సాక్షి, హైదరాబాద్: అశ్వద్ధామ రెడ్డి బయట ఉంటే ఆయన అవినీతికి జైల్లో పెడతారని భయపడి... మళ్లీ యూనియన్‌లో చేరతానని అంటున్నారు. ఆయనను టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం అంటూ థామస్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నర నుంచి అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేశారు. దాంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కార్మికులు ఉద్యోగాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. టీఎంయూలో అశ్వద్ధామ రెడ్డిని నామినేట్ చేసింది నేనే. నన్ను తొలగిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆర్టీసీని సర్వనాశనం చేసింది ఆయనే’’ అన్నారు.
(చదవండి: రోజుకో రూ.కోటి.. చేతులెత్తేశారు!)
అంతేకాక ‘‘థామస్ రెడ్డిని మళ్ళీ బస్ భవన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి.. జిల్లా నుంచి రప్పించండి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. థామస్ రెడ్డి వల్ల కార్మికులు కష్టాలు తీరతాయని సీఎం చెప్పారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పటికీ మాకు తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్‌డౌన్‌లో కూడా డ్యూటీ లేకున్నా, బస్సులు నడవకున్నా మాకు జీతాలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా మాకు జీతాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఇప్పటికే చాలా బస్సులు పాడైపోయాయి.. 2000 కొత్త బస్సులు కొనాలని కోరుతున్నాం.. కార్మికులు ఆందోళనలో ఉన్నారు.. ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment