
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వానికి అమరావతి జేఏసీ వ్యతిరేకం కాదని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు.
కాగా, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు. 30 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జరగలేదు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ క్రమబద్దీకరణ చేశారు. జీపీఎస్ విధానం పాత పెన్షన్ విధానానికి దగ్గరగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘కన్నా లక్ష్మీనారాయణ నీ చరిత్ర నాకు తెలుసు..’
Comments
Please login to add a commentAdd a comment