ఎన్ఎంయూ నేతలు తుది నిర్ణయం వెల్లడించనున్నారు. ఆ సంఘాలకు సంబంధించిన కార్మికుల్లో ఎక్కువ మంది సమ్మె కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ.. కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సమ్మె కొనసాగించాలా? వద్దా? అని దానిపై ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం ముగిసింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేపు హైకోర్టు తుది తీర్పు ప్రకటించిన తరువాత సమ్మెపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని, కోర్టు తీర్పు తరవాత రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. ఎల్బీనగర్ హిమగిరి ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె అంశంతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. అంతకుముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమై.. తెలంగాణవ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోలవారీగా సేకరించారు. ఎల్బీనగర్లోని హిమాగిరి ఫంక్షన్ హాల్లో టీఎంయూ నేతలు, కేకే గార్డెన్‌లోని ఈయూ నేతలు, సీఐటీయూ కార్యాలయంలో ఎస్టీఎఫ్ నేతలు, టీజేఎంయూ కార్యాలయంలో ఆ సంఘం నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఉద్యోగ భద్రతపై గ్యారెంటీ ఏది? 46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. అయితే, సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఈయూ సమావేశంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. బ్యాలెట్ పెట్టి కార్మికుల అభిప్రాయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ పొందిన తర్వాత సమ్మె విరమించాలని పలువురు కార్మికులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేబర్ కమీషన్‌కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సమ్మెపై తర్జనభర్జన ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనలకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై.. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింపుపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది. ఈ డెడ్లైన్లకు అప్పట్లో పెద్దగా స్పందన రాని విషయం తెలిసిందే. -
సమ్మె విరమణపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నెలన్నరగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కార్మిక న్యాయస్థానం పరిధిలోకి ఈ అంశం వెళ్లిన నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా.. వద్దా? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం అత్యవసర సమా వేశం ఏర్పాటు చేసింది. ఇందులో సమ్మె కొనసాగింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జేఏసీ సమావేశానికి ముందు.. అందులో భాగంగా ఉన్న కార్మిక సంఘాల నేతలు అంతర్గతంగా చర్చించనున్నారు. అనంతరం జేఏసీ భేటీలో ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ నిర్ణయాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. సోమవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె విరమణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కార్మిక సంఘాలకు సమ్మె విరమణ విషయంలో సూచనలు చేస్తానంటూ జేఏసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రెండు నెలలుగా వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి జేఏసీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం వాదనల అనంతరం ధర్మాసనం పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి వివరాల ప్రతి వెంటనే అందనందున సమ్మె విషయంలో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రతిని పరిశీలించిన మీదట మంగళవారం భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే వరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించి, మూడు రోజులు దీక్ష కొనసాగించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు సోమవారం సాయంత్రం దీక్ష విరమించారు. వీరిని ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించినా దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, పలువురు ప్రజా సంఘాల నేతలు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. హైకోర్టులో జరిగిన వాదనల్లో కీలక పరిణామాల నేపథ్యంలో అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తమ సమ్మె కొనసాగుతుందని, మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని, సాయంత్రం జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 72.49 శాతం బస్సులు తిప్పాం – ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 72.49 శాతం బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 1,912 అద్దె బస్సులు సహా 6,487 బస్సులను తిప్పినట్లు పేర్కొంది. 4,575 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,487 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని వెల్లడించింది. 44వ రోజూ కొనసాగిన కార్మికుల సమ్మె అక్టోబర్ ఐదోతేదీన మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతూ సోమవారంతో 44 రోజులు పూర్తి చేసుకుంది. సమ్మె విరమించి విధుల్లోకి రావాలంటూ ప్రభుత్వం మూడు దఫాలు చేసిన సూచనలను కూడా కార్మికులు బేఖాతరు చేస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ నేతలకు సంఘీభావంగా అన్ని బస్ డిపోల వద్ద కార్మికులు సంఘీభావ దీక్షలు కొనసాగించారు. -
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం తలపెట్టనున్న సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రేపటి సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. జడ్జిమెంట్ కాపీ చూసి రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కేవలం సడక్ బంద్‌నే వాయిదా వేస్తున్నామని నిరసన దీక్షలు మాత్ర రేపు యధాతదంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీక్ష విరమించిన జేఏసీ నేతలు మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న నిరవదిక నిరాహారదీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నాయకులు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం,మందకృష్ణ మాదిగలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రిలోనే జేఏసీ నాయకులతో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. -
అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహ నిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు ఆదివారం సాయం త్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అశ్వత్థామరెడ్డి దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ తలుపులు గడియవేసి ఉండటంతో లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌లు వచ్చారు. అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని కోరారు. మరోసారి రాజిరెడ్డి అరెస్టు జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. శనివారం ఆయన రెడ్డి కాలనీలోని తన ఇంట్లో దీక్ష నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి పహాడీషరీఫ్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వదిలిపెట్టిన విషయం తెలిసిందే. పోలీసు స్టేషన్లో కూడా దీక్ష కొనసాగించిన రాజిరెడ్డి ఇంటికి వచ్చి తిరిగి దీక్షలోనే ఉన్నారు. దీంతో ఉదయం ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు దీక్షను విరమించాలని కోరారు. ఇందుకు ఆయన నిరాకరించారు. తలుపు గడియ పెట్టి ఉండటంతో బలప్రయోగంతో రాజిరెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తోటి కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యాన్‌లో నినాదాలు చేసే క్రమంలో రాజిరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. వీరిద్దరి అరెస్టులను ఖండిస్తూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోల వద్ద సంఘీభావ దీక్షలు కొనసాగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 68.32 శాతం బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. 1,924 అద్దె బస్సులుసహా 6,114 బస్సులను తిప్పినట్టు వెల్లడించారు. 4,189 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,114 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని చెప్పారు. 5,864 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడామని, 174 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో ట్రే టికెట్లు జారీ చేశామన్నారు. ఉస్మానియాలో కొనసాగుతున్న దీక్ష నిన్నటి నుండి తన నివాసంలో నిరాహారదీక్ష చేస్తున్న ఆశ్వత్థామరెడ్డిని వైద్య చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మెడికల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఆయనను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. బీపీ, షుగర్ ఉన్నందున వైద్యానికి సహకరించాలని వైద్యులు కోరుతున్నా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, యూరిన్‌లో కీటోన్స్ వచ్చాయని, అవి పెరిగితే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని డ్యూటీ డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. -
అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహనిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థాహరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థారెడ్డిని పోలీసులు ఆదివారం సాయంత్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యంగా స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో ఆయన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ ఆయన తలుపులు గడియ వేసి ఉండటంతో పోలీసులు లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్లులు వచ్చారు. వారిని అనుమతించటంతో వారు అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. దీంతో అశ్వత్థారెడ్డితోపాటు ఉన్న కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్‌లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఆరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. అశ్వత్థామరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పోలీసులు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేశారని ఆర్టీసీ మహిళా కార్మికులు ఆరోపిస్తున్నారు. 44 రోజులుగా సమ్మె చేస్తున్నామని, తమ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించిన చర్చలకు పిలవాలని, తమ న్యాయమైన 25 డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తమ ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీలో విలీనం అనే అంశాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. కాగా అంతకు ముందు నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో వివేక్, జితేందర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన తమను ఎందుకు లోపలకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
రాజిరెడ్డి దీక్ష భగ్నం.. అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్లోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి కొనసాగిస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటి డోర్ పగలగొట్టి మరి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చే క్రమంలో రాజిరెడ్డి.. ఇంటి డోర్ వేసుకుని దీక్ష కొనసాగించారు. ఇంటి తలుపు పగలగొట్టి రాజిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో రెడ్డి కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారం నుంచి హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం, ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే పోలీసులు దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మందకృష్ణ అరెస్టు.. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మహాదీక్షకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్ దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇందిరా పార్క్‌కు వస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఆయనను నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మందకృష్ణ విమర్శించారు. ఎట్టిపరిస్థిలోనూ భవిష్యత్తులో దీక్ష చేసి తీరుతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బలగాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల ఆందోళన సమ్మెలో భాగంగా కార్మికులు ఆర్టీసీ డిపోల దగ్గర ఆందోళనకు దిగారు. ఖమ్మం డిపో దగ్గర బైఠాయించిన కార్మికులు... బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలోనూ డిపోల దగ్గర ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు ఇంటి దగ్గర చీపురులతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు -
నిరశనలు... అరెస్టులు
సాక్షి, హైదరాబాద్/హస్తినాపురం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె శనివారం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం బస్ రోకో చేపట్టారు. దీనికి అనుమతి లేదని, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా కార్మికులు శనివారం ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు జేఏసీ రాష్ట్ర నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా అన్ని డిపోల వద్ద కార్మికులు కూడా దీక్షలు నిర్వహించటంతో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను అరెస్టు చేశారు. ముఖ్యంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గృహానిర్బంధం చేయడంతోపాటు, కోకన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలపటంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. వారిని నిలవరించే క్రమంలో పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అశ్వత్థామరెడ్డి గృహ నిర్బంధం... సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం ధర్నా చౌక్ ఇందిరాపార్కు వద్ద నిరశన దీక్ష చేపట్టాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. అయితే దీనికి పోలీసులు అనుమతిత్వలేదు. దీంతో వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం దీక్ష ఉండటంతో, దానిని భగ్నం చేసే క్రమంలో తెల్లవారుజామునే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. ఈ విషయం ముందుగానే ఊహించిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఇళ్ల వద్దకు రావాలంటూ అందుబాటులో ఉన్న కార్మికులకు సమాచారం అందించారు. హస్తినాపురం జయక్రిష్ణ ఎన్‌క్లేవ్‌లోని అశ్వత్థామరెడ్డి, రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజిరెడ్డి ఇళ్ల వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటాక పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం వద్దకు బయలుదేరితే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి అశ్వత్థామరెడ్డి బయటకు రాకుండా ఇంట్లోనే తలుపు గడియపెట్టుకుని ఉండిపోయారు. ఆయనతోపాటు పలువురు ఆర్టీసీ కార్మికులు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఇంట్లోనే దీక్ష ప్రారంభిస్తున్నట్టు ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆయనతోపాటు మహిళా కార్మికులు కూడా దీక్షలో పాల్గొన్నారు. మహిళా కార్మికులను వెలుపలికి రావాల్సిందిగా పోలీసులు కోరినా వారు తిరస్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. అశ్వత్థామరెడ్డి దీక్ష విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేకరులను తప్పించి ఎవరినీ ఆపార్ట్‌మెంట్‌లోని అనుమతించలేదు. దీంతో పోలీసులు దమనకాండ నిర్వహిస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సంధ్యలను అనుమతించలేదు. ఆగ్రహానికి గురైన మందకృష్ణ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో సంధ్య గేటు దూకి లోనికి వెళ్లేందకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రెడ్డికాలనీలో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు రాజిరెడ్డి అరెస్టు.. విడుదల.. ఇదే సమయంలో రాజిరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజిరెడ్డి వద్దకు పోలీసులు వెళ్లకుండా చుట్టూ మహిళా కార్మికులు వలయంగా ఏర్పడ్డారు. అయినా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని, రాజిరెడ్డిని అరెస్టు చేసి పహడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆయన దీక్షను కొనసాగించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజిరెడ్డిని విడిచిపెట్టారు. మరో కోకన్వీనర్ లింగమూర్తి సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి బొల్లారం స్టేషన్‌ను తరలించారు. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు. సునీల్‌శర్మకు ఏం తెలుసు..?: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆర్టీసీ నష్టాలను పదేపదే చెబుతున్న ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది. నష్టాలకు కారణమైన ప్రభుత్వమే సంస్థను నిర్వీర్యం చేసింది. 17 నెలల క్రితం ఎండీగా వచ్చిన సునీల్‌శర్మకు ఆర్టీసీ గురించి ఏం తెలుసు. ఇప్పటివరకు కనీసం ఏడు సార్లు కూడా ఆయన ఆర్టీసీ కార్యాలయానికి రాలేదు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్లపై సునీల్‌శర్మ సంతకాలు పెడుతున్నారు. వాటిని చూస్తే అధికారుల రూపొందించినట్టు లేవు. రాజకీయ పార్టీలు తయారు చేసినట్టే ఉన్నాయి. కోర్టులు చివాట్లు పెట్టినా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవటం లేదు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్థను మూసివేసేందుకు నష్టాల ముద్ర వేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కు తగ్గినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా కార్మికులు భయపడలేదు, భయపడరు. సమ్మె కొనసాగుతుంది. మరింత ఉధృతమవుతుంది. ప్రశాంతంగా దీక్ష చేయబోతే, పోలీసులు 144 సెక్షన్‌తో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపామన్న ఆరోపణలు అవాస్తవం. తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి అవమానం తప్పదు. కేరళ ఎంపీ సంఘీభావం.. రాజిరెడ్డి సహా పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకుని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కేరళ సీపీఐ ఎంపీ బినాయ్ విశ్వం కూడా అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కార్మికులను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారం, ఇక్కడి ప్రభుత్వం తీరును పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. పోలీసు స్టేషన్ వద్ద మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేస్తే నాటి ప్రభుత్వం అనుమతించిందని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల దీక్షకు మాత్రం అనుమతించకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వ వేధింపుల కారణంగా 27 మంది కార్మికులు చనిపోయారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు జరిపిన సమ్మె కారణంగానే రాష్ట్రం ఏర్పడిందని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం వారి పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలన్నారు. -
అశ్వత్థామ దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన బస్‌రోకో కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని బీఎన్ నగర్‌లోని ఆయన ఇంట్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన తన నివాసంలోనే ఉదయం 10 గంటల నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నారు. అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష విరమించాలని పోలీసులు ఆయనతో సంప్రదింపులు జరిపినప్పటికీ.. దీక్ష విరమించేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆయనను పరామర్శించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డికూడా ఎల్బీనగర్లోని రెడ్డి కాలనీలోని తన ఇంట్లో సాయంత్రం 7:30 గంటల నుంచి దీక్షకు కూర్చున్నారు. శనివారం బస్‌రోకో నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో పాటు రాజిరెడ్డిని ఉదయం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. స్టేషన్ నుంచి రాజిరెడ్డిని సాయంత్రం విడిచిపెట్టారు. ఇదిలాఉండగా.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ తేల్చిచెప్పారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని శనివారం ఆయన కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో స్పష్టం చేశారు. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముందస్తుగా 219మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (చదవండి : ‘డిమాండ్లు పరిష్కరించం.. చర్చలు జరపం’) (చదవండి : ఆర్టీసీ జేఏసీ నేతల హౌస్ అరెస్ట్) -
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతల హౌస్ అరెస్ట్
-
ఉద్రిక్తం: జేఏసీ నేతల హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్‌రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. కార్మికులు కార్యక్రమానికి పోలీసు శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని బీఎన్‌రెడ్డి నగర్లో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. మరోనేత రాజిరెడ్డి సైతం గృహ నిర్బంధం చేశారు. నేతల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు వారి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరకుంటున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే బస్‌రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగానే పలువురు నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. దీనిపై సిటీ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. నగరంలోని బస్ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని సూచించారు. -
మాకు మద్దతివ్వండి...
-
‘విలీనం’ వదులుకుంటాం : ఆర్టీసీ జేఏసీ
సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్) : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని, ఇకకైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. గురువారమిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు చేసిన సూచనలను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం కోర్టులను తప్పు దోవ పట్టించిందని ఆరోపించారు. విలీనం చేస్తేనే చర్చలకు వస్తామంటున్నామని, విలీన డిమాండ్‌పై పట్టు వీడడం లేదంటూ తమపై దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను వదులుకుంటున్నామని, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం కార్మిక సం ఘాలతో చర్చలు జరపాలని కోరారు. 23 మంది కార్మికుల ఆత్మహత్యలు, మరణాలకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నా.. ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే గానీ, ఒక మంత్రి గానీ పరామర్శించడం, సానుభూతి ప్రకటించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మద్దతివ్వండి... ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే ఆర్టీసీ కార్మికుల కన్నా ప్రజలే ఎక్కువ నష్టపోతారని, తమ ఇష్టానుసారం చార్జీలు పెంచుకుంటూ వెళతారని అశ్వత్థామరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు ప్రజా, ఉద్యోగ, నిరుద్యోగ తదితర సంఘాలు సంపూర్ణ మద్ధతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు మనోధైర్యం కోల్పోయి ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ట్యాంక్‌బండ్ బంద్‌ను విజయవంతం చేసిన కార్మికులకు, తమకు మద్ధతు ప్రకటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెలో భాగంగా శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు తాము నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని అశ్వత్థామరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత వీహెచ్, బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మోహన్‌రెడ్డి, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్, న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, సూర్యం, డీజీ నర్సింగ్‌రావు, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆందోళన కార్యక్రమాలివే.. 15న గ్రామాల్లో బైక్ ర్యాలీలు 16న సామూహిక నిరాహార దీక్షలు, వీటికి మద్దతుగా డిపోల ముందు బైక్ ర్యాలీలు 17, 18న అన్ని బస్ డిపోల ముందు సామూహిక దీక్షలు 19న హైదరాబాద్–కోదాడ జాతీయ రహదారిపై సడక్‌బంద్ -
ఆర్టీసీ సమ్మె: ‘జేఏసీ కీలక నిర్ణయం’
సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మిగిలిన అంశాలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. సేవ్ ఆర్టీసీ పేరుతో రేపటి నుంచి డిపోల ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. కార్మికులు ఆత్మస్తైర్యాన్ని కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు, ప్రజల మద్దతు ఉందన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ నెల 15న గ్రామ గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించి, 16న తనతో పాటు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక దీక్ష చేపట్టబోతున్నామని చెప్పారు. 17,18తేదిలలో ప్రతి డిపో ముందు 50మంది చొప్పున కార్మికులు నిరహారదీక్షకు చేపడుతారన్నారు. 19న సడక్ బంద్ పేరుతో హైదరాబాద్ నుంచి కోదాడ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీలో మరో బలిదానం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరో ప్రాణం బలైపోయింది. మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేష్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్ ప్రాణాలు విడిచాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, సాయికిరణ్ ఉన్నారు. అతను 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా నరేష్ భార్య హృద్రోగంతో బాధపడుతోందని, నెలకు రూ. 5వేల మందులు వాడుతున్నారని, మరోవైపు ఇద్దరు పిల్లలు చదువుతుండటంతో నరేష్ ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నాడని, ఈ క్రమంలో మొదలైన సమ్మె ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు. నరేష్ ఆత్మహత్య వార్త తెలియడంతో అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని, కోర్టు విచారణ పేరిట కాలయాపన చేయకుండా కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నా చావుకు ముఖ్యమంత్రే కారణం! ఆత్మహత్య చేసుకునే ముందు ఆర్టీసీ డ్రైవర్ నరేష్ సూసైడ్ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ‘నా చావుకు ముఖ్యమంత్రే కారణం. నా వల్ల ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్టీసీలో నాదే చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రిగారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబానికి వచ్చిన ఇబ్బంది మరో కుటుంబానికి రాకూడదు. ఇది నేను సొంతంగా రాసిన లేఖ. నా అంత్యక్రియలకు అశ్వత్థామరెడ్డి హాజరుకావాలి. ఆర్టీసీ కార్మికులు బాగుండాలి’ అంటూ ఈ లేఖలో నరేష్ పేర్కొన్నాడు. ఈ లేఖను చూసి ఆర్టీసీ కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
‘హైకోర్టు ఆదేశాలు మాకు ఆమోదయోగ్యమే’
సాక్షి, హైదరాబాదు : సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తే స్వాగతిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు, కొత్తగా వేసే కమిటీ నిర్ణయాలు తమకు ఆమోదయోగ్యమేనని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయొద్దని, ఇంకా భేషజాలకు పోయి సమస్యను పెంచొద్దని హితవు పలికారు. వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధం కావాలని సూచించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తులతో కమిటీ వేసి, తమను సమ్మె విరమించమని హైకోర్టు సూచిస్తే.. అందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేత థామస్ రెడ్డి చెప్పారు. అయితే, కమిటీకి నిర్ధారిత కాల పరిమితి ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. సమ్మె విరమించమని ఆ కమిటీ చెప్పినా అందుకు సిద్ధమేనని స్పష్టంచేశారు. డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసనలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె బుధవారంతో నలభై రోజులకు చేరుకోనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను ముమ్మరంగా నిర్వహించాలని కార్మిక సంఘాల జేఏసీ జిల్లా నేతలకు సూచించింది. మంగళవారం కూడా కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో నిరసనలు ఉధృతంగానే కొనసాగించారు. వాస్తవానికి జేఏసీ కన్వీనర్‌తోపాటు ముగ్గురు కో–కన్వీనర్లు మంగళవారం నివరధిక నిరశన చేపట్టాలని నిర్ణయించినా.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జిలతో కమిటీ విషయాన్ని హైకోర్టు ప్రస్తావించటాన్ని కార్మికులు ఆసక్తిగా గమనించారు. ఇది తమ సమస్యకు పరిష్కారం చూపే చర్యగా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంగళవారం 6,406 బస్సులను తిప్పినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. -
హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, కమిటీ ఏర్పాటుకు తాము అంగీకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరపాలని ఆయన కోరారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుతో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: హైకోర్టు కీలక నిర్ణయం సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మా ప్రయోగానికి హైకోర్టు ఒప్పుకోలేదని, సమ్మె చట్ట విరుద్ధమని ఎక్కడ ప్రస్తావించలేదని అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని, ఈ విషయమై బుధవారంలోగా తమకు ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
గవర్నర్ ముందుకు గాయపడ్డ మహిళలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని డిక్లేర్ చేసేందుకు హైకోర్టు తిరస్కరించడంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేపు (మంగళవారం) ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ ఉన్నందున జేఏసీ నేతల నిరాహార దీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. సమ్మెపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. చదవండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఛలో ట్యాంక్‌బండ్ సందర్భంగా పోలీసుల లాఠీఛార్జ్‌లో మహిళా కార్మికులు గాయపడ్డారని, గాయపడిన మహిళలను మంగళవారం గవర్నర్ తమిళిసై వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టు చెప్పారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగుతుందని హైకోర్టు పేర్కొన్నట్టు తెలిపారు. హైకోర్టు విచారణ అనంతరం రేపు తమ కార్యాచరణపై స్పందిస్తామని చెప్పారు. -
ఆర్టీసీ సమ్మె : ‘రేపు నలుగురు నిరాహార దీక్ష’
సాక్షి, హైదరాబాద్ : చలో ట్యాంక్‌బండ్ నిరసన కార్యక్రమం విజయవంతమైందని ఆర్టీసీ జేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ‘కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు. పాదాభివందనాలు’అని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులు ధైర్యంగా నిరసన వ్యక్తం చేశారని కొనియాడారు. విద్యానగర్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన మీడియాతో మట్లాడారు. చలో ట్యాంక్‌బండ్ నిరసనలో జరిగిన దమనకాండపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలవాలని విఙ్ఞప్తి చేశారు. నలుగురి నిరాహార దీక్ష ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు నలుగురు రేపు (సోమవారం) ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చుంటారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 13, 14వ తేదీల్లో ఢిల్లీలో మానవహక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తామని చెప్పారు. కార్మికులపై దమనకాండకు నిరసనగా ఈ నెల 18న సడక్ బంద్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్మికులపై దాడికి సంబంధించిన ఫొటోలను ఎగ్జిబిషన్ పెట్టి ప్రదర్శిస్తామని అన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు వీ.హనుమంతరావు, సంపత్‌కుమార్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరింది. -
సీపీ వ్యాఖ్యలు బాధించాయి: అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఖండించారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి ఇవ్వలేదని సీపీ అంజనీకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ...‘మావోయిస్టలు ఉన్నారంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారంటూ పోలీస్ కమిషనర్ వ్యాఖ్యానించడం దురదృష్టకరం. సీపీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొన్నదంతా కార్మికులే. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు. మహిళా కండక్టర్ల పాత్ర కీలకం. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు శిరసు వంచి వందనాలు చెబుతున్నాం. అలాగే చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పోలీసుల దమనకాండను ఖండిస్తున్నాం. సమ్మె విజయవంతం అయ్యేవరకూ మహిళా సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. పోలీసుల దమనకాండకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో రేపు (ఆదివారం) బస్సు డిపోల ఎదుట నిరసన కార్యక్రమం చేపడతాం.’ అని తెలిపారు. కాగా మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు...పోలీసులపై రాళ్లు విసిరారని, ఈ దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీసులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: చాలామంది పోలీసులు గాయపడ్డారు.. -
‘ఈ రాత్రికే హైదరాబాద్ వచ్చేయండి’
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 35వ రోజు కొనసాగుతోంది. తమ ఆందోళనల్లో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు శవివారం(నవంబర్ 9) రోజున చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరో మిలియన్ మార్చ్ తరహాలో దీనిని నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ చేపట్టనున్న చలో ట్యాంక్‌బండ్‌కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు అక్రమ అరెస్ట్‌లను జేఏసీ నేతలు ఖండించారు. రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకోవాలి : అశ్వత్థామరెడ్డి కార్మికుల అక్రమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల ఇళ్లలో దాడులు చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళ కార్మికులను కూడా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని.. పోలీసులు దమనకాండ ఆపాలని అన్నారు. అరెస్ట్ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ రోజు రాత్రి వరకు కార్మికులందరూ హైదరాబాద్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ముగ్దుం భవన్లో అఖిలపక్ష సమావేశం.. సమ్మె, భవిష్యత్ కార్యచరణపై చర్చించేందకు ఓయూ జేఏసీతో ఈయూ కార్యాలయంలో జరగాల్సిన అత్యవసర సమావేశాన్ని ఆర్టీసీ జేఏసీ రద్దు చేసుకుంది. కార్మికుల అక్రమ అరెస్ట్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ముగ్దుం భవన్లో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్టులపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. -
చలో ట్యాంక్‌బండ్ మరో మిలియన్ మార్చ్
సాక్షి, హైదరాబాద్/సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని మరో మిలియన్ మార్చ్ తరహాలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల సరూర్‌నగర్‌లో నిర్వహించాలని నిర్ణయించిన బహిరంగసభకు పోలీసులు అనుమతివ్వకున్నా, కోర్టు ద్వారా అనుమతి పొంది సభకు భారీగా జన సమీకరణ జరిపిన నేపథ్యంలో దీనికి కూడా పెద్దసంఖ్యలో జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిలపక్ష నేతలు కూడా దీనికి మద్దతు తెలిపిన నేపథ్యంలో, కారి్మకుల కుటుంబ సభ్యులతోపాటు ఆయా పారీ్టల నుంచి భారీగా కార్యకర్తలు తరలేలా ఇటు జేఏసీ, అటు పారీ్టలు సం యుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి గురువారం జేఏసీ నేతలు వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరిపారు. ఉస్మానియా విద్యార్థులు కూడా ఈ సభకు తరలేలా వారితోనూ చర్చిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉస్మానియా విద్యార్థులతో జేఏసీ నేతలు సమావేశం కానున్నా రు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. ఇటు ప్రజలకు అటు కోర్టుకు అబద్ధాలు: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్టీసీ విషయంలో ఇటు ప్రజలతో పాటు అటు కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారని, ఒకదశలో కోర్టుకు క్షమాపణలు చెప్పడానికి కూడా ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారని ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. అధికారులకు ఏమాత్రం చీమూనెత్తురున్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత’పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అద్దె బస్సుల వల్లనే నష్టం వస్తోందన్న విషయాన్ని చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు కూడా తప్పుడు లెక్కలు చెప్పి చీవాట్లు పెట్టించుకున్నారన్నారు. చర్చలే ప్రజాస్వామ్యానికి పునాది అని.. కారి్మకులను వెంటనే చర్చలకు పిలిచి పరిష్కరించాలన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప సమ్మె జరగలేదన్నారు. ‘మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. 9 గంటలు మంత్రులతో చర్చించారు. 9 నిమిషాలు మాతో చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యేది కదా.. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఈ నెల 9న నిర్వహించే చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలి.’అని అన్నారు. కార్మికుల చావులు ప్రభుత్వ హత్యలే ఆర్టీసీ కారి్మకుల చావులు ప్రభుత్వ హత్యలేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 11వ తేదీలోపు మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంకా ఎంతమంది కడుపుకోతలను చూస్తారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడినవారి సమస్యలను పరిష్కరించకుండా ప్రగతిభవన్ మాటున ఉండాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఆ గిరే మీకు ఉరితాడు..: ఎల్.రమణ ఆర్టీసీ ప్రజలతో ముడిపడి ఉన్న రవాణా వ్యవస్థ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌గౌడ్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష చొప్పున మిగతా 20 మంది కార్మిక కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. కార్మికులు బరితెగించి కొట్లాడుతుంటే కేసీఆర్ గిరి గీసుకొని ఉన్నారని, ఆ గిరే మీకు ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. 48 వేల కుటుంబాలతో ఆటలు: చాడ కార్మికుల కడుపుకోతకు కేసీఆర్‌దే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. 48 వేల కుటుంబాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. కేసీఆర్ నయా నయీంగా మారాడని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, బీజేపీ నేతలు చింతా సాంబమూర్తి, సుధా తదితరులు పాల్గొన్నారు. 6,459 బస్సులు నడిపాం: ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,459 బస్సులు నడిపినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,531 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,459 మంది తాత్కాలిక కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు తెలిపింది. 5,453 బస్సుల్లో టిమ్ యంత్రాలు వినియోగించామని, 386 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో టికెట్లు జారీ చేశామని అధికారులు చెప్పారు. సీఎం ఉద్యోగం ఊడుతది: కోమటిరెడ్డి ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కారి్మకుల ఉద్యోగాలు తీస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉద్యోగం కూడా ఊడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కారి్మకులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీ భావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళ వారం అర్ధరాత్రి వరకు విధుల్లో చేరకుంటే సుమారు 50 వేల మంది కారి్మకుల ఉద్యోగాలు ఊడినట్లేనని కేసీఆర్ హెచ్చరించినా బెదిరింపులకు భయపడకుండా కారి్మకులు ఏకతాటిపై నిలబడి ఐక్యతను చాటుకోవడం అభినందనీయమన్నారు. చలో ట్యాంక్‌బండ్ సక్సెస్ చేయండి: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: గత 35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 9న ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘చలో ట్యాంక్‌బండ్’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం ఓ ప్రకటనలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి: లక్ష్మణ్ జగిత్యాల: ఆర్టీసీ కారి్మకులు అధైర్య పడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. జగిత్యాల డిపో ఎదుట గురువారం సమ్మెలో పాల్గొన్న కారి్మకులను కలసి సంఘీభావం తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కారి్మకులను రోడ్డు పాలు చేసిందన్నారు. ఉద్యమ సమయంలో ఇచి్చన మాట నిలుపుకోవాలని కోరారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర ప్రభుత్వం సైతం దృష్టి పెట్టిందని, ప్రభుత్వం భేషజాలకు పోకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పోలీసుల తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో స్పీకర్‌ను కల సిన సంజయ్ పోలీసుల తీరుకు సంబంధించిన క్లిప్పింగులు, వీడియోలను సమరి్పంచారు. స్పందించిన స్పీకర్ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సుశీల్‌కుమా ర్ సింగ్‌ను ఆదేశించినట్టు సంజయ్ మీడియాకు తెలిపారు. ఆర్టీసీ కుటుంబాలకు ఎస్వీకేలో ఉచిత వైద్యం సాక్షి, హైదరాబాద్: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కారి్మకులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కలి్పంచాలని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్వీకే భవనంలో సాధారణ ప్రజల కోసం నిర్వహిస్తున్న క్లినిక్‌లోనే పని రోజుల్లో ఉదయం 10–12 గంటల మధ్య, సాయంత్రం 6–8 గంటల మధ్య డాక్టర్ అందుబాటులో ఉంటారని ఈ కమిటీ కార్యదర్శి ఎస్.వినయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ప్రజల నుంచి రూ.30 ఫీజు తీసుకుని వైద్యం చేస్తుండగా, ఆర్టీసీ కారి్మకుల కుటుంబాలకు కన్సల్టేషన్ ఫీజు లేకుండా ఒక కోర్సు మందులను కూడా ఉచితంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు మద్దతు కోరడంతోపాటు సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం బీజేపీ, టీజేఎస్ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీ, టీజేఎస్ నేతలను కోరామన్నారు. ఉద్యోగులను కూడా కలుస్తున్నామని, పెన్‌డౌన్ చేయాలని కోరుతామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఒక్క శాతం మంది కూడా జాయిన్ కాలేదన్నారు. జాయిన్ అయిన వారు 300 మంది కూడా లేరని, చేరిన వారిలో డ్రైవర్లు, కండక్టర్లు 20 మంది కూడా లేరన్నారు. కార్మికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటే కేంద్రం ఆమోదం అవసరమన్నారు. తమ డిమాండ్లలో విలీనం ఒక్కటే కాదని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలనే తదితర 26 రకాల డి మాండ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్లపై చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా బెదిరించినా కార్మికులు వెనక్కి తగ్గలేదన్నారు. కోకన్వీనర్లు వీఎస్‌రావు, సుధ మాట్లాడుతూ.. సీఎం గడువు పెట్టి డకౌట్ అయ్యారన్నారు. భయాందోళనకు గురికావద్దు మేడ్చల్ రూరల్: కార్మికులెవ్వరూ భయాందోళనకు గురికావద్దని, గట్టిగా నిలబడాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సూ చించారు. బుధవారం మేడ్చల్‌లో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయ డం ఎవరి తరం కాదన్నారు. సీఎం కేసీఆర్ వాస్తవా లు గ్రహించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం కోరారు. కాగా, మాజీ మంత్రి గీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ తదితరులు మేడ్చల్ డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె : ‘పెన్‌డౌన్ చేయాలని విఙ్ఞప్తి చేస్తాం..’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రకటలు చేసినా, మంత్రులు కార్మికులకు నచ్చజెప్పినా 300 మంది కూడా ఉద్యోగంలో చేరలేదని వెల్లడించారు. జాయిన్ అయినవాళ్లకు కూడా డ్యూటీలు వేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కార్మికులెవరూ భయపడొద్దు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే గుర్తింపు సంఘం ఆమోదం తీసుకోవాలనే చట్టముంది. చర్చల ప్రక్రియమొదలుపెట్టండని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’అన్నారు. కేసీఆర్ ఇష్టారాజ్యం కాదు.. ఉద్యోగ సంఘాలను కలిసి రేపో, ఎల్లుండో పెన్ డౌన్ చేయాలని విజ్ఞప్తి చేస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా దగ్గరికి ఆర్టీసీ ప్రతినిధులు వెళ్లి సమస్యను వివరించారని తెలిపారు. 33 రోజుల నుంచి సమ్మె కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమస్య పరిష్కరానికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే నడవదు. కోర్టులు ఉన్నాయి. మేం సెలక్షన్ ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్లం’అని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు ఉద్యోగాల్లో చేరడం లేదని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు అందరూ కలిసినా కార్మికులను ఉద్యోగంలో చేర్చలేకపోతున్నారని వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె న్యాయబద్ధమైందని రాజిరెడ్డి స్పష్టం చేశారు. -
ఆర్టీసీ సమ్మె: కేంద్రం అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని, కార్మికులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని తాము ఖండిస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. మంగళవారం జేఏసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘చర్చల ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారం చేసేది కాదు. 31శాతం కేంద్ర వాటా ఉంది. సంస్థను మార్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఎలాంటి మార్పు చేయలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. చట్టం ద్వారా కార్మికులకు రక్షణ ఉంటుంది. ఎవరూ భయపడవద్దు. ఏ ఒక్క కార్మికుడు జాయిన్ అవ్వడం లేదు. జాయిన్ అయిన వారు వెనక్కి వస్తున్నారు’ అని అన్నారు. భైన్సాలో తాత్కాలిక ఉద్యోగులు డీఎంపై దాడి చేయడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. ఇంతమంది కార్మికులు చనిపోతే ప్రభుత్వం తరఫున కనీసం సానుభూతి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తాము ఈ ఘటనను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి అనుచరుడు ఒకరు సిబ్బందిని తీసుకొని వెళ్ళి డిపో వద్ద దింపడం సిగ్గు చేటని విమర్శించారు. సమ్మెకు మద్దతుగా 7న పెన్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడుతామని, చలో ట్యాంక్ బండ్ విజయవంతం చేయమని కొరతామని జేఏసీ నేతలు వెల్లడించారు. -
ఆర్టీసీ సమ్మె : డిపో మేనేజర్‌పై ముసుగువేసి దాడి
సాక్షి, నిర్మల్ : విధుల్లోకి వెళ్తున్న భైంసా బస్ డిపో మేనేజర్ జనార్దన్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. ఆయనపై ముసుగు వేసి దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణ కాంత్ డిమాండ్ చేశారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 32వ రోజుకు చేరింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు విధించిన డెడ్‌లైన్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. (చదవండి : డిమాండ్లపై మల్లగుల్లాలు!) కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నామని, మంగళవారం నాటికి విధ్లుల్లోకి చేరాలని సీఎం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. లేనిపక్షంలో మిగిలిన 5 వేల రూట్లను కూడా ప్రైవేటుకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. పెద్దపల్లి జిల్లా కుచిరాజుపల్లిలో ఆర్టీసీ బస్సుపై దాడి జరిగింది. దుండగుల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. కరీంనగర్ నుంచి మంథని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డీఎంపై దాడితో మాకు సంబంధం లేదు : అశ్వత్థామరెడ్డి భైంసా డిపో మేనేజర్‌పై దాడితో ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. అధికారిపై దాడిని ఆర్టీసీ జేఏసీ ఖండిస్తోందని పేర్కొన్నారు. గత 32 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సమ్మెలో భాగంగా నేడు అన్ని డిపోల వద్ద మానవహారాలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు నేడు అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు. -
డిమాండ్లపై మల్లగుల్లాలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగింపుపై పట్టు వీడట్లేదు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే విధుల్లో చేరాలనే డిమాండ్ నుంచి తగ్గడం లేదు. మరోవైపు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈనెల 5 లోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ విధించిన గడువు నేటితో ముగియనుంది. డెడ్‌లైన్ దగ్గరపడటంతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలా.. వద్దా.. అనే నిర్ణయంపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులెవరూ విధుల్లో చేరకుండా వారికి ధైర్యం చేప్పేందుకు ఉపక్రమించారు. ఆర్టీసీ జేఏసీలో టీఎంయూ, ఈయూ సంఘాలుండగా.. వేరుగా ఉన్న ఎన్ఎంయూ నేతలు సైతం సమ్మె విచ్ఛిన్నం కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కార్మిక సంఘాలు సోమవారం వేర్వేరుగా అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. కార్మికుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొంతమందికి ఫోన్లు చేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మెజారిటీ కార్మికులు విలీనం డిమాండ్‌ను పక్కనపెడితే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడే ఏయే డిమాండ్ల నుంచి తగ్గాలనే దానిపై నిర్ణయానికి రావాలని సూచనలు చేసినట్లు తెలిసింది. అయితే కార్మికులెవరూ విధుల్లో చేరొద్దని, ధైర్యంగా ఉండాలని నేతలు చెప్పారు. విధుల్లో చేరిన వారిని సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు నేతలు చెప్పారు. కొన్నిచోట్ల విధుల్లో చేరిన వారు కూడా తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. డిమాండ్లు సాధించుకునే దిశగా సమ్మెను కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. కాగా, ఇప్పటివరకు 24 మంది కార్మికులు విధుల్లో చేరినట్లు తెలిసింది. యథావిధిగా సమ్మె: అశ్వత్థామరెడ్డి సమ్మె పట్ల ఆర్టీసీ కార్మికులు సానుకూలంగా ఉన్నారని, కార్మికుల మద్దతుతోనే ఇంత పెద్ద ఉద్యమం జరుగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. సీఎం డెడ్‌లైన్ విధించినా కార్మికులెవరూ విధుల్లో చేరట్లేదని స్పష్టం చేశారు. 11 మంది చేరినా వారిలో ఐదుగురు మళ్లీ వెనక్కి వచ్చారని తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం జరి గింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జేఏసీని చర్చలకు ఆహ్వానించి 26 డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు మరోసారి విన్నవించుకుంటున్నట్లు తెలిపారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, భేషరతుగా విధుల్లో చేరడానికి కార్మికులు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. 31 రోజులుగా సమ్మె జరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా అనేకమంది కార్మికులు గుండెపోటుతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 5న అన్ని డిపోల వద్ద మానవహారాలు, 6న కుటుంబసభ్యులతో దీక్ష, తాత్కాలిక సిబ్బందికి విన్నపం, 7న ప్రజా సంఘాల ప్రదర్శన, 9న చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో 11 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కోకన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ ఎన్ని హెచ్చరికలు చేసినా సమ్మెను కొనసాగిస్తున్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులందరూ డెడ్‌లైన్, డిడ్‌లైన్ జాన్తా నై అంటున్నారని పేర్కొన్నారు. చర్చలకు ఆహ్వానించాలి ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. సోమవారం డిపో, రీజనల్, జోనల్, రాష్ట్రస్థాయి నేతలతో వేర్వేరుగా సమావేశం నిర్వహించింది. సుదీర్ఘ చర్చల తర్వాత రెండు అంశాలపై తీర్మానాలు చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రభుత్వం తక్షణమే చర్చలకు ఆహ్వానించాలని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలని తీర్మానించినట్లు ఎన్ఎంయూ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 6531 బస్సులు తిప్పాం: ఆర్టీసీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 6,531 బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 4,620 బస్సులు ఆర్టీసీ సంస్థకు చెందినవి కాగా, 1,911 బస్సులు ప్రైవేటువి. 410 బస్సులను టికెట్ల ద్వారా నిర్వహించగా.. 5815 బస్సుల్లో టిమ్ మెషీన్ల ద్వారా టికెట్లు ఇచ్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. -
సమ్మె విరమించే ప్రసక్తే లేదు
-
కేసీఆర్ ప్రకటనపై స్పందించిన జేఏసీ
సాక్షి, హైదరాబాద్: మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్ ఆశ్వాత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని, డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తమ సమస్యల పరిష్కారంపై హామీ రాలేదని అన్నారు. సమావేశం అనంతరం జేఏసీ నేతలు మాట్లాడారు. సీఎం డెడ్ లైన్లు పెట్టడం కొత్తకాదని, కోర్టులను సైతం సీఎం డిక్టేట్ చేస్తున్నారని విమర్శించారు. తొలుత చర్చలు జరిపి కార్మికులకు డెడ్ లైన్లుపెట్టాలని అన్నారు. ఉద్యోగాలు తీసే అధికారం సీఎంకు లేదని, డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో కూడా రిజర్వేషన్లు అమలు ఉన్నాయని, ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్లకు బుగ్గ కారులో తిరగాలని సోకు లేదని, కార్మికుల డిమాండ్ల కోసమే యూనియన్లు పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికులు నా బిడ్డలు అనుకుంటూనే కేసీఆర్ వారిని ఇబ్బంది పెడ్తున్నాడని మండిపడ్డారు. ఎవరో ఇద్దరు ముగ్గురు పిరికివాళ్లు ఉద్యోగంలో చేరుతున్నారని, కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు. భేటీ సందర్భంగా జేఏసీ నేతలు భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. -
5న సడక్ బంద్.. 9న చలో ట్యాంక్‌బండ్
సాక్షి, హైదరాబాద్ (సుందరయ్య విజ్ఞానకేంద్రం): సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. నాలుగు కోట్ల మంది ప్రజల రవాణాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. శనివారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ విడిపోలేదని, అందువల్ల సీఎం తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలు చెల్లవని పేర్కొన్నారు. తమ కార్యాచరణలో భాగంగా ఢిల్లీ వెళ్లి ఈనెల 4, 5వ తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతిపత్రం సమరి్పంచనున్నట్టు వెల్లడించారు. సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. సీఎం మొండి వైఖరి విడనాడాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సీఎం నిర్ణయాలు చెల్లవు: కోదండరాం ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఇంకా విడిపోనందున ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు చెల్లవని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. సర్కారు ప్రకటనలకు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కోర్టును ధిక్కరించే ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. అసలు సీఎంకు చట్టం గురించి తెలుసా అని ప్రశ్నించారు. సంస్థను ప్రైవేటుపరం చేసే అధికారం ఆయనకు లేదని పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. సీఎంకు కారి్మక చట్టాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కోర్టుకు సైతం తప్పుడు నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి, వాటి ఆస్తులను అమ్ముకునే కుట్రలో భాగంగానే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు. ఇదీ జేఏసీ కార్యాచరణ... మృతిచెందిన కార్మికులకు సంతాపంగా 3న అన్ని డిపోలు, మండలాలు, నియోజకవర్గాల్లో సమావేశాలు 4న రాజకీయ పార్టీలతో కలసి అన్ని డిపోల వద్ద ధర్నాలు 5న సడక్ బంద్‌లో భాగంగా రహదారుల దిగ్బంధనం 6న అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మిక కుటుంబాల నిరసన 7న అన్ని ప్రజా సంఘాలతో ప్రదర్శనలు 8న చలో ట్యాంక్‌బండ్ ముందస్తు సన్నాహక కార్యక్రమాలు 9న చలో ట్యాంక్‌బండ్, సామూహిక నిరసనలు -
ఆర్టీసీ సమ్మె : రేపట్నించి 9వరకూ నిరసనలు
-
అమిత్ షా వద్దకు ఆర్టీసీ పంచాయతి
-
అమిత్ షా వద్దకు ఆర్టీసీ పంచాయితి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. విద్యానగర్‌లోని ఎంప్లాయిస్ యూనియన్‌లో ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలతో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలువనున్నట్లు తెలిపారు. కార్మికులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయనతో చర్చిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈనెల 4 లేదా 5వ తేదీలలో అమిత్ షాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది చెల్లుబాటు కాదని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అలాగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. భవిష్యత్తు కార్యచరణ ప్రకటన.. 3న అన్ని డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం 4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్ష 5న సడక్ బంద్ రహదారుల దిగ్బంధం 6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు నిరసన 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్ష 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు 9న ట్యాంక్ బండ్ పై దీక్ష, నిరసన కార్యక్రమాలు -
ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లక్ష్మణ్ నివేదిక
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశాలు అందటంతో ఆయనకు శనివారం హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 29వ రోజుకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన కలవనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. అలాగే ఎంపీ బండి సంజయ్ విషయంలో పోలీసుల ఓవరాక్షన్‌పై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. తాజా పరిణామాలతో లక్ష్మణ్ వెంటనే ఢిల్లీ రావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆయన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు శనివారం ఉదయం కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై లక్ష్మణ్‌తో చర్చించారు. మరోవైపు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి వీ హనుమంతరావు (కాంగ్రెస్), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), మోహన్ రెడ్డి (బీజేపీ) ఎంఎల్ పార్టీ నేత పోటు రంగారావు, ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి వీఎస్ రావు తదితరులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆర్టీసీ సమ్మె సహా మరో 30 అంశాల ఎజెండాపై చర్చించనుంది. ఆర్టీసీ సమ్మె 29 రోజులకు చేరిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది. చదవండి: ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు? -
సంపూర్ణంగా ఆర్టీసీ సమ్మె..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోందని ఆ సంస్థ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు, సర్వైజర్లు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీకి రూ.1099 కోట్లు రావాల్సి ఉందన్నారు. 2014 నుంచి రావాల్సిన రూ.1500 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ చెల్లింపులపై అఫిడవిట్ వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్మికులు ఎవ్వరూ అధైర్య పడొద్దని కోరారు. కాగా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. -
గంట లేటుగా వచ్చామనడం అబద్ధం..
సాక్షి, హైదరాబాద్: సమ్మె వల్ల ఆర్టీసీ కుటుంబాలు పండుగలు జరుపుకోకపోవడం బాధాకరమని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఇవాళ్టికి టీఎంయూ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. యూనియన్ను బలోపేతం చేయడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. సమ్మెలో పుట్టిన టీఎంయూ యూనియన్ మళ్లీ సమ్మెలోనే ఎనిమిదో ఆవిర్భావాన్ని పూర్తి చేసుకోవడం దురదృష్టకరం. టీఎంయూ జెండా రంగు కూడా మార్చాం. నిన్న చర్చలు నిర్బంధ కాండ మధ్య జరిగాయి. మేము గంట ఆలస్యంగా వచ్చామనడంలో వాస్తవం లేదు. ముందే చెప్పాం....మధ్యాహ్నం 2.15 గంటలకు వస్తామని. సీనియర్ ఐఏఎస్ అధికారులే ఆలస్యంగా వచ్చారు. అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తాం. 29న బహిరంగ సభ కోసం సన్నాహాలు చేస్తున్నాం. 30న జరిగే సకలజనుల సమరభేరీ విజయవంతం అవుతుంది. సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. సమ్మెకు మద్దతుగా ఎన్నారైల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తాం.’ అని తెలిపారు. కాగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 23వ రోజు కూడా కొనసాగుతోంది. చదవండి: లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం.. -
ఆర్టీసీ చర్చలు : ‘అందుకే బయటికి వచ్చేశాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కోర్టు ఉత్తర్వులు అమలు చేశామని చెప్పడానికే చర్చలు పెట్టారని, సమస్యల పరిష్కారం కోసం కాదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్బంధంగా చర్చల ప్రక్రియ కొనసాగింది. మా మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు ఆహ్వానించారు. కోర్టు తీర్పును వక్రీకరించి 21 అంశాలపైననే చర్చిస్తామని యాజమన్యం స్పష్టం చేసింది. పూర్తి డిమాండ్లపై చర్చలు జరపాలని మేము పట్టుబట్టాం. 26 డిమాండ్లపై చర్చలు జరపాలని అన్నాం. యాజమాన్యం మా మాటల్ని పట్టించుకోలేదు. అందుకే బయటికి వచ్చేశాం. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. మా డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా వెళ్తాం’అన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 22వ రోజుకు చేరింది. -
అశ్వత్థామరెడ్డిపై కేసు పెట్టిన డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 21వ రోజు కూడా కొనసాగింది. సీఎం కేసీఆర్ ప్రకటన తో కార్మికుల్లో కొంత గందరగోళం నెలకొన్నా శుక్రవారం కూడా కార్మికులు ఉధృతంగానే నిరసనలు వ్యక్తం చేశారు. కొందరు కార్మికులు డిపో మేనేజర్లకు ఫోన్ చేసి విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో జేఏసీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎవరూ విధుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. కూకట్పల్లి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కోరేటి రాజు విధుల్లో చేరుతున్నట్లు లిఖిత పూర్వకంగా డీఎంకు దరఖాస్తు సమర్పించి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందంటూ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హన్మకొండ ఏక శిలా పార్కులో కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భూపాలపల్లిలో విద్యా సంస్థలకు వెళ్లి కార్మికులు విద్యార్థుల మద్దతు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిల పక్షనేతలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మద్దతు ఇస్తూ నల్లగొండ డిపో వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటలో ఆర్టీసీ జేఏసీ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్, సీఐటీయూ నేతలు కొత్త బస్టాండ్ వద్ద సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఖమ్మం బస్టాండ్ వద్ద జేఏసీ, అఖిలపక్ష నేతలు నిరసన దీక్ష చేపట్టారు. నార్కట్‌పల్లి డిపో డ్రైవర్ జమీల్ గుండెపోటుతో మృతి చెందటంతో ఆయన మృతదేహంతో డిపో వద్ద కార్మికులు ధర్నా చేశారు. మృతుడి కుటుంబసభ్యులకు చెరుకు సుధాకర్ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. దామరచర్ల మండలం నర్సాపురంలో రమావత్ దీప్లా అనే డ్రైవర్ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో కార్మికుల నిరసన కార్యక్రమాల్లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. అలాగే శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వంటావార్పు.. సంగారెడ్డి బస్టాండ్ వద్ద వంటా వార్పు చేపట్టారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్‌లో కార్మికులు ర్యాలీ నిర్వహించి నిరాహారదీక్షలో పాల్గొన్నారు. సిద్దిపేట డిపో వద్ద ఏర్పాటు చేసిన నిరసనసభలో సీపీఐ నేత చాడవెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ మంకమ్మ తోటలో బస్సుల కోసం ఎలగందుల స్కూల్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మెట్పల్లి డిపోవద్ద కార్మికులు చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట గోదావరిఖని డిపో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. 30న సభకు జనసమీకరణపై దృష్టి ఈ నెల30 సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన జేఏసీ.. జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందుకు రాజకీయ పార్టీల సాయాన్ని కోరింది. కార్మికుల కుటుంబసభ్యులతో పాటు సాధారణ ప్రజలు, పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు శుక్రవారం మధ్యాహ్నం జేఏసీ నేతలు బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతర నేతలతో చర్చించారు. జన సమీకరణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ భేషజాలకు పోతున్నందున అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా జన సమీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. సరూర్‌నగర్ బహిరంగ సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొనేలా జేఏసీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతించకపోతే హైకోర్టును ఆశ్రయించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన అశ్వత్థామరెడ్డి రంగంలోకి విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అడ్డు కున్నా శుక్రవారం రాత్రి విద్యార్థులు భారీ బహి రంగ సభ నిర్వహించారు. మధ్యాహ్నం నుంచే సభకు ఏర్పాట్లు జరిగినా అనుమతిలేదంటూ పోలీసులు మైకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరుకావటం జేఏసీకి ఉత్సాహాన్నిచ్చింది. ఇకపై ఉద్యమాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు. 72 శాతం బస్సులుతిప్పాం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎక్కువ సంఖ్య(72 శాతం)లో బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ప్రకటించింది. శుక్రవారం 6,519 బస్సులు తిప్పామని, ఇందులో ఆర్టీసీ బస్సులు 4591 ఉండగా, ఆర్టీసీ అద్దె బస్సులు 1,928 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. -
‘బాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెపై నాతో చర్చించారు. 20 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే.. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు ఓడిపోతే ప్రెస్ నోట్ లేదు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓడిపోయినప్పుడు కూడా మీడియా సమావేశం పెట్టలేదు. కానీ, ఉపఎన్నికలో గెలిచిన అనంతరం గంటసేపు మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి ఉప ఎన్నికల ఫలితాల్ని ఎన్నో ప్రభుత్వాలు చూశాయి. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఓ గెలుపేనా. కులానికి, మతానికో నాయకున్ని పెట్టి.. అధికార దుర్వినియోగంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆర్టీసీ సమ్మెకు హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధమేంటి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచినా.. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమైంది. రేపు మీకూ అదే గతి పడుతుంది. రాజకీయాలు ఉంటే చూసుకుందాం. కానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా కార్మికుల మీదనా మీ ప్రతాపం. కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారు. అందుకనే ఉద్యమం మీద భాజపా కన్నేసింది. ముఖ్యమంత్రి మాటలకు ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. భవిష్యత్ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి భాజపా అండగా ఉంటుంది’అని అన్నారు. ఎత్తుగడల్లో భాగమే కేసులు : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ‘ముఖ్యమంత్రి ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఏ ఒక్క కార్మికుడు విధుల్లో చేరలేదు. కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే. ఈనెల 30న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే సకల జనుల సమర భేరికి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యుడని కేసులు పెట్టారు. నాపై కేసులు ఎత్తుగడల్లో భాగమే. కేసులకు భయపడను. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాం’అన్నారు. -
ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆర్టీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ కూకట్పల్లి పోలీస్స్టేన్లో ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లికి డిపోకి చెందిన డ్రైవర్ రాజు తన ఫిర్యాదులో అనేక విషయాలు పేర్కొన్నాడు. అశ్వత్థామరెడ్డి విలీనం అనే విషాన్ని కార్మికుల్లో నింపారని, 22 రోజులుగా చేస్తున్న సమ్మె వల్ల పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని రాజు తెలిపాడు. కాగా, ఆర్టీసీ డ్రైవర్ రాజు రాసిన లేఖలో సారాంశం ఈ విధంగా ఉంది. ' అయ్యా ! నా పేరు రాజు. నేను కూకట్పల్లి డిపో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. సార్ మా యూనియన్ లీడర్ అశ్వత్థామరెడ్డి కార్మికుల మనసులో విలీనం అనే విషాన్ని నింపారు. ఆయన మాటలు నమ్మి 22 రోజులుగా జరుగతున్న ఆర్టీసీ సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వీరి ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డే ప్రధాన కారకుడు. ఇక ముందు ఇలాంటివి జరగకూడదనే అశ్వత్థామరెడ్డి పై ఫిర్యాదు చేశాను. అంతేగాక ఒకప్పుడు ఆర్టీసీకి పెద్దన్నలా వ్యవహరించిన హరీష్ రావును కొందరు పనికిమాలిన వాళ్లు ' మీరు మౌనంగా ఉండొద్దు, నోరు విప్పాలి అంటూ' ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు సమ్మె విషయం హరీష్ రావుతో చర్చించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు చేస్తున్న సమ్మె వల్ల పోలీసుల సహాయం లేకుండా బస్సులు రోడ్డు మీదకు వెళ్లడం లేదు. మా చేతులతో మేమే ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నాం. గురువారం మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె మాట పక్కనబెట్టి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇది నిజంగా మనకు గొప్ప అవకాశం. మన ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దు. అశ్వత్థామరెడ్డి మీరు ఒక్కరే పీఎం, రాష్ట్రపతి వద్దకు వెళ్లి మా సమస్యలు పరిష్కరించండి. అంతేగానీ మా కార్మికుల పొట్ట గొట్టద్దు’ అని ఆ ఫిర్యాదులో వెల్లడించాడు. -
అలా అయితే ఇప్పుడే ఆర్టీసీ సమ్మె విరమిస్తాం..
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తీవ్రంగా ఖండించారు. టీఎంయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..‘సీఎం ప్రెస్మీట్లో వెటకారం మాటలు, అహంకార పూరిత వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగవు. ఆర్టీసీపై కేసీఆర్ ఎన్నో ఆరోపణలు చేశారు. సంఘాలు కార్మికుల హక్కుల కోసం ఉంటాయి. కార్మికులు స్వచ్ఛందంగా చేస్తున్న సమ్మె ఇది. సమ్మె కొనసాగుతుంది. మా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై పక్క రాష్టాన్ని కూడా చులకన చేసి మాట్లాడటం సరికాదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. చదవండి: ఆర్టీసీ మూసివేతే ముగింపు రాజకీయ పార్టీలకు అయిదేళ్లకు ఓసారి ఎన్నికలు ఎలా వస్తాయో... ప్రతి రెండేళ్లకు ఒకసారి కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతాయి. కార్మిక చట్టాన్ని కేసీఆర్ ఒకసారి చదివి అవగాహన చేసుకోవాలి. ప్రయివేట్ బస్సులను కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిప్పితే తెలుస్తుంది. దూరప్రాంత ఆర్టీసీ బస్సులు కూడా లాభాల్లో ఉన్నాయి. సమ్మెను రాజకీయ కోణంలో కాకుండా కార్మికుల కోణంలో చూడాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మిక సంఘాలే ఉండవు. కరీంనగర్లో చెప్పిన మాటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉండాలి. సమ్మె విరమించి కార్మికులు విధులకు హాజరు కావాలని కేసీఆర్ నిన్న చెప్పినా...ఇప్పటివరకూ ఎవరూ విధుల్లో చేరలేదు. మా స్వార్థం కోసం పెట్టిన ఒక్క డిమాండ్ అయినా ఉంటే...ఇప్పడే సమ్మె విరమిస్తాం. ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే మా డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె కొనసాగుతుంది.’ అని స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం: రాజిరెడ్డి ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. అద్దె బస్సులు లాభాల్లో నడిస్తే ఏడాది చివరికి ఎందుకు నష్టాలు చూపిస్తున్నాయి. కార్మికులకు రూ.50వేల జీతం వస్తుందని ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజారవాణా సంరక్షణ కోసమే కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే ఉంటే సమ్మె కొనసాగుతుంది. సీఎం తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడొద్దు. ప్రయివేట్ ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు మా పోరాటానికి సంబంధం లేదని అన్నారు. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. సమ్మె విషయంలో ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చినవన్నీ అబద్ధాలేనని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 60శాతం మాత్రమే ఐఆర్ ఇచ్చారన్నారు. ఉన్న నష్టాలకు సంబంధం లేకుండా సీఎం భారీగా చూపించారని, 3వేల కోట్లు అప్పులు ఉంటే వేలకోట్లు ఉన్నాయి అని ఎలా మాట్లాడతారని సూటిగా ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా ఈక్విటీ రూపంలో ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు, అప్పులపై యాజమాన్యంతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్మికులు, కార్మిక సంఘాల మధ్య ప్రభుత్వం విభేదాలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది తమ ఉద్యోగాలు తీయించడానికేనా అని ప్రశ్నలు సంధించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 22వ రోజు కూడా కొనసాగుతోంది. -
ఇది కార్మికుల సమ్మె:అశ్వత్ధామరెడ్డి
-
సర్కారు దిగొచ్చే వరకు..
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ స్పష్టంచేసింది. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం 20వ రోజుకు చేరుకుంది. అయితే, సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కార్మికుల్లో ఆందోళన రేగింది. దీంతో జేఏసీ నేతలు రంగంలోకి దిగి ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అక్కడి కార్మికులతో సమావేశం నిర్వహించి ఆందోళన విరమించుకోవద్దని పేర్కొనగా, హైదరాబాద్‌లో ఉన్న జేఏసీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్మికులకు సూచనలు చేశారు. కార్మికుల రక్షణకు హైకోర్టు జోక్యం చేసుకుంటుందని, కోర్టు ఉన్నాక అన్యాయం జరిగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీకి రూ.4,250 కోట్లు ఇచ్చినట్టు చెప్పిన మాటల్లో నిజం లేదని, కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చారని స్పష్టంచేశారు. ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయం.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో సమ్మె కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రాస్తారోకోలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు పేర్కొన్న జేఏసీ.. దాని బదులు ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలకు వెళ్లి సమ్మెకు దారి తీసిన పరిస్థితులను విద్యార్థులకు వివరించి వారి మద్దతు కూడగట్టుకోవాలని నిర్ణయించింది. మరోవైపు గురువారం కూడా అన్ని డిపోల ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. ఉదయం వేళ కొన్ని బస్సులను అడ్డుకున్నా, పోలీసుల జోక్యంతో అవి రోడ్డెక్కాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తిప్పుతున్నా, హైదరాబాద్‌లో మాత్రం వాటి జాడే కనిపించకపోతుండటం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బస్సుల్లేక సకాలంలో విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నామని పేర్కొంటూ ఆందోళనలు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద కొందరు ప్రయాణికులు రోడ్డుపై నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గురువారం 6,395 బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,290 బస్సుల్లో టికెట్ల జారీ యంత్రాలు వినియోగించారని, 1531 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని అధికారులు పేర్కొన్నారు. రేపు ఎండీకి కమిటీ నివేదిక.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో ఆర్టీసీ ఎండీ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఉన్నతాధికారుల కమిటీ రెండు రోజులపాటు చర్చించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగిలిన 21 డిమాండ్లపై సూచనలు సిద్ధం చేసింది. అనంతరం గురువారం సాయంత్రం ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మతో కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా నివేదికలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది. శనివారం తుది నివేదికను ఎండీకి అందజేయనుంది. -
ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం
-
కేసీఆర్ వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ కౌంటర్
సాక్షి, మహబూబ్‌నగర్ : ‘ఆర్టీసీ సమ్మెకు ముగింపు లేదు.. ఆర్టీసీయే ముగుస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సమ్మెలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ మహిళా కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని గురువారం అశ్వత్థామరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతి రథచక్రాలు.. ప్రగతి భవన్‌ను తాకకముందే సమస్యలు పరిష్కంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, కార్మికులు ఎవరు ఆందోళన చెందొద్దన్నారు. ఆర్టీసీ సమ్మెకు ప్రగతి భవన్‌లోనే పరిష్కారం ఉందన్నారు. పేద రాష్ట్రం ఏపీలో కార్మికులను ప్రభుత్వం విలీనం చేస్తే, ధనిక రాష్ట్రంలో ఎందుకు వీలినం చేయారని ప్రశ్నించారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆర్టీసీ ఉంటుందని వ్యాఖ్యానించారు. -
ఆర్టీసీ సమ్మె : అధ్యయన కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన ఈడీ అధికారుల కమిటీ బస్ భవన్లో బుధవారం సమావేశమైంది. సీఎం ఆదేశాలతో కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీనిలో భాగంగా రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా రేపు లేదా ఎల్లుండి ఆర్టీసీ కార్మిక నాయకులతో చర్చలు జరుపనున్నారు. రెండు రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదిక సారాంశాన్ని 28న జరిగే విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు వివరించనుంది. (చదవండి : కార్మికుల డిమాండ్లపై కేసీఆర్ కీలక ఆదేశాలు) ఇక విలీనం మినహా మిగతా 21 డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంతో.. చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు ‘విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదు’ అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొనడం గమనార్హం. సమ్మెలో భాగంగా బుధవారం దిల్సుఖ్ నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’అని వ్యాఖ్యానించారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 19వ రోజుకు చేరింది. -
విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం దిల్సుఖ్ నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లపై చర్చలకు రావాలి. కార్మికులు, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. కార్మికులను గందరగోళంలోకి నెట్టొద్దు’ అని అన్నారు. 2004లో టీడీపీ ఓటమికి ఆర్టీసీ సమ్మె కారణమని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. తాము ప్రతిపాదించిన 26 డిమాండ్లు తమకు ప్రాధాన్యమే అని అన్నారు. ధనిక రాష్ట్రంలో ధనం ఏమైందని, అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం ఎలా చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. కార్మికులను, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు, ఆర్టీసీ సమ్మెకు సంబంధం లేదని, కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని సూచించారు. టీఎంయూ కార్మిక సంఘం జెండా రంగు మార్చాల్సిన అవసరం వచ్చిందన్నారు. గులాబీ జెండా మోసింది తామేనని అన్నారు. కంటితుడుపు కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని పక్కనపెట్టి మిగిలిన 21 డిమాండ్లను పరిశీలించా లని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించేలా చూడాలంటూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఆ నివేదిక అందిన తర్వాత చర్చలపై ప్రభుత్వం తుది నిర్ణ యం తీసుకోనుంది. ఈనెల 28న జరిగే విచారణలో హైకోర్టుకు అదే విషయాన్ని నివేదించనున్నారు. ఈ నేపథ్యంలో బస్ భవన్లో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. -
ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. సోమవారం 17వ రోజు రాష్ట్రవ్యా ప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేశారు. బస్ డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడపడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. వేతనాలు లేక ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని, తమ ఆవేదన అర్థం చేసుకోవాలంటూ తాత్కాలిక డ్రైవర్లు, కం డెక్టర్లను వేడుకున్నారు. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ సర్కారుపై మండిపడ్డారు. కరీంనగర్–1 డిపోకు చెందిన డ్రైవర్ జంపన్న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలుపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మిక వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. విద్యార్థుల అవస్థలు.. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. 24 రోజుల సెలవుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికుల తాకిడికి తగినట్టుగా బస్సులు నడపాలని ప్రభుత్వం ఆరీ్టసీని ఆదేశించింది. ఈ క్రమంలో రోజువారీగా నడిపిన వాటి కంటే ఎక్కువ నడపాల్సి ఉండగా.. అధికారులు మాత్రం విఫలమయ్యారు. తక్కువ బస్సులే రోడ్డెక్కడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ పరిధిలో 2 వేల బస్సులు నడపాలని ఆర్టీసీ భావించింది. అయితే, కేవలం 859 బస్సులు మాత్రమే నడపగలిగారు. అవి కూడా సమయానుకూలంగా నడవలేదు. ఫలితంగా గంటల తరబడి వేచి చూడాల్సి వచి్చంది. విద్యార్థుల బస్ పాస్‌లను అన్ని బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఆదేశించినప్పటికీ చాలాచోట్ల పాసులను అనుమతించలేదు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 6,276 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది. గవర్నర్‌ను కలిసిన ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, బీఎస్ రావు, సుధ తదితరులు సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్‌కు వివరించారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, చర్చలు జరిపేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు. సమ్మె జరుగుతున్న సమయంలో అద్దె బస్సులు పెంచేలా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పరిస్థితిని వివరించారు. తమ వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. ఎంజీబీఎస్‌లో అఖిలపక్షం ధర్నా.. సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖ రికి నిరసనగా సోమవారం హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆర్టీసీ జేఏసీ కనీ్వనర్ అశ్వత్థామరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వీహెచ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. నూరు శాతం బస్సులు నడపాలి నూరుశాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కండక్టర్లు ప్రయాణికులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేయాలని, బస్సు పాసులను అనుమతించాలని స్పష్టంచేశారు. కండక్టర్లకు టిమ్ మెషీన్లు ఇవ్వాలని సూచించారు. అవసరాన్ని బట్టి బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్‌లు, ఎల్రక్టీíÙయన్లను నియమించుకోవాలని ఆదేశించారు. -
ఆర్టీసీ సమ్మె : గవర్నర్‌ను కలిసిన జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశారు. సమ్మెపై చర్చించాలన్న హైకోర్టు వ్యాఖ్యలు, ప్రభుత్వం చర్చలను ఆహ్వానించకపోవడం, వేతనాలు లేక కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని ఆమెకు వివరించారు. గవర్నర్‌ను కలిసినవారిలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి, వీ.ఎస్.రావు తదితరులు ఉన్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం అశ్వత్థమారెడ్డి రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్టీసీని లాకౌట్ చెయ్యడానికి ఎవ్వరికి అధికారం లేదు. ఆర్టీసీ ఆస్తులు కార్మికుల ఆస్తులు. ఆర్టీసీపై కన్నేసి ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోంది. లాకౌట్ చేస్తా అంటే భయపడే ప్రస్తకే లేదు. లాకౌట్ చేసేందుకు సీఎం ఎవరు. సమ్మె డిమాండ్లపై నివేదిక ఇచ్చాము. బోర్డ్ అనుమతి లేకుండా సమ్మెలో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా అద్దె బస్సులకు టెండర్లకు పిలిచారని చెప్పాము. ఆర్టీసీ కార్మికులు దైర్యంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. జేఏసీ కార్యాచరణ విజయవంతం అయింది. మా మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు. జూబ్లీ బస్ స్టేషన్ లో రేపు వంటావార్పు కార్యక్రమం ఉంటుంది’అన్నారు. -
ఆర్టీసీ సమ్మె : గవర్నర్‌ను కలిసిన జేఏసీ నేతలు
-
4 లక్షల మందితో సకల జనుల సమర భేరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిన నేపథ్యంలో సమ్మె మలిదశ కార్యాచరణ పటిష్టంగా ఉండేలా చూడాలని ఆర్టీసీ కార్మికులు సంఘాల జేఏసీ తీర్మానించింది. సమ్మెపై హైకోర్టులో జరిగే తదుపరి విచారణ వరకు ఉధృతంగా నిరసనలు కొనసాగించాలని ఆదివారం జరిగిన రాజకీయ అఖిలపక్ష నేతలతో సమావేశంలో నిర్ణయించింది. దీనికి సంపూర్ణ మద్దతు అందిస్తామని రాజకీయ పార్టీలు కూడా తేలి్చచెప్పాయి. సమ్మె కార్యాచరణలో భాగంగా ఈ నెల 30న కనీసం 4 లక్షల మందితో సకల జనుల సమర భేరీ పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో 3 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, మరో లక్ష మంది సాధారణ ప్రజలు హాజరయ్యేలా రాజకీయ పారీ్టలతో కలసి జనసమీకరణ జరపాలని నిశ్చయించారు. ఈలోగా ఇతర నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నారు. అఖిలపక్ష భేటీలో ఎవరేమన్నారంటే... కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవించకపోవడం దారుణం. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు. దానికి మద్దతు ఇస్తున్నట్టుగా పోలీసులు దమనకాండను కొనసాగిస్తున్నారు. ప్రజలు మా ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఆరీ్టసీని విధ్వంసం చేసే కుట్రను అడ్డుకొని ప్రజారవాణా సంస్థను కాపాడుకునేందుకు సహకరించాలి.– ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ కార్మికుల వెంట నడుస్తాం ఆర్టీసీ కార్మికులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాల్లో మా నేతలు పాల్గొంటారు. ప్రజాప్రతినిధుల ములాఖత్‌లో మేమూ పాల్గొంటాం. వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), ఎస్.వెంకటేశ్వరరావు (న్యూడెమొక్రసీ) ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ఆర్టీసీ పరిరక్షణకు నడుంబిగించాలని కోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం విడ్డూరం. ఆర్టీసీ ఆస్తులు, అప్పులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పౌరసమాజం మద్దతు ఉంది. – ఎల్.రమణ, టీడీపీ కోర్టు తీర్పును గౌరవించాలి. కోర్టు ఆదేశాన్ని గౌరవించి కారి్మకులను ప్రభుత్వం చర్చలకు పిలవాలి. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఆర్టీసీ జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – కోదండరాం, టీజేఎస్ పుస్తకాలు చదివి నేర్చుకున్నదిదేనా? వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే ముఖ్యమంత్రి నేర్చుకున్నది ఇదేనా? ప్రజలు శక్తిమంతులు, వారి ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టమంటూ హైకోర్టు వ్యాఖ్యానించినా కేసీఆర్ పెడచెవిన పెట్టడం వల్ల ఆయనకే నష్టం. – డాక్టర్ చెరుకు సుధాకర్, ఇంటి పార్టీ న్యాయవ్యవస్థపై గౌరవం లేకుంటే ఎలా? న్యాయవ్యవస్థపైనా ప్రభుత్వానికి గౌరవం లేకుంటే ఎలా? ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా చర్చలకు ఎందుకు పిలవట్లేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని అక్కడి ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే మిగుల బడ్జెట్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తోంది. – మంద కృష్ణమాదిగ . మలిదశ సమ్మె కార్యాచరణ ఇలా.. నేడు అన్ని డిపోల వద్ద కారి్మకుల కుటుంబ సభ్యులు బైఠాయించి దీక్షలు. 22న అద్దె బస్సుల డ్రైవర్లు, యజమానులు, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు (ఇక నుంచి విధులకు హాజరు కావద్దని, తమ పొట్ట కొట్టొద్దని) విన్నపాలు. 23న మండలస్థాయి ప్రజాప్రతినిధులు మొదలు ఎంపీల వరకు కలసి ఆర్టీసీ పరిస్థితిపై వివరణ. 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు సహా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ మహిళా ఉద్యోగుల నిరాహార దీక్షలు. 25న ప్రజాసంఘాలు, సాధారణ ప్రజలతో కలసి రాస్తారోకోలు. 26న ఆర్టీసీ కారి్మకుల పిల్లల ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు. 27న దీపావళి వేడుకలకు దూరం. కొన్ని పారీ్టల నేతలు మాత్రం కార్మికుల కుటుంబాలను తమ ఇళ్లకు ఆహా్వనించి వారితో కలిసి దీపావళి జరుపుకోనున్నట్టు ప్రకటించారు. 28న (సోమవారం) సమ్మెపై హైకోర్టులో ఒకవైపు వాదనలు కొనసాగిస్తూనే మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగింపు. 30న సకల జనుల సమర భేరీ బహిరంగ సభ నిర్వహణ. -
ఆర్టీసీ జేఏసీ మరో కీలక నిర్ణయం
-
సమ్మె: ఆర్టీసీ జేఏసీ మరో కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై పొలిటికల్ జేఏసీతో ఆదివారం ఆర్టీసీ జేఏసీ భేటీ అయింది. ఆర్టీసీ సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం మరోసారి గవర్నర్ తమిళసైని కలువాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. 16వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌ను కోరాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఆర్టీసీ జేఏసీ మరోసారి సమావేశమవుతుందని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించేవరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఇదే పొలిటికల్ జేఏసీతో భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 21న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించనున్నారు. 22న మా పొట్టకొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు. 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని, సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. 24న మహిళా కండక్టర్ల దీక్ష, 25న హైవేలు, రహదారులపై రాస్తారోకోలు చేపట్టనున్నారు. 26న ప్రభుత్వం మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేప్టనున్నారు. 27న పండగ సందర్భంగా జీతాలు లేకపోవడంవల్ల నిరసన, 28న సమ్మెపై హైకోర్టు విచారణ సందర్భంగా విరామం. ఇక, ఈ నెల 30న 5లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. -
స్పందించకుంటే సమ్మె ఉధృతం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశం ప్రకారం ప్రభుత్వం ఇప్పటికైనా తమతో చర్చల ప్రక్రియ ప్రారంభించాలని ఆర్టీసీ కార్మికుల జేఏసీ డిమాండ్ చేసింది. కోర్టు చెప్పినా స్పందించకపోవడం సరికాదని పేర్కొంది. ప్రజలంతా ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని, శనివారం రాష్ట్ర బంద్‌ను వారు విజయవంతం చేసిన తీరును ప్రభుత్వం గుర్తించాలని సూచించింది. శనివారం సాయంత్రం జేఏసీ ప్రతినిధులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ తదితరులు, కార్మిక ప్రతినిధులు సమావేశమై సమ్మె తదుపరి కార్యాచరణపై చర్చించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైన బంద్ ఇదేనన్నారు. దీనికి అన్ని విపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు, ఆటో, క్యాబ్ యూనియన్లు స్వచ్ఛందంగా మద్దతు పలికి విజయవంతం చేశాయన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకోవాలన్న తపన అందరిలో ఎంతగా ఉందో ఈ బంద్ ఫలితమే చెబుతోందన్నారు. బంద్‌తో సమ్మె ముగిసినట్టు కాదని, ప్రభుత్వంలో మార్పు రాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాజకీయ సంక్షోభం వస్తుందని హైకోర్టు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత వాతావరణంలోనే శనివారం తెలంగాణ బంద్ నిర్వహించామని, కానీ పోలీసులు అరెస్టులతో దమనకాండకు పాల్పడ్డారని, మహిళా కార్మికుల విషయంలో దురుసుగా వ్యవహరించారని, అక్రమంగా కేసులు నమోదు చేశారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యూ డెమోక్రసీకి చెందిన నేత చేతి బొటన వేలును పోలీసులు వ్యూహాత్మకంగానే విరిచేశారని ఆరోపించారు. అవసరమైతే తాము మరోసారి గవర్నర్‌ను కలసి పరిస్థితిని విన్నవిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడుకోవాలంటూ జనంలోకి... ఆర్టీసీని పరిరక్షించుకోవాలని అంశాన్ని ప్రజల్లోకి చేరవేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లో ‘ఆర్టీసీని పరిరక్షించుకుందాం.. ప్రజా రవాణాను కాపాడుకుందాం’ప్లకార్డులతో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. అలాగే ఆదివారం అన్ని పార్టీలతో సమావేశం కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 23న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బహిరంగ సభ నిర్వహించే యోచన కూడా చేస్తున్నామని వివరించారు. -
ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బంద్‌నకు పిలుపునిచ్చి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు శనివారం బంద్‌లో పాల్గొన్నాయి. చాలా చోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఇతర జేఏసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయ జేసీతో భేటీ.. రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు రాజకీయ జేఏసీ నాయకులను కలవాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఎంఐఎం నేతలనూ కలవాలని నిశ్చయించారు. అక్టోబర్ 23న ఉస్మానియా యూనివర్సీటీలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జేఏసీ తీర్మానించింది. ఇక ధర్నా కార్యక్రమంలో గాయపడ్డ పోటు రంగారావుని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి పరామర్శించనున్నారు. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 15 వరోజుకు చేరిన సంగతి తెలిసిందే. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం : అశ్వత్థామ రెడ్డి ‘ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ సంపూర్ణం అయ్యింది. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలి. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడింది. కాలయాపన మంచిది కాదు. ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది. తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన ఉద్యమాల్లో ఇదే పెద్ద ఉద్యమం. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతాం. మళ్లీ గవర్నర్ ను కలుస్తాం ఎంఐఎం నేతలను కూడా కలుస్తాం. రేపు రాజకీయ జేఏసీతో సమావేశమవుతాం. ఉద్యమ నాయకుల వేళ్లు తీసినా, తలలు నరికినా ఉద్యమం ఆగదు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్టని కేసులు ఆర్టీసీ సమ్మెలో మా కార్మికుల పై పెడుతున్నారు’ అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. డబ్బులన్నీ ఎక్కిడికి పోతున్నాయ్.. రేపు అన్ని చౌరస్తాల్లో పువ్వులు ఇచ్చి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరతామని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీ నేతలతో ఆదివారం సమావేశమైన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 15 రోజుల నుంచి ఆర్టీసీకి వస్తున్న డబ్బులు ఎక్కడకు పోతున్నాయని జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికుల వల్లే రూ.155 కోట్లు నష్టమొచ్చిందని.. ఆర్టీసీ దగ్గర కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. ప్రభుత్వం కచ్చితంగా తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. -
అక్రమ ఆస్తులుంటే బహిరంగ ఉరిశిక్షకు సిద్ధం..
సాక్షి, హైదరాబాద్ : తన ఆస్తులకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తాను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు విచారణలో తేలితే బహిరంగ ఉరిశిక్షకు సిద్ధమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో సమ్మెలు ఉండవు ...మంచిగా బతకొచ్చని కేసీఆర్ అన్నారు. కానీ మా సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ సమాజం మూగపోయింది. కానీ ఆర్టీసీ గొంతు మూగపోలేదు. మంత్రి హరీశ్‌రావు మౌనం మంచిది కాదు. పదవులు శాశ్వతం కాదు. కార్మికులు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. అవసరం అయితే మళ్లీ మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కార్మికుల ఆత్మహత్యలు మమ్మల్ని ఇంకా కృశింప చేస్తున్నాయి. పోరాటం చేయాలి కానీ ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పార్టీల ఒత్తిడికి నాయకులు తలొగ్గారు కానీ రాజకీయ నాయకుల ఒత్తిడికి ఆర్టీసీ నాయకులు తలొగ్గలేదు. గతంలో తెలంగాణ కోసం ఆర్టీసీలో మొట్టమొదటిసారిగా సభలు పెట్టింది నేనే. అప్పుడు రాజకీయ నాయకుల ఉచ్చులో పడ్డావని అప్పటి ప్రభుత్వం అంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా అదేమాట అంటోంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. కొత్త బస్సులు కొనకపోతే కొండగట్టులాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పక్క రాష్ట్రాల్లో ఎన్ని బస్సులు ఉన్నాయ్..మన రాష్ట్రంలో ఎన్ని బస్సులు ఉన్నాయో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు...నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు ఉంది. 2015లో కరీంనగర్లో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమే. నేను చెప్పిన విషయాల్లో తప్పులు ఉంటే ముక్కు నేలకు రాసి...క్షమాపణలు చెప్పి రేపే విధుల్లో చేరతాం. గమ్యం చేరేవరకూ వెనక్కి తగ్గేది లేదు. పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను ఖమ్మంలో తప్ప ఎక్కడా అరెస్ట్ చేయలేదు. కానీ ఈ సమ్మెలో నన్ను రోజు అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి. ఆర్టీసీలో 4వేలమంది కార్మికులకు సకల జనుల సమ్మె నాటి జీతం ఇంకా ఇవ్వలేదు. ఇది సిగ్గుచేటు విషయం. మా ఆస్తులపై కేసీఆర్ కన్నేశారు. ఒకే వ్యక్తికి 44 పెట్రోల్ బంక్‌లు ఇవ్వడంపై గవర్నర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని ఏకపక్ష నిర్ణయాలే. పసునూరి దయాకర్ పేరుతో కొందరు ఆర్టీసీ ఆస్తులను లీజ్‌కు తీసుకున్నారు.’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజు కూడా కొనసాగుతోంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకూ ర్యాలీ చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులను వీఎస్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్థామరెడ్డి, ఇతర నేతలను అరెస్టు చేసి బలవంతంగా తీసుకెళ్లారు. -
ఆర్టీసీ సమ్మె: ‘నిరుద్యోగులు.. ప్లీజ్ సహకరించండి’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె విషయంలో మొండి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని దుయ్యబట్టారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లీకేజీలు ఇచ్చి ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కార్మికులెవరూ భయపడవద్దని.. అందరికీ తాము అండగా ఉంటామని తెలిపారు.ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డితో పాటు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ పాల్గొన్నారు.(చదవండి : ఆర్టీసీ సమ్మె; రేపు బంద్.. ఉత్కంఠ) సమ్మెకు సహకరించండి.. ఆర్టీసీ జేఏసీని విచ్చిన్నం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని రాజిరెడ్డి విమర్శించారు. ‘నిరుద్యోగులెవరూ తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లుగా వెళ్ళకండి. ప్రజా రవాణా వ్యవస్థను విచ్ఛన్నం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దయచేసి నిరుద్యోగులు కార్మికులుగా వెళ్ళకండి. సమ్మెకు సహకరించండి’ అని రాజిరెడ్డి విఙ్ఞప్తి చేశారు. ఇక పద్మనాభన్ మాట్లాడుతూ.. కార్మికులంతా కలిసి ఆర్టీసీ కార్మికుల కోసం ఉద్యమం చేయడం మంచి పరిణామం అన్నారు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉండి కార్మిక చట్టాల గురించి కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ‘సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో లేదు. ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేస్తాను అంటే ఎట్లా..100 ఏండ్ల నుంచి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. మనం నిజాం పాలనలో లేము. రాజ్యాంగ పరమైన దేశంలో ఉన్నాము. సమ్మె చేయడం కార్మికుల హక్కు. బ్రిటిష్ రాజు లాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యమానికి రాజకీయ పార్టీలు కలిసి రావడం మంచి పరిణామం. దేశ వ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు’అని పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ కంటే గొప్ప మేధావా కేసీఆర్..?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఆర్టీసీ జేఏసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘ నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదు. ఎంతోమంది నేతలు వస్తుంటారు... వెళుతుంటారు. ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ మేధావా? 1993-94 సంక్షోభాన్ని కేసీఆర్ మర్చిపోకూడదు. ప్రజాస్వామ్య పునాదులు కదులుతున్నాయ్. ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకుంటే 1994 తరహా సంక్షోభం రావొచ్చు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఇస్తూ మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి మౌనం వీడాలి. మేధావులు మౌనంగా ఉండకూడదు. పలువురు మంత్రులు కార్మికులను విమర్శించి ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికీ చర్చలు జరిపేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. హైకోర్టు సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని కోరారు. కాగా తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజు కూడా కొనసాగుతోంది. -
‘ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉంది’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు అంతర్జాతీయ రోడ్డు రవాణా సమన్వయ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్, అన్ భజిగన్, ఇతర జాతీయ నేతలు బుధవారం మద్దతు తెలిపారు. అనంతరం కేకే దివాకరన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్దతిలో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు ఉందని అన్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంద్‌తో కూడా ప్రభుత్వం స్పందించకుంటే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మెకు జాతీయ యూనియన్లు మద్దతు తెలిపాయని అన్నారు. 12వ కోజు సమ్మె ఉధృతంగా సాగుతోందని, సమ్మెలో పాల్గొంటున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వేసే వలలో ఎవరు పడవద్దని ఆశ్వత్థామరెడ్డి కోరారు. -
ఆర్టీసీ ఆస్తుల వివరాలడిగిన గవర్నర్ !
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణలో కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కేకే దివాకరన్, అన్ భజిగన్ తదితర జాతీయ నేతలు బుధవారం తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథ్థామ రెడ్డి జాతీయ యూనియన్ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అశ్వథ్థామ రెడ్డి మాట్లాడుతూ.. 12వ రోజు కూడా సమ్మె ఉధృతంగా సాతుతోందని, కార్మికులు ఎవ్వరూ ప్రభుత్వ ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. అలాగే గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఆస్తుల గురించి వాకబు చేసినట్టు తెలిసిందని వెల్లడించారు. కేకే దివాకరన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తోన్న సమ్మెకు ప్రజా మద్దతు ఉందని, ఇక తమ మద్దతు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 19న నిర్వహించనున్న బంద్‌కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు దివాకరన్ వెల్లడించారు. బంద్‌తో ప్రభుత్వం స్పందించకుంటే తదనంతరం తమ కార్యాచరణను ప్రకటిస్తామని దివాకరన్ స్పష్టం చేశారు. -
ఆర్టీసీ సమ్మెకు టీఈఏ పూర్తి మద్దతు
సాక్షి, హైదరాబాద్: పన్నెండు రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ లిబర్టీలోని టీఈఏ కార్యాలయంలో ఆర్జీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సహా పలువురు నేతలు ఆ సంఘం నాయకులను కలిసి సమ్మెకు మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమ్మెకు అండగా ఉంటామని టీఈఏ నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి మాట్లాడుతూ.. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో విచారకరమన్నారు. ఆత్మహత్యలతో కాకుండా పోరాటాలతో హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. మిగతా ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను సంఘటితం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రవాణా వ్యవస్థ నాశనం చేశారు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించిన టీఈఏకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రోజురోజుకు సమ్మెకు మద్దతు పెరగడంతో తమలో ఆత్మస్థైర్యం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారితో చర్చలు జరపమని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక బస్సులు తగ్గిపోయాయని, రవాణా వ్యవస్థను నాశనం చేశారని ఘాటుగా విమర్శించారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు బాధ్యులా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆర్టీసీకి పట్టిన గతే మున్ముందు అన్ని ఉద్యోగ సంఘాలకు పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజా రవాణాను, ఆర్టీసీ వ్యవస్థను, ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా ఆర్టీసీ జేఏసీ అందుకు పూర్తిగా సహకరిస్తుందని ప్రకటించారు. -
ప్రస్తుతానికి సమ్మె యథావిధిగా కొనసాగుతుంది
-
చర్చలు మాకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలకు సుముఖంగా ఉన్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నా మని, ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే చర్చలకు హాజరవుతామని పేర్కొంది. సోమవారం గవర్నర్ తమిళిసైను కలసిన ఆర్టీసీ ప్రతినిధి బృందం.. అనంతరం మీడియాతో మాట్లాడింది. టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి, ఈయూ నేత రాజిరెడ్డి తదిత రులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ వైఖరిని తప్పుబట్టారు. కార్మికులంతా సమ్మెకు వెళ్లే ముందే తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీకి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. టీజేఏసీ నేతలను ఫోన్లో సంప్రదించగా తామంతా ఢిల్లీలో ఉన్నట్లు చెప్పారని, సమ్మెను మొదలు పెట్టాల్సిందిగా సూచించారన్నారు. దసరా తర్వాత మద్దతు ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మద్దతు కోసం ఆదివారం చర్చలు జరపాలని కోరా మని, కానీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి, ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సిరావడంతో టీజేఏసీతో చర్చలకు వెళ్లలేకపోయినట్లు వివరించారు. ఇప్పటికైనా తమకు మద్దతు ఇవ్వాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కేకే మధ్యవర్తిత్వం అంగీకారమే... కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలన్న రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు సూచనను వారు స్వాగతించారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు కేకే మధ్యవర్తిత్వం వహిస్తే ఆర్టీసీ జేఏసీకి అంగీకార మేనన్నారు. పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. సమ్మెపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరాలోచించుకోవాలని, తమను చర్చలకు ఆహ్వానించాలన్నారు.ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, కార్మికులెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని కోరారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు కృషి చేయాలని, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలెవరూ స్వతహాగా సమ్మెకు మద్దతు ఇవ్వలేదని, ఆర్టీసీ జేఏసీ కోరిన తర్వాతే మద్దతుగా సమ్మెలోపాల్గొన్నట్లు వివరించారు. సమ్మెలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఆర్టీసీ జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
రేపు భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తాం : ఆర్టీసీ జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు గురువారం సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నాయకులు.. రేపు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్ చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే నిర్ణయించినా రేపటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శన చేపడతామని వెల్లడించారు. అన్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపాలని కోరారు. పలుచోట్ల ఆర్టీసీ కార్మికులను పోలీసుల అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా రవాణాను కాపాడుకునేందుకే తాము సమ్మె చేపట్టినట్టు తెలిపారు. రేపు అన్ని రాజకీయ పార్టీలను కలువనున్నట్టు చెప్పారు. రేపు, ఎల్లుండి శాసనసభ్యులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఎల్లుండి గాంధీ, జయశంకర్ విగ్రహాల ముందు మౌన దీక్షలకు దిగుతామన్నారు. -
సమ్మె యధాతథంగా కొనసాగుతుంది
-
పంథా మార్చిన కార్మిక సంఘాలు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఆర్టీసీని సమూలంగా మార్చేందుకు సీఎం కీలకనిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుండగా, మరోవైపు పట్టువీడకుండా కార్మికసంఘాలు సమ్మెను ముమ్మరం చేశాయి. సోమవారం మూడోరోజు కూడా ఉద్యోగులు విధుల్లో పాల్గొనకుండా సంపూర్ణ సమ్మెను చేపట్టారు. ఓ వైపు సమ్మె జరుపుతూనే మరోవైపు ముఖ్యమంత్రి నిర్ణయాలపై నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మూడోరోజు సమ్మెతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బంది పడనప్పటికీ, చాలాచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం సాయం త్రం నాలుగు గంటల వరకు 5,386 బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 48.51% బస్సులు తిప్పినట్టు అధికారులు ప్రకటించారు. రెండు రోజులతో పోలిస్తే సోమవారం ఉదయం నుంచే అన్ని బస్టాండ్లు బస్సులతో నిండిపోయాయి. నగరంలోని ఇమ్లీబన్‌కు ఉదయం పది గంటల వేళ దాదాపు 300 బస్సులు రావటంతో వాటిని నిలిపేస్థలం లేక ప్లాట్‌ఫామ్స్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సులెక్కువ ఉన్నా, ప్రయాణికుల సంఖ్య పలచగా ఉంది. దసరాను జరుపుకొనేందుకు చాలామంది నగరవాసులు ఊళ్లకు చేరిపోవటంతో సోమవారం రద్దీ పెద్దగా కనిపించలేదు. దీన్ని గుర్తించి అధికారులు ప్రైవేటు బస్సులను కొంతమేర తగ్గించారు. 3,063 మంది వంతున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను వినియోగించారు. గ్రామీణ ప్రాంతాలకు మాత్రం తక్కువసంఖ్యలో బస్సులు నడవటంతో అటు వెళ్లాల్సినవారు ఇబ్బందిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు పెద్దసంఖ్యలోనే నడిచినా, నగరంలో మాత్రం సిటీ బస్సులకు కొరత వచ్చింది. దీంతో ఆటోలు, క్యాబ్‌లు 3 రెట్లు చార్జీ పెంచి దోచుకున్నారు. మారిన పంథా.... : రెండు రోజులు సమ్మెను విజయవంతం చేసేందుకు యత్నించిన కార్మిక సంఘాలు సోమవారం జనం దృష్టిని ఆకర్షించేందుకు యత్నించాయి. ఆదివారం సీఎం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోవటంతో కార్మికనేతలు పంథా మార్చారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులందరినీ తొలగిస్తామని, 50% ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేస్తామన్న కీలక నిర్ణయాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ముందుగా ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. ఆదివారమే దీన్ని ప్రకటించారు. సీఎం సమీక్ష నేపథ్యంలో పోలీసులు ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో కార్మిక సంఘాల నేతలు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. వారు ఉదయం వచ్చేసరికే అక్కడ భారీగా పోలీసులను మోహరించి వచ్చినవారిని వచ్చినట్టుగా అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. నివాళులు కూడా అర్పించనీయకపోవటంతో కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిని మధ్యాహ్నం వదిలిపెట్టారు. అనంతరం వారు భేటీ అయి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. గన్‌పార్క్ వద్ద జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు కార్మికుల భయాందోళన మరోవైపు సీఎం నిర్ణయంతో కార్మికులు కలవర పడ్డారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనతో వారు కార్మిక నేతలకు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యాయ సలహా తీసుకుందామని, అన్ని వేలమంది ఉద్యోగాలు తొలగించటం సాధ్యం కాదని, దానికీ ఓ విధానం ఉంటుందని, ప్రభుత్వం దాన్ని అనుసరించకుండా పత్రికాప్రకటనగా వెల్లడించటం చెల్లదంటూ వారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అంతిమంగా కార్మికులదే విజయమని భరోసా ఇచ్చారు. వీరికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.ఆర్టీసీ పరిరక్షణ పోరాటాన్ని కాస్త ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంగా మారుస్తున్నట్టు నేతలు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 672 బస్సులకుగాను 515 బస్సు లు నడిపించారు. అన్ని ప్రాంతాల్లో ఆదాయం దారుణంగా పడిపోయింది. ఒకరోజు రూ.50 లక్షలకు బదులు రూ.20 లక్షలు కూడా ఈ రీజియన్‌లో రాలేదు. ఇది అన్ని జిల్లాల్లో ఏర్పడ్డ సమస్య. ప్రైవేటు సిబ్బంది వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని ఆర్టీసీకి జమ చేయటం లేదు. కొంతే కడుతున్నారు. టికెట్ల అమ్మకం లేనందున లెక్కలు తెలియటం లేదు. వారు ఎంత ఇస్తే ఆర్టీసీ సిబ్బంది అంత తీసుకోవాల్సి వస్తోంది. అల్లాదుర్గం మండ లం ముస్లాపూర్ శివారులో ఓ బస్సు అద్దాలను ఆగంతకులు ధ్వంసం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 440 బస్సులు తిరిగాయి. టికెట్ ధరలను రెట్టింపు చేయటంతో ప్రైవేటు కండక్టర్లతో ప్రయాణికుల వాగ్వాదం కనిపించింది. ►ఖమ్మం జిల్లాలో... ఖమ్మం జిల్లా పరిధిలోని డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులను కార్మికులు అడ్డుకున్నారు. నాలుగు బస్సులను అడ్డుకుని టైర్ల గాలి తీయడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
‘48,533 మంది కార్మికులు ఆర్టీసీ సిబ్బందే’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాలు అస్థిత్వాన్ని కోల్పోయాయనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లు అస్తిత్వం కోల్పోలేదని ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీలో యూనియన్లు ఇప్పుడు పుట్టినవి కావని.. ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాట చరిత్ర కేసీఆర్‌కు బాగా తెలుసునని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను బినామీలకు అప్పగిస్తారా ‘సీఎం బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. 20 శాతం ప్రైవేటు బస్సులను స్టేజ్ క్యారేజీలుగా మార్చితే ఎవరు నడుపుతారు. ఆర్టీసీ ఆస్తులన్నీ మీ బినామీలకు అప్పగిస్తారా. ఇక మీ దోపిడీ చెల్లదు. కార్మికులంతా అప్రమత్తంగా ఉండాలి. సూపర్ వైజర్లకు ఆర్టీసీ జేఏసీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలంతా మీతో అమీ-తుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 48,533 మంది కార్మికులు ఎప్పటికీ ఆర్టీసీ సిబ్బందే’అన్నారు. -
అమరవీరులకు నివాళులర్పించేందుకు వెళితే అరెస్ట్ చేస్తారా?
-
కేసీఆర్‌కు భయపడం.. ఫామ్‌హౌజ్‌లో పాలేరులం కాదు
-
కేసీఆర్‌కు భయపడం.. ఫామ్‌హౌజ్‌లో పాలేరులం కాదు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు భయపడేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. గన్‌పార్క్ వద్ద పోలీసుల అరెస్టు చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి విడుదలై.. తమ కార్మిక సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ఉద్యమాలతో సీఎం అయి.. ఉద్యమాలను అణిచివేసే సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. ఆర్టీసీలో కార్మికులు 50 వేల వరకు జీతాలు తీసుకుంటున్నారంటూ.. కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేరులం కాదని ఆయన అన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో నలుగురిని కూడా డిస్మిస్ చేసే పరిస్థితి లేదని, కార్మికుల సమ్మె విజయవంతంగా కొనసాగుతోందరి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. సమ్మె విషయంలో న్యాయ సలహా తీసుకున్నామని, సమ్మె న్యాయబద్ధమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీతో టీఎస్ ఆర్టీసీని పోల్చి మాట్లాడాలని, అంతేకానీ, ఇతర రాష్ట్రాలతో కాదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎల్లుండి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అరెస్టు చేసినా.. జైల్లో పెట్టినా.. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారు ఎన్ని హెచ్చరికలు చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. తమను అరెస్టు చేసినా, జైల్లో పెట్టినా సమ్మెను ఆపబోమని ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ పోరాటానికి రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలన్నీ మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మె విరమించేది లేదని ఆయన తెలిపారు. సమ్మె చేస్తోంది.. కార్మికుల స్వలాభం కోసం కాదు.. ప్రజల కోసం, సంస్థ కోసమేనని ఆర్టీసీ జేఏసీ నేత రాజా అన్నారు. ఆర్టీసీ కార్మికులకు క్రమశిక్షణ లేదంటారా? అని ఆయన సీఎంను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు మద్దతు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ అప్పుడే మరిచిపోయారా? అని అడిగారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధమైనదని.. ఆర్టీసీలో తాత్కాలిక నియామకాలు చేపడితే కోర్టు ధిక్కారమే అవుతుందని రాజా అన్నారు. -
ప్రభుత్వ బెదిరింపులకు భయపడం
-
‘మా ఉద్యోగాలు తొలగించే హక్కు సీఎంకు లేదు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ ఆస్తులపై కన్ను వేసినందునే ముఖ్యమంత్రి దాన్ని ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకున్నారని ఆర్టీసీ కారి్మక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆదివారం ఆరోపించారు. సగం ప్రైవేటు బస్సులు తీసుకునే ఉద్దేశం ఈ కుట్రలో భాగమేనన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు క్రమబద్ధ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందారని, రాజకీయ నేతలు మంత్రులు, చైర్మన్లుగా అయినట్టు కాదన్నారు. అలాంటి ఉద్యోగులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులున్నాయని, వాటిని కూలదోసే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. (చదవండి : అనుమతి లేకుండా విధుల్లోకి తీసుకోవద్దు) అందుకే సీఎం నిర్ణయాన్ని తాము న్యాయపరంగానే ఎదుర్కొంటామని, ఇందులో కారి్మకులెవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. తమ సమ్మె న్యాయబద్ధమైనదని, దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్న ఆయన, ఇప్పుడు ప్రజలు తెలంగాణతోపాటు ఆరీ్టసీని కూడా కాపాడుకోవాల్సిన తరుణమొచి్చందన్నారు. ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచన ఈ సమావేశంలో మరోసారి Ðð వెల్లడైందని, కొత్త నియామకాల్లో వచ్చే ఉద్యోగులు కారి్మక సంఘాల్లో చేరొద్దని చెప్పటం దారుణమన్నారు. తమను కారి్మక సంఘాల్లో ఉండొద్దన్నప్పుడు సీఎం రాజకీయ పారీ్టలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. (చదవండి : సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సర్కారు షాక్) తాము ట్రేడ్ యూనియన్ను వదిలేస్తే సీఎం రాజకీయపారీ్టని వదులుతారా అని, ఇది తన సవాల్ అని పేర్కొన్నారు. ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, వయసులో చిన్నవాడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించారు. తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తరహాలో మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇచి్చన హామీకి కట్టుబడి ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తీరును కేసీఆర్ గమనించాలని కోరారు. సోమవారం తాము ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని సిద్ధం కాగా, ఇప్పుడు అనుమతి లేదంటున్నారని, అదే సమయంలో తాము తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులరి్పంచి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
రేపటి సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ
-
రేపటి సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రెండో రోజూ ఆర్టీసీ సమ్మె విజయవంతమైందని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి అన్నారు. ‘ఆర్టీసీ కార్మికుల సమ్మె-రేపటి కార్యాచరణ’పై ఆర్టీసీ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించింది. సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో చేపట్టనున్న నిరాహార దీక్షలో 16 మంది జేఏసీ సభ్యులు పాల్గొంటారని ఆశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదని, వేతనాలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏ ఉద్యోగ సంఘాలను విమర్శించేదిలేదన్న ఆశ్వత్థామ రెడ్డి..సమ్మెకు మద్దతు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆర్టీసీని కాపాడేవిధంగా ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు వాస్తవ పరిస్థితులను వివరించాలని కోరారు. వివిధ రాజకీయ పక్షాలను కలిసి మద్దతు కోరామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీకి ప్రత్యామ్నాయం లేదు : రాజిరెడ్డి ప్రజా రవాణాను కాపాడుకోవడానికే సమ్మె చేస్తున్నామని జేఏసీ నేత రాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీకి ప్రత్యామ్నాయం ఏదీ లేదని.. ఇది పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతుందని విమర్శించారు. అద్దె బస్సులను కొత్తగా వేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. -
ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అశ్వత్ధామరెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..‘ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టింది. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ చర్యల వల్లే సమ్మెకు వెళ్లేలా చేశాయి. విమానాలపై ఉన్న ప్రేమ ఆర్టీసీపై లేదా?. ఆర్టీసీని మూసివేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా యత్నిస్తోంది. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జీతభత్యాల గురించి మా పోరాటం కాదు. రవాణా వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా చూడటమే మా థ్యేయం. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే, పోరాటం ఇంకా కొనసాగుతోంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఆర్టీసీ ఎప్పుడూ రాలేదు. అన్ని పార్టీలు ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. ఆర్టీసీ ఇమేజ్ పోగొట్టాలని కేసీఆర్ కుట్ర పన్నారు. దసరా ముందు బలవంతంగా సమ్మెకు వెళ్లేలా చేసారు. రేపటి ఆర్టీసీ కార్మికుల ధర్నాకు అందరూ మద్ధతు తెలపాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. మంత్రుల కమిటీ వేసినా సమస్య పరిష్కారం కాలేదు. మంత్రి పువ్వాడ అజయ్ ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా?. గతంలోనే కేసీఆర్ వైఖరిని ఇదే పువ్వాడ అజయ్ తప్పుపట్టలేదా. మా సమస్యలు ఏనాడు ముఖ్యమంత్రి వద్ద పరిష్కారం కాలేదు. ఆర్టీసీతో నాకు సంబంధం లేదన్న మంత్రి...అర్థరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి ఉద్యోగులను తీసేస్తా అని ఎలా ప్రకటించారు. మీలా ముఖ్యమంత్రి తీసేస్తే పోయే ఉద్యోగం కాదు మాది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తొలగించాలనుకుంటే నన్ను తీసేయండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ ఆర్టీసీ జేసీఏ కన్వీనర్, టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి పునరుద్ఘాటించారు. హయత్‌నగర్‌లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులని కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకోవడానికి తమవి ఎవరి దయాదాక్షిణ్యాల మీద వచ్చిన ఉద్యోగాలు కావని అన్నారు. విధులకు హాజరు కానీ కార్మికులను తొలగించాలనుకుంటే మొదట తనను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజు మంచి ప్రణాళికతో శాంతియుతంగా సమ్మెను చేస్తామని తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక కొత్త బస్సు పెరగలేదు, ఒక్క రూటు పెంచలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు భయపడబోమని ప్రకటించింది. త్రిసభ్య కమిటీకి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా తూతూ మంత్రంగా ప్రభుత్వం చర్చలు జరిపిందని వెల్లడించింది. సమ్మెలో భాగంగా తదుపరి కార్యాచరణపై జేఏసీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి: ఆర్టీసీని చంపొద్దు.. బతికించండి) జేఏసీ కార్యాచరణ ♦ ఆదివారం ఉదయం 8 గంటలకు అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ లేఖల సమర్పణ ♦ ఆదివారం ఉదయం 11 గంటలకు ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశం ♦ ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ♦ సోమవారం ఉదయం 8 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి ♦ సోమవారం ఉదయం 8 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం -
పోరాటాన్ని ఉధృతం చేస్తాం
-
ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం...
సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై తెలంగాణ కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఎంజీబీఎస్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేసీఏ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తమతో ప్రభుత్వం చర్చలు జరిపితేనే సమ్మెపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్మాకు భయపడేది లేదని, ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు కార్మికులు భయపడవద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె కన్నా ఎక్కువగా తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రయివేట్ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు. బతుకు తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్ రెడ్డి, తిరుపతి, వీఎస్‌రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజేంద్రనగర్ బస్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు -
ప్రభుత్వంతో చర్చలు: ఆర్టీసీ సమ్మె యథాతథం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఆయా కార్మిక సంఘాల నేతలు శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 11వతేదీ నుంచి ఆర్టీసీలో సమ్మె నిర్వహిస్తామంటూ సమ్మె నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమ్మె నోటీస్‌పై రవాణా మంత్రితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీలో ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు, అధికారులతో సంస్థ స్థితిగతుల మీద మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంస్థ నష్టాల్లో ఉంది. సమ్మె నిర్ణయంపై పునరాలోచించండి. 97 డిపోలలో కేవలం 11 డిపోలు నష్టాల్లో ఉన్నాయి. ఆర్టీసీకి సుమారు 3 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఏటా ఆర్టీసీకి రూ. 700 కోట్లు నష్టంతో పాటు వడ్డీకి 250 కోట్ల రూపాయలు కడుతున్నారు. జీతాలు పెంచితే అదనంగా సంస్థ మీద రూ.1400 కోట్ల భారం పడుతుంది. 53 వేల మంది కార్మికులు ప్రయోజనంతో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల ప్రయోజనాలు కూడా ముఖ్యం. సంస్థను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఉన్నారు. కార్మికులను తప్పుడు ఆలోచనలతో సమ్మెకు దించటం సరికాదు. కార్మిక నాయకులు ఎన్నికల కోసం ఆర్టీసీ కార్మికులను, సంస్థను నష్టాల్లోకి నెట్టరాద’ని వ్యాఖ్యానించారు. సమ్మె వాయిదా లేదు చర్చల అనంతరం టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె వాయిదా వేయాలని మంత్రి కోరారని తెలిపారు. లాభనష్టాలతో ఆర్టీసీని చూడొద్దని, డైరెక్టర్ పోస్టులపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. 11 జరిగే సమ్మెను వాయిదా వేయలేదని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం యూనియన్ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమ్మెపై చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఇదే చివరి సమ్మె కావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల పేరుతో తమ సమస్యను పక్కదారి పట్టించొద్దని కోరారు. ముఖ్యమంత్రిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
'నా పై ఆరోపణలకు ఈ ఎన్నికలే రిఫరెండం'
- టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్దామరెడ్డి హైదరాబాద్ : నాపై వచ్చిన ఆరోపణలకు ఈ ఎన్నికలే రిఫరెండమని టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అశ్వత్ధామరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... మెరుగైన పే స్కేల్ టీఎంయూతోనే సాధ్యమని ఆయన అన్నారు. గతంలో తాము కార్మికులకు చేసిన మంచి పనులే తమ గెలుపునకు సోపానాలు అవుతాయని ఆయన తెలిపారు. ఈ దఫా ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమని అశ్వత్థామరెడ్డి జోస్యం చెప్పారు.