సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి | Priest Gangu Bhanumurthy demands KCR for salaries | Sakshi
Sakshi News home page

సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి

Published Sun, Jan 7 2018 3:02 AM | Last Updated on Wed, Aug 15 2018 9:45 PM

Priest Gangu Bhanumurthy demands KCR for salaries - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: అర్చక ఉద్యో గులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఇచ్చిన హామీని రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు అమలు చేయడంలో విఫలమవుతున్నారని అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్‌ గంగు భానుమూర్తి విమర్శించారు. ఈ నెల 10వ తేదీలోగా సీఎం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించకపోతే మరోసారి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గుంటు మల్లన్న దేవస్థాన ఆవరణలో ఖమ్మం జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అర్చక ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5,625 మంది అర్చక ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని గతేడాది సీఎం చెప్పారని గుర్తుచేశారు. కేవలం 738 మందికే డిసెంబర్, జనవరి వేతనాలను సగం ట్రెజరీ నుంచి మిగతా సగాన్ని దేవాలయాల నుంచి తీసుకోవాలని దేవాదాయ అధికారులు చెప్పారని తెలిపారు. సీఎం హామీని నెరవేర్చకపోతే జనవరి 11న కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో వివిధ జిల్లాల అర్చక ఉద్యోగ జేఏసీ నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement