Meesho
-
మీషో యూజర్లు 17.5 కోట్లు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ ‘మీషో’ ఈ ఏడాది ఆర్డర్లలో 35 శాతం వృద్ధిని సాధించినట్టు ప్రకటించింది. తమ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారులు (యూజర్లు) 25 శాతం పెరిగి 17.5 కోట్లకు చేరినట్టు తెలిపింది. వినియోగం పుంజుకోవడం, టైర్–2 నగరాలు, చిన్న పట్టణాల్లో ఈ–కామర్స్ సేవలను వినియోగించుకునే వారు పెరగడం సౌందర్య, వ్యక్తిగత రక్షణ (బీపీసీ), హోమ్, కిచెన్ విభాగాల్లో వార్షికంగా ఆర్డర్లు 70 శాతం పెరగడం వృద్ధికి సాయపడినట్టు పేర్కొంది. ‘‘మొత్తం ఆర్డర్లు వార్షికంగా 35 శాతం పెరగడం అన్నది బలమైన వినియోగ సెంటిమెంట్‌కు నిదర్శనం. దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. పెడుతున్న వ్యయానికి తగిన విలువ కోరుకునే కస్టమర్లతో ఈ వృద్ధి సాధ్యమవుతోంది. ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్, గృహోపకరణాల్లో అందుబాటు ధరల్లో ఉత్పత్తులను వారు కోరుకుంటున్నారు’’అని మీషో తన ప్రకటనలో వివరించింది. ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ వృద్ధి పథాన్ని కొనసాగించామని, లావాదేవీలు నిర్వహించే యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. 2023 చివరికి సంస్థ యూజర్లు 14 కోట్లుగా ఉన్నారు. నాయుడుపేట (ఆంధ్రప్రదేశ్), షేర్గటి (బీహార్), హర్పణహల్లి (కర్ణాటక) తదితర టైర్–4, అంతకంటే చిన్న పట్టణాల నుంచే సగం యూజర్లు ఉన్నట్టు మీషో తెలిపింది. 21 కోట్ల డౌన్లోడ్లతో వరుసగా నాలుగో ఏడాది ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న షాపింగ్ యాప్‌గా తమ స్థానాన్ని కాపాడుకున్నట్టు పేర్కొంది. ఒక వంతు జెన్ జెడ్ నుంచే.. తమ మొత్తం యూజర్లలో మూడింత ఒక వంతు మంది జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు) వారేనని మీషో తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.7,615 కోట్లకు చేరిందని వెల్లడించింది. ప్రస్తుత యూజర్ల నుంచి ఆర్డర్లకుతోడు, యాక్టివ్ యూజర్ల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.232 కోట్ల ఆపరేటింగ్ క్యాష్‌ఫ్లో సాధించిన మొదటి ఈ–కామర్స్ సంస్థ మీషో అని తెలిపింది. మీషో మాల్‌పై ప్రముఖ బ్రాండ్లు అయిన లోటస్ ఆరు రెట్లు, జోయ్ 5.5 రెట్లు, రెనీ 3.5 రెట్లు, డాలర్ 1.8 రెట్లు చొప్పున వృద్ధి సాధించినట్టు పేర్కొంది. 2024లో 2.2 కోట్ల మోసపూరిత లావాదేవీలను నివారించినట్టు మీషో తెలిపింది. 77 లక్షల స్కామ్ దాడులను అడ్డుకున్నట్టు వివరించింది. శాంతి భద్రతల ఏజెన్సీల సహకారంతో మోసాలను నివారించడంలో 98 శాతం మేర విజియం సాధించినట్టు తెలిపింది. -
మీషోపై పడ్డ సైబర్ నేరగాళ్లు: ఎన్ని కోట్లు దోచేశారంటే..
సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే మోసం చేశారని గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏకంగా మీషో కంపెనీని మోసం చేసి ఏకంగా రూ. 5.5 కోట్లు నష్టాన్ని కలిగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సైబర్ నేరగాళ్లు మీషో ఈ-కామర్స్ కంపెనీలో ఫేక్ సెల్లర్‌గా నటిస్తూ.. అదే ప్లాట్ఫామ్లో నకిలీ ఖాతాల ద్వారా ఆర్డర్లు చేసేవారు. ఆర్డర్ డెలివరీ చేసుకున్న తరువాత వాటి స్థానంలో విరిగిపోయిన లేదా పాడైపోయిన పాత వస్తువులను పెట్టి మళ్ళీ రిటర్న్ చేసేవారు. దీనిని నిజమని నమ్మించడానికి వీడియోలు కూడా క్రియేట్ చేసేవారు. ఆ తరువాత డబ్బు వెనక్కి తీసుకునేవారు.మోసగాళ్ళు ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్య ఇదే వరుసలో మోసాలు చేస్తూ.. మీషో నుంచి రూ. 5.5 కోట్లు వసూలు చేశారు. డబ్బు జమచేసుకోవడానికి వీరు వివిధ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించారు. ఈ మోసాన్ని కంపెనీ గుర్తించిన తరువాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మీషో కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత.. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
ఉద్యోగులకు మీషో భారీ ఆఫర్.. 9 రోజులపాటు సెలవులు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో తన ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 9 రోజుల వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఉద్యోగులకు విశ్రాంతి తీసుకుని మళ్లీ రీచార్జ్ కావడానికి ఈ సెలవు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాదీ ఇలాంటి ప్రయోజనం కల్పించినట్లు చెప్పింది.‘‘9 రోజులపాటు ల్యాప్‌టాప్స్‌తో పని లేదు. ఈ మెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. మా మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకొని, మాపై మేం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్’’ అని మీషో వెల్లడించింది. ఈ ‘రెస్ట్ అండ్ రీఛార్జ్’ సెలవులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు ఉండనుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసలతో కామెంట్లు కురిపించారు. -
8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. ఓ వైపు ఆటోమొబైల్ కంపెనీ తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలు ఉద్యోగులను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 'మీషో' (Meesho) కంపెనీ ఏకంగా 8.5 లక్షల ఉద్యుగులను నియమించుకోవడానికి సన్నద్ధమవుతోంది.పండుగ సీజన్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి మీషో సిద్ధమైంది. ఉద్యోగ నియామకాల్లో 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, టైర్ 4 నగరాల్లో ఉండనున్నట్లు సమాచారం.ఈ కామర్స్ దిగ్గజం మీషో డెలివెరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, షాడోఫాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం కూడా ఉద్యోగ నియమాలకు పెంచడంలో సహాయపడింది. ఉద్యోగులలో పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, రిటర్న్‌లను నిర్వహించడానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.ఇదీ చదవండి: ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?ఉద్యోగ నియమాలకు కారణంఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. పండుగ సీజన్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మీషో ఈ చర్యలు తీసుకుంటోంది. -
ఈ-కామర్స్ షాపింగ్‌లో 25 ఏళ్లలోపు వారే ఎక్కువ
న్యూఢిల్లీ: తమ యూజర్లలో మూడింట ఒకవంతు 25 ఏళ్లలోపు వారు ఉన్నారని ఈ–కామర్స్ కంపెనీ మీషో తెలిపింది. సెన్సార్ టవర్‌తో కలిసి రూపొందించిన నివేదిక ప్రకారం.. నాలుగు, ఆపై శ్రేణి పట్టణాలకు చెందిన కస్టమర్లు తరచూ, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు జరుపుతున్నారు.వీరు ఫ్యాషన్, పాదరక్షలు, శిశు సంరక్షణ వంటి విభాగాల్లో ఉత్పత్తులను కొంటున్నారు. ఈ–కామర్స్ యూజర్ల వృద్ధిలో ఉత్తరప్రదేశ్, బిహార్ ముందంజలో ఉన్నాయి. ఆన్లైన్ షాపర్స్‌లో 80 శాతంపైగా ద్వితీయ, ఆపై శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని కస్టమర్లు ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ ఆధారంగా ఈ–కామర్స్ కొనుగోళ్లను ఎక్కువగా చేస్తున్నారు.మొత్తం ఆర్డర్లలో ఈ రాష్ట్రాల వాటా 40 శాతం ఉంది. గృహ, వంటింటి ఉపకరణాలకు 10 శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ విభాగం 50 శాతం వృద్ధి చెందింది. చీరలు, సంబంధిత యాక్సెసరీస్ కొనుగోళ్లు కొత్త ట్రెండ్. -
మీషో కూపన్ల పేరిట సైబర్‌మోసం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అయిన మీషో పేరిట సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెర తీస్తున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీషో కంపెనీ నుంచి వచి్చందని భ్రమపడేలా ఓ ఫామ్‌ను, స్క్రాచ్ కార్డును డిజైన్ చేసి సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేస్తున్నారు. వీటిని అందుకున్న వారిని అందులోని కార్డును స్క్రాచ్ చేయాలని సూచనల్లో పేర్కొంటున్నారు. అలా స్క్రాచ్ చేసిన తర్వాత అందులో మీరు లక్కీ కస్టమర్ కింద లక్కీ కూపన్లో కారు, బంగారం వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకున్నారని ఉంటుంది. ఇలా లక్కీ డ్రా తగిలిన వారు వెంటనే మీ స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మేం అడిగే వివరాలు నమోదు చేయాలని చెబుతారు. ఏదైనా సందేహాలుంటే మీకు ఇచ్చిన దరఖాస్తులోని నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. వివరాలిస్తే అసలుకే మోసం...ఎవరైనా అమాయకులు ఈ ఉచ్చులో చిక్కితే ఇక సైబర్ నేరగాళ్లు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. ఇలా స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూర్ కోడ్ స్కాన్ చేసి అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేస్తే ఇక అసలు మోసం మొదలవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అనుమానాస్పద యాప్‌లు మనకు తెలియకుండానే మన ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా మనం నమోదు చేసే బ్యాంకుఖాతా, వ్యక్తిగత వివరాలన్నీ తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతాల్లోని డబ్బులు కొల్లగొడుతున్నారు.ఇలాంటి కూపన్లు వస్తే నమ్మవద్దని, ఎలాంటి వివరాలు వారితో పంచుకోవద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పట్టణప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. -
కొత్త ఈ-కామర్స్ కంపెనీ.. చవకా.. వీక్నెస్ పట్టేశారు!
దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్‌లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్‌బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. ‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్‌ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్‌బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది. -
ఈ కామర్స్ ఎలిఫెంట్ ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: దేశ ఈ కామర్స్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 48 శాతం మార్కెట్ వాటాతో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ మొదటి స్థానంలో ఉన్నట్టు అలియన్స్ బెర్న్‌స్టీన్ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కలిగిన మీషో వేగంగా చొచ్చుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ 21 శాతం మేర యూజర్లను పెంచుకోగా, మీషో 32 శాతం కొత్త యూజర్లను జోడించుకుంది. అదే సమయంలో అమెజాన్ యూజర్ల వృద్ధి 13 శాతానికే పరిమితమైంది. ‘2022–23 సంవత్సరంలో భారత ఈ–కామర్స్‌లో 48 శాతం వాటాతో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ లీడర్‌గా ఉంది. పరిశ్రమ కంటే వేగంగా ఫ్లిప్‌కార్ట్ వృద్ధి చెందుతోంది. మొబైల్స్, వ్రస్తాలు ఫ్లిప్‌కార్ట్‌కు రెండు పెద్ద విభాగాలుగా ఉన్నాయి. మొబైల్స్‌లో 50 శాతం, వ్రస్తాల్లో 30 శాతం వాటా కలిగి ఉంది. ఆన్లైన్ స్మార్ట్ఫోన్లలో 48 శాతం, ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో 60 శాతం చొప్పున మార్కెట్ వాటా ఫ్లిప్‌కార్ట్ కలిగి ఉంటుందని అంచనా’ అని ఈ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాలపై మీషో గురి జీరో కమీషన్ నమూనాలో ద్వితీయ శ్రేణి, చిన్న పట్టణాలపై మీషో వ్యూహాత్మకంగా దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంటున్నట్టు బెర్న్‌స్టీన్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఈ కామర్స్ యాప్ డౌన్లోడ్లలో 48 శాతం మేర మీషోనే ఉంటున్నట్టు పేర్కొంది. ‘గడిచిన 12 నెలల్లో మీషో ఆర్డర్ల పరిమాణం 43 శాతం మేర పెరిగింది. ఆదాయంలో 54 శాతం వృద్ధి నెలకొంది. మళ్లీ, మళ్లీ కొనుగోలు చేసే కస్టమర్లు 80 శాతంగా ఉన్నారు. మీషోలో 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారవేత్తలు కాగా, ప్లాట్‌ఫామ్‌పై 95 శాతం కొనుగోళ్లు అన్బ్రాండెడ్వే ఉంటున్నాయి. నెలవారీ 12 కోట్ల సగటు యూజర్లతో మీషో భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కంపెనీ. ప్రస్తుతం మీషో స్థూల వాణిజ్య విలువ (జీఎంవీ) 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ’అని ఈ నివేదిక వెల్లడించింది. ఫ్యాషన్‌లో మింత్రా టాప్... ఫ్యాషన్ ఈ–కామర్స్‌లో రిలయన్స్‌కు చెందిన అజియో 30 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సంస్థ మింత్రా ఈ విభాగంలో 50% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్లో పోటీ సంస్థల కంటే మింత్రాయే మెరుగ్గా 25 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఈ–గ్రోసరీలో బ్లింకిట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఉత్పత్తుల శ్రేణి, కస్టమర్లకు చేరువ విషయంలో జెప్టో బ్లింకిట్‌తో పోలిస్తే వెనుకనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. బ్లింకిట్ 40 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 37–39% వాటా, జెప్టో 20% వాటాతో తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
జీఎస్టీ లేకపోయినా పర్లేదు.. మీషో ఆఫర్!
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదు కాని విక్రేతలను సైతం తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలకు అనుమతిస్తున్నట్టు ఈ కామర్స్ సంస్థ ‘మీషో’ ప్రకటించింది. వర్తకుల వార్షిక టర్నోవర్ వస్తువులకు రూ.40 లక్షల్లోపు, సేవలకు రూ.20 లక్షలకు మించకుండా ఉంటే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రాష్ట్రాల మధ్య సరఫరాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలే మినహాయించింది. దీంతో మీషో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని వర్తకులు సైతం తమ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలకు వీలుగా టెక్నాలజీలో మార్పులు చేసినట్టు మీషో తెలిపింది. తాజా నిర్ణయంతో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ సంస్థ ప్లాట్‌ఫామ్‌పై 14 లక్షల మంది విక్రేతలు ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం గమనార్హం. -
నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు!
పండుగ సీజన్ అనగానే వ్యాపారాలు పెరుగుతాయని అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తాయి. ఇందులో భాగంగానే ‘మీషో’ (Meesho) దాదాపు 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈకామ్ ఎక్స్‌ప్రెస్, డీటీడీసీ, ఎలాస్టిక్ రన్, లోడ్‌షేర్, డెలివరీ, షాడోఫ్యాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వంటి మరిన్ని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కొలాబరేషన్ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించాలని మీషో భావిస్తోంది. ఇందులో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు టైర్ 3, 4 ప్రాంతాల్లో రానున్నట్లు సమాచారం. పండుగ సీజన్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఫుల్ఫిల్మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్ష్ సీఎక్స్ఓ సౌరభ్ పాండే అన్నారు. ఇదీ చదవండి: గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫిదా అవుతున్న నెటిజన్లు! మీషో సెల్లర్స్ పండుగ సీజన్లో 3 లక్షల మందికి పైగా సీజనల్ వర్కర్స్‌ను నియమించుకుంటారు. మీషో 80 శాతం మంది విక్రేతలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి, ఫ్యాషన్ యాక్ససరీస్, పండుగ అలంకరణ వంటి కొత్త కేటగిరీలను వెంచర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెరిగిన డిమాండ్‌ను ఆర్గనైజ్ చేయడానికి మీషో అదనపు స్లోరేజ్ స్పేస్ అద్దెకు తీసుకోవడంపై ద్రుష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం పండుగ నియామకాలు గిగ్ జాబ్‌లలో గణనీయమైన వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు టీమ్‌లీజ్ తెలిపింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ వంటి టైర్-1 నగరాలతోపాటు టైర్ 3 నగరాల్లో కార్యకలాపాలను మరింత పెంచడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఇప్పటికే వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తన సప్లై చైన్‌లో 1,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్‌కు ముందు, పండుగ సీజన్లో కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి ఫ్లిప్‌కార్ట్ తన పాన్-ఇండియా సప్లై చెయిన్‌లో మిలియన్ల కొద్దీ సీజనల్ ఉద్యోగాలను నియమించుకోవాలని చూస్తోంది. -
ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!
మెగాకపుల్ రామ్ చరణ్-ఉపాసన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఈ మధ్య కూతురు పుట్టడంతో ఫుల్ హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. ఆమెతో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. మూడురోజుల ముందు భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా కుమార్తె క్లీంకారకి సంబంధించిన వీడియోని చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందరికీ ఆ వీడియో తెగ నచ్చేసింది. ఇదంతా పక్కనబెడితే తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్.. ఉపాసన-తనకు మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. (ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!) క్లాత్స్ విక్రయించే ఓ యాప్‌కి రామ్ చరణ్ ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిని కమెడియన్ తన్మయ్ భట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో భాగంగా తన స్టైలింగ్, ఆన్లైన్ షాపింగ్, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్స్ ఇవ్వడం లాంటివి చేస్తుంటానని చరణ్ చెప్పుకొచ్చాడు. అలానే తనకు పెళ్లి అయిన కొత్తలో భార్య ఉపాసనకు ఎంతో కష్టపడి ఓ గిఫ్ట్ ఇస్తే, దాన్ని అవతల పారేసిందని అప్పటి విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. 'పెళ్లయిన కొత్తలో ఓసారి ఉపాసన కోసం కాస్ట్లీ గిఫ్ట్ తీసుకున్నాను. ఆ వస్తువు కొనడానికే దాదాపు ఐదు గంటలు పట్టింది. తీరా తీసుకెళ్లి ఆమెకు ఇస్తే కనీసం ఐదు సెకన్ల కూడా చూడలేదు. పక్కన పడేసింది. అందుకే ఆడవాళ్లకు సర్ప్రైజులు ఇవ్వొద్దు. వారికి కూడా అవి నచ్చవేమో. ఏదైనా వాళ్లని అడిగి కొంటే బెటర్ అని నా ఫీలింగ్' అని రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!) -
meesho మరో అరుదైన రికార్డు
-
మీషోలో 11 లక్షల మంది విక్రేతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ మీషోలో విక్రేతల సంఖ్య 11 లక్షల పైచిలుకు చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన ఎనిమిదేళ్లలోనే అత్యంత వేగంగా 1 మిలియన్ (10 లక్షల) విక్రేతల మైలురాయిని అధిగమించినట్లు సంస్థ డైరెక్టర్ ఉత్కర్‡్ష గర్గ్ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరిలో 80 శాతం మంది ఆన్లైన్లో తొలిసారిగా విక్రయిస్తున్నవారేనని చెప్పారు. తెలంగాణ నుంచి దాదాపు 17,000 పైచిలుకు చిన్న వ్యాపార సంస్థలు ఉన్నాయని గర్గ్ తెలిపారు. సున్నా కమీషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో గతేడాది రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంలో విక్రేతల సంఖ్య 20 శాతం పెరిగిందని చెప్పారు. ప్రాంతీయంగా హోమ్..కిచెన్, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులకు డిమాండ్ ఉంటోందని గర్గ్ తెలిపారు. మీషోలో సెల్లర్ల వ్యాపారం గత రెండేళ్లలో 82 శాతం పెరిగినట్లు గర్గ్ వివరించారు. గతేడాది తాము 91 కోట్ల ఆర్డర్లను ప్రాసెస్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ–కామర్స్ రంగం 2030 నాటికి ఆరు రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంబీ) అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తోడ్పాటునివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గర్గ్ తెలిపారు. తమ విక్రేతల్లో 50 శాతం మంది రాజ్‌కోట్, హుబ్లి తదితర ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ఉంటున్నారని వివరించారు. -
మీషో బ్రాండ్ కొత్త లోగో ఇదే - ఓ లుక్కేసుకోండి!
న్యూఢిల్లీ: సాఫ్ట్‌బ్యాంక్ వాటాలు కలిగిన ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో నూతన బ్రాండ్ ఐడెంటిటీని పరిచయం చేసింది. మరింత మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు, మీషో ప్లాట్‌ఫామ్‌ను సమాజంలోని భిన్న వర్గాలు పెద్ద ఎత్తున ఆమోదించేందుకు వీలుగా నూతన లోగోని రూపొందించినట్టు ప్రకటించింది. నూతన లోగోతో బ్రాండ్‌కు మరింత గుర్తింపు వస్తుందన్న అభిప్రాయాన్ని మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే పేర్కొన్నారు. ప్రజలు మీషోను నేడు, రేపు ఏ విధంగా గుర్తిస్తారనే దానికి బ్రాండ్ ఐడెంటిటీ కీలకమన్నారు. ‘‘దేశంలో ఈ కామర్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించేందుకు అపార అవకాశాలున్నా యి. షాపర్లు అందరికీ చేరువ చేయడం ద్వారా తదుపరి దశ వృద్ధిని చూడొచ్చు. పునరుద్ధరించిన బ్రాండ్‌తో మీషో తదుపరి బిలియన్ కస్ట మర్లకు చేరువ అవుతుంది’’అని ఆత్రే తెలిపారు. -
ఉద్యోగులకు షాకిచ్చిన మీషో.. 251 మంది అవుట్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో 251 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో ఇది 15 శాతం. తొలగించిన ఉద్యోగులందరికీ నోటీసు పీరియడ్ దాటి ఒక నెల అదనంగా పరిహారంతో పాటు ఎసాప్స్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్), బీమా ప్రయోజనాలు, జాబ్ ప్లేస్మెంట్పరమైన మద్దతు మొదలైన తోడ్పాటు అందించనున్నట్లు సిబ్బందికి పంపిన ఈమెయిల్లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. కోవిడ్ పరిణామాలు, భారీగా పెట్టుబడుల ఊతంతో 2020 నుంచి 2022 నాటికి కంపెనీ 10 రెట్లు వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. అయితే, స్థూల పరిస్థితులు గణనీయంగా మారిపోవడంతో, లాభార్జన లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలను వేగవంతం చేయాల్సి వస్తోందని ఆత్రే వివరించారు. -
11 లక్షల వర్తకులతో మీషో
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ మీషో వేదికపై వర్తకుల సంఖ్య 11 లక్షలు దాటింది. గడిచిన ఏడాదిలో 6 లక్షల పైచిలుకు చిన్న వర్తకులు చేరారని కంపెనీ ప్రకటించింది. ఎనమిదేళ్లలోనే ఈ మైలురాయికి చేరుకున్నట్టు తెలిపింది. ‘విక్రేతల్లో సగం మంది ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారు ఉన్నారు. మొత్తం సెల్లర్స్‌లో 80 శాతం పైచిలుకు మంది ఈ–కామర్స్‌కు కొత్తగా చేరినవారే. మీషో ద్వారానే ఆన్లైన్ వ్యాపారంలోకి వీరు అడుగుపెట్టారు. కశ్మీర్‌లోని పుల్వామా, హిమాచల్ ప్రదేశ్ ఉనా, కర్ణాటక నాగమంగళ, మేఘాలయ జోవాయ్, రాజస్తాన్‌లోని మౌంట్ అబు నుంచి సైతం విక్రేతలు నమోదయ్యారు. ఇంటర్నెట్ వాణిజ్యాన్ని మారుమూల ప్రాంతాలకూ చేర్చడం, చిన్న అమ్మకందారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలన్న సంస్థ లక్ష్యానికి ఇది నిదర్శనం’ అని మీషో వివరించింది. వార్షిక ప్రాతిపదికన 14 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు 2022లో కంపెనీ ప్రకటించింది. విక్రేతల సగటు ఆదాయం మూడింతలు పెరిగిందని తెలిపింది. -
అయ్యో! ఆర్డర్ మీది కాదా? క్యాన్సిల్ చేస్తా.. ఓటీపీ చెప్పండి చాలు..
ఇంటి లోపల మీరేదో పనిలో ఉంటారు.. ఈలోగా డెలివరీ బాయ్ వచ్చి తలుపు తడతాడు. ఆర్డర్ వచ్చిందంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే అనుకుంటూ అదే సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్ అయింది’ అని నమ్మబలుకుతారు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు అంటారు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో.. ఇక అంతే.. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాల్లో కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వస్త్రాలు, ఇతర గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదీ మోసం తీరు.. ఆన్లైన్లో మనం ఆర్డర్ ఇవ్వకుండానే మీ ఇంటికి డెలివరీ బాయ్స్ వచ్చి మీకో ఆర్డర్ వచ్చిందంటారు. తీరా మనం ఆ ఆర్డర్ ఇవ్వలేదని చెబితే పొరపాటున మీ అడ్రస్‌తో ఈ ఆర్డర్ బుక్ అయినట్లుందని నమ్మబలుకుతారు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఆ డబ్బులు మా జీతంలోంచి కట్ అవుతాయని, మా కమీషన్ పోతుందని జాలి నటిస్తారు. మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది దయచేసి అది చెప్పండి చాలు అని నమ్మబలుకుతారు. వారిని నమ్మి మనం ఓటీపీ చెప్పిన వెంటనే అప్పటికే మన వివరాలు సేకరించి ఉంటున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొడతారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తు్తవులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే దగ్గరలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలి. ఏ వివరాలు ఇవ్వొద్దు.. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసేందుకు ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే వివరాలు చెప్పవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వకుండా వస్తువులు మీ పేరిట రావని గుర్తించాలి. ఓటీపీ, ఇతర వివరాలు, బ్యాంక్ ఖాతాల గురించి అడిగితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలోనూ ఆ వెబ్సైట్ నమ్మకమైనదేనా? లేదా? అని తెలుసుకోవాలి. ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు, అమ్మకాల్లోనూ మోసం జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మరవొద్దు. –శ్రీనివాస్,సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ -
ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు!
ఆదివారాలంటే విశ్రాంతి తీసుకోవడానికే అని భావించవచ్చు కానీ, అది ఒకప్పుడు భారతీయులు మాత్రం ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఆదివారమే అత్యంత అనువైన రోజుగా భావిస్తున్నారు. ఆ రోజున బిజీ బిజీగా కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ–కామర్స్ సంస్థ మీషో... తన డేటా ఆధారంగా జరిపిన ఇ షాపింగ్ 2002 అధ్యయనం ఇలాంటి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. వీటిలో... ► ఈ ఏడాది ఈ కామర్స్ షాపర్స్.. ఆదివారం ఎక్కువగా కొనుగోళ్లు జరిపారు. అంతకు ముందు సంవత్సరం అత్యధిక కొనుగోళ్లు జరిపింది బుధవారం, అలాగే ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు షాపింగ్ ప్రైమ్‌టైమ్‌గా కొనసాగింది. గత 2021లో మధ్యాహ్నం 2–3 గంటలలో అధికంగా ఈ– ట్రాఫిక్ కనిపించేది. ►2022లో ఎక్కువ మంది వెదికిన రెండవ ఉత్పత్తిగా స్మార్ట్ వాచ్ నిలిచింది. ఇది శారీరక ఆరోగ్యంపై, వ్యాయామాల పట్ల పెరిగిన ఆసక్తికి అద్దం పడుతోంది. ► గ్రూమింగ్ ఉత్పత్తులపై పురుషులు అమితాసక్తి చూపుతున్నారు. తృతీయశ్రేణి, నాల్గవ శ్రేణి నగరాల మార్కెట్ల నుంచి 60% కు పైగా ఆర్డర్లు లభించాయి. ► ద్వితీయశ్రేణి నగరాల నుంచీ శానిటరీ న్యాప్కిన్స్కు ఆర్డర్లు 9 రెట్లు పెరిగాయి. ఇది మహిళలకు ఈ–కామర్స్ ఏ విధంగా చేరువవుతుందో తెలియజేస్తుంది. ► దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిమిషానికి 148 చీరలు కొనుగోలు చేశారు. అలాగే రోజుకు 93వేల టీషర్టులు, 51, 275 బ్లూ టూత్ ఇయర్ఫోన్లు, 21,662 లిప్స్టిక్స్ విక్రయం జరిగింది. ► వినియోగదారులు స్థానిక ల్యాండ్‌మార్క్‌లు అయిన పిపాల్ క పేడ్, బర్గాద్ కా పేడ్, అట్టా చక్కీ కీ పీచే నియర్ వాటర్ ట్యాంక్ వంటివి వినియోగించడం ద్వారా డెలివరీ పర్సనల్‌కు సహాయపడ్డారు. దేశీ నేవిగేషన్ టూల్ కచ్చితత్త్వం ముందు డిజిటల్ మ్యాప్స్ పోటీపడలేవని ఇది వెల్లడిస్తుంది. ► ఈ సంవత్సరం అమ్మకాల పరంగా ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు కొనుగోలు చేయడానికి అమిత ఆసక్తిని కనబరిచిన ఉత్పత్తులలో స్మార్ట్ వాచ్‌లు, వైర్లెస్ హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బాడీ లోషన్స్ కుర్తీలు ఉన్నాయి. ఈ షాపింగ్.. పదనిసలు... ► గతంలో ఎన్నడూ లేనంతగా పురుషులు గ్రూమింగ్ మీద ఖర్చు చేశారు. ► జిమ్ ఎక్విప్ మెంట్‌కి సంబంధించిన ఆర్డర్స్ దాదాపుగా 3 రెట్లకు పైనే పెరిగిపోయాయి. ► అత్యధిక సంఖ్యలో యోగామ్యాట్స్ కొన్న నగరాల్లో బెంగుళూర్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లు ఉన్నాయి. ► ప్రతీ 10 పుస్తకాల్లో 8 పుస్తకాలకు ఆర్డర్స్ ద్వితీయశ్రేణి నగరాలు, మార్కెట్ల నుంచే వచ్చాయి. చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే! -
వారానికి ఒక్కరోజే ఆఫీస్..!
-
ఒక్క రోజే ఆఫీసుకు: మీషో మరోసారి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ఆన్లైన్ రిటైల్ స్టార్టప్ మీషో మరోసారి తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. రోజూ ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మీషో వారానికి ఒక రోజు ఆఫీసుకు వస్తే సరిపోతుందని ప్రకటించింది. వారంలో ఒకరోజు ఆఫీసుకు రండి అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది మీషో. వారంలో మిగతా రోజులు ఇంటినుంచే పని చేసు కోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది(2023) జూన్ నుంచి ఈ విధానం అమల్లో ఉంటుందని తెలిపింది. అప్పటివరకు మీషో ఉద్యోగులు ఎక్కడినుంచైనా పనిచేసుకోవచ్చు. మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో మీషో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఫ్లెక్సీ-ఆఫీస్ అనేది వారానికి ఒకసారి ఆఫీసుకు, మిగతా రోజులు రిమోట్‌గా పనిచేస్తారని ఇది ఒక టీంగా ఉద్యోగులకు మధ్య సాన్నిహిత్యం పెరగడానికి తోడ్పడుతుందని చెప్పారు. ఇటీవలి సర్వేలో, మెజారిటీ ఉద్యోగులు తమ మధ్య వ్యక్తిగత కనెక్షన్ల అవసరం గురించి మాట్లాడారని అందుకే ఫ్లెక్సీ-ఆఫీస్ మోడల్‌ను అవలంబిస్తున్నట్లు తెలిపారు. కాగా మీషోలో మొత్తం1850 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 50 శాతం మంది బెంగళూరులో ఉన్నారు. మిగిలిన సిబ్బంది దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. తాజా నిర్ణయంతో ఇపుడు వారు బెంగళూరుకు మకాం మార్చాలి లేదా వారానికి ఒకసారి ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. -
మీషో, ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్రం భారీ షాక్..వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, మీషోలకు భారీ షాక్ తగిలింది. యాసిడ్ అమ్మకాలపై విధించిన నిబంధనల్ని ఉల్లంఘించాయంటూ ఆ రెండు సంస్థలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలోని ద్వారకలో ఓ బాలికపై యాసిడ్ దాడి ఘటనలో నిందితుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి యాసిడ్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో నోటీసులు జారీ అయ్యాయి. ప్లాట్‌ఫారమ్‌లపై యాసిడ్ అమ్మకాలను అనుమతించినందుకు రెండు ఈ-కామర్స్ సంస్థలకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ-కామర్స్ సంస్థ నుంచి యాసిడ్‌ను సేకరించినట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు జారీ చేశారు. కఠిన చర్యలు తప్పవ్ సీసీఏపీ యాసిడ్ విక్రయాల నిబందనల్ని ఆదేశాలు బేఖాతరు చేయడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లిప్‌కార్ట్, ఫాష్‌నియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (meesho.com) సంస్థలకు నోటీసులు పంపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇ-కామర్స్ సంస్థలు సీసీపీఏ నోటీసుల ఆదేశాలను పాటించకపోతే, వినియోగదారుల రక్షణ చట్టం - 2019లోని నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఢిల్లీలో దారుణం డిసెంబర్ 14 న దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది తన చెల్లెలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్‌పై వచ్చి యాసిడ్ దాడి చేయటంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లలో యాసిడ్ లభ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కాగా, యాసిడ్ దాడిలో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు సచిన్ అరోరా ఫ్లిప్‌కార్ట్ నుండి యాసిడ్‌ను సేకరించినట్లు గుర్తించారు. దీనిపై వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై సీసీపీఏ చర్య తీసుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
80 మిలియన్ డాలర్లకు ప్రోజస్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో టెక్నాలజీ ఇన్వెస్టర్ ప్రోజస్ 80 మిలియన్ డాలర్ల ట్రేడింగ్ నష్టం ప్రకటించింది. ప్రధానంగా పేయూ ఇండియా వ్యాపారంలో మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సి రావడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమీక్షాకాలంలో పేయూ ఆదాయం 183 మిలియన్ డాలర్లుగా నమోదైంది. నెదర్లాండ్స్‌కి చెందిన ప్రోజస్ గ్రూప్ భారత్‌లో ఓఎల్ఎక్స్, బైజూస్, మీషో, ఎలాస్టిక్‌రన్, డేహాత్, ఫార్మ్ఈజీ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేసింది. -
ఓఎన్‌డీసీలోకి మీషో, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో తాజాగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరింది. కొనుగోలుదారులను హైపర్‌లోకల్ విక్రేతలకు అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడ గలదని సంస్థ తెలిపింది. తమ పైలట్ ప్రాజెక్టు ముందుగా బెంగళూరులో ప్రారంభమై తర్వాత మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే?) మీషోలో 8 లక్షల మంది పైగా విక్రేతలు ఉన్నారు. విక్రేతలు, వినియోగదారుల వ్యయాల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓఎన్డీసీని తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో తక్కువ రేట్లకు ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలుదారులు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. (Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు) -
బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు!
బెంగళూరు: పండుగ సీజన్ కావడంతో ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా సంస్థలు పోటీ పడి మరీ వినియోగదారులకు ఊహించని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో తమ మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తొలి రోజున ఏకంగా 87.6 లక్షల ఆర్డర్లు నమోదు చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మీషో స్పందిస్తూ.. ఒకే రోజున ఇంత భారీ స్థాయిలో ఆర్డర్లు రికార్డు చేయడం ఇదే తొలిసారని, గతేడాదితో పోలిస్తే 80 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. మెగా బ్లాస్టర్ సేల్ మూడు రోజులు పూర్తవగా ఇప్పటికీ కస్టమర్లు నిమిషానికి వేలల్లో ఆర్డర్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉన్నట్లు ట్వీట్ చేసింది మీషో. కాగా ఈ సంస్థ ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించడంతో పాటు భారీ స్థాయిలో మెగా బ్లాక్‌బస్టర్ సేల్ గురించి ప్రచారం చేసింది. దీంతో అదే స్థాయిలో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. 85 శాతం పైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే వచ్చినట్లు సంస్థ సీఎక్స్‌వో ఉత్కృష్ట కుమార్ తెలిపారు. ఫ్యాషన్, బ్యూటీ సాధనాలు, చీరలు మొదలుకుని వాచీలు, జ్యుయలరీ సెట్ల వరకూ 6.5 కోట్ల పైగా లిస్టింగ్స్‌ను అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. Customers are placing several thousand orders per minute during the #MeeshoMegaBlockbuster sale. ⏱️🚀 So our sellers have their hands full. 🙌#ecommerce For more seller stories: https://t.co/qyroCn4uxG pic.twitter.com/t9jbqYIX3b — Meesho (@Meesho_Official) September 26, 2022 చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్: ఒక్కరోజులోనే....
సాక్షి,ముంబై:పండుగ సీజన్సేల్లో ఫ్యాషన్ రీటైలర్ ‘మీషో’ భారీ అమ్మకాలను నమోదు చేసింది. మొదటి రోజే 88 లక్షల ఆర్డర్లను సాధించింది. దీంతో మీషో అమ్మకాలు 80 శాతం పెరిగాయి.ఒక రోజులో కంపెనీ సాధించిన రికార్డ్ సేల్ అని మీషో తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్ నిధులఅందించే ఆన్లైన్ రిటైలర్మీషో తన ఐదు రోజుల హాలిడే సేల్‌లో మొదటి రోజు దాదాపు 87.6 లక్షల ఆర్డర్లు వచ్చాయని, అమ్మకాలు 80శాతం పెరిగాయని శనివారం వెల్లడించింది. ముఖ్యంగా టైర్ 2, 3 , 4 నగరాల్లో మొదటి రోజు దాదాపు 85శాతం ఆర్డర్లు లభించాయని మీషో ఒక ప్రకటనలో నివేదించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపడం సంతోషంగా ఉందని తెలిపింది. చీరల నుండి అనలాగ్ వాచ్‌లు, జ్యువెలరీ సెట్లు, మొబైల్ కేసులు, కవర్లు, బ్లూటూత్ హెడ్ఫోన్లు, ఛాపర్లు, పీలర్లను రికార్డ్ వాల్యూమ్లలో కొనుగోలు చేశారని కంపెనీ తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, కిచెన్,ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లాంటివి తొలి రోజు అత్యధికంగా అమ్ముడైన కేటగిరీలుగా ఉన్నాయట.