న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో 251 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో ఇది 15 శాతం. తొలగించిన ఉద్యోగులందరికీ నోటీసు పీరియడ్ దాటి ఒక నెల అదనంగా పరిహారంతో పాటు ఎసాప్స్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్), బీమా ప్రయోజనాలు, జాబ్ ప్లేస్‌మెంట్‌పరమైన మద్దతు మొదలైన తోడ్పాటు అందించనున్నట్లు సిబ్బందికి పంపిన ఈమెయిల్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు.
కోవిడ్ పరిణామాలు, భారీగా పెట్టుబడుల ఊతంతో 2020 నుంచి 2022 నాటికి కంపెనీ 10 రెట్లు వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. అయితే, స్థూల పరిస్థితులు గణనీయంగా మారిపోవడంతో, లాభార్జన లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలను వేగవంతం చేయాల్సి వస్తోందని ఆత్రే వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment