న్యూస్‌లైన్ బృందం: హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీఓ సభకు అనుమతిచ్చి, తెలంగాణ శాంతిర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజేఏసీ పిలుపుమేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా శాంతిర్యాలీలు నిర్వహించారు. వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. న్యాయవాదులు విధులు బిహ ష్కరించారు.
పలు చోట్ల సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం జరగనున్న ఏపీ ఎన్‌జీఓల సభను అడ్డుకొని తీరుతామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా శాంతిర్యాలీని విజయవంతం చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలో జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ, తెలంగాణ జాగృతి, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు చేపట్టారు.సీమాంధ్ర సభకు సీఎం, డీజీపీ కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బిహ ష్కరించి, మాక్ కోర్టు నిర్వహించారు.
- వన పర్తిలోని జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ శాంతిర్యాలీలో దాదాపు 15 వేల మంది పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం దాదాపు నాలుగు గంటలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీమాంధ్ర నుంచి తెలంగాణలోకి చీమకూడా దూరకుండా కట్టడి చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు.
టీజేఏసీ ఆధ్వర్యంలో నారాయణపేటలో శాంతిర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి చౌక్‌బజార్ మీదుగా సత్యనారాయణ చౌరస్తాకు చేరుకుని ముల్కీ అమరవీరుల ఆత్మశాంతికి మౌనం పాటించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి, ఆందోళన చేశారు. మక్తల్‌లో టీజేఏసీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో, ఆత్మకూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
కల్వకుర్తిలో టీజేఏసీ ఆధ్యర్యంలో సద్భావన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఆ వరణలోనిరసనతెలిపారు.ఆమనగల్లు,వెల్దండలోశ్రీశైలం ప్ర ధార రహదారిపై ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. దేవరకద్రలో భారీ ర్యాలీ నిర్వహించి, కోయిల్‌సాగర్ క్రాస్‌రోడ్డు వద్ద మానవహారం నిర్వహించారు.
సీసీ కుంటలో జేఏసీ నాయకులు ర్యాలీ చేపట్టారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌లో శాంతి ర్యాలీలు చేపట్టారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించనున్న ఏపీఎన్‌జీఓల సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. పాన్‌గల్‌లో శాంతిర్యాలీ, విద్యార్థులు మానవహారం నిర్వహించారు.
గద్వాల ప్రధాన రహదారిపై ఉద్యోగులు, విద్యార్థులు, జేఏసీ నాయకులు శాంతిర్యాలీ నిర్వహించి, ఫిరంగి చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గద్వాలలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు.
అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి చౌరస్తాలో టీజేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అయిజలో శాంతిర్యాలీ చేపట్టగా, శాంతినగర్‌లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
జడ్చర్లలో టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతిర్యాలీలో వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయవాదులు విధులు బిహ ష్కరించి రోడ్డెక్కారు. కొందరు న్యాయవాదులు తహశీల్దార్ కార్యాలయంపైకి ఎక్కి తెలంగాణ నినాదాలు చేశారు. షాద్‌నగర్‌లోని వివిధ కళాశాలల విద్యార్థులు టీ జేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీలు శాంతిర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన కూడలి వద్ద మానవహారం నిర్వహించారు.
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు, న్యూస్‌లైన్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందని పీజేపీ అధికారి కృష్ణయ్య తెలిపారు. ప్రాజెక్టుకు 9114 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రస్తుతం రెండు యూ నిట్ల విద్యుదుత్పత్తి కోసం 16వేల క్యూసెక్కులు, ఆయకట్టు రైతులకు సాగునీరందించేందుకు కుడి, ఎడమ కాల్వల ద్వా రా 1100 క్యూసెక్కుల నీరు మొత్తం ప్రాజెక్టు నుంచి 17వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపా రు.
జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న 1,4 యూనిట్ల ద్వారా పూర్తిస్థాయిలో 78 మెగావాట్ల విద్యుదుత్ప త్తి అవుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. ఇదిలాఉండ గా ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 491.650 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు ఏడువేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుదుత్పత్తి యూనిట్ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తు తం ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 519.590 మీటర్లుగా ఉం ది. ప్రాజెక్టుకు 2590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుదుత్పత్తి యూనిట్ ద్వారా ఏడువేల క్యూసెక్కుల నీటిని ది గువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
గర్జించిన తెలంగాణ
Published Sat, Sep 7 2013 3:23 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement