JAC convenor
-
వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు: జేఏసీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలకు సూచించారు. 75 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ప్రపంచంలో 14 దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో 6 రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి. అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి.’ అని పేర్కొన్నారు జేఏసీ కన్వీనర్. ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ కో కన్వీనర్ దేవుడు మాడ్లాడుతూ.. ఇంకా ఉపేక్షిస్తే మన మనుగడకే ఇబ్బంది వస్తుందని ప్రజలకు సూచించారు. అమరావతికి ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మరోవైపు.. విశాఖ పరిపాలన రాజధాని కావాలన్నారు మేధావుల ఫోరం అధ్యక్షులు. కర్నూలు రాజధాని కాకముందే విశాఖ రాజధాని ప్రతిపాదన ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకు సిద్ధం.. వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అవంతి, కరుణం ధర్మశ్రీ. విశాఖ రాజధాని కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధంమని వెల్లడించారు అవంతి. స్పీకర్ ఫార్మాట్లో జేఏసీ కన్వీనర్‌కు కరుణం ధర్మశ్రీ రాజీనామా లేఖ. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంమని సవాల్ చేశారు. మరోవైపు.. విశాఖ రాజధానిపై రెఫరెండానికి తాము సిద్ధమని తెలిపారు మంత్రి అమర్నాథ్. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేంగా చేస్తున్నయాత్రపై నిరసన తెలియజేస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు -
మెగాస్టార్ ఇంటి ముట్టడి; క్లారిటీ ఇచ్చిన జేఏసీ
సాక్షి, అమరావతి : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ముట్టడించబోతుందన్న వార్తల్లో వాస్తవం లేదని అమరావతి జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతి రావు స్పష్టం చేశారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఓవైపు ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఉద్యమిస్తుంటే.. చిరంజీవి జగన్‌కు మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తీరును తప్పుపడుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆయన ఇంటి ముట్టడికి సిద్దమవుతోందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు స్పందించారు. సోషల్ మీడియాలో జేఏసీ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. అటువంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు -
సంపూర్ణంగా ఆర్టీసీ సమ్మె..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోందని ఆ సంస్థ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు, సర్వైజర్లు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీకి రూ.1099 కోట్లు రావాల్సి ఉందన్నారు. 2014 నుంచి రావాల్సిన రూ.1500 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ చెల్లింపులపై అఫిడవిట్ వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్మికులు ఎవ్వరూ అధైర్య పడొద్దని కోరారు. కాగా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. -
‘ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పేరుతో బదనాం చేస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికలు దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నారని, ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పేరుతో బదనాం చేస్తుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏపీ తరుపున ఆయన శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యంకు సమ్మె నోటీసులు అందచేశారు. అనంతరం అశ్వద్ధామ మాట్లాడులూ.. తెలంగాణలో ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని, ఈ నెల 23, 24 తేదీల్లో సంస్థ డిపోల ముందు ధర్నాలు చేయనున్నామని, దీనిని కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారని గుర్తు చేసిన ఆయన.... మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకే సంస్థను పిచ్చికుక్కలా తయారు చేస్తోందనిడ్డి మండిపడ్డారు. దీనిపై అన్ని సంఘాలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ నష్టాల్లో లేదని, ఓఆర్ పెరిగిందని అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే నష్టాల పేరు ఎత్తుతోందని, లాభ నష్టాలతో సంబంధం లేకుండా సంస్థను ప్రభుత్వం కాపాడాలన్నారు. 2013లోనే ఆర్టీసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ వేసిందని, విలీనంపై హర్యానా, పంజాబ్ వెళ్లి అధ్యయనం చేసి వచ్చి నివేదిక కూడా ఇచ్చామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అశ్వద్ధామ పేర్కొన్నారు. కో-కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు అన్ని యూనియన్లతో కలిసి పోరాడుతామని, తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ కార్మికులను తగ్గించినా సంస్థ ఆదాయం పెంచామని అన్నారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని... ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని గుర్తు చేశారు. కో- కన్వీనర్ వీఎస్ రావ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రూ.3.6 కోట్లు పన్నుల రూపంలో కడుతున్నామని, ఎవరికీ పన్నులు లేనప్పుడు తమకెందుకు పన్నుల వేస్తారని ప్రశ్నించారు. సామాజిక బాధ్యతగా సర్వీసులు నడుపుతున్నామని, రైతు ఆత్మహత్యలులతో పాటు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కూడా చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చేసిన చట్టాలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అర్చక ఉద్యో గులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీని రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు అమలు చేయడంలో విఫలమవుతున్నారని అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి విమర్శించారు. ఈ నెల 10వ తేదీలోగా సీఎం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించకపోతే మరోసారి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గుంటు మల్లన్న దేవస్థాన ఆవరణలో ఖమ్మం జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అర్చక ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5,625 మంది అర్చక ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని గతేడాది సీఎం చెప్పారని గుర్తుచేశారు. కేవలం 738 మందికే డిసెంబర్, జనవరి వేతనాలను సగం ట్రెజరీ నుంచి మిగతా సగాన్ని దేవాలయాల నుంచి తీసుకోవాలని దేవాదాయ అధికారులు చెప్పారని తెలిపారు. సీఎం హామీని నెరవేర్చకపోతే జనవరి 11న కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో వివిధ జిల్లాల అర్చక ఉద్యోగ జేఏసీ నేతలు పాల్గొన్నారు. -
కదులుతున్న ‘కామారెడ్డి’
తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన కామారెడ్డి మరో ఉద్యమానికి సై అంటోంది. మూడు జిల్లాల కూడలి, అన్ని అర్హతలున్న కామారెడ్డినే జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ‘కామారెడ్డి జిల్లా సాధన సమితి’ని ఏర్పాటు చేసుకున్నారు. అన్నివర్గాలను కలుపుకుని ఉద్యమించాలని నిర్ణయించారు. అందులో భాగంగా శనివారం పట్టణంలో సమావేశమై పలు తీర్మానాలు చేశారు. రాస్తారోకో, ధర్నా చేసి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి : కామారెడ్డిని జిల్లా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. దీనికోసం ఉద్యమించడానికి స్థానికులు సిద్ధమవుతున్నారు. ‘కామారెడ్డి జిల్లా సాధన సమితి’ శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా సాధన కోసం ఉద్యమబాట పట్టాలని నిర్ణయించారు. జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానం చేశారు. అందులో భాగంగా రాస్తారోకో నిర్వహించి పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 16న కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, అయితే కామారెడ్డి ప్రాంతాన్ని మెదక్ లోగానీ, సిద్ధిపేటలోగానీ కలుపుతారన్న వార్తలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. కామారెడ్డి ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కలిగి జిల్లా ఏర్పాటుకు కావలసిన అన్ని అవకాశాలు, అర్హతలు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ మరో ప్రాంతంలో కలిపే చర్యలను ఈ ప్రాంత ప్రజలు ఒప్పుకోరని జేఏసీ నేతలు పేర్కొన్నారు. జిల్లాను సాధించుకునేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, మేధావులతో ‘కామారెడ్డి జిల్లా సాధన కమిటి’ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. కామారెడ్డి జిల్లా ఒక్కటే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈనెల 16న కామారెడ్డి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండును ప్రభుత్వానికి నివేదించాలని కోరుతూ ఆర్డీఓ వేంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా నిజాంసాగర్ చౌరస్తా వరకు వెళ్లి రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేసి తీసు కెళ్లారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం, కో కన్వీనర్ తిర్మల్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గౌరీశంకర్, న్యాయవాదులు క్యాతం సిద్ధిరాములు, రాంచంద్రారెడ్డి, నాగభూషణం, గంగాధర్, గంగరాజం, సలీం, కాంగ్రెస్, టీడీపీ నేతలు మామిండ్ల అంజయ్య, నల్లవెల్లి అశోక్, విజయ్‌కుమార్‌రెడ్డి, పండ్ల రాజు, ఉస్మాన్, సీపీఎం నాయకుడు చంద్రశేఖర్, రాజలింగం, విద్యార్థి సంఘాల నేతలు ఆజాద్, రాజు, రాణాప్రతాప్, నరేశ్, శివకుమార్, నాగరాజు, కుంబాల లక్ష్మణ్, వివిధ సంఘాల నేతలు గఫూర్ శిక్షక్, మనోహర్‌రావు, గబ్బుల లక్ష్మిపతి, నాగరాజు, నర్సారెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.