మెగాస్టార్‌ ఇంటి ముట్టడి; క్లారిటీ ఇచ్చిన జేఏసీ | Amaravati JAC Convener Given Clarity On Chiranjeevi House Siege | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌ ఇంటి ముట్టడి; క్లారిటీ ఇచ్చిన అమరావతి జేఏసీ

Published Fri, Feb 28 2020 7:30 PM | Last Updated on Sat, Feb 29 2020 5:40 PM

Amaravati JAC Convener Given Clarity On Chiranjeevi House Siege - Sakshi

సాక్షి, అమరావతి : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ముట్టడించబోతుందన్న వార్తల్లో వాస్తవం లేదని అమరావతి జేఏసీ కన్వీనర్‌ గద్దె తిరుపతి రావు స్పష్టం చేశారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఓవైపు ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఉద్యమిస్తుంటే.. చిరంజీవి జగన్‌కు మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో చిరంజీవి తీరును తప్పుపడుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆయన ఇంటి ముట్టడికి సిద్దమవుతోందన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు స్పందించారు. సోషల్ మీడియాలో జేఏసీ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. అటువంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement