
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోందని ఆ సంస్థ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు, సర్వైజర్లు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీకి రూ.1099 కోట్లు రావాల్సి ఉందన్నారు. 2014 నుంచి రావాల్సిన రూ.1500 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ చెల్లింపులపై అఫిడవిట్ వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్మికులు ఎవ్వరూ అధైర్య పడొద్దని కోరారు. కాగా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment