వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు: జేఏసీ | JAC Leaders Said That Decentralization Benefits The Downtrodden | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి: జేఏసీ

Published Sat, Oct 8 2022 4:26 PM | Last Updated on Sat, Oct 8 2022 4:38 PM

JAC Leaders Said That Decentralization Benefits The Downtrodden - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలకు సూచించారు. 75 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ప్రపంచంలో 14 దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో 6 రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి. అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి.’ అని పేర్కొన్నారు జేఏసీ కన్వీనర్‌. 

ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ కో కన్వీనర్‌ దేవుడు మాడ్లాడుతూ.. ఇంకా ఉపేక్షిస్తే మన మనుగడకే ఇబ్బంది వస్తుందని ప్రజలకు సూచించారు. అమరావతికి ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందన‍్నారు. మరోవైపు.. విశాఖ పరిపాలన రాజధాని కావాలన‍్నారు మేధావుల ఫోరం అధ్యక్షులు. కర్నూలు రాజధాని కాకముందే విశాఖ రాజధాని ప్రతిపాదన ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజీనామాకు సిద్ధం..
వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అవంతి, కరుణం ధర్మశ్రీ. విశాఖ రాజధాని కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధంమని వెల్లడించారు అవంతి. స్పీకర్‌ ఫార్మాట్‌లో జేఏసీ కన్వీనర్‌కు కరుణం ధర్మశ్రీ రాజీనామా లేఖ. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంమని సవాల్‌ చేశారు. మరోవైపు.. విశాఖ రాజధానిపై రెఫరెండానికి తాము సిద్ధమని తెలిపారు మంత్రి అమర్నాథ్‌. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన‍్నారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేంగా చేస్తున్నయాత్రపై నిరసన తెలియజేస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement