Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Telangana High Court Expresses Anger Once Again Over HYDRAA1
HYDRAA : ‘అప్పుడే మీకు అసలైన సార్థకత’.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్‌..

సాక్షి,హైదరాబాద్‌ : హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్‌ పేద,మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్నించింది. పేదల ఇళ్లే కాకుండా అక్రమ నిర్మాణలకు పాల్పడ్డ పెద్దల నిర్మాణాలకు కూల్చివేసినప్పుడే సార్థకత చేకూరుతుందని సూచించింది.ప్రభుత్వ భూములను కాపాడాలంటే పేదల నిర్మాణాలే కాదు. పెద్దల నిర్మాణాలు కూడా కూల్చాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. కేవలం పేదల నిర్మాణాలను తొలగిస్తే సరిపోదని హైకోర్టు తేల్చి చెప్పింది. మిర్ అలం ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో నివసించే గృహ యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా, దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది.చెరువులను రక్షించడం ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పిన హైకోర్టు.. అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడాలని సూచించింది. మిర్ అలం ట్యాంక్ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Gudem Mahipal Reddy Submits Affidavit to Supreme Court Over MLAs Disqualification Case2
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కోర్టులో కీలక పరిణామం

సాక్షి,ఢిల్లీ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు (MLAs Disqualification) సంబంధించిన కేసు కొనసాగుతున్న తరుణంలో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను పార్టీ ఫిరాయించలేదని,కాంగ్రెస్‌లో చేరలేదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్‌లో తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక మర్యాదపూర్వకంగా తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. మీడియా వక్రీకరించిందని, తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ పార్టీమీద గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై చివరి సారిగా (మార్చి 4,మంగళవారం) జరిగిన విచారణలో ఎమ్మెల్యేల అన్హత విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆపరేషన్​ సక్సెస్​.. పేషెంట్​ డెడ్బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్ మాసిహ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ మారి నెలలు గడుస్తున్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ జాప్యం చేయడంపై తీవ్రంగా పరిగణించింది. విచారణలో ‘ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెండ్‌ డెడ్‌’ ధోరణి సరైంది కాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ(మార్చి 25)లోగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం, తెలంగాణ శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.

Ukraine's Zelensky To Speak To Trump Amid Ceasefire Talks3
Zelensky: ట్రంప్‌తోనే తేల్చుకుంటా.. ఏం సమాధానం వస్తుందో?

కీవ్: రష్యా‍, ఉక్రెయిన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇంకా పాజిటివ్ స్టెప్ పడలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ఢ్ ట్రంప్ ప్రత్యేక ఇంట్రెస్ట్ తో డీల్ చేస్తున్న ఇరు దేశాల 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదు. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సరైన సమాధానం రాలేదు. కేవలం తాత్కాలికంగా ఆపడానికి మాత్రమే మంగళవారం నాడు ఒప్పుకున్న పుతిన్.. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రం ముందడుగు వేయడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలనే రష్యా అంటొంది. అదే పంతంతో కూర్చోని ఉంది. ఆ క్రమంలోనే తమ యుద్ధాన్ని కొనసాగించడానికే మొగ్గుచూపుతోంది.‘మీరు కోరుకునే మా ఇరుదేశాల 30 రోజుల శాంతి ఒప్పందం(కాల‍్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం ఉక్రెయిన్ ఆర్మీ కి కాస్త రిలాక్స్ కావడానికి మాత్రమే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను" కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే కానీ 30 రోజుల శాంతి ఒప్పందం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు’ అని అమెరికాకు ఇప్పటికే తేల్చిచెప్పింది రష్యా,గంటల వ్యవధిలోనే ఎయిర్‌ స్ట్రైక్స్‌గత రెండు రోజుల నుంచి చూస్తున్న పరిణామాల్ని బట్టి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న 30 రోజుల శాంతి ఒప్పందంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దాన్ని రష్యా పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శాంతి చర్చలకు తాము రెడీ అంటున్నా రష్యా కవ్వింపు చర్యలతో బదులివ్వక తప్పడం లేదు. ఇరు దేశాల అధ్యక్షులు స్వల్ప కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఇరు దేశాలు ఎయిర్ స్ట్రైక్స్ ను ప్రారంభించాయి. కేవలం మంగళవారం నాడు దాడులను ఆపడానికి ఏదో సూత్రప్రాయంగా ఒప్పుకున్న పుతిన్‌.. దానికి కట్టుబడలేదు. ఉక్రెయిన్‌ ఇంధన వనరులను దెబ్బ తీసే దిశగా ఎయిర్‌ స్ట్రైక్‌ జరిపింది రష్యా, పుతిన్‌ తాత్కాలికం‍గా దాడులు ఆపుతానని ఫోన్‌ లో తనకు మాటిచ్చినట్లు ట్రంప్‌ ప్రకటించిన కాసేపటికే రష్యా దాడులకు దిగింది. అందుకు ఉక్రెయిన్‌ కూడా ధీటుగానే బదులిచ్చింది. ట్రంప్ తో మాట్లాడతా.. చూద్దాం ఏం సమాధానం వస్తుందో?నేను నియంత్రణగా ఉండాలిని కోరుకుంటున్నాను. నా నియంత్రణకు ప్రధాన కారణం మాకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా అని నేను నమ్ముతున్నాను. మేము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాం. కానీ మా వనరులను దెబ్బ తీసే ప్రయత్నం జరిగితే.. మేము అదే చేస్తాం.. మీరు కూల్ గా ఉంటే మేము కచ్చితంగా కూల్ గా ఉంటాం. ఏదో కాల్పులు విరమణ అని చెప్పి మాపై దాడి జరిగితే మేము చూస్తూ ఊరుకోం. మాకు ఇంధన వనరుల విషయంలో సాయం చేయడానికి అమెరికాతో పాటు మా మిత్రదేశాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. నేను ట్రంప్ తోనే తేల్చుకుంటా.. కాల్పుల విరమణ అంటూ ప్రకటించిన గంటల వ్యవధిలోనే దాడి చేస్తే.. ఈ విషయాన్ని ట్రంప్‌ ప్రకటించిన కాసేటికే రష్యా ఉల్లంఘిస్తే ఏం చేయాలి. ట్రంప్‌తోనే మాట్లాడుతా.. ఏం సమాధానం వస్తుందో చూద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం?। అని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.

Special Story On Huge Debts Of Chandrababu Govt4
ఏం అమ్మి తీరస్తారు సామీ.. అప్పులన్నీ..?

సెంద్రబాబునాయుడు ఓ పక్కన కుర్సీ యెక్కిన కాణ్నించీ యెడాపెడా అప్పులు జేస్తానే వుండారు గదా..! అప్పు పుట్టించడాన్ని గూడా ఏదో యెవరెస్టు యెక్కిన మాదిర్తో టముకు యేసుకుంటా.. పోటోలకు పోజులిస్తావుంటారు గదా..! కానీ ‘యేంది సామీ.. రాజదాని కడతండావు సరే.. ఇన్నేసి డబ్బులు గుమ్మరిస్తండావేంది’ అని అడిగినామే అనుకో.. ‘ఓరి పిచ్చోడా యిది సెల్ఫ సస్టయినబుల్ ప్రోజెక్టురా.. అంటా వుంటాడు. అదేందో పలకడానికే నాకు నోరు తిరగడం లేదుగానీ.. ‘అంటే యేందిరా సామీ’ అని యింకో సావాసగాణ్ని అడిగినా. యేం జెప్పినాడో తెలుసునా...‘‘వోరి యెర్రోడా.. మన యెసుట్లోకి మనమే బియ్యం సంపాయించాల.. మన డప్పు మనమే గొట్టుకోవాల.. యిట్టాగానే.. ఆ అమరావతి గూడా దాన్ని కట్టడానికి కావాల్సిన డబ్బులంతా అదే సంపాదించుకుంటాదంట’’ అని జెప్పినాడు.యేడరా సామీ.. యాబయి వేల కోట్ల రూపాయలు ఇప్పుటికే అప్పులు తెస్తిరి.. తీరా జూడబోతే యిప్పుడు కట్టబొయ్యే కతలన్నీ కలిపి నలబై వేల కోట్ల కూడా లేకపాయె.. కొండంత అప్పులు దెచ్చినారు గదా.. యెట్టా తీర్చబోతారు అని కలవరం పుట్టింది నాకు. మా మినిస్టరు నారాయణ మాటలు యింటే మాత్రం సమ్మగా అనిపిస్తండాయి.. కలవరం మొత్తం మాయమైపోతాందంటే నమ్మాల! యింతకీ ఆయనేం అంటండారో తెలుసునా?యీ అప్పులతో ఇప్పునడు మొదులు బెడుతున్న బిల్డింగులు అన్నీ కట్టేయంగా యింకా నాలుగువేల యెకరాలు మిగల్తాయంట.. సిటీ మొత్తం దూందాంగా అయిపోయుంటాది గాబట్టి.. అప్పుడు బూముల రేట్లు ఆకాసెంలో వుంటాయంట. ఆ యేళకి గవుర్మెంటు కాడ నాలుగువేల యెకరాల బూమి వుంటాదంట.. దాన్నంతా అమ్మితే.. ఈ అప్పులు యేపాటివి.. వుఫ్ మని వూది పారేస్తాను గదా.. అంటాండారు. మాట యిన్నప్పుడు సమ్మగానే వుంటంది గానీ.. తలుసుకున్నప్పుడు మాత్రం గుబులు గుబులుగానే వుంటాండాది సామీ.. యిన్నేసి అప్పులు తెచ్చి గుప్పెడు బిల్డింగులు గట్టంగానే అమరావతి సిటీ మొత్తం పూర్తయిపోయినట్టేనా? ఇల్లలికితే పండగ అయిపోతందా? యిదిగూడా అట్నే గదా అని నా బయ్యిం.తీరా ఈ యాబైవేల కోట్లు తగలేసి ఏదో ఓ కాడికి పనులు అయినాయని అనుకున్నాక.. యిప్పుటిదాకా అయిందంతా.. కాయితం మీద గుర్రం బొమ్మ గీసినట్టే.. ఈ బొమ్మ పెకారం మంచి గ్రానైటు రాయిని దెచ్చి బొమ్మని చెక్కాల అని.. బొమ్మను చెక్కినాక, అయ్యో బొమ్మ నల్లగా ఉండాది గదా.. దీనికి బంగారం తాపడం జేయిస్తే బెమ్మాండంగా వుంటాది అనీ.. యిట్టా రకరకాల మాటలు జెప్తా.. అరలచ్చ కోట్లు నగరానికి యింకో లచ్చన్నర కోట్లు తగలెయ్యాల్సిందే.. అని కొత్త పాటలు పాడకుండానే వుంటారా? అనేది అనుమానంగా వుండాది సామీ..!యినుకుంటా వుండారా? ఒక్కో రోడ్డు యెయ్యాలంటే కిలోమీటరుకి యాబై మూడు కోట్ల రూపాయిలా..? నోట్లేమయినా అచ్చేస్తండామా సామీ..! ఈ దేసెంలో ఎంత పెద్ద రాచబాట యేసినా.. సెంట్రలు గవుర్మెంటోల్లు కిలోమీటరుకి 20 కోట్ల దుడ్లు పెడితే చానా జాస్తి అంటాండారే.. మనోళ్లేమైనా కొండల్ని పగలదీసి యేస్తండారా.. ఆకాసానికి అద్దాల నిచ్చెనేసి ఆ పైన రోడ్డేస్తండారా.. యేం జేస్తండారని.. కిలోమీటరుకి అన్నేసి కోట్లు తగలేస్తండారో వొక యితరణ వుండాల గదా? యిట్టా తగలేస్తే యింకో అరలచ్చ కోట్లు అప్పులు దెచ్చినా ఆరతి కర్పూరం అయిపోకుండా వుంటాయా అని నాకు బయం సామీ!యెనకటికి ఇద్దరు సావాసగాళ్లు వున్నారంట. వొకడు ‘తిందాం తిందాం’ అంటే.. ‘ఏం చేసి తిందాం’ అని రెండోవాడు అన్నాట్ట. ‘అప్పుజేసి తిందాం’ అంటే.. ‘అప్పెట్ట తీర్చాల’ అన్నాట్ట. ‘అప్పుజేద్దాం.. వూరొదిలి పారిపోదాం’ అన్నాట్ట మొదటి పెద్దమనిషి. ఆ మాదిర్తో జనం గుండెల మీద బండరాయి పడకుండా వుండాలంటే ఈ అప్పులకి యీడ పుల్ స్టాపు పెడతాండాం అని ఓ మాట జెప్పండి సామీ. లేపోతే అయ్యన్నీ తీర్చడానికి అమరావతిలోనూ అడుగు బూమీ మిగలదు.. మా బోటోళ్ల బతుకులన్నింటినీ వుడ్డగా అమ్మేస్తే తప్ప ఆ అప్పు తీరదు. కొంచిం దయపెట్టండి... ఎం.రాజేశ్వరి

Do not reduce the height of Polavaram YSRCP MP Avinash Reddy In Lok Sabha5
పోలవరం ఎత్తును తగ్గించవద్దు: లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ

ఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని లోక్‌సభ వేదికగా వైఎస్సార్‌సీపీ మరోసారి ఖండించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని, ఒరిజినల్ ఎత్తు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌స‌భ‌లో జ‌ల‌శ‌క్తి శాఖ ప‌ద్దుల‌పై చ‌ర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు పలు ప్రాజెక్టుల అంశాలను కూడా అవినాష్ లేవనెత్తారు.‘ ఇటీవ‌ల రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టుకు కేంద్రం ఈసీని తిర‌స్క‌రించింది. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యానికి ఇది నిద‌ర్శనం. ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన అనుమ‌తుల‌కోసం బాబు ప్ర‌భుత్వం త‌గిన ఒత్తిడి చేయ‌లేదు. వైఎస్ జగన్‌ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఈ ప్రాజెక్టు మెజారిటీ ప‌నులు పూర్త‌య్యాయి. రాయ‌ల‌సీమ ఎత్తిపోతల‌తో 800 అడుగుల వ‌ద్ద రోజు మూడు టిఎంసిల నీరు తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన అనుమ‌తులు కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వాలి. లేదంటే రాయ‌ల‌సీమ‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంది. ఓవైపు శ్రీ‌శైలంలో 798 అడుగుల వ‌ద్ద తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంది. 800 అడుగుల వ‌ద్ద పాల‌మూరు- రంగారెడ్డి , డిండి ప్రాజెక్టుల‌కు నీరు త‌ర‌లిస్తున్నారుఈ ప‌రిస్థితుల్లో 880 అడుగుల వ‌ర‌కు నీరు ఎప్పుడు వ‌స్తుంది...రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు నీళ్లెప్పుడు వ‌స్తాయి. గుండ్రేవుల ప్రాజెక్టుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయం అందించాలి. నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నాగార్జున‌సాగ‌ర్‌, శ్రీ‌శైలం ప్రాజెక్టుల రిపేర్లు చేప‌ట్టాలి. ఏపీకి జ‌ల‌జీవ‌న్ మిషన్ కింద నిధుల‌ను పెంచాలి. నంద్యాల - క‌ల్వ‌కుర్తి మ‌ధ్య రివ‌ర్ ఓవ‌ర్ బ్రిడ్జితోపాటు ఆన‌క‌ట్ట నిర్మించాలి’ అని అవినాష్ రెడ్డి కోరారు.

Lovely Professional University B.Tech student securing job offer of Rs 2.5 cr package6
ఎల్‌పీయూ బీటెక్‌ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్‌లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్‌మెంట్‌లో లీడర్‌గా ఎల్‌పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్‌పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్‌సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్‌పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్‌పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్‌కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్‌పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్‌, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్‌, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌లు పొందిన వివిధ బీటెక్‌ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్‌సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్‌లో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్‌ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్‌మెంట్‌ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్‌ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్‌సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్‌ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్‌పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్‌మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్‌పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్‌పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్‌లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్‌మెంట్లు సాధించేందుకు ఎల్‌పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్‌పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్‌పీయూ నెస్ట్‌ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్‌ ప్రాసెస్‌ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు.

Minds Who Have Led India In Different Formats: Hardik Pandya On MI Strength7
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్‌ పాండ్యా

జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక​ పాండ్యా పేర్కొన్నాడు.ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్‌ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్‌గా సూర్యకాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్‌ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.అయితే, గతేడాది స్లో ఓవర్‌ రేటు కారణంగా హార్దిక్‌ పాండ్యాపై ఒక మ్యాచ్‌ నిషేధం పడగా.. ఐపీఎల్‌-2025 ఆరంభ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్‌ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టంఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్‌ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్‌ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్‌ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జస్‌ప్రీత్‌ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దుఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్‌ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్‌కి వెళ్లినపుడు నన్ను చీర్‌ చేయండి. సిక్సర్‌ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్‌ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అతడి రాకతో రోహిత్‌, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చదవండి: BCCI: విరాట్‌ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ

IIHL takes control of Reliance Capital puts new board members in place8
‘ఇండస్‌ఇండ్‌’ ఆధీనంలోకి అంబానీ కంపెనీ

అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌సీఏపీ)ను ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) తన ఆధీనంలోకి తీసుకుంది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌, దాని అనుబంధ సంస్థల బోర్డును ఐఐహెచ్ఎల్ తన ఆధీనంలోకి తీసుకుందని, కొత్త బోర్డు తొలి సమావేశం బుధవారం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం మేరకు కొత్త బోర్డు సభ్యులుగా మోసెస్ హార్డింగ్ జాన్, అరుణ్ తివారీలు ఉన్నారు.అంతకుముందు రిలయన్స్‌ క్యాపిటల్‌ (ఆర్‌క్యాప్‌) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ (ఐఐహెచ్‌ఎల్‌) చైర్మన్‌ అశోక్‌ హిందుజా వెల్లడించారు. బిడ్‌ మొత్తాన్ని రుణదాతల ఖాతాలోకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ డీల్‌పై దాదాపు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నట్లు హిందుజా పేర్కొన్నారు.ఆర్‌క్యాప్‌ వ్యాపారాన్ని సమీక్షించి, అవసరమైతే నిధులను సమకూర్చడంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. చిన్నా చితకా అనుబంధ సంస్థలు 39–40 వరకు ఉన్నాయని, వాటిల్లో చాలా మటుకు సంస్థలను కొత్త మేనేజ్‌మెంట్‌ విక్రయించవచ్చని హిందుజా చెప్పారు. బ్రోకింగ్, అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ వ్యాపారాన్ని మాత్రం అట్టే పెట్టుకుంటుందని వివరించారు.నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాల ప్రకారం మూడేళ్ల పాటు అదే పేరుతో వ్యాపారాలను కొనసాగించవచ్చని, కానీ తమ సొంత ఇండస్‌ఇండ్‌ బ్రాండ్‌తో అనుసంధానించడంపై కసరత్తు చేస్తున్నామని హిందుజా చెప్పారు. అనుసంధానానికి 6–9 నెలల సమయం పట్టొచ్చని వివరించారు.చెల్లింపుల విషయంలో డిఫాల్ట్‌ కావడం, గవర్నెన్స్‌లో లోపాలు తదితర అంశాల కారణంగా రిలయన్స్‌ క్యాపిటల్‌ను 2021లో రిజర్వ్‌ బ్యాంక్‌ నియమించిన అడ్మినిస్ట్రేటర్‌ తన ఆధీనంలోకి తీసుకున్నారు. కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద 2023 ఏప్రిల్‌లో రూ. 9,650 కోట్లు ఆఫర్‌ చేసి ఐఐహెచ్‌ఎల్‌ విజయవంతమైన బిడ్డరుగా నిల్చింది.

Mahatma Movie Actress Bhavana Responds On Her Divorce Rumours9
మీ కోసం నా భర్త ఫోటోలు షేర్ చేయాలా?.. విడాకులపై మహాత్మ హీరోయిన్

తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ భావన. శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ చిత్రంలో ఆడియన్స్‌ను మెప్పించింది. కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన 2018లో కన్నడ నిర్మాత నవీన్‌ రమేశ్‌ను పెళ్లాడింది. గతేడాది 'నడికర్' అనే మలయాళ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భావన తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. ఇంతకీ ఆ ముచ్చట ఏంటో తెలుసుకుందాం పదండి.ఈ మలయాళీ భామ త్వరలోనే తన భర్త నవీన్‌ రమేశ్‌తో విడిపోనుందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో తమపై వస్తున్న వార్తలపై భావన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. అలాగే తన భర్తతో దిగిన ఫోటోలను కూడా తాను షేర్ చేయకపోవడం వల్లే ఇలా మాట్లాడుకుంటున్నారని భావన వెల్లడించింది.భావన మాట్లాడుతూ..' నా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు ఇష్టముండదు. అందుకే మేము విడాకులు తీసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గోప్యతను పాటిస్తా. నేను యాదృచ్ఛికంగా ఫోటోలు పోస్ట్ చేసినా ఏదో తప్పు జరిగిందని ఊహాగానాలు సృష్టిస్తారు. అలా అని మా బంధం నిరూపించడానికి మేము సెల్ఫీలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా?" అంటూ విడాకులపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది. భావన తన సినీ కెరీర్‌ను మలయాళ చిత్రం నమ్మల్ (2002)తో ప్రారంభించింది. తరువాత చితిరం పెసుతడితో తమిళ సినిమాల్లోకి ప్రవేశించింది. తమిళంలో అజిత్‌ కుమార్ సరసన కూడా నటించింది. ఆ తర్వాత ఒంటరి మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ తెలుగులో ఆమెకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆమె ప్రస్తుతం కన్నడ చిత్రం పింక్ నోట్, తమిళ చిత్రం ది డోర్‌ సినిమాలో కనిపించనుంది.

YSRCP Protest Chandrababu Promise On Free Bus Journey Scheme10
ప్చ్‌.. చంద్రబాబు పేరు చెప్పినా వినలేదు!

తిరుపతి, సాక్షి: సాధారణంగా.. చం‍ద్రబాబు ఎన్నికలొస్తున్నాయంటే అడ్డగోలు హామీలు ప్రకటిస్తారు. వాటిని అమలు చేయడం అనేది ఆయన రాజకీయంలోనే లేదు. ఈ మాట మేం అంటోంది కాదు.. యావత్‌ ఏపీ కోడై కూస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో నిరసనలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutavam) చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న ప్రయత్నం జరిగింది. బుధవారం ఉదయం కొందరు ప్రయాణికులు.. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్‌ వచ్చి టికెట్‌ అడగ్గానే.. వాళ్లంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. ‘‘అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. నాదీ హామీ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు.. తాను అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్‌ మాస్క్‌ వేసుకుని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో.. ఆ కండక్టర్‌ నిర్ఘాంతపోయారు. అయితే.. ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్క్‌తో ఉన్న వ్యక్తి బస్సులో హడావిడి చేశారు. అయితే ‘‘టికెట్ అడిగితే నా పేరు చెప్పండి’’ స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్‌కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్‌ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్‌ చివరకు పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండిదీంతో.. బస్సును నేరుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్‌కు తరలించగా.. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్‌ డాక్టర్‌ శిరీష(Mayor Sirisha) కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి అభినయ్‌ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
Trump: న్యాయవ్యవస్థను బేఖాతరు చేయబోతున్నారా?

అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార

title
అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం

ఆరేలియో మార్టినెజ్: అమెరికాలోని హోండురాస్‌(

title
సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్‌ మస్క్‌ సంచలన ఆరోపణలు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ

title
Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా

న్యూఢిల్లీ: తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యో

title
సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?

ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌

National View all
NRI View all
title
సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్‌ రిక్వెస్ట్‌!

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం  కేసులో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

title
తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో

title
ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు

 ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర

title
పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా

title
Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్‌ సంతాపం

అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్

NRI View all
title
Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్‌ కో

అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్‌ అండ్‌ కో

title
నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సిన

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement

వీడియోలు

Advertisement