జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మోసం చేస్తే మరోసారి ఉ ద్యోగులు సమ్మెచేసేందుకు సిద్ధమని టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. పార్లమెంట్‌లో బిల్లుపెట్టాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో ఈనెల 29న సకల జనుల భేరి సభలోపు తెలంగాణ నోట్‌ను క్యాబినెట్ ముందుకు తీ సుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ సభ నుంచే స మ్మె సైరన్ మోగిస్తామని ఆయన స్పష్టంచేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్‌లో టీఎన్‌జీఓ జిల్లా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రకటించి 53 రోజులు అ వుతున్నా.. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదన్నారు.
దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందేమోననే అనుమానం కలుగుతుందన్నారు. ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించేవరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తమ ప్రాంత విముక్తి కోసం ఎంతటి త్యాగానికైనా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాము సమ్మెచేసిన కాలంలో ఏఒక్క సీమాంధ్ర ఉద్యోగిపైన కూడా దాడిచేయలేదన్నారు. ఏపీఎన్‌జీఓల సమ్మె ఊహాజనితమే అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సమ్మె చేయడం ఎక్కడా జరగలేదన్నారు. ఒప్పందాల నిర్మాణాలపై రాష్ట్రం ఏర్పడిందని ఆ ఒప్పందాలు అమలుకాకపోవడం వల్లే రాష్ట్రాన్ని అడుగుతున్నామన్నారు. తెలంగాణపై అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని, ఆ పార్టీలు తెలంగాణ ప్రజల పక్షన నిలబడలేకపోయాయని తెలిపారు. తాము అడ్డుకోవడం వల్లే తెలంగాణ ప్రక్రియ ముందుకుపోవడం లేదని సీమాంధ్ర నాయకులు చెబుతున్నారని, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. సమైక్యఉద్యమం పేరుతో సీమాంధ్ర ప్రైవేట్ ట్రావెల్స్ రూ.1200 కోట్లను అక్కడి ప్రజల నుంచి వసూలు చేశారన్నారు.
సమైక్యరాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. ఏపీఎన్‌జీఓల సభతో ఈ భయం మరింత పెరిగిందన్నారు. కావునా ఎట్టి పరిస్థితిల్లోనూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. సమావేశంలో టీఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, రామకృష్ణారావు, బాల్‌కిషన్, మానిక్‌రెడ్డి, అంజయ్య, నారాయణరెడ్డి, చంద్రనాయక్, శ్రీనివాస్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరు ఆపం
Published Sun, Sep 22 2013 4:06 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement