Employes
-
ఆఫీస్‌లో తక్కువ స్థాయి పనైతే ఏం చేయాలి..?
‘‘అది నా పని కాదు’’.. అనే మాటను ఆఫీసులలో తరచు వింటుంటాం. తప్పేం లేదు. ఏ పని చేయటానికైతే ఉద్యోగంలో చేరామో ఆ పనే కదా చేయాలి! అయితే కొన్నిసార్లు మనకు మించిన పనినో, మనం చేస్తున్న పని కన్నా తక్కువ స్థాయి పనినో అత్యవసరంగా చేయవలసి వస్తుంది. అంటే.. పనే మనల్ని వెతుక్కుంటూ రావటం అన్నమాట. (మొదట్లో పని కోసం మనం వెతుక్కుంటూ వచ్చినట్లుగా). అప్పుడేం చేయాలి? ఏదైనా చెయ్యొచ్చు. మించిన పనైతే ‘‘బాబోయ్.. నా వల్ల అవుతుందా!’’ అని తప్పించుకోవచ్చు. తక్కువస్థాయి పనైతే ‘‘అది నా పని కాదు’’ అని ముఖం తిప్పేసుకోనూ వచ్చు. ఈ రెండూ కాకుండా... ‘‘ఎస్, ఐ కెన్’ అని ఏ పనికైనా ఉత్సాహంగా చేయందించవచ్చు. సినిమాల్లోకి రాకముందు పరిణీతి చోప్రా కూడా ఒక సాధారణ ఉద్యోగే. రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, రాణి ముఖర్జీ వంటి సినీ సెలబ్రిటీలకు పీఆర్‌గా పని చేశారు. వారి షెడ్యూళ్లు చూసుకోవటం, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయటం ఆమె పని. అయితే ఆ పనులు మాత్రమే చూసుకోలేదు పరిణీతి. అవసరం అయినప్పుడు, బాయ్స్ అందుబాటులో లేనప్పుడు అనుష్క శర్మ, రాణి ముఖర్జీ, దీపికా పడుకోన్, నీల్ నితిన్ ముఖేశ్‌లకు కాఫీలు కూడా అందించారట! ‘‘తప్పేముంది? మనం చేయగలిగిన పనే కదా!’’ అంటారు పరిణీతి.అక్టోబర్ 22 పరిణీతి పుట్టిన రోజు. ఆ సందర్భంగా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో.. తన తొలినాళ్ల ఉద్యోగ బాధ్యతల్ని, అదనంగా వచ్చి పడిన పనులను తనెంత ఇష్టంగా నిర్వహించిందీ గుర్తు చేసుకున్నారు పరిణీతి. ‘‘అవసరమైనప్పుడు పనిలో స్థాయీ భేదాలు చూసుకోనక్కర్లేదని నా ఉద్దేశం..’’ అంటారు ప్రస్తుతం స్టార్ నటిగా వెలిగిపోతున్న పరిణీతి. -
బడ్ లైట్ వివాదం.. భారీగా ఉద్యోగుల తొలగింపు!
బడ్ లైట్ వివాదానికి ప్రభావితమైన 'గ్లాస్ బాట్లింగ్' (Glass Bottling) కంపెనీ ఎట్టకేలకు తన రెండు ప్లాంట్స్ మూసివేయనుంది. అమ్మకాల పరంగా అస్థిరమైన ఆర్ధిక నష్టాలను చవి చూస్తున్న కారణంగా ఈ ప్లాంట్స్‌లో ఏకంగా 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బాట్లింగ్ కంపెనీ మూసివేయడానికి కారణాన్ని వెల్లడించలేదు. అయితే రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బార్లు, కాంట్రాక్ట్ కంపెనీలు వివాదాస్పద బడ్‌పై దేశవ్యాప్త బహిష్కరణల ఆగ్రహాన్ని అనుభవిస్తున్నందున, బడ్ లైట్ అమ్మకాలను ట్యాంకింగ్ చేయడం వల్ల ప్లాంట్లు మూతపడుతున్నాయని భావిస్తున్నారు. గతంలో వెల్లడైన కొన్ని నివేదికల ప్రకారం, బాట్లింగ్ కంపెనీ ప్లాంట్లలోని కార్మికులు ఉత్పత్తి తగ్గినట్లు, డిమాండ్ తగ్గడం వల్ల లూసియానా అండ్ నార్త్ కరోలినా ప్లాంట్లు తమ మెషీన్లలో కొన్నింటిని ఆఫ్‌లైన్‌లో ఉంచవలసి వచ్చిందని సమాచారం. అయితే కంపెనీ పరిస్థితి రోజు రోజుకి క్షీణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఉంటుందనుకుంటున్నారు. కంపెనీ మూసి వేసిన ప్లాంట్లలో బడ్వైజర్ అండ్ బడ్ లైట్ కోసం బాటిళ్లను ఉత్పత్తి చేసేవారు. అయితే బడ్వైజర్ ఇకపై బాటిల్‌ను విక్రయించనందున, వారికి ఇకపై బాట్లింగ్ ఉత్పత్తి అవసరం లేదు. ఇది కూడా కంపెనీ మూసివేతకు ప్రధాన కారణం. ఇది మాత్రమే కాకుండా గత ఏప్రిల్ నెలలో బీర్మేకర్ ఒక బాలిక సెలబ్రేషన్ సమయంలో ప్రత్యేక డబ్బాలను బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి బడ్ లైట్ అమ్మకాలు క్షీణించాయి. (ఇదీ చదవండి: ఈ ఒక్క వైన్ బాటిల్ కొనాలంటే రూ. కోట్లు పెట్టాల్సిందే! ప్రత్యేకతేంటంటే?) మార్కెట్ విలువలో ఇప్పటికే బిలియన్ల డాలర్లను కోల్పోయిన బ్రాండ్ కొత్త వేసవి ప్రకటన ప్రచారాన్ని ప్రారంభించింది. బీర్మేకర్ పంపిణీదారులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకుంది, దాని మార్కెటింగ్ బడ్జెట్‌ను కూడా పెంచింది. కంపెనీలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీర్ అమ్మకాలు క్రమంగా తగ్గుతుండటం వల్ల బడ్ లైట్ బ్రాండ్‌కు ఎదురుదెబ్బ తగులుతోంది. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) 2023 జూన్ 3 వరకు అమ్మకాలు భారీగా తగ్గాయి. గత సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే ఈ అమ్మకాలు సుమారు 24.4 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్న కారణంగా రెండు కంపెనీ ప్లాంట్స్ మూసివేయవల్సి వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. -
ఏపీ ప్రభుత్వానికి అమరావతి జేఏసీ వ్యతిరేకం కాదు: బొప్పరాజు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వానికి అమరావతి జేఏసీ వ్యతిరేకం కాదని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు. కాగా, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు. 30 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జరగలేదు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ క్రమబద్దీకరణ చేశారు. జీపీఎస్ విధానం పాత పెన్షన్ విధానానికి దగ్గరగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘కన్నా లక్ష్మీనారాయణ నీ చరిత్ర నాకు తెలుసు..’ -
ఉద్యోగులకు షాకిచ్చిన మీషో.. 251 మంది అవుట్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో 251 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో ఇది 15 శాతం. తొలగించిన ఉద్యోగులందరికీ నోటీసు పీరియడ్ దాటి ఒక నెల అదనంగా పరిహారంతో పాటు ఎసాప్స్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్), బీమా ప్రయోజనాలు, జాబ్ ప్లేస్మెంట్పరమైన మద్దతు మొదలైన తోడ్పాటు అందించనున్నట్లు సిబ్బందికి పంపిన ఈమెయిల్లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. కోవిడ్ పరిణామాలు, భారీగా పెట్టుబడుల ఊతంతో 2020 నుంచి 2022 నాటికి కంపెనీ 10 రెట్లు వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. అయితే, స్థూల పరిస్థితులు గణనీయంగా మారిపోవడంతో, లాభార్జన లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలను వేగవంతం చేయాల్సి వస్తోందని ఆత్రే వివరించారు. -
'జీతాలిచ్చే వాళ్లపై జోకులేస్తే ఇలాగే ఉంటది', ఎలన్ మస్క్‌కు భారీ ఝులక్!
టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు ఝలక్ ఇచ్చేలా ఉద్యోగులు తమని అక్రమంగా విధుల నుంచి తొలగించడంపై ఉద్యోగులు లేబర్ కోర్ట్‌ను ఆశ్రయించుకోవచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే టెస్లా సంస్థ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల టెస్లా ఉద్యోగులు ఆ సంస్థ తీరును, సీఈవో ఎలన్ మస్క్‌ను విమర్శిస్తూ ఉద్యోగులు ఇంటర్నల్ చాట్ సిస్టం (ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ)లో దుమ్మెత్తి పోశారు. బహిరంగంగా ఓపెన్ లెటర్‌ను విడుదల చేశారు. ఆ లెటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్ ఉద్యోగుల్ని (ఎంత మంది అనేది స్పష్టత లేదు) తొలగించారు. ఈ తొలగింపుతో ఉద్యోగులు మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్లా ఉద్యోగుల పట్ల ఆయన వ్యవహార శైలి సరిగ్గా లేదని మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో టెస్లా తొలగించిన ఉద్యోగులు నేషనల్ లేబర్ రిలేషన్ బోర్డ్ (ఎన్ఎల్ఆర్బీ)లో పిటిషన్ దాఖలు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయంపై న్యాయవ్యవస్థకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు. ఎన్ఎల్ఆర్బీలో టెస్లాకు వ్యతిరేకంగా ఉద్యోగులు పిటిషన్ దాఖలు ఆ సంస్థకు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. లేబర్ చట్టాన్ని ఉల్లంఘించారని అపవాదుతో పాటు తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, వారికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇదే అంశంపై సీటెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షార్లెట్ గార్డెన్ మాట్లాడుతూ..కోర్ట్లు కేసు ఫైల్ అయితే టెస్లా సంస్థ ఆకస్మికంగా ఉద్యోగుల్ని ఎందుకు తొలగించిందో చెప్పాల్సి ఉంటుందని అన్నారు. అలాంటిది ఏం లేదు! మస్క్‌ను విమర్శించినందుకే ఉద్యోగుల్ని తొలగించారని వస్తున్న ఆరోపణలపై టెస్లా ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్ స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను విమర్శించిన ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపారు. ఎందుకు వారి వల్ల సంస్థకు నష్టంతో పాటు..సాధారణ ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. అందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయాల్లో ఉద్యోగులు ఇలాంటి అనాలోచిత చర్యలు సరైనవి కావని ఉద్యోగులకు పంపిన లేఖలో గ్విన్ షాట్వెల్ పేర్కొన్నారు. చదవండి👉టెస్లా ఉద్యోగులు: ఎలన్ మస్క్ నీ పద్దతి మార్చుకో..లేదంటే నీకే నష్టం! -
ఉద్యోగుల చేతివాటం! అప్పగించమంటే అమ్మేసుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: అమెజాన్ గోదాములకు చేర్చాల్సిన కంప్యూటర్ ఉపకరణాలను స్వాహా చేసి అమ్మేసుకున్న అమేజ్ సొల్యూషన్స్ సంస్థ ఉద్యోగులతో పాటు రిసీవర్లను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసినట్లు దర్యాప్తు అధికారిగా ఉన్న టీమ్–1 ఏసీపీ ఎం.శ్రీనివాస్‌రావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని సీటీసీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆనందిత్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్ సంస్థ కంప్యూటర్ విడి భాగాలు, ఉపకరణాల వ్యాపారం చేస్తుంటుంది. ఆన్లైన్ ద్వారానూ వ్యాపారం చేస్తున్న ఈ సంస్థకు అమెజాన్‌లో ‘ఏ1 ప్రై స్ ఏ1 ప్రొడక్ట్స్’ అనే డిస్ప్లే నేమ్ నమోదై ఉంది. కస్టమర్ల ఆర్డర్లకు తగ్గట్టు ఆనందిత్ సంస్థ తమ ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెజాన్ గోదాములకు చేరుస్తుంటుంది. అక్కడి నుంచి ఈ సరుకు అమెజాన్ ద్వారా వినియోగదారులకు డెలివరీ అవుతుంది. తమ ఉత్పత్తులను నిర్ణీత ప్రమాణాలు, పరిమాణంతో ఉండే బాక్సుల్లో ప్యాక్ చేసే ఆనందిత్ సంస్థ వాటిపై షిప్మెంట్ లేబుల్‌ను అతికిస్తుంది. వీటిని ఈ సంస్థ నుంచి అమేజాన్ గోదాములకు చేర్చే బాధ్యతను ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అమేజ్ సొల్యూషన్స్ నిర్వహిస్తుంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు ఆనందిత్ సంస్థ నుంచి ఆయా బాక్సులను సేకరించి భద్రంగా అమేజాన్ గోదాములకు చేరుస్తుంటారు. అమేజ్ సంస్థకు నగరానికి సంబంధించి ఉప్పల్‌లోని హెచ్ఎండీఏ లేఔట్లో ఉన్న గోదాము ద్వారా ఈ రవాణా జరుగుతుంది. ఈ సంస్థలో అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లు డెలివరీ బాయ్స్‌గా, నర్సింగ్ యాదవ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నగరానికి చెందిన వ్యాపారి కృష్ణకుమార్‌తో అనిల్, మనోజ్‌లకు పరిచయం ఉంది. అమేజాన్ గోదాములకు డెలివరీ చేసే సరుకులో కొంత స్వాహా చేసి తీసుకువస్తే తాను ఖరీదు చేస్తానంటూ అతను వీరిద్దరితో చెప్పాడు. దీనికి అంగీకరించిన ద్వయం కొన్నాళ్లుగా సరుకు స్వాహా చేసి కృష్ణకు అందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ మొదలు అమెజాన్ సంస్థ నుంచి ఆనందిత్‌కు ఈ–మెయిల్స్ రూపంలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్డర్ ప్రకారం సరుకు రావట్లేదని, వచ్చిన వాటిలోనూ కొంత తక్కువ ఉంటోందని వాటి సారాంశం. ఈ నేపథ్యంలో ఆనందిత్ సంస్థ లోతుగా ఆరా తీయగా రూ.1.35 కోట్ల విలువైన 4262 బాక్సులు, సరుకు గల్లంతైనట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిని దర్యాప్తు చేసిన అధికారులు అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లతో పాటు కృష్ణకుమార్‌ను అరెస్టు చేశారు. వీరి సరుకు చోరీ చేస్తున్నారని తెలిసినా యాజమాన్యానికి ఫిర్యాదు చేయని డ్రైవర్ నర్సింగ్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణ నేపథ్యంలోనే సరుకు మొత్తం అమీర్‌పేట, సికింద్రాబాద్‌ల్లో ఉన్న ఐదుగురు సెల్‌ఫోన్, కంప్యూటర్ దుకాణదారులకు విక్రయించినట్లు తేలింది. దీంతో వీరినీ నిందితులుగా పరిగణిస్తూ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రూ.లక్షల విలువైన కంప్యూటర్ విడి భాగాలు రికవరీ చేశారు. ఫిర్యాదుదారులు పేర్కొన్న స్థాయిలో సరుకు చోరీ జరగలేదని భావిస్తున్నారు. దీన్ని నిర్థారించే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. (చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి) -
ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ బాధ్యతలొద్దు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల కమిషనర్లుగా నియమించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఒక ప్రభుత్వ అధికారికి అప్పగించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. మార్గోవా, మాపుసా, మార్ముగోవా, సంగెం, క్వీపెం మున్సిపల్ ఎన్నికలకు గోవా ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. చట్ట ప్రకారం మహిళలకు వార్డులు కేటాయించకపోవడంతో సదరు 5 మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ సందర్భం గా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను రాజీ చేయలేమని, ఎన్నికల కమిషనర్లు స్వతంత్ర వ్యక్తులుగా ఉండాలని, ప్రభుత్వం లో పదవిలో ఉన్న వ్యక్తిని ఏ రాష్ట్రాలూ ఎన్నికల కమిషనర్‌గా నియమించజాలవని పేర్కొంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి గోవాలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం బాధాకరమై న అంశమని ధర్మాసనం అభిప్రాయ పడింది. -
పోస్టల్ సిరా..పచ్చ ఎర
సాక్షి, అనంతపురం అర్బన్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో అనుకూల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్‌ను కొనేందుకు అధికారపార్టీ నాయకులు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో కేంద్రం వద్ద హంగామా చేశారు. ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశారు. అయితే వారి చర్యలను పలువురు తిరస్కరించారు. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అనుకూల కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి పల్లెరఘునాథ్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు హల్చల్ చేశారు. దీంతో టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా పెద్దగా మారింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీ చార్జీ చేసి అక్కడి నుంచి పంపించేశారు. రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసి కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అనంతరం ఇరువర్గాలు నాయకులు కేంద్రం వెలుపలకు వచ్చేశారు. ఇబ్బందిపడ్డ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌంటర్లు తక్కువగా ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓటరు ముందుగా ఫారం 12తో పాటు ఓటరు, ఆధార్ కార్డు అందజేస్తే ఫారం 13 ఇస్తారు. దానిపైన గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తిరిగి కౌంటర్లో అందజేయాలి. అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అభ్యర్థులకు ఓటు వేసి డిక్లరేషన్ కాపీ, పోస్టల్ బ్యాలెట్ పత్రాలను కవర్లో పెట్టి ట్రంక్ పెట్టలో వేయాలి. కౌంటర్లు తక్కువగా ఉండటంతో ఒక్కొక్కరికి గంటకు పైగా సమయం పట్టింది. అనంతపురం అర్బన్ కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయగా... ఓటు వేసేందుకు దాదాపు 5 వేల మంది ఉద్యోగులు రావడంతో కేంద్రం కిక్కిరిసిపోయింది. రాప్తాడుకు సంబంధించి ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కేంద్రంలో బైఠాయించి కౌంటర్లు పెంచాలంటూ నినాదాలు చేశారు. గుంతకల్లు, పుట్టపర్తి, తదితర నియోజకవర్గాల్లోనూ కేవలం ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. హిందూపురంలో తోపులాట.. ఆర్ఓకు వ్యతిరేకంగా ఆందోళన హిందూపురం : హిందూపురంలోని ఎస్డీజీఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద రెండు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడం..ఉద్యోగులు వేలాదిగా తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో ఉద్యోగులు ఆర్ఓ తీరుపై నిరసన వ్యక్తంచేశారు. సదుపాయాలు కల్పించడంతో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఆర్ఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇంతలో ప్రచారం కోసం వచ్చిన బాలకృష్ణ ఉద్యోగులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. వారు ఆర్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ అక్కడినుంచి వెళ్లిపోయారు. రద్దీ ఎక్కువగా ఉన్నా...పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న వారంతా సాయంత్రం 5 గంటల్లోపు వెనక్కు బాక్సులో వేయాలని ఆర్ఓ గుణభూషన్‌రెడ్డి చెప్పడంతో కొందరు ఉద్యోగులు ఆయన్ను నిలదీశారు. 22వ తేదీ వరకు సమయం ఉన్నందున ఇలా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. మరోవైపు కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో మహిళా ఉద్యోగినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓట్ల కొనుగోలుకు బేరసారాలు హిందూపురం కేంద్రం వద్ద టీడీపీ నాయకులు హల్చల్ చేశారు. బ్యాలెట్ పత్రం తీసుకుంటున్న ఉద్యోగులను పలకరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని బహిరంగంగానే ప్రచారం చేశారు. కొందరు ఉద్యోగ సంఘ నాయకులను పక్కకు పిలిపించి బేరసారాలు కూడా చేశారు. ఇక తన అనుచరులతో కలిసి వచ్చిన టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఏకంగా లైన్లో ఉన్న ఉద్యోగుల వద్దకే వెళ్లి ప్రచారం చేశారు. మహిళ ఉద్యోగులను ముచ్చటిస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. తర్వాత పోలింగ్ గదిలో వెళ్లి పోస్టల్ పేపర్లలో ఓట్లు టిక్ చేస్తున్న మహిళా ఉద్యోగులతో మాట్లాడుతూ ప్రచారం చేశారు. దీనిపై ఆర్ఓ గుణశేఖర్‌రెడ్డిని వివరణకోరగా.. గుంపులుగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఉద్యోగులకు హామిలివ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై నోటీసు జారీ చేస్తామని చెప్పారు. కుట్రలకు తెరలేపారు : మాలగుండ్ల శంకరనారాయణ పెనుకొండ: టీడీపీ పాలనలో నలిగిపోయిన ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ నిర్ణయాన్ని తెలుపుతుండటంతో ఓర్వలేని టీడీపీ నాయకులు కుట్రలకు తెరలేపారని వైఎస్సార్ సీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వలంటీర్లుగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కళాశాలకు చెందిన డైట్ విద్యార్థులను ఎంపిక చేశారని, దీంతో వైఎస్సార్సీపీకి నష్టం జరిగేలా వారు వ్యవహరించారన్నారు. ఇక 5 మండలాలకు ఒకే కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్రలకు తెరలేపారన్నారు. 400 ఓట్లు దాటితే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఎన్నికల నిబంధన ఉన్నా... వేలాది మంది ఉద్యోగులున్నా... ఆర్ఓ ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదన్నారు. తమకు ఎలాంటి అన్యాయం జరిగినా... దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ పరిస్థితే ఇలా ఉంటే...11వ తేదీ జరిగే పోలింగ్ ఎలా ఉంటుందోనన్న భయం అందరిలోనూ నెలకొందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి స్పందించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
సీపీఎస్‌పై నేనున్నానంటూ వైఎస్ జగన్ భరోసా
సాక్షి, అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్).. ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర కలవరం రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న ఈ పింఛన్ పథకంపై ఏపీలో ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. గత నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ పోరాటంలో భాగంగా ఉద్యమబాట పట్టిన సర్కారీ వేతనజీవులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆందోళనకు ఉవ్వెత్తున తరలివచ్చిన ఉద్యోగులను కర్కశంగా అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తీరని శాపంగా మారిన సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ అండగా నిలబడ్డారు. అధికారంలోకి వచ్చిన నెలలోపే సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పడం ద్వారా ఉద్యోగ వర్గాలకు కొండంత భరోసా ఇచ్చారు. సీపీఎస్ విషయంలో కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రకటనపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. (చదవండి: ఒక్క నెలలోనే సీపీఎస్ రద్దు చేస్తాం) ఏమిటీ సీపీఎస్..? గత కొంతకాలంగా ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను 2003లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి తెరపైకి తెచ్చింది. దీనినే నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్సీఎస్) అని కూడా పిలుస్తారు. త్రిపుర, బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఆ పథకంలో క్రమంగా చేరాయి. ఈ పథకం రాకముందువరకు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వమే ఉద్యోగులకు పెన్షన్ ఇస్తూ వచ్చింది. కానీ కొత్త స్కీమ్ ప్రకారం ప్రతినెల ఉద్యోగి జీతం నుంచి 10 శాతం కట్ చేస్తున్నారు. ప్రభుత్వం మరో 10శాతం నిధులు కలిపి పెన్షన్‌గా ఇస్తోంది. ఈ పెన్షన్ నిధిని నేషనల్ పెన్షన్ స్కీం ఎన్పీఎస్ ట్రస్ట్, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ద్వారా షేర్ మార్కెట్లో మదుపు చేస్తారు. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీతశాతం యూన్యూటీ ప్లాన్‌లో ఉంచి నెలవారీ పెన్షన్‌ను చెల్లిస్తారు. దీనికోసం 2013లో యూపీఏ ప్రభుత్వం విపక్ష ఎన్డీయే మద్దతుతో పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్‌ను తెచ్చింది. సీపీఎస్‌ను ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇదివరకు పెన్షన్ కోసం ఉద్యోగి జీతం నుంచి నగదును కట్ చేసేవారు కాదు. కొత్త విధానం ప్రకారం జీతంలో 10శాతం కోత పెడుతున్నారు. పాత విధానం ప్రకారం పెన్షన్ గ్యారెంటీ ఉండేది. పదవీ విరమణ ముందు ఉద్యోగి జీతం ఆధారంగా పెన్షన్‌ను ఖరారు చేసేవారు. ఉదాహరణకు పాత పెన్షన్ విధానంలో ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రిటైరయ్యే నాటికి రూ. 60వేలు ఉందనుకుంటే పదవీ విరమణ తరువాత అతడికి రూ. 30వేలు పెన్షన్‌గా అందుతుంది. 40 శాతం కమ్యూటేషన్ చేసినా డీఏ, మెడికల్ అలవెన్సులు కలిపితే కుటుంబ అవసరాలకు తగినంత పెన్షన్‌గా వచ్చేది. కొత్త విధానంలో పెన్షన్‌కు ఎలాంటి భరోసా ఉండదు. (సీపీఎస్ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు) స్టాక్ మార్కెట్ పెరిగితే పెన్షన్ పెరుగుతుంది. సెన్సెక్స్ కుప్పకూలితే పెన్షన్ కూడా కరిగిపోతుంది. పాత విధానంలో పెన్షన్ ముందుగానే సరెండర్ చేయవచ్చు. దీన్నే కమ్యూటేషన్ అంటారు. సీపీఎస్‌లో ఆ సౌకర్యం లేదు. పాత విధానంలో పెన్షన్‌తో సంబంధం లేకుండా గరిష్ఠంగా 12 లక్షల వరకు గ్రాట్యూటీ వచ్చేది. ఇప్పుడు గ్రాట్యూటీ లేదు. పాత పెన్షన్ విధానం ప్రకారం ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఉద్యోగి చివరి బేసిక్‌లో సగం, దానిపై డీఏను పెన్షన్‌గా ఇచ్చేవారు. కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగి చనిపోతే షేర్ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఎలాంటి పెన్షన్ ఉండదు. ఇలా అన్ని విధాల తీవ్ర విఘాతంగా మారిన సీపీఎస్‌పై గత కొంతకాలంగా సర్కారీ ఉద్యోగులు ఉద్యమిస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ అండ సీపీఎస్ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేయడం మినహా వారి సమస్యను ఏనాడూ పట్టించుకొని పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆవేదనను, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేనున్నానంటూ ముందుకొచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తానని గతంలో పలుమార్లు హామీ ఇచ్చిన ఆయన.. తాజాగా గురువారం కడపలో నిర్వహించిన ఎన్నికల సమరశంఖారావం సభలో స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. సీపీఎస్ విషయంపై ఉద్యోగులు అడిగితే మనం ఏం చెప్పాలని పార్టీ కార్యకర్త ఒకరు ప్రశ్నించగా.. ‘చంద్రబాబు సీపీఎస్ విషయంలో కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఏమీ చేయలేదు. సీపీఎస్ కింద అన్ని వర్గాల ఉద్యోగులున్నారు. మూడు నెలల తర్వాత అన్న అధికారంలోకొస్తాడు.. అప్పుడు ఒక్క నెలలోపే సీపీఎస్‌ను రద్దు చేస్తాడని గట్టిగా చెప్పండి’ అని వైఎస్ జగన్ స్పష్టంగా సూచించారు. వైఎస్ జగన్ ఈ మేరకు స్పష్టమైన వైఖరి ప్రకటించడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
సవాళ్లున్నాయి... అధిగమిద్దాం!
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ముందు రాజకీయ అనిశ్చితి సహా, 2019లో ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లు ఎదురు కానున్నాయని టాటా సన్స్ (టాటా గ్రూపు మాతృ కంపెనీ) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాలని టాటా గ్రూపు ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రూపు పరిధిలోని ఏడు లక్షల మంది ఉద్యోగులకు ఆయన లేఖ ద్వారా సందేశమిచ్చారు. డిజిటల్‌పై లోతైన పరిజ్ఞానం, సమష్టితత్వం, నిర్వహణపరమైన కార్యాచరణ, అంతర్జాతీయ మార్పులను సమర్థంగా పరిష్కరించే క్రియాశీలతలపై దృష్టి సారించాలని మార్గదర్శనం చేశారు. 2018లో టాటా గ్రూపు మిశ్రమ పనితీరు కనబరిచినట్టు చెప్పారు. ఇక ముందు చేయాల్సింది ఎంతో ఉందంటూ... 100 బిలియన్ డాలర్లకు పైగా విలువైన గ్రూపు నిర్మాణాన్ని మరింత సరళీకరించడాన్ని ఒకానొక కార్యక్రమంగా ప్రస్తావించారు. ‘‘2019 ఎన్నో స్థూల ఆర్థిక సవాళ్లను తీసుకురానుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక చక్రం పరిపక్వతకు చేరింది. అభివృద్ధి చెందిన దేశాల కదలికలపైనే ప్రపంచ ఆర్థిక వృద్ధి ఆధారపడటం పెరుగుతోంది. ద్రవ్య పరమైన కఠినతర పరిస్థితులు 2019లోనూ అంతర్జాతీయంగా కొనసాగుతాయి’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘మన పరుగు ను కొనసాగించడమే మన ఉద్యోగం. మరొకరి పరుగుపైకి మనసు మళ్లకూడదు’’ అని సూచించారు. కీలక ముందడుగు..: ‘టాటా కంపెనీల పునర్వ్యవస్థీకరణ, రుణాల తగ్గింపు, గ్రూపు పరిధిలో ఒక కంపెనీలో మరో కంపెనీ వాటాలను స్థిరీకరించడం, కీలకమైన ఆస్తుల కొనుగోలు, భవిష్యత్తు వృద్ధికి గాను రూ.70,000 కోట్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ 2018లో రూ.10 లక్షల కోట్లు దాటింది’’అని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 7,02,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉన్నట్టు చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. భద్రత, గౌరవనీయంగా పనిచేసే వాతావరణం అన్నది మొదటి నుంచి తమకు అత్యంత ప్రాధాన్యమైనవిగా పేర్కొన్నారు. టాటా గ్రూపు పరిధిలో మొత్తం ఉద్యోగుల్లో 1,86,000 మంది మహిళలు పనిచేస్తుండడం గమనార్హం. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎకోసిస్టమ్... దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల ఎకోసిస్టమ్ ఏర్పాటుకు టాటా మోటార్స్... గ్రూపులోని టాటా పవర్, టాటా క్యాపిటల్‌తో కలసి పనిచేస్తుందని చంద్రశేఖరన్ చెప్పారు. ‘‘టాటా క్యాపిటల్ నుంచి ఆర్థిక సాయం, టాటా పవర్ నుంచి చార్జింగ్ వసతుల నెట్వర్క్ విషయమై టాటా మోటార్స్ కృషి చేస్తోంది’’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
‘జూనియర్, డిగ్రీ’ బదిలీలకు షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగుల బదిలీల షెడ్యూలును ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. జూనియర్ లెక్చరర్లు ఆదివారం లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 13కల్లా ప్రింట్ కాపీ, సర్టిఫికెట్లను జిల్లా ఇంటర్ విద్యాధికారికి అందజేయాలని సూచించింది. ఖాళీలను 13న ప్రకటిస్తామని తెలిపింది. వాటిపై 14న అభ్యంతరాలను స్వీకరిస్తామని, సవరించిన జాబితాలను 15న ప్రకటిస్తామని చెప్పింది. బదిలీలకు అర్హులైన వారి జాబితాను 17న ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తామని, 21న బదిలీలకు అర్హులైన వారి తుది జాబితాను ప్రకటిస్తామని వివరించింది. ఉద్యోగులు ఈనెల 22 నుంచి 24వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 26న బదిలీ ఆర్డర్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే డిగ్రీ కాలేజీల్లో ఈనెల 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఖాళీలను 9న ప్రకటించి 10, 11 తేదీల్లో వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. 12న ఫైనల్ ఖాళీల జాబితాను ప్రకటించి, 13 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. బదిలీలకు అర్హులైన వారి తుది జాబితాను 18న ప్రకటించి, 20న బదిలీ ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. -
టీఎస్ఐఐసీలో ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. టీఎస్ఐఐసీ వీసీఎండీ వెంకటనర్సింహారెడ్డి, సీఈఓ సుధాకర్, ఉన్నతాధికారులతో పాటు ముస్లిం ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వమతాల ఐక్యతకు రంజాన్ పండగ ప్రతీక అని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్, సీజీఎం గీతాంజలి, జనరల్ మేనేజర్లు కళావతి, సునీతా బాయి, డీజీఎంలు కవిత, దీపక్ కుమార్, జోనల్ మేనేజర్ మాధవి పాల్గొన్నారు. -
ఒత్తిడిని ఓడించలేక...
సాక్షి, బెంగళూరు: ఇంటా, బయటా పనుల హడావుడిలో గజిబిజి జీవితాన్ని సాగిస్తున్న నేటి తరం మహిళలు పనిఒత్తిళ్ల కారణంగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగానే ఉద్యోగినుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని అసోచామ్ సంస్థ ఇటివల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అసోచామ్ సంస్థ తన సర్వేలో భాగంగా బెంగళూరు నగరంలో అటు గృహిణిగా, ఇటు ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన కలిగించే కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. లైఫ్ సైటల్ డిసీజెస్ అధికం... సర్వేలో భాగంగా నగరంలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న 2,800 మంది ఉద్యోగినుల వివరాలను సేకరించారు. వీరిలో దాదాపు 75 శాతం మంది ఉద్యోగినులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 32 నుండి 58 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ముఖ్యంగా వీరంతా ఒబేసిటీ, డయాబిటీస్, హైపర్‌టెన్షన్ వంటి లైఫ్ సైటల్ డిసీజెస్‌తో పాటు వెన్నెముకలో నొప్పి, గుండె, కిడ్నీ తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఇక సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కాల్షియం కొరత, రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఉద్యోగినుల్లో ఇంతమంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడడానికి కారణాలు తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే వీరంతా కనీసం డాక్టర్‌ను కలిసేందుకు కూడా సమయం లేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని అసోచామ్ సర్వే వెల్లడించింది. ఇక మరికొంతమందేమో తమ ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. కాగా ఇంటిని నడిపేందుకు తాము ఉద్యోగం చేయాల్సి వస్తోందని, వైద్యం చాలా ఖరీదవుతున్న ప్రస్తుత రోజుల్లో తాము వైద్య పరీక్షల కోసం ప్రతిసారీ డబ్బు వెచ్చించడం అంటే కష్టమని మరికొందరు మహిళలు ఈ సర్వేలో తెలిపారు. భయం కూడా ఒక కారణమే... ఉద్యోగినులు ఇలా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడానికి గల ప్రముఖ కారణాల్లో ఉద్యోగ భయం కూడా ఒకటని అసోచామ్ నివేదిక వెల్లడించింది. నగరంలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. సరైన సమయానికి తిండి, సరైన పనివేళలు కూడా కార్పొరేట్ సంస్థల్లో కనిపించడం లేదంటే నమ్మకతప్పదు. ఇక ఉద్యోగ బాధ్యతల్లో ఇచ్చిన లక్ష్యాలను అందరికన్నా ముందుగా పూర్తి చేయాలని, లేదంటే తమ ఉద్యోగాలను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అనే భయం మహిళలను వెంటాడుతోంది. అందుకే తమ ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అటు ఇళ్లు, ఇటు ఆఫీసు పనులతో నిత్యం సతమతమవుతున్నారు. దీంతో వారిలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వైద్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు... సాధారణంగా ఒక గృహిణిగా ఉండడంతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తించే మగువల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అది కూడా 30 ఏళ్లు దాటితే ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. అందుకే ఏడాదికోసారి తప్పనిసరిగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా స్తన, గర్భాశయ క్యాన్సర్లను చాలా వరకు నిరోధించవచ్చు. ఇక ఎంత పని ఒత్తిడితో ఉన్నా కూడా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా లైఫ్సైటల్ డిసీజెస్‌ను అరికట్టవచ్చు. ఇంటిని నడిపే మహిళ ఆరోగ్యంలో సమస్యలు తలెత్తితే ఆ ప్రభావం కుటుంబమంతటిపైనా పడుతుందని మరిచిపోవద్దు. -డాక్టర్ ఫాతిమా, కర్ణాటక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి -
రూ.1100 కోట్ల రుణాలకు బ్రేక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 19వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం 4,264 మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటం.. ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో సెర్ప్ పథకాలు చతికిలబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.60 లక్షల స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లోని 51 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడంలో సెర్ప్ది కీలక భూమిక. ఒక్కసారిగా ఉద్యోగులు ఆందోళనబాట పట్టడంతో సంఘాల లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల అందజేత అటకెక్కడంతో డబ్బులకు తీవ్ర కటకట ఏర్పడింది. 2017–18లో ఎస్‌హెచ్‌జీలకు రూ.7 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయాలన్నది లక్ష్యం. ఈ ఒక్క నెలలోనే రూ.1,100 కోట్ల రుణ వితరణ జరగాల్సి ఉండగా.. సమ్మె కారణంగా అది సాధ్యపడలేదు. ఇప్పటి వరకు రూ.38 వేల కోట్ల అప్పు ఎస్‌హెచ్‌జీలపై ఉంది. రూ.500 కోట్ల రుణ రికవరీ కూడా ఆగిపోయింది. ఈ నెలలో సుమారు రూ.120 కోట్ల స్త్రీనిధి రుణాలకు మహిళలు నోచుకోలేకపోయారు. సీఎం కేసీఆర్ సెర్ప్న కు చైర్మన్‌గా వ్యవహరిస్తుండటం కొసమెరుపు. మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు.. కొన్ని జిల్లాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా మూత బడ్డాయి. సదరం క్యాంపులదీ అదే దారి. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చేయడం, మరుగుదొడ్ల నిర్మాణం తదితరాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నడుం బిగించింది. ఈ నెల 20న ‘చలో హైదరాబాద్‌కు’పిలుపునిచ్చింది. ఒక్కో ఉద్యోగి 25 మంది ఆత్మీయులతో కలసి హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. -
పని బారెడు..జీతం మూరెడు
ఎస్ఎస్ఏలో కాంట్రాక్ట్ సిబ్బంది ఆవేదన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ కొత్తపేట : విద్యాభివృద్ధి, ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ ఫలితాలే లక్ష్యమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు ఆచరణలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. విద్యాశాఖలో సర్వ శిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ)లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల పనితో పోలిస్తే ఎక్కువ పనిచేస్తున్నా తగిన ఫలితం మాత్రం పొందలేకపోతున్నారు. తమకు ఉద్యోగ భద్రత ,సమాన పనికి సమాన వేతనం, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఏమాత్రం కరుణించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో ఎస్ఎస్ఏ ద్వారా 1,175 మంది పని చేస్తుండగా వారిలో 287 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్పీ), 64 మంది చొప్పున కంప్యూటర్ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, ఎంఆర్సీ అసిస్టెంట్స్, పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు 696 మంది ఉన్నారు. చాలిచాలని వేతనాలు 2011లో అప్పటి ప్రభుత్వం జిల్లా కమిటీ ఇంటర్వూలు ద్వారా గ్రాడ్యుయేట్‌తో బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారిని రూ.5,500 వేతనంతో నియమించింది. 2013,14 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రూ.1,500 చొప్పున పెంచింది. ప్రస్తుతం రూ.8,500 జీతంతో తీవ్ర కష్టాల నడుమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు 2004లో అప్పటి ప్రభుత్వం రూ.1,500 వేతనంతో నియమించింది.తరువాత 2007 నుంచి 2014 వరకూ 5 దఫాలుగా రూ.8,500 పెంచాయి.ప్రస్తుతం రూ 10,000 జీతంతో పనిచేస్తున్నారు. 2012 లో అప్పటి ప్రభుత్వం ఎంఐఎస్ కోర్డినేటర్స్ను రూ.8,500 వేతనంతో నియమించింది. 2013,14ల్లో రూ.3,500 పెంచింది.ప్రస్తుతం రూ.12 వేలు జీతానికి పనిచేస్తున్నారు. 2005లో చేరిన ఎంఆర్సీ అసిస్టెంట్లు ప్రస్తుతం రూ.7,500కు పని చేస్తున్నారు. రూ 6 వేలతో ఎలా బతికేదెలా? 2012–13 సంవత్సరంలో ఎస్ఎస్ఏ లో పార్టటైం ఇన్స్ట్రక్టర్లు (డ్రాయింగ్,క్రాప్టు, పీఈటీలు)గా జిల్లాలో సుమారు 696 మంది నియమితులయ్యారు. మొదట వారికి రూ.4,500 గౌరవ వేతనంగా చెల్లించారు.2014–15 లో రూ.6 వేలకు పెంచారు. గతంలో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లను విద్యా సంవత్సరం నిర్వహించిన విధులకు సంబంధించి వేతనాలు చెల్లించగా ఈ ఏడాది మే 3 నుంచే విధుల్లోకి తీసుకోవాలని ఆర్సీ నెంబరు 1707/ఏపీ ఎస్ఎస్ఏ/ఏ9-2017 ప్రకారం స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) మే 3న జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో అధికారులు లేనిపోని సాకులు చూపుతూ అమలు చేయలేదని వారు వాపోయారు. కేవలం తమ టీచింగ్ విధులే కాక అదనంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తమను ఉపయోగించుకుంటున్నారని, తాజాగా విద్యార్థి గణన కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పీఏబీ ప్రతిపాదిత జీతాలేవి? ఎస్ఎస్ఏ కు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) ప్రతిపాదించిన రూ.20,755 చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తక్కువ వేతనాలు చెల్లిస్తూ మిగిలిన నిధులను వేరే పథకాలకు మళ్లిస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల పొట్టకొడుతోందని వాపోతున్నారు. ఆర్పీ, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోర్డినేటర్లు, ఎంఆర్సీ అసిస్టెంట్లకు మే నుంచి, పీటీఐలకు కూడా ఎస్పీడీ ఉత్తర్వుల ప్రకారం 2 నెలలుగా జీతాలు విడుదల కావడం లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేస్తామని మరచిపోయారని విమర్శిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 7న ఔట్సోర్సింగ్ సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. మూడేళ్లలో సుమారు 100 మెమోరాండాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదు సరికదా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి పెంచలేదు. ఈ మూడేళ్లలో సుమారు 100 మెమోరాండాలు ఇచ్చాం. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. అరకొర జీతాలతో కుటంబాల పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. -ఎం శ్రీనివాసరావు,ప్రెసిడెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్, అల్లవరం -
సమరశీల పోరాటాలకు సిద్ధమవుదాం
ఎమ్మిగనూరురూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సవాలుగా మారిన సీపీఎస్ రద్దు కోసం çసమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి ఎస్వీ రమణయ్య పిలుపునిచ్చారు. స్థానిక గా«ంధీనగర్‌లో డీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవి విరమణ పొందిన తరువాత భవిష్యత్త్‌కు భద్రత లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయడం తగదన్నారు. ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు అనుకులంగా సంక్షేమ రంగంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని అలోచిస్తున్నాయన్నారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కింద 9565 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా నిబంధనలకు విరుద్ధంగా వాటిలో 155 మందికి హెచ్ఎంలుగా పదోన్నతలు కల్పించారన్నారు. దీంతో సాంకేతికంగా జీతాలు చెల్లింపు సమస్య వచ్చిందని చెప్పారు. జిల్లాలో పదోన్నతులు పొందిన 33 మంది హెచ్ఎంల జీతాల చెల్లింపునకు ట్రెజరీ అధికారులు నిరాకరిస్తే డీటీఎఫ్ కృషి ఫలితంగా ఏపీ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందన్నారు. అయితే సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇందులో భాగంగా 2012 జనవరిలో జారీ చేసిన 3,4 జీఓలను సవరించి హెచ్ఎంల పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారంకోసం 2017 జనవరి 11 న విజయవాడ(అమరావతి)లో ధర్నా తలపెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి కె.రత్నం, జిల్లా అ«ధ్యక్ష, కార్యదర్శులు కరె కృష్ణ, జి.తిమ్మప్ప నాయాకులు వీరన్న, గొట్ల చంద్రశేకర్, కిశోర్, రామన్న, వెంకట్రాముడు, ఈశ్వరరెడ్డి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులను పెంచాలని వినతి
ఖమ్మం సహకారనగర్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా భూ కొలతలు, ల్యాండ్ రికార్డుల శాఖలో సిబ్బందిని పెంచాలని కోరుతూ జేసీ దివ్యకు టీఎన్జీఓస్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉద్యోగుల సంఘం నేతలు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు అఫ్జల్‌హసన్, జగదీష్ మాట్లాడారు. జిల్లాల పునర్విభజన సమయంలో తామంతా పూర్తి మద్దతు నిస్తున్నామని, ప్రస్తుతం తమ శాఖలో ఉన్న సిబ్బందితో ప్రభుత్వ కార్యక్రమాల అమలుతోపాటు భూ హద్దులు, తగాదాలను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలు పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరని, త్వరలో తమ శాఖకు సిబ్బందిని పెంచాలని కోరారు. కార్యక్రమంలో శాంతకుమారి, ఉపేందర్, సుధాకర్, సత్యేంద్రకుమార్ పాల్గొన్నారు -
సచివాలయ ఉద్యోగులకు ఘన స్వాగతం
నగరంపాలెం( గుంటూరు): వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పరిపాలన విధులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలివచ్చారు. సికింద్రాబాద్–విజయవాడ రైలులో ఉదయం 10.35 గంటలకు వారంతా గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోగా స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి గులబీ పూలతో స్వాగతం పలికారు. ‘రాజధానికి తరలివస్తున్న ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు స్వాగతం.. అవినీతి రహితమైన పరిపాలనను అందించాలని కోరుతున్నాం..’ అంటూ అవగాహన సంస్థ బ్యానర్లు ప్రదర్శించింది. సచివాలయ మహిళాlఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మంది బ్యానర్లు ప్రదర్శించుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి వెలుపలికి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా వెలగపూడిలోని సచివాలయంకు వెళ్లేందుకు ఆర్టీసీ పది బస్సులను రైల్వేస్టేషన్ వద్ద సిద్ధంగా ఉంచింది. వారంతా ఆ బస్సుల్లో సచివాలయానికి చేరుకున్నారు. చిన్నచిన్న సమస్యలున్నా స్వంతరాష్ట్ర అభివద్ధి దష్ట్యా సర్దుకుపోయి పనిచేసుకుంటామని ఈ సందర్భంగా వారు విలేకరులకు తెలిపారు. -
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కోదాడఅర్బన్: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కోదాడ ఆర్టీసీ డిపో గేటు ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో టిమ్స్ సర్వీసులు రద్దు చేయాలని, పెంచిన కిలోమీటర్లు తగ్గించాలని, గ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌ఎస్‌గౌడ్, కేవీరావు, డిఆర్ దాస్,బీఎస్ నారాయణ, పీ.సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగుల మహాధర్నా
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా నుద్దేశించి సంఘం జిల్లా అధ్యక్షుడు కోడిరెక్క కోటిరత్నం మాట్లాడుతూ గత మూడేళ్ళుగా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారన్నారు. చదువుకు, హోదాకు తగ్గ వేతనం ఇవ్వాలని, ఈపిఎఫ్ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ప్రతినెలా ఒకటో తేదీకల్లావేతనాలు ఇవ్వాలని, హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలని, ప్రస్తుతం ధరలు పెరిగిన దష్ట్యా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ కోసం పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాశిస్టులు, స్టాఫ్‌నర్సులు, కౌన్సిలర్లు, డేటా మేనేజర్లు, కేర్ కో ఆర్డినేటర్లు, తదితరులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. మహాధర్నాలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జ్యోతుల వీరాస్వామి, జిల్లా సెక్రటరీ శ్రీనివాసరావు, మహిళా విభాగం కన్వీనర్ స్వర్ణలత, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ మండలి ప్రాజెక్ట్ మేనేజర్ లంకపల్లి మధుసూధనరావు, షిప్ అధ్యక్షురాలు రమాదేవి, టీఎన్‌పీ ప్లస్ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ కార్యాయంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్‌లో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు అందజేశారు. -
ఎన్జీ రంగా టైంస్కేల్ ఉద్యోగుల నిరసన ర్యాలీ
గుంటూరు రూరల్ : ఆచార్య ఏన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం టైం స్కేలు ఉద్యోగులు 10 రోజులుగా చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమం గురువారం కొనసాగింది. నగర శివారుల్లోని గోరంట్ల ఇన్నర్ రింగ్రోడ్డునుంచి వర్శిటీ అడ్మిన్ కార్యాలయం వరకూ ఉద్యోగులు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్శిటీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె కాశీనందేశ్వరరావు మాట్లాడతూ జీవో119 ప్రకారం ఇంటి అద్దె, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సులను 12 క్యాజువల్ లీవు, రిటైర్మెంట్ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని, 10వ పీఆర్సీ ఫార్స్ల మేరకు ౖటñ ంస్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు వీడీఏతో కూడిన కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర యునివర్సిటీల్లో అన్ని సౌకర్యాలు గత 2 సంవత్సరాలుగా అమలు అవుతున్నాయని, కానీ మన రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ విశ్వవిధ్యాలయ టైం స్కేలు ఉద్యోగులకు సౌకర్యాలు అమలు చేయకుండా వివక్షత చూపుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 25–30 ఏళ్ల టైం స్కేల్‌పై పనిచేసి రిటైర్ అయినా ,చనిపోయినా ఎటువంటి బెనిఫిట్స్ చెల్లించకుండా యునివర్సిటి యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ద్వజమెత్తారు. ఎటువంటి లీవు సౌకర్యాలు అమలు చేయడంలేదని, అనారోగ్యంపాలైనా పట్టించుకోవడంలేదని వాపోయారు. సమస్య పరిష్కారానికై వ్యవసాయ శాఖా మంత్రి జోక్యం చేసుకోని వెంటనే టైంస్కేల్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కె నిరంజన్‌కుమార్, గౌరవాధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, సంఘం సభ్యులు వర్శిటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
‘పోడు’ పాడు
ఇల్లెందు మండలం రొంపేడులో 8 హెక్టార్ల మొక్కజొన్న.. టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలో కొనసాగిన పంటల ధ్వంసం – పోడు భూముల్లో హరితహారం – అడ్డుకున్న గ్రామస్తులు – రొంపేడు, ఒడ్డుగూడెంలలో ఉద్రిక్తత – పోలీస్, అటవీశాఖ సిబ్బంది మోహరింపు ఇల్లెందు/ టేకులపల్లి: ఇటు ఇల్లెందు మండలం రొంపేడు, అటు టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలలో అటవీశాఖ అధికారులు మంగళవారం పంటలను ధ్వంసం చేశారు. రొంపేడులో న్యూడెమోక్రసీ నేతలకు చెందిన 8 హెక్టార్ల మొక్కజొన్న చేనును పోలీస్ రక్షణతో తొలగించారు. ఎన్డీ జిల్లా నాయకులు నాయిని రాజు, మండల నాయకులు తోడేటి నాగేశ్వరరావు, మరొకరికి చెందిన 8 హెక్టార్ల మొక్కజొన్నను మూడు ట్రాక్టర్ల సహాయంతో ధ్వంసం చేశారు. కోటిలింగాల వద్ద ఎన్డీ నేత బోసుకు చెందిన 8 ఎకరాల పంటను ధ్వంసం చేసిన మరుసటిరోజే రొంపేడులో అదేపార్టీకి చెందిన ఇద్దరు నేతల చేలను ధ్వంసం చేయడం గమనార్హం. ఉదయమే పంట చేను వద్దకు మూడు ట్రాక్టర్లు, పోలీస్, అటవీశాఖ సిబ్బంది చేరుకున్నారు. తమ పంటలను తొలగించ వద్దని పోడురైతులు నాయిని రాజు, తోడేటి నాగేశ్వరరావు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఇల్లెందు రేంజర్ బీవీవీఎస్‌కే ప్రసాద్‌ను వేడుకున్నారు. ఆయన వినకపోవడంతో మహిళలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని పంటను ధ్వంసం చేస్తున్న ట్రాక్టర్లకు అడ్డుపడ్డారు. అటవీశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అటవీశాఖ సిబ్బంది వారిని తొలగించి పంటలను ధ్వంసం చేశారు. మరో నెలరోజుల్లో పంట చేతికొస్తుందనే దశలో అటవీ, పోలీసుశాఖల సిబ్బంది ఈ విధ్వంసానికి పాల్పడ్డారని బాధిత రైతు నాయిని రాజు వాపోయారు. ఉన్న ఆరు ఎకరాల్లో కనీసం రెండు ఎకరాలను కూడా వదలకుండా ధ్వంసం చేశారన్నారు. వేసవిలోనే సమాచారం ఇచ్చివుంటే సాగు చేసేవాళ్లం కాదన్నారు. – సమాచారం ఇచ్చినా సాగు చేశారు: బీవీవీఎస్‌కే ప్రసాద్, రేంజర్ అన్యాక్రాంతమైన భూముల్లో సాగు చేయవద్దని గత వేసవిలోనే సమాచారం ఇచ్చాం. హరితహారంలో భాగంగా కొమ్ముగూడెం బీట్‌లో 45 హెక్టార్లలో మొక్కలు నాటాలని నిర్ణయించాం. ఒకే చోట 8 హెక్టార్లలో సాగు చేశారు. 2005 డిసెంబర్ 13 తర్వాత పోడు నరికి పంటలు సాగు చేసిన భూములను అటవీశాఖ స్వాధీనం చేసుకుంటుంది. మొక్కలు నాటుతుంది. ఒడ్డుగూడెంలోనూ విధ్వంసం మరోవైపు టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలోనూ పంటల విధ్వంసం కొనసాగుతోంది. సోమవారం పంటలు ధ్వంసం చేసిన అధికారులు మంగళవారం కూడా కొనసాగించారు. చాతకొండ రిజర్వ్‌ఫారెస్టు, కొప్పురాయి బీట్ ఒడ్డుగూడెంలోని కంపార్ట్మెంట్ నంబర్ 30లో మొత్తం 200 హెక్టార్ల భూమి ఉంది. ఇందులోని 125 ( 50 హెక్టార్లు) ఎకరాల్లో ఫారెస్టు అధికారులు మొక్కలు నాటేందుకు పూనుకున్నారు. ఈ భూముల్లో కొప్పురాయి, ఒడ్డుగూడెం, రాజారాంతండా, బర్లగూడెం గ్రామాలకు చెందిన గిరిజనులు గత కొన్నేళ్ళుగా పంటలు సాగు చేస్తున్నారు. ఈ భూముల్లోనే హరితహారం మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఎఫ్ఆర్వో మంజుల నేతృత్వంలో ఫారెస్టు అధికారులు, సిబ్బంది యత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే జూలై 23న, ఈనెల 1న గిరిజనుల పంట చేలను ధ్వంసం చేశారు. సోమవారం ఒడ్డుగూడెంలో 40 ఎకరాల వరకు పంటలను ధ్వంసం చేసిన ఫారెస్టు, పోలీసు అధికారులు మంగళవారం కూడా దాడులను కొనసాగించారు. మిగిలిన పంటలను ధ్వంసం చేసేందుకు 10 ట్రాక్టర్లు, 50 మంది ఫారెస్టు, పోలీసుశాఖ సిబ్బందితో ఒడ్డుగూడెం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సుమారు 200 మంది రైతులు ఒడ్డుగూడెంలో పాడైన మొక్కజొన్న మొక్కలను చేతపట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. అటవీ, పోలీస్ అధికారులను సుమారు గంటపాటు అడ్డుకున్నారు. గత్యంతరం లేక ఫారెస్ట్ అధికారులు రాజారాంతండా మీదుగా అడ్డదారిలో ఒడ్డుగూడెం చేరుకున్నారు. ఆగని పంటల ధ్వంసం ఒడ్డుగూడెం, రాజారాంతండా గ్రామస్తులు, రైతులు భారీ సంఖ్యలో పంట చేల వద్దకు వచ్చారు. ట్రాక్టర్ డ్రైవర్లు, ఫారెస్టు అధికారులను నిలదీశారు. అప్పటికే మోహరించి ఉన్న ఫారెస్టు, పోలీసు అధికారులు, సిబ్బంది రైతులను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపుగా పెరిగిన చేనును అన్యాయంగా ధ్వంసం చేశారని బాధిత రైతులు దళ్‌సింగ్, ఆయన భార్య కల్యాణి గుండెలవిసేలా రోదించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తున్న నేపథ్యంలో న్యూడెమోక్రసీ, సీపీఐ నాయకులు జోక్యం చేసుకున్నారు. రైతులను శాంతింపజేసి ఫారెస్టు, పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. డీఎఫ్ఓతో మాట్లాడుతాం.. రెండు రోజులపాటు దాడులు ఆపాలని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎఫ్ఆర్వో, ఎస్సై రెండు రోజుల సమయం ఇచ్చారు. బాధిత రైతులు ఎన్డీ ఆధ్వర్యంలో డీఎఫ్ఓను కలిసేందుకు వెళ్లారు. ఈ ఆందోళనలో ఎన్డీ నేతలు గణితి కోటేశ్వర్రావు, రాంచందర్, దుర్గారావు, సీపీఐ జిల్లా, డివిజన్ నేతలు ఏపూరి బ్రహ్మం, దేవరకొండ శంకర్, సూర్యం, రాంచందర్ పాల్గొన్నారు. -
వచ్చే జూన్‌లోగా ఏపీకి వస్తే స్థానికులు
- ‘స్థానికత’ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ - తాజా ఉత్తర్వుల మేరకు జూన్ 2, 2017 నాటికి - వెళ్లే వారికి ఆంధ్రప్రదేశ్ స్థానికత సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థిరపడి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1974, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని గెజిట్‌లో పొందుపరిచింది. ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వులు–1974ను సవరిస్తూ రాష్ట్రపతి ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1974 ఉత్తర్వుల్లోని 4వ పేరాగ్రాఫ్‌లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. ఒక అభ్యర్థి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వస్తే వారిని ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్‌గా గుర్తిస్తారు. వారిని స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. విద్య నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. ఉద్యోగాలకు సంబంధించి..: ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉత్తర్వులు–1975ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1975లోని ఉత్తర్వుల్లో పేరా 7లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వచ్చేవారిని ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థి(లోకల్ క్యాండిడేట్)గా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో నివసించే స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. ఉద్యోగాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. కాగా, రాష్ట్రపతి జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ స్థానికత కోరుకునే వారు ఇప్పటికే అక్కడికి వెళ్లుంటే పరవాలేదు. లేదంటే మరో ఏడాదిలోపు వెళ్లాల్సి ఉంటుంది. -
ఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై కమిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం మంగళవారం కమిటీ నియమించింది. ఈ కమిటీ చైర్మన్‌గా మంత్రి నారామణ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోసభ్యులుగా ఐఏఎస్ అధికారులు ఎస్పీ టక్కర్, ముద్దాడ రవిచంద్రలతో పాటూ ఉద్యోగసంఘాల నేతలు అశోక్ బాబు, బొప్పరాజు, మురళీ కృష్ణలు నియమితులయ్యారు. -
బాగా పనిచేసి రుణం తీర్చుకుంటాం
హైదరాబాద్ సిటీ: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులందరికీ 44 శాతం ఫిట్మెంట్తో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆర్టీసీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని, తమ పట్ల సీఎం కేసీఆర్ ఆదరణకు రుణపడి ఉంటామని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ), ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) అధ్యక్షులు అశ్వద్థామరెడ్డి, రాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, ఇకపై రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని లాభాల బాట పట్టించడంతోపాటు, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. సమ్మె కాలంలో ప్రయాణికులకు జరిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరారు. వెనువెంటనే సమ్మె ఉపసంహరించుకుంటున్నామని, డ్రైవర్లు, కండక్టర్లందరూ ఉన్నపళంగా విధుల్లో చేరాలని కోరినట్టు తెలిపారు. బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశం అనంతరం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. -
ఇక స్థూల వేతనంపై పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్)లో ఉద్యోగుల వాటా ఇకపై మరింత పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం తాను కొత్తగా తీసుకువస్తున్న బిల్లు ముసాయిదాలో స్థూల వేతనం(గ్రాస్ శాలరీ) నుంచి 12శాతం వాటాను పీఎఫ్‌కు జమ చేయాలని ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం మూల వేతనం(బేసిక్ పే), కరవుభత్యం(డీఏ)ల నుంచి మాత్రమే 12శాతాన్ని ఉద్యోగుల వాటాగా, అంతే మొత్తాన్ని యాజమాన్యాల వాటాగా పీఎఫ్‌కు చెల్లిస్తున్నారు. ఇందులో యాజమాన్య వాటా నుంచి 3.67శాతం పీఎఫ్ ఖాతాకు, 8.33శాతం ఉద్యోగుల పింఛన్ నిధికి, 0.5 శాతం డిపాజిట్ లింక్ పథకానికి వెళ్తుంది. అయితే ముసాయిదా బిల్లు ప్రకారం మూలవేతనం, కరవు భత్యంతో పాటు ఉద్యోగికి లభిస్తున్న రకరకాల ఇతర అలవెన్సులన్నీ కలిపి మొత్తం స్థూల వేతనం మీద 12శాతం గణించి పీఎఫ్ వాటాగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే మొత్తాన్ని యాజమాన్యం తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. యాజమాన్యాలు పీఎఫ్‌కు చెల్లించే తమ వాటాను తగ్గించుకోవటం కోసం ఉద్యోగికి రకరకాల అలవెన్సుల రూపాల్లో వేతనాలను విభజించి చెల్లిస్తున్నాయని, ఇలాంటి వాటిని నిరోధించేందుకే మొత్తం స్థూల వేతనం నుంచే 12శాతం ఉద్యోగులు, యాజమాన్యాల వాటాను లెక్కించాలని ప్రతిపాదించినట్లు ఈపీఎఫ్ఓ ట్రస్టీ విర్జేష్ ఉపాధ్యాయ తెలిపారు. దీంతో ఉద్యోగి చేతికి వచ్చే వేతనం కొంత తగ్గినా, పీఎఫ్ వాటా పెరుగుతుందన్నారు. ఉద్యోగ సంఘాలు, యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య ముసాయిదా బిల్లుపై చర్చలు జరుగుతున్నాయని.. ఒక అంగీకారానికి వచ్చిన తరువాత బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువస్తామని చెప్పారు. -
ఈ కొలువు.. మావల్ల కాదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆసరా పింఛన్ల మంజూరు, పంపిణీ వ్యవహార ం ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చింది. అర్హులకు పింఛన్ల అందడం లేదని, అనర్హులకే చోటు దక్కుతోందనే విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వాన్ని తాజాగా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఇచ్చిన అల్టిమేటం మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఆసరా పింఛన్ల మంజూరులో అనర్హులకు చోటు కల్పించాలని తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు చాలాచోట్ల తమపై భౌతికదాడులకు దిగడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల పేరుతో తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వాపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగాలు చేయడం తమవల్ల కాదని పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. అందులో భాగంగా ఈనెల 23 నుంచి మూకుమ్మడిగా సెలవుపై వెళ్లాలని ఎంపీడీవోలు, ఈవోలు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు నిర్ణయించారు. ఇదే విషయంపై తెలంగాణ మండల పరిషత్ డెవలెప్మెంట్ అధికారుల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ నాయకులు శనివారం కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్ల మంజూరు, పంపిణీ సందర్భంగా జిల్లాలో జరిగిన కొన్ని సంఘటలను ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి. వీణవంక మండలంలో ఈనెల 19న ఎంపీడీవో గదికి అకారణంగా తాళంవేసి విధులకు ఆటంకం కలిగించిన అధికార పార్టీ నాయకుడు ఆవాల హరిబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. పైగా సదరు వ్యక్తి తిరిగి ఎంపీడీవోపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెడితే పోలీసులు ఆయనకే వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. దీంతో మండలంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులంతా గత రెండ్రోజులుగా సామూహిక సెలవుపై వెళ్లిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇల్లంతకుంట మండలం సోమారంపేట పంచాయతీ కార్యదర్శిపై అక్కడి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భౌతికదాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కరీంనగర్ మండలం కొత్తపల్లి పంచాయతీ జూనియర్ అసిస్టెంట్, కార్యదర్శులపై పలువురు కత్తితో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. బోయినపల్లి మండలం వరదపెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి జైపాల్‌రెడ్డితోపాటు వీణవంక పంచాయతీ కార్యదర్శులపై పలుమార్లు భౌతిక దాడులకు దిగారు. చొప్పదండి మండలంలోని చాకుంట పంచాయతీ కార్యదర్శిపై దాడి చేయడమే కాకుండా కార్యాలయానికి తాళం వేశారని వాపోయారు. మంథని మండలంలో పింఛన్ రాలేదనే కోపంతో కారోబార్‌పై కి రోసిన్ పోశారని వాపోయారు. ఇదే నియోజకవర్గంలోని కమాన్‌పూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి మారుతిపై భౌతికంగా దాడికి దిగుతారనే సమాచారం రావడంతో వారం రోజులుగా సెలవుపై వెళ్లారని తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న వారు అనర్హులైనప్పటికీ పెన్షన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. -
అమ్మో.. ఒకటో తారీఖు..
ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడంతో జిల్లాలో 42,152 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు, 27,696 మంది పింఛనుదారులు ఆర్థిక ఇబ్బందులతో బతుకుబండిని లాగుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఇప్పటికే రెండు పీఆర్సీలను కోల్పోవడంతో కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దీంతో అక్కడి ఉద్యోగుల్లో ఆనందంలో నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటించే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. సరైన ఫిట్మెంట్ ఇవ్వకపోవడంతో వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఏటా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పోటీ పడలేక వచ్చే వేతనాలతోనే సర్దుకుపోవాల్సి వస్తోంది. వారాంతంలో సరదాలకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వస్తోంది. సినిమాలకు వెళ్లాలన్నా ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకటించి ఫిట్మెంట్ ఇస్తే కొత్త వేతనాలతో కొంత కోలుకుంటామని పలువురు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బి.కొత్తకోట: ఫిట్మెంట్ శాతం ఆధారంగానే ఉద్యోగుల మూల వేతన నిర్ధారణ జరుగుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. గడిచిన ఐదేళ్లలో పెరిగిన నిత్యావసరాల ధరల సరాసరి అంచనాతో ఫిట్మెంట్ ప్రకటించారన్నది ఉద్యోగ సంఘాల వాదన. దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే వేతనం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరాలు తీర్చుకునేందుకు వీలవుతుంది. గతంలో 8వ పీఆర్సీలో 16శాతం, 9వ పీఆర్సీలో 39శాతం, 10వ పీఆర్సీలో 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సుచేశారు. ప్రస్తుతం 69శాతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 2013 జూలైలోనే కొత్త పీఆర్సీ అమలు కావాల్సిన ఉన్నా అమలుకునోచుకోలేదు. ఇప్పటికే 19నెలల కాలాన్ని కోల్పోయిన ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. ఫలితంగా రెండు పీఆర్సీలను కోల్పోవాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో కొత్త ఫిట్మెంట్ ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడడం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిట్మెంట్ ప్రకటిస్తే మూలవేతనం పెరుగుతాయని ఆశతో ఉన్నారు. ఇదీ చంద్రయ్య బడ్జెట్ పెద్దతిప్పసముద్రం మండల పరిషత్ కార్యాలయం లో టైపిస్టుగా పనిచేస్తున్న ఆర్.చంద్రయ్య బి.కొత్తకోటలో అద్దెఇంట్లో ఉంటున్నాడు. ఇతనికివచ్చే వేతనంలో కోతపోగా రూ.24,188 వస్తుంది. ఇది చేతికివచ్చిరాగానే కరిగిపోతోంది. ఇంట్లో నిత్యం మందు లు వాడాల్సిన వారి కారణంగా జీతంలో ఎక్కువ సోమ్ము దానికే సరిపోతోంది. ఇంటిఅద్దె రూ.3,500 పాలు, కూరగాయలకు రూ.3,000 బియ్యానికి రూ.1,200 కరెంట్చార్జీ రూ.400 నీటి ట్యాంకర్లు రెండింటీకి రూ.800 బట్టలు ఉతకడం, ఇస్త్రీకి రూ.1,000 కుటుంబానికి అవసరమైన మందులకు రూ.5,000 బంధువుల ఇళ్లకు వెళ్లివచ్చేందుకు రూ.2,000 పిల్లల విద్యకు రూ.2,500 ఇతర ఖర్చులు రూ.2,500 మొత్తం రూ.21,900 ఇక మిగిలిన సోమ్ము కూడా దాచిపెట్టుకునే వీలులే దు. అది కూడా వైద్యానికి వినియోగించాల్సివస్తోం ది. ఇలా అందే వేతనం ఖర్చులకే సరిపోతే భవిష్యత్తుకోసం ఏం దాచుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇది వెంకట్రమణ కష్టం! పలమనేరు: పలమనేరు తహశీల్దార్ కార్యాలయానికి సంబంధించి జగమర్ల వీఆర్ఏగా పనిచేస్తున్నాడు వెంకట్రమణ. చాలీచాలని జీతంతో ఇళ్లు గడవడమే కష్టంగా మారిన తరుణంలో రాష్ర్టప్రభుత్వం ఫిట్మెంట్నైనా ప్రకటిస్తే జీతానికి ఏకొంతో చేరుతుందని ఆశపడ్డాడు. కానీ ఆ సగటు ఉద్యోగి ఆశలు అడియాశలే అయ్యాయి. గంగవరం మండ లం కీలపట్లకు చెందిన వెంకట్రమణ పదేళ్లకు పైగా ఈ ఉద్యోగంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నెల రూ.6,300 జీతం. అది కూడా ఏ రెండు నెలలకో, మూడు నెలలకో మాత్రమే అందుతోంది. జీతంపై ఆధారపడి జీవించే ఇతను ప్రతి నెలా అప్పులతోనే సంసారాన్ని లాక్కొస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. ముగ్గురు కుమార్తెలకు ఎట్టాగో పెళ్ళిళ్ళు చేశాడు. కొడుకు పలమనేరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తొడుక్కోవడానికి సరైన బట్టలు లేకపోవడంతో పలమనేరు ఎంపీడీవో బాలాజీ కొంత ఆర్థిక సాయం చేసి బట్టలు కొనిచ్చారు. ఇక కళాశాలలో ఫీజు కట్టేందుకు ఇబ్బంది ఎదురైతే కళాశాల కరస్పాండెంట్ కనుకరించారు. గతంలో ఈయన భార్య చనిపోయింది. ఇతనితో పాటు పుట్టిన అక్కా చెల్లెళ్లు నలుగురు వారి బాగోగులు వెంకట్రమణే చూసుకోవాలి. ప్రస్తుతం భర్త చనిపోయిన ఓ చెల్లె ఇంట్లోనే ఉంది. వచ్చే జీతంతో ఈ కష్టాలను ఎదురీదాలా. తనకు రెండెకరాల మెట్టపొలముంది. వర్షాలు రాక వేరుశెనగ చేతికొచ్చి ఐదారేళ్లయ్యింది. నెలకు ఇంట్లో బియ్యానికి రూ.2వేలు కావాల్సిందే. ఆస్పత్రులు, చదువు తదితరాలకు నెలకు ఎంతలేదన్నా రూ.10వేల దాకా ఉండాల్సిందే. కానీ అతనికొచ్చే జీతం ఏ మాత్రం చాలదు. కనీసం ఫిట్‌మెంట్‌తోనైనా ఓ వెయ్యి పెరుగుతుందేమోనని ఆశించాడు. ఇప్పటికే అప్పు రూ.20వేలు దాటింది. చాలీచాలని జీతాలతో జీవితాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థంగాక బాధపడుతున్నాడు. 2004 పునరావృతం అవుతుంది నేను మారాను. నన్ను గెలిపిస్తే మంచి పాలన అందిస్తాను. ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రభుత్వం అని చెప్పుకునేలా వ్యవహరిస్తానని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతోకాలంగా ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. ఖాళీ ఖజానా, కేంద్రం ఆర్థిక సాయం నిరాకరణ, రాష్ట్ర విభజన వంటి కుంటి సాకులతో జాప్యం చేస్తున్నారు. ఇప్పటికైనా తీరు మారకుంటే 2004 ఎన్నికలు పునరావృతం అవుతాయి. -ఎస్.బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పరిషత్(ఆపస్) డీఏకు కోత విధించడం బాధాకరం ఖాళీ ఖజానా పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు గతంలో ఇస్తున్న 0.856డీఏను ప్రస్తు తం 0.524శాతానికి కోత విధించడం బాధాకరం. దీనివల్ల జీతాలపై ఆధారపడ్డ మధ్య తరగతి ఉద్యోగులు చాలా నష్టపోతారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల డీఏలో కోత విధించడం సరికాదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ప్రకటించకుండా జాప్యం చేయడం తగదు. ముఖ్యమంత్రి స్పందించి తెలంగాణ ప్రభుత్వం కంటే మెరుగైన పీఆర్సీని ప్రకటించాలి. -టీ.గోపాల్, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్(ఆర్జేయూపీ), తిరుచానూరు. చాలీచాలని జీతాలు ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టంగా వూరింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె, పిల్లలు చదువులు, కుటుంబానికి సంబంధించిన ఇతర ఖర్చులు చూస్తుంటే ఇప్పుడు వస్తున్న జీతం చాలక ప్రతినెలా అప్పు చేయూల్సిన పరిస్థితి నెలకొంది. 2009లో అప్పటి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 2013 జూలై నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వాలి. పీఆర్సీ కమిటీ 29 శాతం పెంచవుని చెప్పడంతో ఇప్పుడు పెంచినా కేవలం 2 శాతమే పీఆర్సీ పెరుగుతుంది. వెంటనే పీఆర్సీ 65 శాతం పెంచి ఉద్యోగులను ఆదుకోవాలి. - మోహన్, ఉపాధ్యాయుడు, బాలుర ఉన్నత పాఠశాల, శ్రీకాళహస్తి మావి చాలీచాలని బతుకులు పొరుగు రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ను ప్రకటించింది. ఇక్కడేమో సరిగ్గా జీతాలు కూడా ఇవ్వడం లేదు. మాలాంటి బక్క ఉద్యోగుల పరిస్థి తి దయనీయంగా ఉంది. ప్రభుత్వం ఆలోచించి తమలాంటోళ్లను ఆదుకోవాలి. -దేవేంద్రుడు, వీఆర్ఏల సంఘ నాయకులు, పలమనేరు ఉద్యోగస్తులు బాగుండాలి తెలంగాణలోని ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చినట్టుగానే ఇక్కడా ఇవ్వాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగులు మనస్ఫూర్తిగా విధులు నిర్వహించాలి. ఇక్కడి ప్రభుత్వమేమో ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తోంది. మధ్య తరగతి ఉద్యోగులకు ఆసరాగా నిలిచే ఫిట్మెంట్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి. -పుష్పరాజ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయసంఘ నాయకులు త్వరలో వస్తుందనుకుంటున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తుందనే అనుకుంటున్నాం. నిత్యావసర వస్తువులు భారీగా పెరిగిన నేపథ్యంలో సగటు ఉద్యోగుల పరిస్థితి కష్టాలమయమే. ప్రభుత్వం వెంటనే చొరవ చూపి తగు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. - సోమచంద్రారెడ్డి, యూటీఎఫ్ నాయకులు -
ఇదేం ఆట..
నెల్లూరు(రెవెన్యూ): ‘నేను మారిన మ నిషిని..నన్ను నమ్మండి..నేను మాటల మనిషి కాదు చేతల మనిషిని..ఊహించని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలోని పీ ఆర్సీ మంజూరు చేస్తాను’ అని ఉద్యోగులకు సీఎం చంద్రబాబు హామీ ఇ చ్చారు. ఈ హామీ అమలు విషయమై మాట్లాడేందుకు వెళ్లిన ఉద్యోగ నేతల తో ‘ముందు మీరు పనితీరు మెరుగుపరుచుకోండి..పీఆర్సీ తగిన విధంగా ఇస్తాం’ అని సలహా ఇచ్చి పంపారు. చంద్రబాబు తీరుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా పీఆర్సీ విషయంలో కప్పదాటు వైఖరి అవలంభిస్తుండటంపై మండిపడుతున్నారు. తె లంగాణలో 43 శాతం పీఆర్సీ ఇవ్వడం తో అక్కడి ఉద్యోగులు ఆనందంలో ఉం డగా మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు తీరుతో ఉద్యోగులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. రగులుతోన్న చిచ్చు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చిచ్చు రగులుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం వేతనాలు ఇవ్వలేని స్థితిలో ఉంది. మార్చి రాకముందే ఖజానాకు ఫ్రీజింగ్ విధించింది.వేతనాలు రాని ఉద్యోగులు నానా ఇబ్బందులు ప డుతున్నారు. మరోవైపు పెరిగిన ధరలకు అనుగుణంగా 69 శాతం పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీఎం ఇప్పటికి రెండు మార్లు సమావేశం నిర్వహించినా ఫలితం కరువైంది. వేతనాల చాలక ఇబ్బందులు జిల్లాలో వివిధ శాఖలకు చెందిన 35 వేల మంది ఉద్యోగులు, 25 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వీరం తా వేతనాలపై ఆధారపడి జీవనం సాగించేవారే. ఇటీవల కాలంలో ఖర్చులన్నీ పెరిగిపోవడంతో కుటుంబపోషణ వారికి కష్టతరంగా మారుతోంది. ఈ క్రమంలో 69 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం తెలంగాణకు మించి ప్రకటించాలని కోరుతున్నారు. అంతకు తక్కువ ప్రకటిస్తే మాత్రం ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
స్తంభించిన బ్యాంకింగ్ సేవలు
కొరిటెపాడు(గుంటూరు): వేతన సవరణ అమల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగటంతో జిల్లాలో మంగళవారం బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించారుు. జిల్లాలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 500 బ్రాంచిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొనటంతో దాదాపు రూ.150 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయూరుు. ఏటీఎంలలో తగినంత నగదును ముందుగానే పెట్టడంతో సాధారణ ఖాతాదారులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. సమ్మె నుంచి సహకార రంగ బ్యాంకులను మినహాయించడంతో ఆయూ బ్యాంకుల బ్రాంచిల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు గుంటూరు నగరంలోని పట్టాభిపురం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొరిటెపాడులోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిల వద్ద యూనియన్ల నేతలు, ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది ఎస్బీఐ ఉద్యోగులు నగరం పాలెంలోని ప్రధాన బ్రాంచి నుంచి పట్టాభిపురంలోని బ్రాంచి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొరిటెపాడు ఆంధ్రాబ్యాంక్, పట్టాభిపురం ఎస్బీఐ శాఖల వద్ద జరిగిన సభల్లో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. వేతన సవరణను వెంటనే అమలు చేయకపోతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. -
మొర పట్టని మొరటుతనమేల?
* సర్కారుపై ఐకేపీ యానిమేటర్ల ఆక్రోశం * వేతన బకాయిల కోసం కొనసాగిన ఆందోళన * కలెక్టరేట్ వద్ద ధర్నా, రోడ్డుపై వంటావార్పు కాకినాడ సిటీ : వారేమీ అయిదంకెల జీతాలందుకునే వారు కారు. ఇచ్చే కొద్దిపాటి గౌరవ వేతనాన్నీ నెలల తరబడి బకాయి పెడితే బతుకు గడవక కడగండ్లు పడుతున్న చిరుద్యోగులు. పదిహేను నెలల వేతన బకాయిలను చెల్లించాలని రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా అణుమాత్రం చలించని సర్కారును నిరసిస్తూ యానిమేటర్లు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. రోడ్డుపైనే వండుకుని, సామూహికంగా భోజనాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐకేపీ యానిమేటర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరసనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యానిమేటర్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ యానిమేటర్లు 15 సంవత్సరాలుగా పేద మహిళలను సమీకరించి పొదుపు సంఘాల ఏర్పాటు, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించడం, తిరిగి కట్టించడం, రికార్డుల నిర్వహణ, ప్రతి నెలా సమావేశాల నిర్వహణ వంటి సేవలు చేస్తున్న యానిమేటర్లను అటు అధికారులు, ఇటు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను గుప్పించి గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మహిళలను రోడ్డెక్కేలా చేస్తోందన్నారు. పని చేసిన కాలానికి ఇవ్వాల్సిన వేతనం నెలల తరబడి చెల్లించకపోవడం దారుణమన్నారు. గౌరవ వేతనం అందక యానిమేటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యానిమేటర్ల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, బకాయిలు చెల్లించేందుకు అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు డి.ఆనందకుమార్, ప్రధాన కార్యదర్శి కె.మణి, అధిక సంఖ్యలో యానిమేటర్లు పాల్గొన్నారు. 24 గంటల ఆందోళనకు కొనసాగింపుగా యానిమేటర్లు గురువారం రాత్రి కూడా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే నిద్రకు ఉపక్రమించారు. -
ఆదర్శప్రాయుడు సర్వేపల్లి
నెల్లూరు (సెంట్రల్) : భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తరువాత గురువునే విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారన్నారు. ఇటీవల కాలంలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను పెంచాలని కోరారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకుని వారి పిల్లలను అక్కడే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని బొమ్మిరెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ రాధాకృష్ణన్ తెలుగువారైనందుకు అందరూ గర్వ పడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన 63 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌లు సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఈఓ ఉష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నియామకాల్లో ‘తమ్ముళ్ల’ జోక్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రభుత్వ నియామకాల్లో తెలుగు తమ్ముళ్ల జోక్యం పెరుగుతోంది. ఉద్యోగులుగా ఎవరిని నియమించాలో, ఎవరిని నియమించ కూడదో ఆదేశాలు జారీ చేస్తున్నారు. టీడీపీ నేతల మితిమీరిన జోక్యాన్ని ప్ర భుత్వ అధికారులు భరించలేకపోతున్నా రు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. జిల్లాలో వీరు 116 మంది ఉన్నారు. మరో 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కూడా తొలగించారు. వీరు మూడు వారాలుగా నెల్లూరులో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అందరూ హైదరాబాద్ వెళ్లి సీఎం చంద్రబాబును కలిశారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, సీనియారిటీని బట్టి సగం మందికి అవకాశం ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సీనియారిటీ ప్రకారం ఎవరిని నియమించాలనే విషయంలో ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ)కి అధికారమిచ్చారు. గత ప్రభుత్వం మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున 116 మందిని నియమించింది. ప్రస్తుతం వీరిలో దాదాపు సగం మందికే అవకాశం ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే తాము ఎవరి పేర్లు సూచిస్తే వారినే నియమించాలని తెలుగు తమ్ముళ్లు పీడీ దగ్గర వాదిస్తున్నారు. మొత్తం జాబితాను తమకు ఇస్తే, వాటిలో తమకు కావలసిన వారి పేర్లను తెలియజేస్తామని, వారిని మాత్రమే నియమించాలని శాసిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు దిక్కు తోచని పరిస్థితికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారికి అవకాశం ఇవ్వకూడదని బెదిరిస్తున్నారు. రాజకీయంగా విభేదాలు వస్తే సీనియర్లతో సంబంధం లేకుండా కొత్త వారిని నియమించేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక ఉద్యోగి మాట్లాడుతూ పదేళ్లుగా పని చేస్తున్న తమను తీసి వేసి, టీడీపీ కార్యకర్తలను నియమించుకునేందుక ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వం నియమించిన ఉద్యోగులను తొలగించ డం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇదే కొనసాగితే కలెక్టరేట్ ఆందోళన చేపట్టడానికి వెనకాడబోమని హెచ్చరించా రు. తెలుగు తమ్ముళ్ల పెత్తనం ఈ ఉద్యోగాల విషయానికే పరిమితం కాలేదని, వివిధ శాఖల్లో నియామకాల పేరుతో ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో తెలుగు తమ్ముళ్లకే నియామక అధికారాలు ఇస్తే, తాము ఇంట్లో కూర్చోవడం మేలని అధికారులు పేర్కొంటున్నారు. -
కార్పొరేషన్‌కు కాంట్రాక్ట్ భారం
సాక్షి, నెల్లూరు: అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల పుణ్యమా అని నెల్లూరు నగర పాలకసంస్థకు కాంట్రాక్ట్ ఉద్యోగులు భారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నేతలు చెప్పిందే తడవుగా నిబంధనలు పాటించక ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నాటి అధికారపార్టీ నేతల ఆదేశాలతో అప్పటి కమిషనర్ ఇష్టానుసారం తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. ఇప్పుడు అధికార టీడీపీ నేతలు తాము చెప్పిన వారందరికీ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు అధికారులు అధికార పార్టీ నేతలు,దళారులతో కుమ్మక్కై అందినకాడికి దండుకుని కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఉద్యోగాల కోసం అధికారపార్టీ నేతల జాబితా చాంతాడంత అయ్యింది. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌కు తాత్కాలిక ఉద్యోగనియామకాలు మరింత భారంగా మారాయి. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ విభాగంలో 800 మంది, ఇంజనీరింగ్ విభాగంలో 300 మంది, 70 మంది వరకూ కంప్యూటర్ ఆపరేటర్లతో కలిపితే 1170 మంది కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నది కేవలం 900 మంది మాత్రమే. ఇది కార్పొరేషన్‌కు మరింత భారంగా మారింది. తాజాగా టీడీపీ అధికారం చేపట్టడం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇక్కడి వారే కావడం, ఇక వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచిన మేయర్ అబ్దుల్ అజీజ్ అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవడంతో నగరపాలకలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మరింత డిమాండ్ పెరిగింది. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయి ఉన్న అధికారపార్టీ నేతలు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం పోటీలు పడి కమిషనర్‌పై ఒత్తిళ్తు తెస్తున్నట్లు తెలుస్తోంది. ‘అధికారం మాదే. ఉద్యోగాలు ఇవ్వకుంటే మీసంగతి తేలుస్తాం’ అంటూ కొందరు నేతలు బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. మరోవైపు కార్పొరేటర్లు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వీరేకాక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు వసూలు చేసిన కొందరు నేతలు, దళారులు సైతం కార్పొరేషన్లో ఉద్యోగాల కోసం అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం నెలకు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకూ జీతం ఇస్తుండటంతో వీటికి పోటీ పెరిగింది. దీంతో కొందరు నేతలు,దళారులు అభ్యర్థుల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూళ్లు చేస్తున్నారు. మొత్తంగా కాం్రట్రాక్ట్ ఉద్యోగాల కోసం వచ్చిన జాబితా చాంతాడంత అయినట్లు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఓ కీలక ఉద్యోగి పేర్కొన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు నెలకు రూ.90 లక్షలు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. సిబ్బంది నియామకాలు భారమని తెలిసినా అధికారులు మాత్రం అవేవీ చెప్పక ఇష్టానుసారం నియామకాలు సాగించారు. వీరిలో ఎక్కువ మంది కార్పొరేషన్ కార్యాలయానికి మొక్కుబడిగా వచ్చి నెలజీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు చేయడంలేదో కూడా అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి: కార్పొరేషన్లో ఎంతమంది తాత్కాలిక ఉద్యోగులున్నారు? వారి విధులు ఏమిటి? ఎవరు ఏఏ విభాగాల్లో పని చేస్తున్నారు? వారికి నిజంగా పని ఉందా? వారిని ఎప్పుడు ఎవరు నియమించారు?లాంటి విషయాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకావముంది. అవసరం లేకున్నా సిబ్బందిని నియమించి జీతాలు చెల్లించడం దారుణం. అసలే నిధుల లేమితో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం దారుణం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్రవిచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. -
పీడీ మాకొద్దు
మంకమ్మతోట : ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్‌కు.. ఆ శాఖ ఉద్యోగులకు మధ్య ఏడాదికాలంగా జరుగుతున్న వివాదం మంగళవారం మరింత ముదిరింది. ఉద్యోగులు సహకరించడం లేదంటూ వేధిస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. పీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు పెన్‌డౌన్ సమ్మెకు దిగారు. సమ్మెను విరమింపచేసేందుకు ఐసీడీఎస్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జయరామ్ నాయక్ జరిపిన చర్చలు ఫలించలేదు. పీడీ మోహన్‌రెడ్డి బదిలీపై వెళ్లిపోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈనెల 27నుంచి పీడీ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఉద్యోగుల సంఘం జిల్లా నాయకత్వం చర్చలు జరిపినా సద్దుమణగకపోవడంతో రాష్ర్టం నాయకులు రంగంలోకి దిగారు. రెండు గంటలపాటు జరిపిన చర్చలు ఉద్యోగుల ఆరోపణలతో వాడివేడిగా కొనసాగాయి. ఏడు నెలలుగా ఫైళ్లు తన వద్దనే పెట్టుకుని సొంత పనులు చేసుకుంటున్నారని, ఉద్యోగులకు పనిచేయడం రాదని ఇతరులతో చెబుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చర్చల్లో తనపై వచ్చిన ఆరోపణలపై పీడీ స్పందించకపోగా.. ఉద్యోగులు కార్యాలయ పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, పీడీ అని గౌరవం లేకుండా మాట్లాడతున్నారంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో ఉద్యోగులు చర్చల నుంచి బయటికొచ్చి పీడీ వెళ్లిపోవాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రెండు రోజుల్లో పీడీ సెలవులో వెళ్లిపోతున్నట్లు ఉద్యోగవర్గాల ద్వారా తెలిసింది. పీడీ సెలువుపై వెళ్లిపోకపోతే ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవుపై వెళ్లిపోతామని వారు స్పష్టం చేశారు. -
4వ యూనిట్.. ముంచింది
ఆత్మకూర్ : దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 4వ యూనిట్లో లోపం కారణంగానే విద్యుత్‌ఉత్పత్తి కేంద్రంలోకి వరద నీరు చేరిందని జెన్కో అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తెలంగాణ జెన్కో సీఎండీ ఆదేశాల మేరకు కార్యాలయ డీఈ హనుమాన్ బృందం దిగువ జూరాలను. మూలమల్ల, జూరాల గ్రామాల శివారులో నిర్మిస్తున్న దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సోమవారం సందర్శించింది. ఎగువ జూరాల నుంచి విడుదల చేసిన నీరు టర్బైన్లలోకి ప్రవేశించకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాలుకట్టను పరిశీలించారు. అనంతరం పవర్‌హౌస్‌లో ముంపునకు గురైన పరికరాలు పరిశీలించారు. నష్టంపై, సంఘటన వివరాల గురించి కిందిస్థాయి ఉద్యోగులు... ఆల్స్ట్రామ్ కంపెనీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈ హనుమాన్‌తోపాటు ఎస్ఈలు శ్రీనివాస్, శ్రీనివాసులు మాట్లాడుతూ పవర్‌హౌస్‌లోని ఐదు యూనిట్లలో నీటిని పూర్తిస్థాయిలో తోడేశామని, ప్రమాదానికి కారణమైన నాల్గవయూనిట్ ఒక మీటరు మేర నీరు తోడాల్సి ఉందన్నారు.ఈ నీటిని పూర్తిస్థాయిలో తోడేందుకు సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. రెండు రోజుల్లో ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు. నాల్గవ యూనిట్‌లోని 7వ గేటు వద్ద మీటరు మేర కాంక్రీట్ వర్క్ ధ్వంసమై ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం నీటిలో మునిగిన కంట్రోల్ ప్యానల్‌బోర్డులు, టర్బైన్లను పరిశీలించారు. నవంబర్ చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈలు రమణమూర్తి, రాంభద్రరాజు, వీఆర్క్స్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌశిక్కుమార్రెడ్డిలతోపాటు ఆల్స్ట్రామ్ కంపెనీ నిర్వాహకులు పాల్గొన్నారు. -
ఆగని అక్రమ వసూళ్లు
బీవీపాళెం(తడ): ఎలుక తోకను పట్టి ఏడాదంతా ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు సామెతలా తయారైంది రాష్ట్ర సరిహద్దులోని ఉమ్మడి తనిఖీ కేంద్రం పనితీరు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పలువురు ఉద్యోగులు చేయి చాపడాన్ని మానలేకున్నారు. పదేపదే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేస్తున్నా వారిలో మార్పు కరువైంది. ప్రైవేటు వ్యక్తుల సాయంతో దందా కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి నిర్వహించిన దాడుల్లో వివిధ శాఖల కార్యాలయాల వద్ద రూ.51,288 స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కేఎస్ నంజుండప్ప కథనం మేరకు..చెక్పోస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన దాడుల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి 12 గంటలకు భీమునివారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్దకు ఏసీబీ అధికారులు వచ్చారు. పరిసరాల్లో మకాం వేసిన అధికారులు అరగంట పాటు అన్ని శాఖల విభాగాల పనితీరును పరిశీలించారు. అనంతరం 12.30 గంటలకు బృందాలుగా విడిపోయి ఒక్కసారిగా అన్ని శాఖల కార్యాలయాల్లోకి ప్రవేశించారు. రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి ఏసీబీ అధికారులను గమనించి తన చేతిలోని రూ.5,858ను పరిసరాల్లో పడేసి ఉడాయించాడు. ఆ శాఖ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేటు గదిలో లభించిన బ్రీఫ్‌కేసులో రూ.6,700 లభించింది. అయితే విధులు ముగించుకున్న తర్వాత ఊరికెళ్లేందుకు బ్రీఫ్‌కేసుతో పాటు నగదు తెచ్చుకున్నానని, అందుకు నిదర్శనంగా ట్రైన్ టికెట్ ఉన్నట్లు రవాణాశాఖలోని ఓ ఉద్యోగి చెప్పాడు. ఆ పక్కనే ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో రూ.250 మాత్రమే లభించడంతో పట్టించుకోలేదు. అయితే ఓ కానిస్టేబుల్ మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించి తడ పోలీసులకు అప్పగించారు. అతడికి వైద్యపరీక్షలు జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరారైన వ్యక్తి వివరాలను కూడా సేకరించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో వాహనాల రద్దీ తక్కువగా ఉందని, అందువల్లే అక్రమ నగదు వసూళ్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. వాహనదారులు ఎక్కువ మంది సిబ్బంది అడగకపోయినా మామూళ్లు ఇచ్చివెళుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తిచెప్పాలని హితవు పలికారు. సిబ్బంది పద్ధతి మార్చుకోకపోతే వరుస దాడులు తప్పవని హెచ్చరించారు. బెంచ్ కలెక్షన్ రూ.38,730 తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు సాధారణ సిబ్బందిలా వివిధ శాఖల విభాగాల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా లారీల సిబ్బంది భారీగా మామూళ్లు ముట్టజెప్పివెళ్లారు. ఇలా రాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు రూ.38,730 వసూలైంది. ఇందులో రవాణా శాఖ కార్యాలయం వద్ద రూ.22,300, వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించే ఇన్కమింగ్ కార్యాలయం వద్ద రూ.10,140, చెన్నై వైపు వెళ్లే మార్గంలో వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్న అవుట్గోయింగ్ సెంటర్ వద్ద రూ.6,290 వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీతో పాటు ఇన్స్పెక్టర్లు రవికుమార్(విజయవాడ), శ్రీనివాసులు(ఒంగోలు), నరసింహారెడ్డి(గుంటూరు), కె.వెంకటేశ్వర్లు, కృపానందం(నెల్లూరు), 15 మంది సిబ్బంది, 10 మంది వివిధ శాఖల ఉద్యోగులు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
పాపం చిరుద్యోగులు
మాచర్లటౌన్ : కొత్త ప్రభుత్వం చిరుద్యోగుల పొట్టకొడుతోంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చీరాగానే ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొడుతున్నారు. గ్రామాల్లో ఉపాధి పనుల నిర్వహణలో కీలక మైన ఫీల్ట్ అసిస్టెంట్లను, రైతులకు, వ్యవసాయ శాఖాధికారులకు మధ్య వారధిగా వ్యవహరించే ఆదర్శ రైతులను తొలగిస్తామంటూ ప్రకటించారు. దీంతో అతి తక్కువ గౌరవ వేతనంతో పదేళ్లుగా సేవలందిస్తున్న వీరంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో మండలంలో దాదాపు 60 మంది ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. గ్రామాల్లోని నిరుద్యోగ యువకులను పదేళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధుల్లోకి తీసుకుంది. ప్రతి మండలంలో 15 నుంచి 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో కీలక పాత్ర వహించే ఫీల్డ్ అసిస్టెంట్లు ముందుగా ఆయా గ్రామాల్లో పనులను గుర్తిస్తారు. ప్రతి పనిని మేట్లు, కూలీలతో చేయించి వారికి నగదు చెల్లింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పనుల అంచనాలో కీలక పాత్ర వహించే వీరు పొలాలు, బీడు భూములు, కుంటలు, చెరువులకు సంబంధించిన ప్రతి పనినీ పర్యవేక్షించి అంచనాలు రూపొందిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధులు నిర్విహ ంచే వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. రాష్ర్టంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే పనిలో ఉంది. ఆదర్శానికీ మంగళం.. వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రతి గ్రామంలో ఒక ఆదర్శరైతు ఉంటారు. గ్రామంలోని రైతుల సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లటం, ప్రతి నెల వ్యవసాయ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొని వ్యవసాయశాఖ సూచనలు, సలహాలను ఆయా గ్రామాల రైతులకు అందించడం వీరి విధి. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, రైతులకు ఇచ్చే సబ్సిడీ, మట్టి నమూనా సేకరణతో పాటు అనేక బాధ్యతలు నిర్వహిస్తారు. వీరికి గౌరవ వేతనంగా ప్రభుత్వం చెల్లించేది 1000 రూపాయలే. అయినా వీరి సేవలను ఎక్కువగానే వ్యవసాయశాఖ వారు వినియోగించుకుంటారు. మండలానికి 30 నుంచి 40 మంది వరకు ఆదర్శ రైతులు ఉన్నారు. వీరిని కూడా తొలగించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖపట్నంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఆదర్శరైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగించాలని ఆలోచన చేసి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవటంతో పదేళ్లుగా పని చేస్తూ చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్న తామంతా రోడ్డున పడాల్సి వస్తోందని ఆ చిరుద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ నిర్ణయంతో తమపై వేటువే యాలని ప్రయత్నించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇక ఉక్కపోతే
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: అసలే అంతంతమాత్రంగా ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత సంక్షోభంలో పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజల కష్టాలు రెట్టింపుకానున్నాయి. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఆదివారం ఆ శాఖ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగారు. ఉద్యోగులు విధులకు రాకపోవడంతో 1,760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విజయవాడలోని వీటీపీఎస్, 1,260 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కడపలోని ఆర్టీపీపీ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కోతలు రెట్టింపవుతాయని అధికారులే చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవి మరింత పెరిగితే జనజీవనం అస్తవ్యస్తం కానుంది. ప్రస్తుతం నెల్లూరులో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కోత విధిస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరుతో అనధికారికంగా మరో రెండు గంటలు అదనంగా కోత పెడుతున్నారు. విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోతుండడంతో జిల్లాకు రావల్సిన విద్యుత్ కోటా భారీగా తగ్గిపోనుంది. ఈ క్రమంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండతో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్తంభించనున్న జనజీవనం విద్యుత్ కోతలు సోమవారం నుంచి తీవ్రం కానుండడంతో జనజీవనం స్తంభించే ప్రమాదం ఏర్పడింది. సామాన్య ప్రజలు కష్టాలు పడడంతో పాటు వాణిజ్య, వ్యాపార రంగాలు తీవ్రనష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జ్యూస్, జెరాక్స్ షాపులు తదితర చిన్నతరహా దుకాణాలు నడుపుకునే వారు నష్టాల్లో ఉన్నారు. పరిశ్రమలు సైతం జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్న పరిస్థితి. పభుత్వ కార్యాలయాల్లో ఉదయం, సాయంత్రం వేళలో సేవలు స్తంభిస్తున్నాయి. కంప్యూటర్లు పనిచేయకపోతుండడంతో ఉద్యోగులు కుర్చీలకే పరిమితమవుతున్నారు. అపార్టుమెంట్లలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఇక అందరి కష్టాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
అమానుషం
మడకశిర, న్యూస్‌లైన్ : మడకశిరలో ఇద్దరు చిన్నారుల హత్యపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి చిన్నారుల హత్యను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఫలితంగా మడకశిర పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు నానాతంటాలు పడాల్సి వచ్చింది. పట్టణంలోని ఎస్బీఐ వెనుకభాగంలోని కాలనీలో నివాసముంటున్న ఆనందప్ప, సాకమ్మ అనే ఉపాధ్యాయ దంపతుల కుమార్తె మంజువాణి (13), కుమారుడు రంగనాథ్ (8) గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యారు. మంజువాణిని చున్నీతో గొంతుబిగించి, రంగనాథ్‌ను టవల్‌తో గొంతునులిమి హతమార్చారు. ఈ హత్యల విషయం పట్టణంలోనే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా దావానలంలా వ్యాపించడంతో వేలాది మంది ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఆస్పత్రి నుంచి పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులను కాల్చి చంపాలని, ఉరితీయాలని నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీస్‌స్టేష న్ను ముట్టడించి, నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్ ఎదుట దాదాపు గంటసేపు బైఠాయించారు. అదే సమయంలో అమరాపురం నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. డీఎస్పీ సుబ్బారావు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా గేటువేసి పోలీసులు అడ్డగించారు. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహానికి లోనుకావడంతో పెనుకొండ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, స్థానిక ఎస్ఐ సద్గురుడు తదితర పోలీసులు వారిని అదుపుచేయడానికి నానాతంటాలు పడ్డారు. చివరకు పోలీస్‌స్టేషన్ వద్దకు పెనుకొండ డీఎస్పీ చేరుకుని నిందితులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో ఎన్జీఓ సంఘం నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదనపు బలగాలు పంపాలని కోరిన డీఎస్పీ మడకశిరలో చిన్నారుల దారుణ హత్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మడకశిరకు సీఐ కూడా లేరు. సిబ్బంది కొరత కూడా ఉంది. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు శుక్రవారం అందించనున్నారు. అంతవరకు ఉద్రిక్త వాతావరణం ఉండే అవకాశం లేకపోలేదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అదనపు బలగాలను పంపాలని ఉన్నతాధికారులను కోరినట్లు పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. హత్యలపై ఎస్పీ ఆరా మడకశిరలో చిన్నారుల హత్యలను జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ హత్యలపై పలుసార్లు పెనుకొండ డీఎస్పీతో ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. వెంటనే నిందితులను అరెస్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కోరారు. ఈ హత్యలకు సంబంధించిన కేసుపై కొంతవరకు పురోగతి సాధించినట్లు ఎస్పీకి డీఎస్పీ వివరించారు. ట్రైనీ ఎస్పీ మడకశిరలో మకాం చిన్నారుల హత్యల నేపథ్యంలో ట్రైనీ ఎస్పీ శ్వేత వెంటనే మడకశిరకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ హత్యలు జరిగిన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో చర్చించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులను ఈ సంఘటనపై విచారించారు. అనుమానితుల ఇంటిపై దాడి అనంతపురం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ మృతుల ఇంటి సమీపానికి 50 మీటర్ల దూరంలో ఉన్న మరో ఇంటి వద్దకు వెళ్లి ఇద్దరు యువకులను గుర్తించింది. వీరే తమ పిల్లలను హత్య చేశారని కోపాద్రిక్తులైన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు మూకుమ్మడిగా ఈ యువకుల ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని టీవీ, ఫర్నీచర్‌ను రోడ్డుపైకి వేసి ధ్వంసం చేశారు. విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ సుబ్బారావు, పెనుకొండ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, స్థానిక ఎస్ఐ సద్గురుడు తదితరులు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా.. అనుమానిత కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పోలీసులు ఈ ఇంటి వద్ద కూడా బందోబస్తును కొనసాగిస్తున్నారు. -
సిఫార్సు, రూ.6 లక్షలతోనే వర్సిటీలో పోస్టు ?
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. రాజకీయ పలుకుబడి, డబ్బున్న వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేసి ఓ ప్రహసనంలా రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పలువురు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జిల్లాలోని నిరుద్యోగులు ఆశపడ్డారు. వాటి కోసం ఐదేళ్లుగా ఎదురుచూపులు చూశారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 100 నాన్ టీచింగ్ పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులనే కొనసాగిస్తూ వచ్చారు. వీటిలో కొన్ని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎట్టకేలకు ఇటీవల నోటిఫికేషన్లు విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, హాస్టల్ స్టీవార్డ్, కుక్, డ్రైవర్, జానియర్ స్టెనో, సీనియర్ అసిస్టెంట్ తదితర నాన్‌టీచింగ్ పోస్టులతో పాటు ఒక డిప్యూటీ రిజిస్ట్రార్, ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఒక సూపరింటెండెంట్ మొత్తం కలిపి 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పలుకుబడికే ప్రాధాన్యం ! సుదీర్ఘ కాలం తర్వాత వీఎస్‌యూలో నాన్‌టీచింగ్ పో స్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో వేలాది మం ది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ, పీజీ పట్టభద్రులు కూడా ఉన్నారు. అయితే భర్తీప్రక్రియపై నిరుద్యోగులు పలు అనుమానాలు వ్య క్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి సిఫార్సుతో పాటు రూ.6లక్షలు ముట్టజెప్పిన వారికే నాన్ టీచింగ్ పోస్టు దక్కేలా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. కొన్ని పోస్టులకు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసి నామమాత్రం గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని వాపోతున్నారు. అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలివే.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి బుధవారం ని ర్వహించిన రాతపరీక్ష ఫలితాలను వెబ్సైట్లో ఉంచా రు. 212 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రకటించినా, వారు సాధించిన మార్కులను వెల్లడించలేదు. యూనివర్సిటీ స్థాయిలో పోస్టుల భర్తీకి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. కానీ ఇక్కడ ఓఎంఆర్ షీటు లాంటి టెక్నాలజీని ఉపయోగించలేదు. రాతపరీక్షలోనూ హాల్‌టికెట్ నంబర్లను సింగిల్ డిజిట్ నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో పరీక్ష పత్రాలను తారుమారు చేసే అవకాశం ఉంది. రాజకీయ నేతల సిఫార్సులతో ఇప్పటికే అనేక మంది వర్సిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా కొనసాగుతున్నారు. వీరిలో ఓ మాజీ మేయర్ సమీప బం ధువు కూడా ఉన్నారు. ప్రస్తుతం భర్తీకానున్న పోస్టులు వారికే దక్కే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
సంబురం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది. పోరు గడ్డ ఎగిరి గెంతేసింది. లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటారుు. సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూసిన జిల్లా ప్రజలు ఆనందంతో గంతులేశారు. వీధి వీధినా... పల్లె పల్లెనా పండుగ వాతావరణం వెల్లివిరిసింది. పిల్లా పాపలు మొదలు వృద్ధుల వరకు... జై తెలంగాణ... జయుహో తెలంగాణ... అంటూ అరుపులు కేకలతో వీధుల్లోకి పరుగులు తీశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే ఆనందంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుులు, వివిధ ప్రజాసంఘాలు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌కు తరలివచ్చి జయు జయుధ్వానాలు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయుకులు... కార్యకర్తలు విజయోత్సాహంతో... వీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు. ధూం ధాం తీన్వూర్ ఆటపాటలతో డాన్సులు చేశారు. టపాసులు కాల్చి... మిఠారుులు పంచిపెట్టారు. జిల్లా కేంద్రం మొదలు అన్ని వుండల కేంద్రాల్లో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకున్నారు. ఎన్నికల తరుణం కావడంతో అన్ని ప్రాంతాల్లో రాజకీయు కోలాహలం కనిపించింది. ప్రధాన పార్టీల నాయుకులు సంబరాల్లోనూ పోటీపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు వుుందు వరుసలో నిలబడితే బిల్లుకు వుద్దతునిచ్చిన బీజేపీ నాయుకులు ఆనందంలో పాలుపంచుకున్నారు. ఎవరికి వారుగా తవు పార్టీల జెండాలను విజయు పతాకాలుగా ఎగరేశారు. వారం రోజుల నుంచే పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై గందరగోళం నెలకొనటం... పెప్పర్ స్ప్రే ఘటనలో ఎంపీ పొన్నం ప్రభాకర్ అస్వస్థతకు గురికావడంతో... జిల్లాలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ వుుఖ్యనేతలు ఢిల్లీలోనే ఉన్నారు. వుంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం, వివేక్‌తోపాటు విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, సోవూరపు సత్యనారాయుణ, గంగుల కవులాకర్, విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి అక్కడే సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, రవీందర్‌సింగ్, వుహిళా నేతలు కటారి రేవతిరావు, వరాల జ్యోతి... కాంగ్రెస్ తరఫున పార్టీ వుహిళా నేతలు నేరెళ్ల శారద, గందె వూధవి, గుగ్గిళ్ల జయుశ్రీ, గంట కళ్యాణి, నందెల్లి రవు, బీజేపీ తరఫున మీస అర్జున్‌రావు, బండి సంజయ్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సీపీఐ నుంచి వుర్రి వెంకటస్వామి, సృజన్కువూర్, పైడి రాజు, జేఏసీ తరఫున వెంకటవుల్లయ్యు, జక్కోజు వెంకటేశ్వర్లు సారథ్యంలో భారీగా తరలివచ్చిన ఉద్యవుకారులు ఆనందోత్సాహాల్లో పాలుపంచుకున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సంబరాలకు దూరంగా ఉంది. జగిత్యాలలో స్థానిక టీడీపీ నాయుకులు కొందరు వీధుల్లోకి వచ్చినప్పటికీ... మిగతా సెగ్మెంట్లలో ఆ పార్టీ ఊసే కనిపించలేదు. వుుగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వుుఖం చాటేశారు. మొన్నటివరకు పాదయూత్ర చేసిన ఎమ్మెల్యే విజయురవుణారావుతోపాటు ఎల్.రవుణ, సుద్దాల దేవయ్యు జిల్లాలో అందుబాటులో లేకుండా... రాజధానిలో వుకాం పెట్టారు. సీనియుర్ నాయుకులు కళ్యాడపు ఆగయ్యు, దామెర సత్యం సారథ్యంలో కొందరు టీడీపీ నేతలు జెండాలతో బయుల్దేరినప్పటికీ.. తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. జెండాలు కింద పడేసి తవుు్మళ్లను దూరంగా తరిమికొట్టారు. జిల్లా కేంద్రంలో ఆ నాయకులు మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నావుని... తెలంగాణకు వుద్దతుగా తవు పార్టీ లేఖ ఇచ్చినందుకే రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకున్నారు. కలెక్టరేట్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయూల్లో ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. -
ఆయనను సస్పెండ్ చేయాల్సిందే..
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్న ట్రెజరీ డిప్యూటీ డెరైక్టర్ రంగప్పను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా ట్రెజరీ కార్యాలయం వద్ద ఆ శాఖ ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై డీడీ రంగప్ప వేధింపులు, బెదిరింపులు అధికమయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకునేవరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన, వర్క్ టు రూల్ లాంటి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎస్టాబ్లిష్మెంట్ సబ్ ట్రెజరీ అధికారి కె.అనురాధమ్మ, సబ్ ట్రెజరీ అధికారి ఎస్.అమీనుద్దీన్ కూడా మాట్లాడారు. -
మిన్నంటిన ‘సమైక్య’ నినాదం
అనంతపురం కలెక్టరేట్/సిటీ, న్యూస్‌లైన్ : ‘సమైక్య’ నినాదం మిన్నంటింది. రాష్ట్ర విభజనను ఉద్యోగులు ముక్తకంఠంతో నిరసించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకోకపోతే గట్టిగా బుద్ధి చెబుతామని సీమాంధ్ర ఎంపీలను హెచ్చరించారు. ఎన్జీఓలు, ఇతర ఉద్యోగులు ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీపై కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ, ట్రెజరీ ఉద్యోగులు టమోటాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి జయరామప్ప, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఫరూక్ అహమ్మద్ మాట్లాడుతూ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే నాయకులు ప్యాకేజీల కోసం ఢిల్లీ టూర్లు వేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, ఏపీ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దయాకర్, జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో నిర్వహించిన ‘రన్‌ఫర్ సమైక్యాంధ్ర’ విజయవంతమైంది. ఉద్యమకారులు ఒకే రంగు దుస్తులు ధరించి సమైక్య నినాదాన్ని మార్మోగించారు. స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి సప్తగిరి, టవర్‌క్లాక్ సర్కిళ్ల మీదుగా పాతూరు వరకూ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి జాక్టో, యూత్ జేఏసీ, ఐఎంఏ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర ఐక్యవేదిక నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ఐఎంఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహబూబ్‌బాషా, సీఆర్ఐటీ విద్యాసంస్థల అధినేత చిరంజీవిరెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులకు సమ్మె సెగ ఏపీ ఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన సమ్మె వల్ల పలు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను వాయిదా వేసింది. ఈ నెల 10 నుంచి 25 వరకు జిల్లాలో జరగాల్సిన రెవెన్యూ సదస్సులు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఉద్యోగులు ఉన్నట్టుండి సమ్మె చేపట్టడంతో సదస్సులను వాయిదా వేయక తప్పలేదు. -
రెండో రోజూ పాక్షికమే
కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండుతో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎన్జీఓలు చేపట్టిన సమ్మె శుక్రవారానికి రెండవరోజుకు చేరుకుంది. ఇటీవల జరిగిన ఉద్యమంలో ఉద్యోగులందరూ పాల్గొన్నారు. దీనిపై అడ్డంకులు ఇంకా తొలగకపోవడం, సర్వీసుకు సంబంధించిన వ్వవహారాలు ఉండడంతో ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఉద్యమంలోకి రానట్లు తెలుస్తోంది. రాయచోటి పట్టణంలో ఎన్జీఓ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. డైట్లో జరిగే అవగాహన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర సమాచార హక్కు చట్టం శాఖ కన్వీనర్ ఇంతియాజ్ అహ్మద్‌ను ఆందోళనకారులు అడ్డగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులకు, ఉద్యోగులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఉద్యోగులను స్టేషన్‌కు తరలించారు. కడపలో ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి సమ్మెను పర్యవేక్షించారు. కలెక్టరేట్, పౌరసరఫరాలు, ట్రెజరీ, సర్వే, చీఫ్ ప్లానింగ్ కార్యాలయాకు వెళ్లి ఉద్యోగులను బయటికి పంపివేశారు. సమ్మెకు సహకరించి సమైక్యాంధ్రకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్జీఓ నేతలు శ్రీనివాసులు, అలీఖాన్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. పులివెందులలో తహశీల్దార్ కార్యాలయంతోపాటు పలు ఆఫీసులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రొద్దుటూరుపట్టణంలో ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి సమ్మెను పర్యవేక్షించారు. ఆర్అండ్బీ, ట్రెజరీతో పాటు మరికొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వేకోడూరులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ చైర్మన్ పి.ఓబులేసు ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్వర్‌బాష, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు రంగారెడ్డి, సుదర్శన్‌రాజు, కాంగ్రెస్ నాయకులు జయప్రకాశ్, ఆదర్శ హైస్కూలు విద్యార్థులు సంఘీభావం తెలిపారు. బద్వేలు తహశీల్దార్ కార్యాలయం మూతపడింది. మిగతా కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి. జమ్మలమడుగులో ఎన్జీఓ అధ్యక్షుడు నారాయణరెడ్డి సమ్మెను పర్యవేక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కమలాపురంలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే మూతపడ్డాయి. మిగతా కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి. రాజంపేటలో ఎన్జీఓ అసోసియేషన్ చైర్మన్ రమణ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు యోహాన, రామచంద్రయ్య, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. మైదుకూరులో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించారు.మిగతా కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి. -
పైసలిస్తే ఓకే
సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాల్సిన ఆ కార్యాలయం ఇష్టారాజ్యంగా నడుస్తోంది. అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్నట్లుగా చేతులు తడిపితే ఎలాంటి పనులైనా చకచకా జరిగిపోతుంటాయి. ఉద్యోగుల సీటు మారాలన్నా పైసలు లేనిదే ఫైల్ కదలడం లేదు. మొత్తంమీద అక్రమ కార్యకలాపాలకు జిల్లా పరిషత్ వేదికగా మారుతోంది. అవకాశం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చర్యలు జిల్లా పరిషత్‌లో ఇటీవల తీవ్రతరం అయ్యాయి. ప్రతిపనికి ఓ రేటును నిర్ణయించి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలా విచ్చలవిడిగా జరుగుతుండటంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న ఒక రికార్డు అసిస్టెంట్‌కు పదేళ్ల క్రితం టైపిస్టుగా ప్రమోషన్ లభించింది. అప్పట్లో కారణాలు ఏమైనప్పటికీ తనకు ప్రమోషన్ వద్దని భవిష్యత్‌లో కూడా తీసుకోనని రాతపూర్వకంగా విన్నవించారు. అతని సర్వీసు రిజిష్టర్‌లో సైతం ఆ విషయం పొందుపర్చారు. అయితే ఇటీవల సదరు వ్యక్తి కొన్ని కారణాల వల్ల ప్రమోషన్ తిరస్కరించానని, ప్రస్తుతం తనకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. అతని అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని పరిశీలించాల్సిందిగా కోర్టు కోరింది. దీంతో సదరు వ్యక్తికి టైపిస్టుగా ప్రమోషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈతతంగం నిబంధనలకు విరుద్ధమని ఓ సీనియర్ అసిస్టెంట్ ఆక్షేపణ వ్యక్తం చేసినట్లుతెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారి ఒకరు స్వయంగా కల్పించుకుని ప్రమోషన్ ఉత్తర్వులకు చెందిన సిఫార్సులను తయారు చేయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సుమారు రూ.1.5లక్షలు చేతులు మారినట్లు జెడ్పీ ఉద్యోగ వర్గాలు కోడైకూస్తున్నాయి. మైనస్ గ్రాంట్‌లో కూడా పనులు కేటాయింపు... జెడ్పీ జనరల్ ఫండ్ ఇప్పటికే రూ.40లక్షలు మైనస్‌లో ఉంది. అయితే అక్కడ పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్‌ను సంప్రదిస్తే మైనస్ గ్రాంట్‌లో కూడా పనులు అప్పగిస్తున్నారు. జిల్లా పరిషత్ నుంచి గాలివీడుకు అక్కడి నుంచి మళ్లీ జిల్లా పరిషత్‌కు, తదుపరి కీలక సీటుకు ఇటీవలే మారిన ఆసీనియర్ అసిస్టెంట్ ఉన్నతాధికారికి అంతరంగికుడుగా మారినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఎలాంటి పని కావాలన్నా ఆసీనియర్ అసిస్టెంట్‌ను సంప్రదించి తదనుగుణంగా వ్యవహరిస్తే అన్ని పనులు చక్కబడుతున్నట్లు సమాచారం. జెడ్పీ క్వార్టర్స్‌ను సైతం ఓమహిళామండలికి కేటాయించే పనిలో ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇటువంటి విషయాలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. -
లక్ష్యం..సమైక్యం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదంతో సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లా కేంద్రమైన కర్నూలుతో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వకార్యాలయాలు మూతపడ్డాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కోవెలకుంట్లలో రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ జి.రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దారు, ఎంపీడీఓ తదితర కార్యాలయాల సిబ్బంది విధులు బహిష్కరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆదోనిలో నియోజకవర్గ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. డోన్ నియోజకవర్గ ఎన్జీఓ అసోసియేషన్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటికి వచ్చి సమ్మెలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో సమైక్య నినాదం హోరెత్తింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఎన్జీఓలు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను నిరశిస్తూ ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర విభజనను సీమాంధ్ర జిల్లాల ఎంపీలు, కేంద్ర మంత్రులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో ఎన్జీఓ నేతలు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, ఎమ్మిగనూరు తదితర పట్టణాల్లోను సమైక్య సెగలు రాజుకున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఏకమై ఆందోళనలు నిర్వహించారు. కర్నూలులో ఉత్కంఠ భరితంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ కోశాధికారి పి.రామక్రిష్ణారెడ్డి, జిల్లా నేతలు శ్రీరాములు, లక్ష్మన్న, సుధాకర్‌రెడ్డి, బలరామిరెడ్డి, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రామన్న, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ హమీద్, అసోసియేట్ అధ్యక్షుడు మౌలాలి, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని అన్ని శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలోకి వచ్చారు. రెవెన్యూలో వీఆర్ఏ మొదలుకొని తహశీల్దార్ల వరకు సమ్మె బాట పట్టారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, మునిసిపల్ ఎంప్లాయిస్, పంచాయితీరాజ్, వాణిజ్య పన్నుల శాఖ తదితర శాఖల అధికారులు కూడా విధులు బహిష్కరించి జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనతో పాల్గొన్నారు. ఎన్జీఓ నేతలు కలెక్టరేట్లోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో కలియదిరిగి విధులు నిర్వహిస్తున్న వారందరినీ బయటికి తీసుకువచ్చారు. జేసీ చాంబర్ పక్కనున్న రూములో స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా అడ్డుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారందరినీ బయటికి తరలించారు. కుర్చీలను నేలకేసి కొట్టారు. సమ్మె ముగిసే వరకు వీడియో కాన్ఫరెన్స్ రూము తెరిస్తే కబడ్దార్ అంటూ సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా ఎన్జీఓ నేతల ఆందోళనలతో వీడియో కాన్ఫరెన్స్‌ను అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయారు. సునయన ఆడిటోరియంలో ఈనెల 9వ తేది జరిగే టెట్ పరీక్ష సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు తదితరులకు నిర్వహించిన తలపెట్టిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. డీఈఓ ఆధ్వర్యంలో టెట్ అవగాహన సదస్సును వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు అడ్డుకున్నారు. ఈసందర్భంగా కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మేము మా స్వార్థం కోసం సమ్మె చేయడం లేదని, ప్రజా ప్రయోజనాలు ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాల కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండుతో సమ్మె చేస్తున్నామని, ఇందుకు అందరూ సహకరించాలని వెంగళ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొంత ఉత్కంఠ తర్వాత టెట్ సమావేశానికి వచ్చిన వారందరినీ బయటికి పంపారు. సమైక్యాంధ్ర నినాదాలతో కలెక్టరేట్ మారుమోగింది. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ మొత్తం ఖాళీ అయింది. కలెక్టర్ కార్యాలయంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. సమ్మె సందర్భంగా మొదటి రోజు కలెక్టరేట్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మొహరించారు. కలెక్టరేట్‌లోనికి ఎవ్వరినీ అనుమతించలేదు. విధులు బహిష్కరించిన అన్ని శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఏకమై రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆడిట్, ట్రెజరీ, సివిల్ సప్లయ్, వైద్యారోగ్య శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, పబ్లిక్ సెక్టారు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమ్మె కారణంగా పరిపాలన స్తంభించిపోయింది. కాగా శుక్రవారం సమ్మె మరింత తీవ్రంగా ఉంటుందని జిల్లా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి, కో-ఛైర్మన్ సంపత్‌కుమార్ తెలిపారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వకార్యాలయాలను ముట్టడించి పాలనను నిలిపివేస్తామన్నారు. ఈనెల 21వ తేది వరకు జరిగే సమ్మెకు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు సహకరించాలని కోరారు. ఈనెల 21వ తేది వరకు రాష్ట్ర విభజనను అడ్డుకుంటే సమైక్యాంధ్ర లక్ష్య సాధన పూర్తయినట్లు అవుతుందని తెలిపారు. -
మసక ‘కిరణాలు’
రాజీవ్ యువకిరణాల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలన్న సీఎం కిర ణ్ ప్రకటన.. నేతిబీర చందంగా మారింది. ఓవైపు ఉద్యోగాలు లేకపోగా.. మరోవైపు శిక్షణ కేంద్రాలు మూత పడుతున్నాయి. యువతలో నైపుణ్యం పెంపొందించి వారికి ఉపాధి కల్పించాల్సిన సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఖర్చు చేసిన రూ.కోట్లు వృథా అయ్యాయి. సాక్షి, నల్లగొండ: రాజీవ్ యువకిరణాల పథకం ఆది నుంచి బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఏటా లక్షమందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రెండున్నరేళ్ల క్రితం పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద నమోదు చేయించుకున్న నిరుద్యోగుల విద్యాస్థాయిని బట్టి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉద్యోగాలు ఇప్పించడం ఈ పథకం ఉద్దేశం. అభ్యర్థులకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా లబ్ధిపొందిన సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో నిధుల వృథా తప్ప నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు. దీన్ని గుర్తించిన సర్కారు... శిక్షణను నిలిపివేయాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై ఎలాంటి శిక్షణ కేంద్రాలను ప్రారంభించొద్దని అ ధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. ఇంటి దారి... కొన్ని శిక్షణ సంస్థలు అభ్యర్థుల సంఖ్యను ఎక్కువగా చూపి జిమ్మిక్కులు చేశాయి. లేని అభ్యర్థుల పేరిట నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో శిక్షణ సంస్థల్లో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చారు. అయినా సత్ఫలితాలు దక్కలేదు. ఉద్యోగాలు ఇప్పిస్తేనే డబ్బు చెల్లిస్తామని ప్రభుత్వం మెలిక పెట్టింది. దీంతో కొన్ని సంస్థలు చిరుద్యోగాలు చూపించి మమ అన్నాయి. నెలకు రూ.3 వేల వేతనాల కోసం పొద్దంతా పనిచేయలేక ఉద్యోగం నుంచి అభ్యర్థులు వైదొలిగారు. తిరిగి వారందరినీ తీసుకొచ్చి కొలువుల్లో చేర్పించాలని అధికారులకు సర్కారు సూచించింది. క్షేత్రస్థాయిలో వారికోసం అధికారులు తిరిగినా లాభం లేకపోయింది. ఇలాంటి ఒడిదుడుకులు అడుగడుగునా ఎదురయ్యాయి. -
అన్నీ అమ్మకాలే!
అంగన్వాడీ నియామకాలలో నిబంధనలు గాలికి వదిలేశారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వారికి, అదీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అత్యధిక పోస్టులు కట్టబెట్టేశారు. ఒక్కో పోస్టును రూ.50 వేల నుంచి రూ.70 వేల దాకా అమ్ముకున్నారు. ఇందులో హిందూపురం నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఆంతరంగికుడు చక్రం తిప్పగా.. ముఖ్య అధికారి, ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేసేశారు. గత ఏడాది రెండు విడతలుగా జరిగిన ఈ అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వచ్చాయి. అర్హత ఉండి ఉద్యోగాలు పొందలేకిపోయిన వారు సమాచార హక్కు చట్టం కింద నియామకాల ప్రక్రియ ఏ విధంగా సాగిందో బయటకు తీశారు. వీటి ఆధారంగా బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. హిందూపురం మునిసిపాలిటీ, న్యూస్‌లైన్ : హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న 247 (మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు-94, మినీ అంగన్వాడీ కార్యకర్తలు-46, సహాయకులు-107) పోస్టుల భర్తీకి 2011 జనవరి 12న దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు 2013 ఫిబ్రవరి 5న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 245 పోస్టులు భర్తీ చేశారు. రెండో విడతలో 85 (మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు 23, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 27, సహాయకులు-35) పోస్టుల భర్తీకి 2013 జూలై4న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి అదే ఏడాది నవంబర్ 15న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 59 పోస్టులు భర్తీ చేశారు. 29 పెండింగ్‌లో ఉన్నాయి. ఇంటర్వ్యూ బోర్డులోని ఓ ముఖ్య అధికారి, నియోజకవర్గ ప్రజాప్రతినిధి కలిసి ముందుగా నిర్ణయించుకున్న వారికే మిగతా సభ్యులు ఆమోదముద్ర వేసేలా ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిభ ఉన్నా తమను పక్కకు పెట్టారంటూ హిందూపురం, చిలమత్తూరు మండలాలకు చెందిన దాదాపు పది మంది కోర్టుకెళ్లారు. తాజాగా 36 పోస్టులకు నోటిఫికేషన్ హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో తాజాగా 36 (మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు -8, మినీ అంగన్వాడీ కార్యకర్తలు -8, సహాయకులు-20) అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూ తేదీని ఖరారు చేయాల్సి ఉంది. ఈసారైనా ఉన్నతాధికారులు అక్రమాలకు చెక్‌పెట్టి.. ప్రతిభ, అర్హత ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అన్యాయం చేశారు హిందూపురంలోని మోడల్‌కాలనీ-2 అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. పదోతరగతిలో 352 మార్కులు వచ్చాయి. అనుభవం మార్కులు చూసుకుంటే ప్రస్తుతం నియమించిన కార్యకర్తకంటే నాకే ఎక్కువ. ఎంపిక చేసిన కార్యకర్త వివరాలను అడిగితే అధికారులు ఇవ్వడంలేదు. దీంతో నేను హైకోర్టును అశ్రయించి స్టే తీసుకొచ్చాను. అయినా అధికారులు స్పందిస్తున్న దాఖలాల్లేవ్. - జె.శోభావతి, బాధితురాలు సున్నా మార్కులు వేశారు హిందూపురం పట్టణంలోని సత్యసాయికాలనీ అంగన్వాడీ వర్కర్ పోస్టుకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నాం. అందులో పదో తరగతిలో 418 మార్కులతో నేనే అందరికన్నా ముందు న్నా. ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాను. అయితే నాకు ఎమ్మెల్యే 0, ఐసీడిఎస్ అధికారులు 0 మార్కులు వేశారు. ప్రస్తుతం ఈ పోస్టుకు ఎంపిక చేసిన ఆమె కన్నా నాకు పదో తరగతిలో 101 మార్కులు ఎక్కువ. విద్యావలంటీర్‌గా కూడా పని చేశాను. అయినా నన్ను ఎంపిక చేయలేదు. ఈ అక్రమ నియామకంపై న్యాయ పోరాటం చేస్తా. - ప్రశాంతి, బాధితురాలు -
ఉల్లాసంగా..ఉత్సాహంగా
ఉద్యోగులు.. అధికారులు తరతమ బేధం లేకుండా ఉల్లాసంగా.. ఉత్సాహంగా వివిధ క్రీడా పోటీలలో పాల్గొంటున్నారు. గెలిచిన జట్ల సభ్యులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. వీరికి ఓడిన జట్టు సభ్యులు క్రీడాస్ఫూర్తితో అభినందనలు తెలుపుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్న పోటీలలో ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఉద్యోగుల క్రీడోత్సవాలు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. ఈ క్రీడాపోటీలను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు. అన్ని క్రీడాంశాల వద్దకు వెళ్లి ఉద్యోగులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులు కలిసిమెలిసి ఆడుతుంటే ఆత్మీయత, అనుబంధం కలబోసినట్లు ఉందన్నారు. అనంతరం ఉద్యోగులతో పాటు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాజంపేట సబ్‌కలెక్టర్ ప్రీతిమీనా, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ ఎం. రామచంద్రారెడ్డి, డీఎస్డీఓ బాషామోహిద్దీన్, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్పగౌర్, ఆర్అండ్బీ ఎస్ఈ మనోహర్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ ప్రతిభాభారతి, స్టెప్ సీఈఓ మమత తదితరులు ఉన్నారు. చెడుగుడు ఆడేశారు.. కబడ్డీ.. కబడ్డీ అంటూ ఉద్యోగులు చెడుగుడు ఆడేశారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వీరి ఆటతీరు కొనసాగింది. మేం.. గెలిచాం.. వాలీబాల్‌లో పాల్గొన్న జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. జిల్లాపరిషత్‌పై డీఈఓ కార్యాలయ సిబ్బంది విజయం సాధించడంతో కేరింతలు కొట్టారు. మేం గెలిచాం.. అంటూ సందడి చేశారు. పాపం.. క్రీ‘డల్’.. జిల్లా క్రీడాప్రాథికార సంస్థ అంటే క్రీడలకు జిల్లాలో ఆయువుపట్టు లాంటింది. అటువంటి జట్టుపైనే నెగ్గిన సర్వే అండ్ ల్యాండ్స్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఒక్కపాయింటు తేడాతో ఓటమి చెందిన క్రీడాప్రాధికార సంస్థ ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో విజేతలను అభినందించారు. క్రికెట్.. క్రికెట్.. వైఎస్ రాజారెడ్డి, ఆర్ట్స్ కళాశాల మైదానాల్లో క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. జెడ్పీ జట్టు, నీటిపారుదల జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ సాగింది. క్రికెట్ పోటీలను కలెక్టర్, అధికారులు తిలకించారు. స్కిప్పింగ్ మహరాణులు.. స్కిప్పింగ్ పోటీల్లో మహిళలు ఉల్లాసంగా పాల్గొన్నారు. డీటీసీ కృష్ణవేణి, జిల్లా పంచాయతీ అధికారిణి అపూర్వసుందరి పాల్గొని మహిళా ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. పరుగో.. పరుగు.. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుపందెంలో రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్పగౌరవ్, సీపీఓ తిప్పేస్వామి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి పాల్గొన్నారు. మహిళలు సైతం పరుగు పందెంలో పాల్గొన్నారు. షటిల్ మాస్టర్.. సబ్ కలెక్టర్.. రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా షటిల్ బ్యాడ్మింటన్ ఉత్సాహంగా ఆడారు. ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌తో కలసి చాలాసేపు ఆడి తోటి ఉద్యోగులను ఉత్సాహపరిచారు. అన్ని క్రీడల్లోనూ,... ఎవరైనా ఒక రంగంలో రాణిస్తేనే అబ్బో అంటాం.. అలాంటిది.. వివిధ క్రీడాంశాల్లో ఆడటమే కాక పోరాటపటిమను చూపుతూ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నాడు జిల్లా కలెక్టర్ కోన శశిధర్. షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, క్రికెట్ ఇలా అన్ని క్రీడాంశాల్లో ప్రొఫెషనల్ క్రీడాకారుడు వలే ఆడుతుండటం పట్ల ఉద్యోగులు సైతం స్వతహాగానే క్రీడాకారుడు కనుకనే క్రీడలు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాడంటూ కితాబునిస్తుండటం గమనార్హం. - న్యూస్‌లైన్, కడప స్పోర్ట్స్ -
ఇలా అయితే ఎలా సారూ!
పీఎస్ ప్రద్యుమ్న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక ప్రజాసమస్యలపై దృష్టి సారించారు. అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేశారు. అయితే, నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచే కొందరు అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ ఆశయానికి గండి కొడుతున్నారు. ఆయననే తప్పుదారి పట్టిస్తున్నారు. అందుకు ఈ సంఘటనే నిదర్శనం. కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇందూరు జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు, ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రద్యుమ్న 2013 సెప్టెంబర్ 4న కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యలను ఈ నంబరుకు ఫోన్ చేసి చెబితే, వాటిని సత్వరమే పరి ష్కరించేలా చూస్తామని ప్రకటించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కొందరు అధికారులు ఇక్కడా తమ నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోయినా, పరిష్కారం అయిందని టోల్‌ఫ్రీ కేంద్రానికి సమాచారమిస్తున్నారు. దీంతో ప్రజలు విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సంఘటనే ఒకటి గురు వారం వెలుగులోకి వచ్చింది. వీధి దీపాలు వెలగడం లేదని నగరంలోని కోటగల్లి భగత్‌సింగ్ చౌరస్తా నుంచి ఇందిరాగాంధీ పార్కు వరకు ఉన్న వీధి దీపాలు కొద్ది రోజులుగా వెలగడం లేదు. రాత్రిపూట ఆ ప్రాంతంలో చీకటి అలుముకుంటోంది. ఈ ప్రాంతవాసులు నడవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతల గంగాదాస్ అనే స్థానికుడు గత నవంబరు 27న ఈ విషయాన్ని టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేశారు. (ఫిర్యాదు నం58886). టోల్ ఫ్రీ నిర్వాహకులు సమస్యను కంప్యూటరీకరించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. 15 రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. సంబంధి త అధికారులులెవరూ స్పందించలేదు. కనీసం సమస్య ను తెలుసుకోడానికి కూడా ప్రయత్నించ లేదు. దీంతో గంగాదాస్ డిసెంబరు 16న తిరిగి ఫిర్యాదు (59693) చేశారు. టోల్‌ఫ్రీ నిర్వాహకులు ఈ ఫిర్యాదును మరోసారి మున్సిపల్ అధికారుల దృషికి తీసుకెళ్లారు. ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమైపోయిందని వారు సమాధానమివ్వడంతో, అదే విషయాన్ని వారు కంప్యూటర్లో నమోదు చేశారు. అసలు విషయం ఇది ఇక్కడ వీధి దీపాలు మాత్రాలు వెలగలేదు. గంగాదాస్ గురువారం ఉదయం మరోసారి టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేశారు. సమస్య పరిష్కారమైందని అక్కడి సిబ్బం ది చెప్పడంతో నివ్వెరపోయారు. అసలు విషయం ఆరా తీసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. సమస్య పరిష్కారమైం దని కంప్యూటర్లో స్పష్టంగా నమోదు అయి ఉండడాన్ని చూసి ఖంగు తిన్నారు. దీంతో మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని తేలిపోయింది. ఇక ఆయన చేసేదేమీ లేక కలెక్టర్‌నే నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో నిజాలెన్నో టోల్ ఫ్రీ సెంటర్‌కు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 2,581. ఇందులో వాస్తవంగా ఎన్ని పరిష్కారమయ్యాయో తెలియదు. తప్పుడు సమాచారాలెన్నున్నా యో కూడా తెలియదు. ఫిర్యాదుదారులు సుదూర ప్రాం తాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రజావాణికి వస్తున్నారని ఆలోచించిన కలెక్టర్, వారి ఇబ్బందు లను తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. కొందరు అధికారులు అతి తెలివి చూపించి కలె క్టర్నే బురిడీ కొట్టిస్తున్నారు. -
భద్రత డొల్ల..
అధికారుల నిర్లక్ష్యం.. విధుల్లో నిర్లిప్తత విలువ.. అక్షరాల అరకోటి పైమాటే. రైతుల సొమ్మును భద్రంగా ఉంచాల్సిన ఉద్యోగులు గాలికొదిలేశారు. కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంతో దొంగలు వచ్చి తాపీగా ఉన్నదంతా ఊడ్చేశారు. వారు ఇంటి దొంగలా? బయట దొంగలా? అనేది విచారణలో తేలనుంది. కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో బంగారం మాయం ఘటన మరవకముందే ధర్మపురి ప్రాథమిక సహకార సంఘంలో చోరీ జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. - న్యూస్‌లైన్, ధర్మపురి ధర్మపురి న్యూస్‌లైన్ : ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భద్రత ఏర్పాట్లు లేకనే దొంగలు చొరబడ్డారని తేలిపోయింది. పట్టణంలోని నం బరు 63 జాతీయ రహదారిపై నిత్యం వాహనా లు రాకపోకలు సాగుతుంటాయి. సంఘానికి కేవలం 50మీటర్ల దూరంలోనే తహశీల్దార్, మండల పరిషత్ తదితర ప్రభుత్వ కార్యాలయా లు ఉన్నాయి. జనసంచారం అధికంగా ఉంటుం ది. అయినా వీటి సమీపంలోని పీఏసీఎస్‌లో చోరీ జరగడం గమనార్హం. నగదుతోపాటు రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు భద్రపర్చే సింగిల్ విండోలో భద్రతా పరమైన ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. కనీసం సీసీ కెమెరాలు బిగించలేదు. వాచ్‌మన్ సైతం లేడు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. షట్టర్లు పగులగొట్టి.. లాకర్లు తెరచి.. ముందుగా పీఏసీఎస్ షట్టర్ల తాళాలను వేటకొడవలితో కోసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గదిలో ఓ మూలకు పడిఉన్న వేటకొడవలి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. షట్టర్లు తెరిచిన దొంగలు.. నేరుగా లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత తాళాలతో లాకర్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయంలో దొంగలు మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. పీఏసీఎస్‌లో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. రెండు లాకర్లు, నాలుగు బీరువాలు ఉన్నాయి. ఒక లాకరులో ఆభరణాలు, మరోదానిలో నగదు భద్రపరుస్తున్నారు. వాటికి సంబంధించిన తాళం చెవులు మేనేజరు వద్ద ఉండాలి. మేనేజర్ బుచ్చన్న మంగళవారం ఆఫీస్ పనిపై కరీంనగర్ వెళ్లగా మిగతా వారు విధుల్లో ఉన్నారు. తాళం చెవులను బీరువాలోని రహస్య లాకర్లో పెట్టి విధులు ముగించుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. వీటిని చూసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళాలతో నేరుగా బీరువా తెరిచి అందులోని లాకర్ తాళాలు తీసుకుని లాకర్ తెరిచి ఆభరణాలు ఎత్తుకెళ్లారంటే బాగా తెలిసిన వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. రూ.50 లక్షల వరకు చోరీ పీఏసీఎస్‌లో రూ.50 లక్షల విలువైన బంగారం(1345.42 గ్రాములు), రూ.2.85 లక్షలు నగదు అపహరణకు గురైందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ధర్మపురి సింగిల్‌విండో పరిధిలో 16 గ్రామాలకు చెందిన 27మంది బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు. సుమారు రూ.25 లక్షల రుణాలు పొందారు. తాకట్టు పెట్టిన ఆభరణాలపై యాభై శాతం వరకు రుణం అందిస్తారు. ఈ లెక్కన ఆభరణాల అసలు విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. విండోపై ఎంతో నమ్మకంతో విలువైన ఆభరణాలు కుదవపెట్టిన వారికి ఈ సంఘటనతో ఆందోళన మొదలైంది. దొంగలను పట్టుకుంటాం పీఏసీఎస్‌లో చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుంటామని సీఐ మహేందర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ఎస్సై జగన్మోహన్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. కరీంనగర్ నుంచి క్లూస్ టీంను రప్పించారు. జాగిలాలతోనూ పరిశీలించారు. సంఘటనా స్థలం నుంచి స్థానిక ఆర్అండ్ బీ వసతి గృహం వరకు వెళ్లిన జాగిలం.. దర్గా వద్దకు వెళ్లే రహదారి వద్ద ఆగిపోయింది. కాగా, వేలిముద్ర నిపుణులు.. అనుమానితులతో పాటు సిబ్బంది వేలిముద్రల్ని సేకరించారు. -
జాతీయ హోదా లభిస్తుందా?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా లభిస్తుందా? అన్న అంశం తాజాగా తెరపైకి వచ్చింది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 2008 డిసెంబర్ 16న వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాప న చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి 28 ప్యాకేజీల ద్వారా రూ.38,500 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, నిర్మల్, ముథోల్ ఐదు నియోజకవర్గాలు, 19 మండలాలు, 306 గ్రామాలకు చెందిన 1,56,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. వైఎస్ మరణంతో గ్రహణం తుమ్మిడిహెట్టి వద్ద నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు 1,055 కిలోమీటర్ల పొడవున కాల్వ తవ్వకాలు జరపడంతోపాటు ఏడు జిల్లాలో పనులు నిర్వహించేందుకు టెండర్లు కూడా పూర్తయి ప్రాజెక్టు పనులు జోరందుకునే క్రమంలో మహానేత అకాల మరణానికి గురయ్యారు. తెలంగాణ ప్రజల కలల సాకారమైన భారీ ప్రాజెక్టు పనులు మందగించిపోగా ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన పాలకులు అంతగా పట్టించుకోక పోవడంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగాలు, వనరులు తదిత ర అంశాలపై కేంద్ర మంత్రి మండలి(జీవోఎం) పరిశీలిస్తున్న విషయం విదితమే. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశంపై టీ-కాంగ్రెస్ మంత్రులు, నేతలు జీవోఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ సారైనా జాతీయ హోదా దక్కుతుందా? అన్న చర్చ జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుకు జాతీయ దక్కి పూర్తయితే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్న అభిప్రాయాన్ని ఇంజినీరింగ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
‘స్వగృహం కల
గోదావరిఖని, న్యూస్‌లైన్: సర్కారు నిర్లక్ష్యం వల్ల రాజీవ్ స్వగృహ పథకం పడకేయడంతో మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోతోంది. రామగుండం మండలం కుందనపల్లి శివారు ఇంధన నిల్వల కేంద్రం ఎదురుగా రాజీవ్ రహదారిని ఆనుకుని 28.08 ఎకరాల విస్తీర్ణంలో స్వగృహ సముదాయ నిర్మానాన్ని 2008లో ప్రారంభించారు. ఈ సముదాయానికి అక్షయ కేంద్రం అని నామకరణం చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఆర్‌ఎస్‌సీఎల్) ఆధ్వర్యంలో నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో సొంతిల్లు నిర్మించుకోవడం మధ్య తరగతి ప్రజలకు కష్టసాధ్యంగా మారింది. దీంతో పలువురు ఉద్యోగులు, కార్మికులు, ఇతర వర్గాల వారు స్వగృహ సముదాయంలో నిర్ణీత రుసుము చెల్లించి ఇళ్లు బుక్ చేసుకున్నారు. వివిధ కారణాల వల్ల కొంతమంది వెనక్కు తగ్గగా, మరికొంత మంది విడతల వారీగా పూర్తి సొమ్ము చెల్లించి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఐదేళ్లు గడస్తున్నా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడం, ప్లాట్లు ఎప్పటిలోగా అప్పగిస్తారో కూడా వెల్లడించకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. నగరాలు, పట్టణాల్లో భూమి కొని ఇల్లు నిర్మించుకోలేని వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్సార్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని 2008లో ప్రవేశపెట్టింది. జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ మరణానంతరం పాలకుల నిర్లక్ష్యం వల్ల రామగుండం మినహా మిగిలిన అన్ని చోట్ల ఈ పథకం అటకెక్కింది. ఎన్నటికి పూర్తయ్యేనో..? మొత్తం 176 ఇళ్ల నిర్మాణానికి 2008 నవంబర్ 27న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ భవనాలు నిర్మించే స్థలం ఎగుడుదిగుడుగా ఉండడం, పైన ఎన్టీపీసీకి చెందిన హైటెన్షన్ విద్యుత్ లైన్లు వెళుతుండడంతో చాలామంది ఆసక్తిచూపలేదు. చివరకు 177 మంది ముందుకు రాగా భవన నిర్మాణాలు ప్రారంభించారు. ఆయా శ్రేణులకు నిర్ణయించిన మొత్తాన్ని దశలవారీగా చెల్లించేం దుకు అవకాశమిచ్చారు. అక్షయ కేంద్రం రామగుండం, గోదావరిఖనిలకు దూరంగా ఉండడంతో.. చివరకు 30 మంది మాత్రమే మిగిలారు. వీరిలో 25 మంది లబ్ధిదారులు మొత్తం డబ్బులను చెల్లించగా, ఏడాదిలో భవనాలు అప్పగిస్తామన్నారు. పస్తుతం క్లాసిక్ శ్రేణి భవనాలు నాలుగు, ఇంట్రినిక్స్ శ్రేణి భవనాలు 18తోపాటు బేసిక్, సివిక్ భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతున్నా లబ్ధిదారులకు భవనాలు అందుబాటులోకి రాలేదు. కొన్ని భవనాలకు రంగులు వేసినప్పటికీ వాటిలో అవసరమైన సామగ్రిని పొందుపర్చలేదు. కొన్ని కిటికీలకు ఇంకా అద్దాలను బిగించలేదు. పలు భవనాల లోపలి భాగంలో నిర్ణయించిన మేరకు టైల్స్‌ను ఏర్పాటు చేయలేదు. అమర్చిన టైల్స్ పలుచోట్ల పగిలిపోయాయి. దూరం నుంచి చూస్తే భవనాలు అందంగా కనిపిస్తున్నప్పటికీ దగ్గరకు వెళ్లి చూస్తే వాటి దుస్థితి కళ్లకు కడుతుంది. సివిక్ శ్రేణి భవనాలను తీసుకోవడానికి ఎక్కువ మంది రాకపోవడంతో వాటికి కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల సర్వే చేసినట్టు సమాచారం. మౌలిక వసతులేవీ? అక్షయ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన దారుణంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం గా ఉంది. ఇటీవల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మా ణం పూర్తి చేశారు. కానీ భూగర్భంలో పైపులను ఎగుడు దిగుడుగా వేయడంతో వర్షాకాలంలో నీరు బయటకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. తిరిగి డ్రైనేజీ పైపులైన్లను పూర్తిగా పెకిలించి మళ్లీ పైపులైన్లు వేస్తున్నారు. డ్రైనేజీ కుండీలు నిర్మించినా అవి ఎక్కడికక్కడ పగిలిపోయాయి. విద్యుత్ లైన్లు వేసినప్పటికీ రెండుచోట్ల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్కటీ అమర్చలేదు. గోదావరినది నుంచి తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయారు. మూడుచోట్ల బోర్లను మాత్రమే తవ్వించారు. కాలనీకి ఉపయోగపడేలా ట్యాంకు నిర్మాణం చేపట్టలేదు. రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల చెట్లపొదలతో అవి నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీస సౌకర్యాలు లేకుండా తాము ఈ భవనాలలో ఎలా నివసించేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఆర్థిక సమస్యలతో ఆలస్యం -ఎ.కొమురయ్య, డీజీఎం, ఏపీఆర్‌ఎస్‌సీఎల్ రాజీవ్ స్వగృహ సంస్థకు కొంత ఆర్థిక సమస్య ఉండడం వల్ల భవన నిర్మాణాలు పూర్తి చేయడంలో ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ సమస్య తీరింది. ఇక చకచకా పనులు చేయిస్తున్నాం. వచ్చే జనవరి నాటికి డబ్బులు చెల్లించిన 25 మంది లబ్ధిదారులకు భవనాలను అప్పగిస్తాం. -
అవినీతి వధ జరిగేనా!
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: అప్పట్లో నరకాసురుడనే రాక్షసుడు అందరినీ పీక్కుతింటూ ప్రజలతో పాటు దేవతలకు సమస్యగా మారాడు. అతని బాధితుల మొర విని స్పందించిన సత్యభామ నరకాసురుడ్ని వధించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ రోజుల్లో నరకాసురుడు ఒక్కడే ప్రజలను హిం సించాడు. ఈ రోజుల్లో మాత్రం అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు, ఉద్యోగులు నరకాసురుడ్ని మరిపించేలా జనాన్ని బాదుతున్నారు. వీరికి లంచం బాధ నుంచి విముక్తి కల్పించేందుకు అవినీ తి నిరోధక శాఖ అధికారులు శ్రమిస్తున్నా, వారు పూర్తి స్థాయిలో జూలు విదిలించాల్సిన సమయం ఆ సన్నమైంది. సమాజంలో అవినీతిని పూర్తిగా అరికట్టినపుడే ప్రజలకు నిజమైన దీపావళి. అవినీతిమయం: జిల్లాలోని దాదాపు అన్ని ప్రభు త్వ శాఖలు అవినీతిమయంగా మారాయి. ప్రజల అ వసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకున్న పలువురు అధికారులు, సిబ్బంది జలగల్లా పీల్చేస్తున్నారు. అవినీతి పరుల ఆటకట్టించేందుకు ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు సీహెచ్ చంద్రమౌళి, టి.వి.శ్రీనివాసరావు, కృపానందం, వెంకటేశ్వర్లు చర్యలు చేపట్టారు. వరుస దాడులు : ఈ ఏడాదిలో ఏసీబీ అధికారులు 22 కేసులు నమోదుచేసి పలువురిని కటకటాల వెనక్కునెట్టారు. డీఎంహెచ్ఓ కార్యాలయంపై ఏసీబీ దా డులు జరగడం సంచలనం సృష్టించింది. అవినీతికి మారుపేరుగా మారిన ఆర్టీఏ కార్యాలయంపై మా ర్చి 13న మెరుపుదాడి చేశారు. అదే నెల 15న నెల్లూరులోని పరిశ్రమల శాఖ కార్యాలయంపై, 30న సూళ్లూరుపేట రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. మార్చి 17వ తేదీన వింజమూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. స్థల విషయమై క్లియరెన్స్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినా ఏఎస్మండలంలోని ఓ సర్వేయర్‌ను ఏప్రిల్ 16న పట్టుకున్నారు. అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్న నెల్లూ రు కార్పొరేషన్ టీపీసీ అధికారులను ఏప్రిల్ 22న అరెస్ట్ చేశారు. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేసేం దుకు లంచం డిమాండ్ చేసిన హౌసింగ్ అధికారి మేనెలలో ఏసీబీకి దొరికిపోయాడు. జూలై 9న ఓజిలి ఎస్సైని, లెసైన్స్ రెన్యూవల్ విషయంలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటున్న వాణిజ్యపన్నుల శాఖ లోని ఓ అధికారిని జూలై 28న నెల్లూరు లో, ఇందిరమ్మ ఇంటికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు లంచం తీసుకుంటున్న నారాయణరెడ్డిపేట వీఆర్వో శ్రీనివాసులును ఆగస్టు 6న పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపు విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ అటవీశాఖలోని ఓ అధికారి ఆగస్టు 21న దొరికిపోయారు. వైద్యఆరోగ్య శా ఖ కార్యాలయంలోని సూపరింటెండెంట్ సెప్టెంబ ర్లో ఏసీబీకి చిక్కాడు. అనంతరం నెల్లూరులోని పె ద్దాసుపత్రిపై అధికారులు దాడులు నిర్వహించారు. గత నెల 29న వాకాడులోని ప్రభుత్వ ఐటీఐపై దాడి చేసి భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుస దాడులు జరుగుతున్నా అవినీతిపరుల్లో మార్పురాకపోవడం దురదృష్టకరం. -
ఆగని పోరు
సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం మళ్లీ ఊపందుకుంటోంది. ఎన్జీఓలు, ఉద్యోగులు రాస్తారోకోలు, మానవహారాలు చేస్తున్నారు. దీనికితోడు విద్యార్థులు చేయూతనందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ దీక్షలు కొనసాగుతున్నాయి. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని అన్ని వర్గాల ప్రజలు హెచ్చరిస్తూనే ఉన్నారు. కడపలో వైఎస్సార్ సీపీ నేత, మాజీ కార్పొరేటర్ ఎస్ఏ షంషీర్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్బి అంజాద్‌బాషా, అధికార ప్రతినిధి అఫ్జల్ఖాన్ సంఘీభావం తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో మాదిగ దండోరా నేతలు పాపోడు, రాజా ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు ధనిరెడ్డి కొండారెడ్డి, హనుమంతరెడ్డి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో వైఎస్సార్సీపీ నేత చెవ్వు శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్ సీపీ నేత సాయికిశోర్‌రెడ్డి, పంజం సుకుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. బద్వేలులో మిద్దెల దళితవాడకు చెందిన వైఎస్సార్ సీపీ నేత యర్రబల్లె యల్లయ్య ఆధ్వర్యంలో 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఫులివెందులలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఎర్రగుడిపల్లె, వైఎస్ జార్జిరెడ్డి ఐటీఐ సిబ్బంది, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. రాయచోటిలో చిన్నమండెం, కేశాపురం, బోనాల, టి.పోలిచెరువు గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. కమలాపురం పట్టణంలో యల్లారెడ్డిపల్లె సర్పంచ్ రవిశంకర్ ఆధ్వర్యంలో పలువురు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్సీపీ నేతలు ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి మద్దతు తెలిపారు. -
దిగ్బంధం
సాక్షి, కడప : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లాలో ఉద్యోగులు కదం తొక్కారు. కడప, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, బద్వేలులో ఉద్యోగులు ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ నేతృత్వంలో సడలని సంకల్పంతో రిలే దీక్షలు సాగుతున్నాయి. సమైక్య శంఖారావం సభ సక్సెస్ కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు సమైక్యవాదుల్లో కొత్త ఊపు వచ్చింది. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగుతాయని అన్ని వర్గాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. కడపలో ఎన్జీఓలు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇర్కాన్ సర్కిల్లో ఉదయం జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో వందలాది వాహనాలు ఆగిపోయాయి. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకుడు శివారెడ్డి, కన్వీనర్ శ్రీనివాసులు, ఉపాధ్యాయ నాయకులు వెంకటశివారెడ్డి, తిరుపాలు పాల్గొన్నారు. వీరికి డీఆర్వో ఈశ్వరయ్య సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ నగర ప్రధాన కార్యదర్శి షబ్బీర్ ఆధ్వర్యంలో ఆరుగురు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. కోర్టు వద్ద న్యాయవాదులు, కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. జమ్మలమడుగులో రాజీవ్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ నేత సంజీవరాయుడు ఆధ్వర్యంలో 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో జేఏసీ చైర్మన్ ఓబులేశు నేతృత్వంలో ఉద్యోగులు రోడ్డుపైన బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ నేత శారదమ్మ నేతృత్వంలో ఆరుగురు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బద్వేలులో మహేశ్వర్‌రెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థినులు 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మద్దతుగా ప్రైవేటు పాఠశాలల యూనియన్, స్కూలు విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి 89 ఆకారంలో కూర్చొన్నారు. జేఏసీ నాయకుడు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నాలుగురోడ్ల కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు, లారీలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో కృష్ణశారద కళాశాల ఇంటర్ విద్యార్థులు 15 మంది దీక్షల్లో కూర్చొన్నారు. పులివెందులలో మున్సిపల్ పరిశీలకుడు వరప్రసాద్ నేతృత్వంలో మహిళలు 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాయచోటిలో ఎన్జీఓలు భారీ ర్యాలీ నిర్వహించి నేతాజీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ కార్యక్రమం ఎన్జీఓ నేతలు వెంకటేశ్వరరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డితోపాటు పలువురి ఆధ్వర్యంలో కొనసాగింది. అర్చన విద్యా సంస్థల ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి వైస్సార్ సీపీ నేత మదన్‌మోహన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మైదుకూరులో సిండికేట్బ్యాంకు, రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కమలాపురంలో వైఎస్సార్సీపీ నేత మెడికల్ షాప్ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. రాజంపేటలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ నేత ఎస్వీ రమణ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరులో న్యాయవాదులు రిలే దీక్షలు కొనసాగించారు. -
పోరు బాట
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ప్రజలు పోరుబాటలో సాగుతున్నారు. ఉద్యోగులు ఉద్యమ బాట వీడినా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ సమైక్య రాష్ట్రం కోసం పాటుపడకపోయినా.. సామాన్యులు మాత్రం వైఎస్సార్సీపీ అండతో అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడంతో జిల్లాలోని సమైక్యవాదుల్లో రెట్టింపు ఉత్సాహం కన్పిస్తోంది. అదే ఉత్సాహంతో 88వ రోజైన శనివారం జిల్లాలో సమైక్య పోరు జోరుగా కొనసాగించారు. ధర్మవరంలోని కాలేజీ సర్కిల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ’ అంటూ విద్యార్థులు మౌనప్రదర్శన చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. తలుపులలో రాస్తా రోకో నిర్వహించారు. క ళ్యాణదుర్గంలో మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, జేఏసీ నాయకులు ర్యాలీలు చేపట్టారు. విద్యార్థులు స్థానిక టీసర్కిల్లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో నిలబడి నిరసన తెలిపారు. గోరంట్లలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. రాయదుర్గంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలోని పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కూడేరులో విద్యార్థులు మానవహారం నిర్మించారు. -
న్యాయం జరగాలంటే వేరు పడాల్సిందే
కొడంగల్, న్యూస్‌లైన్: పాలమూరు ఎత్తిపోతల పథ కం నిర్మాణంతోనే జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాలంటే వేరుపడాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను గుర్తించి వారి న్యా యం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. గురువారం కొడంగల్ పట్టణంలో జరిగిన విద్యార్థి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. తెలంగాణ ఏర్పడే వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన ను వెంటనే అమలు చేయాలన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమో దం పొందేందుకు కృషి చేయాలని కోరారు. ఈ ప్రాంత ప్రజల నోటికాడి బుక్కను సీమాంధ్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నీళ్లు, కరెంట్, బొగ్గు, వనరులు, ఉద్యోగాలు, సంప ద ఈ ప్రాంతం వారికే దక్కాలన్నారు. సీమాంధ్ర పెత్తందారులు ఆ ప్రాంత ప్రజలకు లేనిపోని భయాలను సృష్టిం చి వారిలో అనుమానాలు రేకెత్తిస్తున్నారని వాపోయారు. హైదరాబాద్ తె లంగాణ ప్రజలహక్కు అని అన్నారు. మూడేళ్లవరకు హైదరాబాద్‌లో కలిసి ఉండి ఆ తర్వాత ఖాళీచేసి వెళ్లిపోవాలని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రా లు, పరాయి దేశస్తులు ఉన్న హైదరాబాద్‌లో వారికి లేని భయాలు సీమాం ధ్రులకు ఎందుకోసమని కోదండరామ్ ప్రశ్నించారు. వారి రక్షణ కోసం చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ 29వ రాష్ర్టం గా ఏర్పడిన తర్వాత కూడా భారత రాజ్యాంగమే అమల్లో ఉం టుందన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ కోచైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జేఏసీ జిల్లా చైర్మ న్ రాజేందర్‌రెడ్డి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు కరాటే రాజు, టీవీ వీ జిల్లా కన్వీనర్ రవీందర్‌గౌడ్, టీఎ న్జీఎస్ తాలూకా కన్వీనర్ బాకారం శ్రీనివాస్, రెడ్డి శ్రీనివాస్, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, రాజేంద్రబాబు తదితరు లు పాల్గొన్నారు. -
పోరాడకపోతే భావితరాలు క్షమించవు
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై పోరాడకపోతే భావితరాలు క్షమించవని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ కన్వీనర్ రత్నాకర్‌రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అందరూ ఉద్యమించాలన్నారు. ఈనెల 26న హైదరాబాదులో జరిగే సమైక్య శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమైక్య రాష్ట్రం తమ పార్టీ విధానమని రాజీనామాలతో పాటు ఏ త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం తెగించి పోరాడుతున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టే సమైక్య శంఖారావానికి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత తరలిరావాలన్నారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండానే న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమ్మె విరమించడం తగన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు నాగన్న, వెంకటేశ్వర్లు, ప్రభుదాసు, నాగేంద్ర, రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా ‘హెల్త్’ పోస్టుల భర్తీ !
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: జిల్లా వైద్యఆరోగ్యశాఖ తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులైన హెల్త్ అసిస్టెంట్లకు(మేల్) గుట్టుచప్పుడు కాకుండా నియామక ఉత్తర్వులు అందజేయడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే డీఎంహెచ్ఓ సెలవుపై వెళ్లడంతో కొందరు ఆ ఆరోపణలకు మరింత పదును పెట్టారు. ఈ వ్యవహారంలో భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 52 హెల్త్‌అసిస్టెంట్(మేల్) పోస్టులను గురు, శుక్రవారాల్లో భర్తీ చేశారు. వీరంతా 2002,03 నుంచి ఆ పోస్టుల్లో కొనసాగుతున్న వారే. అవసరానికి మించి పోస్టులు భర్తీ చేశారనే కారణంతో గత ఏడాది జూలై 3న వీరిని ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వందలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతో హైదరాబాద్‌లో ఏడాదిపాటు నిర్విరామంగా రిలేదీక్షలు కొనసాగించారు. ఎట్టకేలకు స్పందించి ప్రభుత్వం వీరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఇటీవల అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలకు ఆదేశాలిచ్చింది. అందులో భాగంగా జిల్లాలోనూ డీఎంహెచ్ఓ సుధాకర్ గురువారం 40 మందికి, శుక్రవారం 12 మందికి నియామకఉత్తర్వులిచ్చారు. వీరంతా గతంలో తాము పనిచేస్తున్న స్థానాల్లోనే నియమితులయ్యారు. అయితే వీరికి నియామక ఉత్తర్వులు అందించే క్రమంలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మెలో ఉండగా గురువారం సాయంత్రానికి ఎక్కువ శాతం మందికి నియామక ఉత్తర్వులు అందజేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియామక ప్రక్రియ పూర్తవగానే డీఎంహెచ్ఓ 22వ తేదీ వరకు సెలవు పెట్టారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఈ దండకాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని కార్యాలయంలో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపిస్తున్నారు. -
కార్యాలయాలు కళకళ
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : సమ్మె విరామం ప్రకటన తరువాత జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం మళ్లీ సందడి నెలకొంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సకల జనుల సమ్మెలో భాగంగా వివిధ శాఖల ఉద్యోగులు 66 రోజుల పాటు తమ విధులకు దూరమయిన విషయం తెలిసిందే. కనీసం కార్యాలయం వైపు కూడా వెళ్లకుండా సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గురువారం ఏన్జీఓలు సమ్మె విరమించడంతో శుక్రవారం అన్ని కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కార్యాలయాలకు వెళ్లిన ఉద్యోగులకు తమ సీటు వద్ద దుమ్ము, ధూళి, బూజు దర్శనమిచ్చాయి. పలువురు ఉద్యోగులు ముందుగా తమ సీటు, టేబుల్‌ను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కార్యాలయాల అటెండర్, స్వీపర్లు సైతం సమ్మెలో కొనసాగడంతో ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. సుదీర్ఘకాలం వినియోగించకపోవడంతో పలు కంప్యూటర్లో దుమ్మ, ధూళితో నిండి పోయాయి. కొన్ని కంప్యూటర్లు పనిచేయలేదు. సాంకేతిక నిపుణులు స్వల్ప పాటి మరమ్మతులు చేసిన వాటి బాగు చేశారు. విద్యాశాఖాధికారి కార్యాలయం లో మినిస్టీరియల్ స్టాఫ్ వంద శాతం విధులకు హాజరయ్యారు. రవాణా శాఖ కార్యాలయంలో సుధీర్ఘ విరామం తర్వాత కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సిబ్బంది అధికారులు అందరూ విధులకు హాజరయ్యారు. అయితే సమ్మె ముగిసిన తర్వాత తొలిరోజు దరఖాస్తుదారుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. సాధారణ రోజుల్లో వందల సంఖ్యలో వచ్చే దరఖాస్తులు శుక్రవారం అన్ని పనులకు సంబంధించి కేవలం 70 లోపు రావడం సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. ఎల్ఎల్ఆర్, రిజిస్ట్రేషన్, లెసైన్స్, ఎఫ్‌సీ, వివిధ రకాల చలానాలు కలిపినా 70 కూడా రాలేదు. -
హా..జరు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్య ఉద్యమానికి తాత్కాలిక తెర పడింది. రెండు నెలల పాటు ఉద్యమ సిపాయిలై రోడ్డెక్కిన ఉద్యోగులు ఇక కార్యాలయాల వైపు అడుగులేశారు. మొదటి రోజు శుక్రవారం విధులకు హాజరైన కొందరు అధికారులు, సిబ్బందిలో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. తప్పదన్నట్లుగా వారి సీట్లకు పట్టిన దుమ్ము దులిపి.. బూజుపట్టిన ఫైళ్లను కదిలించే ప్రయత్నం చేశారు. వీరి తరహాలోనే కంప్యూటర్లు, ఫ్యాన్లు మొరాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విజిట్ నిర్వహించింది. పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్లోనే చాలా మంది ఉద్యోగులు ఆలస్యంగా విధులకు హాజరవడం కనిపించింది. తీరిగ్గా 11 నుంచి 12 గంటల మధ్యలో వారి రాక నత్తలను తలపించింది. నగరంలోని జిల్లా పరిషత్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే ఇదే తరహా దృశ్యాలే. ఇక ఆర్డీఓ కుర్మానాథ్ కార్యాలయం వైపే రాకపోవడం గమనార్హం. అదే విధంగా జిల్లాలోని తహశీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అధికారులు కొందరు మొదటి రోజు కదా అన్నట్లు ఆలస్యంగా రాగా.. మరికొందరు సొంతంగా సెలవు ప్రకటించేసుకున్నారు. ఇంకొందరైతే కార్యాలయానికి వచ్చి హాజరుపట్టీలో సంతకం చేసి తిరిగి వెళ్లిపోవడం వారి కోసం పడిగాపులు కాసిన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలాఉండగా చాలా కాలం తర్వాత కార్యాలయాలు తెరుచుకోవడంతో సిబ్బంది కుర్చీలతో పాటు వివిధ ఫైళ్లు సైతం దుమ్ముపట్టిపోయాయి. కలెక్టరేట్లోని ఏ, బీ, సీ తదితర సెక్షన్లలో కంప్యూటర్లు మొరాయించారు. కొన్ని విభాగాల్లో ఫ్యాన్లు పనిచేయకపోవటంతో ఉద్యోగులు వాటితో కుస్తీ పట్టడంతోనే సరిపోయింది. జిల్లాలోని పలు కార్యాలయాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. కాగా పలు సమస్యలతో ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయాలకు చేరుకున్నారు. ముఖ్యంగా జనన మరణ, కుల, ఆదాయ, పట్టాదారు పాసుపుస్తకాల కోసం క్యూకట్టారు. అయితే కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటి, నీటి పన్నుల చెల్లింపులు పెద్ద ఎత్తున జరిగాయి. ఒక్క కర్నూలు కార్పొరేషన్లోనే రూ.31 లక్షలకు పైగా వసూలవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఈ మొత్తం రూ.2 కోట్లకు పైమాటేనని అధికారుల ద్వారా తెలిసింది. -
జనోద్యమం @ 80
సాక్షి, అనంతపురం : ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఉద్యమ బాట వీడుతున్నా సామాన్య జనం మాత్రం సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా పోరు సాగిస్తున్నారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో 80వ రోజైన శుక్రవారం కూడా ‘అనంత’లో ఉద్యమ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అనంతపురంలో ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టవర్‌క్లాక్ సర్కిల్లో వందలాది మంది ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడ్డారు. వీరికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు ఓపీ విభాగం వద్ద ఆందళన చేశారు. యువ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ముట్టడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెలు అమ్ముతూ నిరసన తెలిపారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మెరుపు సమ్మెకు దిగుతామని గుంతకల్లులో మునిసిపల్ ఉద్యోగులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. గుత్తిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. తోపుడుబండ్లపై పండ్లు అమ్ముతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హిందూపురంలో ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో జై..సమైక్యాంధ్ర నినాదాలతో ఆందోళన చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శెట్టూరులో జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. పెనుకొండలో న్యాయవాదులు, విద్యార్థులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వీరికి ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మద్దతు తెలిపారు. ఏపీ ఎన్జీవోల ఉద్యమంపై విమర్శలు గుప్పించిన మంత్రి కొండ్రు మురళి దిష్టి బొమ్మను జేఏసీ నాయకులు దహనం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి.. అనంతరం రిలే దీక్ష చేపట్టారు. వీరికి కాపు భారతి సంఘీభావం తెలిపారు. కణేకల్లులో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. రాప్తాడులో జేఏసీ కన్వీనర్ ఎంఈఓ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రిలే దీక్ష కొనసాగింది. వీరికి వైఎస్సార్సీపీ నాయకులు వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు మనోహర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పెద్దవడుగూరులో ఉపాధ్యాయులు విరామసమయంలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఆందోళన చేశారు. బత్తలపల్లిలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. -
ఉద్యమం ఉధృతం
పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆమె ఇంటి గేటు వద్ద దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. నెల్లూరులో ఎన్జీఓ భవన్లో నీటిపారుదల శాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయంపైకి ఎక్కి మండుటెండలో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. గూడూరులో జేఏసీ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ కూడలిలో దీక్షలు కొనసాగుతున్నాయి. కావలిలో వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ట్రంకు రోడ్డుపై సమైక్యాంధ్ర జేఏసీ నిర్వాహకులు రాస్తారోకో చేసి ఆటాపాట నిర్వహించారు. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కాశీపేట సెంటర్ వరకు భిక్షాటన చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో రైతులు పాల్గొన్నారు. సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. నగరంలో ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. అలాగే బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడి ఇంటి ముట్టడికి యత్నించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, సమైక్యవాదులు 78వ రోజు నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆమె ఇంటి గేటు వద్ద దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. నెల్లూరులో ఎన్జీఓ భవన్లో నీటిపారుదల శాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయంపైకి ఎక్కి మండుటెండలో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. గూడూరులో జేఏసీ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ కూడలిలో దీక్షలు కొనసాగుతున్నాయి. కావలిలో వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ట్రంకు రోడ్డుపై సమైక్యాంధ్ర జేఏసీ నిర్వాహకులు రాస్తారోకో చేసి ఆటాపాట నిర్వహించారు. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కాశీపేట సెంటర్ వరకు భిక్షాటన చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో రైతులు పాల్గొన్నారు. -
అనంతాగ్రహం
సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్న యూపీఏ సర్కారు, కాంగ్రెస్ అధిష్టానంపై ‘అనంత’ ప్రజానీకం మండిపడుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం రాజీలేని పోరు కొనసాగిస్తోంది. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట వీడినా... ప్రజలు, ఎన్జీఓలు మాత్రం సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఫలితంగా 78వ రోజైన బుధవారం కూడా జిల్లాలో ఆందోళన కొనసాగింది. అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది సమ్మె కొనసాగించారు. నగరంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, న్యాయవాదులు, వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకులు రాళ్లు కొరుకుతూ నిరసన తెలిపారు. ధర్మవరంలో జేఏసీ, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో రైతులు చేపట్టిన రిలే దీక్షలు 60వ రోజుకు చేరాయి. వారికి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతల మధ్య 1956 ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందంపై జేఏసీ ఆధ్వర్యంలో మాక్ ప్రదర్శన నిర్వహించారు. పామిడిలో సమైక్యవాదులు మౌన దీక్ష చేశారు. కేంద్ర మంత్రుల కమిటీ ‘గోబ్యాక్’ అంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్లో ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో డివిజన్ పరిధిలోని మండల పరిషత్ నాలుగవ తరగతి ఉద్యోగులు ఒక్క రోజు సామూహిక దీక్ష చేపట్టారు. వీరికి పలువురు మద్దతు తెలిపారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు జల దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రులు, జీఓఎం సభ్యులను సీమాంధ్ర ద్రోహులుగా అభివర్ణిస్తూ... వారి చిత్రపటాలను జల సమాధి చేశారు. మడకశిరలో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు మద్దతు తెలిపారు. పెనుకొండలో జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టారు. స్థానిక జాతీయ రహదారిపై లారీలను నిలిపి శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. రాయదుర్గంలో దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్ష చేస్తున్న వారికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో ప్రజాగర్జన నిర్వహించారు. రైతులు, ప్రజలు, సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. తాడిపత్రిలో జేఏసీ నాయకులు, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగాయి. యాడికిలో రెవెన్యూ ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. ఉరవకొండలో జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. బెళుగుప్పలో భిక్షాటన చేశారు. కూడేరులో పీహెచ్సీ వైద్యులు సమ్మెబాట పట్టడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. పామిడికి చెందిన మేదర రంగనాథ్ (45) బుధవారం టీవీలో సమైక్యాంధ్ర ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. -
జనోద్యమం
సాక్షి, కడప : జిల్లాలో పండుగలు, పర్వదినాల రోజు కూడా సమైక్య ఆందోళనల పర్వం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తమ పోరు ఆగదని అన్నివర్గాల ప్రజలు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అన్నదాతలు రైతు గర్జనల పేరుతో కదం తొక్కుతూనే ఉన్నారు. పోరుమామిళ్ళలో ముస్లింలు భారీ ర్యాలీని నిర్వహించారు. ఎన్జీఓలు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నుంచి తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని, సమైక్య రాష్ట్ర పరిరక్షణకు కట్టుబడి ఉంటానని హామీపత్రాన్ని తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి. కడపలో సమైక్య సాధనే లక్ష్యంగా రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో డ్వామా, గృహ నిర్మాణ సిబ్బంది, ఉపాధ్యాయులు దీక్షల్లో పాల్గొన్నారు. నగర పాలక సంస్థ, నీటిపారుదల శాఖ ఉద్యోగులు, వాణిజ్య పన్నుల శాఖ, పంచాయతీ రాజ్, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదుల రిలే దీక్షలు సాగుతూనే ఉన్నాయి. జమ్మలమడుగులో మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన వేలాది మంది రైతులు పట్టణంలో ర్యాలీ చేపట్టి కదం తొక్కారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను వీరికి అధికారులు, రాజకీయ పార్టీ నేతలు విపులంగా వివరించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి, చిన్నయ్య పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. రాయచోటిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎండ్లపల్లె గ్రామస్తులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సిబ్బంది, న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రసూల్ సంఘీభావం తెలిపారు. బద్వేలులో ఉపాధిహామీ సిబ్బందితోపాటు ఆర్టీసీ జేఏసీ, ఎన్జీఓలు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఉపాధిహామీ సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పోరుమామిళ్ళ పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీని నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మైదుకూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాజంపేటలో ఉద్యోగ జేఏసీ, రెవె న్యూ, సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో దీక్షలు సాగాయి. రైల్వేకోడూరు పట్టణంలో జేఏసీ నేత ఓబులేసు ఆధ్వర్యంలో రోడ్డుపై నిలబడి ఉద్యోగులు నిరసనను తెలిపారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నుంచి తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామనే హామీ పత్రాన్ని తీసుకున్నారు. -
అలుపెరగని పోరు
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం సింహపురి వాసులు 77 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రజలను కష్టాల పాలుచేయవద్దని, అందరూ సోదరభావంతో కలసిమెలసి ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. నెల్లూరు ఎన్జీఓ భవన్లో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలేదీక్ష చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్సీపీ దీక్షా శిబిరంలో పూసలకాలనీవాసులు కూర్చున్నారు. వీరికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. వింజమూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రిలేదీక్షలు కొనసాగించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్లో సమైక్యవాదులు రిలేదీక్ష చేసి, రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేటలో నిర్వహించిన రైతుగర్జన విజయవంతమైంది. రిలేనిరాహార దీక్షా శిబిరం నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ నాయకులు, ప్రజలు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. కావలిలో ైవె ఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఉన్న వారికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో పలుచోట్ల రిలేదీక్షలు జరిగాయి. పొదలకూరులో ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారంటూ సమైక్యవాదులను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పొదలకూరు పోలీసుస్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. -
పండుగ పూట.. పోరు బాట
సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జిల్లాలో ఉద్యమం జోరుగా సాగుతోంది. అన్ని వర్గాల వారిని ఉద్యమంలో భాగస్వాములను చేసే బాధ్యతను సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు తమ భుజ స్కందాలపై వేసుకున్నారు. పండుగ రోజుల్లోనూ పోరుకు విరామం ఇవ్వకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రైతులను కార్యోన్ముఖులను చే స్తున్నారు.జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతున్నాయి. సాక్షి, కడప: సమైక్యాంధ్ర ప్రకటన వచ్చిన రోజే నిజమైన పండుగ అని, అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు పోరు ఆగదని జిల్లా ప్రజలు నినదించారు. దసరా సంబరాల్లోనే సమైక్యాంధ్ర లక్ష్యంగా ఉద్యమం నడిపిస్తూ సమరోత్సాహంతో ముందుకు సాగారు. విభజనకు నిరసనగా వినూత్న ప్రదర్శనలు, విచిత్ర వేషధారణలు, రిలే దీక్షలతో సకల జనులు పోరును సాగించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా రైతు సదస్సుల్లో సమైక్య ఆకాంక్షను బలంగా వినిపించారు. కడప నగరంలో సోమ,మంగళవారాల్లో సమైక్య వాదుల దీక్షలు కొనసాగాయి. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, సాగునీటిపారుదల, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమాఖ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సాగాయి. మంగళవారం రిమ్స్ జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక శిబిరంలో రైతులు, మైదుకూరు ప్రాంత ఉపాధ్యాయులు, డ్వామా, ఏపీఎంఐపీ సిబ్బంది పాల్గొన్నారు. శిబిరాన్ని ఉద్దేశించి ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు ప్రసంగించారు. జమ్మలమడుగు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు సాగాయి. మంగళవారం పత్రికా విభాగానికి సంబంధించి హెచ్ఆర్, సర్క్యులేషన్, పేపర్ బాయ్‌లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో క్రైస్తవ జేఏసీ నాయకుడు అగస్తీన్రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిలు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో న్యాయవాదులు, మున్సిపల్ సిబ్బంది దీక్షలు సోమవారం కొనసాగాయి. మంగళవారం ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు పట్టణంలో భారీ రైతు సదస్సును నిర్వహించారు. రాష్ట్రం విడిపోతే కలిగే నష్టాలను రైతులకు వివరించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నేత రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, టీడీపీ నాయకురాలు లక్ష్మిప్రసన్న సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో జేఏసీ ఆధ్వర్యంలో రైతు సదస్సును నిర్వహించి అవగాహన కల్పించారు. సమైక్యాంధ్ర గీతాలు, విచిత్ర వేషధారణలతో నిరసన వ్యక్తంచేశారు. రాజంపేట పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండు కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. జేఏసీ కన్వీనర్ రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. దీనికి వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలు పట్టణంలో సోమ,మంగళవారాల్లో గ్రామ నౌకర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మోకాళ్లపై నడుస్తూ వినూత్న నిరసన తెలిపారు. మంగళవారం పట్టణంలో రైతు సదస్సును నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి జేఏసీ నాయకులు రాష్ర్టం విడిపోతే కలిగే కష్టనష్టాలను వివరించారు. పులివెందుల పట్టణంలో సోమవారం రాత్రి ఎన్జీఓలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం ఎన్జీఓల ఆధ్వర్యంలో కొత్త బస్టాండు నుంచి పూల అంగళ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై పడుకొని సమైక్య నినాదాలు చేశారు. మైదుకూరులో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాయచోటి పట్టణంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, సమైక్యాంధ్ర జేఏసీ, న్యాయవాదుల ఆధ్వర్యంలో సోమ, మంగళ వారాల్లో రిలే దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వ ఏరియా ఆస్ప్రత్రి వైద్యులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించి వైఎస్సార్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఓపీ సేవలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. -
ఉద్యమ కెరటం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సముద్ర కెరటంలా ఎగిసిపడుతోంది. రాష్ట్ర విభజనకు నిరసనగా 74వ రోజూ ఉద్యమ హోరు కొనసాగింది. శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరులోని ఎన్జీఓ భవన్లో వైద్య విధాన ప రిషత్ ఉద్యోగులు రిలేదీక్ష చేయగా, రా మలింగాపురం కూడలిలో విద్యార్థి జేఏ సీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఎన్జీఓ హోమ్ వరకు ర్యాలీ చేశారు. ఉదయగిరి, వింజమూరులో జేఏసీల ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. విం జమూరులోని దీక్షా శిబిరంలో సాతానువారిపాళెంనకు చెందిన యువకులు కూర్చున్నారు. ఉదయగిరిలోని శిబిరం లో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు దీక్ష చేపట్టారు. బెలూన్లతో నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు బస్టాండ్ సెంటర్లో జరిగిన రిలే దీక్షలో సీతారామపురం మండల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. సో నియా గాంధీ, దిగ్విజయ్, షిండే దిష్టిబొమ్మలకు గూడూరులోని టవర్‌క్లాక్ ప్రాంతంలో జేఏసీ నాయకులు సమాధులు కట్టారు. వైఎస్సార్సీపీ గూ డూరు నియోజకవర్గ సమస్యకర్త పాశం సునీల్‌కుమార్ సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోటుపాళెం కూడలి ప్రాంతంలో రాస్తారోకో జరిగింది. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండు ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీధర్ అనే యువకుడు గుండు కొట్టించుకుని నిరసన తెలిపాడు. కావలిలో ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ మండలాల్లోనూ రిలేదీక్షలు జరిగాయి. తుపాన్ నేపథ్యంలో విధులకు హాజరైనా సంతకాలు పెట్టకుండానే పనిచేస్తామని ఎన్జీఓలు తెలిపారు. -
కళతప్పిన దసరా
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: దసరా అంటేనే అందరిలో ఓ ఆనందం. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునే పండగ ఇది. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు, రైతులు..ఇలా అందరిలోనూ విజయదశమి ఉత్సాహం నింపుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సారి ఆనందోత్సవాహాలు కరువయ్యాయి. ఉద్యోగులు, కార్మికులకు రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో పండగపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. సమ్మె కారణంగా అన్ని రకాల వస్తువుల ధరలు నింగినంటుతుండటంతో సామాన్య ప్రజలు సైతం సాదాసీదాగానే పండగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దసరా ఉత్సవాల్లో భాగ మైన విజయదశమి పండగకు ప్రత్యేకత ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభించే వారితో పాటు గృహప్రవేశాలు, వివాహాలకు దసరా ముహుర్తాల్లోనే ప్రాధాన్యం ఇస్తారు. సైకిల్ నుంచి భారీ వాహనాల వరకు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్నింటికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. హిందువులతో పాటు మిగిలిన వర్గాల ప్రజలు కూడా ఈ పండగ నాడు ఆయుధాల పూజ నిర్వహిస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న దసరాపై ఈ మారు సమైక్య ఉద్యమం తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు నెలలుగా అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేసే కూలీలకు ఉపాధి కరువైంది. వరుస బంద్‌ల నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక వ్యాపారులు నిత్యావసర సరుకులను పెద్దగా దిగుమతి చేసుకోలేదు. ఈ క్రమంలో అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉద్యోగులు, కార్మికుల చేతిలో నగదు లేకపోవడంతో పండగపై ఆసక్తి కనబచరడం లేదు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పండగకు సరుకులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా ఎప్పుడూ దసరా సందర్భంగా కొనుగోలుదారులతో కిటకిటలాడే నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట ఈ సారి వెలవెలబోతోంది. సాధారణంగా దసరా సీజన్లో వారం రోజుల వ్యవధిలో రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు వ్యాపారాలు జరిగితే ఇప్పుడు మాత్రం రూ.20 లక్షల కూడా దాటలేదని వ్యాపారులు చెబుతున్నారు. బోసిపోతున్న వస్త్రదుకాణాలు ఏటా దసరా సందర్భంగా పలు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్ అందజేస్తాయి. చిరువ్యాపారులు సైతం తమ వద్ద పనిచేసే కార్మికులు దుస్తులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి మాత్రం వ్యాపారాలు లేకపోవడంతో పరిస్థితి తిరగబడింది. ఇటీవల నాలుగు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడంతో చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆదాయాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఈసారి బోనస్ అందజేసే విషయంలో వెనుకంజ వేశారు. మొత్తం మీద దసరా పండగ కళతప్పింది. -
జిల్లాలోనూ కరెంటు కోతలు
రాయికల్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ఉద్యమ ప్రభావం జిల్లాపైనా పడింది. ఆ ప్రాంత ఉద్యోగులు విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తిని నిలిపివేసి ఆందోళనబాట పట్టడంతో మూడు రోజు లుగా సీమాంధ్రలో చీకట్లు అలుముకున్నాయి. విద్యుత్ సరఫరాలో తీవ్రమైన లోటు ఏర్పడడం వల్ల తెలంగాణలోనూ కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మండల కేంద్రాల్లో రెండు గంటలు, గ్రామాల్లో మూడు గంటలు అధికారిక కోతలు అమలు చేస్తున్నారు. తాజాగా సోమవారం రాత్రి నుంచి మరో రెండు మూడు గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే సమయంలో కాకుండా పలు దఫాలుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. అరగంట, గంట చొప్పున సరఫరా నిలివేస్తూ ప్రజల దృష్టి కోతలవైపు మరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు కొన్ని ప్రాంతాల్లో, ఉదయం వేళల్లో మరికొన్ని ప్రాంతాల్లో కరెంటు కట్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన ఇలాగే కొనసాగితే గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలిపోయి తెలంగాణలోనూ అంధకారం అలుముకునే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
విభజన చీకట్లు
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. ఆదివారం ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపేసిన ఉద్యోగులు సమ్మెకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకే సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల 8 గంటలకు నిలిచిపోయింది. రాత్రి వరకు సరఫరాను పునరుద్ధరించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా చీకట్లు అలుముకున్నాయి. అత్యవసర సేవలతో పాటు అన్ని విభాగాలకు సరఫరా నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. టీవీలు పనిచేయకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వివేకా ఇంటికి కరెంట్ బంద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఏసీ సెంటర్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసానికి మాత్రం సరఫరా ఆగలేదు. కొందరు విద్యుత్ అధికారులను బెదిరించి సరఫరా చేయించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వెంటనే జేఏసీ నేతలు అక్కడకు చేరుకుని వివేకా ఇంటికి వెళ్లే లైనును తొలగించారు. కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తూరులోని 2ృ0 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏడీఈ, ఆపరేషన్ సిబ్బంది విధులకు హాజరవడంతో జేఏసీ నేతలు ముట్టడించారు. అప్పటికే అక్కడృకు చేరుకున్న సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై వెంకట్రావు జేఏసీ నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు ృగారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్లో సంప్రదించి బయటకు వచ్చేలా చేశారు. మనుబోలులోని ృ00 కేవీ పవర్‌గ్రిడ్ ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి సిబ్బంది సైతం విధులను నిలిపివేసి బయటకు వచ్చేశారు. రైల్వేలైన్లకు సరఫరా నిలిపివేత విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని కోవూరు, ఎన్టీఎస్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల నుంచి రైల్వేలైన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సవెృ్మలో భాగంగా ఈ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గృడ్స్ రైళ్లు పూర్తిగా నిలిచిపోగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను డీజల్ ఇంజన్ల సాయంతో నడిపారు. ప్యాసింజర్, యూనిట్ రైళ్లతో పాటు పినాకిని, జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు పూర్తిగా రద్దయ్యాయి. చీకట్లో ఇక్కట్లు సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారని ప్రజలు భావించి పడిగాపులు కాశారు. పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడం, ఇళ్లలోని మోటార్లకు కరెంట్ లేకపోవడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కరెంట్ రాకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు దోమల హోరుతో జనానికి కంటిమీద కునుకు కరువైంది. ఏసీలకు అలవాటు పడిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 06ఎన్‌ఎల్‌ఆర్91-సబ్‌స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు 92- సబ్‌స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సిబ్బంది సేవలతో పాటు అన్ని విభాగాలకు సరఫరా నిలిచిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. టీవీలు పనిచేయకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వివేకా ఇంటికి కరెంట్ బంద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఏసీ సెంటర్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసానికి మాత్రం సరఫరా ఆగలేదు. కొందరు విద్యుత్ అధికారులను బెదిరించి సరఫరా చేయించుకుంటున్నారని ప్రచారం జరిగింది. వెంటనే జేఏసీ నేతలు అక్కడకు చేరుకుని వివేకా ఇంటికి వెళ్లే లైనును తొలగించారు. కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెల్లూరు రూరల్ మండలంలోని కొత్తూరు సబ్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏడీఈ, ఆపరేషన్ సిబ్బంది విధులకు హాజరవడంతో జేఏసీ నేతలు ముట్టడించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై వెంకట్రావు జేఏసీ నేతలను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎంతకీ పోలీసులు అనుమతించకపోవడంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు ది గారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్లో సంప్రదించి బయటకు వచ్చేలా చేశారు. మనుబోలులోని 400 కేవీ పవర్‌గ్రిడ్ ఎదుట కూడా విద్యుత్ ఉద్యోగ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. అక్కడి సిబ్బంది సైతం విధులను నిలిపివేసి బయటకు వచ్చేశారు. రైల్వేలైన్లకు సరఫరా నిలిపివేత విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం రైల్వేపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలోని కోవూరు, ఎన్టీఎస్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల నుంచి రైల్వేలైన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సమ్మెలో భాగంగా ఈ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైళ్లు పూర్తిగా నిలిచిపోగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను డీజిల్ ఇంజన్ల సాయంతో నడిపారు. ప్యాసింజర్, యూనిట్ రైళ్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌లు పూర్తిగా రద్దయ్యాయి. చీకట్లో ఇక్కట్లు సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారని ప్రజలు భావించి పడిగాపులు కాశారు. పల్లెల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడం, ఇళ్లలోని మోటార్లకు కరెంట్ లేకపోవడంతో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కరెంట్ రాకపోవడంతో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు దోమల హోరుతో జనానికి కంటిమీద కునుకు కరువైంది. ఏసీలకు అలవాటు పడిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
పేదోడి బువ్వకు.. ఎసరు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించకపోవడం అంటే ఇదే. ఏ ఒక్క పేదవాడూ ఆకలికి తల్లడిల్లవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం రేషన్‌దుకాణాల ద్వారా అందిస్తోంది. అయితే, ఈ బియ్యం నెలానెలా వినియోగదారులకు సక్రమంగా అందడం లేదు. పౌరసరఫరాల శాఖలోని కొందరు ఉద్యోగులు, ఏళ్లుగా పాతుకుపోయి చక్రం తిప్పుతున్న మరికొందరు రేషన్‌డీలర్లు, ఇంకొందరు రైస్‌మిల్లుల యజమానులు అంతా కలిసి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. ఇందులో ఎవరి వాటాలు వారికి ముట్టజెబుతుండడంతో అంతా గప్‌చుప్‌గా నడిచిపోతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిత్యం పదుల సంఖ్యలో రేషన్‌బియ్యం లారీలకు లారీలే మాయమవుతున్నాయి. ఇటు డీలర్లు, అటు సివిల్ సప్లయీస్ ఉద్యోగులు కొందరు అనుసరిస్తున్న విధానం నివ్వెర పరిచేలా ఉంది. ఇదీ.. కథ ప్రతినెలా తనకు కేటాయించిన కోటా బియ్యాన్ని మెజారిటీ డీలర్లు గోడౌన్ల నుంచి లిఫ్ట్ చేయడం లేదు. ఉదాహరణకు ఒక డీలర్‌కు వంద క్వింటాళ్ల బియ్యం కోటా కేటాయించినట్లయితే, ఆ మొత్తానికి డీడీలు కట్టినా గోడౌన్ల నుంచి కేవలం 75 క్వింటాళ్లు మాత్రం తీసుకుపోయి, మరో 25 క్వింటాళ్ల బియ్యాన్ని గోదాములోనే బ్యాలెన్సు ఉంచుతున్నారు. తమ దుకాణాల పరిధిలో కార్డుదారులకు అరకొరగా పంపిణీ చేసి అయిపోయిందనపిస్తున్నారు. వాస్తవానికి ప్రతినెలా 20వ తేదీ దాకా రేషన్‌షాపుల్లో బియ్యం, ఇతర సరుకులు వినియోగదారులకు అందాలి. కానీ, అలా జరగడం లేదు. ఇక, గోదాములో బ్యాలెన్సు పెట్టిన బియ్యాన్ని అటు నుంచి అటే మిల్లులకు తరలిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతోనే.. కొందరు డీలర్లు, డిప్యూటీ తహసీల్దారులు(సీఎస్), ఆర్ఐలకు, కొన్ని చోట్ల గోడౌన్ల మేనేజర్లకు ఇందులో భాగస్వామ్యం ఉంది. ఈ బియ్యాన్ని కొందరు రైస్‌మిల్లుల యజమానులే నేరుగా కొనుగోలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం సివిల్ సప్లయీస్ ఉద్యోగులే దళారుల అవతారం ఎత్తి డీ లర్లకు కిలోకు రూ.13, రూ.14, రూ.15 చొప్పున అవసరాన్ని బట్టి చెల్లించి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ రేషన్ బియ్యం అత్యధికంగా నార్కట్‌పల్లిలోని ఓ మిల్లుకు, అదే మాదిరిగా హాలియా ప్రాంతంలోని మరో మిల్లుకు చేరుతున్నాయి. ఇటీవల లారీలకు పట్టుకుంటున్నారని గమనించి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆటోలను ఐస్‌క్రీం బండ్లలా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. షాపుల్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బ్యాగులు మార్చి అనుమానం రాకుండా జాగత్త్ర పడుతున్నారు మరికొందరు డీలర్లు. కర్నూల్ రైస్, రిలయన్స్ తదితర బ్యాగుల్లో వీటిని నింపి ఊరు దాటిస్తున్నారు. ఇక, బియ్యం రవాణా విషయానికి వస్తే స్టేజ్-1, స్టేజ్-2లలోనే అక్కడక్కడే మారుతూ తతంగమంతా జాగ్రత్తగా నడుస్తోంది. బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో పలువురు అధికారులు, యూనియన్ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధుల మద్దతున్న మిల్లర్లకు భాగస్వామ్యం ఉండడంతో ఎవరిపై ఎలాంటి చర్యలూ ఉండడం లేదు. కొరవడిన నిఘా... ఉన్నతాధికారుల నిఘా కొరవడడం వల్లే రేషన్ బియ్యం వినియోగదారులకు అందకుండా మిల్లర్లకు చేరుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలువురు సీనియర్ డీలర్ల వద్ద బోగస్ కార్డులు ఉన్నాయి. బోగస్ కార్డుల ఏరివేతలోనూ అక్రమాలు చోటుచేసుకోవడంతో కొందరి దగ్గర వంద నుంచి రెండొందల దాకా బోగస్‌కార్డులు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అధిక కోటా కేటాయించుకుని అదనపు బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. జిల్లాలో ఇంకా పలుచోట్ల బినామీ డీలర్లు కూడా ఉన్నారని సమాచారం. డీలర్‌గా పేరొకరిది, రేషన్ దుకాణం నడిపేది మరొకరు. వీరి నుంచి మామూళ్లు ముడుతుండడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. ఇటీవల హుజూర్నగర్ సీఐ ఆధ్వర్యంలో అక్రమంగా రవాణ అవుతున్న రేషన్ బియ్యం లోడు లారీని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నిందితులను శనివారం ఎస్పీ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, పేదోడి బియ్యం పేదోడికే దక్కేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖ ఉన్నతాధికారులపైనే ఉంది. -
భేరీ మోగింది
పది జిల్లాలతో కూడిన తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సకలజనులభేరీకి జిల్లా నుంచి తెలంగాణవాదులు అధికసంఖ్యలో తరలివెళ్లారు. ఉదయం నుంచే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు రాజధాని బాటపట్టాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారులన్నీ జెతైలంగాణ.. హైదరాబాద్ హమారా.. నినాదాలతో హోరెత్తాయి. - సాక్షి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: తెలంగాణ ప్రక్రియలో జాప్యానికి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనలకు వ్యతిరేకంగా జేఏసీ హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన సకలజనులభేరీని విజయవంతం చేసేందుకు జిల్లానుంచి సబ్బండవర్గాలు తరలివెళ్లాయి. అన్ని నియోజకవర్గాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీగా కదిలారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు కూడా తరలివెళ్లారు. జిల్లా కేంద్రంలోని అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు టీఎన్జీవోల భవనం నుంచి బయలుదేరారు. జేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధు లు వీలైన మార్గాల్లో వెళ్లారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ నేతలు పెద్దసంఖ్యలో పార్టీశ్రేణులు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జీలు ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్టీ ముఖ్యనేతలు ముందుగానే హైదరాబాద్‌కు చేరుకోగా పలువురు ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు పార్టీ కార్యకర్తలతో పాటు బయలుదేరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, వినోద్‌కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఈద శంకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావుతోపాటు నియోజకవర్గ ఇన్చార్జీలు బొడిగె శోభ, ఓరుగంటి ఆనంద్, ఒడితెల సతీష్‌బాబు, మనోహర్‌రెడ్డి, జితేందర్‌రావు, రాంరెడ్డి, ఇతర నాయకులు, అనుబంధసంఘాల నేతలు ఈ సభలో పాల్గొన్నారు. జిల్లాకేంద్రం నుంచి మహిళలు బతుకమ్మలతోపాటు కదిలారు. సింగరేణి నుంచి కార్మికులు గనుల్లోకి వెళ్లే సమయంలో ధరించే టోపీ,తట్ట, చెమ్మస్లను ధరించి సభలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య నాయకత్వంలో కార్మికులు తరలివెళ్లారు. గోదావరిఖని నుంచి వెళ్లిన కర్రసాము విన్యాసాలు చేసే ‘అకాడా’ బృందం సకలజనులభేరీలో ప్రదర్శన ఇచ్చింది. న్యూడెమాక్రసీ కార్యదర్శి చలపతిరావు, నేతలు రాజన్న, జ్యోతి, తాల్లపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో బీజేపీ నేతలు తరలివెళ్లారు. మధ్యాహ్నం వరకే సభ నిర్వహించే నిజాం కళాశాల మైదానం నిండిపోవడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లినవారు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సభలో టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఒక్కరికే మాట్లాడే అవకాశం లభించింది. సకలజనభేరి సభ విజయవంతం కావడంతో అందరూ ఉత్సాహంతో తిరుగుపయనమయ్యారు. -
చెక్‌పోస్టు దందా
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమం చెక్‌పోస్టులోని ఆయా శాఖల్లోని కొంతమందికి వరంగా మారింది. ఓ వైపు సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాట పట్టి రెండు నెలలుగా జీతాలకు నోచుకోక అధిక శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉమ్మడి తనిఖీ కేంద్రంలో అత్యవసర సేవల పేరుతో వాణిజ్య, రవాణా శాఖల సిబ్బంది అనధికార వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. రెండు శాఖల సిబ్బంది రోజుకు లక్షల రూపాయల అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణాశాఖ సిబ్బంది అక్రమ వసూళ్లపై చెక్‌పోస్టు పరిపాలనాధికారి 10 రోజుల క్రితం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉమ్మడి తనిఖీ కేంద్రంలో వాణిజ్య పన్నులు, రవాణా, అటవీ, పశువర్థకశాఖ, ఎక్సైజ్, మార్కెటింగ్, మైన్స్ అండ్ జియాలజీ తదితర శాఖల అధికారులు పనిచేస్తున్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడంతో మరుసటి రోజు నుంచే జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీఓలు నిరవధిక సమ్మెకు పిలుపు నివ్వడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అయితే ఉమ్మడి తనఖీ కేంద్రంలో వాణిజ్యపన్నుల శాఖలోని కొందరు ఉద్యోగులు అత్యవసర సేవలు పేరుతో విధులు నిర్వహిస్తున్నారు. అయితే మిగతా ఆయా శాఖల్లోని కొంత మంది సిబ్బంది అనధికార విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఆయా శాఖల అధికార అనుమతులను పొందాల్సి ఉంది. ప్రధానంగా పప్పులు, నూనె, ఇసుక, గ్రానైట్, సిలికా, బియ్యం, పార్శిల్, ఎలక్ట్రానిక్స్ తదితర వస్తువులతో కూడిన వాహనాలు రవాణా అవుతుంటాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది కొందరు అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపుతున్నారు. సరుకులకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోయినా చెక్‌పోస్టు దాటిస్తున్నారు. రవాణా శాఖలో కొంత మంది సిబ్బందిని షిప్ట్ డ్యూటీలు వేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శాఖలో అనధికారికంగా రోజుకు రూ.1.5 లక్షలు వసూళ్లు అవుతాయన్న ప్రచారం సాగుతోంది. వాణి జ్య పన్నుల శాఖలో కేవలం డీసీటీఓ, సీటీఓలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో కేవలం ఐదారుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ శాఖ ద్వారా ఎక్కువ మొత్తం వస్తుండటంతో కొంత మంది సిబ్బంది సమ్మెలో పాల్గొనకుండా అనధికార వసూళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. చెక్‌పోస్టులోని వాణిజ్యపన్నుల శాఖలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారికి నెలకు రూ. 6 లక్షలు, ఇన్స్పెక్టర్లకు రూ. 2.5 లక్షలు పైగా అనధికార వసూళ్లు అవుతాయని ఆ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది చెబుతున్నారు. ఎక్సైజ్‌శాఖలో సీఐ, ఎస్ఐలు లేకపోయినా అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫారెస్ట్, మార్కెటింగ్, మైన్స్ అధికారులు, సిబ్బంది సమ్మెలో ఉన్నా చెక్‌పోస్టులో ఉన్న సిబ్బంది మాత్రం విధులు నిర్వహిస్తూ అందినంత అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆయా శాఖల్లోని కొంతమంది ఉద్యోగులు ఏపీఎన్జీఓల దృష్టికి కూడా తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, రేణిగుంట, నరహరిపేట, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం చెక్‌పోస్టులు పూర్తిగా మూతపడ్డా తడ చెక్‌పోస్టులో మాత్రం యథేచ్ఛగా అక్రమ దందాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే : మల్లికార్జున, చెక్‌పోస్టు పరిపాలనాధికారి రవాణా సిబ్బంది అక్రమ వసూళ్ల పై ఆ శాఖ ఉప కమిషనర్‌కు ఫిర్యాదు చేశా. చెక్‌పోస్టులో పనిచేస్తున్న ఎంవీఐకి కూడా తెలియజేశా. కాని వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రెండురోజుల్లో మళ్లీ ఫిర్యాదు చేస్తా. -
ఉద్యమజోరు
రాష్ట్ర విభజన ప్రకటన మరో ఇద్దరి ఉసురు తీసింది. సమైక్యనాదాన్ని గట్టిగా వినిపిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ రాములు ఉద్యమ వార్తలు చదువుతూ ఇంట్లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయ కూలీ ఉక్కాల రవి సమైక్యభేరి సభ నుంచి తిరిగి వెళుతూ గుండె పోటుకు గురై, ఇంట్లో అడుగుపెట్టగానే మృతి చెందాడు. ఇద్దరు సమైక్యవాదులు హఠాన్మరణం చెందడంతో జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు. సాక్షి, నెల్లూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో సింహపురివాసులు చేపట్టిన ఉద్యమం శనివారం 60వ రోజు మరింత ఉధృతంగా సాగింది. నగరంలో నీటిపారుదలశాఖ ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుడు ఎన్.రాములు సమైక్యాంధ్ర కోసం అసువులు బాసారు. టీపీగూడూరు, ఆత్మకూరులలో మహిళా గర్జనలు పెద్ద ఎత్తున జరిగాయి. వీఆర్సీ సెంటర్లో ముస్లింలు దీక్షలు కొనసాగించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న సమైక్యాంధ్ర దీక్షలకు శనివారం వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు.నగరంలో ఎన్జీఓ హోంలో ఆర్అండ్బీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీఎస్‌యూ ఆధ్వర్యంలో క్యాంపస్ కళాశాల నుంచి గాంధీ బొమ్మ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గోల్డెన్ జూబ్లీహాల్లో మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సమీక్ష సమావేశాన్ని ఏపీ ఎన్జీఓ నాయకులు అడ్డుకున్నారు. వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి నాల్గో రోజుకు చేరుకున్నాయి. వీరికి నెల్లూరు నగర వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. వెంకటగిరిలో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో బ్యాంకులు మూయించారు. పొదలకూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. గూడూరులో జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. అలాగే చెన్నూరుకు చెందిన ఉపాధ్యాయులు సకల జనుల సమ్మెలో భాగంగా గూడూరు వరకు పాదయాత్ర చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు టవర్‌క్లాక్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో జేఏసీ కన్వీనర్ జ్ఞానానందం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన చిట్టమూరు సమైక్యగర్జన హోరెత్తింది. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో జేఏసీ నాయకులు చేపట్టిన దీక్షలో పట్టణంలోని మేకపాటి వెంకురెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు ర్యాలీగా వెళ్లి సిండికేట్ బ్యాంకు, ఏపీజీబీ, టెలికం కార్యాలయం, స్టేట్బ్యాంకులను మూసి వేయించారు. కోవూరు ఎన్జీఓహోంలో కోవూరు గ్రామస్తులు దీక్ష చేపట్టారు. బుచ్చిరెడ్డిపాళెంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నాయకులు మూసి వేయించారు. విడవలూరులో పొదుపు మహిళలు రిలే నిరాహారదీక్ష చేశారు. కావలి ఆర్డీవో కార్యాలయ సెంటర్లో ప్రభుత్వ జేఏసీ శిబిరంలో రిలే నిరాహారదీక్షలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన కార్యక్రమం జరిగింది. పట్టణంలో సమైక్యాంధ్ర జేఏసీ, వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. ఆత్మకూరులో మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల ఆధ్వర్యంలో మహిళా గర్జన మహా సభ బస్టాండ్ సెంటర్లో నిర్వహించారు. స్థానిక బాలికోన్నత పాఠశాల నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరుపాళెం ఉన్నత పాఠశాలలో తరగతుల నిర్వహణను ఎన్జీఓలు అడ్డుకున్నారు. -
రెండు నెలలుగా ఉద్యమం
‘‘రెండు నెలలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. అన్ని పనులు వదులుకుని సమైక్యమే ధ్యేయంగా రోడ్లపైకొచ్చాం. విభజిస్తే మా బతుకులు అంధకారమవుతాయని గొంతు చించుకుని అరుస్తున్నాం. ఎన్ని విధాలుగా నిరసన తెలపాలో అన్ని రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాం. మేము సైతం అంటూ మాతో పాటు చిన్న పిల్లలు కూడా ఉద్యమంలో కదం తొక్కుతున్నారు. అయినా ఈ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు.’’ - సకల జనం ఆవేదన ‘‘ రాష్ట్ర విభజన జరిగితే అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా మరింతగా నష్టపోతుంది. ఎంతగా అంటే నిత్యం తాగు, సాగు నీటి కోసం కొట్టుకోవాల్సినంత. హంద్రీ-నీవా నీరు ఇక వస్తుందో.. రాదో దేవుడికే ఎరుక.’’ - రైతన్న ఘోష సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం 60 రోజులుగా హోరెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణే ధ్యేయంగా ప్రజలు, ఉద్యోగులు కదం తొక్కుతుండడంతో రెండు నెలలుగా ఉధృత స్థాయిలో కొనసాగుతోంది. శనివారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మార్మోగింది. అనంతపురం నగరంలో ఏపీఎన్జీఓలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న జాక్టో నాయకులకు కళాకారులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ఆట పాటలతో సమైక్యవాదాన్ని వినిపించారు. ఉపాధ్యాయులు, హౌసింగ్, రెవెన్యూ, హంద్రీ-నీవా ఉద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన, బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఫేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కళాకారులు ర్యాలీ చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు జిల్లా పరిషత్ ఎదుట మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఎస్కేయూ పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు వర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై ‘ఎస్కేయూ..60’ ఆకారంలో కూర్చుని రాస్తారోకో చేశారు. రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకునేది లేదంటూ ఉరవకొండలో వేలాది మంది విద్యార్థులు గర్జించారు. ఒక్కసారిగా ై‘జె సమైక్యాంధ్ర’ అంటూ నినదించడంతో ఉరవకొండ దద్దరిల్లింది. సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తూ ఉరవకొండలో సాయిప్రగతి పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరంలో విద్యార్థులు రోడ్డుపైనే చదువుతూ నిరసన తెలిపారు. తాడిమర్రిలో జేఏసీ నాయకులు బ్యాంకులను బంద్ చేయించారు. గుంతకల్లులోని పాతబస్టాండ్ సర్కిల్లో ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. మునిసిపల్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. హిందూపురంలో ఎన్జీఓలు ర్యాలీ చేపట్టారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తోపుడు బండ్లపై ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిరుధాన్యాలు అమ్ముతూ, ఉపాధ్యాయులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు గంజి పంపిణీ చేశారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో ఓడీచెరువు మండల ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు ఉరి తగిలించుకొని నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్, రెవెన్యూ ఉద్యోగులు ర్యాలీ చేశారు. తలుపులలో సమైక్యవాదులు రోడ్డుపైనే స్నానాలు చేసి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మినీ సర్కస్ నిర్వహించారు. మడకశిరలో సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించారు. జేఏసీ నాయకులు ఎస్బీఐని ముట్టడించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. కర్ణాటక బస్సులపై వీరప్పమొయిలీకి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు రాశారు. పుట్టపర్తిలో హిజ్రాలు ర్యాలీ చేశారు. జేఏసీ నాయకులు గ్రామ దేవత సత్యమ్మకు పూజలు నిర్వహించారు. అమడగూరులో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ముట్టడించారు. నల్లమాడలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు వీధులు ఊడ్చి నిరసన తెలిపారు. కొత్తచెరువులో జేఏసీ నాయకులు యూపీఏ పెద్దల చిత్రపటాలతో శవయాత్ర నిర్వహించారు. పెనుకొండలో ట్రాక్టర్ యజమానుల యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ, రొద్దంలో జేఏసీ నాయకులు ప్రజా బ్యాలెట్ చేపట్టారు. గోరంట్లలో జేఏసీ నాయకులు శరీరానికి ఆకులు చుట్టుకుని, సోమందేపల్లిలో టీ అమ్ముతూ నిరసన తెలిపారు. రాయదుర్గంలో డాక్టర్లు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓలు మోకాళ్లపై నిరసన తెలిపారు. కణేకల్లులో ఉప్పర కులస్తులు, ఆత్మకూరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. రాప్తాడులో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. శింగనమల ఆర్టీసీ బస్టాండ్‌ను శుభ్రం చేసి సమైక్యవాదులు నిరసన తెలిపారు. కల్లూరు వద్ద పెన్నానదిలో ‘సమైక్యాంధ్ర’ మంటలు వేశారు. తాడిపత్రిలో జేఏసీ నాయకులు మానవహారం నిర్మించి.. పచ్చగడ్డి తింటూ నిరసన తెలిపారు. ఆంజనేయస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి రాష్ట్రం విడిపోకుండా చూడాలని ప్రార్థించారు. బెళుగుప్పలో జేఏసీ నాయకులు ఇంటి ంటికీ వెళ్లి సమైక్య నినాదాన్ని విన్పించారు. కాగా.. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన ఉరవకొండకు చెందిన చేనేత కార్మికుడు వూడిశెట్టి శేఖర్(42), గుంతకల్లులోని తిలక్‌నగర్‌కు చెందిన దాదావలి(25) శనివారం గుండెపోటుతో మరణించారు. -
ఆపేది లేదు
పులివెందుల, న్యూస్‌లైన్ : కేంద్రం దిగివచ్చేదాకా సమైక్య ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉద్యమకారులు తేల్చిచెప్పారు. శనివారం పులివెందులలో నిర్వహించిన పులికేకలో సమైక్యవాదులు సమర శంఖం పూరించారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చి మైదానం మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు, వ్యాపారస్తులు, సమైక్యవాదులతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనంలో ఎక్కడ చూసినా సమైక్యవాదులే కనిపించారు. మైదానంలో స్థలం లేకపోవడంతో రోడ్డుపైనుంచే పులికేకలో పాల్గొని మద్దతును తెలియజేశారు. సమైక్యవాదులకు ఎలాంటి ఆటంకం లేకుండా పులివెందుల జేఏసీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా కుర్చీలు వేసి బారీకేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు చిన్నారులు కూర్చొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆకట్టుకున్న సాంసృ్కతిక కార్యక్రమాలు : పులివెందులలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులతోపాటు వైఎస్ఆర్ సీపీ సాంసృ్కతిక విభాగపు కన్వీనర్ వంగపండు ఉష ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాన్ని రగిలించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా సమైక్యాంధ్ర లక్ష్మిపూజ సాంప్రదాయబద్ధంగా నిర్వహించి పులికేకను ప్రారంభించారు. సభ ప్రారంభంకాగానే జేఏసీ చైర్మన్ నరసింహారెడ్డి సమైక్యాంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞను చేయించారు. ఉద్యమంలో అశువులు బాసిన సమైక్యవాదులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
సడలని సంకల్పం
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సింహపురీయులు సడలని సంకల్పంతో పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే పట్టుదల వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమ నినాదాలు చేసీచేసి అలసిపోయిన మరో గుండె ఆగిపోయింది. రెవెన్యూ ఉద్యోగి అయిన సత్యనారాయణ సూళ్లూరుపేటలో శుక్రవారం వేకువజామున ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో 120 ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. సత్యనారాయణ పురంలో రిలేదీక్షలను ఆనం జయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలిలో మానవహారం నిర్వహించారు. వీఆర్సీ, గాంధీబొమ్మ సెంటర్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పశుసంవర్ధశాఖ ఉద్యోగులు ఎన్జీఓహోంలో రిలే దీక్షలు చేపట్టారు. బ్రాహ్మణులు మద్రాస్ బస్టాండ్ వద్ద మానవహారంతో నిరసన తెలిపారు. ఆర్యవైశ్యులు గాంధీబొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. పొదలకూరులో ముస్లింలు వంటావార్పు చేయడంతో పాటు రోడ్డుపైనే ప్రార్థనలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మనుబోలు, ముత్తుకూరులో బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లోని రిలేదీక్షల శిబిరంలో మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఫైనల్ఇయర్ ఈసీఈ విద్యార్థులు కూర్చున్నారు. సమైకాంధ్ర నిధి ఏర్పాటుచేసి విరాళాలు సేకరించారు. దుత్తలూరు, నందిపాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నేతలు మూయించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్ వద్ద ప్రైవేటు పాఠశాలల సిబ్బంది దీక్షలో కూర్చున్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపైనే వడ్రంగి పనిచేసి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. దిగ్విజయ్‌సింగ్, షిండేల దిష్టిబొమ్మలను ఆర్టీసీ కార్మికులు జేసీబీకి వేలాదీసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన బలిజ సంఘీయులు కోట క్రాస్‌రోడ్డులో రిలేదీక్ష చేశారు. గూడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు వాకాడులో జలదీక్ష నిర్వహించారు. సంగంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కావలిలో వ్యాపారుల సింహగర్జన జరిగింది. ప్రజాగాయకుడు వంగపండు ప్రసాద్ తన పాటలతో ప్రజల్లో సమైక్య స్ఫూర్తి పెంపొందించారు. మహిళా ఉపాధ్యాయులు ఉండమ్మా బొట్టు పెడతా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగుల నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర రథానికి నాయుడుపేటలో ఘనస్వాగతం లభించింది. బుచ్చిరెడ్డిపాళెంలో సమైక్యభేరి హోరెత్తింది. కోవూరులోని ఎన్జీఓ హోంలో యువకులు, లేగుంటపాడులో గ్రామస్తుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.