జీఎస్‌టీ లేకపోయినా పర్లేదు.. మీషో ఆఫర్‌! | Meesho opens up its platform for sellers without GST registration | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ లేకపోయినా పర్లేదు.. మీషో ఆఫర్‌!

Published Wed, Oct 4 2023 8:51 AM | Last Updated on Wed, Oct 4 2023 8:52 AM

Meesho opens up its platform for sellers without GST registration - Sakshi

న్యూఢిల్లీ: జీఎస్‌టీ కింద నమోదు కాని విక్రేతలను సైతం తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలకు అనుమతిస్తున్నట్టు ఈ కామర్స్‌ సంస్థ ‘మీషో’ ప్రకటించింది. వర్తకుల వార్షిక టర్నోవర్‌ వస్తువులకు రూ.40 లక్షల్లోపు, సేవలకు రూ.20 లక్షలకు మించకుండా ఉంటే.. ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రాష్ట్రాల మధ్య సరఫరాలకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను జీఎస్‌టీ కౌన్సిల్‌ ఇటీవలే మినహాయించింది.

దీంతో మీషో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ లేని వర్తకులు సైతం తమ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలకు వీలుగా టెక్నాలజీలో మార్పులు చేసినట్టు మీషో తెలిపింది. తాజా నిర్ణయంతో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ సంస్థ ప్లాట్‌ఫామ్‌పై 14 లక్షల మంది విక్రేతలు ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement