Thomas Reddy
-
ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
హన్మకొండ: అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆ ర్టీసీ వరంగల్–1 డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూ సింది. వరంగల్ 1 ఆర్టీసీ డీపోలో బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి సెలవులో ఉన్నా రు. అయితే విధులకు హాజరు కావాలని ఫోన్ ద్వా రా అధికారులు బలవంతం చేయడంతో ఒత్తిడి భ రించలేక ఓ సీసాలో పెట్రోల్ తీసుకుని డిపోకు చేరు కున్నాడు. డిపోలో అధికారులు కూడా డ్యూటీ చేయాల్సిందేనని చెప్పడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సహోద్యోగులు డ్రైవ ర్‌పై నీళ్లు పోయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డిపో మేనేజర్ భానుకిరణ్ అక్కడకు చేరుకుని ఘటన గురించి ఆరా తీశారు. సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని, ఇటువంటి చర్యలకు పాల్ప డవద్దని చెప్పి డ్రైవర్‌ను ఇంటికి పంపించారు. ఆర్టీసీ కార్మికులను హింసకు గురిచేస్తే తిరుగుబాటు తప్పదు: థామస్‌రెడ్డి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): ఆర్టీసీ కార్మికులను హింసకు గురిచేస్తే యాజ మాన్యంపై తిరుగుబాటు తప్పదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.థామస్‌రెడ్డి హెచ్చరించారు. అధికారులు హింసించడం వల్లనే రాణిగంజ్ డిపోకు చెందిన తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సదస్సు జరిగింది. థామస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సహకారంతోనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని, ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. కవితక్క నాయకత్వంలోనే తమ యూనియన్ ముందుకు సాగుతుందని, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. -
‘అశ్వద్ధామ రెడ్డిని టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: అశ్వద్ధామ రెడ్డి బయట ఉంటే ఆయన అవినీతికి జైల్లో పెడతారని భయపడి... మళ్లీ యూనియన్‌లో చేరతానని అంటున్నారు. ఆయనను టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం అంటూ థామస్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నర నుంచి అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేశారు. దాంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కార్మికులు ఉద్యోగాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. టీఎంయూలో అశ్వద్ధామ రెడ్డిని నామినేట్ చేసింది నేనే. నన్ను తొలగిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆర్టీసీని సర్వనాశనం చేసింది ఆయనే’’ అన్నారు. (చదవండి: రోజుకో రూ.కోటి.. చేతులెత్తేశారు!) అంతేకాక ‘‘థామస్ రెడ్డిని మళ్ళీ బస్ భవన్‌లోకి ట్రాన్స్ఫర్ చేయండి.. జిల్లా నుంచి రప్పించండి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. థామస్ రెడ్డి వల్ల కార్మికులు కష్టాలు తీరతాయని సీఎం చెప్పారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పటికీ మాకు తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్లో కూడా డ్యూటీ లేకున్నా, బస్సులు నడవకున్నా మాకు జీతాలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా మాకు జీతాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఇప్పటికే చాలా బస్సులు పాడైపోయాయి.. 2000 కొత్త బస్సులు కొనాలని కోరుతున్నాం.. కార్మికులు ఆందోళనలో ఉన్నారు.. ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
'అశ్వత్థామరెడ్డి మమ్మల్ని బెదిరించలేదు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్ రెడ్డి సోమవారం నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. తాజాగా థామస్‌రెడ్డి వ్యవహారతీరుపై మండిపడుతూ టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డే కొనసాగనున్నట్లు ఆర్టీసీ కేంద్ర కమిటీ మరోసారి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. (చదవండి : రెండుగా చీలిన ఆర్టీసీ కార్మిక సంఘం) ' రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామ రెడ్డి కొనసాగాలని (ఆదివారం 27) రోజున కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా తిర్మానించడం జరిగింది. ఈ కేంద్ర కమిటీ కి గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధ్యక్షుడు.బి. వెంకటేష్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.పి.రెడ్డి, హైదరాబాద్ రీజినల్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, ఎస్.యచ్.కె.రెడ్డి, సికింద్రాబాద్ రీజినల్ కార్యదర్శి నర్సింహులు హాజరై అశ్వత్థామ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. కాని నిన్న థామస్ రెడ్డి పదవి కాంక్షతో అశ్వత్థామరెడ్డిపై చేసిన తప్పుడు ఆరోపణలను గ్రేటర్ హైదరాబాద్ జోనల్, రీజినల్ నాయకులుగా తాము ముక్త కంఠంతో ఖండిస్తూన్నాం. థామస్ రెడ్డి ఆరోపించినట్టుగా అశ్వత్థామరెడ్డి మమ్మల్ని ఎవరిని బెదిరించలేదు. మేము అతని నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.'అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి : అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది) -
వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులే..
సాక్షి, హైదరాబాద్: థామస్ రెడ్డి వెంట ఉన్న వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులేనని టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వద్ధామరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పదవి కాంక్షతోనే థామస్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ రాజీనామా చేస్తామని చెప్పిన వారంతా డిపోల్లో పని చేసే వ్యక్తులేనని, ఒక్కరు కూడా టీఎంయూలో ఉన్న నేతలు లేరన్నారు. తనకు ఇవాళ రాజీనామా చేస్తామని చెప్పిన వాళ్లలో ఇప్పుడు ఫోన్ చేసి యూనియన్‌లో కొనసాగుతామని చెప్పారని ఆయన తెలిపారు. తాను రాజకీయ పదవులు ఆశించనని స్పష్టం చేశారు. ఇప్పటికే కార్మిక సంఘ యూనియన్‌లో ఉంటూ రాజకీయాల్లో పోటీ చేయకూడదని ఆయన తెలిపారు. -
తీవ్ర విభేదాలు.. రెండుగా చీలిన టీఎంయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్ రెడ్డి నేడు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. అయితే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్‌రెడ్డి సహా ఆయన మద్దతుదారులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. (చదవండి: అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది) ఇక ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఈ భేటీలో మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిన తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ రెండు చీలిపోయింది. -
మేం రాజీనామా చేస్తాం.. ఆర్టీసీని అలాగే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: కార్మిక నేతలపై కోపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమాయక కార్మికులపై చూపడం సరికాదని పేర్కొంటున్న జేఏసీ నేతలు కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. తాము రాజీనామాలు చేసి తప్పుకుంటామని, అప్పుడు ఆర్టీసీని ఉన్నది ఉన్నట్లుగా నిర్వహించాలని పేర్కొననున్నట్లు తెలిసింది. దీనిపై బుధవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ‘చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్మిక సంఘాల నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని మాట్లాడారు. ఆయనకు మాపై అంత కోపం ఉంది. దాన్ని అమాయక కార్మికులపై చూపి వారిని విధుల్లోకి తీసుకోకుండా ఆవేదనకు గురి చేయడం సరికాదు. నేను రాజీనామా చేసి తప్పుకునేందుకు సిద్ధం. మిగతా మా జేఏసీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీని పాత పద్ధతిలోనే కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలి. గురువారం కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలి’అని జేఏసీ కో–కన్వీనర్ థామస్‌రెడ్డి అన్నారు. కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు... సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నందున వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ మరోసారి ప్రభుత్వాన్ని కోరింది. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట ప్రకారం సరైన చర్య కాదన్న విషయాన్ని గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్‌కు జేఏసీ ఫిర్యాదు చేసింది. మరోవైపు అదే ఫిర్యాదు కాపీలను గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయాల్లో అందజేయాలని జేఏసీ నేతలు సూచించారు. ఆ కార్యాలయాలు లేని ప్రాంతాల్లో సేవ్ ఆర్టీసీ పేరుతో ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొన్నారు. -
'సీమాంధ్రోళ్లు పోవాలే.. తెలంగాణోళ్లు రావాలే'
హుస్నాబాద్ రూరల్: దేశంలోనే తెలంగాణ ఆర్టీసీనీ నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతామని టీఎంయూ వ్యవస్థాపక కార్యనిర్వాహక అధ్యక్షుడు, కార్మికశక్తి అవార్డు గ్రహీత థామస్‌రెడ్డి అన్నారు. ఈ నెల 28లోగా సీమాంధ్ర ఆర్టీసీ ఉద్యోగులు అక్కడికి వెళ్లిపోవాలని, అక్కడ పనిచేసే తెలంగాణ ఉద్యోగులు ఇక్కడకు రావాల్సిందేనన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని సీమాంధ్ర నేతలు కోరుతున్నారని, ఇక్కడి ఆస్తుల్లో అంగుళం కూడా ఇవ్వబోమని చెప్పారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్ విలువ ప్రకారం విభజించి వాటా ఇస్తామన్నారు. ఆర్టీసీ బోర్డులో 17మంది సభ్యులకు ఇద్దరే తెలంగాణకు వాళ్లు ఇద్దరే ఉన్నారని, ఇందులో అత్యధికంగా తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించే బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.