తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశారు. సమ్మెపై చర్చించాలన్న హైకోర్టు వ్యాఖ్యలు, ప్రభుత్వం చర్చలను ఆహ్వానించకపోవడం, వేతనాలు లేక కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని ఆమెకు వివరించారు. గవర్నర్‌ను కలిసినవారిలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి, వీ.ఎస్.రావు తదితరులు ఉన్నారు.