without
-
జీఎస్టీ లేకపోయినా పర్లేదు.. మీషో ఆఫర్!
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదు కాని విక్రేతలను సైతం తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలకు అనుమతిస్తున్నట్టు ఈ కామర్స్ సంస్థ ‘మీషో’ ప్రకటించింది. వర్తకుల వార్షిక టర్నోవర్ వస్తువులకు రూ.40 లక్షల్లోపు, సేవలకు రూ.20 లక్షలకు మించకుండా ఉంటే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రాష్ట్రాల మధ్య సరఫరాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలే మినహాయించింది. దీంతో మీషో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని వర్తకులు సైతం తమ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలకు వీలుగా టెక్నాలజీలో మార్పులు చేసినట్టు మీషో తెలిపింది. తాజా నిర్ణయంతో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ సంస్థ ప్లాట్‌ఫామ్‌పై 14 లక్షల మంది విక్రేతలు ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం గమనార్హం. -
'ఎన్నికల్లో పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదు'
తాడేపల్లి: ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు హడావుడి చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బీజేపీని తిట్టిన నోటితోనే చంద్రబాబు మళ్లీ పొగుడుతున్నారని మండిపడ్డారు. పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలని, పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదన్నారు సజ్జల. పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదు ప్రకటించిన మేనిఫెస్టో ఏంటో టీడీపీ వారికే గుర్తులేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు బపూన్కు ఎక్కువ .. జోకర్ కు తక్కువ అని దుయ్యబట్టారు. 2019 వరకు చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేయడానికి చంద్రబాబే సిద్ధంగా లేరని అన్నారు. ఆనాడు ప్రధాని మోదీ కుటుంబం గురించి చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు.. ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ , బీజేపీని కీర్తిస్తున్నారని చెప్పారు. పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదని అన్నారు. 'నడ్డాతో చంద్రబాబు వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారు. బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలే రావడం లేదు. ప్రజలను భ్రమలో పెట్టాలనుకుని వారే భ్రమలో బతుకుతున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ ను అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ నాణెం పేరిట లక్ష్మీపార్వతిని పిలవకుండా అయన ఆత్మకు క్షోభ పెట్టారు. ఈసారి రెండు వెన్నుపోట్లు చంద్రబాబు పొడిచారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి కలిసి బీజేపీతో కలిసేందుకు పైరవీలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై 70 శాతం మంది ప్రజలు పాజిటివ్ గా ఉన్నారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు. టీడీపీ సొంతంగా ఎందుకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదు. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ గా మారారు.' అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్ పాలిటిక్స్: వెల్లంపల్లి వ్యాఖ్యలు -
Amala Paul Without Makeup: మేకప్ లేకుండా, టాటూ చూపిస్తూ అమలాపాల్ ఫోజులు (ఫోటోలు)
-
విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే..
ఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా ట్రాఫిక్ చలానా వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కొరియా దేశస్థుని వద్ద కానిస్టేబుల్ రిసిప్ట్ ఇవ్వకుండానే రూ. 5000 చలానా వసూలు చేశాడు. నెలక్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. కానిస్టేబుల్ మహేష్ చంద్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కొరియా దేశస్థునికి రూ.5000 జరిమానా విధించినట్లు చెప్పారు. కానీ విదేశీయుడు రూ.500 ఇచ్చాడు. తను అడిగిన డబ్బు రూ. 500 కాదని, రూ. 5000 అని చెప్పి కానిస్టేబుల్ మళ్లి అడిగాడు. చేసేది లేక విదేశీయుడు కానిస్టేబుల్‌కు మిగిలిన డబ్బును ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇద్దరు హ్యాండ్స్ షేక్ చేసుకుని వెళ్లిపోతారు. కానీ జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఆ బాధిత విదేశీయునికి కానిస్టేబుల్ ఇవ్వలేదు. Video: Delhi Cop Fines Korean Man ₹5,000 Without Receipt, Suspended https://t.co/EaheIf2LvI pic.twitter.com/bX5lLND7vM — NDTV (@ndtv) July 23, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసు కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సంబంధిత వీడియోపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చేలోపే ఆ విదేశీయుడు వెళ్లిపోయినట్లు కానిస్టేబుల్ చెబుతున్నాడు. ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
ఫాన్స్ కి గుడ్ న్యూస్ ఎవరి సాయం లేకుండానే..!
-
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
ప్రపంచంలో నీరు లేకుండా జీవించే టాప్ 10 జంతువులు (ఫోటోలు)
-
ఇంటర్నెట్ లేకుండానే UPI పెమెంట్స్
-
సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో
ఆక్వా రంగంలోనూ మాఫియా జడలు విప్పుతోంది. చట్టాన్ని చెరువుల పాలే్జస్తోంది. అక్రమం ఆ గట్లపై వికటాట్టహాసం చేస్తోంది. చేలను చటుక్కున మాయం చేసేస్తోంది. రాత్రికి రాత్రి చేపల చెరువుల్ని పుట్టిస్తోంది. అమాయక రైతుల్ని నయానో భయానో దారికి తెచ్చుకుని లీజు పేరిట వందలాది ఎకరాల పంట భూముల్ని హస్తగతం చేసుకుంటున్న ఆక్వా మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులుగా మార్చేస్తోంది. చేలను చెరువులుగా మార్చేందుకు కనీసం దరఖాస్తు చేయకుండా దందా సాగిస్తోంది. కాసులు మరిగిన అధికారులు నిబంధనలను గాలికొదిలేస్తుండటంతో.. ఆ చెరువుల సమీపంలో వరి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. చివరకు తమ భూములనూ ఆక్వా మాఫియాకు అప్పగించాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ప్రాంతంలో ఆక్వా మాఫియా రాజ్యమేలుతోంది. ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో చాపకింద నీరులా ప్రవహిస్తూ వరి చేలను చేపలు చెరువులుగా మార్చేస్తోంది. అక్రమాల పంజా విసిరి రైతుల్ని వలలో బిగిస్తోంది. రెండు పంటలూ పండే భూములను హస్తగతం చేసుకుని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. తొలుత సారవంతమైన భూముల మధ్య నాలుగైదు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకోవడం.. అందులో చేపలు లేదా రొయ్యల చెరువు తవ్వడం చేస్తున్నారు. పొలాల మధ్యలో చెరువు తవ్వడం వల్ల అందులోంచి వచ్చే కలుషిత నీటివల్ల దాని చుట్టుపక్కల భూముల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీనిని సాకుగా తీసుకుని సమీపంలోని పొలాలన్నిటినీ లీజుకు తీసుకుని 30నుంచి 50 ఎకరాలను ఒకే ప్లాటుగా చేసి చెరువులు తవ్వుతున్నారు. క్రమంగా ఇలా ఆయకట్టు పరిధిలోని మొత్తం చేలను చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ మాఫియాకు అధికారులు, అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అండదండలు ఇస్తుండటంతో ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా మారిపోయింది. ఉదాహరణలివిగో.. నిడమర్రు మండలంలోని నిడమర్రు, నరసింహపురం రెవెన్యూ గ్రామాల్లోని ఆయకట్టులో మెరక భూములను సైతం ఆక్వా మాఫియా వదిలి పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో ఇటీవల 163 ఎకరాల విస్తీర్ణంలో 6 భారీ చెరువులు తవ్వేశారు. నిడమర్రు–ఏలూరు రాష్రీ్టయ రహదారి పక్కనే గల బాడవ ఆయకట్టు పరిధిలోని పంట భూముల్లో చెరువులు తవ్వారు. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం చెరువు తవ్వకానికి ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేయలేదు. చెరువులు వద్దకు చేరుకునేందుకు వీలుగా రహదారి సైతం అధికారుల అండతో ఆక్వా మాఫియా సొంతంగా నిర్మించుకుంది. ఈ భూముల్ని లీజుకు తీసుకున్న వారే విద్యుత్ స్తంభాలు కూడా స్వయంగా పాతుకుంటున్నారు. చెరువులకు నీటి సదుపాయం నిమిత్తం మూడు మీటర్ల వెడల్పున కాలువల సైతం నిర్మించారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థాయి రెవెన్యూ అధికారి అయినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. కనీసం దరఖాస్తు చేయలేదు... నిడమర్రు, నరసింహపురం ఆయకట్టులో 163 ఎకరాల్లో కొత్తగా చెరువులు తవ్వారు. ఆ తరువాత 65.89 ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈనెల 7న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. దరఖాస్తు నంబర్లు పీఆర్ఎఫ్ 011700018229, పీఆర్ఎఫ్ 011700018228, పీఆర్ఎఫ్ 01170018226 ద్వారా ఆన్లైన్లో పరిశీలిస్తుంటే ఈ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు చూపిస్తోంది. పరిశీలన పూర్తికాకుండానే చెరువులు రెడీ అయిపోయాయి. మిగిలిన సుమారు 100 ఎకరాల్లో చెరువులకు సంబంధించి కనీసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చెయ్యలేదని స్పష్టంగా కనపడుతోంది. అయినా.. అందులోనూ చెరువులు తవ్వేశారు. ముందు తవ్వకాలు.. ఆనక అనుమతులు లీజుదారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ముందుగా చెరువులు తవ్వేస్తున్నారు. అ తర్వాత తాపీగా అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల మీసేవా కేంద్రం నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేసు దర్యాప్తు సమయంలో మండలంలో సుమారు 1,500 ఎకరాల్లో అనధికార అనుమతులతో చెరువులు తవ్వేసినట్టు బహిర్గతమైంది. అయినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. జిల్లాలో వరి ఆయకట్టు మాయమవుతోందని రైతులు ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడటం లేదు. ఇదో సిత్రం చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చే విషయంలో విచిత్రాలు బయటపడుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే.. ఎలాంటి విచారణ జరపకుండానే అనుమతి వచ్చేసింది. పైగా కలెక్టర్‌కు ప్రతినిధిగా పేర్కొంటూ తహసీల్దార్ డిజిటల్ సంతకం స్థానంలో తహసిల్దార్ సంతకంతో అనుమతి ఇచ్చేశారు. చేపల చెరువుల విషయంలో అధికారులు ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉదంతం నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన పేరిచర్ల బంగారమ్మ, మరికొందరు కలిసి ఐదెకరాల పంట భూమిలో చేపల చెరువు తవ్వేందుకు అనుమతి కోరుతూ ఈనెల 13న నిడమర్రు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి కోరిన సాగుభూమిని అధికారులు కనీసం పరిశీలించకుండానే ఆన్లైన్లో అనుమతులు ఇస్తూ ధ్రువీకరణ పత్రం వచ్చేసింది. ధ్రువీకరణ పత్రంపై విధిగా జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉండగా.. ఆయన స్థానంలో నిడమర్రు తహసీల్దార్ పేరు కనిపిస్తోంది. ‘ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ’గా పేర్కొంటూ తహసీల్దార్ ఎం.సుందరరాజు పేరిట ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది. అంటే తహసీల్దార్ అనుమతి ఉంటే చెరువులు తవ్వేసుకోవచ్చన్నమాట. ఏపీ మీ సేవా పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘చెక్ మీ సేవా సర్టిఫికెట్’ అనే కాలమ్ దరఖాస్తు సంఖ్య పీఆర్ఎఫ్011700018461 నమోదు చెయ్యగానే ఈ ఆన్లైన్ సర్టిఫికెట్ దర్శనమిస్తోంది. ఈ విధంగా ఆన్లైన్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ప్రత్యక్షం అవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
నోటీసులు ఇవ్వకుండానే అపరాధరుసుములా?
ఇంటిపన్నుల విధానంలో మార్పులు చేయాలి కోదాడఅర్బన్: కోదాడ మున్సిపాలిటీలో ఇంటిపన్నుల విధానంలో మార్పులు చే స్తామని గతంలో ఇచ్చిన హామీని మున్సిపల్ అధికారులు వెంటనే అమలు చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడిమర్రి సత్యబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటిపన్నుల పెంపుపై గతంలో ఆందోళనలు చేసినప్పుడు ఇచ్చిన రివిజన్ పిటిషన్లను 45రోజులలోగా మళ్లీ కొలతలు వేసి పన్ను వేయాల్సి ఉండగా అది జరగలేదన్నారు. పట్టణాన్ని జోన్స్, సబ్ జోన్స్‌గా వేరు చేయాలని ప్రభుత్వ నిబంధనలలో ఉన్నా దానిని అమలు చేయకుండా అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శించారు. దీనివల్ల ప్రస్తుతం స్లమ్ ఏరియాలలోని ప్రజలు కూడా అధికంగా పన్ను చెల్లించాల్సి వస్తున్నదన్నారు. ఆగస్టు నెలలో ప్రస్తుత సంవత్సర పన్ను నోటీసులు ఇస్తూ దానికి జూన్ నుంచి అపరాధరుసుము కట్టాలనడం దారుణమన్నారు. రివిజన్ కోరిన వారికి దరఖాస్తులను పరిష్కరించాలని, పట్టణాన్ని రీజోన్స్ చేసి పన్ను విధించాలని, ఇంటిపన్నుపై అపరాధరుసుమును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తెప్పని శ్రీనివాస్, కౌన్సిలర్లు వాడపల్లి వెంకటేశ్వర్లు, కొమరగిరి రంగారావు, నాయకులు షమి, ముస్తఫా, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు గంధం బంగారు, పొడుగు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
సార్ లేని లోటు పూడ్చలేనిది
–కులాలు, మతాలకు అతీతంగా పనిచే సిన మహోన్నత వ్యక్తి –సమైక్య పాలకుల అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడు –జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసిన త్యాగధనుడు –ఆచార్య జయశంకర్ జయంతి సభలో ఎంపీ కవిత, మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంర్ అని, సార్ లేని లోటు పూడ్చలేనిదని తెలంగాణ జాగృతి వ్యవస్థాక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కులాలు, మతాలుకు అతీతంగా రాష్ట్ర సాధనే ద్యేయంగా పని చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ మన మధ్య లేకపోయినా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ప్రతికూల పరిస్థితిల్లోనూ తెలంగాణ నడిపించారని పేర్కొనామ్నరు. యువత జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమైక్య పాలకులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ నిలదీశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి తనకుంటూ ఒక చర్రిత సృష్టించుకుందన్నారు. అంతకుముందు కవిత స్థానిక మున్సిపల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇం చార్జి దుబ్బాక నర్సింహ్మారెడ్డి, నోముల నర్సిహ్మాయ్య, కాసోజు శంకరమ్మ, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ తదితరులు పాల్గొ న్నారు. వర్షంతో నిలిచిన సభ రాత్రి 7.50 గంటలకు ప్రారంభమైన సభ 8.30 గంటలకు ముగిసింది. దేశపతి శ్రీనివాస్, మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడిన అనంతరం ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తుండగా భారీ వర్షం రావడంతో సభను అర్ధాంతంగా ఆపేశారు. -
ఇక 3డీ అద్దాల అవసరం లేదు!
న్యూయార్క్ః థియేటర్లలో 3డీ సినిమాలు చూడాలంటే తప్పనిసరిగా కళ్ళకు ప్రత్యేకమైన గ్లాసెస్ పెట్టుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై అలాంటి అవసరం లేదంటున్నారు మసాచుసెట్స్.. వైజ్ మ్యాన్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు. కంటికి ఎలాంటి 3డీ గ్లాసెస్ పెట్టుకోకుండానే త్రీడీ సినిమాలు చూసే అవకాశం దగ్గరలోనే ఉందంటున్నారు. అమెరికా కు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ లోని వైజ్ మ్యాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు 3డీ అద్దాలు పెట్టుకోకుండానే థియేటర్లలో 3డీ సినిమాలు చూడొచ్చని చెప్తున్నారు. 'సినిమా 3డీ' పేరున్న ఆప్టిక్ లెన్స్ ను స్ర్కీన్ పై అమర్చడంతో సినిమా హాల్లోని ఏ సీట్లో కూర్చున్నా.. 3డీ అనుభూతి కలుగుతుందని తమ తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఇప్పటికే గ్లాసెస్ లెస్ 3డీ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా... అది హాల్లో ఆటూ ఇటూ తిరిగుతూ చూసే అవకాశం ఉండదని, సీట్ల అమరిక ఆధారంగా సింగిల్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించారని ఎంఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ అర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్ కు చెందిన ప్రొఫెసర్ వోసియెక్ మాటుసిక్ అంటున్నారు. అయితే కొత్త సినిమా 3డీ స్పెషల్ ఆప్టిక్ సిస్టమ్ లో థియేటర్లోని ఏ ప్రాంతంనుంచీ, ఏ యాంగిల్ లోనైనా 3డీ సినిమాను అద్దాల్లేకుండా చూడొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త గ్లాసెస్ లెస్ 3డీ సిస్టమ్ అభివృద్ధి దశలో ఉందని, థియేటర్లలో ఈ కొత్త విధానం అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. కాలిఫోర్నియాలోని అనాహైమ్ లో జరిగబోయే 'సిగ్ గ్రాఫ్' కంప్యూటర్ గ్రాఫిక్స్ కాన్ఫరెన్స్ లో తాము అభివృద్ధి చేసిన పరిశోధనలను ప్రవేశపెట్టనున్నట్లు వారు తెలిపారు. -
ఇంటర్నెట్ లేకుండానే 'ఫేస్ బుక్'..!
న్యూఢిల్లీః ఫేస్ బుక్ వినియోగదారులకు శుభవార్త! ఇప్పుడు భారతదేశంలోని యూర్లంతా స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ కనెక్షన్, డేటా బ్యాలెన్స్ లేకపోయినా ఫేస్ బుక్ ను వాడుకునే సౌకర్యం కల్పిస్తోంది. *325# డయల్ చేస్తే చాలు కనెక్ట్ అయిపోయే కొత్త సేవలను ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు ఫేస్ బుక్ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా, డేటా బ్యాలెన్స్ లేకపోయినా ఫేస్ బుక్ లోకి ఎంటరయ్యే కొత్త సేవలను ప్రారంభించింది. ఫేస్ బుక్ ఇండియా, ఫోనెట్ విష్ భాగస్వామ్యంతో ఈ తాజా అవకాశాన్ని కల్సిస్తోంది. అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా (యుఎస్ఎస్ డీ) ఆధారిత ఫోనెట్ విష్ ఇంటరాక్టివ్ సర్వీస్... డేటా కనెక్షన్ లేకుండానే ఈ సేవలను అందిస్తుంది. అంతేకాక ఫేస్ బుక్ స్టేటస్ ను కూడా ఉచితంగా చూసుకోవచ్చు. అయితే ఇందులో పోస్టింగ్ లు, నోటిఫికేషన్ల పరిశీలన, యాడ్ ఫ్రెండ్స్ వంటి వాటికి మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేవలం రోజుకు ఒక్క రూపాయి చెల్లిస్తే ఈ సౌకర్యాన్ని అపరిమితంగా వాడుకోవచ్చు. ఇందుకోసం స్మార్ట్ ఫోన్ లో *325# ను డయల్ చేసి, ఫేస్ బుక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే చాలు... ఫేస్ బుక్ ఫీచర్లలోకి ఎంటరైపోవచ్చు. దీంతో యుఎస్ఎస్ డీ ద్వారా మొబైల్ హ్యాండ్ సెట్ కు సమాచారం బదిలీ అయిపోతుంది. అయితే ప్రస్తుతం ఇండియాలో ఈ అవకాశం కొన్ని నెట్వర్క్ లకు మాత్రమే పరిమితమైంది. ఎయిర్ టెల్, ఎయిర్ సెల్, ఐడియా, టాటా డొకొమో వినియోగదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరలో మిగిలిన నెట్బర్క్ లకు సైతం అందుబాటులోకి తేవాలని ఫేస్ బుక్ భావిస్తోంది. -
విద్యారంగాన్ని విస్మరిస్తున్నారు : ఏఐఎఫ్డీఎస్
నర్సంపేట :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరించడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నార ని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చౌటపెల్లి వేణుగోపాల్ అన్నారు. పట్టణంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో శుక్రవా రం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తే విద్యార్థుల భవిష్యత్ మారుతుందని చెప్పిన కేసీఆర్ నేడు పట్టించుకోవడం లేదని ఆరోపిం చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 42 హామీలను విస్మరించి ప్రభుత్వ విద్యావిధానాన్ని తుం గలో తొక్కారని, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఊడిగం చేసేలా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక్క గది లేకుండా 175 పాఠశాలలు నడుస్తున్నాయని, ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 44, వరంగల్ జిల్లాలో 31 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఎంసెట్–2 లీకేజీకి పాల్పడిన 72 మంది విద్యార్థులను పక్కనబెట్టి మిగతా విద్యార్థులకు న్యాయం చేయాల న్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మెత్రి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి మొగిళిచర్ల సందీప్, డివిజన్ అధ్యక్షుడు జన్ను రమేష్, నాయకులు ఆకుల రమేష్, సౌజన్య, సాయి, రఫీ, రామకృష్ణ, అరుణ్, గౌతమ్, స్వాతి, మౌని కొత్తకొండ రాజమౌళి పాల్గొన్నారు. -
గంటలకొద్దీ సినిమాలు చూసి.. గిన్నిస్ రికార్డు
గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించడం అంటే ఆషామాషీ విషయం ఏమీ కాదు. అత్యున్నత ప్రపంచ రికార్డుకోసం ఒక్కోరూ ఒక్కో విన్యాసాన్ని ప్రదర్శిస్తుంటారు. సాహసాలకూ వెనుకాడరు. కొందరు ఇంతకు ముందున్న రికార్డును తిరగరాసే ప్రయత్నాలు చేస్తారు. అయితే కెనడా, జొహన్నెస్ బర్గ్ కు చెందిన ఓ యువకుడు ఏకంగా 121 గంటలపాటు (సుమారు ఐదు రోజులు) నిద్రపోకుండా సినిమాలు చూస్తూ రికార్డు సృష్టించేశాడు. 120 గంటల 23 మూడు నిమిషాలతో ఇంతకు ముందున్న గిన్నిస్ రికార్డును, 121 గంటల 18 నిమిషాలపాటు అంటే.. సుమారు గంట ఎక్కువ సమయం నిద్రపోకుండా ఉండి సురేష్ జోచిమ్ తిరగరాశాడు. అంతేకాదు.. ఆఫ్రికాలోనే తనకు మొదటి టైటిల్ రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నాడు. ఇంతకు ముందు ఇండియాకు చెందిన ఆషిష్ శర్మ..120 గంటల 23 నిమిషాలపాటు 48 సినిమాలు చూసి గిన్నిస్ పుటలకెక్కగా... జోచిమ్ ఆ రికార్డును తిరగరాశాడు. టెల్కాంకు చెందిన బోల్ట్ స్పీడ్ ఫైబర్ ద్వారా ఆగకుండా ప్రసారంచేసిన సినిమాలను చూస్తూ జోచిమ్ రికార్డు సృష్టించాడని, ఇలా స్ట్రీమింగ్ తో రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారని ఆ సంస్థ అధికారి జాక్వి చెప్పారు. జొహెన్నెస్ బర్గ్ డౌన్ టౌన్ లో ఓ స్వచ్ఛంద సంస్థ సహాయార్థం నిర్వహించిన తమ అన్ లిమిటెడ్ మూవీ మారథాన్ లో.. వచ్చిన సొమ్మును ఆ సంస్థకు అందించినట్లు ఆయన తెలిపారు.