మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్లైన్ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్ ఆశ్వాత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని, డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తమ సమస్యల పరిష్కారంపై హామీ రాలేదని అన్నారు.