సమావేశంలో మాట్లాడుతున్న థామస్‌రెడ్డి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: తెలంగాణ ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్‌ల వ్యవస్థను పునరుద్ధరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.థామస్‌రెడ్డి కోరారు. బుధవారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనియన్‌ల ద్వారానే ఆర్టీసీలో ప్రగతి సాధ్యమవుతుందన్నారు. జేఏసీల వల్ల ఆర్టీసీకి ఒరిగింది ఏమిలేదన్నారు.
తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరారు. సమ్మెలు చేసి సాధించే రోజులు పోయాయని సంధి ద్వారానే సమస్యలను సాధించుకోవచ్చన్నారు. 70శాతం మంది కార్మికులు మా సంఘానికి మద్దతు తెలుపుతున్నారని, మా సంఘానికి గౌరవ అధ్యక్షురాలు కవితమ్మనేనని స్పష్టం చేశారు.
ఉద్యోగ భద్రతపై జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని, ఆర్టీసీని కాపాడేందుకు బడ్జెట్‌లో 2శాతం లేదా రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎన్.కమలాకర్‌గౌడ్, ముఖ్య సలహాదారు ఎల్.మారయ్య, ఉపాధ్యక్షుడు జి.ఆర్.ఆర్ రెడ్డి, సహాయ కార్యదర్శి బి.నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment